జగన్కు బాధలు వెళ్లడించిన బెల్లం రైతులు
చిత్తూరు: బెల్లం సాగుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బెల్లం రైతులకు హామీ ఇచ్చారు. ఎస్ఆర్ పురంలో ఈరోజు ఆయన బెల్లం రైతులతో మాట్లాడారు. బెల్లం సాగు గిట్టుబాటు కావడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు 3,500 రూపాయలకు మించి ధర రావడం లేదని వారు తెలిపారు.
కూలీ రేట్లు, బెల్లం తయారీ సామగ్రి ధరలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాగా పెంచేసిందని వారు చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీకి చెరకు పంపలేక తప్పనిసరి పరిస్థితుల్లో బెల్లం తయారు చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో బెల్లం ధర దారుణంగా ఉందన్నారు.
మన ప్రభుత్వం వచ్చాక బెల్లం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి గిట్టుబాటు ధర పెంచుతామని జగన్ వారికి హామీ ఇచ్చారు.