Jaggery farmers
-
మంచి రుచితో పాటు పోషకాలు అధికం..!
-
బెల్లం దిమ్మ దిగాలు
అనకాపల్లి మార్కెట్లో బెల్లం లావాదేవీలు ఏటేటా తగ్గిపోతున్నాయి. తాజాగా ముగిసిన ఆర్థికసంవత్సరం(2018–2019) మార్కెట్ చరిత్రలోనే నిరాశను మిగిల్చింది. సాధారణంగా ఏటా రూ.150 కోట్ల వరకూ లావాదేవీలు ఉంటాయి. రూ.వంద కోట్ల మేర జరిగాయంటే బెల్లం ఉత్పత్తి తగ్గినట్లే. అలాంటిది 2018–19 ఆర్థిక సంవత్సలంలో కేవలం రూ. 91.08 కోట్లకే పరిమితం కావడం మార్కెట్ వర్గాలను కలవరపరుస్తోంది. జిల్లాలో చెరకు సాధారణ సాగు విస్తీర్ణం 45వేల హెక్టార్లు. ప్రస్తుతం 34వేల హెక్టార్లకు పడిపోయింది. ఇది ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అనకాపల్లి: దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన అనకాపల్లి మార్కెట్లో బెల్లం వ్యాపారం ప్రస్తుతం దయనీయంగా ఉంది. ఏటా సంక్రాంతి, దసరా పండుగల సీజన్లలో బెల్లానికి మంచి డిమాండ్ ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతి అవుతుంది. ప్రస్తుత సీజన్లో ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఒకవైపు బెల్లం దిగుబడి గణనీయంగా పడిపోగా, ధర మరీ దారుణంగా పతనమైంది. తయారు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెరకు సాగు, బెల్లం తయారీ అంటేనే ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీత్యాలు ఏటా దెబ్బతీస్తున్నాయి. మార్కెట్లో తెల్ల బెల్లాన్ని మొదటి రకంగా భావిస్తారు. దీని తయారీలో సల్ఫర్ వినియోగం ఉంటోందంటూ ఫుడ్ కంట్రోల్ అధికారుల దాడులతో రైతులు, వర్తకులు ఇబ్బంది పడుతున్నారు. అలాగని నల్లబెల్లం తయారు చేస్తే ధర పడిపోతోంది. ఏడాదంతా కష్టపడి పండించే చెరకును బెల్లంగా తయారీలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. సహజంగా దాని రంగును వాతావరణం, చెరకు వంగడాలు, నేల స్వభావం, రైతులు వండే విధానం ప్రభావితం చేస్తాయి. ఇలా గిట్టుబాటు కానందున ఇటీవల రైతులు చెరకు సాగుకు దూరమవుతున్నారు. దీని పరిష్కారానికి శాస్త్రవేత్తలు జంట చాళ్ల పద్ధతి, బడ్ చిప్ చెరకు, టిష్యూ కల్చర్ సాగుపై అవగాహన కల్పిస్తున్నా, అది రైతుల వద్దకు చేరడం లేదు. కిలో దిమ్మల తయారీపైనే దృష్టి.. పరిస్థితులు మారుతున్నాయి. బెల్లం రైతులను చైతన్య పరిచేందుకు మార్కెట్ అధికారులు సైతం రంగంలోకి దిగుతున్నారు. సనాతన పద్ధతిలో 12 నుంచి 15 కిలోల బరువుండే దిమ్మలకు కిలోల రూపంలో తయారు చేసి మార్కట్‌కు తరలిస్తున్నారు. వర్తకులు, మార్కెట్ కమిటీ అధికారులూ దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు సేంద్రియ బెల్లం తయారీపై కూడా దృష్టి సారించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఏటేటా తగ్గుతున్న చెరకు విస్తీర్ణం... జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతోంది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 45వేల హెక్టార్లు. ఈ ఏడాది 34 వేల హెక్టార్లకు పడిపోయింది. దిగుబడి మరీ దయనీయంగా ఉంది. చెరకు వంగడాలను రూపొందించినప్పుడు హెక్టార్‌కు 150 టన్నులు ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెక్టార్‌కు కొన్ని ప్రాంతాల్లో 75 టన్నులు, మరికొన్ని చోట్ల 50 టన్నులకు మించడం లేదు. ఇక బెల్లం దిగుబడి కూడా బాగా తగ్గిపోతోంది. అనకాపల్లి మార్కెట్‌కు 2011–2012లో 8.17లక్షల క్వింటాళ్ల బెల్లం వచ్చింది. ఇదే రికార్డు. 2016 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మొదటి రకాన్ని గుంటూరు రైతులు క్వింటా రూ. 4500 లకు కొనుగోలు చేశారు. సహజంగా మార్కెట్‌కు అక్టోబర్, నవంబర్ నెలల నుంచి బెల్లం వస్తుంది. జిల్లాతో పాటు పొరుగున ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని రైతులు 15కిలో దిమ్మల రూపంలో దీనిని తయారు చేస్తుంటారు. ఈ కారణంగా రిటైల్ అమ్మకాలకు ఆస్కారం లేకుండా పోయి నష్టపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో పంపిణీ చేసిన చంద్రన్న కానుకల్లో బెల్లాన్ని కిలో రూ.39.10లకు సరఫరా చేస్తామని స్థానిక వర్తకులు చెప్పినా ఈ ప్రభుత్వం మాత్రం కిలోకు రూ. 49.70 వంతున చెల్లిస్తూ గుజరాత్‌కు చెందిన వ్యాపారులకు కట్టబెట్టింది. ఆ బెల్లం కూడా కర్నాటక ప్రాంతంలో తయారైనదే. ఇలా రాష్ట్ర రైతులకు, వర్తకులకు నష్టమే మిగిలింది. మార్కెట్లో డిమాండ్ మేరకు రైతులు ఇక నుంచి కిలో సైజుల్లో తయారు చేస్తే కొద్దిపాటి నష్టాల నుంచి బయటపడవచ్చు. ఇదే సమయంలో ప్రభుత్వం సైతం చెరకు రైతులకు ప్రోత్సాహం, మద్దతు ఇవ్వకపోతే చెరకు సాగు రాష్ట్రంలో ప్రశ్నార్థకం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. -
ఆ రైతే ఉచిత విద్యుత్‌కు ప్రేరణ
సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్సార్ చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా 2003 ఫిబ్రవరి 15న మునగపాక గ్రామానికి వచ్చారు. బెల్లం క్రషర్ దగ్గరకు వెళ్లి రైతు ఆడారి పోలయ్యతో కలిసి గానుగ తిప్పారు. ఏం పోలయ్య ఎలా ఉన్నావ్...చెరకు సాగు ఎలా ఉంది? బెల్లం గిట్టు బాటవుతుందా? అని మహానేత ఆరా తీశారు. రైతుల బతుకలే బాగులోదయ్యా అని బదులివ్వగానే రైతు బాగుపడాలంటే ఏం చేయాలో చెప్పు.. మహానేత అడగ్గానే విడతల వారీగా తెల్లవారుజామున రెండుగంటలు, మధ్యాహ్నం రెండు గంటలు, రాత్రి నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. పగటి పూటే ఏడుగంటలు కరెంట్ ఇస్తే బాగుంటందయ్యా అని కోరాడు. ఓకే మనం రాగానే ఉదయం పూటే కరెంట్ ఇద్దాం..ఇంకేం కావాలోచెప్పు అనగానే ఆ కరెంట్ కాస్త ఉచితంగా ఇస్తే రైతు బాగు పడతాడని బదులిచ్చాడు. మనం అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తా అని హామీ ఇవ్వడమే కాదు..అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. నాటి మహానేతతో తన అనుభవాలను పాదయాత్రలో బుధవారం తమ గ్రామానికి వచ్చిన రాజన్న బిడ్డ జగన్‌ని కలిసి పోలయ్య కుటుంబం పంచుకుంది. వైఎస్ మాదిరిగానే మీరు కూడా రైతుకు మేలు చేయాలని కోరింది. -
వైఎస్ జగన్‌ను కలిసిన బెల్లం రైతులు
-
బెల్లం ధరఢమాల్
కామారెడ్డి, న్యూస్‌లైన్: బెల్లం రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు వీలుగా మా ర్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొంత కాలం క్రితం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏమైందో తెలియదు కానీ, దానిని నెల రోజులకే మూసివేశారు. బెల్లం అమ్మిన రైతులకు డబ్బులు రాకపోగా, ఇంకా విక్రయించని రైతులు బెల్లాన్ని విధి లేక ఇంటిలోనే నిలువ చేసుకున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు బహిరంగ మార్కెట్ ధరను బాగా తగ్గించేశారు. మార్క్‌ఫెడ్ క్వింటాలుకు రూ. 2600 ధర నిర్ణయించింది. కొందరు రైతులు మా ర్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో బెల్లం విక్రయించారు. అప్పుడు మార్కెట్లో వ్యాపారులు రూ. 2400 వరకు ధర చెల్లించారు. అయితే, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం నెల రోజులకే మూతపడడం బెల్లం ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు మార్కెట్లో వ్యాపారులు క్వింటాలు కు రూ. 2,050 మా త్రమే చెల్లిస్తున్నారు. దీంతో క్విం టాలుకు 550 వరకు నష్టపోవాల్సి వస్తోంది. అప్పుల వేధింపులు వ్యాపారులు నిర్ణయించిన ధరకే బెల్లం అమ్మాల్సిన పరిస్థితులలో రైతులు తమ ఇళ్లలోనే బెల్లాన్ని నిల్వ ఉంచుతున్నారు. చెరుకు సాగుతో పాటు బెల్లం త యారీకి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రై తులు బెల్లం అమ్ముడుపోకపోవడంతో అప్పుల వే ధింపులు తాళలేకపోతున్నారు. మార్క్‌ఫెడ్ కొనుగో లు కేంద్రం ఎత్తివేసిన తర్వాత బెల్లం కొనడానికి వ్యా పారులు కూడా ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు చే సిన బెల్లాన్ని ఎక్కడికి సరఫరా చేస్తున్నది, ఎంత కొ నుగోలు చేసిందన్న వివరాలను ఎప్పటికప్పుడు త మకు తెలపాలని ఎక్సైజ్ అధికారులు ఆంక్షలు పెట్టా రు. ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేటలో కామారెడ్డి వ్యాపారికి చెందిన బెల్లం లారీని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ కారణాలతో వ్యాపారులు బెల్లం కొ నుగోలుకు విముఖత చూపుతున్నారు. కొందరు కొ నుగోలు చేస్తున్నప్పటికీ ధర మాత్రం అంతంతగానే ఉంటోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మిగిలేదేమీ లేదు తక్కువ ధరకు బెల్లం అమ్మితే మిగిలేది ఏమీలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు సాగుకు అయ్యే ఖర్చుతో పాటు బెల్లం తయారీకి కలిసి క్వింటాలుకు రూ. రెండు వేల వరకు ఖర్చవుతోంది. క్వింటాలుకు రూ. 2600 చెల్లిస్తే రైతులకు రూ. 600 మిగిలేది. మార్కెట్లో ధర రూ. రెండు వేలకు మించకపోవడంతో ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామంలో రైతుల వద్ద వెయ్యి క్వింటాళ్లకు పైగా బెల్లం మిగిలింది. బండరామేశ్వర్‌పల్లి, లచ్చాపేట, తది త ర గ్రామాలలో కొనేవారు లేక, ఉన్న ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతు న్నామని వాపోతున్నారు. పాలకులకు పట్టని రైతుల గోడు బెల్లం కొనుగోలు కేంద్రం ఎత్తివేసిన దరిమిలా తలెత్తిన సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. రైతుల గురించి గొప్పగా మాట్లాడే నే తలు బెల్లం విషయంలో తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా బెల్లం ధర విషయంలో, కొనుగోలు కేంద్రాల విషయంలో చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
జగన్‌కు బాధలు వెళ్లడించిన బెల్లం రైతులు
చిత్తూరు: బెల్లం సాగుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బెల్లం రైతులకు హామీ ఇచ్చారు. ఎస్ఆర్ పురంలో ఈరోజు ఆయన బెల్లం రైతులతో మాట్లాడారు. బెల్లం సాగు గిట్టుబాటు కావడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు 3,500 రూపాయలకు మించి ధర రావడం లేదని వారు తెలిపారు. కూలీ రేట్లు, బెల్లం తయారీ సామగ్రి ధరలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాగా పెంచేసిందని వారు చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీకి చెరకు పంపలేక తప్పనిసరి పరిస్థితుల్లో బెల్లం తయారు చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో బెల్లం ధర దారుణంగా ఉందన్నారు. మన ప్రభుత్వం వచ్చాక బెల్లం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి గిట్టుబాటు ధర పెంచుతామని జగన్ వారికి హామీ ఇచ్చారు.