కామారెడ్డి, న్యూస్‌లైన్: బెల్లం రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు వీలుగా మా ర్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొంత కాలం క్రితం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏమైందో తెలియదు కానీ, దానిని నెల రోజులకే మూసివేశారు. బెల్లం అమ్మిన రైతులకు డబ్బులు రాకపోగా, ఇంకా విక్రయించని రైతులు బెల్లాన్ని విధి లేక ఇంటిలోనే నిలువ చేసుకున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు బహిరంగ మార్కెట్ ధరను బాగా తగ్గించేశారు. మార్క్‌ఫెడ్ క్వింటాలుకు రూ. 2600 ధర నిర్ణయించింది.
కొందరు రైతులు మా ర్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో బెల్లం విక్రయించారు. అప్పుడు మార్కెట్‌లో వ్యాపారులు రూ. 2400 వరకు ధర చెల్లించారు. అయితే, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం నెల రోజులకే మూతపడడం బెల్లం ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు మార్కెట్‌లో వ్యాపారులు క్వింటాలు కు రూ. 2,050 మా త్రమే చెల్లిస్తున్నారు. దీంతో క్విం టాలుకు 550 వరకు నష్టపోవాల్సి వస్తోంది.
అప్పుల వేధింపులు
వ్యాపారులు నిర్ణయించిన ధరకే బెల్లం అమ్మాల్సిన పరిస్థితులలో రైతులు తమ ఇళ్లలోనే బెల్లాన్ని నిల్వ ఉంచుతున్నారు. చెరుకు సాగుతో పాటు బెల్లం త యారీకి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రై తులు బెల్లం అమ్ముడుపోకపోవడంతో అప్పుల వే ధింపులు తాళలేకపోతున్నారు. మార్క్‌ఫెడ్ కొనుగో లు కేంద్రం ఎత్తివేసిన తర్వాత బెల్లం కొనడానికి వ్యా పారులు కూడా ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు చే సిన బెల్లాన్ని ఎక్కడికి సరఫరా చేస్తున్నది, ఎంత కొ నుగోలు చేసిందన్న వివరాలను ఎప్పటికప్పుడు త మకు తెలపాలని ఎక్సైజ్ అధికారులు ఆంక్షలు పెట్టా రు. ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేటలో కామారెడ్డి వ్యాపారికి చెందిన బెల్లం లారీని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ కారణాలతో వ్యాపారులు బెల్లం కొ నుగోలుకు విముఖత చూపుతున్నారు. కొందరు కొ నుగోలు చేస్తున్నప్పటికీ ధర మాత్రం అంతంతగానే ఉంటోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
మిగిలేదేమీ లేదు
తక్కువ ధరకు బెల్లం అమ్మితే మిగిలేది ఏమీలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు సాగుకు అయ్యే ఖర్చుతో పాటు బెల్లం తయారీకి కలిసి క్వింటాలుకు రూ. రెండు వేల వరకు ఖర్చవుతోంది. క్వింటాలుకు రూ. 2600 చెల్లిస్తే రైతులకు రూ. 600 మిగిలేది. మార్కెట్‌లో ధర రూ. రెండు వేలకు మించకపోవడంతో ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామంలో రైతుల వద్ద వెయ్యి క్వింటాళ్లకు పైగా బెల్లం మిగిలింది. బండరామేశ్వర్‌పల్లి, లచ్చాపేట, తది త ర గ్రామాలలో కొనేవారు లేక, ఉన్న ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతు న్నామని వాపోతున్నారు.
పాలకులకు పట్టని రైతుల గోడు
బెల్లం కొనుగోలు కేంద్రం ఎత్తివేసిన దరిమిలా తలెత్తిన సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. రైతుల గురించి గొప్పగా మాట్లాడే నే తలు బెల్లం విషయంలో తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా బెల్లం ధర విషయంలో, కొనుగోలు కేంద్రాల విషయంలో చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
బెల్లం ధరఢమాల్
Published Fri, Feb 28 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement
Advertisement