support price
-
సర్కారు మోసం.. మిర్చి రైతు హాహా‘కారం’
సాక్షి, అమరావతి/నెట్వర్క్: మిరప రైతుల నెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. మద్దతు ధర పేరిట ఊరించి ఊహల పల్లకిలో ఊరేగించి నిలుపునా ముంచేసింది. మద్దతు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసానికితోడు రైతుల ఖాతాకు జమ చేస్తామని కొంతకాలం, బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామంటూ మరికొంత కాలం నాన్చింది. ఇప్పుడు మార్కెట్లో ధరలు ఎగబాకిపోతున్నందున ఇక మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెబుతోంది. మరి నష్టానికి అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నోరు పెగలడం లేదు. బోనస్ విషయంలో చేతులెత్తేశారు. తేజ రకం తప్ప మిగిలిన రకాలన్నీ నేటికీ మద్దతు ధర కంటే తక్కువగానే పలుకుతున్నాయి. అయినా సరే ధరలు ఎగబాకిపోతున్నాయంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతూ అబద్ధాలు వల్లె వేస్తున్నారు. విదేశాలకు ఎగుమతుల ఆర్డర్లు తగ్గడంతో పంట మార్కెట్‌కు వచ్చే సమయంలోనే ధరల పతనం మొదలైంది. మరో వైపు ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనతో మసాలా కంపెనీలు కూడా కొనుగోలు నిలిపివేశాయి. ఇదే విషయమై ఓ వైపు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం హెచ్చరికలు చేసినా, మార్కెటింగ్ శాఖ ముందుగానే గుర్తించించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రంగంలోకి దిగి మిర్చి యార్డుకు వెళ్లి మిరప రైతులకు బాసటగా నిలవడంతో కూటమి పెద్దలు నానా హంగామా చేశారు. చేతిలో ఉన్న మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి ఆదుకోవల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని.. మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగివచ్చేసిందంటూ ఊదరగొట్టారు. కేంద్రంపై భారం మోపి.. చేతులెత్తేశారు దిగుబడుల్లో కనీసం 30 శాతం (3 లక్షల టన్నులపైన) పంట సేకరిస్తే రూ.3,480 కోట్లు ఖర్చవుతుందని.. ఆ భారం కేంద్రమే భరించేలా ఒప్పిస్తామంటూ తొలుత రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. ఆ తర్వాత మార్కెట్ ధర, మద్దతు ధర మధ్య వ్యత్యాసంలో 50 శాతం (మిగతా 50 శాతం కేంద్రం) భరించేలా ఫిబ్రవరి మూడో వారంలో ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున 25 శాతం (2.9 లక్షల టన్నులు) పంటకు రూ.846.15 కోట్లు, 50 శాతం (5.83 లక్షల టన్నులు) పంట కొనుగోలుకు రూ.1,692.31 కోట్లు, 75 శాతానికి (8.75 లక్షల టన్నులు) రూ.2,538.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. రూ.11,781 చొప్పున కేంద్రం కొంటుందంటూ కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని గొప్పగా ప్రకటించారు. అన్నీ తెలిసి దొంగ నాటకాలు సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులతో గత నెల 21న ఏర్పాటు చేసిన సమావేశంలో తమకు శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. 25 శాతానికి మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కన్పించడం లేదంటూ తేల్చి చెప్పేశారు. వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా, 25 శాతానికి మించి కొనుగోలు చేయాలన్నా, కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సిందే. నాటి భేటీలో వారం పది రోజుల్లో మరోసారి భేటీ అయ్యి తాము నిర్దేశించిన మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసి మూడు వారాలు దాటినా మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. ధరలు పెరిగిపోయాయంటూ అబద్ధాలు మద్దతు–మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ హంగామా చేశారు. ఆ మేరకు యార్డులో మిర్చి విక్రయించిన రైతుల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది. పైగా ఈ హడావుడి తర్వాత మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా పోటీపడి స్టేట్మెంట్లు ఇస్తూ సమస్యను నీరుగార్చేస్తున్నారు. వాస్తవానికి గురువారం మిర్చి యార్డులో తేజ రకానికి మాత్రమే గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.5,500 పలికింది. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ఎంతో కొంత బోనస్ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.ఈయన పేరు కన్నెబోయిన బాలసాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి స్వగ్రామం. తనకున్న మూడెకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేశారు. ఎకరాకు రూ.1.75 లక్షలు ఖర్చయ్యింది. గతేడాది ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో 15 క్వింటాళ్ల లోపే వచ్చింది. సగానికి పైగా తాలు. గత సీజన్లో క్వింటా రూ.23వేల నుంచి రూ.27 వేల మధ్య పలికిన తేజ రకం కాయలు నేడు రూ.11వేల నుంచి రూ.12 వేల మధ్య పలుకుతున్నాయి. తాలు రకానికి గత సీజన్లో క్వింటాకు రూ.17 వేలు ధర వస్తే ఈ ఏడాది రూ.5 వేలు కూడా దక్కలేదు. ‘గత నెల మొదటి వారంలో 40 బస్తాలు గుంటూరు యార్డుకు తీసుకొస్తే క్వింటాకు రూ.15 వేలు ధర వస్తే నేడు 50 బస్తాలు తెస్తే క్వింటా రూ.11 వేలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.11,781గా ప్రకటించిన తర్వాత ధరలు మరింత పతనమయ్యాయి. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. మిర్చి పంట అమ్ముకోవాలంటే భయం వేస్తోంది. ఇళ్ల వద్ద కూలీలతోపాటు ఎరువులు, మందుల షాపుల వారు కాచుకుని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్వింటాకు రూ.20 వేలు ధర పలికితే పెట్టుబడి వస్తుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం’ అని బాలసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగు, దిగుబడి లెక్కలివి.. రాష్ట్రంలో 2023–24 సీజన్లో 6 లక్షల ఎకరాలకు పైగా మిరప సాగైంది. 14.50 లక్షల టన్నులకుపైగా దిగుబడులొచ్చాయి. అలాంటిది 2024–25లో వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్వాకంతో కేవలం 3.95 లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప సాగైంది. దిగుబడి 11 లక్షల టన్నులొస్తాయని అంచనా వేయగా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. మరోపక్క గుంటూరు మార్కెట్ యార్డుకు ఈ ఏడాది 4.76 లక్షల టన్నులు మిరప వస్తుందని అంచనా వేయగా, జనవరిలో 61 వేల టన్నులు, ఫిబ్రవరిలో 1.10 లక్షల టన్నులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 1.09 లక్షల టన్నులొచ్చాయి. ఈ నెలలో మరో లక్ష టన్నులు, ఏప్రిల్‌లో 65 వేల టన్నులు, మేలో 30 వేల టన్నులు మార్కెట్‌కు వస్తాయని అంచనా. ఈ దుస్థితి ఏనాడు లేదు దశాబ్దాలుగా మిర్చి పంటను పండిస్తున్నా. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కాయలు కోత కోద్దామంటే కూలీలు వచ్చే పరిస్థితి లేదు. గత సీజన్లో కిలో ఎండు మిర్చి తీతకు రూ.10 ఇస్తే, ఈ ఏడాది రూ.25 ఉంది. గతేడాది తేజ రకం మిర్చి క్వింటా రూ.20 వేలకు పైగా అమ్మితే ఈ ఏడాది రూ.10 వేలకు మించి కొనడం లేదు. విచిత్రంగా మిర్చి ధర తగ్గి కూలీల ధర పెరగటం దారుణం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.11,781 దేనికీ సరిపోదు. – దొండపాటి అంజయ్య, అడిగొప్పుల, పల్నాడు జిల్లాఅప్పులే మిగిలాయి3 ఎకరాల్లో మిరపసాగుకు ఎకరాకు రూ.75 వేలకుపైగా పెట్టుబడి పెట్టా. వైరస్ సోకి ఎకరాకు 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. మార్కెట్లో ధర లేదు. చివరికి క్వింటా రూ.9 వేలకు అమ్ముకున్నా. కనీస పెట్టుబడి కూడా మిగల్లేదు. అప్పులు మాత్రమే మిగిలిపోయాయి. – అహ్మద్, కమాన్దొడ్డి, కొసిగి మండలం, కర్నూలు జిల్లా -
‘కంది’పోయిన ‘రైతు’
కంది రైతు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కుదేలవుతున్నాడు. ఓ వైపు రిటైల్ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.180 పై మాటే. కాస్త నాణ్యమైన కందిపప్పు ధర ఏకంగా రూ.224 వరకు పలుకుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో ఆ కంది పండించే రైతులకు మాత్రం కనీస మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. నాణ్యమైన కందులకు కూడా ఆశించిన ధర దక్కక రైతు ఆర్థికంగా నష్టపోతున్నాడు. – సాక్షి, అమరావతిమెజార్టీ రైతులకు దక్కని మద్దతు ధరఏన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం ప్రతీ ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో పంట చేతికొచ్చే సమయంలో ధరల అంచనా వేస్తుంది. ఏఏంఐసీ అంచనా నివేదిక ప్రకారం జనవరి, ఫిబ్రవరిలో కందులకు క్వింటా రూ.7,830 నుంచి రూ.8,680 మధ్య ఉంటుందని అంచనా. కానీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో సోమవారం కందులకు గరిష్టంగా క్వింటా రూ.7,200 పలికింది. 70– 80 శాతం మంది రైతులకు నాణ్యత లేదనే సాకుతో క్వింటాకు రూ.4,700 నుంచి రూ.6,170 మధ్య చెల్లిస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భరోసామార్కెట్లో మద్దతు ధర దక్కని సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్కెట్లో రైతు సంక్షేమమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. ఇలా 2019–24 మధ్య మార్క్‌ఫెడ్ ద్వారా రూ.140 కోట్ల విలువైన 61,377 టన్నులు కందులను సేకరించారు. కాగా ఈ ఏడాది కోతలు ప్రారంభమైనప్పటి నుంచి మద్దతు ధర దక్కని పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న పాపాన పోలేదు. కేంద్రం నుంచి అనుమతి రాగా గత నెల మూడో వారం నుంచి సేకరణకు శ్రీకారం చుట్టింది. కనీస మద్దతు ధరకు 1,450 టన్నుల కందులను మాత్రమే సేకరించారు.మార్కెట్లో మద్దతు ధర దక్కని సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్కెట్లో రైతు సంక్షేమమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. ఇలా 2019–24 మధ్య మార్క్‌ఫెడ్ ద్వారా రూ.140 కోట్ల విలువైన 61,377 టన్నులు కందులను సేకరించారు. కాగా ఈ ఏడాది కోతలు ప్రారంభమైనప్పటి నుంచి మద్దతు ధర దక్కని పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న పాపాన పోలేదు. కేంద్రం నుంచి అనుమతి రాగా గత నెల మూడో వారం నుంచి సేకరణకు శ్రీకారం చుట్టింది. కనీస మద్దతు ధరకు 1,450 టన్నుల కందులను మాత్రమే సేకరించారు.» ఖరీఫ్ సీజన్లో 9 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. » సగటున హెక్టార్‌కు 754 కేజీల చొప్పున 2.73 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు.» అధిక వర్షాలు,వర్షాభావ పరిస్థితులు వేరుశనగ, పత్తి తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు కందిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.» గతేడాది ఇదే సమయానికి క్వింటా రూ.9,400–9,800 మధ్య పలికింది. దీంతో ఈ ఏడాది మంచి రేటు పలుకుతుందని రైతులు ఆశపడ్డారు.» అయితే పూత, పిందె దశలో భారీ వర్షాల ప్రభావంతో దిగుబడులు పడిపోయాయి. దాదాపు ఆరేడు సార్లు మందులు పిచికారీ చేయాల్సి రావడంతో ఎకరాకు రూ.2వేల వరకు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచి్చంది.» కందులకు కనీస మద్దతు ధర క్వింటాకురూ.7,550గా కేంద్రం ప్రకటించగా, పంట వేసిన సమయంలోనే అతి తక్కువగా క్వింటా రూ.7,500 నుంచి రూ.8వేల శ్రేణిలో పలికింది.» కోతకొచ్చే వేళలో మద్దతు ధరయినా దక్కు తుందని ఆశించారు.» అయితే వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర లేకుండా చేసారు.» తీరా పంట చేతికొచ్చే వేళ ధర నేలచూపులు చూస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.» ఎకరాకు ఐదారు క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 2–3 క్వింటాళ్ల మించిరాని పరిస్థితి ఏర్పడింది.మద్దతు ధర కూడా దక్కలేదు.. నేను రెండెకరాలు సొంతంగా, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని కంది సాగు చేసా. పెట్టుబడి రూ.80 వేల చొప్పున ఖర్చు కాగా, ఎకరాకు కనీసం 5–6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించాను. కానీ వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 3 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. కనీస మద్దతు ధరకు కొనే వారు లేకపోవడంతో క్వింటాను రూ.7,200 చొప్పున విక్రయించా. వచ్చిన సొమ్ము పెట్టుబడులకు కూడా సరిపోలేదు. – వడ్డే ఈశ్వరప్ప, గిరిగెట్ల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా -
ధరలేక దిగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం రైతు దగా పడుతున్నట్లుగానే పత్తి రైతు కూడా చిత్తవుతున్నాడు. మద్దతు ధర కల్పనకు తేమ శాతం సాకుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మోకాలడ్డుతుంటే అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. ఫలితంగా గతంలో ఎన్నడూలేని విధంగా పత్తి ధర పతనమైందని.. సర్కారు తీరువల్ల పెట్టుబడి కూడా దక్కడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు. గతేడాది 15 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడంలేదంటున్నారు. ఈ ఏడాది కనీస మద్దతు ధరగా మధ్యస్థ రకానికి క్వింటా రూ.7,121, పొడవు రకానికి రూ.7,521గా కేంద్రం నిర్ణయించింది. కానీ, ఈ ఏడాది తొలితీత ప్రారంభానికి ముందే మార్కెట్లో ధరల పతనం మొదలైంది. గతేడాది క్వింటా రూ.10వేలకు పైగా పలికిన పత్తి ప్రస్తుతం మార్కెట్లో గ్రేడ్‌ను బట్టి క్వింటా రూ.4వేల నుంచి రూ.5,800 మించి పలకడంలేదు. మరోవైపు.. ఏటా అక్టోబరు మూడోవారంలో ప్రారంభం కావాల్సిన సీసీఐ కేంద్రాలు ఈ ఏడాది నవంబరు 11నాటికి కానీ ప్రారంభం కాలేదు. పైగా.. 33 ఏఎంసీల పరిధిలో 61 జిన్నింగ్ మిల్లులు ఏర్పాటుచేయాలని సంకలి్పంచగా, 45 జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే కొనుగోళ్లు మొదలయ్యాయి. సుదూర ప్రాంతాల్లో కేంద్రాలు.. ఇక కొనుగోలు కేంద్రాలను మారుమూలనున్న మిల్లుల వద్ద ఏర్పాటుచేయడంతో రవాణా, లోడింగ్ చార్జీలు రైతులకు తడిసిమోపెడవుతున్నాయి. ఉదా.. వైఎస్సార్ జిల్లాలో ఒక్క కేంద్రం ఏర్పాటుచేయలేదు. ఈ జిల్లాకు చెందిన రైతులు నంద్యాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే, గుంటూరు జిల్లా తాడికొండ రైతులు కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్తిపాడు మండలంలోని కోయపాలెం మిల్లుకు వెళ్లాల్సి వస్తోంది. పోనీ ధర పెరిగే వరకు నిల్వచేసుకుందామనుకుంటే క్వింటాకు రూ.400–500 వరకు అద్దెలు చెల్లించాల్సి రావడంతో చేసేదిలేక అయినకాడకి అమ్ముకుంటున్నారు. తేమ శాతం పేరిట కొర్రీలు..కేంద్ర నిబంధనల మేరకు 8 శాతం తేమతోనే పత్తిని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత 12 శాతం వరకు ఒక్కో శాతం చొప్పున ఎమ్మెస్పీ ధరలో కోత విధిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో పత్తి పిందె, పూతకొచ్చే దశలో కురిసిన అధిక వర్షాల కారణంగా తేమ శాతం 15–30 శాతం చొప్పున నమోదవుతుండగా, ప్రస్తుతం కురుస్తున్న మంచు ప్రభావంతో పెరుగుతున్న తేమశాతం రైతులకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రాల్లో ఏర్పాటుచేసిన రెండు రకాల యంత్రాల్లో ఒక్కోదాంట్లో ఒక్కో రీతిలో తేమ శాతం నమోదవడంతో రైతులు నష్టపోతున్నారు. జిన్నింగ్ పరిశ్రమల యాజమాన్యాలతో సీసీఐ అధికారులు కుమ్మక్కై సర్వర్ నెమ్మదిగా ఉందని, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకులు చెబుతూ మద్దతు ధర దక్కనీయకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉన్న పత్తిని నిల్వచేస్తే రంగు మారుతుండగా, నాణ్యమైన దిగుబడులొచి్చన చోట కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక రైతులు అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది.ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు.. మా జిల్లాలో ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు. ఫలితంగా నంద్యాల జిల్లాలోని కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి వేలకు వేలు ఖర్చుపెట్టి లారీల్లో పత్తిని తీసుకుకెళ్తే అక్కడ నిమ్ము ఎక్కువగా ఉందని నాణ్యతలేదని రేటు తగ్గించేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎవరు వెళ్లడంలేదు. ఇక్కడే అమ్ముకుంటున్నారు. గతేడాది మద్దతు ధరకు మించి పలికింది. ఈ ఏడాది రూ.6 వేలకు మించి పలకడంలేదు. దీంతో పాతది, ఇప్పటిదీ కలిపి దాదాపు 400 క్వింటాళ్ల పత్తిని ఇంట్లోనే ఉంచుకున్నాను. – నంద్యాల భాస్కర్‌రెడ్డి, రాజుపాలెం, వైఎస్సార్ జిల్లా ఎకరాకు రూ.5వేల నష్టం.. గతేడాది నవంబరులోనే గుంటూరు, ఒడిశా, రాయగడ, గుణుపూర్ ప్రాంతాలకు చెందిన వర్తకులు క్వింటా రూ.7వేలకు పైగా కొనుగోలు చేశారు. కానీ, ఈ ఏడాది రూ.6వేలకు మించి కొనడంలేదు. ఇలా అయితే ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ ఒక్కరికీ లభించడంలేదు. – పెద్దకోట జగన్నాథం, కర్లెం, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా -
అన్నీ కోతలే.. కొన్నది ఏదీ!
అవనిగడ్డ/సాక్షి ప్రతినిధి, బాపట్ల/బండి ఆత్మకూరు: రాష్ట్రంలో ధాన్యం రైతుల విషయంలో ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది మరొకటి. ఏ ఒక్క రైతుకూ పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వమే ధాన్యం దళారీగా మారి.. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతుంటే అన్నదాతలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మిల్లర్లు చెప్పిన ధరకే ధాన్యం ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకు రావడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా.. అని రైతులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ‘మొన్నటి ఇబ్బందులు చెప్పొద్దు. ఈ రోజే మీ సమస్యను పరిష్కరిస్తాం. ఎన్ని సంచులు కావాలంటే అన్ని... ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీలు పంపిస్తాం. దళారులకు ధాన్యం అమ్మొద్దు. ఈ రోజు సాయంత్రానికే మీ ధాన్యం కొనుగోలు చేసి తీరతాం’ అని మంత్రి మనోహర్ బుధవారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మాజేరు, లంకపల్లి, లక్ష్మీపురం, చల్లపల్లి, కప్తానుపాలెం, పెదప్రోలు గ్రామాల్లో ధాన్యం రాశులను పరిశీలించి రైతులకు హామీ ఇచ్చారు.గురువారం రాత్రి వరకు కూడా అటు వైపు ఏ అధికారీ కన్నెత్తి చూడక పోవడం గమనార్హం. చేత కానప్పుడు ఇలాంటి వాగ్దానాలు చేయకూడదని రైతులు హితవు పలుకుతున్నారు. ‘15 రోజుల క్రితం కోత కోయించి ధాన్యం తీసుకొచ్చి రోడ్డు పక్కన ఆరబెట్టుకుంటున్నాం. వర్షం వచ్చి ధాన్యం తడిస్తే ఎందుకూ పనికిరావు. ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని చేతులెత్తి మంత్రిని వేడుకున్నా. బుధవారం సాయంత్రానికి కొనేస్తామన్నారు. గురువారం సాయంత్రం వరకు ఎవరూ పత్తాలేరు. రైతులపై కనీస కనికరం లేదు’ అని లంకపల్లికి చెందిన మోటుపల్లి జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. బిత్తరపోయిన మంత్రులుబాపట్ల జిల్లా కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించేందుకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా దోపిడీకి గురవుతున్న తీరును స్థానిక రైతులు ఏకరువు పెట్టారు. ‘ఏం బాబూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయా’ అని మంత్రి కొలుసు పార్థసారథి ఆరా తీశారు. దీనికి కౌలు రైతు ప్రసాదరావు సమాధానమిస్తూ.. ‘ఏంటండీ కొనేది? పండించిన పంటను కొనడానికి ముప్ప తిప్పలు పెడుతున్నారు. మిల్లర్లే దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం తీసుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు. కొల్లూరులో 6 ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని మిల్లుకు తెచ్చాం. ధాన్యం కొనాలని కోరుతూ తిరగని రోజు లేదు. ఈకేవైసీ చేయించిన పత్రాలు చూపెట్టా. తేమ శాతం 21 ఉన్నా.. మిల్లర్లు వారి కింద పనిచేసే బ్రోకర్లను అడ్డం పెట్టుకుని బస్తా (75 కిలోలు) రూ.1,200కే అడుగుతున్నారు’ అని అవస్థలను ఏకరువు పెట్టాడు. దీంతో బిత్తరపోయిన మంత్రులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు గురువారం నంద్యాల జిల్లా సంతజూటూరు గ్రామంలో రోడ్డెక్కారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజశేఖర్, రైతు సంఘం నాయకులు వెంకట కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సన్న రకం వడ్లు బస్తా రూ.1,300 నుంచి రూ.1,400 ధర పలుకుతోందని, గత ప్రభుత్వం క్వింటాకు రూ.2,600 మద్దతు ధర ప్రకటించడంతో రూ. 2,500 నుండి రూ.2,900 వరకు ధర పలికిందన్నారు. గత ప్రభుత్వంలోనే మేలు జరిగిందని గుర్తు చేశారు. -
ధాన్యం దళారీగా సర్కారు
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వం ధాన్యం దళారీగా మారింది. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతోంది. మిల్లర్లు చెప్పిన ధరకు ధాన్యం ఇచ్చేయాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకొస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర దక్కడంలేదు. చరిత్రలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితులు చూడలేదు’.. అంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. తేమశాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గడిచిన రెండ్రోజులుగా మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్బీకేలు, రైతుక్షేత్రాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశుల ఎదుట నిరసనలు వ్యక్తంచేసిన రైతులు బుధవారం విజయవాడలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ మండలాల రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు, వివిధ రైతు సంఘాల నేతలు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..మంత్రి చిటికలేసినా ధాన్యం కదల్లేదు..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి, రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సాయంత్రానికి కల్లా కాటావేసి మిల్లులకు తరలించాలని నాలుగు రోజుల క్రితం అధికారులకు చిటకలేసి మరీ చెప్పారు. రోజులు గడుస్తున్నా గింజ ధాన్యం కూడా కాటా వేయలేదు. మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో పట్టించుకోవడంలేదు. వాళ్లు పర్యటించిన చోట కూడా ధాన్యం కాటా వేయడం కానీ, మిల్లులకు తోలడంగానీ జరగడంలేదు. మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ‘మద్దతు’ దక్కడంలేదు..తేమ శాతం ఎంతున్నా కొంటామంటున్నారు. ఆ తర్వాత 17 శాతం దాటితే ఐదు కేజీల కోత వేసి మిగిలిన ధాన్యాన్ని కొంటామన్నారు. పూర్తిస్థాయి మద్దతు ధర కల్పించాల్సిన ప్రభుత్వమే తరుగు మినహాయించి కొంటామని చెప్పడం దారుణం. తుపాను, వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేమ శాతం 20 నుంచి 24 శాతం వస్తోంది. రెండు శాతమో, ఐదు శాతమో కట్ చేసి మిగిలిన ధాన్యానికి మద్దతు ధర ప్రకారం లెక్కిస్తే 75 కేజీల బస్తాకు రూ.1,670 చొప్పున ఇవ్వాలి. కానీ, రూ.1,470–1,500కు మించి ఇవ్వడంలేదు. పైగా.. ధాన్యం బాగోలేదంటూ మిల్లర్లు పేచీ పెడుతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఎంటీయూ 1,262, 1,318 వంటి ఫైన్ వెరైటీ ధాన్యానికి కూడా మద్దతు లభించని దుస్థితి ఏర్పడింది.రైతులకు–మిల్లర్లకు మధ్య బ్రోకర్లుగా మారారు..నిజానికి.. రైతుసేవా కేంద్రాల్లో తేమ శాతాన్ని పరీక్షించాలి. అక్కడ నిర్ధారించే దానినే ప్రామాణికంగా తీసుకుని ధరను నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. కానీ, ఎక్కడా ఆ పరిస్థితిలేదు. ఆర్ఎస్కేలకు వెళ్తుంటే తేమ శాతం కూడా చూడడంలేదు. ఏ మిల్లుకు వెళ్తారని అడిగి అక్కడకు పంపించేస్తున్నారు. మిల్లు వాళ్లు ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధరకు అమ్ముకోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది రైతాంగాన్ని మిల్లర్లు దోచుకునేందుకు ఉపయోగపడే పద్ధతే తప్ప రైతులకు మేలుచేసే విధానం కాదు. ఇక వాట్సప్‌లో ‘హాయ్’ అని మెసేజ్ పెడితే చాలు క్షణాల్లో మీ ధాన్యం కొనేస్తామంటున్నారు. కానీ, ఆచరణలో ఇదెక్కడా అమలుకు నోచుకోవడంలేదు.ఒక్క ప్రైవేటు వ్యాపారిపైనైనా కేసు పెట్టారా?ఇక ప్రైవేటు వ్యాపారులు కొనే ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కొనడంలేదో అర్థం కావడంలేదు. తక్కువ ధరకు కొనే వ్యాపారస్తులపై కేసులు పెడతామని చెప్పారుగానీ.. రాష్ట్రంలో ఒక్క ధాన్యం వ్యాపారిపైనైనా కేసు పెట్టారా? ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు తక్కువ రేటుకు ధాన్యం కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పోనీ ప్రభుత్వమైనా కొంటుందా అంటే అదీలేదు. గతేడాది కోసిన ధాన్యాన్ని కోసినట్లుగానే తీసుకెళ్లారు.. ప్రతీ రైతుకూ మద్దతు ధర లభించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితిలేదు. ధర్నాలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీవీ లక్ష్మణస్వామి, కృష్ణాజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే. శివనాగేంద్ర, పంచకర్ల రంగారావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావాలి..ఏడెకరాల్లో వరి వేశాం. పంట కోసి 15 రోజులైంది. తేమ 17 శాతం ఉంది. 20 శాతమైనా తీసుకుంటామన్నారు. కానీ తీసుకోలేదు. బేరగాళ్లు వచ్చి 75 కేజీల బస్తాకు రూ.1,450 ఇస్తామన్నారు. మా రైతు రూ.1,740 చొప్పున లెక్కగట్టి కౌలు ఇవ్వాలంటున్నారు. ఇలా అయితే మా చేతి డబ్బులు పెట్టుకోవాలి. పైగా పంటను కాపాడుకునేందుకు పరదాలకు రోజుకు రూ.2వేలు ఖర్చవుతోంది. డబ్బులు కట్టలేక చచ్చిపోతున్నాం. ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావడం తప్ప వేరే దారిలేదు.– పొద్దుటూరు ప్రసాద్, గొడవర్రు. కంకిపాడు మండలం, కృష్ణాజిల్లాఇలా అయితే కౌలు రైతులు బతికేదెలా?నేను మూడెకరాల్లో వరి వేశాను. గతేడాదితో పోలిస్తే ఎకరాకు ఐదు బస్తాలు తగ్గింది. తేమ శాతం తక్కువగానే ఉన్నప్పటికీ ఈ రకం ధాన్యాన్ని కొనడంలేదు. ఆర్బీకేల్లోనే 20–25 శాతం ఉంటే 1,450 ఇస్తామంటున్నారు.బయట వాళ్లు కొనడం లేదు. పంటను కాపాడుకునేందుకు పరదాల కోసం రోజుకు ఎకరాకు రూ.300–500 చొప్పున చెల్లిస్తున్నాం. ఇలా అయితే కౌలురైతులు బతికేదెలా? కోసూరి శివనాగేంద్ర, గడ్డిపాడు, పమిడిముక్కల మండలం, కృష్ణాజిల్లాగతేడాది మద్దతు ధర వచ్చింది..ఎనిమిది ఎకరాల్లో వరికోసి 10 రోజులైంది. తేమ 15.5 శాతం ఉంది. మిల్లుకు పంపిస్తామన్నారు. కానీ ఎవరూ రాలేదు. మళ్లీ వెళ్లి అడిగితే మిల్లు దగ్గరకు వెళ్లండి అంటున్నారు. బేరగాళ్లు రూ.1,400 ఇస్తామంటున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదు. గతేడాది కోసిన వెంటనే 75 కేజీల బస్తాకు రూ.1,630కు కొన్నారు. ఈ ఏడాది కొనేవాడులేడు. 10 రోజులుగా రోడ్డుపైనే ధాన్యం ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – గెద్దా నరేంద్ర, గొడవర్రు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లానష్టానికి తోలాల్సి వస్తోంది..ఐదెకరాల్లో వరివేసా. ఎకరాకు 30 బస్తాలొచ్చింది. గొడవర్రు ఆర్ఎస్కు తీసుకెళ్తే 15.4% తేమ వచ్చింది. రేటు చెప్పలేదు. 90 బస్తాలు మిల్లుకు తోలారు. అక్కడ 75 కేజీల బస్తాకు రూ.1,600 కు మించి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఆర్ఎస్కే సిబ్బందికి చెబితే పట్టించుకోలేదు. చేసేది లేక బస్తాకు రూ.130 చొప్పున నష్టానికి మిల్లుకు తోలాల్సి వచ్చింది.– గెడ్డం రాజా, గొడవర్రు, కృష్ణాజిల్లా -
రైతులను రోడ్డున పడేశావ్!: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో టీడీపీ కూటమి సర్కారు దారుణ వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మద్దతు ధర కల్పించి ఆదుకోవాలన్న కనీస ధ్యాస కూడా ఈ ప్రభుత్వానికి లేదని.. రైతులను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా వర్షాలకు తడిసిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని.. కృష్ణా, గోదావరి డెల్టాలో ఎటు చూసినా కిలోమీటర్ల మేర ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ముఖం చాటేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు 75 కిలోల బస్తాకు రూ.300–400 నష్టానికి దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత ఐదేళ్లూ పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ప్రతి రైతన్నకూ కనీస మద్దతు ధర కల్పించి తోడుగా నిలబడ్డామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలతో మోసగించిన చంద్రబాబు రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో ఆయన ఇంకా ఏమన్నారంటే..పంటలకు మద్దతు ధర ఏదీ...రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో మీ ప్రభుత్వం విఫలమైంది. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండాపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. బస్తాకు రూ.300–400 నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైంది. 75 కిలోల బస్తాకు రూ.1,725ల చొప్పున ఏ ఒక్కరికి అందే పరిస్థితి లేకుండా పోయింది.రోడ్లపైనే ధాన్యం... కొనేవారేరీ...ధాన్యం కొనేవారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపైనే ధాన్యాన్ని పోసి కొనేవారి కోసం నిరీక్షిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది. ఫెంగల్ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయ్యింది. రంగుమారిపోయే పరిస్థితి ఏర్పడింది. తుపాను వస్తుందని నాలుగు రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినాసరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు.యుద్ధ ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస, ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండాపోయింది. కనీసం ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. కనీసం సరిపడా సంచులు కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఎక్కడకు వెళ్లినా కిలోమీటర్ల కొద్దీ ధాన్యం రాశులు రోడ్లపైనే కనిపిస్తున్నాయి. విజయవాడ – మచిలీపట్నం మధ్య 60 కిలోమీటర్ల పొడవునా ఆరబెట్టిన ధాన్యం కొనేనాథుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నా మీకు కనిపించడం లేదా?కనీస సాయం అందించిన పాపాన పోలేదువైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నా సాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వరదలు, వర్షాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో సాయం అందించిన పాపాన పోలేదు. కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలన్న ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది.ఈ– క్రాప్ ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలనే తపన, రైతులందరికీ సంపూర్ణ మద్దతు ధర దక్కాలనే ఆశయం పూర్తిగా నీరుగారిపోయింది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్‌తో నువ్వు, మీ మంత్రులు కాలం గడుపుతున్నారు.మా హయాంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. ఐదేళ్లూ పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేశాం. ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర కల్పించాం. అంతేకాదు గన్నీ సంచులు, లేబర్, రవాణా (జీఎల్టీ) చార్జీలను ప్రభుత్వ ద్వారానే అదనంగా ఇస్తూ వచ్చాం. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోని టోల్ ఫ్రీ నంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 1967తో కూడిన టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. గతేడాది ఇదే సమయంలో వచ్చిన మిచాంగ్ తుపాను సమయంలో రైతులను ఆదుకునేందుకు జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేశాం. కళ్లాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బందిలేకుండా ఉండేందుకు నాడు ప్రతీ జిల్లాకు రూ.కోటి కార్పస్ ఫండ్ కూడా ఇచ్చాం. తుపాను ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చూశాం.రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యం కూడా కొన్నాం..తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశాం. మిల్లర్ల దోపిడీని అరికట్టేందుకు ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరించాం. క్షేత్ర స్థాయిలో ఆర్బీకే సిబ్బంది రైతు క్షేత్రాల వద్దకు వెళ్లి జియోట్యాగింగ్ ద్వారా ఫొటోలు తీసి నాణ్యతను పరిశీలించడంతోపాటు ఆన్లైన్లోనే రైతుల వివరాలను నమోదు చేసి ట్రక్ షీట్ జనరేట్ చేశాం. ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమెటిక్‌గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చాం.ధాన్యం లోడులు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్‌ను అమర్చాం. మిల్లుల్లో రైతులతో సంబంధం లేకుండా ధాన్యం నాణ్యత సమస్యలను పరిష్కరించాం. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ప్రతీ మిల్లుకో కస్టోడియన్ అధికారిగా నియమించాం. మండలానికో ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కరించాం. వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్ అసిస్టెంట్ పర్యవేక్షణలో ప్రతీ జిల్లాకో మొబైల్ మినీ మిల్లును ఏర్పాటు చేశాం.రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఆర్బీకేల ద్వారానే ఇవన్నీ చేశాం. మా హయాంలో ఏ ఒక్క రైతుకు తమకు మద్దతు ధర దక్కలేదని రోడ్డుమీదకు రాలేదు. 2014–19 మధ్య మీ పాలనలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, 2019–24 మధ్య మా హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906.14 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాం.రైతులకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడఅధికారంలోకి వచ్చేందుకు హామీలతో మోసం చేసిన చంద్రబాబు ప్రస్తుతం రైతులను పట్టించుకోవడం లేదు. ప్రతి రైతుకు రూ.20వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదు? సూపర్ సిక్స్ హామీనే గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం ఇక రైతుల ఇతర సమస్యలను ఎందుకు పట్టించుకుంటుంది ? సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకక రైతులు నానా అగచాట్లు పడ్డారు. లాభసాటిగా సాగు ఎలా చేయాలో రైతులకు సలహాలు ఇచ్చే నిపుణులు లేరు. ఆర్బీకేలు నీరుగారిపోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాల రద్దుతో రైతులకు తీవ్ర నష్టం కలిగించారు.విత్తు నుంచి విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, సున్నావడ్డీ రాయితీ వంటి పథకాలను అటకెక్కించేశారు. రైతులపై పైసా భారం పడకుండా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి ఆ భారాన్ని రైతుల నెత్తిన మోపారు. 2023–24 సీజన్లో రైతుల తరఫున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు జూన్‌లో కట్టాల్సి ఉండగా, నువ్వు ఎగ్గొట్టడం వలన రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండాపోయింది. పెట్టుబడి సాయం లేక,రుణాలు అందక రూ.3లు, రూ.5లు వడ్డీలకు అప్పులు చేసి మరీ రైతులు సాగు చేశారు. అడుగడుగునా నువ్వు నిర్లక్ష్యం, మొండి చేయి ప్రదర్శించినా, వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన రైతులు నీ నిర్వాకం వలన తీవ్రంగా నష్టపోతున్నారు. -
సన్నాల్లో గోల్మాల్ జరిగితే కలెక్టర్లే బాధ్యులు
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చిన మాట ప్రకా రం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కావటంతో తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి తప్పు జరగ కుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందని హెచ్చరించారు. సన్న వడ్ల కొనుగోలుకు ప్రత్యే క ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్ట ర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించా రు. ధాన్యం సేకరణ, డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, టీచర్ల నియామక ప్రక్రియను దసరా లోపు పూర్తి చేసే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కు మార్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు వెంకటేశం, రఘునందన్‌రావు, పౌరసరఫరాల కమిషనర్ డీఎస్,చౌహాన్ జిల్లాల నుంచి మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ సన్నాల సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలు, లేదా వేర్వేరు కాంటాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సన్న రకాలను ధ్రువీకరించే యంత్రాలు, సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. సన్నవడ్ల సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్మాల్ జరిగే ప్రమాదముందని సీఎం అప్రమత్తం చేశారు. అటువంటి తప్పులు, అవకత వకలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, ఈసారి రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం చెప్పారు. ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా 7,000 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో డబ్బులు చేరాలన్నారు. ఒకవేళ కొనుగోలు కేంద్రాలు సరిపోని పక్షంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకొని అదనంగా కొత్త కేంద్రాలను తెరవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతీ కేంద్రానికి ఓ నంబర్..ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక నంబర్ కేటాయించాలని, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నంబర్ తప్పకుండా వేయాలని సీఎం సూచించారు. దీంతో ఏ తప్పు జరిగినా, ఏ దశలో గోల్మాల్ జరిగినా సులభంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని మార్గాల్లోనూ నిఘా ఉంచాలని, చెక్ పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు రైతులను వేధించొద్దు...తాలు ,తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించొద్దని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం చెప్పారు. రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురి కాకూడదని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడే సంఖ్యలో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మెషీన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రతి గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణ శాఖ సూచనలను చేరవేయాలని, దానికి అనుగుణంగా కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు తమ జిల్లాలో జరుగుతున్న కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించాలని, ప్రతి రోజు ఉదయం నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. పాత పది జిల్లాలకు నియమించిన ప్రత్యేకాధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల విభాగంలో 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. జనవరి నుంచి రేషన్‌షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన 5వ తేదీలోగా పూర్తి చేయండిఅన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మొత్తం 11,062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు. -
టమాట మండీ.. అక్రమ వసూళ్లు దండి
సాక్షి టాస్క్‌ఫోర్స్/రాఫ్తాడు రూరల్: ఓవైపు ఆరుగాలం ఎండనక.. వాననక కష్టపడి పండించుకున్న పంటకు కనీస మద్దతు ధర కూడా లభించక అన్నదాతలు ఆవేదన చెందుతుంటే.. మరోవైపు వారి కష్టాన్ని అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు నిలువుదోపిడీ చేస్తున్నారు. అధికారంలో ఉండి రైతులను ఆదుకోవాల్సిన ఆయనే రైతుల నుంచి భారీ ఎత్తున పిండుకుంటున్నారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి సమీపంలోని టమాట మండీలో అక్రమ వసూళ్లకు తెర తీశారు. గతంలో టమాట మండీకి వచ్చే వాహనాల నుంచి పంచాయతీ అధికారులు సుంకం వసూలు చేసేవారు. దీనిపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఈ వసూళ్లు నిలిపేశారు. అయితే ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు రంగంలోకి దిగారు. టమాట మండీకి వచ్చే వాహనాలు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. లోడు చేసుకునే పెద్ద వాహనం నుంచి రూ.2,500, చిన్న వాహనం నుంచి రూ. 500 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మండీ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో వసూళ్లకు దిగారు. మండీ ఓనర్స్ అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్, బయ్యర్లు.. ఈ ముగ్గురూ కలిసి చేస్తున్న వివిధ రకాల వసూళ్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.నెల రోజులుగా దందా..కక్కలపల్లి టమాట మండీలో అధికార పార్టీ నేత సాగిస్తున్న అక్రమ వసూళ్ల దందా నెల రోజులుగా సాగుతోంది. రోజూ రమారమి 230 వాహనాలు లోడింగ్ అవుతున్నాయి. ఇందులో 140 దాకా పెద్దవి, 90 దాకా చిన్న వాహనాలు ఉంటున్నాయి. రోజుకు రూ.3,95,000 చొప్పున ఇప్పటిదాకా రూ.1.15 కోట్లకు పైగా వసూలు చేశారు. రోజూ వసూలవుతున్న మొత్తం సాయంత్రానికి అధికార పార్టీ ముఖ్య నేత ఇంటికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. కూటమి నేతలు అడిగిన కప్పం కట్టడానికి నిరాకరించినవారికి బెదిరింపులు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఓ బయ్యర్ కప్పం కట్టేందుకు నిరాకరించడంతో ఆయన్ను బెదిరించి కప్పం కట్టించారు.నోటీసులను లెక్క చేయని అసోసియేషన్“టమాట మండీ ఓనర్స్ అసోసియేషన్ చేస్తున్న వసూళ్లు పూర్తిగా చట్ట విరుద్ధం. ప్రభుత్వ అనుమతి లేకుండా పంచాయతీ పరిధిలో ఎలాంటి వసూళ్లు చేయరాదు. అలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు’ అంటూ కక్కలపల్లి పంచాయతీ కార్యదర్శి గత నెల 22న టమాట మండీ ఓనర్స్ అసోసియేషన్‌కు నోటీసు ఇచ్చారు. వసూళ్ల నిర్వాకంపై స్వయంగా ఈవోఆర్డీ, డీఎల్పీవో, డీపీవోతో పాటు పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. అయినా ఏమాత్రమూ లెక్క చేయకుండా వసూళ్లు చేస్తూనే ఉన్నారు. పైగా ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని అధికారులు ఏర్పాటు చేసిన బ్యానర్‌ను కూడా తొలగించేశారు.రెండో రోజూ రోడ్డెక్కిన టమాట రైతులు టమాటాలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అనంతపురంలో రైతులు రెండో రోజు మంగళవారం కూడా రోడ్డెక్కారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి టమాట మండీల్లో అసోసియేషన్ నాయకులు నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ వసూళ్లను నిరసిస్తూ బయ్యర్లు రెండురోజులుగా కొనుగోలు ఆపేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారి–44పై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో అనంతపురం డీఎస్పీ ప్రతాప్ ఆధ్వర్యంలో పోలీసులు రైతులతో మాట్లాడారు. ఏదైనా ఉంటే మండీ అసోసియేషన్, బయ్యర్లతో కూర్చుని మాట్లాడదామని, వెంటనే ఆందోళన విరమించాలని సూచించారు. దీంతో రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు రోజులుగా రైతులు రోడ్డెక్కుతున్నా ఏమి న్యాయం చేశారంటూ నిలదీశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే బయ్యర్లు కొనేందుకు ముందుకు రావడం లేదన్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ టమాట మండీ వద్దకు చేరుకున్నారు. మండీ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో ప్రతి లోడుకూ రూ.2,500 అదనంగా వసూలు చేస్తున్న విషయాన్ని కొందరు బయ్యర్లు శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ వసూళ్లపై ఎందుకు స్పందించలేదని ఆయనను నిలదీశారు. కాగా బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మంగళవారం వేలం పాట నిలిచిపోయింది. దీంతో ప్రతి రైతుకూ వేలాది రూపాయలు నష్టం వాటిల్లింది. నెత్తిన గుండేసుకుని చావాలా?బయ్యర్ల నుంచి ప్రతి లోడుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అది పరిష్కారం అయ్యేదాకా తాము కొనుగోలు చేయబోమని బయ్యర్లు అంటున్నారు. సరుకు తెచ్చిన రైతులు నెత్తిన గుండేసుకుని చావాలా? – తిమ్మప్ప, రాంపురం, ఉరవకొండ మండలంమా గోడు ఎవరికి చెప్పుకోవాలి? నేను 100 బాక్సుల టమాట తీసుకొచ్చా. రేయంతా కాసుకుని కూర్చున్నా. ఉదయమైతే బయ్యర్లు కొనేందుకు ముందుకు రాలేదు. పంట సాగు చేసినప్పటి నుంచి మండీకి తెచ్చేదాకా రైతులు ఎన్నో అగచాట్లు పడుతున్నారు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి? – మంజునాథ్, కళ్యాణదుర్గం -
మొదలైన ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ ప్రారంభమైంది. ప్రతి రైతుకు సంపూర్ణ మద్దతు ధర చెల్లింపే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రాథమికంగా ఈ సీజన్లో 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. కల్లాలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించేంత వరకు ఎక్కడా జాప్యం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. అకాల వర్షాలు, అనుకోని విపత్తులు సంభవిస్తే తక్షణం ధాన్యాన్ని తరలించే విధానంపై ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. గోదావరి జిల్లాల్లో కోతలు మొదలవడంతో వచి్చన ధాన్యాన్ని వచి్చనట్టు కొనుగోలు చేస్తోంది. విప్లవాత్మక మార్పులతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం సేకరణలో విప్లవాత్మక మార్పులు చేసింది. దళారులు, మిల్లర్ల దోపిడీని పూర్తిగా అరికట్టి రైతులను నష్టపోకుండా కాపాడింది. రైతుకు మద్దతు ధర దక్కాలన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఈ–క్రాప్ ఆధారిత ధాన్యం సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫలితంగా టీడీపీ హయాంలో కంటే ఎక్కువ మంది రైతులకు మద్దతు ధర దక్కింది. ఏటా దిగుబడుల్లో సగటున 50 శాతంపైనే కొనుగోళ్లు చేస్తూ రైతులకు అండగా నిలిచింది. ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అదే టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. అంటే టీడీపీ హయాంలో కంటే 20 లక్షల మంది రైతులకు అదనంగా మద్దతు ధర అందించింది. జీఎల్టీ లబ్ధి అదనం టీడీపీ హయాంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనుగోలు కేంద్రాలకు పంటతో వచి్చన రైతుల నుంచి ధాన్యం తీసుకోవడానికి ముప్పుతిప్పలు పెట్టేది. దీంతో రైతులు వచి్చనకాడికి దళారులు, మిల్లర్లకు ధాన్యాన్ని అప్పజెప్పాల్సి వచ్చేది. ఇలా సేకరించిన ధాన్యాన్ని దళారులు తిరిగి ప్రభుత్వానికి విక్రయించి రైతుల పేరుతో పూర్తి మద్దతు ధర కొట్టేసేవారు. ఇక్కడ రైతులు మద్దతు ధర కోల్పోవడంతోపాటు కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేందుకు రూ.వేలకు వేలు వెచి్చంచాల్సి వచ్చేది. గతంలో రైతులే ధాన్యాన్ని రవాణా చేస్తే ఆ ఖర్చులను ప్రభుత్వమే భరించినట్టు లెక్కల్లో చూపించి ఏటా రూ.కోట్లు దోచేసేవారు. ఇది గమనించిన సీఎం వైఎస్ జగన్ రైతులకే గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టీ) ఖర్చులను చెల్లించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గోనె సంచులు, హమాలీ కూలీ, ధాన్యం రవాణాకు టన్నుకు రూ.2,523 చొప్పున రైతులకు అదనంగా చెల్లిస్తోంది. ఈ పరిస్థితుల్లో మద్దతు ధర కంటే అధికంగా చెల్లించి ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. బొండాలు రకానికీ మార్కెట్లో మంచి ధర గోదావరి జిల్లాల్లో సాగు చేసే జయ రకం (బొండాలు) ధాన్యానికి మార్కెట్లో మంచి రేటు లభిస్తోంది. గతేడాది నుంచి ప్రభుత్వం జయ రకం ధాన్యాన్ని కూడా సేకరించడం ప్రారంభించడంతో ప్రైవేట్ వ్యాపారుల దందాకు అడ్డుకట్ట పడింది. దీంతో దిగొచి్చన వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.100 నుంచి రూ.300 కంటే ఎక్కువ ఇచ్చి కల్లాల నుంచే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది 3 లక్షల టన్నుల వరకు జయ రకం ధాన్యాన్ని సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు సమస్య లేకుండా.. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారుల స్థానంలో ప్రతి మండలంలో మొబైల్ బృందాలను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు వచి్చన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. -
అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: ఎంతో శ్రమించి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లింపులు జరపడంతో అన్నదాతల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.815 కోట్లు చెల్లించింది. దీంతో ఖరీఫ్‌లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లు చెల్లించినట్లయ్యింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ డీఎం అనుమతి రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షిస్తూ ఆర్బీకే స్థాయిలోనే సంపూర్ణ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ఇలా ఈ ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తోంది. పెరిగిన ధాన్యం సేకరణ.. గత చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే సగటు ప్రస్తుత ప్రభుత్వంలో 77 లక్షల టన్నులుగా ఉంది. దీనికి తోడు ఆర్బీకే పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి కల్లాల వద్దనే ధాన్యం సేకరణ చేపట్టింది. ఆర్బీకేల్లో.. ధాన్యం సేకరణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వంలో అదనంగా దాదాపు 20 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధర దక్కింది. తడిచిన ధాన్యమూ కొనుగోలు.. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జయ రకం(బొండాలు/దుడ్డు బియ్యం) ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జయ రకం పండించే రైతులు చాలా లాభపడ్డారు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తెచ్చిన రైతులకు సైతం అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించి మరీ రైతులకు మద్దతు ధర అందించడంలో రికార్డు నెలకొల్పింది. ఆఫ్‌లైన్‌లో సేకరించిన ధాన్యాన్ని దూరాభారాలు చూడకుండా డ్రయ్యర్ సౌకర్యం, డ్రయ్యర్ ప్లాట్‌ఫాం ఉన్న మిల్లులకు తరలించి ఆరబోసి మరీ కొనుగోలు చేసింది. జగన్ ప్రభుత్వం అదనపు భారాన్నైనా మోసింది గానీ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. బాబు హయాంలో బకాయిలు.. చంద్రబాబు హయాంలో రైతులు ధాన్యం డబ్బుల కోసం అహోరాత్రులు ఎదురు చూడాల్సి వచ్చేది. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ప్రభుత్వంపై నమ్మకంతో విక్రయిస్తే.. వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చంద్రబాబు పక్కదారి పట్టించారు. ఇలా 2019 ఎన్నికలకు ముందు పౌరసరఫరాల సంస్థకు చెందిన రూ.4,838.03 కోట్లను వేరే కార్యక్రమాలకు మళ్లించి రైతులను నట్టేట ముంచారు. చివరకు సీఎం పదవి నుంచి దిగిపోతూ రూ.960 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలోని బకాయిలను కూడా తీర్చి.. పారదర్శక ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారు. అదనంగా టన్నుకు రూ.2,523 గత ప్రభుత్వం పేరుకే ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. వారంతా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో మిల్లర్లు, దళారుల దందాకు చెక్‌పడింది. అలాగే రైతులపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రతి టన్ను ధాన్యం కొనుగోలులో రవాణా, హమాలీ, గోనె సంచుల వినియోగం నిమిత్తం రైతులకు రూ.2,523 అందిస్తోంది. గతంలో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే.. వాటిని ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు రికార్డుల్లో నమోదు చేసి టీడీపీ నాయకులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు. -
రైతు బాగే దేశ స్వావలంబన
పంటల ఉత్పత్తి ఖర్చు నిర్ధారణలో అనేక లోపాలు ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చును రాష్ట్రాల వారీగా సేకరించి, దానిని దేశ ‘సగటు’గా మార్చడం వల్ల రైతులకు నష్టం జరుగుతున్నది. ఒకే పంటకు దేశ వ్యాప్తంగా సాగు ఖర్చులో తేడా ఉంటుంది. ప్రతి పంటలో అనేక వెరైటీలు ఉన్నా ఒకే మద్దతు ధరఉంటుంది. వరిలో కొన్ని వందల రకాలున్నా, కనీస మద్దతు ధర అన్నింటికీ ఒకటే. ఈ తేడాలను కనీస మద్దతు ధర నిర్ణాయక వ్యవస్థ పరిగణనలోనికి తీసుకునే పరిస్థితి లేదు. ధరలు రాని పంటలను రైతులు వేయడం మానేస్తారు. ఆ పంటలు వేయడం మానేస్తే, పంట పండించే జ్ఞానం, నైపుణ్యం కోల్పోతాము. క్రమంగా, స్వావలంబన కోల్పోతే ఇతర దేశాల పెత్తనానికి దాసోహం కావాల్సి వస్తుంది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ (సీఏసీపీ) కేవలం మద్దతు ధరను సిఫారసు చేస్తుంది. సిఫారసు చేసిందే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని లేదు. ఉదా: 2023–24 రబీ సీజన్లో గోధుమలకు వారు క్వింటాలుకు రూ. 2,300 సిఫారసు చేస్తే, క్యాబినెట్ ఆమోదించింది రూ. 2,125 మాత్రమే. కనీస మద్దతు ధర నిర్ణయంలో కనీసం 12 అంశాలను పరిశీ లిస్తారు. అయితే 12 అంశాలలో ఉత్పత్తి ఖర్చు తప్పితే, మిగతాఅంశాలు కనీస మద్దతు ధర నిర్ణయంలో ఎటువంటి పాత్ర పోషి స్తాయో స్పష్టత లేదు. పంటల ఉత్పత్తి ఖర్చు నిర్ధారణలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చు రాష్ట్రాల వారీగా సేకరించి, దానిని దేశ ‘సగటు’గా మార్చడం వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతున్నది. ఒకే పంటకు దేశ వ్యాప్తంగా సాగు ఖర్చులలో తేడా ఉంటుంది. దీనిని సగటు చేస్తే, ఖర్చు ఎక్కువ అవుతున్న రైతులకు నష్టం అవుతున్నది. సాగు ఖర్చు ఎందుకు పెరుగుతున్నదనే విషయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమీక్ష ఎన్నడూ చేయలేదు. రైతు ఆత్మ హత్యల తదనంతరం జరిపిన అధ్యయనాలు రైతుల మీద పెరుగు తున్న ఖర్చు, మార్కెట్లో గిట్టుబాటు ధర పరిస్థితి గురించి ప్రధానంగా ప్రస్తావించాయి. రైతు కొనే విత్తనాలు, ఎరువులు, కీటకనాశకాలు అన్ని కంపెనీల లాభాలు అవుతున్నాయి. కృత్రిమ ఎరువులు, రసా యన కీటక నాశకాలు సారవంతమైన మట్టిని విషతుల్యం చేస్తూ, రైతును ‘బానిసను’ చేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా జరిపే ఉత్పత్తి ఖర్చు నిర్ధారణ కూడా సరిగా, పారదర్శకంగా లేదు. చిన్న రైతు ఎదుర్కొనే అన్ని రకాల ఖర్చులను సేకరించే వ్యవస్థ లేదు. రాష్ట్రాలు అందించే రాష్ట్ర స్థాయి ‘సగటు’ లెక్కలను సీఏసీపీ తన స్వీయ ఆలోచన మేరకు తగ్గిస్తూ ఉంటుంది. స్థూలంగా, పంటల మీద ఖర్చును దశల వారీగా, వివిధ స్థాయిలలో ‘తరుగు’ చేస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుని శాస్త్రీయంగా, పార దర్శకంగా నిర్ధారించే వ్యవస్థ అవసరం. రైతులు కోరుతున్నట్లుగా ధర లకు చట్టబద్ధత కల్పిస్తే, ఈ వ్యవస్థ లోపాలు బయటకు వస్తాయని కూడా విధాన నిర్ణేతల ఆందోళన కావచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధిలో విధించిన షరతులు కూడా ఒక కారణం. కనీస మద్దతు ధర అన్ని పంటలకు ఇవ్వరు. 1964–65లో వరి, గోధుమలకు మాత్రమే కనీస మద్దతు ధరను నిర్ణయించేవారు. కాలక్రమేనా 23 పంటలకు చేరింది. పసుపు, జొన్నలు, తృణధాన్యాలు వంటి పంటలకు లేవు. భారత దేశంలో దాదాపు 600 పంటలు పండించేవారు. అనేక పంటలు కనుమరుగు అయినాయి, అవుతున్నాయి. ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ, సారవంతమైన మట్టి కనుమరుగు అవ్వడం, కలుషిత నీళ్ళు, నీటి కొరత, పురుగుల బెడద, వన్యప్రాణుల దాడులు, నాణ్యమైన విత్తనాల కొరత, కూలీల కొరత, ఇంకా ఇతర ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల నేపథ్యంలో రైతులు క్రమేణా కొన్ని పంటలకే పరిమితం అవుతున్నారు. ఈ నిర్ణయంలో కనీస మద్దతు ధర పాత్ర కూడా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కనీస మద్దతు ధరల వ్యవస్థ మీద నాలుగు కమిటీలు అనేక సూచ నలు ఇచ్చాయి – ఝా కమిటీ (1965), సేన్ కమిటీ (1979), హను మంతరావు కమిటీ (1990), వై.కే.అలఘ్ కమిటీ (2005). 2007లో ప్రణాళిక సంఘం, 2017లో నీతి ఆయోగ్ నివేదికలు కూడా ఉన్నాయి. ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 2005 కమిటీ వ్యవసాయ ధరల కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని సిఫారసుచేసింది. అంటే, కనీస మద్దతు ధర చట్టబద్ధతను అది ఆమోదించింది. ధర నిర్ణయంలో నాణ్యత కూడా కీలకం అని ఈ కమిటీ భావించింది. వివిధ పంటలకు మార్కెట్ కాలం రెండు లేక మూడు నెలలు మాత్రమే ఉంటుంది. రబీ పంటల మార్కెటింగ్ కాలం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మాత్రమే. ఆయా పంటల సరఫరా డిమాండ్లతోసంబంధం లేకుండా మద్దతు ధరలు మాత్రం సంవత్సరం పాటు స్థిరంగా ఉంటాయి. ప్రతి పంటలో అనేక రకాల వెరైటీలు ఉన్నా ఒకే మద్దతు ధర ఉంటుంది. వరిలో కొన్ని వందల రకాల విత్తనాలు ఉన్నా, కనీస మద్దతు ధర అన్నింటికీ ఒకటే. వరి రకం బట్టి పంట కాలం ఉంటుంది. ఆ మేరకు ఖర్చులలో కూడా తేడా ఉంటుంది. కొన్ని 80 రోజుల పంట అయితే, ఇంకొన్ని 160 రోజులు ఉంటాయి. ఈ తేడాను కనీస మద్దతు ధర నిర్ణాయక వ్యవస్థ పరిగణనలోనికి తీసుకునే పరిస్థితి లేదు. అంతా స్థిరమైన సగటు. ధర రాక రైతులు రాబోయే సంవత్సరంలో ఈ పంట వేయడం ఆపేస్తే ఆ పంట సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాని మీద ఆధారపడ్డ వినియోగదారులకు, పరిశ్రమలకు (పంట ముడిసరుకుగా వాడే వాటికి) ధర పెరుగుతుంది. ఏదైనా పంట దిగుబడి తగ్గి, సరఫరా తగ్గి, ధర పెరిగితే వెంటనే దిగుమతులకు అనుమతులు ఇస్తుంది ప్రభుత్వం. అయితే ఆ యేడు వరకే దిగు మతులను ‘నల్లా తిప్పి బంజేసినట్లు’ చేసే పరిస్థితి ఉండదు. సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో సరఫరా ఒప్పందాలు గిట్టుబాటుగా కొన్ని సంవత్సరాల కొరకు చేసుకుంటారు. దిగుమ తులు కొనసాగితే దేశీయంగా ధర మళ్లీ పెరిగే అవకాశం లేక రైతులు ఆ పంట వేయడం పూర్తిగా మానేస్తారు. పప్పుల విషయంలో అదే అయ్యింది. 2015లో కొరత ఉందని అనుమతిస్తే సరఫరా ఒప్పందాలు 7 సంవత్సరాలకు చేసుకుని దిగుమతులు పెంచారు. రైతులకు ధర వచ్చే ఆశ లేక పూర్తిగా వేయడం మానేశారు. దరిమిలా పప్పుల ఉత్పత్తిలో అగ్రగామి అయిన భారత్ ఇప్పుడు దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అటు వినియోగదారులకు పప్పుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పప్పులకు కనీస మద్దతు ధర (ఖర్చుకు అనుగుణంగా) ఇస్తేనే రైతులు మళ్లీ వేస్తారు. అధిక ధరలకు దిగుమతి చేసుకుంటున్న ప్రభుత్వం కనీస మద్దతు పెంచడానికి ఇష్టపడటం లేదు. వంట నూనె విషయంలో ఇంకో విధంగా మన స్వావలంబన కోల్పోయాం. ముడి పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన వ్యవస్థ వల్ల ఏర్పడింది. తక్కువ ధరకు పామాయిల్ రావడంతో, తక్కువ ధరకు వినియో గదారులకు అందిస్తే రాజకీయ ప్రయోజనం అని చూసుకుని ప్రభుత్వం ఆయా సంవత్సరాలలో పెరుగుతున్న పామాయిల్ దిగుమతులను పట్టించుకోలేదు. పైగా దిగుమతి సుంకాలను సున్నా చేసింది. ఫలితంగా, మనం పండించే వేరుశనగ, నువ్వులు, ఆము దాలు, ఆవాలు వంటి 9 రకాల వంట నూనె గింజల పంటల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. వంట నూనె నిత్య అవసరం కాబట్టి ఇప్పుడు ఆ దిగుమతి మానలేము. అది మానకుంటే రైతులకు ధర రాక ఇక్కడ నూనె గింజల ఉత్పత్తి పెరిగే పరిస్థితి లేదు. డిమాండ్ ఉన్న రకాల పంటలు వేసే ప్రోత్సాహక పరిస్థితి రైతులకు లేకుండా పోయింది. ప్రభుత్వం జోక్యం వల్ల మార్కెట్లకు నష్టం అని భావించేవారు, ఈ పరిస్థితిని ప్రభుత్వ జోక్యం లేకుండా ఎట్లా మారుస్తారో చెప్పాలి. రైతులు ఆ యా పంటలు వేయడం మానేస్తే, పంట పండించే జ్ఞానం, నైపుణ్యం, సామర్థ్యం కోల్పోతాము. ఇప్పుడు చెరుకు కోసే నైపుణ్యం ఉన్న కూలీలు దొరకడం లేదు. తిరిగి ఆ పంట కావాలంటే ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సిందే. అప్పుడు పెట్టుబడులు పెట్టే బదులు, ప్రభుత్వం ఇప్పుడే మార్కెట్లో జోక్యం చేసుకుని, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే అందరూ సంతోషంగా ఉంటారు కదా! లేకుంటే మనం కొన్ని ఆఫ్రికన్ దేశాల మాదిరి అయి పోతాం. నిరంతరం సముద్ర తీరాల వైపు చూడాల్సి వస్తుంది. క్రమంగా, స్వావలంబన కోల్పోతే ఇతర దేశాల పెత్తనానికి దాసోహం కావాల్సి వస్తుంది. - వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు - డా‘‘ దొంతి నరసింహా రెడ్డి -
మద్దతు ధరకు కొంటే విమర్శలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పండిన పంటలను రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నా విమర్శించడం సరికాదని మార్క్‌ఫెడ్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు చెప్పారు. పంట ఉత్పత్తుల కొనుగోలుపై ఈనాడు పత్రిక రాసిన కథనాన్ని ఆయన ఖండించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం యాప్ ద్వారా గ్రామాలవారీగా పంట ఉత్పత్తుల మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తూ, మద్దతు ధర దక్కని పంటలను ధరల స్థిరీకరణ నిధి (పీఎస్ఎఫ్) ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ 57 నెలల్లో 6.18 లక్షల రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను సేకరించామన్నారు. ప్రస్తుత రబీ సీజన్లో శనగలు, మినుములు, పెసలు, వేరుశనగలు, జొన్నలు, మొక్కజొన్నలు కలిపి 3.88 లక్షల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మొక్కజొన్న క్వింటాలు రూ.2,090 చొప్పున 85 వేల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఈ 57 నెలల్లో రూ.1,648 కోట్ల విలువైన 9.10 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించామన్నారు. ఫలితంగా మార్కెట్లో మొక్కజొన్న ధరలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. మొక్కజొన్న గతేడాది రూ. 2 వేల నుంచి రూ.2,400 వరకు పలికిందన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు పౌల్ట్రీతో పాటు ఇథనాల్ పరిశ్రమల నుంచి మంచి డిమాండ్ ఏర్పడటంతో మార్కెట్లో ఈ పంట ధరలు నిలకడగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధాన మార్కెట్లలో క్వింటాలు రూ.2 వేల నుంచి రూ. 2,600 వరకు పలుకుతోందన్నారు. మార్కెట్ సదుపాయం లేని చోట్ల చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం మొక్కజొన్న సేకరణకు అనుమతినిస్తుందని తెలిపారు. ప్రతి ఏటా మద్దతు ధర దక్కని పంటలకు రైతుకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కెట్లలో జోక్యం చేసుకుంటుందని చెప్పారు. అదే రీతిలో ఈ ఏడాది కూడా 85 వేల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. సకాలంలో చెల్లింపుల కోసం రుణాలు తీసుకోవడం ఏటా జరిగే ప్రక్రియేనని చెప్పారు. సేకరించిన పంట ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించగా వచ్చే సొమ్ముతో రుణాలు సర్దుబాటు చేసుకుంటామని, అవసరమైతే పంట ఉత్పత్తుల సేకరణకు తీసుకునే రుణాలను వడ్డీతో సహా ధరల స్థిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందన్నారు. ఇందులో తప్పేమిటని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే పనిగట్టుకొని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. -
నేటి నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: మొక్కజొన్న కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం (ఈ నెల 14న) కొనుగోళ్లు ప్రారంభించి మే 15వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించింది. నాణ్యమైన క్వింటాల్ మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2,090 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్‌బాబు మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది. రైతును నిలబెట్టేలా మద్దతు ధర రాష్ట్రంలో రబీ 2023–24లో 4.75 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 16.82 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా.. నెలాఖరు నాటికి ముమ్మరమవుతాయి. సీఎం యాప్ ద్వారా ప్రతిరోజు మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తున్నారు. అయితే.. పంట చేతికొచ్చే సమయంలోమార్కెట్ను బూచిగా చూపి వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తారేమోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర విషయంలో రైతులకు అండగా నిలవాలన్న సంకల్పంతో క్వింటాల్‌కు రూ.2,090 చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగింది. ఇందుకోసం ముందస్తుగానే ఏర్పాట్లు చేసి కనీసం 85 వేల టన్నులను సేకరించేందుకు అనుమతిచ్చింది. కొనుగోలుకు పక్కా ఏర్పాట్లు మొక్కజొన్న కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ (ఆర్బీకే అండ్ ఆర్) నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసింది. కొనుగోలుకు అవసరమైన టార్పాలిన్లు, తేమను కొలిచే మీటర్లు, డ్రయ్యర్లు, జల్లెడ, కుట్టు యంత్రాలు, వేయింగ్ మెషిన్లు వంటి వాటిని సమకూర్చే బాధ్యతను మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. మొక్కజొన్న సేకరణకు అవసరమైన నిధులను ధరల స్థిరీకరణ నిధి నుంచి సమీకరించుకునే వెసులుబాటును మార్క్‌ఫెడ్‌కు కల్పించింది. అవసరమైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతులకు సకాలంలో నగదు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి తిరిగి చెల్లిస్తుంది. మొక్కజొన్నను నిల్వ చేసుకునేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీలతో పాటు వ్యవసాయ, ఇతర గిడ్డంగులను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. ధరలు పెరిగేలా చర్యలు మార్కెట్లో మొక్క జొన్న ధరల హెచ్చుతగ్గులను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. సమీప రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏ ఒక్కరూ తొందరపడి అమ్ముకోవద్దు. మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. ఇప్పటికే మినుము, పెసలు, వేరుశనగ, శనగ, జొన్నల సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తాజాగా మొక్కజొన్న కొనుగోలుకు కూడా అనుమతి ఇచ్చింది. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
జొన్న రైతులకు ప్రభుత్వం బాసట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హైబ్రీడ్ రకం జొన్నల మార్కెట్ ధర మద్దతు ధరకంటే తక్కువగా ఉండటంతో రైతులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద వెంటనే హైబ్రీడ్ రకం జొన్నలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. 27,722 టన్నుల హైబ్రీడ్ రకం జొన్నలు కనీస మద్దతు ధర క్వింటాలు రూ.3,180కు కొనుగోలుకు అనుమతినిచ్చింది. ఈమేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం నుంచి ఆర్బీకేల ద్వారా జొన్న రైతుల రిజిస్ట్రేన్‌కు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ సీజన్లో 2.38 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 4.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. హైబ్రీడ్ రకం క్వింటాలు రూ.3180గా, మల్దిండి రకం క్వింటాలు రూ.3,225గా ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రీడ్ రకం ఆహార అవసరాల కోసం, మల్దిండి రకం పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. హైబ్రీడ్ జొన్నల ధర మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలు రూ.2,500 నుంచి రూ.2,600 వరకు పలుకుతోంది. మద్దతు ధరకంటే మార్కెట్ ధర తక్కువ ఉండటంతో జొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా (మోర్ ప్రిఫర్డ్ వెరైటీగా) గుర్తింపు పొందిన హైబ్రీడ్ రకం జొన్నలను 27,722 టన్నులు కొనడానికి అనుమతినిచ్చింది. బుధవారం నుంచి మే 31వ తేదీ వరకు రైతుల నుంచి ఈ రకం జొన్నలను సేకరిస్తారు. ఇప్పటికే కనీస మద్దతు ధరలకు రబీ సీజన్లో పండిన శనగ, మినుము, పెసర, వేరుశనగ పంటలను ఆర్బీకేల ద్వారా ఏపీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. తక్కువకు అమ్ముకోవద్దు కనీస మద్దతు ధరకంటే తక్కువకు ఏ రైతూ అమ్ముకోవద్దు. జొన్న రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 27,722 టన్నుల సేకరణకు అనుమతినిచ్చింది. మద్దతు ధర దక్కని రైతులు ఆర్బీకేల ద్వారా వివరాలు నమోదు చేసుకొని వారి వద్ద ఉన్న హైబ్రీడ్ రకం జొన్నలను అమ్ముకోవచ్చు. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీ మార్క్‌ఫెడ్ -
Fact Check: రైతులకే ప్రా‘ధాన్యం’...'పచ్చ'రాతల్లోనే దైన్యం!
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014–15లో రెండు సీజన్లలో కలిపి 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందు కోసం రూ.5,583 కోట్లు చెల్లించింది. ఇక్కడ సగటున ఒక రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎలా కొనుగోలు చేశారన్నది ఎవరికైనా కలిగే సందేహం. అంటే ఇక్కడ దళారులు, మిల్లర్లు కొందరు రైతుల పేరిట ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి మద్దతు ధర కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లో సగటున ఒక రైతు నుంచి 24 టన్నుల ధాన్యం సేకరించినట్టు చూపారు. ఇక్కడ కూడా మద్దతు ధర మధ్యవర్తులే కాజేశారని తెలుస్తోంది కదా... దీనిని బట్టి టీడీపీ హయాంలో ధాన్యం దోపిడీ ఎంతగా సాగిందో అర్థమవుతోంది. కానీ నాడు కళ్లకు గంతలు కట్టుకున్న ఈనాడుకు ఇవేవీ కనిపించలేదు. ఇప్పుడు పారదర్శకంగా సేకరణ జరుగుతున్నా... లేనిపోని ఏడుపుగొట్టు రాతలు. సాక్షి, అమరావతి: రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టడం తెలుగుదేశం సంస్కృతి. వారి హయాంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరించేది. కొనేదంతా మిల్లర్లు, దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200ల వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యేక్షంగా రైతులు నష్టపోయేవారు. కానీ, సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ప్రతి సీజన్లోనూ ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా పంట కొనుగోలు చేపట్టడంతో వాస్తవ రైతుకు పూర్తి మద్దతు ధర దక్కుతోంది. దీంతో తమ దళారుల దోపిడీ వ్యవస్థను నాశనం చేశారన్న ఆక్రోశం రామోజీ రాతల్లో నిలువెల్లా కనిపిస్తోంది. వాస్తవానికి రైతుకు మద్దతు ధరతో పాటు గన్నీ, లేబర్, రవాణా చార్జీలను సొంతంగా పెట్టుకున్న రైతుకు టన్నుకు రూ.2,523ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంట విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బయట మార్కెట్లోని వ్యాపారుల్లో ధాన్యానికి డిమాండ్ పెరిగింది. చేసేదేమీ లేక వారు సైతం ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు మించి చెల్లిస్తూ కల్లాల్లోంచే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందువల్ల రైతులు మంచి రేటు వస్తున్న చోటే ధాన్యం అమ్ముకుంటున్నారు. అంత మాత్రాన ప్రభుత్వ సేకరణ తగ్గిందనడం ఎంతవరకు సమంజసం. ఈ వాస్తవాన్ని మరుగునపెట్టి రామోజీ రైతులపై కపట ప్రేమను ఒలకబోయడం చూస్తే జాలేస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువలైన 2.65 కోట్ల టన్నులను ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచింది. అంటే గతంతో పోలిస్తే దాదాపు 20లక్షల మంది అదనంగా రైతులు సంపూర్ణ మద్దతు ధరను అందుకున్నారు. ఆశాజనకంగా దిగుబడులు గత ఖరీఫ్‌లో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. గతేడాది చివరల్లో మిచాంగ్ తుఫాన్ కొంత ఇబ్బంది పెట్టినా ఎకరాకు అత్యధికంగా 40–42 బస్తాల దిగుబడి వచ్చింది. జనవరి పండుగ సీజన్ కావడం, పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు బియ్యం అవసరం పెరగడంతో దాదాపు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు మించి(సాధారణ రకానికి రూ.100కు పైగా ఫైన్ వెరైటీలకు రూ.200–500లకు పైగా) చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేయడం విశేషం. ఇదే క్రమంలో ఆర్బీకే ద్వారా 29.58లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ లెక్కన 44.58 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి బయటకు వెళ్లిపోయింది. అంటే దాదాపు ఈఖరీఫ్‌లో పంట మొత్తం విజయవంతంగా కొనుగోలు చేశారు. ఇంతటి ఫలితాన్ని రామోజీ కలలోకూడా ఊహించి ఉండరు. కానీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు అడ్డగోలు అభాండాలు వేశారు. కేంద్ర నిబంధనలు రామోజీకి తెలియవా... కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర దక్కట్లేదని గుండెలు బాదుకున్న రామోజీకి.. ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు విధిస్తుందన్న విషయం తెలీదా? ఆ ప్రకారం తేమ 17శాతం మించితే కొనుగోలుకు ఎక్కడైనా అభ్యంతరం చెబుతారు కదా? ఇదే ఆసరాగా చేసుకుని టీడీపీ హయాంలో బస్తాలకు బస్తాలు అదనంగా రైతు నుంచి దోచేసినప్పుడు ఈనాడు గొంతెందుకు మూగబోయిందన్నది ఇక్కడి ప్రశ్న. అధికారంలో మనవాడు లేకుంటే దుమ్మెత్తి పోయడమే వారికి తెలిసిన న్యాయం. కానీ, సీఎం జగన్ రైతుకు ఒక్క రూపాయి నష్టం జరగకుండా తేమ శాతం ఎక్కువగా ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేసి డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తున్నారు. ప్రకృతి వైప రీత్యాల సమయంలోనూ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సైతం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ♦ ఇక దుడ్డు రకాలు(జయ రకం ధాన్యం) కేరళకు ఎగుమతి చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఒప్పందం చేసుకుంది. అందువల్ల గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆ రకాలనే సాగు చేసేందుకు మొగ్గు చూపారు. గతేడాది తుఫాన్ కంటే ముందే అక్కడ కోతలు పూర్తవడం, ప్రభుత్వం కంటే ముందుగా బయట వ్యాపారులు వచ్చి మంచి రేటు ఇచ్చి పంట కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి సేకరించే అవకాశం రాలేదు. దీనిని కూడా ఈనాడు వక్రీకరించింది. ♦ ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వమే కళ్లాల్లోని ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తోంది. అక్కడ కస్టమ్ మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని బఫర్ గొడౌన్లు, మండల నిల్వ కేంద్రాలకు తరలించాలి. వీటిన్నింటికీ ప్రతి స్టేజీలో వేర్వేరు రవాణా వ్యవస్థలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రాంతాల్లో సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించింది. దానిపై దీనిని ఈనాడు ధాన్యం సేకరణ మిల్లర్లకు అప్పగిస్తున్నారంటూ అబద్దపు ప్రచారం చేస్తోంది. -
రబీ ఉత్పత్తుల కొనుగోళ్లకు శ్రీకారం
సాక్షి, అమరావతి: మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని రబీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. శనగల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు శ్రీకారం చుట్టారు. త్వరలో పెసలు, మినుముల కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు. మద్దతు ధరకు సేకరణ... రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్‌కు శనగలకు రూ.5440, పెసలకు రూ.8558, మినుముకు రూ.6950, వేరుశనగకు రూ.5850 చొప్పున కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. రబీ–2023 –24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 4.50 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేలటన్నుల దిగుబడులొస్తాయని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్‌కు పెసలకు రూ.9 వేల నుంచి 9300, మినుముకు రూ.9 వేల నుంచి 9500 ఉండగా, శనగలు మాత్రం రూ.5300 నుంచి రూ.5600 మధ్య ఉంది. కనీస మద్దతు ధరకు 1.14,163 టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఆర్బీకేల ద్వారా శనగలు కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుడుతున్నారు. 26వతేదీ నుంచి కొనుగోలు చేపట్టనున్నారు. అదే రీతిలో మిగిలిన పంట ఉత్పత్తుల కొనుగోలుకు కూడా అనుమతి కోరుతూ మార్క్‌ఫెడ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రైతు రబీలో సాగుచేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే తొలుత ప్రాధాన్యతనిస్తారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీట్యాగ్ వేస్తున్నారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ అమలు చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. పారదర్శకంగా కొనుగోళ్లు... కనీస మద్దతు ధరకు రైతుల నుంచి శనగల సేకరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్న, సన్న కారు రైతులకు తొలుత ప్రాధాన్యతనిస్తాం. ప్రభుత్వం అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
రైతుల డిమాండ్లకు చెవి ఒగ్గాలి!
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ పంజాబ్ రైతులు నిరసన బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం వాగ్దానం విషయంలో ఆలస్యమే ఈ నిరసనకు ఒక ప్రేరేపకం. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయ పార్టీలు మాట వింటాయనేది మరొక కారణం. అయితే, 2020 నాటి రైతుల ఆందోళనకు 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. ఈసారి నిరసనలకు అంత విస్తృత మద్దతు లేదు. అయినప్పటికీ, మునుపటి కంటే డిమాండ్లు నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతుకూలీలకు పింఛన్లు వంటివి ఇందులో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ పంజాబ్ రైతులు నిరసన బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం వాగ్దానం విషయంలో ఆలస్యమే ఈ నిరసనకు ఒక ప్రేరేపకం. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయ పార్టీలు మాట వింటాయనేది మరొక కారణం. అయితే, 2020 నాటి రైతుల ఆందోళనకు 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. ఈసారి నిరసనలకు అంత విస్తృత మద్దతు లేదు. అయినప్పటికీ, మునుపటి కంటే డిమాండ్లు నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతుకూలీలకు పింఛన్లు వంటివి ఇందులో ఉన్నాయి. రానున్న 2024 పార్లమెంటరీ ఎన్నికలు విరుద్ధమైన అవగాహనలకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. ప్రతిపక్షాల కుల గణన డిమాండ్‌కు బీజేపీ తలొగ్గు తుందనే భావన పోయి, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ ప్రయోజనం పొందుతుందనే అభిప్రాయం వైపు లోలకం సూచీ కదిలింది. అయితే, సమాఖ్య నిధుల్లో తమ వాటా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న దక్షిణాది ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈ కథనాన్ని సవాలు చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్యనే పంజాబ్ రైతులు ఢిల్లీ వైపు కవాతు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిరసనకు పలు రైతు సంఘాలు మద్దతు తెలుపడంతో ఎన్నికముందు మరోసారి రంగం సిద్ధమైంది. ఢిల్లీ సరిహద్దులో బలగాలను మోహరించి, భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, డిమాండ్ల స్వభావం, పాల్గొంటున్న సంఘాలు, ప్రభుత్వ ప్రతిస్పందన వంటి అనేక అంశాలలో, 2020 రైతుల నిరసనలకు ప్రస్తుత నిరసనభిన్నంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనలకు జగ్జీత్ సింగ్ డల్లేవాల్, సర్వన్ సింగ్ పంఢేర్ నేతృత్వంలోని సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం వహిస్తోంది. వీరు మునుపటి రైతుల నిరసనలో ప్రముఖులు కాదు. దర్శన్ పాల్, బల్బీర్ సింగ్ రాజేవాల్ నేతృత్వం వహిస్తున్న రెండు గ్రూపులు భారత్ బంద్‌కు వేర్వేరుగా పిలుపు నిచ్చాయి. హరియాణాలో మితిమీరిన ప్రభుత్వాధికార వినియోగానికి వ్యతిరేకంగా భారత్ కిసాన్ యూనియన్(ఉగ్రాహాన్) రైల్ రోఖోకు ప్రత్యేక పిలుపునిచ్చింది. 2020లో మొదలైన రైతుల ఆందోళనకు సైద్ధాంతికంగా సమ ర్థమైన 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. పైగా అది పంజాబ్ కేంద్రంగా మాత్రమే జరగలేదు. అందులో పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హరియాణా నుండి కూడా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. ఈసారి మాత్రం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికి చాలావరకు మౌనంగా ఉన్నాయి. అలాగే రాకేశ్ టికైత్, గుర్నామ్ సింగ్ చఢూనీ నేతృత్వంలోని యూనియన్లు ప్రస్తుతం ఆందోళనలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నాయి. అంతకుముందటి నిరసన ఉద్యమం... పౌర సమాజ కార్య కర్తలు, కళాకారులు, నిపుణులు, పదవీ విరమణ చేసిన పౌర సేవ కులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి విస్తృత మద్దతునుపొందింది. రాడికల్ మితవాదులు కూడా తమ సొంత కథనాలతోఅందులోకి వచ్చారు కానీ వారు కేంద్రస్థానంలోకి ప్రవేశించలేదు. ఉద్యమానికి ప్రగతిశీల రైతులు నాయకత్వం వహించడం, వారికి మత కుల అనుబంధాలకు అతీతంగా ఉదారవాదులు మద్దతునివ్వడం వల్ల రాడికల్ మితవాద రాజకీయాల పాత్ర పరిమితమైంది. కానీ ప్రస్తుత నిరసనకు విస్తృతమైన మద్దతు లేదు. పైగా గుర్తింపు రాజకీయాలవెంపర్లాట కూడా దీని వెనుక ఉంటోంది. నేడు రైతు సంఘాలలోని మూడు ప్రధాన వర్గాలు ఒకే బ్యానర్ కింద ఐక్యం కాలేదు. అవి ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా (రాజ కీయేతరమైన గ్రూప్) ఇతర యూనియన్లను అధిగమించి నాయకత్వ స్థానంలోకి ప్రవేశించింది. పంజాబ్ ప్రభుత్వ మద్దతుతో కేంద్ర ప్రభు త్వంతో చర్చలు జరపడానికి సిద్ధమైంది. డిమాండ్ల విషయానికొస్తే, ప్రస్తుత నిరసనలు మునుపటి కంటే నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారతదేశం వైదొలగడం, వ్యవసాయ రుణాల మాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, రైతులు– రైతు కూలీలకు పెన్షన్లు, 2020–21 నిరసనల సంద ర్భంగా రైతులపై దాఖలైన కేసుల ఉపసంహరణ, నష్టపరిహారంవంటివి ఇందులో ఉన్నాయి. నిరసన కాలంలో మరణించిన రైతు లకూ, ‘లఖీంపూర్ ఖీరీ ఘటన’ బాధితులకూ న్యాయం జరిగేలా చూడటం, వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత 2021లో బీజేపీ చేసిన వాగ్దానాలపై దృష్టి పెట్టడం కూడా డిమాండ్లలో ఉన్నాయి. మరోవైపు, సరిహద్దుల్లో భారీగా కంచెలు వేయడం, ఘాజీపూర్, సింఘు, టిక్రి సరిహద్దుల్లో 144 సెక్షన్ విధించడం చూస్తుంటే ప్రస్తుత నిరసనపై ప్రభుత్వ ప్రతిస్పందన ఇప్పుడు కూడా ప్రతిచర్యగానే కని పిస్తోంది. పంజాబ్, హరియాణాల్లో అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పంజాబ్, హరియాణా సరిహద్దులను రాజ స్థాన్ మూసివేసింది. అనేక జిల్లాలలో నిషేధాజ్ఞలను విధించింది. వారి ‘ఢిల్లీ ఛలో’ ప్రకటనకు ముందే, రైతులతో చర్చలు ప్రారంభించినప్ప టికీ, 2021లో చేసిన వాగ్దానాలపై కేంద్రప్రభుత్వం ఇంకా స్పందించ లేదు.అలాగే, నిరసన ప్రదేశంలో టియర్ గ్యాస్ వాడకం, డ్రోన్ల ద్వారా పొగ బాంబులు వేయడం, రాళ్లు రువ్వడం, వాహనాలను సీజ్ చేయడం, రైతులను పోలీసులు నిర్బంధించడం వంటి ఘటనలు అలాగే కొనసాగుతున్నాయి. క్రితంసారి మితిమీరిన బలప్రయోగం జరిపిన అనుభవం నుంచి ప్రభుత్వం పాఠాలేమీ నేర్చుకున్నట్టు లేదు. ఎందుకంటే, మితిమీరిన బలప్రయోగం చేయడం... నిరసనను తీవ్ర దారుల్లోకి మళ్లించాలనుకునేవారికి ఊతమిస్తుంది. 2020లో జరిగిన రైతుల నిరసన నుండి ఇతర పాఠాలు కూడా ఉన్నాయి. అది రైతుల విజయంతో ముగిసింది, అయితే 700 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ఎజెండాకు వ్యతిరేకంగా ఇది మొదటి, సుదీర్ఘ పోరాటం. అన్నదాతలు ఆకలితో అలమటిస్తున్న వేళ వ్యవసాయ వ్యాపారం (అగ్రి బిజినెస్) మాత్రం విపరీతంగా లాభాలు ఆర్జించడం విడ్డూరం. ఆహార ధాన్యాలకు కొత్త మార్కెట్లు లేకపోవడం, నీటి మట్టం తగ్గడం లాంటి కారణాలనే వ్యవసాయ సంక్షోభానికి కారణా లుగా చూపడం పరిస్థితి తీవ్రతను తగ్గించడమే అవుతుంది. ఆహారమే ఇప్పుడు రాజకీయం. ఇది కేవలం పరిపాలన, చట్ట పరమైన చర్యల ద్వారా మాత్రమే పరిష్కారం కాదు. ఆహార సార్వ భౌమాధికారం, ఆహార భద్రత, రైతుల జీవనోపాధికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రాజకీయ సంకల్పం అవసరం. కేంద్రం అన్ని రాజకీయ పార్టీలను భాగం చేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొన డంలో నిమగ్నం కావాలి. దీన్నొక ఓట్ల వ్యవహారంగా చూడకూడదు. వ్యవసాయాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేయాలంటే, సబ్సిడీలు ఇవ్వాలి. తమ వాణిజ్య వ్యవసాయాన్ని నిలబెట్టుకోవడానికి, అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారీ సబ్సిడీలు ఇస్తున్నాయి. క్రితంసారి రైతులు వీధుల్లోకి వచ్చిన ఘటన నుండి మరొక పాఠం ఏమిటంటే, ప్రభుత్వం అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల తర్వాతే చట్టాలను రూపొందించాలి. లేకపోతే, అది ప్రజలకు విషాదాన్నీ, నాయకత్వానికి ఇబ్బందినీ కలిగిస్తుంది. మూడు వ్యవ సాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన మద్దతును అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ వాగ్దానంపై చొరవ విషయంలో ఆలస్యమే ఇప్పుడు తమ నిరసనను ప్రారంభించేందుకు రైతులకు తగిన కారణాన్ని అందించింది. రాజకీయ నాయకత్వం కేవలం నిరసనలకు మాత్రమే స్పందిస్తుందనీ, ఎన్నికల వేళ మాత్రమే ప్రజల వాణిని వింటుందనే భావన ట్రిగ్గర్‌గా పనిచేసింది. - వ్యాసకర్త చండీగఢ్‌లోని ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్_ -ప్రొ‘‘ ప్రమోద్ కుమార్ -
రైతులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యం
సాక్షి, అమరావతి: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కంటే రెట్టింపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాలు ఇలా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన దాఖలాల్లేవన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో జరిగిన ఏపీ గున్వత్ సంకల్ప (నాణ్యతకు భరోసా) వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు రైతుల సంక్షేమం కోసమే వేస్తున్నారని చెప్పారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు చేయిపట్టుకుని నడిపించేందుకు ఆర్బీకే వ్యవస్థను, దీనికి అనుబంధంగా యంత్రసేవా కేంద్రాలు, గోదాములతో కూడిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేశారని వివరించారు. పాడి, ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ అందించడంతోపాటు బ్యాంకింగ్ సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు, రివార్డులతో నేడు మన ఆర్బీకేలు దేశానికే కాదు.. ప్రపంచానికే రోల్‌మోడల్‌గా నిలిచాయని చెప్పారు. వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఉద్యానపంటల హబ్‌గా నిలిచిన ఏపీ బొప్పాయి, టమాటా, కొకో, పామాయిల్లో మొదటిస్థానంలోను, అరటి, బత్తాయి, వంగ, మిరపలో రెండోస్థానంలోను, మామిడి, ఉల్లి, జీడిమామిడిలో మూడోస్థానంలోను నిలిచిందని చెప్పారు. రొయ్యలు, చేపలు, గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. 14 ఎఫ్‌పీవోలకు గ్యాప్ సర్టిఫికేషన్ క్యూసీఐ సహకారంతో పైలెట్ ప్రాజెక్టు కింద గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్–23లో 33 ఎఫ్‌పీవోలు రిజిస్ట్రేషన్ చేసుకోగా, అర్హత పొందిన 14 ఎఫ్‌పీవోలకు మంత్రి కాకాణి గ్యాప్ సర్టిఫికేషన్ జారీచేశారు. క్యూసీఐ ఇండిగ్యాప్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సేవలందించేందుకు మంత్రి సమక్షంలో ఏపీ ప్రభుత్వం, క్యూసీఐ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. క్యూసీఐ చైర్పర్సన్ జాక్సా షా, సీఈవో డాక్టర్ ఎ.రాజ్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, సహకార, మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవిచౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, ఉద్యాన, సహకార, మత్స్యశాఖల కమిషనర్లు శ్రీధర్, అహ్మద్‌బాబు, కన్నబాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రుణ మాఫీ, కుల గణన
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఈ నెల 7, 17వ తేదీల్లో రెండు విడతలుగా జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కులగణన, ధాన్యానికి మరింత మద్దతు ధర, రైతులకు రుణామాఫీ, సబ్సిడీ ధరకే వంటగ్యాస్ వంటివి ఇందులో ప్రధాన హామీలుగా ఉన్నాయి. రాజ్‌నందన్‌గావ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం బఘేల్ ఎన్నికల హామీలను ప్రకటించారు. మళ్లీ అధికారమిస్తే.. ఎకరానికి 20 క్వింటాళ్ల వరిధాన్యాన్ని రూ.3,200 చొప్పున కొనుగోలు చేస్తామని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని తెలిపారు. తునికాకు స్టాండర్డ్ బ్యాగుకు రూ.4 వేలకు బదులు రూ.6 వేలు చెల్లిస్తామని, సేకరణ దారులకు అదనంగా రూ.4 వేల బోనస్ ఇస్తామని ప్రకటించారు. మహిళలకు వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. -
రైతు భరోసా గొప్ప కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న రైతు భరోసా గొప్ప కార్యక్రమమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఇది తెలంగాణ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని రైతులకు ఎకరాకు ఏటా రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని.. కౌలు రైతులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. వరి పండించే రైతులకు మద్దతు ధరపై క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసా గ్యారంటీ స్కీమ్‌ను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు తెలంగాణ రైతాంగం తరపున అభినందనలు తెలుపుతున్నామన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే నేరుగా బీజేపీకి ఓటు వేసి నట్టుగా భావించాలని సీఎల్పీనేత భట్టి విక్రమార్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు హోటల్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్కు పడిన ప్రతి ఓటు బీజేపీకి బదిలీ అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్లమెంట్లో బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయా లకు ఓటు వేసి సమర్థిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్లు పరస్పరం సహకరించుకుంటూ ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసమే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలని ప్రకటిస్తోందని తెలిపారు. -
AP: పసుపు@రూ.11,750.. ప్రభుత్వ జోక్యంతో నెలలోనే రెట్టింపైన ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యలు ఫలించాయి. పసుపు ధర అమాంతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ధర లభిస్తుండడంతో రైతులు ఎంతో సంతోషిస్తున్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన దుగ్గిరాల పసుపు మార్కెట్లో శుక్రవారం క్వింటా పసుపు ధర రూ.11,750 పలికింది. ఈ స్థాయి ధర చరిత్రలో ఎన్నడూ లభించలేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఈసారి క్వింటా రూ.15 వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2022–23 సీజన్లో రాష్ట్రంలో 84 వేల ఎకరాల్లో పసుపు సాగవగా 4 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. సాధారణంగా 50 శాతం రాష్ట్ర పరిధిలో వినియోగిస్తుండగా, 20 శాతం పొరుగు రాష్ట్రాలకు, 30 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. 2022–23 సీజన్లో పసుపునకు కనీస మద్దతు ధర రూ.6,850గా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ధర తగ్గిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. టీడీపీ ఐదేళ్ల పాలనలో 28,563 మంది రైతుల నుంచి రూ.305 కోట్ల విలువైన 48,540 టన్నుల పసుపును సేకరిస్తే, 2019–20 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 28,724 మంది రైతుల నుంచి రూ.437.24 కోట్ల విలువైన 56,536 టన్నుల పసుపును సేకరించింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా దాదాపు రెండున్నరేళ్లపాటు పసుపు రైతుకు మంచి ధర లభించింది. ఒక దశలో క్వింటా రూ.10 వేలకుపైగా పలికింది. రబీ 2022–23 సీజన్ ప్రారంభంలో రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్య పలికిన పసుపు ధర ఆ తర్వాత మేలో అనూహ్యంగా ఎమ్మెస్పీ కన్నా దిగువకు పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకు తోడు దేశీయంగా పసుపు పంట ఒకేసారి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిçస్తున్న ప్రభుత్వం ధరలు తగ్గిన వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా పసుపు రైతుకు అండగా నిలిచింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి కనీస మద్దతు ధర రూ.6,850 చొప్పున పసుపు కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకేల ద్వారా 2,794 మంది రైతుల నుంచి రూ.34.39 కోట్ల విలువైన 5,020 టన్నుల పసుపును రైతుల నుంచి సేకరించింది. ప్రభుత్వ జోక్యంతో వ్యాపారులు కూడా పోటీపడి కనీస మద్దతు ధరకు మించి కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ధరలు మళ్లీ ఎమ్మెస్పీకి మించడంతో ప్రభుత్వం కొనుగోళ్లను నిలిపేసింది. క్వాలిటీని బట్టి ఈ ఏడాది జూన్‌లో క్వింటా రూ.5,300 నుంచి రూ.6,250 మధ్య పలికిన పసుపు జూలై వచ్చేసరికి రూ.8 వేల నుంచి రూ.10,511 మధ్య పలికింది. ఆగస్టులో గత ఏడాది క్వింటా రూ.5 వేల నుంచి రూ.6,300 మధ్య పలకగా, ప్రస్తుతం రూ.8,200 నుంచి రూ.11,750 పలుకుతోంది. పెట్టుబడి పోను రూ.5 లక్షలు మిగులుతోంది. మూడెకరాల్లో పసుపు వేశా. ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. మంచి దిగుబడి వచ్చింది. రెండునెలల కిందట రూ.5 వేలకు మించి పలకకపోవడంతో పెట్టుబడి కూడా దక్కదేమోనని ఆందోళన చెందాను. ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు చేయడంతో మళ్లీ ధరలు పెరిగాయి. శుక్రవారం 100 క్వింటాళ్లు మార్కెట్‌కు తీసుకొచ్చా. క్వింటా రూ.11,100 చొప్పున కొన్నారు. రూ.11 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. పెట్టుబడిపోను రూ.5 లక్షలకు పైగా మిగులుతోంది. చాలా ఆనందంగా ఉంది. – ఎస్.రాము, చింతమోటు, భట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా ఈ స్థాయి ధర ఎప్పుడూ రాలేదు ఒకటిన్నర ఎకరాలో సాగుచేశా. ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెలన్నర కిందటి ధరతో పోలిస్తే రెట్టింపు ధర లభించింది. ప్రభుత్వం కొనడం మొదలు పెట్టిన తర్వాత రేటు పెరుగుతూ వస్తోంది. ఈరోజు 44 క్వింటాళ్ల పసుపు తీసుకొచ్చాను. క్వింటా రూ.11 వేలకు కొన్నారు. ఈ స్థాయి ధర గతంలో ఎప్పుడూ లభించలేదు. చాలా సంతోషంగా ఉంది. – ఎ.వెంకటసుబ్బయ్య, పోరుమామిళ్ల, వైఎస్సార్ జిల్లా ధర మరింత పెరిగే అవకాశం ప్రభుత్వ జోక్యంతోపాటు డిమాండ్‌కు తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. దుగ్గిరాల మార్కెట్ పరిధిలోని కోల్డ్ స్టోరేజ్‌ల్లో మూడులక్షల టన్నుల పసుపు ఉంది. రైతుల వద్ద మరో మూడులక్షల టన్నుల సరుకు ఉంది. కొల్లిపర, లంకల ఏరియా, సత్తెనపల్లి, పిడుగురాళ్లతో పాటు వైఎస్సార్ జిల్లా నుంచి రోజూ 30–40 లారీల పసుపు వస్తోంది. ధర మరింత పెరిగే అవకాశం ఉంది. – ఎన్.శ్రీనివాసరావు, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ యార్డు, దుగ్గిరాల ప్రభుత్వ జోక్యం వల్లే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సీఎం యాప్‌ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇలా ఈ సీజన్లో రూ.513.94 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాం. ప్రభుత్వ జోక్యం వల్లనే నెల తిరక్కుండానే పసుపునకు మంచి ధర లభిస్తోంది. మొక్కజొన్న క్వింటా రూ.2 వేలకు పైగా పలుకుతుండగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసుపు ధర క్వింటా రూ.11,750 పలుకుతోంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి -
ముగిసిన రబీ ఉత్పత్తుల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: రబీ ఉత్పత్తుల సేకరణ ముగిసింది. రైతులకు మద్దతు దక్కని పంట ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రికార్డు స్థాయిలో సేకరించింది. ధరల స్థిరీకరణ ద్వారా ఏటా ప్రతి సీజన్లోను మార్కెట్లో మద్దతు ధర లభించని పంట ఉత్పత్తులను సేకరిస్తూ నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. అదేరీతిలో 2022–23లో ఖరీఫ్, రబీ సీజన్లలో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఫలితంగా మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మద్దతు ధరకు మించి పెరిగాయి. సీఎం యాప్ ద్వారా రోజూ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఖరీఫ్ 2021 సీజన్ చివరిలో మార్కెట్ ధరలు తగ్గడంతో ప్రభుత్వాదేశాలతో 3,513 మంది రైతుల నుంచి రూ.24.61 కోట్ల విలువైన 8,384 టన్నుల సజ్జలు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు సేకరించారు. గడిచిన ఖరీఫ్–2022 సీజన్లో సజ్జలు మినహా మిగిలిన పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరలు దక్కడంతో రైతులకు మంచి లాభాలొచ్చాయి. సజ్జలను మాత్రమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశారు. 564 మంది రైతుల నుంచి రూ.3.94 కోట్ల విలువైన 1,676 టన్నులు కొనుగోలు చేశారు. రబీ 2021–22 సీజన్లో 33,566 మంది రైతుల నుంచి రూ.426 కోట్ల విలువైన 84,773 టన్నుల శనగలు, జొన్నలు, పసుపు, పెసలు సేకరించారు. ఇటీవల ముగిసిన రబీ 2022–23 సీజన్లో 39,479 మంది రైతుల నుంచి రూ.510.74 కోట్ల విలువైన 1,39,262 టన్నుల శనగలు, మొక్కజొన్న, పసుపు సేకరించారు. ప్రధానంగా 28,112 మంది రైతుల నుంచి రూ.336.83 కోట్ల విలువైన 63,132 టన్నుల శనగలు, 9,110 మంది రైతుల నుంచి రూ.139.52 కోట్ల విలువైన 71,110 టన్నుల మొక్కజొన్న, 2,257 మంది రైతుల నుంచి రూ.34.39 కోట్ల విలువైన 5,020 టన్నుల పసుపు సేకరించారు. శనగలకు సంబంధించి నూరుశాతం చెల్లింపులు చేయగా, మొక్కజొన్న రైతులకు రూ.139.06 కోట్లు, పసుపు రైతులకు రూ.7.48 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.27.37 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. గడిచిన రబీ సీజన్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో మొక్కజొన్న ధర రూ.1,500 నుంచి రూ.2 వేలకుపైగా పెరిగింది. అదేరీతిలో కందులు, పెసలు, మినుములు వంటి అపరాల ధరలు కూడా రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,322.15 కోట్ల విలువైన 9.01 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 12 రకాల పంట ఉత్పత్తులను సేకరించగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.7,712.32 కోట్ల విలువైన 21.56 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 17 రకాల పంట ఉత్పత్తులను సేకరించింది. గతంలో ఏన్నడూ లేనివిధంగా అరటి, పత్తి, పొగాకు, బత్తాయి. టమాటా పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించి రైతులకు అండగా నిలిచింది. -
చిరుధాన్యాలకు ‘మద్దతు’
సాక్షి, అమరావతి: చిరు ధాన్యాలు పండించే రైతన్నలకు మద్దతు ధర కల్పిస్తూ ఖరీఫ్ నుంచి ఆర్బీకేల ద్వారా రాగులు, జొన్నలు, కందుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధ్యవర్తులు, దళారుల బెడద లేకుండా ధాన్యం మాదిరిగానే నేరుగా కల్లాల్లో పంట ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి పౌర సరఫరాల సంస్థ మద్దతు ధరకు సేకరించనుంది. పంట వేసిన తర్వాత ఆర్బీకేలో నమోదు చేసే ఈ–క్రాప్ వివరాల ఆధారంగా కొనుగోలు చేయనుంది. క్వింటాల్ కందులకు కనీస మద్దతు ధర రూ.7 వేలు, రాగులకు రూ.3,578, జొన్నలకు రూ.2,970(హైబ్రీడ్), రూ.2,990 (మల్దండి) చొప్పున ప్రకటించింది. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారంలోగా వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.41 లక్షల టన్నుల కందులు, 64,738 టన్నుల రాగులు, 3.63 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తుల దిగుబడులు రావచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు రాగులు, జొన్నలు, కందుల కొనుగోళ్ల వివరాలను పౌర సరఫరాల సంస్థ గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలోనే సేకరణ.. రాయితీపై విత్తనాలు ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాల ద్వారా ప్రతి నెలా కార్డుకు మూడు కేజీల బియ్యం బదులు రాగులు/జొన్నలను అందిస్తోంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థ మద్దతు ధరకు జొన్నల కొనుగోలు చేపట్టగా రాగులను కర్ణాటక నుంచి సేకరిస్తోంది. అయితే మన రాష్ట్రంలో పండే చిరుధాన్యాలు, కందులను స్థానికంగానే కొనుగోలు చేసి రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించి వాటిని తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వర్షాధార, మెట్ట పంటలైన రాగి, జొన్నల సాగును ప్రోత్సహించేందుకు 50 శాతం రాయితీపై రైతులకు విత్తనాలను అందిస్తోంది. రైతులపై భారం లేకుండా.. పంట ఉత్పత్తులను నేరుగా కల్లాల్లోనే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు రవాణా, హమాలీ ఖర్చుల భారం నుంచి ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తోంది. గోనె సంచులు, లోడింగ్, మిల్లు వద్దకు తరలించేందుకు రవాణా ఖర్చులను కూడా భరిస్తోంది. ఒకవేళ రైతులు వాటిని స్వయంగా సమకూర్చుకుంటే అందుకు అయిన ఖర్చులను తిరిగి చెల్లిస్తోంది. ఒక్కో గోనె సంచికి (50 కేజీలు) రూ.3.39, లేబర్ చార్జీ కింద రూ.22 చొప్పున అందచేస్తోంది. పోటీతో రైతులకు లాభసాటి ధర చిరుధాన్యాలు, కందులు పండించే రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. స్థానికంగా పంటలను కొనుగోలు చేసి స్థానికులకే పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే బృహత్తర ప్రణాళిక ఇది. తొలుత ఖరీఫ్‌లో ఆర్బీకేల ద్వారా జొన్నలు, రాగులు, కందుల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు వీటిని మార్కెట్లో వ్యాపారులే కొనుగోలు చేస్తుండగా ప్రభుత్వం ముందుకు రావడంతో పోటీ పెరగనుంది. తద్వారా రైతుకు మద్దతు ధర మించి లాభసాటి రేటు దక్కుతుంది. రైతులు కచ్చితంగా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
12 వరకు మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: మార్కెట్లో ధరలు పుంజుకున్నప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మరికొంతకాలం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అనుమతికి మించి రైతుల నుంచి కొనుగోలు చేయడమేగాక సకాలంలో డబ్బు చెల్లిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది. ప్రభుత్వ జోక్యంతో మార్కెట్లో ధరలు మళ్లీ పుంజుకోవడంతో మొక్కజొన్న రైతులు సంతోషిస్తున్నారు. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ రైతు ప్రయోజనాల దృష్ట్యా ఈ నెల 12వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదిరోజుల్లోనే రైతులకు సొమ్ము మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. కనీస మద్దతుధర కంటే మార్కెట్లో మొక్కజొన్న ధరలు తగ్గినట్టు సీఎం యాప్ ద్వారా గుర్తించిన మరుక్షణం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.1,962 కాగా, మార్కెట్లో రూ.1,500 నుంచి రూ.1,800 చొప్పున పలుకుతుండడంతో మొక్కజొన్న ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లోని 1,548 ఆర్బీకేల పరిధిలో కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. మే 5వ తేదీన కొనుగోళ్లు ప్రారంభించింది. తొలుత 25,316 మంది రైతులు తమ వివరాలను ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 698 ఆర్బీకేల పరిధిలో 8,915 మంది రైతుల నుంచి కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.1,962 చొప్పున రూ.140.18 కోట్ల విలువైన 71,445 టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తోంది. ఇప్పటికే సీఎం యాప్ ద్వారా 6,292 మంది రైతులకు రూ.95.29 కోట్లు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని వారం, పదిరోజుల్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న ధర ప్రభుత్వ జోక్యంతో వ్యాపారులు సైతం పోటీపడడంతో మార్కెట్లో ధరలు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఫలితంగా ప్రస్తుతం సాధారణ కామన్ వెరైటీ సైతం కనీస మద్దతు ధరతో సమానంగా ఉండగా, ఫైన్ క్వాలిటీ మొక్కజొన్న ధర క్వింటాల్ రూ.2 వేలకు పైగా పలుకుతోంది. దీంతో రైతులు తమ వద్ద ఉన్న నిల్వలను బహిరంగమార్కెట్లో అమ్ముకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 85 శాతానికి పైగా రైతుల వద్ద ఉన్న నిల్వలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలుత ఈ నెల 9వ తేదీతో కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించినా.. చివరి గింజ అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు ఈ నెల 12వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. సీఎం యాప్ ద్వారా ప్రతి రోజు మొక్కజొన్నతో సహా ఇతర పంట ఉత్పత్తుల మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టపోయేవాడిని.. పంట చేతికొచి్చంది. మార్కెట్లో ధర లేదు. పెట్టుబడి కూడా దక్కుతుందో లేదో అని ఆందోళన చెందా. ఏం చేయాలో పాలుపోలేదు. ప్రభుత్వం మా ఊళ్లోనే ఆర్బీకేలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. 113 క్వింటాళ్లు ఈ కేంద్రంలో అమ్ముకున్నా. పదిరోజులు తిరక్కుండానే క్వింటా రూ.1,962 చొప్పున రూ.2.22 లక్షలు నా అకౌంట్లో జమ అయ్యాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టపోయేవాడిని. – ఎస్.వెంకటేశ్వరరెడ్డి, పాలపాడు, పల్నాడు జిల్లా కొనుగోలు కేంద్రంలో విక్రయంతో లబ్ధి నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశా. బయట క్వింటా రూ.1,600కు మాత్రమే కొంటున్నారు. దీంతో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలనుకున్నా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజుల కిందట క్వింటా రూ.1,900 చొప్పున 10 టన్నులు విక్రయించా. దీంతో క్వింటాకు రూ.300 చొప్పున, 10 టన్నులకు రూ.30 వేల మేర లబ్ధి కలిగింది. – చీడెపూడి సాంబిరెడ్డి, వలివేరు, బాపట్ల జిల్లా కేంద్రాలు కొనసాగిస్తాం ప్రభుత్వ జోక్యం వల్ల వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కనీస మద్దతు ధరకు మించే కొనుగోలు చేస్తున్నారు. ఫైన్ క్వాలిటీ రూ.2 వేలకుపైగా పలుకుతోంది. ప్రభుత్వాదేశాలతో ఈ నెల 12వ తేదీ వరకు కేంద్రాలు తెరిచే ఉంటాయి. రైతుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి మరికొంతకాలం కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
నేటి నుంచి పసుపు కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా ధరలేక ఇబ్బందిపడుతున్న పసుపు రైతుకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీస మద్దతు ధర రూ.6,850గా నిర్ణయించి, 20వేల టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆర్బీకేల ద్వారా ఈ నెల 5వ తేదీ నుంచి కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. నాలుగేళ్లలో 52 వేల టన్నుల పసుపు కొనుగోలు కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధర తగ్గిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. ఇలా 2019–20 నుంచి ఇప్పటివరకు 29,193 మంది రైతుల నుంచి రూ.405.11 కోట్ల విలువైన 52,456.82 టన్నుల పసుపును సేకరించింది. అదే టీడీపీ ఐదేళ్ల పాలనలో 28 వేలమంది రైతుల నుంచి రూ.305 కోట్ల విలువైన 48,540.38 టన్నులను మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా గత రెండేళ్లుగా పసుపు ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ఒకదశలో క్వింటా రూ.10 వేలకుపైగా పలికింది. నెలరోజుల కిందటి వరకు రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్య పలికింది. సాధారణంగా 50 శాతం రాష్ట్ర పరిధిలో వినియోగిస్తుండగా, 20 శాతం పొరుగు రాష్ట్రాలకు, 30 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. 2022–23లో రికార్డు స్థాయిలో 84 వేల ఎకరాల్లో సాగుచేయగా, నాలుగు లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే 50 శాతానికిపైగా మార్కెట్‌కు వచ్చింది. సీఎం యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ డిమాండ్‌కు మించి పసుపు వస్తుండడంతో పాటు దేశీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొద్దిరోజులుగా మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం నాణ్యమైన పసుపు క్వింటా ధర రూ.5,500 నుంచి రూ.6,300 వరకుపలుకుతోంది. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం పసుపు రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. మరోసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుంటోంది. ఇప్పటివరకు మార్కెట్‌కు ఎంత వచ్చింది. ఇంకా రైతుల వద్ద ఏ మేరకు నిల్వలున్నాయని ఆర్బీకే స్థాయిలో సర్వే చేసింది. వైఎస్సార్, నంద్యాల, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని రైతుల వద్ద పసుపు నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఆయా జిల్లాల పరిధిలోని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రైతుల వద్ద ఉన్న పసుపు నిల్వలను నాణ్యతను బట్టి కనీస మద్దతు ధర రూ.6,850కి కొనుగోలు చేయనుంది. సీఎం ఆదేశాల మేరకు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ఉన్న పసుపును ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాం. ఆర్బీకేల ద్వారా రైతులు తమ వివరాలను నమోదు చేసుకుంటే, వారివద్ద ఉన్న ఫైన్ క్వాలిటీ పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. – రాహుల్‌పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
ప్రభుత్వ జోక్యంతో పెరిగిన మొక్కజొన్న ధర
సాక్షి, అమరావతి: మార్కెట్లో పంటల ధరలు పతనమైన ప్రతిసారీ రైతన్నను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది. వ్యాపారులతో పోటీ పడి పంటలను కొంటూ ధరల పెరుగుదలకు కృషి చేస్తోంది. తాజాగా మొక్కజొన్న విషయంలోనూ ప్రభుత్వ చొరవ ఫలించింది. కనీస మద్దతు ధరకంటే తక్కువ పలికిన మొక్కజొన్న ధర ప్రభుత్వ జోక్యంతో తిరిగి రూ.2 వేలకు పైగా పలుకుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.. గత మూడేళ్లుగా మంచి ధరలు పలికిన మొక్కజొన్న కొద్ది రోజుల క్రితం కనీస మద్దరు ధరకంటే తక్కువ ధర పలకడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పంట కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. 20 రోజులు కూడా తిరక్కుండానే ధరలు పెరిగాయి. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాలుకు రూ.1,962 కాగా, రెండు నెలల క్రితం వరకు రూ.2 వేలకు పైగా పలికింది. కొద్ది రోజుల క్రితం అనూహ్యంగా ధర తగ్గుతున్నట్లు ధరలను రోజూ సమీక్షించే సీఎం యాప్ ద్వారా గుర్తించారు. అకాల వర్షాలు, ఇతర కారణాలను బూచిగా చూపించి మొక్కజొన్నను కనీస మద్దతు ధరకంటే తక్కువకు కొంటున్నట్లు గుర్తించారు. దీంతో సీఏం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీ మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. 66 వేల టన్నుల మొక్కజొన్నను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కనీస మద్దతు ధరకు కొనుగోలు ప్రారంభించింది. పంట అధికంగా సాగయ్యే గుంటూరు, ఎన్టీఆర్, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 1,548 ఆర్బీకేల పరిధిలో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 24,871 మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 4,500 మంది రైతుల నుంచి రూ.65.14 కోట్ల విలువైన 33,199 టన్నుల మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు కొన్నారు. వారం రోజుల్లోనే చెల్లింపులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రూ.20.59 కోట్లు చెల్లించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలవడంతో వ్యాపారులు సైతం ధర పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుతం రూ.2 వేల వరకు చెల్లించి కళ్లాల వద్దే కొంటున్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్లో ధరలు నిలకడగా కొనసాగేంత వరకు ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తామని ఏపీ మార్క్‌ఫెడ్ ప్రకటించింది. ధర మరింత పెరిగే అవకాశం ప్రభుత్వ జోక్యంతో మొక్కజొన్న ధర పెరుగుతోంది. వారం క్రితం వరకు క్వింటా రూ. 1,750 కంటే తక్కువగా ఉండగా, ప్రస్తుతం రూ 2 వేల వరకు చెల్లించి మరీ కొంటున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దు. కనీస మద్దతు ధర దక్కని ఏ రైతు అయినా వారి పంటను ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా అమ్ముకోవచ్చు. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ నష్టం రాకుండా.. కష్టం లేకుండా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెలకి చెందిన ఈ రైతు పేరు టి.శ్రీనివాస్. తన సోదరుడితో కలిసి 20 ఎకరాల్లో వరి పంట వేశారు. పదెకరాల్లో సాధారణ రకం.. మరో పదెకరాల్లో బొండాలు రకాలు ఊడ్చారు. సాధారణ ర కం ధాన్యం 200 క్వింటాళ్ల వరకు దిగుబడి వ చ్చింది. రూ.4.08 లక్షల విలువైన ఆ ధాన్యాన్ని ఈ నెల 22న ఆర్బీకేలో విక్రయించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన తర్వాత రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నాడు. ‘ఒకప్పుడు దళారి చెప్పిందే రేటు.. అతను కొనేదే ధాన్యం అన్నట్టు ఉండేది. ఏనాడూ పూర్తిగా మద్దతు ధ ర చూసేవాళ్లం కాదు. ఇప్పుడు పొలం దగ్గరకే వచ్చి ధాన్యం కొనే పరిస్థితిని ప్రభుత్వం కల్పించడంతో రైతుల కష్టం చాలా వరకు తగ్గిపోయింది’అని చెప్పాడు. బొండాలు ధాన్యాన్ని ఆరబెట్టాల్సి ఉందని, ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధర కు కొ నుగోలు చేస్తామని చెప్పడంతో మార్కెట్లో వ్యా పారులు ధర పెంచి కొంటున్నారని చెప్పాడు. గింజ కూడా వదలడం లేదు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రుకి చెందిన ఈ రైతు పేరు చింతలపాటి బలరామరాజు. ఆయనకు 8 ఎకరాలు సొంత పొలం ఉంది. మరో 15 ఎకరాలను కౌలుకు తీసుకుని మొత్తం 23 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. మొత్తం 2,280 బస్తాల (ఒక్కొక్క బస్తా 40 కేజీలు) ధాన్యాన్ని ఆర్బీకేలో విక్రయించగా.. వారం రోజుల్లోనే రూ. 18,60,480 నగదు ఆయన ఖాతాలో జమయ్యింది. ‘మా గ్రామంలో ఒక్క గింజ కూడా వదలకుండా ధాన్యం కొంటున్నారు. అందుకు నేనే ఉదాహరణ. ఒకప్పుడు ధాన్యం అమ్మితే డబ్బులు కోసం ఆరేసి నెలలు ఎదురు చూడాల్సి వచ్చేది. వర్షాల సమయంలో అయితే ఆర్బీకే సిబ్బంది నుంచి వీఆర్వో, జిల్లాస్థాయి అధికారుల వరకూ గ్రామాల్లోనే ఉండి ధాన్యం కొన్నారు. రోజుకు 25 వాహనాల్లో ఊరిలో మొత్తం ధాన్యాన్ని తరలించేశారు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో నాకు మంచి దిగుబడి వచ్చింది’ అని బలరామరాజు వివరించారు. -
రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలు
కరీంనగర్‌రూరల్: యాసంగి పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,100 కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్ గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లైచైర్మన్ రవీందర్‌సింగ్‌తో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ రెండో పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. యాసంగి పంట ముందుగా కోతకు రావడంతో సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కేంద్రాలను ఏర్పాటు చేయ నున్నామని, ఇప్పటివరకు 420 కేంద్రాలను ఏర్పా టు చేసి రూ.4.15కోట్ల విలువైన 2వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. అవ సరమైన ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించేందు కు కలెక్టర్లకు ఆదేశాలిచి్చనట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సురేశ్ పాల్గొన్నారు. మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లో ఆదివారం కొందరు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం శ్రీసీతారాముల పట్టాభిõషేకం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మంత్రి గంగుల హాజరై వేదికపైకి చేరుకున్నారు. ఆయనతోపాటు సివిల్ సప్లైచైర్మన్ రవీందర్‌సింగ్ కూడా ఉన్నారు. అయితే అప్పటికే పెద్దసంఖ్యలో మహిళలు వేదికపైకి ఉన్నారు. గంగుల, రవీందర్‌సింగ్‌తోపాటు స్థానిక నాయకులు వేదికపైకి వెళ్లడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో మంత్రి గంగుల కమలాకర్ ఎడమకాలుకు గాయమైంది. రవీందర్‌సింగ్, జెడ్పీటీసీ లలిత స్వల్పంగా గాయపడ్డారు. పడిపోయిన మంత్రి వెంటనే గన్మెన్లు, నిర్వాహకులు పైకి లేపి ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. -
క్వింటాల్ పసుపు రూ. 6,850
సాక్షి, అమరావతి: పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. 2022–23 సీజన్ కోసం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,850లుగా పేర్కొంది. రాష్ట్రంలో పసుపు 30,518 హెక్టార్లలో సాగవుతోంది. ఏటా 3.50 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కకపోవడంతో 2019–20లో రూ.342.75 కోట్ల విలువైన 50,035 టన్నుల పసువును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు మంచి రేటు పలుకుతోంది. గడిచిన సీజన్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ రూ.7,900కు పైగా పలికింది. ప్రస్తుతం క్వింటాల్ రూ.6,500కు పైగా పలుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో మార్కెట్లో పసుపునకు రేటు పెరిగే అవకాశం కన్పిస్తోంది. రైతుకు అండగా ఉండేందుకే: మంత్రి కాకాణి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మద్దతు ధర ప్రకటించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మద్దతు ధర ప్రకటిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. పసుపు కొనుగోలు కోసం కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.6,850లుగా ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. పసుపు రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. -
జీసీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 5 సాధించి సత్తా చాటింది. రెండు విభాగాల్లో మొదటి ర్యాంకు, ఒక విభాగంలో రెండో ర్యాంకు, మరో రెండు విభాగాల్లో మూడో ర్యాంకు లభించాయి. ► ప్రతిస్పందన విభాగంలో.. గిరిజనుల కోసం ప్రధానమంత్రి వన్ ధన్ వికాస్ యోజన కేంద్రాలు, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల (ఎంఈపీ)కు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను అందించడంలోను దేశంలోనే టాప్‌లో నిలిచి మొదటి ర్యాంకు సాధించింది. ► రిటైల్ అండ్ మార్కెటింగ్ విభాగంలో.. సేంద్రియ, సహజ ఆహార ఉత్పత్తుల సరఫరాలోను జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు గెల్చుకుంది. ► కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4 కోట్ల 50 లక్షల 74 వేల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు దక్కింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.9 కోట్ల 76 లక్షల, 27 వేల విలువైన చిన్న తరహా అటవీ ఫలసాయాలు (ఎంఎఫ్పీ) సేకరించినందుకు జాతీయ స్థాయిలో 3 వ ర్యాంకు సాధించింది. ► 2020–2021లో అత్యధికంగా రూ.12 కోట్ల 86 లక్షల 12 వేలను వినియోగించినందుకు దేశంలోనే 3 వ ర్యాంకు దక్కించుకుంది. సీఎం మార్గనిర్దేశం.. సిబ్బంది అంకితభావంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశం, అధికారులు, సిబ్బంది అంకితభావం వల్లే జీసీసీకి 5 అవార్డులు దక్కాయి. కరోనా కష్టకాలంలోను ఉత్తమ పనితీరుతో జీసీసీ అధికారులు, సిబ్బంది అధికంగా వ్యాపార వ్యవహారాలను నిర్వహించగలిగారు. అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు 2019–20లో రూ.13.18 కోట్లు, 2020–21లో రూ.76.37 కోట్లు ఖర్చుచేశాం. జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు 2019–20లో రూ.24.22 కోట్లు జరగ్గా, 2020–21లో రూ.33.07 కోట్లకు పెరిగాయి. 2019–20లో జీసీసీ రూ.368.08 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేయగా, 2020–21లో తీవ్రమైన కరోనా నేపథ్యంలోను రూ.450.68 కోట్ల మేరకు వ్యాపారం చేయగలిగింది. – పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి జాతీయస్థాయిలో సత్తా చాటింది జాతీయస్థాయి ర్యాంకింగ్ల్లో జీసీసీ సత్తా చాటింది. పలు విభాగాల్లో ఏకంగా 5 జాతీయ అవార్డులు రావడం ఎంతో గర్వకారణం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జీసీసీలు పలు విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు కేంద్ర ట్రైఫెడ్ సంస్థ ఈ అవార్డులను అందిస్తుంది. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల్లోను అటవీ ఉత్పత్తుల సేకరణలో జీసీసీ పటిష్టమైన కార్యాచరణ చేపట్టింది. అటవీ ఉత్పత్తుల అమ్మకాల్లో రాష్ట్రంలోని గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమన్వయం, పర్యవేక్షణతోనే ఇంత గొప్ప రికార్డును సాధించడానికి సాధ్యమైంది. – పీఏ శోభ, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్, విశాఖపట్నం -
లోగ్రేడ్.. లో రేట్
కందుకూరు: అసలే ప్రకృతి వైపరీత్యాలతో పొగాకు నాణ్యత తగ్గింది. దానికి తోడు కరోనా వైరస్ పుణ్యమా అంటూ 50 రోజులకు పైగా వేలం నిలిచిపోయింది. అంతంత మాత్రంగా ఉన్న నాణ్యత కాస్త వేలం విరామంతో మరికాస్త దిగజారింది. రంగు మారి బ్రైట్‌గ్రేడ్ రకం కూడా లోగ్రేడ్ రకంలోకి మారిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ ఏడాది రైతుల వద్ద లోగ్రేడ్ ఉత్పత్తులే అధికంగా ఉన్నాయి. కానీ వీటిని అమ్ముకోవాలంటే రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన లోగ్రేడ్ పొగాకు బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేయరు. ఒకవేళ కొనుగోలు చేసినా ధర రాదు. ఇదీ ప్రస్తుతం పొగాకు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి. జిల్లాలో ఈ ఏడాది మొత్తం 91.78 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. దాంట్లో ఇప్పటి వరకు 31.5 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. లోగ్రేడ్ రకం కొనుగోలు చేయని వ్యాపారులు: ఈ ఏడాది వేలం ప్రారంభంలోనే పొగాకు నాణ్యతపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. బ్రైట్‌గ్రేడ్ కేవలం 40 శాతం మాత్రమే వచ్చిందనేది బోర్డు అధికారుల అంచనా. డిసెంబర్, జనవరి నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పొగాకు నాణ్యత దెబ్బతిని క్యూరింగ్‌లో మీడియం, లోగ్రేడ్ రకం ఉత్పత్తులు అధికంగా వచ్చాయి. దాదాపు 50 శాతం వరకు లోగ్రేడ్ ఉత్పత్తులు వచ్చాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వేలంలో లోగ్రేడ్ రకం ఉత్పత్తులకు సరైన ధర దక్కితేనే రైతులు నష్టాల నుంచి బయటపడగలరు. కానీ పొగాకు వేలంలో పరిస్థితి పూర్తి భిన్నంగా నడుస్తోంది. బ్రైట్‌గ్రేడ్ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారే తప్పా లోగ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి వేలం కేంద్రంలో రోజూ వందల సంఖ్యలో లోగ్రేడ్ బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉదాహరణకు కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో శనివారం 784 బేళ్లను వేలానికి ఉంచితే 634 కొనుగోలు చేయగా 150 బేళ్లను తిరస్కరించారు. అలాగే రెండవ వేలం కేంద్రంలో 719 బేళ్లను గాను 609 కొనుగోలు చేయగా 110 బేళ్లను తిరస్కరించారు. ప్రతి రోజు ఇదే తీరుగా వందల సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీని వల్ల రైతులకు అదనపు భారంగా మారుతోంది. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం ఒకెత్తు అయితే తిరిగి తమ క్లస్టర్ వంతు వచ్చే వరకు వేచిచూడాల్సిన వస్తోంది. ఒక క్లస్టర్ వంతు తిరిగి వేలానికి రావాలంటే కనీసం నెల రోజులకుపైగానే పడుతోంది. ఇలా బేళ్లను ఇంటిలోనే ఉంచుకోవడం వల్ల ఆ ఉత్పత్తుల నాణ్యత మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ధర విషయం మరీ దారుణంగా ఉంది. లోగ్రేడ్ ఉత్పత్తుల విషయంలో సిండికేట్‌గా మారి న వ్యాపారులు గిరిగీసినట్లు ఒక రేటును దాటడం లేదు. కేవలం రూ.80 మాత్రమే చెల్లిస్తున్నారు. గత నెల రోజుల వేలం ప్రక్రియలో లోగ్రేడ్ రకం పొగాకుకు ఇదే ధర లభిస్తోంది. ఒక్క రూపాయి పెరగడం లేదు, తగ్గడం లేదు. అదీ లేకపోతే వేలంలో కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. దీంతో ఈ ఏడాది అధికంగా ఉన్న లోగ్రేడ్ ఉత్పత్తులను అమ్ముకోవడం రైతులకు గగనంగా మారుతోంది. అమ్ముకున్నా వ్యాపారులు చెప్పిన రేటుకు ఇచ్చేయాల్సిందే. వేలం ఆలస్యంతో మరింత నష్టం: కరోనా వైరస్ లేకుంటే ఇప్పటికే వేలం ప్రక్రియ చివరి దశలో ఉండేది. కానీ ఈ ఏడాది ఇంకా మరో రెండు నెలలకు వేలం ముగిసినా ముగిసినట్టే. ప్రస్తుతం కొనుగోలు చేసిన ఉత్పత్తులు ఇంకా మిగిలిన ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం. కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో 8.4 మిలియన్లు, రెండవ వేలం కేంద్రంలో 7.2 మిలియన్ల వరకు అధికారిక కొనుగోళ్లు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దాదాపు 3 మిలియన్ల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేశారు. ఇవిపోను అనధికారిక ఉత్పత్తులు కూడా ఉంటాయి. అంటే ఇంకెంత సమయం పడుతుందో ఊహించవచ్చు. దీని వల్ల ఉత్పత్తుల రంగు మారి అంతిమంగా రైతులకు నష్టం చేకూరుతుంది. అసలే లోగ్రేడ్ కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఇష్టపడడం లేదు. ఈ పరిణామం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బ్రైట్ గ్రేడ్ రూ.200లకు కొనుగోలు చేస్తున్నా, లోగ్రేడ్ రూ.80లు దాటడం లేదు. దీంతో సరాసరి రేట్లు కూడా రూ.140లు మించి రావడం లేదు. ప్రత్యక్ష వేలంలోకి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు వేలంలో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై 1వ తేదీ నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ప్రధానంగా వ్యాపారులు కూటమిగా మారి ధరలు పెంచకపోవడం, లోగ్రేడ్ ఉత్పత్తులను తిరస్కరిస్తుండడంతో ప్రభుత్వం వేలంలోకి అడుగు పెడుతోంది. రేట్లు రాని ఉత్పత్తులను రైతులకు మద్దతు ధర వచ్చేలా వేలంలో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. అంటే లోగ్రేడ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల వ్యాపారులు కూడా కచ్చితంగా లోగ్రేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బోర్డు పరిధిలో రిజిస్టర్ అయి వేలంలో పాల్గొనని వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో వేలంలో పాల్గొనే వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలా మొత్తం మీద ప్రభుత్వమే స్వయంగా పొగాకు వేలంలోకి రావడం వల్ల ధరలు పెరుతాయనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ వ్యాపారులు ధరలు పెంచేందుకు ముందుకు రాకపోయినా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. దీని వల్ల ఇక రైతులు నష్టపోయే అవకాశం లేకుండా ఉంటుంది. అన్ని రకాల ఉత్పత్తులను మద్దతు ధరలకు వేలం కేంద్రాల్లోనే నేరుగా అమ్ముకునే అవకాశం వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ధర వెలవెల! రైతు విలవిల
సాక్షి, అమరావతి: పేదోడి పండుగా పిలిచే అరటికి ఇప్పుడు గడ్డురోజులు వచ్చాయి. గిట్టుబాటు ధరలేక దానిని సాగు చేస్తున్న రైతులు విలవిల్లాడుతున్నారు. నెల కిందట రూ.17 వేలు పలికిన టన్ను కాయలు ప్రస్తుతం రూ.12 వేలకు పడిపోవడమే కారణం. కొన్ని ప్రాంతాలలో గెలకు రూ.50 కూడా రాకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే వాటిని వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో అయితే కాయ కోయడం కూడా వృధా అని రైతులు వదిలేస్తున్నారు. శుభకార్యాలు లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పులు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అరటిసాగు పెరగడం, బెంగాల్ నుంచి ఒడిశాకు అధిక మొత్తంలో దిగుమతులు పెరగడం ధరలు పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు. అరటి సాగులో ఏపీది 4వ స్థానం దేశంలో అధికంగా అరటి సాగుచేసే రాష్ట్రాల్లో ఏపీది నాలుగో స్థానం. ఇక్కడ సుమారు 1,12,995 హెక్టార్లలో సాగవుతోంది. అరటి సాగుచేసే జిల్లాల్లో 35,620 హెక్టార్లతో వైఎస్సార్ కడప అగ్రస్థానంలో ఉంది. ఇక రాష్ట్రం నుంచి ఏటా 63,84,730 టన్నుల అరటి దిగుబడి వస్తుందని అంచనా. కాగా, మన రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లయిన రావులపాలెం, రాజంపేట, పులివెందుల, అనంతపురం, తెనాలి వంటి కేంద్రాల నుంచి బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్లకు అరటి ఎగుమతి అవుతుంది. మార్కెట్లలో పరిస్థితి ఎలా ఉందంటే.. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 16,400 హెక్టార్లలో అరటి సాగవుతోంది. హెక్టార్‌కు 62 టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. నెల కిందట మేలి రకం అరటి టన్ను రూ.17వేలు పలికింది. ఇప్పుడది రూ.13 వేలకు, రూ.12 వేలు పలికిన రెండో రకం ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. పులివెందులలో టన్ను ధర రూ.11, రూ.12 వేల మధ్య ఉంది. ఎగుమతులు తగ్గడానికి చలి తీవ్రతే కారణంగా చెబుతున్నారు. ఇక.. తెనాలి మార్కెట్లో పెద్ద గెల (పది అత్తాలు) రూ.50 నుంచి రూ.60 మధ్య ఉంది. చిన్న గెలయితే కేవలం రూ.25, మరీ చిన్నదైతే రూ.15లకు అమ్ముడవుతున్నాయి. కానీ, విడిగా అయితే డజను కాయలు సైజును బట్టి మార్కెట్లో రూ.30, రూ.50 పలుకుతున్నాయి. రావులపాలెం మార్కెట్లో ఇలా.. ఇదిలా ఉంటే.. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 32,418 హెక్టార్లలో అరటి సాగవుతోంది. ఇక్కడి రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో కూడా అరటి ధరలు దారుణంగా పతనమయ్యాయి. ముహూర్తాలు, శుభకార్యాలు లేకపోవడం, కర్పూర రకం అధికంగా సాగు చేయడంతో ధరలు తగ్గాయి. దీనికి తోడు విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం అరటి పంట అందివచ్చింది. సీజన్లో ఈ యార్డుకు రోజుకు 35–40 వేల గెలలు వచ్చేవి. తమిళనాడు, ఒడిశా, బీహార్, తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 40 లారీల సరుకు రవాణా అయ్యేది. కానీ, ప్రస్తుతం అది 20–25 లారీలకు పడిపోయింది. దీంతో కొనుగోళ్లు లేక రైతులు తాము తెచ్చిన గెలలను యార్డులోనే వదిలి వెళ్లాల్సిన దయనీయ స్థితి నెలకొంది. రూ.150 కూలీ చెల్లించి తీసుకువచ్చిన ఆరు గెలలకు (లోడు) రూ. 200 కూడా ధర పలకక రైతులు తీరని నష్టాలు ఎదుర్కొంటున్నారని అరటి వ్యాపారి కోనాల చంద్రశేఖరరెడ్డి అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి మాది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల. నాలుగు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నా. కాయ బాగా వచ్చిన తర్వాత ధర లేదు. టన్నుకు కనీసం రూ.15 వేలు అయినా ఉంటే తప్ప గిట్టుబాటు కాదు. కానీ, రూ.13 వేలు కూడా రావడంలేదు. పోయిన నెలలో రూ.17 వేలకు అమ్మాం. ధరల స్థిరీకరణ నిధితో ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. – టి. నారాయణస్వామి,అరటి రైతు -
పంటకు ముందే ‘మద్దతు’!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అంకాపూర్.. ఇదో ఆదర్శ గ్రామం. గ్రామస్తుల ఐకమత్యంతో ఎన్నో అద్భుతాలు సృష్టించి.. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొని మార్గదర్శకంగా నిలుస్తోంది. అనేక స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్న ఈ గ్రామంలో ఈసారి రైతులు సంఘంగా ఏర్పడి పంటకు ముందే మద్దతు ధర నిర్ణయించారు. ‘ఇక పంటకు మద్దతు ధర నిర్ణయించేది వ్యాపారులు కాదు.. మేమే’అంటూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పైగా పండించబోయే (మార్చిలో చేతికందే) పంటకు ముందే ధర ప్రకటించారు. ఈ మేరకు వ్యాపారులను గ్రామాలకు పిలిచి ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఎర్రజొన్న (గడ్డి విత్తనం) ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సాగవుతుంది. ఏటా తమ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ కష్టాలను అధిగమించేందుకు అంకాపూర్ లో రైతులంతా ఏకమయ్యారు. ఈ రబీ సీజనులో సుమారు 1,300 ఎకరాల్లో ఎర్రజొన్న పంటను సాగు చేయాలని నిర్ణయించారు. సుమారు 1,400 టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనాకొచ్చిన రైతులు.. విత్తన వ్యాపారులతో సంప్రదింపులు జరిపారు. తమ పంటకు వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. 15 మంది విత్తన వ్యాపారులు, సీడ్ కంపెనీలు ఈ గ్రామానికి వచ్చి వేలంలో పాల్గొనగా.. 200 టన్నుల చొప్పున ఏడుగురు వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చిలో చేతికందే తమ ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు రూ.2,600 చొప్పున కొనుగోలు చేసేలా విత్తన వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. పంట విలువలో పది శాతం మొత్తాన్ని అడ్వాన్సు రూపంలో తీసుకుని పంటను సాగు చేస్తున్నారు. తీరా పంట పండిన తర్వాత మార్కెట్లో ఆ ధర లేదంటూ వ్యాపారులు చేతులెత్తేయకుండా ముందు జాగ్రత్తగా పేరున్న వ్యక్తుల జమానతు తీసుకున్నారు. -
మద్థతు ధర కోసం జాతీయ రహదారిపై ధర్నా
నిజామాబాద్: పసుపు, ఎర్రజొన్నలకు మద్ధతు ధర ప్రకటించాలని కోరుతూ జక్రాన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై రైతులు భారీ ధర్నాకు దిగారు. ఉదయం నుంచి ధర్నా కొనసాగుతోంది. కోలాటాలు వేస్తూ జాతీయరహదారిపై కూర్చుని రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు రైతులు ధర్నా విరమించేది లేదంటున్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్‌లో కూడా జాతీయ రహదారిపై 7 గంటలుగా ఆందోళన కొనసాగుతోంది. కలెక్టర్ వచ్చే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
సేకరణ లక్ష్యం
సాక్షి, వరంగల్ రూరల్: అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఖరీఫ్‌లో పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టనున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కలెక్టర్ ముండ్రాతి హరిత, జేసీ మహేందర్ రెడ్డి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. జిల్లాలో 102 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పీఏసీఎస్–67, ఐకేపీ–33, జీజేసీ–2 ఏర్పాటు చేయనున్నారు. ఖరీఫ్‌లో 20 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. దిగుబడి దాదాపు 1.35 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం ఏ గ్రేడ్‌కు రూ.1,770, సాధారణ రకం రూ.1,750 ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష టన్నులు కొనుగోలు లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల్లోనే డబ్బులు... గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీంతో అన్నదాతలు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు పంటలను విక్రయించేవారు. ప్రభుత్వం గత విధానాలకు స్వస్తి పలుకుతూ రెండు, మూడు రోజుల్లోనే అన్నదాతలకు డబ్బులు అందజేసేలా చర్యలు తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోలు చేసే మహిళా సంఘాలకు ట్యాబ్‌లు అందజేసి, కొనుగోళ్లు ఏ విధంగా చేయాలి, వివరాల క్రోడీకరణ, బ్యాంకు ఖతాల సేకరణ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో కేంద్రాల్లో పంటను విక్రయించిన అన్నదాతల వివరాలను ఖాతాల్లో నిక్షిప్తం చేశారు. లాగిన్‌లో రైతు వివరాలు పొందుపర్చిన తర్వాత పౌరసరఫరాల సంస్థకు వివరాలను అందజేస్తారు. అనంతరం డీఎం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆన్లైన్లో జరగడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 26.50 లక్షల గన్నీ బ్యాగులు ఈ సారి 26.50 లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచబోతున్నారు. గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే 9.50 లక్షల బ్యాగులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించేందుకు తూకం మిషన్లు, గన్నీ బ్యాగుల కోసం ఐదుగురు కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు.17 లక్షల బ్యాగులు ఇంకా రావాల్సి ఉంది. ఆరబెట్టి తీసుకురావాలి.. రైతులు పంట పొలం నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురాకుండా ఆరబెట్టి తీసుకురావాలి. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకుండా తీసుకరావాలని అధికారులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టకుండ తమ పొలాల వద్దనే ఆరబెట్టుకుని తీసుకరావాలని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నాం.. నవంబర్ మొదటి వారం నుంచి పంట చేతి కొస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ సారి రెండు రోజుల్లోనే డబ్బులు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలు చేయరు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. రైతులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తాయి. –వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ -
మద్దతు ఉత్తదేనా ?!
ఈ ఏడాది ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1,700గా మద్దతు ధర ప్రకటించింది. కానీ బాదేపల్లి మార్కెట్లో క్వింటా ధర గరిష్టంగా రూ.1,404 దాటకపోగా.. కనిష్టంగా రూ.1,051 మాత్రమే లభించింది. ఇక వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1,750 నుంచి రూ.1,770 వరకు అందాల్సి ఉన్నా 1,650 దాటడం లేదు. సాగు వ్యయం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మద్దతు దక్కేలా చూడాలని.. లేనిపక్షంలో ప్రభుత్వమే నేరుగా తమ నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. వారి ఆశ ఈ ఏడాది ఫలిస్తుందో లేదంటే ఎప్పటిలాగే అరణ్యఘోషగానే మిగులుతుందో వేచి చూడాల్సిందే.... జడ్చర్ల : పంట ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతులకు అందడం లేదు. 2018–19 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కొంత ఆశాజనకంగానే ఉన్నా అవి కూడా రైతులకు దక్కక పోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే పంట దిగుబడులు మార్కెట్‌కు వస్తున్న వేళ దిగుబడులకు లబిస్తున్న ధరలను చూసి రైతులు నివ్వెరపోవాల్సి వస్తుంది. అసలే ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలను నష్టపోయిన రైతాంగం మార్కెట్లో లబిస్తున్న ధరలను చూసి ఖంగుతింటున్నారు. కనీసంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు దక్కుతాయని ఆశించిన వారికి తక్కువ ధరలు కేటాయిస్తుండడంతో తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పెరిగిన సాగు వ్యయం ఒక వైపు భారీగా పెరిగిన ఎరువుల ధరలతో పాటు రోజురోజు ఆకాశాన్ని తాకుతున్న డీజిల్, పెట్రోలు ధరలు రైతులను కుదేలు చేస్తున్నాయి. వీటికి తోడు పురుగు మందుల ధరలతో పాటు కూలీల వ్యయం కూడా తడిసి మోపెడవుతోంది. ఇలాంటి కారణాలతో సాగు వ్యయం భారంగా మారింది. అయితే, సాగు వ్యయానికి తగ్గట్లుగా దిగుబడులు రాకపోవడం.. కాస్తోకూస్తో వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభించక పోవడంతో రైతాంగం కుంగిపోతోంది. ఇక వంటగ్యాస్, నిత్యావసర ధరలు కంటికి కునుకు పట్టకుండా చేస్తున్న తరుణంలో పంట ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను చూసిన రైతాంగం తీవ్ర అసహనానికి గురవుతోంది. దీంతో ఈ ఏడు కూడా రైతులకు గిట్టుబాటు ధరలు లభించే పరిస్థితులు కనిపించడం లేదని పలువురు పేర్కొన్నారు. సాగు వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కనీసంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు దక్కుతాయని భావించిన రైతులకు మార్కెట్లలో నిరాశే ఎదురవుతోంది. మక్కకు దక్కని మద్దతు బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధరలు దక్కడం లేదు. వారం, పది రోజులుగా యార్డుకు మొక్కజొన్న, తదితర పంట దిగుబడులు విక్రయానికి వస్తున్నాయి. కానీ ఆయా దిగుబడులకు రైతాం గం ఆశించిన విధంగా మద్దతు ధరల జాడ కరువైంది. వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా గరిష్టంగా క్వింటాకు రూ.1,770, కనిష్టంగా రూ.1,750 ధర అందాల్సి ఉన్నా అలా జరగడం లేదు. ఇక మొక్కజొన్నకు సంబంధించి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,700 మద్దతు ధరగా నిర్ణయించగా ఆ ధరలు మచ్చుకైనా కానరావడం లేదు. ధరలు ఇలా... బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఓ రోజు పరిశీలిస్తే... వివిధ ప్రాంతాల నుండి 2,095 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,404, కనిష్టంగా రూ.1,051 ధరలు లభించాయి. అదేవిధంగా హసం రకం ధాన్యానికి సంబంధించి గరిష్టంగా రూ.1,650, కనిష్టంగా రూ.1,556 ధర లభించింది. అలాగే, ఆముదాలకు గరిష్టంగా రూ.4,154, కనిష్టంగా రూ.2,924 ధర లభించడం గమనార్హం. కొనుగోలు కేందాలతోనే లాభం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రటించినా ఇప్పటి వరకు అడుగు వేయలేదు. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి కూడా కొనుగోలు కేంద్రాలను ఎక్కడా ప్రారంభించకపోవడంతో రైతులు తమ దిగుబడులను తక్కువధరలకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అదికారులు స్పందించి త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ముంచెత్తనున్న మొక్కజొన్న
మార్కెట్ ధర కంటే సర్కారు కొనుగోలు చేస్తున్న కనీస మద్దతు ధర ఎక్కువగా ఉండటంతో రైతులు మక్కలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ముందస్తుగా కోత కొచ్చే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అధికార యం త్రాంగం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించింది. ఇప్పటి వరకు 8,686 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సర్కారు కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న ముంచెత్త నుంది. గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజను కంటే ఈ సారి సుమారు రెండింతలకు మించి కొనుగోళ్లు పెరిగే అవకాశాలున్నట్లు అధికార యం త్రాంగం భావిస్తోంది. మార్కెట్ ధర కంటే సర్కా రు కొనుగోలు చేస్తున్న కనీస మద్దతు ధర ఎక్కువగా ఉం డటంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కిక్కిరిసి పోతున్నాయి. ముందస్తుగా కోత కొచ్చే ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాలను దృష్టిలో ఉం చుకుని అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. క్వింటాలుకు రూ.300 ఎక్కువ ప్రభుత్వం మొక్కజొన్న కనీస మద్దతు ధర క్విం టాలుకు రూ.1,425 నుంచి రూ.1,700 పెంచింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మాత్రం క్వింటాలుకు రూ.1,300 నుంచి రూ.1,400 మిం చి ధర పలకడం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఇంతకు మించి ధర ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. అలాగే ఫౌల్ట్రీ యజమానులు సైతం రూ.1,400 మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు సర్కారు కేంద్రాలకే ఎక్కువగా మొక్కజొన్నను తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న పంటనే అధికం గా సాగు చేస్తారు. ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొం డ, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బా న్సువాడ ప్రాంతాల్లో ఈ పంట అధికంగా సాగు చేస్తారు. ఈ ఖరీఫ్ సీజనులో సుమారు 1.17 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది. సుమారు పది లక్షల క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కేంద్రాలకు వస్తుందని అంచనా వేసిన అధికారులు ఈ మేరకు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. మొత్తం 92 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు, ఇప్పటికే నాలుగు కేంద్రాల్లో సేకరణ షురూ చేశారు. ఇప్పటి వరకు 8,686 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గత ఏడాది కొనుగోళ్లు.. గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి 3.59 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో 1.75 లక్షల క్వింటా ళ్లు, కామారెడ్డి పరిధిలో 1.84 లక్షల క్వింటాళ్లు సేకరించారు. ఈసారి ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు పది లక్షల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఈ కేంద్రాలను 92 వరకు పెంచాలని నిర్ణయించారు. ఈసారి కూడా కొనుగోళ్ల బాధ్యతలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. మొక్కజొన్న సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. రైతులకు ఇబ్బందులు రాకుండా పది లక్షల గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచాము. కొనుగోలు చేసిన మొక్కజొన్నను నిల్వ చేసేందుకు 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను ఎంపిక చేశాము. ఈసారి ప్రైవేటు గోదాముల్లో కాకుండా, వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములనే వినియోగిస్తున్నాము. ఈ కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.– చంద్రశేఖర్‌గౌడ్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ -
రబీ ప్రణాళిక సిద్ధం
ఆదిలాబాద్‌టౌన్: వ్యవసాయ శాఖ అధికారులు రబీ ప్రణాళిక కోసం యాక్షన్‌ప్లాన్ తయారీలో నిమగ్నం అయ్యారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. గతేడాది వర్షాభావ పరిస్థితులు, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ యేడాది జూన్‌లోనే వర్షాలు పుష్కలంగా కురిసాయి. పంటలకు ఆశాజనకంగా ఉండగా, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతియేటా అన్నదాతలు ప్రకృతి వైఫరీత్యాలు, దళారుల చేతిలోనూ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. దిగుబడులు బాగా వస్తే పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల చేతిలో మోసాలకు గురికావడం మనం చూస్తూనే ఉన్నాం. గిట్టుబాటు ధరలు లభించే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో పంటలు నష్టపోవాల్సిన దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. యాసంగిపైనే ఆశలు.. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 24వేల హెక్టార్లలో పత్తి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాతలు యాసంగిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాలు ఉన్నాయి. తాంసి మండలంలో మత్తడి ప్రాజెక్టు, జైనథ్ మండలంలో సాత్నాల ప్రాజెక్టు మినహా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. రబీలో బోరుబావులపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తారు. గతంలో అరకొర నీటివనరులు, విద్యుత్ సమస్య ఉండేది. ప్రస్తుతం వర్షాలతో చెరువులు, కుంటలు, బావులు నిండి ఉన్నాయి. నీటి సదుపాయం ఉన్న రైతులు ఖరీఫ్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు రబీ సీజన్లో శనగ, వేరుశనగ, మొక్కజొన్న, తదితర పంటలపైనే పెద్ద మొత్తంలో ఆశలు పెట్టుకున్నారు. 23వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం అంచనా.. జిల్లాలో ఈ యేడాది రబీలో 23వేల హెక్టార్లలో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 18వేల హెక్టార్లలో శనగ, వెయ్యి హెక్టార్లలో వేరుశనగ, 2వేల హెక్టార్లలో జొన్న, 500 హెక్టార్లలో మొక్కజొన్న, 1500 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శనగ విత్తనాల ధర క్వింటాలుకు రూ.6,500 ఉండగా, 50 శాతం సబ్సిడీపై రూ.3250కి రైతులకు అందించనున్నారు. మిగతావి కూడా సబ్సిడీపై అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా రబీ కోసం ఎరువులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంటున్నారు. యూరియా 9వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 4500 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 2300 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 6500 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 250 మెట్రిక్ టన్నులు, మొత్తం 23,150 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 24వేల హెక్టార్లలో ఖరీఫ్ పంట నష్టం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 24వేల హెక్టార్లలో పంటలకు నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పంట చేతికొచ్చే సమయంలో పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు పంటలు నష్టపోయి దిగుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొందని దిగాలు చెందుతున్నారు. జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 780 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా 1142 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని అధికారులు చెబుతున్నారు. ప్రతియేటా ఏదో విధంగా రైతులు నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. అందుబాటులో ఎరువులు, విత్తనాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రబీ కోసం ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నాం. అక్టోబర్ మొదటి వారం నుంచి సబ్సిడీ విత్తనాల కూపన్లను క్లస్టర్ల వారీగా పంపిణీ చేయనున్నాం. గతంలో విత్తనాలు 33శాతం సబ్సిడీ అందించగా, ఈసారి 50శాతం సబ్సిడీతో పంపిణీ చేయనున్నాం. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఆశకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
ప్యాడీ క్లీనర్లు లేనట్లే!
‘‘కడ్తా పేరుతో తూకంలో కోతకు అడ్డుకట్ట వేసేందుకు ఖరీఫ్ కొనుగోలు సీజను నాటికి జిల్లాలో 90 అధునాతన ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేస్తాం.. సహకార సంఘా ల ద్వారా 50, మార్కెటింగ్ శాఖ ద్వారా 40 ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేస్తాం.. ముందుగా ధాన్యం వచ్చే కొనుగోలు కేంద్రాల్లో వీటిని అందుబాటులో ఉంచుతాం ’’ ఇదీ గత రబీ కొనుగోలు సీజనులో రైస్‌మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అడ్డగోలు దోపిడీని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు గత మే నెలలో తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ఖరీఫ్ కొనుగోలు సీజనులో కూడా మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గత సీజనులో రైస్‌మి ల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ‘కోత’ పేరిట భారీగా దండుకుంటున్నారు. తాలు పేరుతో క్వింటాలుకు రెండు నుంచి ఐదు కిలోల వరకు తూకంలో కోత విధించారు. జిల్లా ఉన్నతాధికారులు మిల్లర్లకు వత్తాసు పలకడంతో కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు యథేచ్చగా కొనసాగాయి. ఈ ఖరీఫ్ సీజన్లో కూలీలు అవసరం లేని అధునాతన ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేసి ఇలాంటి అక్రమాలకు చెక్ పెడతామని అధికారులు ప్రకటించారు. కానీ వీటిని తెప్పించడంలో విఫలమయ్యారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు.. అక్టోబర్ మొదటి వారం నుంచి జిల్లాలో ధాన్యం రాక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నా రు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈసారి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుగా వరి కోతలు జరిగే కో టగిరి, వర్ని, బాన్సువాడ, బోధన్ తదితర ప్రాం తాల్లో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కేంద్రాలను ప్రారంభించి, కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గన్నీ బ్యాగులు, ధాన్యం రవాణా ఏర్పాట్లను వెంట వెంటనే పూర్తి చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. తేమ పేరుతో.. ఈసారి మాయిశ్చర్ (తేమ) పేరుతో రైతులను నిండా ముంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎఫ్ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం వరకు అనుమతి ఉంటుంది. అయితే, గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో ఈ తేమ శాతాన్ని సాకుగా చూపి పెద్ద ఎత్తున దోపిడీకి తెర లేపారు. తూకం లో క్వింటాలుకు రెండు నుంచి ఐదు కిలోల వరకు కోత విధించి రైతులను నిండా ముంచారు. పీఏసీ ఎస్ చైర్మన్ల కనుసన్నల్లోనే ఈ కొనుగోలు కేంద్రా లు నడిచాయి. రైస్ మిల్లర్లతో కుమ్మక్కైన ఈ కేం ద్రాల నిర్వాహకులు కడ్తా పేరుతో దోపిడీకి తెర లేపారు. సీజను మొత్తానికి రూ.కోట్లలో రైతులు నష్టపోయారు. ఈసారి తేమ పేరుతో దోపిడీ జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం కట్టడి చే యాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి గత సీజన్ల మాదిరి గానే రైస్‌మిల్లర్లకు వత్తాసు పలికితే ఈసారి కూడా ధాన్యం రైతులు నిండా మునగడం ఖాయం. రబీ సీజన్ నాటికి అందుబాటులోకి తెస్తాం ఈ సీజను నాటికే ప్యాడీ క్లీనర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. వీటి అవసరం ఇప్పుడు అంతగా ఉండదు. వచ్చే రబీ సీజన్ నాటికి వీటిని అందుబాటులో ఉంచుతాం. వీటి అవసరం రబీ సీజన్లోనే ఎక్కువగా ఉంటుంది. – హరికృష్ణ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం -
కంది.. దిగజారింది
ఖమ్మంవ్యవసాయం: రైతులు కంది సాగుకు దూరమవుతున్నారు. సాగు ఖర్చులు పెరిగిపోవడం, పండిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో ఏడాదికేడాది సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. రైతులు వర్షాధారంగా మెట్ట భూముల్లో, మిశ్రమ పంటగా కూడా పంటను అధికంగా సాగు చేస్తుంటారు. ఖరీఫ్ సీజన్లో తొలకరి సమయంలోనే పంట వేస్తారు. సాగుకు ఎకరాకు రూ.15వేలు ఖర్చవుతుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 5 క్వింటాళ్లు ఆపైన దిగుబడి వస్తుంది. వర్షాలు అనుకూలించకపోవడంతో రెండు, మూడేళ్లుగా ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలతో పండిన పంట ఉత్పత్తికి కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. పంట సాగుతో నష్టపోతున్నామని, ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర కూడా ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల కాలం ఉండే పంట కాలంలో ఎక్కువగా శ్రమించినా ఫలితం ఉండడం లేదని రైతులు పేర్కొంటున్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో కంది సాగు పరిస్థితి చూస్తే పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. గిట్టుబాటు ధర లేకపోవడమే.. కంది పంటకు ఆశించిన ధరను కేంద్రం ప్రకటించడం లేదు. పంట కాలపరిమితి, సాగుకయ్యే ఖర్చు తదితరాలను పరిగణనలోకి తీసుకొని మద్దతు ధర నిర్ణయిస్తే రైతులు సాగుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. 2015లో పత్తి పంటను విదేశాలకు ఎగుమతి చేయడంలో అవరోధాలు ఉన్నాయని, దేశంలో పప్పు దినుసుల పంట సాగు బాగా తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం.. పత్తి సాగును తగ్గించి.. పప్పు దినుసుల పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దీంతో పప్పు దినుసుల పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత ప్రచారం చేసింది. రైతు చైతన్య యాత్రలో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేశారు. సాగు పెంచాలని చెప్పారే తప్ప గిట్టుబాటు ధరపై స్పందించ లేదు. గత ఏడాది ఈ పంటకు కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.5,450, ఈ ఏడాది రూ.5,675 ప్రకటించింది. ఈ ధరలు వచ్చే దిగుబడులకు ఎంత మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రైవేటు వ్యాపారులు రూ.3వేల నుంచి రూ.3,500 మించి ధర పెట్టడం లేదు. ప్రభుత్వం నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా.. రైతులకు ఇవి ఎంతమాత్రం ఉపయోగపడడం లేదు. నాణ్యత నిబంధనల పేరిట రైతు పంటను తిరస్కరిస్తున్నారు. ఎకరాకు రూ.15వేల వరకు ఖర్చవుతుండగా.. పండిన పంట నుంచి రూ.10వేల ఆదాయం కూడా రావడం లేదు. అంతర పంటకు ఇష్టపడని రైతులు.. కందిని గతంలో పెసర, మినుము, మొక్కజొన్న, వేరుశనగ, పసుపు, పత్తిలో అంతర పంటగా సాగు చేసేవారు. వరి గట్లపై కూడా సాగు చేసేవారు. ప్రస్తుతం అంతర పంటగా దీనికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పత్తి చేల చుట్టూ, గట్లపై కొందరు కంది పంటను సాగు చేస్తున్నారు. కొందరు మాత్రం వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పురుగు ఆశించకుండా 4, 5 పత్తి వరుసల్లో కందిని వేస్తున్నారే తప్ప మరే పంటలో దీనిని అంతర పంటగా సాగు చేయడం లేదు. ధర లేకనే వేయట్లేదు.. కంది వేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. పెట్టుబడి కూడా రావడం లేదు. ధర మరీ దారుణంగా ఉంది. రెండేళ్లుగా ఆ పంటను వేయడం లేదు. ఎకరానికి రెండు క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్వింటాకు రూ.3వేల ధర కూడా పెట్టడం లేదు. ఆ పంట వేసి ఏమీ లాభం లేదు. – సబాటు వీరన్న, గోవింద్రాల, కామేపల్లి మండలం రైతు పంటను కొనరు.. మార్కెట్‌కు అమ్మకానికి తెస్తే పంట నాణ్యత లేదని కొర్రీలు పెడతారు. ఇదే సరుకును ప్రైవేటు వ్యాపారికి చూపిస్తే నాణ్యత లేదంటూ రూ.3వేలకు మించి ధర పెట్టడం లేదు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర కూడా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. – బాదావత్ భద్రు, పంగిడి, ముదిగొండ మండలం -
అయ్యో రైతన్నా..బె‘ధరా’ల్సిందేనా!
మధిర(ఖమ్మం): ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటకు మంచి ధర వస్తుందని కొన్ని నెలలుగా కోల్డ్ స్టోరేజీల్లో సరుకు నిల్వ చేసిన రైతులు బెదిరిపోయేలా, గుండెధైర్యం చెడేలా ఇంకా రేటు పతనమవుతోంది. గత ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మిర్చి పంటలో చాలా వరకు నిల్వ చేశారు. అప్పుడు క్వింటా ధర రూ.9,500 పలికింది. అయితే పెట్టుబడి భారం పెరగడంతో ఆ రేటుతో గిట్టుబాటు కాదని ఎక్కువమంది సాగుదారులు మిర్చిని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ నడుస్తున్న తరుణంలో వ్యవసాయ పెట్టుబడి అవసరాల రీత్యా..అప్పటి మిర్చిని అమ్ముకోవాలనుకుని మార్కెట్‌కు తెస్తుండగా డిమాండ్ ఉండట్లేదు. ప్రస్తుతం క్వింటాకు రూ.8,500 మాత్రమే రేటు పలుకుతోంది. అంటే..ఏడాది పాటు నిల్వ ఉంచితే..ఉన్న రేటు కూడా పడకపోగా క్వింటాకు వెయ్యి రూపాయల చొప్పున దిగజారడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. తేజ సన్నరకం మిర్చిని 70శాతం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచితే..క్వింటాకు ఆరు నెలలకు రూ.350 చొప్పున కట్టాలి. చాలామంది రైతులు..30 క్వింటాళ్ల వరకు సరుకును నిల్వ ఉంచారు. దీంతో వీరికి వేలాది రూపాయల భారం పడింది. ఇంటి నుంచి మిర్చిని శీతల గిడ్డంగి వరకు తరలించేందుకు ఎగుమతి, అక్కడ దిగుమతి, ఇతర రవాణా ఖర్చులు..కలిపి తడిసి మోపెడయ్యాయి. పైగా..వీటి ధర పెరుగుతుందనే ఆశతో, ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నారు. అంతకుముందు సంవత్సరం మిర్చి నిల్వ చేసినప్పుడు రైతులకు కలిసివచ్చింది. క్వింటాకు రూ.2వేలకు పైగానే పెరిగింది. కానీ..ఈసారి అసలు డబ్బులు కూడా రాని దైన్యం నెలకొనడంతో ఏం చేయాలో తెలియక అమ్మాలంటేనే..బెదిరిపోతున్నారు. రైతుల పరిస్థితి ఆగమాగం.. మార్కెట్లో క్వింటా ఒక్కింటికి తేజ రకాలను రూ.8,500లకు వ్యాపారులు అడుగుతున్నారు. లావు రకాలను అడిగే నాథుడే లేడు. సుమారు 6నెలలు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచి, అద్దెలు చెల్లించి, వడ్డీలు పెరిగి అప్పు తడిచిమోపెడవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటా ఒక్కింటికి వెయ్యిరూపాయలు ధర తగ్గడంతోపాటు మరో వెయ్యిరూపాయల వరకు ఖర్చులు, వడ్డీలు అవుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, చైనా, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి ఆర్డర్లు లేకపోవడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో 32 కోల్డ్‌స్టోరేజీలు ఉండగా వాటిల్లో సుమారు 20లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉన్నాయి. మరికొంతమంది చిన్నచిన్న వ్యాపారులు ధర పెరుగుతుందని కల్లాల్లో కొనుగోలుచేసి కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేయగా..వీరికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాకుండా కోల్డ్‌స్టోరేజీలో సాంకేతిక సమస్య ఏర్పడినా, మిర్చి నిల్వ చేసినప్పుడు కొద్దిగా తేమ ఉన్నా నాణ్యత తగ్గిపోయి ధర మరింత క్షీణిస్తుంది. ప్రస్తుతం వివిధ రకాల పంటలు పలు దశల్లో ఉన్నాయి. వీటికి పెట్టుబడి పెట్టేందుకు రైతులకు డబ్బులు అవసరమవుతున్నాయి. అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చిన రైతులకు వ్యాపారులు అడిగే రేటు వింటే కళ్లల్లో కన్నీరు తిరుగుతోంది. లావు రకాలపై చిన్నచూపు.. లావు రకాలైన 334, 275 తదితరాల మిర్చికి డిమాండ్ ఉండట్లేదు. గత ఖరీఫ్ సీజన్లో రూ.9000 ధర పలకగా..ఇప్పుడు 7,500కు పడిపోయింది. క్వింటాకు రూ.1500 తగ్గిపోవడంతో ఈ సరుకును అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. క్వింటాకు రూ.2వేల నష్టం.. ధర పెరుగుతుందని కోల్డ్ స్టోరేజీలో మిర్చిని నిల్వ ఉంచితే..ఇప్పుడు క్వింటాకు రూ.2వేల నష్టం వస్తోంది. మిరపనారుకు, కూలీలకు, అరకలు, ఎరువులు, పురుగుమందుల పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. కానీ మద్దతు ధర మాత్రం పెంచట్లేదు. 61బస్తాలు మే నెలలో కోల్డ్‌స్టోరేజీలో నిల్వ ఉంచా. ఆరోజు కల్లంలో రూ.9వేలకు అడిగారు. కానీ ఇప్పుడు రూ.8,500 అంటున్నారు. నెలనెలా రేటు తగ్గుతోంది. – గూడూరు ప్రభాకర్‌రెడ్డి, పెద్దకోరుకొండి, కల్లూరు మండలం పెట్టుబడికి డబ్బుల్లేవు.. ప్రస్తుతం పత్తి, మిర్చి పంటలు సాగుచేశా. వాటికి పెట్టుబడి పెట్టేందుకు చేతిలో డబ్బులు లేవు. కోల్డ్‌స్టోరేజీలో నిల్వ ఉన్న మిరప బస్తాలను అమ్ముకునేందుకు యార్డుకు వచ్చిన. లావు రకం మిర్చి కావడంతో ఎవరూ కొనట్లేదు. రైతు పరిస్థితి దిగజారుతోంది. ఇదేవిధంగా కొనసాగితే వ్యవసాయం చేయడం కష్టమే అవుతుంది. మా బాధలను పట్టించుకునే వారు కరువయ్యారు. – బండి సుబ్బారావు, దేశినేనిపాలెం, మధిర మండలం -
వ్యవసాయోత్పత్తులకు గడ్డుకాలం
వ్యవసాయ రంగంలో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2016 ఫిబ్రవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను సాఫల్యం చేయడానికి నీతి ఆయోగ్‌ను ఆదేశించారు. ప్రణాళికాబోర్డును రద్దుచేసి, దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పర్చిన తర్వాత ఈ సంస్థ ప్రతిపాదించిన సూచనలు, నివేదికలు కార్పొరేట్లకు అనుకూలంగా వున్నాయే తప్ప, సామాన్య ప్రజలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని ఆచరణ రుజువు చేసింది. రైతుల ఆదాయం రెట్టింపుచేసే బాధ్యతను తీసుకున్న నీతి ఆయోగ్ 4 సూచనలను ప్రకటించింది. 1. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించటం 2. వ్యవసాయ ఉత్పత్తులు పెంచటం 3. భూసంస్కరణలు అమలుచేసి పేదలకు భూములు పంచటం 4. రైతులకు సహాయం అందించటం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చని సూచించింది. అసలు పెరుగుదల అంటే ఏమిటి? ఏ ప్రాతిపదికగా పెరుగుదలను పరిశీలించాలి? 1. రైతుల ఆదాయం 2. ఉత్పత్తి పెరుగుదల 3. వ్యవసాయ రంగంలో అదనపు విలువ పెంపుదల 4. దేశీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల. పై నాలుగింటిలో ఏ రంగంలో పెరుగుదల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది? ఈ నాలుగు అంశాలను పరిశీలించిన నిపుణుల కమిటీ భారతదేశంలో ప్రస్తుత విధానాల ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం కానీ, రైతు ఆదాయం పెరగడం కానీ అసాధ్యమని ఈ మధ్య తేల్చారు. గిట్టుబాటు ధరలు రెండు విధాలుగా చూడాలి. 1. మార్కెట్ సంస్కరణలు 2. కనీస మద్దతు ధర నిర్ణయం. మార్కెట్ సంస్కరణల విషయంలో రాజ్యాంగం రీత్యా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్కెట్ చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చి బిల్లులు తయారుచేసి తమ తమ శాసనసభలలో ఆమోదానికి పెట్టాల్సిందిగా ఆదేశిం చింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ఆ బిల్లులను ఆమోదించాయి. ఈ చట్ట సభల ద్వారా కార్పొరేట్ సంస్థలకు మార్కెట్లలో కొనుగోలుచేసే అవకాశం కల్పిం చారు. ధరలను ఆ సంస్థలే నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల నుంచి వైదొలిగి రాష్ట్రాలపై నెట్టివేసింది. గిట్టుబాటు ధరలు నిర్ణయించటం, వాటిని అమలుచేసే బాధ్యతను కేంద్రం గానీ, రాష్ట్రంగానీ ఇంతవరకూ ప్రకటించలేదు. కేంద్రం ధరలు ప్రకటించి చేతులు దులుపుకోగా, రాష్ట్రం నేటికీ ధరల అమలుపై తన బాధ్యతను ప్రకటించలేదు. ఉత్పత్తిని పెంచడం: గత సంస్కరణల నుండి (1997 నుండి) మన దేశీయ పరిశోధనల విభాగాలను దాదాపుగా మూసివేశారు. బహుళజాతి సంస్థలైన మోన్శాంటో, డూపాంట్, కార్గిల్, సింజెంటా సంస్థలు 80% ప్రయోగాలను చేస్తుండగా, వాటిని మన దేశంలో వినియోగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 27 కేంద్రాలలో 5 వేల ఎకరాల భూమి పరిశోధనల కొరకు కేటాయించబడినప్పటికీ, ఆ పరి శోధనా కేంద్రాలన్నింటినీ మూసివేయడం జరిగింది. ఇలాంటి స్థితిలో ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? సహాయక చర్యలు: ప్రస్తుతం బడ్జెట్లో 2.5% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నారు. పేద దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ దేశాలు తమ బడ్జెట్లో 5 నుంచి 8 శాతం కేటాయించాయి. 8 రకాల సబ్సిడీలను రైతులకు అందచేస్తున్నారు. పంటల బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. నిర్ణయించిన ఆదాయం, నిర్ణయించిన ధరలు మార్కెట్లో తగ్గితే ఆ లోటును కూడా ప్రభుత్వాలు రైతుకు నగదుగా ఇస్తున్నాయి. కానీ ఇందులో ఏ ఒక్కటీ భారతదేశంలో అమలు జరగడం లేదు. రెట్టింపు కావడానికి చేపట్టాల్సిన చర్యలు: నాణ్యత గల వ్యవసాయ ఉపకరణాలు స్వదేశీ టెక్నాలజీలో పరిశోధన చేసి రైతులకు సకాలంలో అందించాలి. వ్యవసాయ భూమి తగ్గుదలను అరికట్టాలి. సకాలంలో పంటలకు సాగునీటి వసతి కల్పించాలి. సకాలంలో రుణాలు ఇవ్వాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వడంతోపాటు, సహకార వ్యవస్థను బలపర్చాలి. పంటలు వేసేటప్పుడే ధరలు నిర్ణయించి, ఆ ధరలను అమలు జరపాలి. ప్రభుత్వమే అన్ని పంటలకు ప్రీమియం చెల్లించాలి. 60 సం.లు దాటిన రైతులకు పెన్షన్లు ఇవ్వాలి. బడ్జెట్లో 6% వ్యవసాయ రంగానికి కేటాయించాలి. పరిశోధనా కేంద్రాలలో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనోత్పత్తి చేసి, రైతులకు అందించాలి. కార్పొరేట్ల జోక్యం ఉన్నంతకాలం రైతుల ఆదా యం పెరగదని ప్రపంచబ్యాంకు అనుకూల నిపుణులే వ్యాఖ్యానిస్తున్న అంశాలను కేంద్రం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రకటించిన విధానాలను మార్చాలి. వ్యాసకర్త: సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ నిపుణులు మొబైల్ : 94900 98666 -
రైతుల ఆదాయం, వృద్ధికి బలం
న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆదాయం, వృద్ధి పెరిగేందుకు తోడ్పడుతుందని అసోచామ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో 14 ఖరీఫ్ పంటలకు 50 శాతం మేర మద్దతు ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత వారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచగా, ఒక్క దీనివల్లే ప్రభుత్వ ఖజానాపై రూ.15,000 కోట్ల భారం పడుతుంది. అయితే, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనపు ఆదాయం అందేలా చూస్తామని బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ దిశగా ఈ నిర్ణయం ఉండడం గమనార్హం. ‘‘రైతుల సమస్యల నివారణకు మద్దతు ధరల పెంపు కచ్చితమైన లేదా సరైన పరిష్కారం కాదు. కానీ, దీర్ఘకాలిక సంస్కరణలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతకాలం పాటు రైతులను కష్టాల్లో ఉండనీయకూడదు. మొత్తం వినియోగంలో గ్రామీణ ప్రాంతం 70% వాటా కలిగి ఉంది. గ్రామీణులకు తగినంత కొనుగోలు శక్తి రానంత వరకు భారత పరిశ్రమలకు డిమాండ్ పుంజుకోదు’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనను ధాన్యం, కూరగాయల మార్కెట్లలో యంత్రాంగాన్ని మెరుగుపరచడం ద్వారా పరిష్కరించొచ్చని రావత్ సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పెంపునకు కారణమయ్యే మార్కెట్ దళారులకు కళ్లెం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించగలవన్నారు. ద్రవ్యోల్బణం, జీడీపీపై ప్రభావం: డీబీఎస్ న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపు వల్ల జీడీపీపై 0.1– 0.2% వరకు ప్రభావం పడుతుందని, దీనికి తోడు ద్రవ్యోల్బణంపైనా దీని ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డీబీఎస్ ఓ నివేదిక విడుదల చేసింది. ద్రవ్య పరమైన వ్యయాల పెరుగుదలకు దారితీస్తుందని అభిప్రాయపడింది. జీడీపీపై ప్రభావం నేపథ్యంలో అధిక ఆదాయ మద్దతు అవసరమని లేదా మూలధన వ్యయాలను తగ్గించుకుంటేనే 2018–19లో ద్రవ్యలోటు లక్ష్యాలపై ప్రభావం పడకుండా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆహార సబ్సిడీ కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.1.70 లక్షల కోట్లు కేటాయించగా, మద్దతు ధరల పెంపు వల్ల సబ్సిడీ బిల్లు రూ.2లక్షల కోట్లు దాటిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మద్దతు ధరల పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలి ఉన్న కాలంలో ద్రవ్యోల్బణంపై 25–30 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం ఉంటుందని డీబీఎస్ నివేదిక తెలియజేసింది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్బీఐ మరో విడత రేట్లను పెంచొచ్చని అంచనా వేసింది. -
ఊరింపా.. ఉసూరా!?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మద్దతు ధర పెంపు ఊరట మాత్రమేనని ఓవైపు.. ఈ పెంపుతో రైతుకు ఒరిగేదేమీ లేదని మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి. పంటల సాగు వ్యయానికి కనీసం 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర నిర్ణయిస్తామని కేంద్రం చెప్పిందని, కానీ ఆ స్థాయిలో ధరలు నిర్ణయించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా సొంత ఫార్ములా ప్రకారం మద్దతు ప్రకటించారని ఆరోపణలొస్తున్నాయి. వరికి క్వింటాకు రూ. 200 పెంచామని చెబుతున్నారని, కానీ డీఏపీ బస్తా కూడా రూ. 200 పెంచారని.. దీని వల్ల రైతుకు ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. మొత్తం 14 పంటలకు.. పంటల మద్దతు ధరలు పెంచుతామని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ బడ్జెట్లో దీనికి కార్యరూపం తీసుకొచ్చారు. ఆ ప్రకారం మొత్తం 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం పెంచింది. క్వింటా వరి (సాధారణ రకం) ధర రూ. 1,550 నుంచి రూ. 1,750కు పెరిగింది. గ్రేడ్ ఏ రకం వరి క్వింటా ధర రూ. 1,590 నుంచి రూ. 1,750 పెంచారు. పత్తి ధర రూ. 4,020 నుంచి రూ. 5,150కు పెంచారు. పప్పు ధాన్యాల్లో కందులు క్వింటా ధర రూ. 5,450 నుంచి రూ. 5,675, పెసర్లను రూ. 5,575 నుంచి రూ. 6,975, మినుములను రూ. 5,400 నుంచి రూ. 5,600, వేరుశనగల పాత ధర రూ. 4,450 ఉండగా, కొత్త ధర రూ. 4,890కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరి ధాన్యం క్వింటా మద్దతు ధరను గతేడాదికన్నా రూ. 200 ఎక్కువ పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే కందులకు రూ. 225, పత్తికి రూ. 1,130, పెసర్లకు రూ.1,400, జొన్నలకు రూ.700 ఎక్కువ పెంచినట్లు పేర్కొంది. సాగు వ్యయానికి ఒకటిన్నర రెట్లు పెంచామని కేంద్రం చెప్పినా ఏ ప్రాతిపదికన పెంచారో మాత్రం స్పష్టం చేయలేదు. సొంత ఫార్ములా ప్రకారం!: రాష్ట్ర వ్యవసాయ శాఖ.. జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ) ఈ ఏడాది జనవరిలో సమర్పించిన సాగు వ్యయాల ప్రకారం క్వింటా వరి పండించేందుకు రూ. 2,202 ఖర్చు అవుతుంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి క్వింటాకు రూ. 3,303 మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వరి, మొక్కజొన్నకు క్వింటాకు కనీసం రూ. 2 వేల పైన ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పత్తి లాంగ్ స్టాపిల్ క్వింటాకు రూ. 6,087.. క్వింటా కందికి రూ. 5,896 ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. వీటికి 50 శాతం అదనంగా మద్దతు ఇస్తేనే రైతుకు సాగు లాభసాటిగా ఉంటుందని పేర్కొంది. వీటినీ కేంద్రం పట్టించుకోలేదు. మరోవైపు క్వింటా వరి మద్దతు ధరను రూ.2,000 చేస్తే బాగుండేదని రైతన్నలు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఖర్చు సాగు ఖర్చులో ఒకటిన్నర రెట్లు పెంచామని కేంద్రం చెప్పడంలో అర్థం లేదు. ఖర్చు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. తెలంగాణలో వరి సాగు ఖర్చు క్వింటాకు రూ. 2,100 ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆ ప్రకారం ఒకటిన్నర రెట్లు కలిపితే రూ. 3,100 కావాలి. కానీ కేంద్రం తెలంగాణ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పైగా డీఏపీ బస్తా ధర రూ. 200 పెంచి మద్దతు ధరను రూ. 200 పెంచింది. – సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ నేత పెంపులో ఫార్ములా ఏదీ ప్రస్తుతం నిర్ధారించిన ధరలు రైతుకు ఊరట మాత్రమే. మద్దతు ధరల పెంపులో వ్యవస్థీకృత ఏర్పాటు చేయలేదు. ఫార్ములా అంటూ ఏమీ లేకుండానే చేశారు. దేనికి ఎంత, ఎందుకు పెంచుతున్నారో కూడా స్పష్టత లేదు. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు ఎన్నికల స్టంట్ స్వామినాథన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండానే మద్దతు ధరలు ఖరారు చేశారు. సొంత ఫార్ములా ప్రకారమే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదంతా ఎన్నికల స్టంట్ మాత్రమే. – పిడిగం సైదయ్య, ఉద్యాన శాస్త్రవేత్త -
రైతును ముంచిన శనగ
సాక్షి, రాజుపాళెం : రైతులను శనగ పంట ముంచేసింది. ప్రకృతి సహకరించక, ప్రభుత్వం పట్టించుకోక వారు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది రబీలో జిల్లాలో 84480 హెక్టార్లలో శనగ సాగు చేశారు. విత్తనం వేశాక ఒక్క వాన కూడా పడకపోవడంతో పంట పూర్తిగా ఎండుముఖం పట్టింది. ఎకరాకు కేవలం 2 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రతి రైతు ఎకరాకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, ట్రాక్టరు బాడుగలు, కూలీలు తదితర వాటి కోసం రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేశారు. ధర అంతంత మాత్రమే... శనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం క్వింటా ధర రూ.3500 పలుకుతోంది. గతంలో రైతులు విత్తనం వేసేటప్పుడు కొనుగోలు చేయగా.. క్వింటా రూ.7 వేలు పలికింది. ఇలా ధర వ్యత్యాసం ఉంటే ఎలా గట్టెక్కుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.8000 కల్పించి ఉంటే.. పరిస్థితి కొంత వరకు బాగుండేదని వారు పేర్కొన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.14 వేలు చెల్లించి కౌలుకు తీసుకున్నారు. దీంతో పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. అటు అప్పులు కట్టలేక, ఇటు ధాన్యం అమ్ముకోలేక సందిగ్ధంలో ఉన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. చాలా మంది రైతులకు టోకన్లు దొరకక అమ్ముకోలేదు. మరి కొంతమంది రైతులు శనగ పంట నూర్పిడి తర్వాత పొలాల్లోనే వ్యాపారులకు అనామత్ (ధాన్యం వేశాక ఎప్పుడైనా అమ్ముకోవచ్చు) వేశారు. ప్రభుత్వ గోదాములు నిండిపోవడంతో చాలా మంది ప్రైవేటు గోదాములను ఆశ్రయించారు. ఒక్కో బస్తాకు ఏడాదికి రూ.130 బాడుగ చెల్లిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ చూపి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు వేలం నోటీసులు ఒక వైపు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగానికి బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడంతో.. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గోదాముల్లో ఉంచిన ధాన్యాన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. గతంలో క్వింటా ధర రూ.10 వేలు పలికింది. ఇలాంటి ధర వచ్చిన తర్వాత అమ్ముకుందామని కొందరు రైతులు భావించారు. అయితే ఏడాది గడిచినా ధర తక్కువగా ఉండటంతో అమ్ముకోలేక పోయారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించక ఏడాది పూర్తి కావడంతో.. బ్యాంకర్లు రైతులకు వేలం నోటీసులు పంపారు. ఆ తర్వాత శనగలు వేలం వేస్తామని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించి, రుణాలను రెన్యువల్ చేయాలని కోరినా బ్యాంకర్లు వినుకోవడం లేదు. గతంలో క్వింటా ధర రూ.6000 నుంచి రూ.6500 వరకు ఉండటంతో.. బ్యాంకులు క్వింటాకు రూ.3500 నుంచి రూ.4500 వరకు రుణం ఇచ్చాయి. ప్రస్తుతం క్వింటా రూ.3500 పలుకుతుండటంతో తీసుకున్న అప్పునకు కూడా సరిపోవడం లేదు. ఎమ్మెల్యేను కలిసిన రైతులు రుణం చెల్లించకుంటే ఈ నెల 22న వేలం వేస్తామని బ్యాంకులు పత్రికల్లో ప్రకటన ఇచ్చాయి. దీంతో రాజుపాళెం మండలంలోని పలు గ్రామాల రైతులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని కలిసి, పరిస్థితి వివరించారు. ఎమ్మెల్యే వెంటనే బ్యాంక్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు ఫలానా రోజు కట్టాలని చెప్పలేదు కదా.. ఉన్నట్టుండి ఇప్పుడు కట్టమంటే ఎలా కడతారు. కాదు కూడదు రుణం వడ్డీతో సహా చెల్లించాలంటే నేనే చెల్లిస్తా. గాంధీ మార్గంలో దీక్ష చేస్తా. శనగలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయనీయబోం’ అని మేనేజర్‌కు ఎమ్మెల్యే చెప్పారు. -
రైతుకు దుఃఖం, దళారికి రొక్కం
విజయనగరం జిల్లాకు చెందిన శ్రీనివాస్ ప్రస్తుతం విశాఖపట్నంలో చిరుద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. ఆయన గతేడాది కిలో బియ్యాన్ని రూ.42కు కొన్నాడు, ఇప్పుడు అదే రకం బియ్యాన్ని రూ.50కి కొనాల్సి వచ్చింది. అంటే ఏడాదిలో ధర కిలోకు రూ.8 పెరిగింది. ఇదే సమయంలో రైతుల నుంచి క్వింటాల్ ధాన్యాన్ని(వడ్లు) కేవలం రూ.1,100కు దళారులు కొనుగోలు చేశారు. క్వింటాల్ ధాన్యాన్ని మరాడిస్తే 70 కిలోల బియ్యం వస్తాయి. కిలోకు రూ.50 లెక్కన 70 కిలోల బియ్యం ధర రూ.3,500. మర ఆడించినందుకు, రవాణాకు రూ.1,500 పోగా దళారికి నికరంగా రూ.2,000 లాభమన్నమాట! అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి, రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి ధాన్యాన్ని పండించిన రైతుకు దక్కింది కేవలం రూ1,100. ఇందులో అన్ని ఖర్చులూ పోను అతడికి మిగిలేది ఉత్త చిల్లరే. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తిరిగిరాని పరిస్థితి. రైతు నష్టపోయినా వినియోగదారుడికైనా మేలు జరుగుతోందా? అంటే లేదనే చెప్పాలి. చివరకు లాభపడేది మధ్యలో ఉన్న దళారే. బహిరంగ మార్కెట్లో బియ్యం ధర ఏటా పెరిగిపోతూనే ఉంది. వ్యాపారులు, దళారుల మాయాజాలం వల్ల అన్నదాతలకు మాత్రం ఆ స్థాయిలో ధర రావడం లేదు. సాక్షి, అమరావతి: కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లేక రైతులు కుంగిపోతుండగా, మరోవైపు వినియోగదారులు అవే పంటలను అధిక ధరలు పెట్టి కొనలేక విలవిల్లాడుతున్నారు. వ్యాపారులు రైతుల నుంచి పంటలను తక్కువ ధరకు కొంటూ, బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటాల్ కందులను గరిష్టంగా రూ.4,000కు రైతుల నుంచి కొనుగోలు చేస్తుండగా, బయటి మార్కెట్లలో, సూపర్ బజార్లలో కంది పప్పు ధర రూ.100కు తగ్గడం లేదు. మార్కెట్లలో కిలో మినప పప్పు ప్రస్తుతం రూ.110 పలుకుతుండగా, క్వింటాల్ మినుముల ధర రూ.4,500కు మించడం లేదు. ముడి సరుక్కి వ్యాపారులు అదనపు విలువ జోడించారనుకున్నా ప్రస్తుతం ఉన్న ధరలో సగానికే వినియోగదారునికి దక్కాలి. కానీ, అపరాల మార్కెట్‌పై వ్యాపారులు, దళారుల గుత్తాధిపత్యం రైతులను, వినియోగదారులను నట్టేట ముంచుతోంది. డిమాండ్–సప్లై మధ్య వ్యత్యాసాల వల్ల ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నా అందులో ఏమాత్రం పస లేదని ప్రస్తుత ధరలు తెలియజేస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ధరలను నియంత్రించి, వినియోగదారులకు ఊరట కల్పించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అది తనకు సంబంధం లేని విషయమన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నదాతలకు గిట్టుబాటు ధరలేవీ? చింతపండు సేకరణ ధరకు, రిటైల్ ధరకు మధ్య అసలు పొంతనే ఉండడం లేదు. సేకరణ ధర కిలోకి గరిష్టంగా రూ.20 మించడం లేదు. కానీ, మార్కెట్లో మాత్రం వినియోగదారుడు కిలోకు రూ.150 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పసుపు పరిస్థితి మరింత దారుణం. కొన్నేళ్ల క్రితం క్వింటాల్‌కు రూ.10,000 దాకా పలికిన పసుపు కొమ్ములను వ్యాపారులు ఇప్పుడు రైతులకు కేవలం రూ.4,000 ఇచ్చి కొంటున్నారు. మార్కెట్లో పసుపు ధర మాత్రం తగ్గకపోవడం గమనార్హం. రాష్ట్రంలో నీటి కొరత నేపథ్యంలో జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. తెల్ల జొన్నలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్ రూ.1,725గా ప్రకటించింది. ప్రస్తుతం వ్యాపారులు తెల్ల జొన్నలకు క్వింటాల్‌కు రూ.1,100 మాత్రమే ఇస్తున్నారు. మామిడి రైతుల దిగాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర స్వల్పంగా పెరిగినా మామిడి రైతులు నష్టాలే చవిచూడాల్సి వస్తోంది. ఈసారి దిగుబడి 20 శాతం వరకు తగ్గిపోయింది. మార్చి నెలలో అకాల వర్షాల వల్ల పూత, పిందె రాలిపోయాయి. ఈ నేపథ్యంలో టన్ను మామిడి కనీసం రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఉంటుందని రైతులు భావించారు. కానీ, దళారులు ఏకమై ఆ ధరను రూ.18 వేలకు తగ్గించారు. వినియోగదారులు కిలో మామిడిపండ్లు కొనాలంటే రూ.90 నుంచి రూ.110 దాకా వెచ్చించాల్సి వస్తోంది. -
గిట్టుబాటు ధర కోసం రైతు పరుగుయాత్ర
హైదరాబాద్: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు ఆత్మహత్యలను అరికట్టాలని కోరుతూ ఓ రైతుబిడ్డ చేపట్టిన రైతు పరుగుయాత్ర శనివారం ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో కనువిప్పు కలగాలని ఫణి అనే యువకుడు హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ నుంచి అమరావతిలోని ఏపీ అసెంబ్లీ వరకు ఈ యాత్ర చేపట్టాడు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ వనస్థలిపురం దగ్గర ఫణికి స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇవ్వడంలేదని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేవిధంగా ఫణి రైతు పరుగుయాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఎస్పీ మీనయ్య, తెలంగాణ ప్రజల పార్టీ యువజన విభాగం నాయకులు కోట్ల వాసు తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు జిల్లా వెంకటాపూర్ రైతుల పట్టుదల
మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌కు చెందిన రైతు విజయ్‌కుమార్‌రెడ్డి క్వింటా వేరుశనగ విత్తనాలకు రూ.11,500 చొప్పున వెచ్చించి 6 క్వింటాళ్ల విత్తనాలు తెచ్చాడు. వీటితో ఏడు ఎకరాల్లో సాగు చేయగా.. పంట చేతికి వచ్చే వరకు రూ.2 లక్షలు పెట్టుబడి కోసం ఖర్చయింది. ఎకరాకు 30 నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సినా వాతావరణంలో మార్పులతో ఎకరాకు కేవలం 20 బస్తాల దిగుబడి వచ్చింది. మొత్తంగా 148 బస్తాల పంట చేతికి అందింది. ఈ పంటను ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.4,450తో అమ్మితే నష్టమే తప్ప లాభముండదు. దీంతో క్వింటాకు రూ.6వేలు వచ్చే వరకూ అమ్మేది లేదంటూ ఇంట్లోనే నిల్వ చేశాడు. మరికల్ (నారాయణపేట): మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలో వెంకటాపూర్ ఓ చిన్న గ్రామం. ఇక్కడి రైతులు ఆరుగాలం కష్టపడి పడించిన వేరుశనగ పంటకు మార్కెట్లో మద్దతు ధర లభించలేదు. దీంతో మార్కెట్లో దళారులు కొనుగోలు చేసే అరకొర ధరకు అమ్మలేక, నష్టాలను కొని తెచ్చుకోలేక మద్దతు ధర వచ్చేంత వరకు పంటను అమ్మరాదనే ఉద్దేశంతో గ్రామంలోని రైతులందరూ ఏకమైయ్యారు. పండించిన పంటను ఏ ఒక్కరూ అమ్మకుండా తమ ఊళ్లోనే నిల్వ ఉంచుకున్నారు. ఈ ఏడాది రబీలో సుమారు 120 ఎకరాల్లో దాదాపు 25 మంది రైతులు వేరుశనగ పంట సాగు చేశారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి క్వింటాల్ వేరుశనగ విత్తనాలకు రూ.11,500 చొప్పున తెచ్చి నాటారు. ఎకరాకు రూ.35 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. అయితే వాతావరణంలో మార్పుల కార ణంగా పంట దిగుబడి తగ్గింది. ఎకరాకు 30 నుంచి 40 బస్తాల వరకు రావాల్సిన పంట, కేవలం 15 నుంచి 20 బస్తాల లోపే వచ్చింది. పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే దళారులు క్వింటాల్ వేరు శనగను కేవలం రూ.4,200 అడుగుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే క్వింటాకు రూ.4,450 ధర కట్టడంతో చేసేది లేక పంటను వెనక్కి తీసుకొచ్చారు. ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించిన రూ.6 వేల మద్దతు ధర ఇస్తేనే అమ్ముతామని చెబుతూ ఇళ్లలో వేరుశనగ పంటను నిల్వ చేసుకున్నారు. అయితే రైతులకు పెట్టుబడికోసం అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు వస్తు న్నాయి. కానీ పంటను ఇప్పటి ధరకు అమ్మితే అప్పులు తీరకపోగా.. చేతికి ఏమీ మిగలదనే భావనతో కష్టమైనా సరేనంటూ పట్టుదలగా వేరుశనగను అలాగే ఉంచేశారు. పంటను ఇంట్లో నిల్వ ఉంచుకుని రెండు నెలలు దాటింది. ప్రభుత్వం క్వింటాకు రూ.6వేలతో కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మద్దతు ధర వచ్చే వరకు అమ్మబోం వేరుశనగ పంటకు మద్దతు ధర వచ్చే వరకు గ్రామం నుంచి ఒక్క క్వింటా కూడా అమ్మబోం. నాలుగు నెలల పాటు రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కాపాడిన పంటకు మద్దతు రాకపోతే మా పరిస్థితి ఏమిటి? ధర వచ్చే వరకు ఇలాగే ఉంటాం. – గుణవతి, మహిళా రైతు, వెంకటాపూర్ రూ.6 వేలతో కొనుగోలు చేయాలి ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి పెట్టి పండించిన వేరుశనగ పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాకు రూ.6వేలతో కొనుగోలు చేయాలి. రైతుల దగ్గర క్విటాలుకు రూ.4,450 కొనుగోలు చేసిన పంటనే కే–6 సబ్సిడీ విత్తనాలు అంటూ మళ్లీ మిగతా రైతులకు క్వింటా రూ.7వేలకు అమ్ముతున్నారు. ఇది న్యాయమేనా? రూ.6వేల ధర ఇచ్చే వరకు పంటను నిల్వ ఉంచుకుంటాం. – లక్ష్మారెడ్డి, రైతు, వెంకటాపూర్ ప్రభుత్వం ప్రకటించిన ధరకే కొనుగోలు రబీలో రైతులు పండించిన వేరుశనగ పంట క్వింటాకు ప్రభుత్వం రూ.4,450 ధర నిర్ణయించింది. ఈ ధరతోనే కేంద్రాల్లో కొనుగోలు చేస్తాం. మార్కెట్లో ఎవరైనా ఇంతకంటే ఎక్కువ ధర ఇస్తామంటే రైతులు అమ్ముకోవచ్చు. «రైతులు డిమాండ్ చేస్తున్నారని ధర పెంచే అవకాశం మా చేతుల్లో ఉండదు. – సక్రియానాయక్, ఏడీఏ, నారాయణపేట -
మద్దతుధరకు చట్టబద్ధత ఇవ్వాలి
విశ్లేషణ ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. దీనితో పాటు త్వరగా పాడయ్యే టొమేటో, బంగాళదుంప, ఉల్లి, ఇతర కూరగాయల పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించే విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో వ్యవసాయదారుల కమిషన్లు ఏర్పడినాయి. కానీ అవి ఆశ్రితులకు పునరావాసం కల్పించేందుకే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి తక్షణం చేయవలసిన పని ఏమిటంటే, ఈ కమిషన్లను రాష్ట్ర వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్లుగా మార్పు చేయాలి. రైతులకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దుర్గ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో గడచిన రెండువారాలలో కొన్ని విషాదకర దృశ్యాలు వరసగా దర్శనమిచ్చాయి. ఆ పక్షం రోజుల పాటు కూడా ఆయా ప్రాంతాల రైతులు వారు పండిం చిన టొమేటోలను రోడ్ల మీదకు తెచ్చి పారబోయడం కనిపించింది. ఆ జిల్లాలోనే ఉంది పర్సూలీ అనే గ్రామం. ఆ ఒక్క గ్రామంలోనే కనీసం 100 క్వింటాళ్ల టొమేటో పంటకు ఇదే గతి పట్టిందని అంచనా. అక్కడి రైతాంగం ఆ పంటను తమ పశువుల చేత అవి తిన్నంత తినిపించింది. ఇంకొంత పొలాలలోనే వదిలి, కుళ్లిపోయేటట్టు చేసింది. మొన్న జనవరి మొదటి వారం వరకు కొద్దిగా మెరుగ్గానే ఉన్నా, తరువాత టొమేటోల చిల్లర ధర పడిపోతూ వచ్చింది. ఉత్తర భారతంలోని ఆ రాష్ట్రంలోనే కాదు, దక్షిణాదిన తమిళనాడులో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిం చాయి. ఈ రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా రైతాంగాన్ని మార్కెట్ పరిస్థితులు తీవ్రంగా కలత పెడుతున్నాయి. అక్కడ క్యాబేజీ చిల్లర ధర దారుణంగా పడిపోయింది. గడచిన సంవత్సరం క్యాబేజీ కిలో ఒక్కంటికి రూ.12 ధర పలికినప్పటికీ, రైతులకు దక్కినది సగటున కిలోకు కేవలం ఒక్క రూపాయి. పడిపోతున్న టొమేటో ధర ఛత్తీస్‌గఢ్‌లో కూడా రైతుల జీవితాలను కకావికలు చేస్తోంది. కిలో ఒక్కంటికి రూ. 1, లేకపోతే, రూ. 2లకు మించి దక్కని పరిస్థితులలో చాలామంది రైతులు పంటను కోసే పని కూడా పెట్టుకోకుండా పొలం మీదే వదిలి పెడుతున్నారు. అంటే మార్కెట్ నుంచి దక్కుతున్న ఆ పరిమిత రాబ yì పంట వ్యయానికే కాదు, కోత కోయడానికి కూడా గిట్టుబాటు కావడం లేదు. అధిక దిగుబడితోనూ కష్టాలేనా? నిజానికి ఇలాంటి పరిస్థితి ఎందుకంటే– అధిక దిగుబడి. అది టొమేటో కావచ్చు, బంగాళదుంప, క్యాబేజీ, ఉల్లి, మరేదైనా పంట కావచ్చు. అవన్నీ అధికంగానే పండుతున్నాయి. కానీ పలుకుతున్న ధర మాత్రం చాలా తక్కువ. అధిక దిగుబడి మళ్లీ మధ్య దళారీలకే లాభం చేకూరుస్తున్నది. దళారులంతా ముఠాలు కట్టేసి, తరుచూ దోపిడీ అనదగిన స్థాయిలో ధరలను నియంత్రిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దాపురించడానికి కారణం అధిక దిగుబడేనని ఈరోడ్ జిల్లాకు చెందిన రైతు టి. రాజాగణేశ్ కూడా అంగీకరించారు. ‘ఒక ఎకరం పొలంలో ఒక నెలపాటు క్యాబేజీ సాగుకు రైతు చేసే వ్యయం రూ. 45,000. దీనికి కూలీల ఖర్చును కలపవలసి ఉంటుంది. ఇంకా నిర్వహణ, ఎరువుల ఖర్చును కూడా జత చేయాలి. ఇవన్నీ కలుపుకుంటే నెలకి అయ్యే ఖర్చు దాదాపు రూ. 50,000. ఇక క్యాబేజీ పంట చేతికి అందాలంటే మూడు మాసాలు పడుతుంది. అంటే ఒక ఎకరం భూమిలో క్యాబేజీ సాగు చేయాలంటే చేయవలసిన వ్యయం కనీసం రూ. 1.5 లక్షలు. అలాంటప్పుడు కిలో ఒక్కంటికి రైతుకు ఒక్క రూపాయి వస్తే మాకు లాభం వచ్చిందని ఎలా అనుకోగలం?’అని ప్రశ్నించారు రాజాగణేశ్. టొమేటో సాగు కూడా ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండడం లేదు. చిన్న రైతు విషయమే తీసుకోండి. ఒక ఎకరం పొలంలో ఆ పంటను పండించాలంటే వారి కయ్యే వ్యయం రూ. 90,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉంటుంది. అదే పెద్ద రైతులు టొమేటో పండిస్తే ఇంకొంచెం ఎక్కువగా, అంటే ఎకరానికి రూ. 1.25 లక్షల వరకు సాగు వ్యయం అవుతుంది. దుర్గ్ జిల్లాలో టొమేటో రైతులను కలుసుకోవడానికి నేను జనవరిలో పర్యటించాను. అప్పుడు ధరలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయి. 25 కిలోల ఒక పెట్టె రూ. 1,000 ధర పలికిన సమయమది. అయితే కర్ణాటక నుంచి టొమేటోలు మార్కెట్లో ప్రవేశించడంతో సరుకు పెరిగిపోయింది. ధరలు పడిపోయాయి. ఇప్పుడు శనగ పంట విషయం తీసుకుందాం. కొత్త పంట మార్కెట్లోకి రావడం మొదలైంది. వీటి కనీస మద్దతు ధర రూ. 4,400. కానీ మార్కెట్లో రైతుకు లభిస్తున్న ధర రూ. 3,600. అంటే క్వింటాల్‌కు 20 శాతం తక్కువగా వారికి దక్కుతోంది. ఇది చిల్లర ధర. పైగా ఈ సంవత్సరం 8 శాతం అధికంగా సాగు జరి గింది. కాబట్టి కోటి లక్షల టన్నుల అధిక దిగుబడి ఉంటుందని (గడచిన సంవత్సరం దిగుబడి దాదాపు 93 లక్షల టన్నులు) అంచనా. కాబట్టి పంట మార్కెట్‌కు చేరే కొద్దీ ధర మరింతగా పతనమయ్యే అవకాశాలే ఎక్కువ. గోధుమ ధరలు కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువగానే రైతుకు దక్కుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఆ పంటకు కనీస మద్దతు ధర కంటే 6నుంచి 8 శాతం తక్కువగానే రైతులకు దక్కుతోంది. అక్కడ కూడా పంట మార్కెట్లకు రవాణా కావడం మొదలైంది. కనీస మద్దతు ధర మిథ్యేనా? కందిపప్పు ధర కూడా అంతే. మొన్న ఫిబ్రవరి ఆఖరి వారానికి కందిపప్పు మార్కెట్ ధర క్వింటాల్‌కు రూ. 4,500. కానీ, తెలంగాణలోని తాండూర్‌లో సేకరణ ధర మాత్రం రూ. 5,500. ఈ నెల మొదటి వారంలో గుజ రాత్, మధ్యప్రదేశ్‌లలో కొనసాగిన ఆవాలు, ఇతర పప్పుధాన్యాల ధరలను పరిశీలించినా ఇదే అవగతమవుతుంది. వాటి మార్కెట్ ధర ప్రకటించిన మద్దతు ధర కంటే చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలా ఉండగానే, ఛత్తీస్‌గఢ్‌లో మరో దఫా రైతులు తమ టొమేటో పంటను రోడ్ల మీదకు తెచ్చి పడేశారన్న వార్తలు వచ్చాయి. టొమేటోల ధర కిలో ఒక్కంటికి రూ.1కి పతనం కావడమనే విష పరిణామం వరుసగా మూడేళ్లు కొనసాగినట్టవుతుంది. ఇది టొమేటోలకే పరిమితమైన విష పరిణామం కూడా కాదు. నిజానికి వ్యవసాయోత్పత్తుల ధరలు దేశవ్యాప్తంగా పతనం కావడమనే ఆ పరి ణామం వరసగా మూడేళ్ల నుంచి జరుగుతోందన్న వాస్తవం గమనించాలి. 2014, 2015 వరుసగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొని రైతులను వేధించాయి. తరువాత 2016, 2017, 2018 సంవత్సరాలు పంట దిగుబడికి సానుకూలంగా ఉన్నాయి. ఈ అధిక దిగుబడి ప్రభుత్వానికి ఎంతో మోదాన్ని తెచ్చి పెట్టింది. కానీ పడిపోయిన ధరలు మాత్రం రైతును దుఃఖసాగరంలోకి నెట్టివేశాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఇలాంటి పరిస్థితులలో కర్ణాటక వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ టి. ఎన్. ప్రకాశ్ చేసిన సూచన సముచితంగా ఉంటుందని నా అభిప్రాయం. ఆయన సూచన సరైన సమయంలో వచ్చినదే కూడా. పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయడం చట్ట ప్రకారం అమలు చేసే విధంగా రూపొందాలని ఆయన చెప్పారు. మైసూరులో డాక్టర్ ప్రకాశ్ ఇచ్చిన ఒక స్మారకోపన్యాసంలో ఈ సూచన చేశారు. ‘గరిష్ట చిల్లర ధరను మించి ఉత్పత్తులను విక్రయిస్తే దాని నుంచి వినియోగదారునికి చట్టబద్ధమైన రక్షణ ఉంది. అలా జరిగిన పక్షంలో వినియోగదారులు న్యాయస్థానాలకు వెళ్లవచ్చు. కానీ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా, రైతుకు మాత్రం అలాంటి చట్టబద్ధమైన రక్షణ లేదు’అని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయోత్పత్తుల ధరలు పతనం కావడమనే పరిణామం మూడేళ్లుగా వరుసగా జరుగుతోంది. మూడో సంవత్సరంలో కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో చూస్తే అన్ని వ్యవసాయోత్పత్తులు వాటికి ప్రకటించిన కనీస మద్దతు ధరల కంటే 20 నుంచి 45 శాతం తక్కువ ధరలకే నోచుకుంటున్నాయి. కర్ణాటకలో ఐక్య మార్కెట్ వేదికను ఏర్పాటు చేశారు. దీనితో దేశంలో 585 ఈ నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చ రల్ మార్కెట్) శాఖలు విస్తరించాయి కూడా. అయినా రైతులకు ఒనగూడిన ప్రయోజనం ఏమీలేదు. నమూనా ధరల నిర్ణయం కూడా రైతుకు ఏమీ చేయలేదు. రోజు వారీ ట్రేడింగ్‌ను బట్టి ఈ ధరను నిర్ణయిస్తారు. ఇది వాస్తవంలో నిస్పృహను మిగిల్చింది. ఈ విధానానికి స్వస్తి పలకడం అవసరం. ఈ నామ్ల ఉద్దేశం కూడా జాతీయ స్థాయిలో స్పాట్ ట్రేడింగ్‌కు లాభం చేకూర్చడమే. రాష్ట్రాలలో వ్యవసాయోత్పత్తుల కమిషన్లు నాది కూడా ఒక సూచన ఉంది. ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. దీనితో పాటు త్వరగా పాడయ్యే టొమేటో, బంగాళదుంప, ఉల్లి, ఇతర కూరగాయల పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించే విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో వ్యవసాయదారుల కమిషన్లు ఏర్పడినాయి. కానీ అవి ఆశ్రితులకు పునరావాసం కల్పిం చేందుకే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి తక్షణం చేయవలసిన పని ఏమిటంటే, ఈ కమిషన్లను రాష్ట్ర వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్లుగా మార్పు చేయాలి. రైతులకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలి. అంటే కర్ణాటకలో ఏర్పాటు చేసిన కమిషన్ మాదిరిగా అన్నమాట. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు మించి కర్ణాటక 14 పంటలను సేకరిస్తూ ఉంటే, రాజకీయాలకు అతీతంగా ఇలాంటి పంథాను అనుసరించడానికి మిగిలిన రాష్ట్రాలకు ఎదురయ్యే చిక్కులేమిటో అర్థం కాదు. - దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
మద్దతు ధర కల్పించాలని తెనాలి ఆర్డీలోకు వైఎస్ఆర్సీపీ వినతిప్రం
-
నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతుల ఆందోళన
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు ఆందోళన కొనసాగుతోంది. జిల్లాలోని జుక్రాన్‌పల్లిలో శనివారం రైతుల నిరసన చేపట్టారు. సుమారు వెయ్యి మంది రైతులు ర్యాలీ నిర్వహించారు. ఎర్రజొన్నకు రూ. 4,500 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా, గత రెండు రోజులుగా ఎర్రజొన్న, పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతుల ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. -
కదంతొక్కిన ఎర్రజొన్న రైతులు
-
కదంతొక్కిన ఎర్రజొన్న రైతులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎర్రజొన్న రైతులు కదంతొక్కారు.. గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కారు.. ఎర్రజొన్న కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన సుమారు రెండు వేలమంది రైతులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆందోళన చేపట్టారు. ముందుగా మామిడిపల్లి చౌరస్తాకు చేరుకున్న రైతులు రోడ్డుపై బైటాయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అక్కడ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. రైతుల ఆందోళనకు మద్దతు పలికేందుకు వచ్చిన వివిధ పార్టీల నేతలను అక్కడి నుంచి పంపించేశారు. నేతలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న కొనుగోలుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని పేర్కొన్నారు. ఎర్రజొన్నకు క్వింటాలుకు రూ.4,500, పసుపునకు క్వింటాలుకు రూ.15 వేల చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. 144 సెక్షన్ విధించినప్పటికీ.. పోలీసులు రైతుల నిరాహార దీక్షకు అనుమతి మంజూరు చేయలేదు. గురువారం ఆర్మూర్ పట్టణంలో నిషేధాజ్ఞలు జారీ చేసి, 144 సెక్షన్ విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదని నిజామాబాద్ సీపీ కార్తికేయ ప్రకటించారు. అయితే ఇవేవీ లెక్కచేయని రైతులు తమ ఆందోళనను కొనసాగించారు. ప్రకటించిన కార్యాచరణ మేరకు రాస్తారోకో, ర్యాలీ, నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులను ఆర్మూర్‌కు తరలించి పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే నివాసాల వద్ద భద్రత.. రైతుల దీక్ష నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే సమీపంలోని పెర్కిట్‌లో ఉన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో అవసరమైతే ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా బందోబస్తును పెంచారు. వీరి నివాసాల ముందు బారికేడ్లను ఏర్పాటు చేశారు. -
మద్దతు ధర కోసం..
♦ కలెక్టరేట్ ఎదుట దొండ రైతుల ధర్నా ♦ దొండకాయలను రోడ్డుపై కుప్పగా పోసి ఆందోళన చేసిన కర్షకులు ♦ దళారుల నుంచి కాపాడాలని డిమాండ్ నల్లగొండ టూటౌన్ : ఆరుగాలం కష్టపడి పండించిన దొండకాయకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని పీఏపల్లి మండల రైతులు సోమవారం కలెక్టర్ ఎదుట ఆందోళన చేశారు. బస్తాలలో దొండకాయలు తెచ్చి కలెక్టరేట్ గేటు ఎదుట, ప్రధాన రహదారిపై కుప్పలుగా పోసి దర్నా చేశారు. ఈ సందర్భంగా పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లు నాగార్జున్‌రెడ్డి మాట్లాడుతూ దొండ రైతులను దళారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. పండించిన పంటకు ధర లేక కూళ్లు కూడా వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు మద్దతు ధర రూ.1200 ఇప్పించాలని, అర్హులైన రైతులకు సబ్సిడీ డబ్బులను వెంటనే ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. దళారులు సిండికేటై క్వింటా దొండ ధర రూ. 100లకే కొనుగోలు చేస్తున్నారన్నారు. రోడ్డుపై దొండకాయలు పోసి వాటిపై పడుతున్న రైతులకు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమించారు. కొంతమంది రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కార్యక్రమంలో పండ్లతోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్రెడ్డి నాగిరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, గజ్జల లింగయ్య, వి. రవీందర్‌రెడ్డి, బి. బాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. దొండకాయల కోసం ఎగబడిన ప్రజలు.. రైతులు దొండకాయలను కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై పోసి ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడే సమీపంలో ఉన్న హోటల్ వ్యాపారులు, కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలు దొండకాయల కోసం ఎగబడడం గమనార్హం. ఓ వైపు రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తుంటే.., వారికి మద్దతుగా నిలవకుండా అక్కడ ఉన్న దొండకాయలను తీసుకెళ్లడంపై పలువురు రైతులు విస్మయం వ్యక్తం చేశారు. -
వారానికి ఇద్దరు!
పోలీసు కాల్పుల్లో మరణిస్తున్న సామాన్యుల సంఖ్య ఇది 4,747 - 2009–2015 మధ్య దేశంలో మొత్తం కాల్పుల ఘటనలు 796 - 2009 నుంచి 2015 మధ్య కాల్పుల్లో మృతిచెందినవారు పండించిన పంటకు మద్దతు ధర కోసం ఉద్యమించిన రైతులపై జూన్ 6న మధ్యప్రదేశ్ పోలీసులు కాల్పులు జరపడంతో ఆరుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. గత ఏడేళ్లలో పోలీసు కాల్పుల్లో సగటున వారానికి ఇద్దరు పౌరులు మరణించారట. 2009–2015 మధ్య నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం.. 2009 నుంచి 2015 మధ్య పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 796. 2009–2015 మధ్య దేశంలో 4,747 పోలీసు కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ భాగం జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘటనలే. రాష్ట్రాలవారీగా చూస్తే 2015లో రాజస్థాన్‌లో అత్యధికంగా 35 పోలీసు కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 33, ఉత్తరప్రదేశ్‌లో 29 రికార్డయ్యాయి. అల్లర్లు, దోపిడీ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల వ్యతిరేక చర్యలు.. మొదలైన సమయాల్లో పోలీసు కాల్పులను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. కాగా, దేశంలో 2009 నుంచి 2015 మధ్య జరిగిన కాల్పుల్లో 471 మంది పోలీసు సిబ్బంది కూడా మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి తెలంగాణ డెస్క్ -
రైతులపై కాల్పులు దురదృష్టకరం: ఉత్తమ్
హైదరాబాద్: మద్దతుధర కోసం నిరసన చేస్తున్న రైతులను పోలీసులు కాల్చిచంపడం బీజేపీ, ప్రధాని మోదీ వైఖరికి నిదర్శనమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. నిన్న మధ్యప్రదేశ్‌లో రైతుల పై కాల్పులు దురదృష్టకరం. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక కార్పోరేట్లకు లక్షన్నర కోట్లు రుణమాఫీ ఇచ్చింది. అదే రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దేశంలో 62 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 2,964 మంది ఆత్మహత్య చేసుకున్నారు.. అందులో మూడో వంతు వారిని కూడా ప్రభుత్వం అదుకోలేదని అన్నారు. -
చెరకు టన్ను ధర రూ.2550
► మద్దతు ధర ప్రకటించిన కేంద్రం ► రాష్ట్ర సుగర్ కేన్ కమిషనర్‌కు అందిన ఉత్తర్వులు ► రూ.3వేలైనా ఇవ్వాలంటున్న రైతులు చోడవరం: ఈ ఏడాది చెరకు మద్దతు ధరను కేంద్రం ఇటీవల ప్రకటించింది. టన్నుకు రూ.2550 చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సుగర్ కేన్ కమిషనర్‌కు ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడేళ్లుగా కనీస మద్దతు ధర లేక తీవ్ర నిరాశతో ఉన్న రైతులకు ఇది కొంత ఊరటనిచ్చే పరిణామం.కేంద్ర ప్రభుత్వ ఆహార ఉత్పత్తుల ధరల నియంత్రణ మండలి సమావేశంలో ఇటీవల టన్నుకు రూ.250పెంచుతూ ప్రకటించారు. గతేడాది టన్నుకు రూ.2225లు చెల్లించిన కేంద్ర ఈ ఏడాది మరో రూ.250లు పెంచింది. అన్ని ఫ్యాక్టరీలు టన్నుకు రూ.2475 చెల్లించాల్సి ఉంటుంది. గోవాడ ఫ్యాక్టరీ గతేడాది రూ.2300 ఇవ్వగా ఈఏడాది పెరిగిన ధరతో టన్ను చెరకు ధర రూ.2550 చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా మరో రూ. 60 రవాణా చార్జిగా ఇవ్వాలి. అంటే రానున్న క్రషింగ్ సీజన్లో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ టన్నుకు రూ. 2610 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ ధర కొంత పర్వాలేకపోయినప్పటికీ ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులు రీత్యా టన్నుకు కనీసం రూ.3వేలైనా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇదిలావుంటే చెరకు మద్దతు ధర పెరగడంపై ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పంచదార ధర క్వింటా రూ.3750 ఉంది. ఈ ధర ఇలా ఉన్నా,కాస్త పెరిగినా ఫ్యాక్టరీ పెరిగిన చెరకు ధర ఇచ్చేందుకు ఇబ్బంది ఉండదు. రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చెరకు సాగు పెట్టుబడులు బాగాపెరిగిపోవడం వల్ల ప్రస్తుతం ప్రకటించిన ధర కూడా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం కొంత సాయం చేసి మద్దతు ధర పెంచితే రైతులు చెరకు సాగుపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్యాక్టరీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న 11సహాకార చక్కెర కర్మాగారాల్లో కేవలం నాలుగు ఫ్యాక్టరీలు మాత్రమే క్రషింగ్‌కు సిద్ధమవుతున్నాయి. అవి కూడా మన జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక, తాండవ కాగా పక్కనే ఉన్న విజయనగరం జిల్లా భీమసింగ ఫ్యాక్టరీలు. మిగతా ఫ్యాక్టరీలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోయి మూతబడ్డాయి. అయితే క్రషింగ్‌కు సిద్ధమవుతున్న 4ఫ్యాక్టరీలు కూడా గతేడాది చెరకులేక లక్ష్యంలో కేవలం 60 శాతమే క్రషింగ్ చేసి చతికిలపడ్డాయి. పంచదారకు మంచి ధర ఉన్నప్పటికీ చెరకు పంట లేక ఆశించిన మేర క్రషింగ్ చేయకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాయి. చెరకు విస్తీర్ణం పెంచి ఈ ఏడాది ఆశించిన మేర ఫ్యాక్టరీలు క్రషింగ్ లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పెరిగిన ధర రైతులకు చెల్లించకలేకపోగా ఫ్యాక్టరీలు కూడా మూతపడే ప్రమాదం ఉంది. -
రహస్యంగా మరో సర్వే చేయిస్తున్నకేసీఆర్ !
-
ఏపీలో పంటలకు మద్దతు ధర ఏదీ?
గుంటూరు: రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం స్థానికంగా ఉన్న మిర్చి మార్కెట్ యార్డును రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన ధరల స్థిరీకరణ నిధి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. 90 లక్షల క్వింటాళ్ల మిర్చి ఉండగా 2 శాతం కూడా కొనుగోలు కాలేదని అన్నారు. కోల్డ్ స్టోరేజీల్లో దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, జిల్లాల్లో మార్క్‌ఫెడ్, నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఎర్రబడ్డ మిర్చి రైతు
⇔ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన ⇔ కేంద్రం ప్రకటించిన పథకాన్నిఅమలు చేయని టీడీపీ సర్కారు ⇔ దారుణంగా దిగజారిన ధరలు ⇔ నాటు రకం మిర్చిని కొనేందుకు నిరాకరిస్తున్న వ్యాపారులు ⇔ హైబ్రిడ్ రకాల ధరలూ తగ్గింపు సాక్షి, అమరావతి బ్యూరో గుంటూరు మిర్చి యార్డులో రోజు రోజుకూ ధరలు పతనం అవుతుండటంపై రైతులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు.. మిర్చి యార్డులో ధరలు తగ్గటంతో కడుపు మండిన రైతులు గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ కోల్‌కతా–చెన్నై హైవేతో పాటు గుంటూరు–కర్నూలు రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. తమను పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాటు రకం మిర్చి కొనుగోలుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. హైబ్రిడ్ (తేజ)రకం హై క్వాలిటీ మిర్చిని సైతం క్వింటాలు రూ. 2,500 నుంచి రూ. 3,000కు మించి కొనుగోలు చేయకపోవడం, సాధారణ రకం మిర్చిని అయితే మరి దారుణంగా క్వింటాలు రూ. 1,500 రూ. 2,000 మధ్య ధర ఉండటంతో రైతులు కన్నెర్ర చేశారు. రోజుల తరబడి యార్డులో పడిగాపులు కాస్తున్నా మిర్చి అమ్ముకునేందుకు అవకాశం లేక అవస్థలు ఎదుర్కొం టున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మిర్చి ధరలు మరింత పతనమయ్యాయి. వందలాది లారీల్లో సరుకు... మార్కెట్ యార్డులో నాటు రకం మిరపకాయలు కొనుగోలు చేయకపోవడం, మిర్చి ధరలను తగ్గించి వ్యాపారులు అడ గటంతో రైతన్నలు మిర్చిని అమ్మేందుకు నిరాకరిస్తుం టంతో మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున సరుకు పేరుకుపోయింది. వందల సంఖ్యలో మిర్చి లారీలు మార్కెట్ యార్డు బయట ఆగిపోయాయి. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తించేటట్లు అయితే మేం మిర్చి కోనుగోలు చేయబోమని కొంత మంది వ్యాపారులు మెలిక పెడుతున్నట్లు రైతన్నలు వాపోతున్నారు. క్వింటాలుకు హైగ్రేడ్ తేజ క్వాలిటీ రకం గురువారం ఓ వ్యాపారి కేవలం రూ. 3వేలకు కొనుగోలు చేస్తే.. మరో వ్యాపారి ఇంకో రైతుకు అదే రకానికి రూ. 2,500 ఇస్తానని చెప్పాడు. మార్కెట్లో దించిన సరుకు మళ్లీ ఇళ్లకు తీసుకపోరు అనే భావనతో వ్యాపారులు ఉన్నారని రైతులు వాపోతున్నారు. గందరగోళంగా కొనుగోళ్లు.... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ఇచ్చే రూ.5 వేలే సరిపోదని రైతులు గగ్గోలు పెడుతుంటే దానిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ. 1,500 సహాయం పథకమే ప్రస్తుతం అమలులో ఉందని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలు రూ. 5,000 పథకం రాష్ట్ర పరిశీలనలో ఉందని, దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని సమాచారం. రెండు పథకాలు వర్తిస్తాయని పెద్ద సంఖ్యలో రైతులు యార్డుకు సరుకు తీసుకువచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల కుమ్మక్కు నేపథ్యంలో గురువారం రైతన్నలు రోడ్డెక్కడంతో పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన పోలీసులు అర్బన్ ఎస్పీ త్రిపాఠి పర్యవేక్షణలో యార్డు వద్ద మొహరించారు. గుంటూరు జెసీ–2 ముంగా వెంకటేశ్వరావు రైతులకు నచ్చజెప్పడానికి యార్డు కార్యా లయంలో రైతులతో సమావేశ మయ్యారు. మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావును పలువురు రైతు లు నిలదీశారు. యార్డు కార్యాలయం నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ రైతులు శాపనార్థాలు పెట్టారు. నాటు రకం కాయలు కొనలేదయ్యా.. గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి తెచ్చి పదిరోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మచ్చు (శాంపిల్) తీసి వ్యాపారులు కాయలు కొనటం లేదయ్యా. కనీసం క్వింటాలు రూ.1,000 కూడా అడగటం లేదు. సరుకు వదిలి వెళ్లలేక పది మంది రైతులం ఇక్కడే ఉంటున్నాం. కనీసం భోజన టోకెన్లు కూడా ఇవ్వటం లేదు. కడుపు మాడ్చుకొంటున్నాం. ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదు. – బి.వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా తేజ మిర్చి రూ. 2,500కు అడుగుతున్నారయ్యా.. నేను వారం క్రితం 110 బస్తాల తేజ రకం మిర్చి తీసుకొని వచ్చా. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించక ముందు క్వింటాలు రూ.7000కు అడిగారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు రూ. 5000 ప్రకటించక ముందు ధర రూ. 6000 ఉంది. ఈ ప«థకం ప్రకటించాక వ్యాపారులు మిర్చిని క్వింటాలు రూ. 3000 అడిగారు. మళ్లీ అంతలోనే ఇంకొక వ్యాపారి రూ. 2500 ఇస్తే తీసుకొంటాం లేకపోతే లేదంటున్నారు. వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నా. ఆత్మహత్య తప్ప శరణ్యం లేదు. ప్రభుత్వం మిర్చి రైతులను పట్టించుకోలేదు. చిన్న చూపు చూస్తోంది. – పువ్వాడ కోటయ్య, కందుకూరు ప్రకాశం జిల్లా సరుకు కొనుగోలు చేయడం లేదు.. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ అర్హత కోసం పత్రాలు ఉంటే ఆ సరుకు కొనడం లేదు. ఫారాలు ఇవ్వకుండా, రాయితీ పరిధిలోకి సరుకు రాకుంటేనే వ్యాపారులు కొంటామంటున్నారు. ఇలా వ్యాపారులు మూడు రోజులుగా మిర్చిని కొనడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ధరలు పడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. – శ్రీనివాసరావు, నాదెండ్ల -
సూర్యాపేట-జనగాం రహదారిపై ఆందోళన
తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం మద్ధతు ధర తగ్గించారని రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో సూర్యాపేట-జనగాం రహదారిపై రాస్తారోకోకు దిగారు. అటుగా వెళ్తున్న భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్‌ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్ధతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఆగని ‘మిర్చి’ సెగలు
-
ఆగని ‘మిర్చి’ సెగలు
సాక్షి, ఖమ్మం/లీగల్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏప్రిల్ 28న జరిగిన ఆందోళన, విధ్వంసం చేసిన ఘటనలో పది మంది రైతులను త్రీటౌన్ పోలీసులు ఆదివారం ఖమ్మం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ ఘటనలో ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన మండెపుడి ఆనందరావు, బాణాపురానికి చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య, కల్లూరు మండలం లక్ష్మీపురంతండాకు చెందిన ఇస్రాల బాలు, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లికి చెందిన భుక్యా అశోక్, ఏన్కూరు మండలం శ్రీరామపురంతండాకు చెందిన భుక్యా నర్సింహారావు, తిరుమలాయపాలెం మండలం బచ్చోడుతండాకు చెందిన భూక్యాశ్రీను, బానోతు సైదులు, కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన తేజావత్ భావ్‌సింగ్, నేలకొండపల్లి మండలం శంకరగిరితండాకు చెందిన బానోతు ఉపేందర్లను ఖమ్మం మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎన్. అమరావతి ఎదుట హాజరు పరచగా, వారికి మే 11 వరకు రిమాండ్ విధించారు. వీరిలో ఏ–2ముద్దాయి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పరారీలో ఉన్నట్లు చూపించారు. కాగా, రైతులపై సెక్షన్లు 147(దాడి చేయటానికి వెళ్లడం), 148(మారణ ఆయుధాలతో దాడి చేయటం), 353(ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం), 427(ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించుట), 446, 448( అక్రమంగా, దురుద్దేశంగా ప్రవేశించుట) 120(బి)(నేరం చేయటానికి ముందస్తు ప్రణాళిక, llనేరపూరిత కుట్ర) రెడ్‌విత్ 149, సెక్షన్ 3 అండ్ 4 పీడీ పీపీ యాక్ట్ (ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించుట) కింద రిమాండ్ చేశారు. రాజకీయ కుట్రతోనే కేసు : సండ్ర రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్లో మిర్చికి మద్దతుధర అందకనే రైతులే ఆవేశంగా మార్కెట్ కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన శుక్రవారం రోజు రైతులు మార్కెట్లో ఉదయం 7.30 గంటల నుంచే ధర విషయంలో ఆందోళన చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో రైతులను పరామర్శించేందుకు, చైర్మన్‌తో మాట్లాడదామని మార్కెట్‌కు ఉదయం 10.30 గంటలకు వెళ్లానని, అప్పటికే రైతులు మార్కెట్లో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌తో ఆయన చాంబర్లో ధర విషయమై మాట్లాడానని చెప్పారు. అప్పుడు చాంబర్లో చైర్మన్‌తోపాటు ఇద్దరు సీఐలు కూడా ఉన్నారన్నారు. ఆందోళన అంతకు ముందు జరుగుతున్నట్లు వాళ్లకు తెలిసినా, తాను వచ్చినప్పుడే రైతులు ఒక్కసారిగా ఆందోళన చేశారని, తానే ఈ విధ్వంసానికి కారకుడినని ప్రచారం చేస్తుండటం రాజకీయ కుట్రేనని అన్నారు. అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ కూడా రైతుల వద్దకు వెళ్లిందని, అప్పుడు జరిగిన ఇలాంటి సంఘటనలకు కూడా ఆ పార్టీ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న తాము రైతులు, ప్రజల కష్టాలను చూస్తామని, ఇలాంటి కేసులకు భయపడబోమని అన్నారు. మార్కెట్‌కు పంటను అమ్ముకోడానికి వచ్చిన రైతులపై ఖమ్మం మార్కెట్ నుంచే కేసులు పెట్టడం హేయమైనచర్య అని పేర్కొన్నారు. -
గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం
– దయనీయస్థితిలో మిర్చి, పసుపు రైతులు – కనిపించని ధరల స్థీరికరణ నిధి - రైతు దీక్షకు రైతు సంఘాల మద్దతు – వైఎస్ఆర్సీపీ రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల భరత్‌కుమార్‌రెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల భరత్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు సమావేశమయ్యారు. మే ఒకటి, రెండు తేదీల్లో గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న రైతు దీక్షకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ రైతు సంఘం, న్యూ డెమోక్రసీ రైతు విభాగం సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..గిట్టుబాటు ధర లేకపోవడంతో పంట ఉత్పత్తులను కల్లాల్లోనే రైతులు తగలబెడుతున్నారని, అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. గతేడాది క్వింటా మిర్చి రూ. 12 వేల ధర పలికితే ఈ ఏడాది రూ. మూడు వేలు కూడా లేదన్నారు. పసుపు రైతుదీ ఇదే దుస్థితి అని వివరించారు. గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి, పసుపులను విక్రయించిన వారికే అదనపు ధర వర్తించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్లో మద్దతు ధరను వర్తింపజేయాలని కోరారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల ముందు టీడీపీ అధినేత హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక దానిని మరచిపోయారన్నారు. అప్పులపాలైన అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు దీక్షకు మద్దతు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న రైతు దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథం తెలిపారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ఉపశమన చర్యలను చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ... రైతులను మోసం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అవినీతిలో సీఎం చంద్రబాబునాయుడు మొదటి స్థానంలో ఉన్నారని, ఆయనకు రైతుల గురించి పట్టించుకునే ఆలోచనే లేదని న్యూడెమోక్రసీ రైతు విభాగం జిల్లాప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మద్దతు కరువు
గిట్టుబాటు ధర లేక రబీ వరి రైతు గగ్గోలు – గ్రేడ్–ఏ ధాన్యానికి మద్దతు ధర రూ.1,510 – ప్రస్తుతం మార్కెట్లో రైతుకు లభిస్తున్న ధర రూ.1,266 మాత్రమే – క్వింటాపై రూ.244 వరకు నష్టం – కొనుగోలు కేంద్రాల ఏర్పాటును పట్టించుకోని ప్రభుత్వం – గిట్టుబాటు ధర లేక రైతుల గగ్గోలు కర్నూలు(అగ్రికల్చర్): వరి రైతుకు మద్దతు కరువయింది. ఇప్పటికే ఎండుమిర్చి, కంది, పసుపు, ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా వరి రైతులు తాము పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లబించక నష్టాలను మూట కట్టుకుంటున్నారు. కనీస మద్దతు ధర కంటే ధరలు పడిపోయినపుడు రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సి ఉంది. రబీలో పండిన వరి ధాన్యానికి ధరలు పడిపోయినప్పటికీ అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోతున్నారు. ఖరీఫ్‌లో 95 శాతం వరకు కర్నూలు సోన తదితర సన్నరకాలు సాగు చేస్తారు. రబీలో మాత్రం లావు రకాలు అంటే ఆర్ఎన్ఆర్, హంస వంటి రకాలు సాగవుతాయి. బండి ఆత్మకూరు, వెలుగోడు, ఆళ్లగడ్డ, నంద్యాల, శిరువెళ్ల, రుద్రవరం, పాములపాడు, నందికొట్కూరు, పగిడ్యాల తదితర మండలాల్లో రబీలో వరి సాగు చేస్తారు. ప్రతి ఏటా పంట కొతకు రాకముందే వరి ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ సారి మాత్రం రబీలో సాగు చేసిన వరి ధాన్యం మార్కెట్లోకి వచ్చినప్పటికీ, ధరలు పూర్తిగా పడిపోయిన్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. దీన్ని అవకాశంగా తీసుకొని దళారీలు గ్రామాల్లోకి ప్రవేశించి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర రూ.1,510.. మార్కెట్లో లభిస్తున్న ధర రూ.1,266 మాత్రమే గ్రేడ్–ఏ ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1510, సాధారణ రకానికి రూ.1470 మద్దతు ధర ఉంది. రబీలో çపండిన ధాన్యం గ్రేడ్–ఏ కిందకు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో 75 కిలోల బస్తా ధర కేవలం రూ.950 ఉంది. ఈ ప్రకారం క్వింటాకు లభిస్తున్న ధర రూ.1266 మాత్రమే. మద్దతు ధరతో పోలిస్తే రైతులు క్వింటాపై రూ.244 నష్టపోతున్నారు. మద్దతు కంటే ధరలు తగ్గినప్పుడు రైతులు నష్టపోకుండా పౌరసరఫరాల సంస్థను రంగంలోకి దింపి కొనుగోలు చేయించాలి. కానీ జిల్లాలో ఆ దిశగా కనీస చర్యలు కూడా లేకపోవడం గమనార్హం. జిల్లాలో రబీ సీజన్ వరి సాధారణ సాగు 19,296 హెక్టార్లు ఉండగా.. సాగు దాదాపు 10వేల హెక్టార్లలో సాగయింది. 90శాతం వరకు రబీలో లావు రకాలే సాగు చేస్తారు. గతంలో రబీలో పండిన వరిని లెవీ కింద సేకరించి ప్రజాపంపిణీకి వినియోగించేవారు. మూడేళ్లుగా లెవీ సేకరణకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇప్పుడు లెవీ సేకరణతో పాటు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు పెట్టుబడి సగటున రూ.30వేలు పెడుతున్నారు. దిగుబడి ఎకరాకు సగటున 25 క్వింటాళ్లు వస్తోంది. ప్రస్తుతం లభిస్తున్న ధరల ప్రకారం ఎకరాకు రైతుకు రూ.31,600 మాత్రమే వస్తోంది. అంటే పెట్టుబడి మాత్రమే దక్కుతుంది. మద్దతు ధర లభిస్తే పెట్టుబడి దక్కి కొంతవరకు నికరాదాయం ఉంటుంది. వరికి మద్దతు ధరలు లేనప్పుడు పౌరసరఫరాల సంస్థ గ్రామైక్య సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు మార్కెటింగ్ శాఖ కల్పించాలి. కానీ ఎవ్వరు రబీ వరి రైతులను పట్టించుకోకపోవడం గమనార్హం. రబీలో 6.25 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రబీలో వరి ధాన్యం దాదాపు 6.25 లక్షల క్వింటాళ్ల వరకు వచ్చింది. జిల్లాలో 25వేల ఎకరాల్లో(10వేల హెక్టార్లు) వరి సాగయింది. ఎకరాకు 25 క్వింటాళ్ల ప్రకారం రబీలో వరి ధాన్యం 6.25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దాదాపు నెల రోజుల క్రితమే ధాన్యం మార్కెట్లోకి వచ్చింది. మద్దతు కంటే ధరలు పడిపోయి రైతులు తక్కువ ధరలకే కష్టార్జితాన్ని అమ్ముకొని నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే 20 శాతం మంది రైతులు పంటను అమ్మకొని నష్టపోయారు. ఇప్పటికైన జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి రబీలో 20 ఎకరాల్లో వరి సాగు చేసిన. ధాన్యం మార్కెట్లోకి వచ్చింది. దళారీలు తక్కువ ధరలతో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడితో ఆరుగాలం శ్రమించిన రైతులకు ఇప్పుడున్న ధరల్లో పెట్టుబడి దక్కడం కూడా కష్టమే. ప్రభుత్వం స్పందించి అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – హుసేన్‌బాషా, బండిఆత్మకూరు క్వింటాకు రూ.230 నష్టం రబీలో లావు రకాల వరి 4 ఎకరాల్లో సాగు చేసిన. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు అయింది. దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వచ్చింది. ధర లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. మద్దతు ధర రూ.1510 ఉంటే దళారీలు రూ.1280 ప్రకారం కొనుగోలు చేసినారు. మద్దతు ధరలో క్వింటాపై రూ.230 నష్టం వచ్చింది. మద్దతు ధరతో అమ్ముకుందామని కొన్నాళ్లు వేచి చూసిన. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో తక్కువ ధరకే అమ్ముకున్నా. – చంద్రయ్య, నారాయణపురం, బండిఆత్మకూరు మండలం -
మిరప రైతు గగ్గోలు
► క్వింటా ధర రూ.2,500లోపు ► ధర నేలను తాకడంతో రైతుల కంట కన్నీరు ► సాధారణ సాగు 15,567 హెక్టార్లు ► సాగయిన పంట 24,494 హెక్టార్లు ► వడ్డీలకూ సరిపోని దిగుబడి కర్నూలు(అగ్రికల్చర్): మిరప రైతు ఎప్పుడూ లేని విధంగా నష్టాలను మూటగట్టుకున్నాడు. 2015లో కాసులు పండినా.. ఆ తర్వాత ఏడాది ఈ పంట కన్నీరు మిగిల్చింది. అప్పట్లో రూ.10వేలకు పైగా ధర పలికిన మిరప ధర ఇప్పుడు నేలను తాకింది. విత్తనాల కొరత ఏర్పడినా ఎంతో ఆశతో అధిక ధరలతో కొనుగోలు చేసి పంట సాగు చేస్తే పెట్టుబడి కూడా దక్కకని పరిస్థితి నెలకొంది. సాధారణ సాగు 15,567 హెక్టార్లు కాగా.. 24,494 హెక్టార్లలో పంట సాగయింది. కిలో విత్తనం ధర రూ.20వేల వరకు పలికిందంటే ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఎరువులు, పురుగు మందులు, కూలీలు, ఇతరత్రా ఖర్చులు ఎకరాకు రూ.లక్షలకు పైగా పెట్టుబడిగా పెట్టారు. అయితే పెట్టుబడిలో 20 శాతం కూడా దక్కకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో క్వింటా ఎండు మిర్చి ధర రూ.10వేల నుంచి రూ.12వేలు పలికింది. ప్రస్తుతం ధర రూ.3వేలు కూడా మించని పరిస్థితి ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో క్వింటాకు లభిస్తున్న ధర రూ.2వేల నుంచి రూ.2,500 మాత్రమే. మిర్చి క్రయ, విక్రయాలకు గుంటూరు మార్కెట్ ప్రసిద్ధి. అక్కడ కూడా ధర నేలను తాకింది. ఆలూరు, పెద్దకడుబూరు, శిరువెళ్ల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. మరికొందరు రైతులు భార్యల బంగారం ఆభరణాలు తాకట్టుపెట్టి మిరప పంట సాగు చేశారు. అయితే చీడపీడల కారణంగా దిగుబడులు కూడా పడిపోవడం.. ధర కూడా అంతంతే కావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మిరపకు మద్దతు ధర ఏదీ: వివిధ పంటలకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిని బట్టి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. ఇటు జిల్లాలోను, అటు రాష్ట్రంలోను సాగు చేసే ప్రధాన పంటల్లో ఎండు మిర్చి ఒకటి. ప్ర«ధాన పంటగా గుర్తింపు ఉన్నా.. మద్దతు ధర కరువయింది. కనీస మద్దతు ధర ఉంటే ధరలు పడిపోయినపుడు ప్రభుత్వం నాఫెడ్, మార్క్‌ఫెడ్‌లను రంగంలోకి దింపి మద్దతు ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ ఎండు మిర్చికి కనీస మద్దతు ధర లేకపోవడంతో ధరలు నేలను తాకినా పట్టించుకునే వారు కరువయ్యారు. మిరప రైతులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం చెవికెక్కించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో కనీసం 12వేల మంది రైతులు మిరప సాగు చేశారు. ఇందులో ఒక్క రైతుకు కూడా పెట్టుబడిలో సగం కూడ దక్కలేదంటే నష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం అవుతోంది. మూడెకరాల్లో ఎండు మిర్చి సాగు చేసిన. ఎకరాకు రూ.లక్ష ప్రకారం రూ.3లక్షలు పెట్టుబడి పెడితే 35 క్వింటాళ్ల పంట వచ్చింది. క్వింటాకు లభించిన ధర రూ.2వేలు మాత్రమే. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడంతో రూ.2.30 లక్షల నష్టం వచ్చింది. పంట అమ్మితే వచ్చిన డబ్బు వడ్డీలకే సరిపోయింది. ఈ ఏడాది చానా నష్టపోయినం. ---నీలప్ప, బూదూరు, మంత్రాలయం మండలం కనీస మద్దతు ధర ప్రకటించాలి: రెండు ఎకరాల్లో మిరప సాగు చేసినం. రూ. 2లక్షలకు పైగా పెట్టుబడి అయ్యింది. 20 క్వింటాళ్ల వరకు పంట వచ్చింది. అయితే మార్కెట్లో ధర రూ.2500లే లభించింది. ఈ ధరతో రైతులు ఎట్లా బాగుపడతారు. పంటను అమ్మగా వచ్చిన డబ్బు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. క్వింటాకు కనీసం రూ.7500 ధర ఉంటే రైతులకు కొంత గిట్టుబాటు అవుతుంది. --- నబిషా, కున్నూరు, గొనెగండ్ల మండలం -
మద్ధతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం
విడపనకల్లు(అనంతపురం జిల్లా): మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించాలంటూ అనంతపురం జిల్లా విడపనకల్ లో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. వైస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. మిర్చి రైతు పట్ల ప్రభుత్వ వైఖరిని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ప్రజలతో పాటు భోజనాలు చేశారు. అనంతరం తహశీల్దారుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మద్ధతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రూ. 5 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు అది ఏమైందని ప్రశ్నించారు. మిర్చికి మద్దతు ధర కోసం అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రస్తావిస్తే ప్రభుత్వం కనీసం చర్చకు కూడా రాలేదని పేర్కొన్నారు. రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి దుర్భరమైన జీవనం సాగిస్తున్నా చంద్రబాబు కంటికి కనిపించక పోవడం దారుణమన్నారు. -
ముగిసిన కందుల కొనుగోలు
కర్నూలు(అగ్రికల్చర్): కనీస మద్దతు ధరతో కందులు కొనుగోలు చేసే కార్యక్రమం బుధవారంతో ముగిసింది. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాల్ ధర రూ.9వేలకు పైగా ఉండగా ఈ ఏడాది మద్దతు కరువైంది. క్వింటా ధర రూ. 4000 కు పడిపోయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్.. 80 రోజుల క్రితం జిల్లాలో 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి ఈ నెల 28వ తేదీతో ముగియగా.. దాదాపు 3 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. అయితే 40 శాతం మంది రైతులు నగదు చెల్లించాల్సి ఉంది. -
మద్దతు ధర కోసం రైతుల ధర్నా
ఖమ్మం: పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఖమ్మంలో మంగళవారం తెలంగాణ రైతు సంఘం ధర్నా నిర్వహించారు. మిర్చికి క్వింటాలుకు 1500 రూపాయలు, కందులు క్వింటాలుకు 8,000 రూపాయలు, సుబాబుల్ టన్నుకు 5,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని, అలాగే మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే సాగర్ జలాలు ఏప్రిల్ 15 వ తేదీ వరకూ ఇవ్వాలని వారు కోరారు. -
కాసుల కోసం కక్కుర్తి
రాజుపేట(యాదాద్రిభువనగిరి): ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు ఓ వ్యాపారి అక్రమ మార్గంలో వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు. యాదాద్రిభువనగిరి జిల్లా రాజుపేట మండలం సోమారం గ్రామానికి చెందిన గడ్డం శ్రీను భువనగిరిలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల గ్రామ రైతుల నుంచి ఇటీవల దాదాపు 60 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశాడు. కందులను రైతు పేరుతో భువనగిరి మార్కెట్లో మద్దతు ధరకు విక్రయించి సుమారు రూ.3 లక్షల మేర అతడు లాభం పొందాడు. అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా శ్రీనుకు వరి పొలం, మామిడితోట మాత్రమే ఉన్నాయని, కంది పంట సాగు చేయలేదని తేలింది. దీనిపై సోమవారం వీఆర్వో పద్మ ఫిర్యాదు మేరకు ఎస్సై బీసన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మద్దతు కరువు!
ఉల్లి రైతు కంట కన్నీరు - మద్దతు ధరకు దూరమైన 4వేల మంది రైతులు - గత డిసెంబర్ 21 నుంచి పట్టించుకోని కలెక్టర్ - రూ.600లోపు ధరతో విక్రయించిన ఉల్లి 4.50 లక్షల క్వింటాళ్లు - మొత్తం రైతులు 13,566 - మద్దతు 3,797 రైతులకే పరిమితం లారీ బాడుగ కూడా దక్కలేదు గత ఏడాది ఖరీఫ్‌లో 1.88 ఎకరాల్లో ఉల్లి సాగు చేసినా. పెట్టుబడి రూ.75వేలు అయ్యింది. 90 క్వింటాళ్ల పంట వచ్చింది. కర్నూలు మార్కెట్‌కు గత అక్టోబర్ 15న తీసుకొస్తే వ్యాపారులు కొనలేదు. మరుసటి రోజున వేలం పాటకు పెడితే రూ.90 ప్రకారం కొనుగోలు చేసినారు. ఈ ధర లారీ బాడుగలకు కూడా సరిపోలేదు. మద్దతు కోసం మార్కెట్లో 2631 నెంబర్ కార్డుపై తహసీల్దారు, వీఆర్ఓ సంతకాలు పెట్టించుకొని వచ్చి అదే నెలలోనే అందజేసినా. క్వింటాకు రూ.300 మద్దతు కల్పించాలి. నా కుమారుడు శివశంకర్ పేరు మీద కార్డు ఉంది. ఇంతవరకు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. - మూల బీరప్ప, కొత్తపల్లి, పత్తికొండ మండలం మద్దతు కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నాం ఖరీఫ్‌లో ఒక ఎకరాలో ఉల్లి సాగు చేసినా. పెట్టుబడి రూ.35వేల వరకు వచ్చింది. 43 క్వింటాళ్ల దిగుబడి రాగా గత అక్టోబర్‌లో కర్నూలు మార్కెట్లో క్వింటా రూ.430 ప్రకారం అమ్మినా. ఈ లెక్కన క్వింటాకు రూ.170 ప్రకారం మద్దతు ధర రావాల్సి ఉంది. 963 కార్డులో అన్ని వివరాలు సక్రమంగా పూర్తి చేసిచ్చినా. మార్కెట్ కమిటీ అధికారులు కంప్యూటర్లో పేరు తప్పుగా నమోదు చేయడంతో మద్దతు ధరకు దూరమయ్యా. ఆ తర్వాత తప్పు సరిదిద్దినా ఇప్పటికీ నగదు అందలేదు. - ఖాజన్న, సుంకేసుల, కర్నూలు మండలం కర్నూలు(అగ్రికల్చర్): అధికారుల నిర్లక్ష్యం ఉల్లి రైతుకు శాపంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉల్లి రైతులకు మద్దతు ధర ఇచ్చే అవకాశం ఉన్నా డిసెంబర్ 20 నాటికే ముగించడం వేలాది మంది రైతులకు నిరాశే మిగిలింది. కష్టాల్లోని రైతుల పట్ల అధికారులు కాస్త సానుభూతి చూపినట్లయితే రూ.3.23 కోట్లు మద్దతు రూపంలో లభించేది. జిల్లాలో 4వేల మంది రైతులు మద్దతు ధరకు దూరమవడం చూస్తే అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో తెలుస్తోంది. ఉల్లి సాగులో దేశంలోనే మహారాష్ట్రలోని పూనె మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానం కర్నూలుదే. 2016 ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లి ఆగస్టు నుంచి మార్కెట్లోకి వచ్చింది. రాష్ట్రంలోనే ఉల్లి క్రయ విక్రయాలు కలిగిన ఏకైక మార్కెట్ కర్నూలు. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు పెట్టుబడి ఖర్చు వస్తోంది. ఎకరాకు సగటున 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గత ఏడాది ఆగస్టు నుంచే మార్కెట్లో ఉల్లి ధర నేలను తాకింది. క్వింటాకు సగటున రూ.250 నుంచి రూ.300 ధర మాత్రమే లభించింది. రూ.50 నుంచి రూ.100 ధరతో అమ్ముకున్న రైతులు 20 శాతం వరకు ఉన్నారు. ధర లభించక అనేక మంది రైతులు దిగుబడులను మార్కెట్లోనే వదిలేశారు. ఆ సందర్భంగా మద్దతు ధర కల్పించాలని రైతులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. దిగొచ్చిన ప్రభుత్వం క్వింటాకు రూ.600 మద్దతు ధర ప్రకటిస్తూ గత అక్టోబర్ 6న జీవో జారీ చేసింది. అయితే జిల్లా యంత్రాంగం గరిష్టంగా క్వింటాకు రూ.300 మద్దతు కల్పించేలా చర్యలు తీసుకుంది. క్వింటా ఉల్లిని రూ.300లోపు అమ్ముకుంటే మద్దతు కింద రూ.300 లభిస్తుంది. రూ.400లకు అమ్ముకుంటే రూ.200 మద్దతు లభిస్తుంది. ఈ మద్దతు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అధికారుల చుట్టూ తిరగలేక.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ఏడాది సెప్టంబర్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ.600 లోపు ధరకు అమ్మకున్న రైతులందరకీ మద్దతు వర్తిస్తుంది. ఈ కాలంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో 13,566 మంది రైతులు 4.50లక్షల క్వింటాళ్ల ఉల్లిని రూ.600 కంటే తక్కువ ధరకు అమ్మకున్నారు. వీరందరికీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బ్యాలెన్స్ మొత్తం మద్దతుగా చెల్లించాలి. అయితే దాదాపు 8వేల మంది రైతులు మాత్రమే మద్దతు ధర కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారు అధికారులు చుట్టూ తిరుగలేక.. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మద్దుతు ధరను స్వచ్ఛందంగా వదులుకున్నారు. 3,797 మంది రైతులకే మద్దతు ఉల్లికి మద్దతు ధర పొందేందుకు మార్కెట్ కమిటీ ప్రత్యేకంగా కార్డులు ముద్రించింది. వీటిలో రైతులు ఉల్లి సాగు చేసినట్లు, ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వచ్చింది తదితర వివరాలు ఉంటాయి. ఈ కార్డుపై రైతులు సంబంధిత తహసీల్దారు, వీఆర్ఓ సంతకాలు చేయించుకొని కర్నూలు మార్కెట్ యార్డులో అందజేయాలి. వీటిని మార్కెట్ కమిటీ సెక్రటరీ పరిశీలించి మార్కెటింగ్ శాఖ ఏడీకి.. ఆయన వాటిని జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదించిన తర్వాత ఏడీఏం మద్దతు ధరను రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. మార్కెట్ కమిటీ అధికారులు 7,796 మంది రైతులతో మొత్తం 70 లిస్టులు తయారు చేశారు. ఇందులో 60 లిస్టులను ఏడీఎంకు పంపారు. అయితే జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ డిసెంబర్ 20 వరకు ప్రతి రోజూ ఉల్లి మద్దతు జాబితాలను పరిశీలించారు. ఆ మేరకు 37 జాబితాలను ఆమోదించారు. వీటికి సంబంధించి 3,797 మంది రైతులకు మద్దతు కింద రూ. 3,76,91,218.42 రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. 4వేల మంది రైతులకు మొండిచెయ్యి సెప్టంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28లోపు మార్కెట్లో రూ.50 నుంచి రూ.600 లోపు ధరకు అమ్మకున్న రైతులు 4వేల మంది మద్దతుకు దూరమయ్యారు. వీరంతా మార్కెట్ కమిటీ అధికారులు ఇచ్చిన కార్డులపై అన్ని సంతకాలు చేయించి అందజేశారు. ఇందులో 300 కార్డుల్లో కొన్ని తప్పులు ఉన్నా.. మిగిలినవన్నీ సక్రమంగా ఉన్నాయి. డిసెంబర్ 21న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తాను మళ్లీ చెప్పే వరకు ఉల్లి రైతుల మద్దతు జాబితాలను తన వద్దకు తీసుకురావొద్దని ఏడీఎంను ఆదేశించారు. అప్పటి నుంచి వీటిని పట్టించుకున్న దాఖలాల్లేవు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం మొదట్లో అర్హులైన రైతులందరికీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మద్దతు ధర కల్పించాం. డిసెంబర్ 20 వరకు 3,797 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఆ తర్వాత నుంచి ఉల్లి మద్దతు నిలిచిపోయింది. దాదాపు 4వేల మంది రైతులకు మద్దతు అందించాల్సి ఉంది. ఈ జాబితాలో కొన్ని తప్పులు ఉన్నాయి. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. - సత్యనారాయణ చౌదరి, ఏడీఎం, కర్నూలు -
రైతు నెత్తిన సోయాబీన్ టోపీ
► మార్కెట్లో క్వింటాలు రూ.4 వేల లోపే ► కంపెనీల నుంచి రూ.5,200కు కొనుగోలు సాక్షి, హైదరాబాద్: సోయాబీన్ విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసేందుకు కంపెనీలతో వ్యవసాయశాఖ ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. మార్కెట్లో సోయాబీన్ ధర పడిపోయినా అధిక ధరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. సోయాబీన్ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ. 2,775 ఉంది. ఇక విత్తన ధర అటూఇటుగా క్వింటాలు రూ.3,500–రూ.4వేలుంది. కానీ తెలంగాణ వ్యవసాయ శాఖ మాత్రం 2017–18లో ఖరీఫ్‌లో రైతులకు సరఫరా చేసేందుకు రూ.5,200కు విత్తనాన్ని కొనుగోలు చేసేందు కు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇటీవల టెండర్లు పిలచిన శాఖ దాదాపు 32 కంపెనీల నుంచి విత్తనాల కొనుగోలుకు అంగీకారం తెలిపింది. ఒక్కో కంపె నీ నుంచి 5వేల క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలి సింది. గతేడాదితో పోలుస్తూ: పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ ను పండించాలని గతేడాది ప్రభుత్వం ప్రచారం చేసిన సంగతి తెలి సిందే. గతేడాది విత్తన ధరను రూ.6,600గా ఖరారు చేసింది. 33 శాతం సబ్సిడీతో రైతులకు రూ.4,400కు ఇచ్చింది. ఈసారి సోయబీన్ ధర మార్కెట్లో పతనమైంది. క్వింటాలుకు రూ.2,100 నుంచి రూ. 2,500 వరకే పలుకుతోంది. అంటే ఎంఎస్పీ కంటే తక్కు వే. దీంతో విత్తన ధర కూడా పడిపోయింది. పైగా ఈసారి రాష్ట్రంలోనూ సోయాబీన్ దిగుబడి బాగానే ఉంది. గతంలోలా మధ్యప్రదేశ్ నుంచే పూర్తిస్థాయిలో సేకరించాల్సిన అవసరమూ విత్తన కంపెనీలకు ఉండదు. అంతేకాదు మధ్యప్రదేశ్‌లో ప్రాసెస్ చేసిన సోయా విత్తన ధర రూ.3,500–రూ.4 వేల వరకే ఉందని అక్కడ వ్యవసాయశాఖ పేర్కొంది. కాబట్టి క్వింటాలుకు రూ. 4 వేలకు మించి ఖర్చు కాదు. అలాంటిది రూ. 5,200కు కంపెనీల నుంచి ఎలా కొనుగోలు చేస్తున్నారన్న ప్రశ్న రైతుల్లో తలెత్తుతోంది. -
ఉల్లి రైతుకు అందని మద్దతు ధర
– పెండింగ్‌లో 3, 000 మంది దరఖాస్తులు కర్నూలు(అగ్రికల్చర్): తక్కువ ధరకు ఉల్లిని అమ్ముకున్న రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతును పొందేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. క్వింటాలు ఉల్లిని మార్కెట్లో రూ.60, రూ. 100కి అమ్మకొని రైతులు నష్టపోయారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.600 ప్రకారం మద్దతు ధర ప్రకటించింది. దీని ద్వారా మద్దతు కింద రైతుకు గరిష్టంగా రూ.300 లభిస్తుంది. అయితే మద్దతు ఇచ్చే విషయాన్ని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ డిసెంబరు నెల 21 వరకు పరిగణలోకి తీసుకున్నారు. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే బ్యాంకు ఖాతాలకు మిగతా మొత్తం జమ చేశారు. ఈ విధంగా 3,800 మంది రైతులకు రూ.3.50 కోట్లు జమ చేశారు. మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మకంటే గరిష్టంగా రూ.300 మద్దతు పొందే అవకాశం ఫిబ్రవరి వరకు ఉంది. జిల్లా కలెక్టర్ మాత్రం డిసెంబరు 21 నుంచి ఉల్లి రైతులకు మద్దతు ధర ఇచ్చే అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టేయడం విమర్శలకు తావిస్తోంది. మార్కెటింగ్ శాఖ అధికారుల దగ్గర దాదాపు 3000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి రూ.3కోట్లు అవసరం అవుతాయి. జిల్లా కలెక్టర్ దయ తలిస్తేనే వీరికి మద్దతు లభిస్తుంది. -
తెల్లబంగారం@5500
జమ్మికుంట: ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో తెల్లబంగారమైన పత్తికి ఈరోజు గరిష్ఠ మద్దతు ధర రూ.5500 లభించింది. అక్టోబర్‌లో సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే రికార్డు ధర. కాగా, కనిష్ఠ ధర రూ. 5,300 పలుకుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా గరిష్ఠ మద్దతు ధర లభించడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. -
చెరుకులో తీపేది
జిల్లాలో 5 వేల హెక్టార్లలో సాగు ఆందోళనలో రైతులు మద్దతు ధర ప్రకటించని యాజమాన్యం టన్నుకు రూ. 3,600 ధర ఇవ్వాలని విజ్ఞప్తి క్రషింగ్‌కు సిద్ధమైన ఫ్యాక్టరీ అందరికీ తీపిని పంచే చెరుకు రైతుకు మాత్రం చేదు అనుభవాలే మిగులుతున్నాయి. ఏడాదంతా శ్రమించినా.. పంటకు మద్దతు ధర లభించడం లేదు. ఈ ఏడాది క్రషింగ్ సీజన్ సమీపిస్తున్నా.. ఫ్యాక్టరీలు మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర ఇవ్వాలని యాజమాన్యాలను కోరుతున్నారు. నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లాలో అడ్లూర్ ఎల్లారెడ్డి, మాగిలలో గాయత్రి చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. ఈ కార్మాగారాల పరిధిలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో 12 మండలాల్లో 5 వేల హెక్టార్లల్లో చెరుకు పంట సాగవుతోంది. కామారెడ్డి జిల్లాలో 2 వేల హెక్టార్లలో, సంగారెడ్డి జిల్లాలో 3 వేల హెక్టార్లలో చెరుకును సాగు చేస్తున్నారు. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చెరుకు సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత దశకు చేరింది. ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించే మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్నారు. పెట్టుబడులు పెరిగినందున టన్నుకు రూ. 3,600 మద్దతు ధర ఇస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని పేర్కొంటున్నారు. అయితే యాజమాన్యాలు రూ. 2,600 లకు మించి మద్దతు ధర ఇచ్చేలా కనిపించడం లేదు. మద్దతు ధర ప్రకటించకుండానే క్రషింగ్‌కు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల వారీగా చెరుకు నరికివేత, క్రషింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. గానుగ కోసం చెరుకును ఫ్యాక్టరీకి తరలించాలని రైతులకు సూచించింది. నేడు బాయిలర్ పూజలు కామారెడ్డి జిల్లాలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, మాగి గాయత్రి కార్మాగారాల్లో చెరుకు క్రషింగ్ కోసం యాజమాన్యం సిద్ధమైంది. మాగిలోని గాయత్రి కర్మాగారంలో బుధవారం బాయిలర్ పూజలు చేయనున్నారు. పూజల అనంతరం క్రషింగ్ తేదీలు ఖరారు చేయనున్నారు. పూజల్లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సరితారెడ్డి, వైస్ చైర్మన్ సందీప్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారని ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు. -
గోధుమ, పప్పులకు ‘మద్దతు’
► కనీస మద్దతు ధరలను పెంచిన కేంద్రం ► గోధుమలకు రూ.100, పప్పుధాన్యాలకు రూ.550 వరకు న్యూఢిల్లీ: రబీ సాగు పెంపు,, ధరల నియంత్రణకు కేంద్రం గోధుమలు, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచింది. గోధుమలకు క్వింటాల్‌కు రూ.100, పప్పు ధాన్యాలకు రూ.550 వరకు పెంచింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం సమావేశమై 2016-17 రబీ పంటలపై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. గోధుమలకు గత ఏడాది రూ.1,525గా ఉన్న కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.100 పెంచి రూ.1,625 చేసింది. శనగలకు మద్దతు ధరను బోనస్‌తో కలిపి రూ.500 పెంచి రూ.4 వేలు చేశారు. గతంలో ఇది రూ.3,500గా ఉంది. ఆవాలకు ప్రస్తుతం రూ.3,350 ఉన్న ఎంఎస్పీని రూ.350 పెంచి రూ.3,700 చేశారు. ఆవాలకు రూ.400 పెంచడంతో మద్దతు ధర రూ.3,700కి చేరింది. బార్లీ గింజల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.100 పెంచడంతో అది రూ.1,325కు చేరింది. కుసుమలకు మద్దతు ధరను రూ.400 పెంచడంతో అది రూ.3,700కు చేరింది. ఎర్ర కందిపప్పుకు రూ.550 పెంచి రూ. 3,950 చేశారు. గత ఏడాది ఈ ధర రూ.3,400గా ఉంది. శనగలు, ఎర్ర కందిపప్పుకు మద్దతు ధరను రూ.4వేలు చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇలాచేస్తే రబీ సాగు పెరగడంతోపాటు ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపింది. గోధుమలకు 6.6 శాతం పెంచామని, అయితే ఇది బోనస్‌తో కలిపి 8.2 శాతం అవుతుందని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. శనగలకు 14.3 శాతం, ఎర్ర కందిపప్పుకు 16.2, ఆవాలకు 10.4, కుసుమలకు 12.1 శాతం పెంచారన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు మద్దతు ధరలను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మంచి వర్షాలు పడినందున 20.75 మిలియన్ టన్నులను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేబినెట్ నిర్ణయాలు: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను చట్టవ్యతిరేక సంస్థగాప్రకటించాలని కేబినెట్ నిర్ణయి0ది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నదుల అనుసంధాన స్పెషల్ కమిటీకి చట్టబద్దత కల్పించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. -
‘మద్దతు’ పైసా తగ్గినా ఊరుకోం
మంత్రి హరీశ్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు పైసా తగ్గినా వెంటనే కొనుగోలు చేయడానికి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను సిద్ధం చేశామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎంఎస్పీకి పైసా తగ్గకుండా రైతులకు ఇప్పిస్తున్నామని చెప్పారు. మొక్కజొన్నను మార్క్‌ఫెడ్, ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ, పత్తిని కాటన్ కార్పొరేషన్ కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొక్కజొన్న క్వింటాలు ఎంఎస్పీ రూ.1,365 కాగా.. వ్యవసాయ మార్కెట్లలో రూ.1,400 నుంచి రూ.1,450 వరకు రైతుకు లభిస్తున్నట్లు వివరించారు. పత్తి ఎంఎస్పీ రూ. 4,160 ఉండగా.. రూ. 4,800 నుంచి రూ. 5,100 వరకు వస్తోందన్నారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన విమర్శలు అర్థరహితమన్న మంత్రి.. బీజేపీ నేతలు గుడ్డి వాళ్లని విమర్శించారు. ‘నామ్’ అమలులో వైఫల్యానికి కేంద్రానిదే పూర్తి బాధ్యతన్నారు. నామ్‌కు సంబంధించిన సర్వర్, సాఫ్ట్వేర్ ఇతర సాంకేతిక వ్యవహారాలు నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీకి అప్పగించారన్నారు. సాఫ్ట్వేర్, సర్వర్ సమస్యలతో ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ తదితర వ్యవసాయ మార్కెట్లలో ఆన్లైన్ ట్రేడింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయంపై వారం కిందటే నామ్ ప్రతినిధులతో చర్చించానన్నారు. ఖరీఫ్ దిగుబడులు వస్తున్నందున ఆన్లైన్ ట్రేడింగ్‌లో సమస్యలు పరిష్కరించాలని వారిని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. నామ్లో భాగంగా దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే ఎక్కువ ఆన్లైన్ ట్రేడింగ్ జరిగినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు. కలెక్టర్లతో పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ క్షేత్రస్థాయి కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్లను వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలపై సూచనలిచ్చారు. 27.52 లక్షల పత్తి రైతులకు బార్కోడ్ కార్డులు మంజూరు చేశామని, తద్వారా వారికి ఆన్లైన్లో చెల్లింపులు జరుగుతాయన్నారు. అక్టోబర్‌లో మొక్కజొన్న,సోయాబీన్.. నవంబర్‌లో వరి, పత్తి, కందులు మార్కెట్‌కు చేరతాయని, ఈ ఏడాది 195 మొక్కజొన్న, 1,900 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసిందన్నారు. సోయాబీన్ ఏ గ్రేడ్‌కి క్వింటాలుకు రూ.2,775, బీ గ్రేడ్‌కు రూ.2,400, వరి సాధారణ రకం రూ.1,470, ఏ గ్రేడ్‌కు రూ.1,510, మొక్కజొన్న రూ.1,365 మద్దతు ధర నిర్ణయించామన్నారు. వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లిరైతు కన్నీరు తుడిచేందుకు ‘మద్దతు’
- మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసువాలి - సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్నాం - ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతులు కన్నీరు పెట్టుకోరాదనే ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం రూ.600 మద్దతు ధర ప్రకటించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. మార్కెట్‌కు రైతుల తగిన నాణ్యతతో తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు. శుక్రవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి మద్దతు ధర ఇచ్చే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 25 వేల హెక్టార్లలో ఉల్లి సాగు అయిందని, గతంలో ఎపుడూ లేని విధంగా ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి మద్దతు ధర రూ.600గా నిర్ణయించామన్నారు. ఈ అవకాశం కేవలం కర్నూలు జిల్లా రైతులకు మాత్రమే రావడం విశేషమన్నారు.సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమ్మకున్న రైతులకు కూడా మద్దతు ధర లభిస్తుందన్నారు. కలెక్టర్ ఇక్కడే ఎమ్మెల్యే అయి మంత్రి అవుతారేమో: టీజీ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బాగా పనిచేస్తున్నారని, ఆయన ఇక్కడే ఎమ్మెల్యే అయి మంత్రి అవుతారేమోనని ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఉల్లికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతును ప్రతి రైతుకు అమలు చేయాలన్నారు. ఉల్లి రైతులకు మద్దతు ఇవ్వడంలో ఎటువంటి అక్రమాలకు తావు ఉండరాదని అన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ఉల్లి నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి డిప్యూటి కలెక్టర్ స్థాయి అధికారితో పాటు ఏడీఎం, ఉద్యాన అధికారులను అందులో నియమిస్తామన్నారు. మార్కెట్లో నాణ్యతను బట్టి ధర రూ.80 లభించినా, 200 లభించిన రైతులకు ప్రభుత్వం నుంచి రూ.300 లభిస్తుందని వివరించారు. దీనిని రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని వివరించారు. కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జేసీ హరికిరణ్ మాట్లాడుతూ...హెక్టారు ఉల్లి ఎన్ని టన్నులు వస్తుందో అంచనా వేశామని అంత వరకు మద్దతు ఇస్తామని వివరించారు. కర్నూలు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు ఎసీ్వ మోహన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి తిక్కారెడ్డి, ఏడీఎం సత్యనారాయణచౌదరి, మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వీరభద్రగౌడు, డోన్ ఇన్చార్జి కేఇ ప్రతాప్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుకు దేహశుద్ధి : జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్న సమయంలో ఓ రైతు తమ ఆందోళనను వివరించేందుకు ప్రయత్నించాడు. దీనిని సహించలేక అధికారులు రైతును తాగుబోతుగా ముద్ర వేసి పోలీసులకు తగిన సూచనలు ఇచ్చారు. పోలీసులు రైతును లాక్కెళి్ల లాఠీలతో చితకబాదారు. -
ఆసర ఇవ్వని పెసర
లభించని మద్దతు ధర పంట దళారుల పాలు ఆరుగాలం కష్టించినా ఫలితం శూన్యం సర్కారే కొనుగోలు చేయాలని రైతుల వేడుకోలు పెద్దశంకరంపేట:ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు సరియైన మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా పంటలను పండించి మార్కెట్‌కు తీసుకువస్తే.. ఇక్కడి ధరలను చూసి లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ ధరకు, మార్కెట్ ధరకు చాలా వ్యత్యాసం ఉండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అసలే కరువు ఛాయలు, ఆపై అప్పుల వాళ్ల బెడదతో విధిలేక వచ్చిన ధరకే అమ్ముకుంటున్నారు. ఫలితంగా తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో ఎక్కడా పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారులకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మార్కెట్లో పప్పు కిలో ధర రూ.100కు తక్కువగా లేదు. కానీ రైతులు తెచ్చిన పంటకు మాత్రం కిలోకు రూ.45 కూడా రావడం లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. సరియైన మద్దతు ధర లేక పోవడమే కారణం. గత ఏడాది పెసర క్వింటాలుకు రూ. 9 వేల నుంచి 10 వేల వరకు పలికింది. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే సమయంలో మార్కెట్ ధరకు, రైతులు అమ్మే ధరకు ఎక్కడా పొంతనా లేదు. ప్రభుత్వం నిర్దేశిత ధరను ఏర్పాటు చేస్తే తప్ప రైతులకు లాభం చేకూరేపరిస్థితి లేదు. ఆరుతడి పంటలపై చూపు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల 23 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల జిల్లాలో 14 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇలా పేట మండలంలో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడా చెరువులు, కుంటలు నిండలేదు. దీని వల్ల రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలనే సాగు చేశారు. వచ్చిన ఈ అరకొర పంటలను కూడా అమ్ముకుందామంటే మద్దతు ధర రాక రైతులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి పెసర పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఆయా మండలాల్లో పంటల దిగుబడిని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. -
వరికి ‘మద్దతు’ సగమే
- రాష్ట్రం వరికి అడిగింది 3,118 కేంద్రం ఇచ్చింది రూ.1,470 - వరితోపాటు పత్తికి గతేడాది కంటే రూ.60 మాత్రమే పెంపు - పెట్టుబడులు, సాగు ఖర్చుల్ని పట్టించుకోని కేంద్రం సాక్షి, హైదరాబాద్: వరికి కనీస మద్దతు ధరగా సాధారణ రకానికిరూ. 1,470, ఏ గ్రేడ్ వరికి రూ.1,510 ఖరారు చేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2016-17 ఖరీఫ్‌కు సంబంధించి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లను కేంద్రం ప్రకటించింది. గతేడాది కంటే వరికి కేవలం రూ.60 మాత్రమే పెంచడం విమర్శలకు దారితీసింది. మొక్కజొన్నకు గతేడాది కంటే క్వింటాకు రూ.40 పెంచి రూ. 1,365 ఖరారు చేసింది. సోయాబీన్‌కు గతేడాది రూ. 2,600 ఎంఎస్పీ ఉండగా... ఇప్పుడు రూ.2,775 ఖరారు చేసింది. అంటే రూ. 175 పెంచిందన్నమాట. పత్తికి కూడా గతేడాది కంటే రూ. 60 మాత్రమే పెంచింది. పత్తికి గ్రేడ్లనుబట్టి రూ.3,860, రూ.4,160 చొప్పున ఖరారు చేసింది. ఎకరా వరికయ్యే ఖర్చు రూ.45,200 ఎకరా విస్తీర్ణంలో వరి పండించాలంటే అయ్యే ఖర్చు అక్షరాలా రూ.45,200. సాగు సహా ఇతర అన్ని ఖర్చులను లెక్కలోకి తీసుకొని తెలంగాణ సర్కారు గతేడాది ఈ లెక్కగట్టింది. ఆ ప్రకారం క్వింటా వరి పండించాలంటే రైతుకు అయ్యే ఖర్చు రూ. 2,079గా తేల్చింది. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం అందుకు 50 శాతం అదనంగా కలిపి 2016-17 ఖరీఫ్‌లో వరికి ఎంఎస్పీ రూ. 3,118 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఢిల్లీలో నాలుగు నెలల కిందట జరిగిన వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మద్దతు ధరలకు సంబంధించి సమగ్ర నివేదికను కేంద్రానికి అందజేసింది. వరితో పాటు మొక్కజొన్న, కంది, పెసర, సోయాలకు కూడా రైతుకు అయ్యే ఖర్చును, ఎంఎస్పీని నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అలాగే పత్తి సాగు, ఇతర ఖర్చులు క్వింటాకు రూ.5,395 అవుతుందని, ఈ పంటకు మద్దతు ధరగా రూ. 8,092 ఇవ్వాలని కోరింది. మొక్కజొన్న క్వింటా సాగు ఖర్చు రూ. 1,883 అవుతుందని... మద్దతు ధరగా రూ. 2,824 కావాలని కోరింది. సోయాకు సాగు ఖర్చు క్వింటాకు రూ. 3,157 అవుతుందని... మద్దతు ధర రూ. 4,731 ఇవ్వాలని కోరింది. ఈ రకంగా ఎంఎస్పీ ఇస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని... లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ గోడును కేంద్రం లెక్కచేయలేదు. మద్దతు ధరపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉండాలి మద్దతు ధరలను కేంద్రం నిర్ణయించడం సరికాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సాగు, పెట్టుబడి ఖర్చులుంటాయి. స్థాని కంగా ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు ఇంకో విధంగా ఉంటాయి. కాబట్టి మద్దతు ధరలను దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా కేంద్రం నిర్ణయించడం సమంజసం కాదు. సీఏసీపీ సమావేశంలో వరికి మద్దతు ధర రూ. 3 వేలకు పైగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవిస్తే కేంద్రం మాత్రం కేవలం రూ. 1,470కే పరిమితం చేయడం అన్యాయం. - సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షుడు -
పప్పులకు కేంద్రం 'మద్దతు'
సాక్షి, న్యూఢిల్లీ వరి, పప్పు ధాన్యాలకు 2016–17 ఖరీఫ్ సీజన్‌కు కనీస మద్దతు ధరను బుధవారం కేంద్రం పెంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా సాగయ్యే వరి ధాన్యానికి మద్దతు ధరను నామమాత్రంగా క్వింటాలుకు రూ. 60 మాత్రమే పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల రేటు 4.3 శాతమే. అయితే.. అనూహ్యంగా పెరిగిన పప్పు ధరలను అదుపుచేసే ప్రయత్నంలో భాగంగా.. పప్పు ధాన్యాల పంటల సాగును ప్రోత్సహించేందుకు వీటికి మద్దతు ధరను గణనీయంగా పెంచింది. ‘వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్’ సిఫారసులకు అదనంగా రైతులకు మేలు చేసేందుకు మరింత బోనస్ ఇచ్చినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. ఈ ధరలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు కామన్ గ్రేడ్ వరికి రూ. 1,410 ఉన్న మద్దతు ధరను రూ. 1,470కు పెంచింది. రూ. 1,450 ఉన్న గ్రేడ్–ఏ రకం వరికి మద్దతు ధర రూ.1,510కి పెరిగింది. ప్రస్తుతానికి కేంద్రం వద్ద సరిపడినంత స్థాయిలో బియ్యం నిల్వ ఉన్నందున వరికి ఈ మద్దతు ధరలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది విదేశాల నుంచి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి రావటంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో పప్పు ధాన్యాలకు బోనస్‌ను పెంచినట్లు మంత్రి తెలిపారు. 2015–16లో క్వింటాలుకు రూ. 4,625గా ఉన్న కందులకు మద్దతు ధరను 9.2 శాతం మేర పెంచుతూ రూ. 5,050గా ప్రకటించింది. గతేడాది కందులకు బోనస్ రూ.200 ఉండగా.. ఈ ఏడాది మద్దతు ధరలో రూ.425 బోనస్ సమ్మిళితమై ఉంది. మినుములకు 8.1 శాతం బోనస్ ఇస్తూ.. ఇప్పటివరకు క్వింటాలుకు రూ. 4,625గా ఉన్న మద్దతు ధరను ఈఖరీఫ్‌లో రూ. 5 వేలకు పెంచింది. పెసర క్వింటాలుకు ఇప్పటివరకు మద్దతు ధరను రూ. 4,850 నుంచి రూ. 5,225 కు (7.7 శాతం పెంపు) పెంచుతూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వేరుశనగకు గతేడాది రూ. 4,030 మద్దతు ధర ఉండగా ఈ ఏడాది బోనస్ రూ. 100తోపాటు అదనంగా రూ. 90 కలిపి మొత్తంగా క్వింటాలుకు రూ. 4,220గా ప్రకటించింది. నువ్వులకు రూ. 4,700 మద్దతు ధరల ఉండగా.. దీన్ని రూ.5,000లకు పెంచింది. సోయాబీన్ మద్దతు ధరను రూ. 175, పొద్దుతిరుగుడు పువ్వు కు రూ.150 పెంచినట్లు రాధా మోహన్ సింగ్ వెల్లడించారు. మీడియం స్టేపుల్ పత్తి రకానికి ప్రస్తుతం ఉన్న రూ. 3800 ధరకు రూ. 3,860 పెంచారు. అదేవిధంగా.. లాంగ్స్టేç³#ల్ రకానికి ప్రస్తుతం ఉన్న రూ. 4,100 ధరను రూ. 4,160లకు పెంచినట్లు ఆయన తెలిపారు.దీంతోపాటు రాగికి రూ.75, జొన్నకు రూ.60, సజ్జలకు రూ.55, మొక్కజొన్నకు రూ.40 మద్దతు ధర పెంచినట్లు మంత్రి వెల్లడించారు. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు చెన్నై మెట్రోరైలు లైను మొదటి దశ పనులను మరో 9 కిలోమీటర్లు పొడగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వాషర్‌మ్యాన్‌పేట్ నుంచి వింకోంగార్ వరకు లైనును పొడగించనున్న ఈ లైనుతోపాటు రూ.3,770 కోట్ల ప్రతిపాదిత తొలిదశ ప్రాజెక్టును మార్చి 2018 కల్లా పూర్తిచేయన్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అమెరికాతో చేసుకునే ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ధాన్యం పాత ఎంఎస్పీ కొత్త ఎంఎస్పీ పెంపు వరి 1,410 1,470 60 కందులు 4,625 5,050 425 పెసలు 4,850 5,225 375 మినుములు 4,625 5,000 375 వేరుశనగ 4,030 4,220 190 నువ్వులు 4,700 5,000 300 పత్తి 3,800 3,860 60 -
'రైతులను రోడ్డుకు ఈడ్చుతున్నారు'
హైదరాబాద్: ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకటిస్తున్న విధానం వ్యవసాయాన్ని మానుకోండని పరోక్షంగా చెప్పినట్టుగా ఉందని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. 2016-17 సంవత్సరానికి గాను ధాన్యానికి కనీస ధరను రూ.60 పెంచటం రైతులను మనో వేదనకు గురిచేయడమేనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు రైతులకు చేసిన వాగ్దానాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. 50 శాతం లాభం లభించేలా స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ఊరూ వాడా ప్రచారం చేసిందన్నారు. కానీ ఇపుడు ముష్టి వేసినట్టుగా మద్దతు ధర పెంచి రైతును వ్యవసాయం నుంచి రోడ్డుకు ఈడ్చే కార్యక్రమం చేస్తున్నారన్నారు. మద్దతు ధర విషయంలో ఏపీ రాష్ట్ర రైతులే ఎక్కువగా నష్టపోతున్నారని, గత రెండేళ్లుగా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. -
ధర పతనం.. కూరగాయలు ఉచితం
రఘునాథపల్లి: నీటి అవసరం, పెట్టుబడి తక్కువ.. ఆదాయం బాగానే వస్తుందని ఆశించి తనకున్న నాలుగెకరాల్లో కూరగాయలు సాగు చేశాడు ఖిలాషాపూర్‌కు చెందిన కావటి రాజయ్య. చేతికొచ్చిన క్వింటాల్ బీరకాయలు, సుమారు 300 సొరకాయలు అమ్మేందుకు శుక్రవారం మండల కేంద్రానికి తీసుకొచ్చాడు. అరుుతే సొరకాయ ఒకటి రూ.1, బీరకాయ కిలో రూ.4 చొప్పున తీసుకుంటానని అక్కడి వ్యాపారి చెప్పాడు. కనీసం అవి తెంపిన కూలీలకు సరిపడా డబ్బు కూడా రాకపోవడంతో.. ‘వ్యాపారి చెప్పిన ధరకు విక్రయించడం కంటే ఉచితంగా పంపిణీ చేయడమే మేలు’ అని భావించి బస్టాండ్‌వద్దకు తీసుకొచ్చాడు. ‘బీర, సొరకాయలు ఉచితం.. రండి.. తీసుకెళ్లండి’ అని చెప్పడంతో స్థానికులు, పలు గ్రామాలకు చెందిన వారు ఎగబడి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతు రాజయ్య మాట్లాడుతూ ఏ పంట వేసినా రైతుకు అప్పే మిగులుతోందని, పంటలకు మద్దతు ధర వచ్చేంత వరకు తమ బతుకులు మారవని వాపోయాడు. -
ముఖ్యమంత్రికే మద్దతు ధర లేదు: కోదండరెడ్డి
సంగారెడ్డి మున్సిపాలిటీ (మెదక్): స్వయంగా తాను సాగుచేసిన పంటకు మద్దతు ధర లేదని సీఎం కేసీఆర్ దిగాలు చెందితే సామాన్య రైతుల పరిస్థితి ఏమిటని పీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల గడువు దగ్గర పడుతున్నందున రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మెదక్ జిల్లా సంగారెడ్డిలో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కోదండరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో 23 వేల కోట్ల వ్యవసాయ రుణాలుంటే ప్రభుత్వం మాత్రం రూ.17 వేల కోట్లు మాత్రమే ఉన్నట్టు చెప్పడం సరికాదన్నారు. ఇవేకాకుండా మరో 3.50 లక్షల మంది మహిళా రైతుల పుస్తెల తాళ్లు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారన్నారు. బ్యాంకర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగానే తాము ఈ వివరాలను వెల్లడిస్తున్నామన్నారు. అనేక ప్రాజెక్టులకు నిధులిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రైతులకు మొండిచేయి చూపిస్తున్నాయని ఆరోపించారు. -
‘ఉల్లి’ కల్లోలం.. ఆపండి
♦ అధికారులూ కల్లాల్లోకి వెళ్లండి ♦ ఉల్లి రైతుకు అండగా నిలబడదాం ♦ కిలో రూ.12కు విక్రయించే ఏర్పాట్లు చేయండి ♦ మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం ♦ ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దిగుబడి పెరిగి, మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న ఉల్లిగడ్డ రైతులకు అండగా నిలబడదామంటూ భారీ నీటిపారుద ల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. క్వింటాలు ఉల్లికి కనీసం రూ.1200 గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారులను ఆదేశించారు. ఉల్లి రైతు కష్టాన్ని దళారులు దోచుకుంటున్న తీరును వివరిస్తూ ‘కన్నీళ్లు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి హరీశ్‌రావు స్పందించారు. చేతికి అందిన పంట దళారుల పాలుకాకుండ చూసే బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదేనని మంత్రి గుర్తుచేశారు. కల్లాల్లోకి వెళ్లి పంట దళారులకు అమ్ముకోకుండా చూడాలన్నారు. వ్యవసాయ మార్కెట్లలో ప్రస్తుతం పనులు పెద్దగా లేనందున సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లోని మార్కెటింగ్ శాఖ సిబ్బందిని కూడా డిప్యూటేషన్‌పై నారాయణఖేడ్ నియోజకవర్గానికే పంపించాలని సూచించారు. రైతులు పంటను నేరుగా రైతు బజారుకు తరలించి, కిలోకు కనీస మద్దతు ధర రూ.12 కు అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు అవసరమైతే పల్లె వెలుగు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటుచేయాలని నారాయణఖేడ్ డిపో మేనేజర్‌ను ఆదేశించారు. -
మద్దతు ధర మాటేమిటి?
మంత్రి అయ్యన్నను నిలదీసిన చెరకు రైతులు అడ్డుకున్న ఎమ్మెల్యే రాజు ఆందోళన వ్యక్తం చేసిన అన్నదాతలు బుచ్చెయ్యపేట: టన్ను చెరకుకు మద్ధతు ధర ఎంత..గతేడాది ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకు, దవ్వ డబ్బులు ఎప్పుడిస్తారంటూ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును పలువురు చెరకు రైతులు నిలదీశారు. ఆదివారం బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రిని ‘గోవాడ’ రైతులు చుట్టుముట్టారు. క్రషింగ్ ప్రారంభమై నెలన్నర గడిచిపోయినా ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. మంత్రి వివరణ ఇచ్చేలోపే చోడవరం ఎమ్మేల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కల్పించుకుని ఇది సమయం కాదని తర్వాత మాట్లాడుదామని రైతులను వారించడంతో పలువురు తీవ్ర ఆగ్రహం చెందారు. మిల్లుకు గతేడాది సరఫరా చేసిన చెరకుకు సంబంధించి బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. సర్కారు విధానాలతో ఏలా బతకాలని వాపోయారు. టీడీపీ అధికారంలో లేనప్పుడు గోవాడ ఫ్యాక్టరీని తమకు అప్పగిస్తే టన్నుకు రూ.3500 ధర చెల్లిస్తామంటూ రోడ్డేక్కి ఆందోళనలు చేపట్టిన ఎమ్మేల్యే ప్రస్తుతం మద్దతు ధర గురించి ప్రశ్నిస్తే నోరు నొక్కడం శోచనీయమని పేర్కొన్నారు. గోవాడ ఫ్యాక్టరీలో రూ.16 కోట్లకుపైగా అవినీతి చోటుచేసుకుందన్న వాదన నేపథ్యంలో విచారణ జరుగుతుండగా ఎమ్మేల్యే రైతులను వారించడంపై విస్మయం వ్యక్తం చేశారు. -
కందిపప్పు మద్దతు ధర రూ.325 పెంపు
న్యూఢిల్లీ: పప్పుధాన్యాల ధరలు ఎగసిపడుతున్న నేపథ్యంలో రబీ సీజన్లో పప్పు ధాన్యాలకు మద్దతు ధరను రూ. 325 పెంపునకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. గోధుమ మద్దతుధరపై మరో రూ.75 బోనస్ అందించేందుకు ఆర్థికవ్యవహారల కేబినెట్ కమిటీ(సీసీఎఫ్ఏ) ఆమోదం తెలిపింది. దీంతో 2015-16రబీ సీజన్‌కుగాను గోధుమ మద్దతుధర క్వింటాకు రూ.75 పెరిగి రూ.1,525కు చేరుకుంది. నూనెగింజల మద్దతు ధరను క్వింటాకు రూ.250 పెంచారు. పెంపు తర్వాత కందిపప్పు మద్దతుధర రూ.3,325కు, శెనగల మద్దతుధర రూ.3,425కు చేరింది. వ్యవసాయ ఖర్చులు, ధరల సలహా మండలి కమిషన్(సీఏసీపీ) సూచించినట్లుగా ఆరు రబీ పంటలైన గోధుమలు, బార్లీ, శెనగలు, కందిపప్పు, ఆవాలు, కుసుమ నూనె గింజలకు మద్దతుధరను పెంచాలని నిర్ణయించారు. ఆహార బిల్లును ఇంకా అమలుచేయని రాష్ట్రాల్లో పేద, అత్యంత పేద వర్గాలకు 27లక్షల ధాన్యాలను కేటాయించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పటికి 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార బిల్లు అమల్లో ఉండగా.. మిగిలిన రాష్ట్రాలు సెప్టెంబర్ 2015 కల్లా. అమలు చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలనుంచి స్పందన రాలేకపోవడంతో కేంద్రమే పేద వర్గాలకు ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. మద్దతు ధర పెంపుపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హరియాణా సీఎం ఖట్టర్ హర్షం వ్యక్తం చేశారు. బెల్జియం, భారత్ మధ్య వివిధ రంగాల్లో అభివృద్ధికి సహకారం అందించుకోవటంతోపాటు.. పునరుత్పత్తి శక్తికి సంబంధించిన సాంకేతికత విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
మద్దతు అరకొర
రెండోరోజూ పత్తి కొనుగోళ్లు నిల్ {పభుత్వ మద్దతు ధర రూ.4100 {పైవేటు వ్యాపారులు చెల్లిస్తున్న ధర రూ.3900 తేడా రవాణా ఖర్చులకే సరిపోతుందంటున్న రైతులు రూ.6 వేలు చెల్లించాలని డిమాండ్ విజయవాడ : సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు రైతుల నుంచి స్పందన కనిపించటం లేదు. మొదటి రెండు రోజులూ ఒక్క రైతు కూడా పత్తి అమ్మకాల కోసం రాలేదు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.4,100 ప్రకటించగా, ప్రైవేటు వ్యాపారులు రూ.3,900 చెల్లిస్తున్నారు. వ్యాపారులు ఇంటివద్దకు వచ్చి కొంటుండగా, సీసీఐ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కేంద్రాల వద్ద కొనుగోలు చేస్తున్నారు. రవాణా ఖర్చులు సీసీఐ రైతులకు చెల్లించదు. దీంతో మద్దతు ధరకు, వ్యాపారులు చెల్లించే ధరకు తేడా ఉండటం లేదని రైతులు పేర్కొంటున్నారు. రూ.6 వేలిస్తేనే గిట్టుబాటవుతుంది... క్వింటాలు పత్తికి ప్రభుత్వ మద్దతు ధర 2013-14లో రూ.4 వేలు, 2014-15లో రూ.4050 చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ఏడాది రూ. 4100 చెల్లిస్తామని ఏఎంసీ అధికారులు ప్రకటించారు. గతేడాదే కనీస మద్దతు ధర రూ.5వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేసినప్పటికీ రూ.4050 మాత్రమే చెల్లించారు. ఈ ఏడాది ఖర్చులు పెరిగి దిగుబడి కూడా తగ్గే పరిస్థితి నెలకొనటంతో కనీస మద్దతు ధర రూ.6 వేలు ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. ప్రారంభమైంది మూడే... జిల్లా వ్యాప్తంగా 18 మార్కెట్ యార్డులు ఉండగా ఇందులో మైలవరం, తిరువూరు, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేటల్లో మాత్రమే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఈ నెల మూడు నుంచి ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. నందిగామ, మైలవరం మార్కెట్ యార్డుల్లో రెండోరోజుకూ ప్రారంభించలేదు. గతేడాది సీసీఐ వారు, మార్కెట్ యార్డుల్లో ఉద్యోగులు, బయ్యర్లు కలిసి తూకాల్లో మోసాలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఈ వ్యవహారం సీబీఐ వరకూ వెళ్లి అనేక మందిపై కేసులు నమోదు చేసింది. దీంతో ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో ఉద్యోగులు సీసీఐ వారికి సహకరించడం లేదు. తేమ శాతం లెక్కింపులోనూ తేడాలు కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం లెక్కింపులోనూ తేడాలు జరుగుతున్నాయి. ఎనిమిది శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని, అంతకు మించి ఉంటే కొనుగోలు చేయడం సాధ్యం కాదని సీసీఐ సిబ్బంది చెబుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు 12 నుంచి 20 వరకు తేమ శాతం ఉన్నా కొనుగోలు చేస్తున్నారు. పైగా నాణ్యత పేరుతో కొంత పత్తిని పక్కన బెట్టే పరిస్థితి సీసీఐలో ఉంది. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అది లేదు. నిబంధనల పేరుతో సీసీఐ ద్వారా జరిగే కొనుగోళ్లలో తమకు అన్యాయం జరుగుతోందే తప్ప న్యాయం జరగటం లేదనేది రైతుల అభిప్రాయం. అమ్మకాలకు రాని రైతులు జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆర్భాటంగా ప్రారంభించినా ఒక్క రైతూ విక్రయాలకు రాలేదు. దీంతో అధికారులు గోడౌన్లో ఉన్న పత్తి బోరాలను తీసుకొచ్చి కాటా పెట్టి ఫొటో దిగి కొనుగోళ్లు ప్రారంభించామనిపించారు. రెండోరోజైన బుధవారమూ రైతులు రాకపోవటం గమనార్హం. తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని గంపలగూడెం యార్డులో మంగళవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించగా నేటికీ కొనుగోళ్లు జరగలేదు. బుధవారం కొందరు రైతులు పత్తి నమూనాలను పరిశీలించారు తప్ప కొనుగోళ్లు చేపట్టలేదు. ఎ.కొండూరు మండలంలో గుంటూరు పత్తి వ్యాపారులు నేరుగా రైతుల ఇళ్ల వద్దే కొనుగోళ్లు జరుపుతున్నారు. -
మద్దతు ఉత్తిదే..!
మద్దతు ధర పెంపు రూ. 50 మాత్రమే.. నిపుణుల కమిటీ సిఫారసులను పట్టించుకోని ప్రభుత్వం కృష్ణాలో 5, గుంటూరులో 6 కేంద్రాలు 15 నుంచి రైతులకు ఆన్లైన్ చెల్లింపులు సీసీఐ అధికారులతో మంత్రి ప్రత్తిపాటి తేమ శాతాన్ని తగ్గించాలంటున్న రైతులు నేటి నుంచి పత్తి కొనుగోళ్లు .. విజయవాడ బ్యూరో పత్తి కొనుగోళ్లకు సిద్ధమైన ప్రభుత్వం మద్దతు ధరపై చిన్నచూపు చూసింది. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.4,100 ను మద్దతు ధరగా ప్రకటించి రైతులను నిరాశకు గురిచేసింది. మొదటి దశలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మంగళవారం నుంచి పత్తి కొనుగోలుకు ఉపక్రమిస్తోంది. ఈ మూడు జిల్లాల్లోని 12 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలుకు తలుపులు తీసింది. సోమవారం మధ్యాహ్నం గుంటూరులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ అధికారులతో సమావేశమై, ఇందుకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. కిందటేడాది ఇది రూ.4050 గా ఉన్న మద్దతు ధరను ప్రభుత్వం ఈ ఏడాది రూ.4,100గా ప్రకటించింది. కేవలం రూ.50 మాత్రమే పెంచిన ప్రభుత్వం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పత్తి సాగులో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై గత ఏడాది అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ కేంద్ర ధరల నిర్ణాయక కమిషన్‌కు మద్దతు ధరను రూ.7,700 ఉండేలా చూడాలని సిఫార్సు చేసింది. దీన్ని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. నేరుగా అమ్ముకునేలా ఏర్పాట్లు : కిందటేడాది సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. కొంతమంది సీసీఐ బయ్యర్లే దళారుల అవతారమెత్తి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తి కొనుగోళ్లు జరిపారు. దీనివల్ల కౌలు రైతులు లక్షల్లో నష్టపోయారు. కొనుగోళ్ల కుంభకోణంపై సీబీఐ విచారణ కూడా జరిగింది. ఈ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకూడదని నిర్ణయించిన ప్రభుత్వం ఈ సారి జరిగే పత్తి కొనుగోళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రైతులు నేరుగా మార్కెట్‌యార్డులకు పత్తి తెచ్చి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15 నుంచి ఆన్లైన్ పద్ధతిలో రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు చెల్లింపులు జరిపేందుకు చర్యలు తీసుకుంటుంది. కొనుగోలు కేంద్రాలివే : కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 12 కేంద్రాల్లో పత్తి కొనుగోలు జరపనున్నారు. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, జగ్గయ్యపేట, నందిగామ, గంపలగూడెం, మైలవరం యార్డుల్లోనూ, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మాచర్ల, నరసరావుపేట, తాడికొండ, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. కౌలు రైతులకు ఇక్కట్లే : రాష్ట్రం వ్యాప్తంగా ఈ ఏడాది 6.06 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. పత్తి సాగు చేసే రైతుల్లో కౌలు రైతులే ఎక్కువ. వీరిలో చాలా మందికి రుణ అర్హత కార్డులు (ఎల్ఈసీ) కూడా లేవు. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు దొరక్క అందిన చోటల్లా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పత్తి సాగు కోసం పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం పత్తి కొనుగోళ్లు జరిపి 15 నుంచి ఆన్లైన్ పేమెంట్లు చేస్తానంటుంది. ఇదే జరిగితే కౌలు రైతులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పత్తి కొనుగోలు సమయంలో పట్టాదారు పాసుపుస్తకం నెంబరు, రైతు ఆధార్ నెంబర్లను తీసుకునే ప్రభుత్వం నగదు చెల్లింపులను ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కౌలు రైతుల ఆధార్ నెంబర్లు, పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లతో జతకూడే అవకాశాలు ఉండవు. ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఇబ్బందులు పడే వీలుందన్నది రైతు సంఘాల వాదన. అంతేకాకుండా పత్తి కొనుగోలు నిబంధనల్లో తేమ శాతంపై పెట్టిన ఆంక్షలను సవరించాలని కోరుతున్నారు. 14న రాష్ట్ర కౌలు రైతుల సదస్సు : రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి మొమోరాండం సమర్పించేందుకు ఈ నెల 14న గుంటూరులో ఏపీ కౌలు రైతుల సదస్సు నిర్వహించనున్నామని గుంటూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు గద్దె చలమయ్య తెలిపారు. పత్తికి మద్దతు ధర కనీసం రూ.6 వేలు ఉండాలన్నది ప్రధాన డిమాండుగా ఆయన పేర్కొన్నారు. -
వరికి మద్దతు రూ. 1,410
ధాన్యం మద్దతు ధరలు, సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం మేలు రకం ధాన్యానికి రూ.1,450 ప్రస్తుత ఖరీఫ్‌లో 15 నుంచి 20 లక్షల టన్నుల సేకరణకు నిర్ణయం ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ల ద్వారా కొనుగోళ్లు 48 గంటల్లో ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లింపు సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం సేకరణ విధానాన్ని, మద్దతు ధరలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మేలురకం (గ్రేడ్ ఏ)ధాన్యం క్వింటాల్‌కు రూ.1,450, సాధారణ రకానికి రూ.1,410 ధరలతో ధాన్యం సేకరించనున్నట్లు ప్రకటించింది. జీరో లెవీ విధానం అమల్లోకి వచ్చినందున పూర్తిస్థాయి సేకరణను పౌరసరఫరాల శాఖే చేపడుతుందని.. దీనికోసం అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. రైతులకు సొమ్మును 48 గంటల్లో ఆన్లైన్ ద్వారా చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు కొత్త ధాన్యం సేకరణ మార్గదర్శకాలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ రజత్‌కుమార్ విడుదల చేశారు. - జీరో లెవీ అమల్లో ఉన్న కారణంగా ప్రస్తుత ఖరీఫ్‌లో 15 నుంచి 20 లక్షల టన్నులు, రబీలో 20 నుంచి 25 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తారు. - ధాన్యం సేకరణ కేంద్రాలను ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ల ద్వారా తెరిపించే బాధ్యతను పౌర సరఫరాల శాఖ తీసుకోవాలి. - కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం మొత్తాన్నీ కచ్చితంగా కొనాలి. విసృ్తత ప్రచారం ద్వారా మద్దతు ధర, ధాన్యం నాణ్యత వివరాలు, కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించాలి. మిల్లింగ్ కేంద్రాలకు దగ్గరగా ఈ కేంద్రాల ఏర్పాటు జరగాలి. ఈ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది జాయింట్ కలెక్టర్లు ముందుగానే గుర్తించాలి. - ఒకవేళ ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల నిర్వహణకు సంఘాలు ముందుకు రాకుంటే మార్క్‌ఫెడ్ సేవలను లేక ఇతర సహకార సంఘాల సేవలను వినియోగించుకోవాలి. - కొనుగోలు కేంద్రాల్లో షెల్టర్లు, తాగునీరు, మూత్రశాలలు వంటి మౌలిక వసతులు కల్పించాలి. కొనుగోలుకు అవసరమైన గోనె సంచులు, ధాన్యం క్లీనర్లు, టార్పాలిన్లను ముందుగానే సమకూర్చుకోవాలి. - కొనుగోలు కేంద్రాల్లో రైతుల బ్యాంకు ఖాతా వివరాలతో సహా అన్ని రకాల వివరాలు డేటాబేస్‌లో పొందుపర్చాలి. బ్యాంకు ఖాతాలు లేని రైతులు ఎవరైనా ఉంటే వారిచే ఖాతాలు తెరిపించేందుకు చొరవ చూపాలి. - కొనుగోలు కేంద్రాలకు ఎవరు ముందుగా ధాన్యం తీసుకొస్తే వారి ధాన్యాన్ని ముందుగా సేకరించాలి. వేచిచూసే పరిస్థితులు రానీయకుండా ఏ ఊరు ధాన్యాన్ని ఎప్పుడు సేకరిస్తారో ముందుగానే షెడ్యూల్ విడుదల చేయాలి. - ధాన్యాన్ని వెంటనే కస్టమ్ మిల్లింగ్‌కు పంపి, వచ్చిన బియ్యాన్ని వెంటనే ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖకు పంపాలి. - కస్టమ్ మిల్లింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించి, దీన్ని పాటించని మిల్లర్లపై తగు చర్యలు తీసుకోవాలి. -
పత్తి మద్దతు ధర కోసం రైతు ఆమరణ దీక్ష
-
మద్దతు ధర కోసం ఆమరణ దీక్ష
ఆదిలాబాద్: రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలని.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన రైతు కిషోర్రావు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ గత నెల 26న మార్కెట్‌యార్డులోనే పత్తి కొనుగోలు ప్రారంభించారన్నారు. అక్కడ వేలం పాట ద్వారా ధర నిర్ణయించిన అనంతరం తేమ సాకుతో కొనుగోలుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. మొదటి రోజు మాత్రమే రైతులు తీసుకొచ్చిన పత్తిని తేమ చూడకుండా వ్యాపారులు కొనుగోలు చేశారని, తదుపరి పరిస్థితి అధ్వానంగా తయారైందని తెలిపారు. రైతులకు మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధరలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రూ.4,100 మద్దతు ధర చెల్లించి ఆదుకునే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
'ఆ మద్దతు ధర ఏ మూలకు సరిపోతుంది'
హైదరాబాద్: రైతులకు ముష్టి వేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచిందని వైఎస్సార్సీపీ నేత నాగిరెడ్డి అన్నారు. క్వింటాల్ వరికి పెంచిన రూ.50, వేరు శెనగకు రూ.30, పత్తికి రూ.50 ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. బీజేపీకి భాగస్వామ్య పక్షమైన టీడీపీ మద్దతు ధర పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు కోరడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతపురంలో వేరు శెనగ విత్తనాల పంపిణీ కోసం రైతులు రోడ్లెక్కారని, ఇలాంటి పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం వల్లే వచ్చిందని ఆరోపించారు. ఏపీ సర్కార్‌కు విత్తనాలు సరఫరా చేయడం చేతకాక ప్రైవేట్ మార్కెట్లో కొనుక్కోమంటుందని, అది సిగ్గుచేటని విమర్శించారు. -
మార్క్‌ఫెడ్‌లో ముక్కిన మక్కలు!
⇒ దళారులతో కుమ్మక్కై పురుగులు పట్టిన మొక్కజొన్న సేకరణ ⇒ కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ నిరాకరణ ⇒ అడ్డదిడ్డంగా టెండర్లు పిలిచి అమ్మేసిన వైనం ⇒ మార్కఫెడ్కు రూ. 100 కోట్లు నష్టం సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. దళారుల నుంచి పురుగులు పట్టిన, పుచ్చిపోయిన మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసి... ఆ తర్వాత అతి తక్కువ ధరకు వ్యాపారులకు కట్టబెట్టడుతున్నారు. దీంతో మార్క్‌ఫెడ్‌కు అక్షరాలా రూ. 100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మక్కల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి రెండు లేఖలు ఇచ్చినా... సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పినా మార్క్‌ఫెడ్ యంత్రాంగం స్పందించడం లేదు. పురుగుపట్టిన మొక్కజొన్నగా నిర్ధారించిన ఎఫ్‌సీఐ తెలంగాణలో సుమారు 15 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తారు. రైతులు పండించిన మక్కలను కొనుగోలు చేసేందుకు మార్కెట్ యార్డుల్లో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఆ ప్రకారం 2013-14లో మార్క్‌ఫెడ్ తెలంగాణలో రూ.13,100 కనీస మద్దతు చెల్లించి సుమారు 2.52 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. అందులో దాదాపు సగం వరకు దళారుల నుంచి కొనుగోలు చేసినట్లు అంచనా. మార్కఫెడ్ సేకరించిన వాటిని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలుకు ముందు గతేడాది మొక్కజొన్నలను పరిశీలించిన ఎఫ్‌సీఐ సాంకేతిక బృందం 27 వేల టన్నులు పురుగుపట్టిన స్టాక్ ఉందని నివేదిక ఇచ్చింది. మిగిలిన స్టాక్కూడా అదే విధంగా ఉంటుందని భావించిన ఎఫ్‌సీఐ మార్కఫెడ్ సేకరించిన 2.52 లక్షల టన్నులలో 2 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కార్‌కు మిగిలిన స్టాక్ ఏం చేయాలో పాలుపోక టెండర్లు పిలిచి అమ్మించాలని నిర్ణయించింది. ఆ మేరకు టెండర్లు పిలిచి 2014 జూలై నుంచి డిసెంబర్ వరకు 2.50 లక్షల టన్నులు అమ్మేసింది. అయితే దళారులు, రైతుల నుంచి మద్దతు ధర రూ. 13,100కు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ టెండర్ల ద్వారా వ్యాపారులకు సరాసరి రూ. 10 వేల వరకు మాత్రమే విక్రయించింది. అలా టన్నుకు రూ. 3 వేల చొప్పున మొత్తం రూ. 75 కోట్లు నష్టం వాటిల్లింది. గోదాముల చార్జీలు, నిల్వ చార్జీలు కలిపి మరో రూ. 25 కోట్ల మేరకు ఉంటాయని అంచనా. ఆ చార్జీలను కూడా ఎఫ్‌సీఐ రాష్ట్రానికి చెల్లించలేదు. దీంతో మార్క్‌ఫెడ్‌కు రూ. 100 కోట్ల మేరకు నష్టం వచ్చింది. 2014-15లో మార్కఫెడ్ సేకరించిన 3 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ ఇప్పటి వరకు ఆమోదం తెలపకపోవడం గమనార్హం. అవినీతి అధికారులకు బదిలీలతో సరి... అక్రమాలు జరిగాయని ఆరు నెలల క్రితం అప్పటి మార్క్‌ఫెడ్ ఎండీ దినకర్‌బాబు నిర్ధారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కిందిస్థాయి అధికారులు స్పందించలేదు. చివరకు వ్యవసాయ, సహకార ముఖ్య కార్యదర్శి ఈనెల 21న జీఎంకు లేఖ రాసినా చర్యలు శూన్యం. మరోవైపు జిల్లాల్లో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకుండా బదిలీలతో సరిపెడుతున్నారు. ప్రస్తుతం నిషేధం ఉన్నా గత శుక్రవారం 13 మందిని బదిలీ చేశారు. -
సీసీఐ అవినీతిపై సీబీఐ విచారణ
అక్రమార్కుల గుండెల్లో వణుకు తప్పించుకునే మార్గాల కోసం అన్వేషణ ఫోన్ కాల్స్‌కూ స్పందించని వైనం సాక్షి ప్రతినిధి, గుంటూరు : సీసీఐలో చోటు చేసుకున్న భారీ అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టడంతో అవినీతి అధికారులు వణికిపోతున్నారు. గుంటూరులోని సీసీఐ కార్యాలయంలో బుధవారం సీబీఐ అధికారులు నిర్వహించిన విచారణలో కీలక సమాచారాన్ని సేకరించారు. కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు నామ్‌కే వాస్తే దర్యాప్తు కొనసాగుతుందని, విచారణ సమయానికి రికార్డులు తారుమారు చేసి గండం నుంచి బయటపడవచ్చని భావించిన వీరంతా కలవరం చెందుతున్నారు. ఈ అక్రమాల్లో సీసీఐ, మార్కెటింగ్ శాఖలు, దళారులు, బయ్యర్లు, స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల యజమానులు భాగస్వాములుగా ఉన్నారు. ప్రజాప్రతినిధుల బంధువులమని, అనుచరులమని పనులు చేయించుకున్న వారంతా సీబీఐ రంగ ప్రవేశంతో సెల్‌ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు. రైతుకు దక్కని మద్దతు ధర.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 43 సీసీఐ కోనుగోలు కేంద్రాల్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. మొత్తం 93 లక్షల క్వింటాళ్లను కొనుగోలు కేంద్రాల ద్వారా సీసీఐ కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. టీడీపీలో సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు భారీగా వ్యాపారం కొనసాగించారు. రైతుల నుంచి క్వింటాలు రూ.3000కు కొనుగోలు చేసి రూ.4000కు సీసీఐ కొనుగోలు కేంద్రానికి విక్రయించి క్వింటాకు వెయ్యి రూపాయల లాభం పొందారు. వీటితోపాటు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించకుండా నేరుగా జిన్నింగ్ మిల్లులకు తరలించి రవాణా చార్జీలను స్వాహా చేశారు. ఈ రెండు వ్యవహారాల్లో రూ.400 కోట్ల అవినీతి జరగడంతో ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర సామాన్యరైతుకు దక్కకుండా పోయింది. కృష్ణా జిల్లా నందిగామ సీసీఐ కొనుగోలు కేంద్రానికి రాష్ట్రమంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరులు లక్ష క్వింటాళ్లకు పైగా విక్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడి కొనుగోలు కేంద్రంలో 1.46 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే, మంత్రి అనుచరులే లక్ష క్వింటాళ్లను అమ్మారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం నుంచి క్వింటా రూ. 2700 నుంచి రూ.3000 వరకు కొనుగోలు చేసి నందిగామ సీసీఐ కేంద్రానికి క్వింటా రూ. 4000 చొప్పున అమ్మినట్లు సమాచారం. మంత్రి మిల్లును అద్దెకు తీసుకున్న సీసీఐ.. గణపవరం వేలూరు డొంకలో ఉన్న మంత్రి పుల్లారావుకు చెందిన స్పిన్నింగ్ మిల్లులో జిన్నింగ్, టీఎంసీ యూనిట్లను సీసీఐ అద్దెకు తీసుకొని పెద్ద ఎత్తున పత్తిని జిన్నింగ్ చేశారు. మంత్రి అనుచరులు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రానికి తరలించకుండా ఈ మిల్లుకే తరలించి రవాణా చార్జీలు స్వాహా చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సీసీఐ అధికారులు కీలకంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో మార్కెటింగ్‌శాఖ జేడీ నుంచి యార్డు కార్యదర్శుల వరకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయి. మార్కెటింగ్‌శాఖ మంత్రి జిల్లాలో అధికారుల లీలలు మార్కెటింగ్ శాఖ అధికారులు సైతం దోపిడీకి పాల్పడ్డారు. క్వింటా పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన సెస్ రూ.10 నుంచి రూ.13 ఉంటే, మార్కెట్ యార్డు అధికారులు నియమించిన వ్యక్తులు క్వింటాకు రూ. 40 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నారు. సీసీఐ బయ్యర్లు నేరుగా పత్తిని జిన్నింగ్ మిల్లులకు తరలించినా యార్డు అధికారులకు మామూళ్లు అందజేయాల్సిందే. ఇలా వసూలు చేసిన నగదును రోజూ యార్డు ఉన్నతాధికారి మొదలు కిందస్థాయి అధికారి వరకు పంచుకుంటారు. ఇలా జిల్లాలోని 11 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్ శాఖ అధికారులు చక్రం తిప్పుతున్న వ్యవహారంపైనా సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. -
కందిపోయిన దిగుబడి కలిసిరాని రాబడి
ధర చూసి మురిసిపోవాలో.. దిగుబడి చూసి దిగాలు చెందాలో.. అర్థం కాని పరిస్థితి కంది రైతులది. గతేడాది గణనీయంగా ఉన్న దిగుబడి.. ఈసారి అదే స్థారుులో దిగజారింది. ఆ సమయంలో మద్దతు ధరకు నోచుకోని రైతులు.. ఇప్పుడేమో వ్యాపారులు ముందు చూపుతో మద్దతు ధరకు మించి అదనంగా రూ.వెయి చెల్లిస్తున్నారు. గతేడాది ఎక్కువ దిగుబడి వస్తే క్వింటాల్‌కు రూ.3,900 నుంచి రూ.4,600లోపు చెల్లించి కొనుగోలు చేశారు. ఈసారి ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా దిగుబడి రాకపోవడంతో మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,350కి అదనంగా రూ.వెరుు్య వరకు చెల్లిస్తున్నారు. - కంది ధర పెరిగినా.. దిగుబడి రాని వైనం - మద్దతు ధర కంటే అదనంగా రూ.1000 వరకు.. ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి సగానికి పైగా పడిపోయింది. వీటిలో కంది దిగుబడి కూడా గణనీయంగా తగ్గింది. పంట ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉన్నా.. 3 నుంచి 4 క్వింటాళ్లు దాటలేదు. ఈ పంటకు వ్యవసాయ మార్కెట్ యూర్డులో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,350 ఉండగా.. ఈ ధర కంటే అదనంగా మరో రూ.వెరుు్య వరకు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఎక్కువ దిగుబడి రావడంతో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.3,900 నుంచి రూ.4,600 లోపు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.5,000 నుంచి రూ.5,600 వరకు చెల్లిస్తున్నారు. దిగుబడి తగ్గి వినియోగం పెరుగుతుం దనే కారణంతోనే ఇక్కడ మద్దతు ధర పెంచినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర మార్కెట్ ఇంధన్ఘడ్లో ఎక్కువ ధర చెల్లిస్తుండడంతో ఇక్కడా మద్దతు ధరకు రెక్కలొచ్చాయని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో కంది పంట 43,350 హెక్టార్లలో సాగు చేశారు. దీని ప్రకారం జిల్లాలో ఆశించినంత వర్షాలు కురిస్తే సుమారుగా ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల చొప్పున మొత్తం మూడున్నర నుంచి నాలుగు లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ.. రెండు లక్షలు కూడా దాటలేదు. గతేడాది ఇదే సమయూనికి ఆదిలాబాద్ మార్కెట్ యూర్డులో వ్యాపారులు 47,980 క్వింటాళ్లు కొనుగోలు చేయగా.. ఈసారి 7,102 క్వింటాళ్లు మాత్రమే వచ్చారుు. వర్షాభావ పరిస్థితులే కారణం.. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో విత్తుకున్న పంటలు వర్షాలు లేక మొలకెత్తలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు, మూడేసి సార్లు విత్తారు. పంట కాలం పూర్తరుునా జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. 1094 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను.. 746 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులే స్వయంగా జిల్లాలో 52 మండలాలకు గాను 40 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. వర్షాభావంతో వాణిజ్య పంటలతోపాటు ఆహారధాన్యాల పంటలైన వరి, కంది, పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, తదితర పంటల దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో దిగుబడిపై ప్రభావం.. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం, పప్పు దినుసుల ధరలు భగ్గుమంటున్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నారుు. అందుకే.. ప్రస్తుతం వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ఒక్క మార్కెట్లోనే కొనుగోళ్లు.. జిల్లాలో 19 వ్యవసాయ మార్కెట్లు ఉండగా.. ఎక్కువగా సాగు చేసే ప్రాంతాలకు అనుగుణంగా ఏటా నిర్మల్, భైంసా, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరుగుతాయి. ఆయూ ప్రాంతాల్లో పంట దిగుబడి ఎక్కువగా రాకపోవడంతో నిర్మల్, భైంసా మార్కెట్యూర్డుల్లో కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఒక్క ఆదిలాబాద్ మార్కెట్లో మాత్రమే కొనుగోళ్లు చేపడుతున్నారు. దిగుబడి సగానికి తగ్గింది.. పోయినేడు పదెకరాలు సోయా పంటలో అంతర పంటగా కంది సాగు చేసిన. 13 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది పదెకరాలు సాగిచేసినా. అరుునా.. 4 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే పండింది. పోయేనేడు ధర తక్కువగా ఉండే. ఈసారి ధర ఎక్కువగా ఉంది. కానీ.. పంట సగం వరకు ఎండిపోయింది. - సంతోష్, గిరిగాం, తాంసి మండలం ధర ఎక్కువ.. దిగుబడి తక్కువ.. చేనులో పంట దిగుబడి తగ్గింది. మార్కెట్లో ధర మాత్రం పెరిగింది. కానీ.. ఈ ఏడాది విత్తనం, ఎరువుల, కూలీల ధర గతం కంటే ఎక్కువగా ఉంది. వర్షాలు లేక పంట దిగుబడి బాగా తగ్గింది. ధర చూసి సంబరపడాలో పంట దిగుబడి చూసి ఏడవలో అర్థం కావడం లేదు. నాలుగెకరాల్లో 10 క్వింటాళ్ల వరకు రావాల్సింది. మూడున్నర క్వింటాళ్లకు తగ్గింది. - గంగుల నర్సింగ్, రమాయి గ్రామం, ఆదిలాబాద్ మండలం -
పత్తిరైతు చిత్తు
పత్తి రైతు దగా పడుతున్నాడు. రైతులకు మద్దతు ధర కల్పించి అండగా నిలవాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనూ దళారులదే రాజ్యమవుతోంది. కేంద్రాల్లో నిబంధనలతో విసిగి వేసారిన రైతులు తప్పనిసరై దళారులకు పత్తిని విక్రయిస్తూ నష్టపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వ మద్దతు ధర కాగితాలకే పరిమితమవుతోంది. క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతులు నష్టపోతున్నారు. - సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇక్కట్లు - మద్దతు ధర కరువు - బినామీ పేర్లతో వ్యాపారుల అమ్మకాలు - కాగితాలకే పరిమితమవుతున్న మద్దతు ధర ఒంగోలు టూటౌన్: ప్రస్తుతం మార్కెట్లో పత్తికి పెద్దగా డిమాండ్ లేదు. దీంతో ఇప్పటికే తీవ్రనష్టాల్లో ఉన్న పత్తిరైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో క్వింటా పత్తికి రూ.3,750 నుంచి రూ.4,050 మధ్య చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ మద్దతు ధర రైతులకు దక్కడం లేదు. వ్యాపారులే రైతుల అవతారం ఎత్తి సర్కారు మద్దతు దక్కించుకుంటున్నారు. సీసీఐ కేంద్రాల్లో సమస్యల వలన రైతులు గిట్టుబాటు పొందలేకపోతున్నారు. చెల్లింపుల జాప్యం, తేమశాతం, రంగు మారిందన్న సాకుతో ధరల్లో కోత పెడుతుండటం రైతులను నిరాశకు గురిచేస్తోంది. దీన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు రూ.3,500 క్వింటాకు ఇవ్వడంతో గత్యంతరం లేక అక్కడే అమ్ముకుంటున్నారు. ఫలితంగా క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు పత్తిరైతులు నష్టపోతున్నారు. ఏటా ఇదే తంతు కొనసాగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో అలవిమాలిన నిర్లక్ష్యం విహ స్తోంది. జిల్లాలో ఖరీఫ్, వేసవి పత్తి 56,167 హెక్టార్లు లక్ష్యం కాగా రెండూ కలిపి 75,571 హెక్టార్లు సాగు చేశారు. ఇందులో సమ్మర్ కాటన్ 12,517 హెక్టార్ల కన్నా ఎక్కువే సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఖర్చులు, పరిస్థితులు అనుకూలించక దిగుబడులు సగానికి సగం పడిపోయాయి. దీనికి తోడు కూలీల డిమాండ్ పెరిగిపోవడంతో కొన్నిచోట్ల పొలాల్లోనే దిగుబడిని వదిలేశారు. నష్టాలబాటలో అవస్థలు ఎదుర్కొంటున్న పత్తిరైతుకు మద్దతు ధర ఇవ్వాల్సింది పోయి సీసీఐ కేంద్రాలు ఇంకా కష్టాలు, చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తేమశాతం, రంగుమార్పు, ధ్రువీకరణ పత్రం వంటి నిబంధనలతో వేధిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు రూ.4,050 పొందాలంటే అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ఎనిమిది సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించిన చోట దళారులు రాజ్యమేలుతున్నారు. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాలకే పరిమితమవుతోంది. నిబంధనల పేరుతో ఓవైపు సీసీఐ కేంద్రాల్లో పత్తిని సక్రమంగా కొనుగోలు చేయడంలేదు. ఇదే అదునుగా దళారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిబంధనలతో బెంబేలు: సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకుందామని గంపెడాశతో వచ్చిన రైతులు ఇక్కడి నిబంధనలు చూసి బెంబేలెత్తుతున్నారు. తేమ 12 శాతం కంటే తక్కువ ఉండాలనే నిబంధన రైతుల పాలిట శాపమైంది. అసలే శీతాకాలం కావడం, మార్కెట్‌కు రైతులు రాత్రిపూట పత్తిని తీసుకువస్తుండటంతో మంచు కారణంగా తేమ శాతం పెరుగుతోంది. దీన్ని అడ్డంపెట్టుకొని తేమశాతం ఎక్కువగా ఉందనే పేరుతో సీసీఐ సరుకును మద్దతు ధరకు కొనుగోలు చేయడంలేదు. కేవలం రూ.3,200 నుంచి రూ.3,300 మధ్యే కొనుగోలు చేయడం రైతులను కుంగదీస్తోంది. దళారుల పన్నాగం: సీసీఐ నిబంధనలను దళారులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. తేమశాతం, రంగు మారడం, డబ్బు చెల్లింపుల్లో ఆలస్యం..తదితర ఇబ్బందులు సీసీఐ కేంద్రాల్లో రైతులకు ఎదురవుతుండటంతో దీనిని అసరాగా చేసుకుని దళారులు రైతుల నుంచి క్వింటాలు రూ.3,500 లోపు ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని బినామీ రైతుల పేర్లతో దళారులు, కొందరు కమీషన్ వ్యాపారులు సీసీఐ కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారుల అండదండలతో ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం: జిల్లాలో 15 ఏఎంసీలు ఉండగా వాటి పరిధిలో పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి, పూసపాడుల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. నవంబర్‌లో ఒకటి, రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా..మరికొన్ని జనవరిలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 16 లక్షల 4 వేల క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ప్రైవేట్ వ్యాపారులు దాదాపు 2 లక్షలకు పైగా క్వింటాళ్లు వరకు కొనుగోలు చేస్తుంటారని అధికారులు చెబుతున్నారు. సకాలంలో కేంద్రా లు ఏర్పాటు చేయకపోవడం, వెంటనే డబ్బులు చెల్లించకపోవడం, తేమ శాతం అడ్డంకి, ఇలా పలు కారణాలు, రైతుల ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా రూ.3,500 లకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. పైగా ప్రైవేట్ వ్యాపారులు వెంటనే డబ్బు చెల్లిస్తుండటంతో అప్పుల బాధ తాళలేక కొంతమంది రైతులు అటువైపే మొగ్గుచూపుతున్నారు. రైతుల నుంచి కొన్న పత్తిని రైతుల పేరుమీదనే సీసీఐకి అమ్మి దళారులు సొమ్ము చేసుకుంటూ లాభపడుతున్నాడు. పంట పండించిన రైతు గిట్టుబాటు ధర పొందలేక దిగజారిపోతున్నాడు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం లేదు: మార్కెట్ ఏడీ సయ్యద్ రఫీ అహ్మద్ పత్తిని రైతుల నుంచి దళారులు కొన్నా..చెక్‌పోస్టుల ద్వారా మార్కెట్ ఫీజు వసూలు చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ఉండదు. నిబంధనల ప్రకారమే పత్తిని సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. రూ.3,880 నుంచి రూ.3,900 వరకు కొంటున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి. -
సాగర్ జలాలపై చర్చిస్తాం-మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు: సాగర్ జలాల విషయంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కౌలు రైతులు గురువారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాగర్ కుడి కాలువకు నీరు నిలుపదల విషయమై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఒక వేళ వారు సానుకూలంగా వ్యవహరించకుంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. మొక్కజొన్న పంటకు క్వింటాల్ కు రూ.1310 మద్దతు ధర కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు తక్కువ ధరకు పంట అమ్ముకోవద్దని మంత్రి సూచించారు. అవసరమైతే ప్రత్యేకంగా పంట కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. (చిలకలూరిపేట) -
దళారీ వ్యవస్థను అరికట్టండి: గవర్నర్
అనంతపురం: దళారీ వ్యవస్థను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం మార్కెట్ సదుపాయం కల్పించాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురంలోమాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్నిపెంపొందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రైతులు విక్రయిస్తున్న ధరకు, మార్కెట్లో విక్రయిస్తున్న ధరకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. పంట పండించిన రైతుకు ఆదాయం దక్కినపుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని గవర్నర్ తెలిపారు. జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని గవర్నర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం కదిరి జూనియర్ కాలేజ్‌లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎంసెట్, జల వివాదాలు లేకుండా చూడాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మల్యే చాంద్ భాషా గవర్నర్ ను కోరారు. వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థ అరికట్టాలన్న గవర్నర్ సూచనను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
'పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు'
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం విజయవాడలో నాగిరెడ్డి మాట్లాడుతూ... ఎగుమతులు, దిగుమతులు రైతులను సంక్షోభంలోకి పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఇప్పటి వరకు ఏ గ్రామంలో అమలైందో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు పంటకు మద్దతు ధర కల్పించాని ప్రభుత్వాన్ని కోరారు. -
కందులు @ రూ.5100
తాండూరు: కందుల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. కందులకు అధిక ధర పలుకుతుండడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,350 ఉండగా మార్కెట్లో రూ.5,100 పలుకుతోంది. క్వింటా కందులకు అదనంగా రూ.750 ధర లభిస్తున్నది. కందులకు డిమాండ్ ఉండటంతోనే అధిక ధర రావడానికి కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఎర్ర, తెల్ల, నల్ల కందుల కొనుగోళ్లతో కళకళలాడుతున్నది. బుధవారం యార్డులో ఎర్ర కందులకు గరిష్టంగా రూ.5,230, కనిష్టంగా రూ.5వేలు, సగటు ధర రూ.5,100 ధర పలికింది. సగటు ధర ప్రకారం రూ.79.56లక్షల విలువ చేసే 1560 క్వింటాళ్ల ఎర్ర కందులను యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. నల్ల కందులు క్వింటాలుకు రూ.4,925, రూ.4,900, రూ.4,920 ధర పలికింది. సగటు లెక్కన రూ.2,95,200 విలువచేసే 60 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. తెల్లకందులు క్వింటాలుకు రూ.5,211 -రూ.5,200 ధర వచ్చింది. కనిష్ట ధర చొప్పున రూ.2.86లక్షల విలువ చేసే 55 క్వింటాళ్లను కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. మొత్తం యార్డులో రూ.85,37,200 విలువచేసే 1,675 క్వింటాళ్ల కందుల వ్యాపార లావాదేవీలు జరిగాయి. కొనుగోలు చేసిన కందులను కమీషన్ ఏజెంట్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రవాణా చేస్తున్నారు. వరికి లభించని ‘మద్దతు’ మార్కెట్ యార్డులో సాధారణ రకం వరిధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. దాంతో రైతులు నష్టపోతున్నారు. సాధారణ రకం వరి ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.1,360 ఉంది. బుధవారం యార్డులో క్వింటాలు ధాన్యానికి గరిష్టంగా రూ.1,250, కనిష్టంగా రూ.1,220, సగటు ధర రూ.1,240 పలికింది. సగటు ధర ప్రకారం చూసినా వరి రైతులకు మద్దతు ధర లభించలేదు. క్వింటాలుకు సుమారు రూ.120 చొప్పున రైతులు నష్టపోయారు. సగటు ధర లెక్కన రూ.3,22,400 విలువ చేసే 260 క్వింటాళ్ల వరిధాన్యాన్ని కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. -
జీరో దందా
ఖమ్మం వ్యవసాయం : ఆరుగాలం కష్టించినా నిబంధనల పేరుతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించని అధికారులు అక్రమ వ్యాపారులకు మాత్రం అండదండలు అందిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల జీరో దందాకు రాచమార్గం వేస్తున్నారు. దొడ్డిదారిన సరుకులు తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారికి బాసటగా నిలుస్తున్నారు. పొంతన లేని లెక్కలు జిల్లాలో పంటల సాగు విస్తీర్ణాన్ని, అందులో పంట ఉత్పత్తులను జిల్లా వ్యవసాయ శాఖ ప్రకటిస్తుంటుంది. రైతులు పండించిన ఉత్పత్తులను గ్రామాలు, వ్యవసాయ మార్కెట్లలో అమ్ముతుంటారు. ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వ్యాపారులు మార్కెటింగ్, వాణిజ్య పన్నుల శాఖలకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మార్కెటింగ్ శాఖకు ఒక శాతం సెస్‌ను, వాణిజ్యపన్నుల శాఖకు 4 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. వ్యవసాయ శాఖ పేర్కొన్న విధంగా పంట ఉత్పత్తుల మొత్తానికి పన్నులు జమకావడం లేదు. 30 నుంచి 40 శాతం పంట ఉత్పత్తులను రికార్డుల్లో చేర్చడం లేదు. ఈ సరుకును అక్రమంగా తరలిస్తూ (జీరో దందా) ప్రభుత్వ శాఖల ఆదాయానికి గండిపెడుతున్నారు. అక్రమాలు ఇలా... జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు పెసర, కంది, మినుము, వేరుశనగ తదితర పంటలను పండిస్తున్నారు. వీటితోపాటు కూరగాయలు, ఆకు కూరలు, మామిడి, బొప్పాయి, జామ తదితర పండ్లను కూడా పండిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా సాగవుతున్న పంటల ఉత్పత్తులు, వాటి నుంచి వాస్తవంగా రావాల్సిన పన్నులు, ప్రస్తుతం వస్తున్న పన్నులను పరిశీలిస్తే ప్రభుత్వ ఆదాయం ఎంత మేరకు గండి పడుతుందో అర్థమవుతుంది. వరి పంటను (2013-14 ఖరీఫ్, రబీలను) పరిశీలిస్తే జిల్లాలో సుమారు 2.50 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. ఈ విస్తీర్ణం నుంచి 1.20 కోట్ల క్వింటాళ్ల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పంట ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ శాఖకు సుమారు 15 కోట్ల మేరకు సెస్ రావాల్సి ఉంటుంది. కానీ 2013-14 సంవత్సరంలో 44.91 లక్షల క్వింటాళ్ల పంట ఉత్పత్తికి మాత్రమే రూ. 6 కోట్ల సెస్ వసూలయ్యాయి. మిర్చిని 30 వేల హెక్టార్లలో(2013-14) సాగు చేశారు. 18 లక్షల క్వింటాళ్ల పంట ఉత్పత్తి అవుతోంది. ఈ మొత్తం నుంచి మార్కెటింగ్ శాఖకు సుమారు రూ.10 కోట్ల మేరకు సెస్ వసూలు కావాల్సి ఉంటుంది. అయితే... మార్కెటింగ్ శాఖ లెక్కల ప్రకారం 11.53 లక్షల క్వింటాళ్లు మాత్రమే లెక్కల్లో కనిపిస్తున్నాయి. వీటి ద్వారా రూ.6.88కోట్లు మాత్రమే సెస్ వసూలైంది. మొక్కజొన్నను పరిశీలిస్తే 2013-14లో సుమారు 40 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఈ విస్తీర్ణం నుంచి సుమారు 25 లక్షల క్వింటాళ్ల మేరకు దిగబడి వస్తోంది. దీని నుంచి సుమారు 4 కోట్లకు పైగా సెస్ వస్తోంది. అయితే.. 23 లక్షల క్వింటాళ్లకు మాత్రమే సెస్ వసూలైంది. రూ.2.99 కోట్లు సెస్ రూపంలో వసూలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. పత్తి, పెసర, మినుము, కంది తదితర పంటల ఉత్పత్తులు, మార్కెట్‌కు అందుతున్న సెస్ కూడా తక్కువగా ఉంటుంది. జిల్లాలోని 13 వ్యవసాయ మార్కెట్లు, 33 చెక్‌పోస్టుల నుంచి పంట ఉత్పత్తుల సెస్ వసూలవుతోంది. ఏటా సుమారు రూ.33 నుంచి 34 కోట్ల వరకు సెస్ వస్తోంది. ఈ మార్కెట్ సెస్ ఆధారంగా వాణిజ్య పన్నుల శాఖ నాలుగు వంతుల పన్నును వసూలు చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్ శాఖకు సుమారు 30 నుంచి 40 శాతం పంట ఉత్పత్తుల సెస్ చెల్లించకపోవటంతో దాదాపు రూ.15 కోట్లు గండి పడుతోంది. రూ.15 కోట్లు మార్కెటింగ్ శాఖకు చెల్లించకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖకు రూ.60 కోట్ల రాబడి తగ్గింది. అన్నిరకాల పంట ఉత్పత్తుల నుంచి మొత్తంగా రూ.75 నుంచి రూ.100 కోట్ల వరకు పన్నులు ప్రభుత్వానికి అందకుండా పోతున్నాయి. వ్యాపారుల దందాకు అండ పన్నులు ఎగవేయడానికి వ్యాపారులు జీరో దందాకు తెరతీశారు. గ్రామాలు, మార్కెట్లలో కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను మార్కెటింగ్ శాఖ రికార్డు చేయకుండా అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. మార్కెటింగ్ శాఖకు చెల్లించే పన్నులో సగం మొత్తాన్ని సంబంధిత అధికారులకు ముట్టజెప్పి ఎలాంటి పత్రాలు లేకుండా సరకును తరలిస్తున్నారు. రహదారుల వెంట ఉన్న చెక్‌పోస్టుల్లో ఉన్న సిబ్బందికి కూడా లంచాలు ఇస్తూ సరుకును దాటిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని మార్కెట్లలో సిబ్బంది కొరత కూడా బాగా ఉంది. మొత్తం 13 మార్కెట్లలో 200 మందికి పైగా ఉద్యోగులు పని చేయాల్సి ఉండగా 90 మంది ఉన్నారు. వీరిలో 52 మంది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పని చేస్తున్నారు. 39 మంది మిగిలిన 12 మార్కెట్లలో పని చేస్తున్నారు. ఒక్కో కార్యదర్శి మూడు నుంచి నాలుగు మార్కెట్లకు ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో చెక్‌పోస్టులో ఇద్దరు సూపర్వైజర్లు, ఒక అటెండర్, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పని చేయాల్సి ఉండగా సిబ్బంది కొరత కారణంగా ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. కొన్ని చెక్‌పోస్టులు సెక్యూరిటీ గార్డులతో నిర్వర్తిస్తున్నారు. సిబ్బంది కొరతను కూడా ఆసరాగా చేసుకుని వ్యాపారులు తమ దందాను యధేచ్ఛగా సాగిస్తున్నారు. దీంతో మిర్చి, వరి జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలో పండించిన ఈ పంటను రైతుల పేరుతో నేరుగా మిల్లులకు, పొరుగు జిల్లాలకు తరలిస్తున్నారు. పెసర, మినుము, కంది, వేరుశనగ పంటలను కూడా రైతుల పేరిట ఎలాంటి బిల్లులు లేకుండా రాచమార్గంలో పంపిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అక్రమాలను నిరోధించేందుకు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి కొంత మేరకు ఫలితాన్ని సాధించినప్పటికీ వ్యాపారుల ఆగడాలను అధికారులు అరికట్టలేక పోతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను ప్రక్షాళన చేసి నిబంధనలను పటిష్ట పరచటంతో పాటు సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమిస్తే ప్రభుత్వ ఆదాయానికిగండి పడకుండా కొంత మేరకైనా నివారించే అవకాశం ఉంది. -
సుడిదోమ పోటు
- ఎకరాకు 14 నుంచి 22 బస్తాలతో సరి - భారీగా తగ్గిన దిగుబడులతో రైతుల్లో ఆందోళన - తగ్గిన మద్దతు ధర - సాగు ఖర్చులు కూడా రాని వైనం మచిలీపట్నం : ఖరీఫ్ ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. జిల్లా ప్రణాళిక శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో దిగుబడుల లెక్కింపు కోసం చేపడుతున్న పంట కోత ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడవుతోంది. ముదినేపల్లి మండలంలో మూడు చోట్ల పంటకోత ప్రయోగం చేయగా ఒక ప్రాంతంలో ఎకరానికి 14 బస్తాలు, మరో ప్రాంతంలో 22, వేరొక ప్రాంతంలో 28, గుడ్లవల్లేరులో 28 బస్తాలు చొప్పున దిగుబడి వచ్చినట్లు ప్రణాళిక శాఖాధికారులు చెబుతున్నారు. సకాలంలో సాగునీటిని విడుదల చేయకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుతో వరి పొట్టదశ నుంచి సుడిదోమ వ్యాపించడంతో దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. సుడిదోమ నివారణ కోసం ఆస్టాఫ్, ఎస్పేట్, షైన్, ఓసిన్, ఒలారా తదితర రసాయన మందులు రెండు, మూడు కలిపి పిచికారీ చేసినా ఫలితం కనిపించలేదని అంటున్నారు. ఎకరానికి నాలుగు నుంచి ఐదుసార్లు రసాయనాలు పిచికారీ చేశామని, ఒకసారి రసాయనాల పిచికారీకి రూ.1500 చొప్పున ఖర్చయ్యిందని చెబుతున్నారు. సుడిదోమ నివారణకే ఎకరానికి రూ.6 వేల నుంచి రూ.7,500 ఖర్చు చేయాల్సి వచ్చిందని, ఇది అదనపు ఖర్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎకరా సాగుకు రూ.30 వేలు ఖర్చు చేశామని.. 18 నుంచి 20 బస్తాలు కూడా రాకపోవడంతో ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 5.78 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. జిల్లాలో 12.29 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వరి కోతలు ప్రారంభమై కుప్పనూర్పిళ్ల సమయంలో దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మద్దతు ధర లేదు గత ఏడాది 1061, 2067, 2077, 1001, 1010, బీపీటీ 5204 తదితర రకాలను రైతులు సాగు చేశారు. బీపీటీ రకం పాత ధాన్యం ప్రస్తుతం మార్కెట్లో బస్తా రూ.1600గా ఉంది. ప్రస్తుతం ఈ రకం ధాన్యం బస్తా రూ.1,050కి ఇచ్చినా కొనుగోలు చేసేవారే కరువయ్యారు. పొలం నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వరకు తీసుకువెళ్లి మద్దతు ధరకు విక్రయిస్తే.. బస్తాకు రవాణా ఖర్చులు పోను రూ.950 మాత్రమేనని మిగులుతాయని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరాకు 20 బస్తాలు చొప్పున దిగుబడి వస్తే రూ.19 వేలు వస్తోందని, సాగు వ్యయం రూ.30 వేల వరకు కాగా, రూ.11 వేలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1061, 2077, 1010, 1001 వంటి రకాలు బస్తా ధాన్యం ధర వెయ్యి రూపాయలుగా ఉందని, దీనిలోనే రవాణా ఖర్చులు తీసేస్తే ఎకరానికి రూ.18 వేలకు మించి రావని పేర్కొంటున్నారు. గతంలో మిల్లర్లు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కన్నా బస్తాకు రూ.100 అదనంగా ధర చెల్లించేవారని, ఈ ఏడాది వారు ఇబ్బడిముబ్బడిగా ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇష్టమున్నా, లేకపోయినా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాళ్వా పైనా స్పష్టత లేదు ఖరీఫ్ సీజన్లో దిగుబడులు తగ్గడంతో రైతులు దాళ్వా సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్‌లో వచ్చిన నష్టాన్ని దాళ్వాలో వరిసాగు చేసుకుని పూడ్చాలనే ఉద్దేశంతో ఉన్నా ప్రభుత్వం సాగునీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకుండా జాప్యం చేస్తోంది. ఓ వైపు వరికోతలు ఊపందుకున్నప్పటికీ ఎలాంటి ప్రకటనలూ చేయకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. సముద్ర తీర మండలాల్లోని భూముల్లో అపరాలు పండే అవకాశం లేనందున దాళ్వాకు సాగునీటిని విడుదల చేస్తే వరిసాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. -
తెల్లబోతున్న బంగారం
పత్తి.. రైతును చిత్తు చేస్తోంది. తెల్లబంగారంగా పేరొందిన పత్తిసాగు ఒకప్పుడు పేరుకు తగ్గట్టే బంగారు సిరులు పండించేది. ప్రస్తుతం రకరకాల తెగుళ్లతో పాటు ఖర్చులు ఎక్కువవడం, సరైన మద్దతు ధర లేకపోవడంతో పత్తిసాగు చేయడానికి రైతన్నలు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా మునుపటితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో పత్తిసాగు తగ్గింది. ఈ నేపథ్యంలో పత్తిసాగులో కలుగుతున్న నష్టాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘సాక్షి’ ఈవారం ‘మార్కెట్ రివ్యూ..’ జి.కొండూరు : జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట, తెల్లబంగారం అరుున పత్తిసాగు రైతులకు నిరాశే మిగులుస్తోంది. ఏటా పెరిగిపోతున్న ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు, దొరకని మద్దతు ధరలతో ఈ సాగు భారంగా పరిణమించింది. పెట్టుబడి రాక రైతులు అప్పులు పాలవుతుండటంతో సాగును క్రమేపి తగ్గిస్తున్నారు. జిల్లాలో గత ఏడాది 65వేల హెక్టార్లలో ఈ పంట సాగు చేయగా ఈ ఏడాది 55వేల హెక్టార్లకు తగ్గిపోయింది. పత్తిసాగులో ఖర్చులు ఒకటికి రెండింతలయ్యూరుు. విత్తనాలు, ఎరువులు, కూలీలు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు పత్తిని సాగు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. గిట్టుబాటు ధర ఏదీ? పెరుగుతున్న ధరలతో అష్టకష్టాకోర్చి పత్తిసాగు చేపట్టిన రైతులకు పంట అమ్మే సమయూనికి అప్పులే మిగులుతున్నారుు. ఈ ఏడాది జిల్లాలో సాగు చివరి వరకు వాతావరణం అనుకూలిస్తే.. సరాసరి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం పత్తిలో బూడిద, మచ్చ తెగుళ్లు సోకి మొక్కలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఈ ఏడాది దిగుబడులు ఆశించిన స్థారుులో ఉండవని రైతులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరం పైరులో పత్తి సాగు చేపట్టాలంటే ఈ ఏడాది దాదాపు రూ.42,250 అవుతుందంటున్నారు. తుపాను సంభవిస్తే నష్టాలేనంటున్నారు. మద్దతు ధర పెరిగేదెన్నడో.. పెరుగుతున్న ఖర్చుల ప్రకారం పత్తి మద్దతు ధర రూ.6వేలు చేయూలని రైతులు ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.4,050 ప్రకటించినా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించే సరికి రెండో తీతలు కూడా మొదలవుతున్నారుు. ఈలోగా వ్యాపారుస్తులు పత్తి బాగాలేదని, తేమ ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ క్వింటాలు రూ.3వేలకు మించి కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. సీసీఐకి పత్తిని తీసుకువెళ్లినా రూ.3,900, రూ.4వేలు దక్కని పరిస్థితి. రైతుల నుంచి పత్తిని కొన్న వ్యాపారులు సీసీఐ అధికారులతో లాలూచీ పడి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరాకు సరాసరి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చి దానిని ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం సీసీఐ కొనుగోలు చేస్తే రూ.40,510 వస్తాయనుకుంటే, పెట్టుబడి ప్రకారం చూసుకుంటే రూ.1,740 వరకు నష్టపోతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగు వ్యయాల ప్రకారం పంటలకు మద్దతు ధరలు ఖరారు చేయాలని కోరుతున్నారు. నష్టాల పత్తిసాగు పత్తి సాగు చేయాలంటే ఎకరాకు రూ.40 వేలకు పైగా ఖర్చవుతోంది. వచ్చిన పంటను అమ్ముకుంటే రూ.30వేలు కూడా రాని పరిస్థితి. ప్రభుత్వ మద్దతు ధర కనీసం రూ.6వేలకుపైగా చేస్తేనే సాగు గిట్టుబాటు అవుతుంది. లేనిపక్షంలో రైతులకు ఆత్మహత్యలు తప్ప వేరే దారి లేదు. - వేమిరెడ్డి పుల్లారెడ్డి, చెవుటూరు తెగుళ్లతో దిగుబడి అంతంతమాత్రమే.. పత్తి పంటలో తెగుళ్లు ఎక్కువగా ఉన్నారుు. ఆకులు, పూత పిందె ఎర్రబారి రాలిపోతున్నారుు. దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎకరాకు గరిష్టంగా 8 నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. బహిరంగ మార్కెట్లోని ధరలు నష్టాలే మిగులుస్తున్నారుు. - చెరుకూరి శ్రీనివాసరావు, కవులూరు -
పాటిస్తే మెళకువలు..పత్తిలో లాభాలు
మద్నూర్: జిల్లాలో ఈ ఏడాది యాభై వేల ఎకరాలలో పత్తి సాగైంది. ప్రస్తుతం చేతికందే దశలో ఉంది. ఈ సారి ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎకరాని కి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 3 నుంచి 4 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రభుత్వ మద్ద తు ధర రూ.4050 ప్రకటించినా ఆశించిన స్థాయిలో పంట లేకపోవడం రైతులను ఆవేదన కలిగిస్తోంది. పత్తిలో తేమశాతం 8 ఉంటే ఈ ధర లభిస్తుంది. ఆపైన వచ్చిన ఒక శాతానికి రూ.40.50 పైసల చొప్పున కోత విధిస్తోంది. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రస్తుతం పత్తి కొనుగోలు చేస్తోంది. 12 శాతంలోపు వచ్చిన పత్తిని మాత్రమే వారు కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువ గా వచ్చిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకు ని రూ. 200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నా రు. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఎం డ అధికంగా ఉన్నప్పుడు పత్తి తీయెద్దు. ఆ సమయంలో ఎండుటాకులు, వ్యర్థ పదార్థాలు విరిగి పత్తిలో కలుస్తాయి. పొద్దున, సాయత్రం వేళల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడే మాత్రమే తీయా లి. పత్తిని తీసేటప్పుడు అది పొడిగా ఉండాలి. వర్షం పడిన తర్వాత తీయొద్దు. పంటకు దిగుబడి బాగా రావాలంటే పత్తి తీయడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు (8886613150) సూచిస్తున్నారు. జాగ్రత్తలు పంట కాలంలో కనీసం మూడు నాలుగు సార్లు పత్తిని తీస్తారు. పూర్తిగా విచ్చుకున్న తర్వాతనే కాయల నుంచి పత్తిని ఏరాలి. ఏరిన తర్వాత మట్టిలో కుప్పలుగా పోయరాదు. పత్తిలో దుమ్ము ధూళీ, ఎరువులు,పురుగుల మందులు, పెట్రోలియం పదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం, చీడపీడల వల్ల పాడైన పత్తిని వేరుచేయాలి. దీన్ని మంచి పత్తిలో కలప కూడదు. మొదట మొక్కల కింద భాగం కాయల నుంచి తీయాలి. ఎందుకంటే ముందుగా పైభాగంలోని కాయల నుంచి తీస్తే కింది కాయల పత్తిలో చెత్తపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా చివరలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా ఉంటుంది.కాబట్టి దాన్ని ప్రత్కేకంగా అమ్ముకోవాలి. పంట చివరికి వచ్చేసరికి మొక్కలో, నేలలోనూ పోషకాలు తగ్గడంతో పత్తి నాణ్యత లోపిస్తుంది. నిల్వ చేయాల్సిన పత్తిలో 12 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే లోపల వేడి పెరిగి విత్తనంతో పాటు దూదిని కూడా పాడుచేస్తుంది. పత్తి తీసిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే పత్తి రంగుమారి నాణ్యత తగ్గుతుంది. పత్తిని వీలైనంత వరకు గదుల్లో గానీ, షెడ్లలో గానీ సిమెంట్ నేలమీద గానీ పరచాలి.పత్తి పూర్తిగా ఆరిన తర్వాతనే బోరాల్లో నింపి పొడిగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయాలి. ఆరిన తర్వాతే తీయాలి వర్షానికి తడిసిన, మంచుబిందువులతో చల్లబడిని పత్తిని ఆరిన తర్వాతే సేకరించాలి. గింజ, దూదిపింజల్లో తేమశాతం లేదని నిర్దారణకు వచ్చిన తర్వాత తీయాలి. ఎక్కువ మంది రైతులు మంచులోనే పత్తిని సేకరిస్తారు. వర్షానికి తడిసిన పత్తిని మాత్రం ఎండకాసే సమయంలో, మంచు నీరు లేని సమయంలో తీయాలి. ఎక్కువ రోజులు వర్షానికి తడిస్తే గింజలు మొలకెత్తుతాయి. అలాంటి పత్తిని సేకరించిన తర్వాత మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన పత్తిని మూడు గంటలకోసారి తిరిగేయాలి. తేమ పూర్తిగా తగ్గిన తర్వాతే బోరే(సంచు)ల్లో నింపాలి. కొద్దిపాటి తడిసిన పత్తిలో ఎటువంటి నాణ్యత లోపాలు ఉండవు. తడిసిన పత్తిని ఆరబెట్టిన తర్వాత టార్పాలిన్ కవర్ కప్పేటప్పుడు పూర్తిగా కాకుండా గాలి తాకే విధంగా ఉండాలి. ఆవిరి వచ్చి తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. -
నేటి నుంచి ‘ట్రైడెంట్’లో క్రషింగ్ ప్రారంభం
జహీరాబాద్: జహీరాబాద్ సమీపంలోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో గురువారం నుంచి క్రషింగ్ ప్రారంభించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. దీంతో రైతులు చెరకు ఉత్పత్తులను క్రషింగ్ నిమిత్తం కర్మాగారానికి తరలిస్తున్నారు. బుధవారం పలువురు రైతులు చెరకు పంటను ట్రాక్టర్లలో కర్మాగారానికి తరలించారు. చెరకు ధరను పెంచక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది చెల్లించిన ధరకంటే ఎక్కువ ధర చెల్లించే అవకాశమే లేదని ఇప్పటికే కర్మాగారం ప్రతినిధులు ప్రకటించారని రైతులు వాపోతున్నారు. చక్కెరకు మార్కెట్లో ఏ మాత్రం డిమాండ్ లేనందున గత ఏడాది చెల్లించిన విధంగానే ప్రస్తు క్రషింగ్ సీజన్లో కూడా టన్నుకు రూ.2,600ల మేర చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడుల వ్యయం రెట్టింపైనందున టన్ను చెరకు ధరను రూ.3,500లు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం మెట్టు దిగడం లేదు. ఇది రైతులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. భారీగా చెరకు సాగు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జహీరాబాద్ జోన్ పరిధిలో చెరకు పంట అధికంగానే సాగులో ఉంది. ప్రస్తుతం జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలో 24వేల ఎకరాల మేర చెరకు పంట సాగులో ఉంది. అయినా ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నందున దిగుబడులు బాగా పడిపోయే అవకాశం ఉంది. గత సంవత్సరం ఎకరాకు 24 టన్నుల సగటు దిగుబడి రాగా, ఈ సంవత్సరం 19 టన్నులకు పడిపోయే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. పెట్టుబడుల వ్యయం మాత్రం అధికమైందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మాదిరిగానే ధరను చెల్లించాలని యాజ మాన్యం నిర్ణయించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చెరకు కోత, రవాణా సబ్సిడీలను అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఛీసీఐని‘బంధనాలు’
ఖమ్మం వ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాల్లో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాలపైనే కనిపిస్తున్నా..వాస్తవంగా ఆ రేటు వారికి అందటం లేదు. నిబంధనల పేరుతో ఓవైపు సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేయడం లేదు. ఇదే అదునుగా దళారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ల్లాలో 10 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీసీఐ ఇప్పటి వరకు కేవలం రెండు కేంద్రాలనే తెరవడంతో దళారుల పంట పండుతోంది. పత్తి పంట అక్టోబర్ నెల ప్రారంభం నుంచి మార్కెట్‌కు అమ్మకానికి వస్తుంది. ప్రభుత్వం పత్తి అమ్మకానికి వచ్చే సమయం నుంచే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో అక్టోబర్ 3, 4 వారాల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. అక్టోబర్ 17న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రెండు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే సీసీఐ అధికారులు 17వ తేదీన మార్కెట్‌కు వచ్చినా కొనుగోళ్లను మాత్రం ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్కెట్‌ను సందర్శించారు. సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించలేదని చెప్పడంతో ఎంపీ అక్కడి నుంచే ఆ శాఖకు సంబంధించిన చీఫ్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. స్పందించిన సీసీఐ అదేనెల 24వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించింది. జిల్లాలో ఒక్క నేలకొండపల్లిలో నవంబర్ 3వ తేదీన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది మినహా జిల్లాలో మిగతా ఎక్కడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో దళారులదే ఇష్టారాజ్యమైంది. తేమ పేరుతో తిరస్కరణ సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకుందామని గంపెడాశతో వచ్చిన రైతులు ఇక్కడి నిబంధనలు చూసి బెంబేలెత్తుతున్నారు. తేమ 12 శాతం కంటే తక్కువ ఉండాలనే నిబంధన రైతుల పాలిట శాపంగా మారింది. అసలే శీతాకాలం కావడం, మార్కెట్‌కు రైతులు రాత్రిపూట పత్తిని తీసుకు వస్తుండటంతో మంచు కారణంగా తేమశాతం పెరుగుతోంది. దీన్ని అడ్డుపెట్టుకొని తేమశాతం ఎక్కువగా ఉందనే పేరుతో సీసీఐ సరుకు కొనుగోలుకు విముఖత తెలుపుతోంది. పత్తి అమ్మకానికి తెచ్చే రైతులు భూ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలనే నిబంధన కూడా రైతులను ఇబ్బందులపాలు చేస్తోంది. అనేకమంది రైతులు భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వీరు పత్తిని సాగుచేసినట్లుగా వీఆర్వో నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావడం ఇబ్బందికరంగా మారింది. ఈ పత్రం ఉంటేనే మార్కెట్ లోకి పత్తిని అనుమతిస్తున్నారు. అనేకమంది రైతులకు వీఆర్వోలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఎలాగోలా పత్తిని అమ్మిన రైతులకు చెక్‌లు వెంటనే ఇవ్వడం లేదు. పత్తిని అమ్మిన 15 రోజుల తర్వాత కానీ చెక్‌లు రావడం లేదు. దళారుల పన్నాగం.. సీసీఐ నిబంధనలను దళారులు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. తేమశాతం, డబ్బు చెల్లింపుల్లో 15 రోజుల వ్యవధి తదితర ఇబ్బందులు సీసీఐలో చోటు చేసుకోవడంతో వీటిని ఆసరాగా చేసుకుని దళారులు రైతుల నుంచి క్వింటాలు రూ.3,500లోపు ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని బినామీ రైతుల పేర్లతో దళారులు, కొందరు కమీషన్‌వ్యాపారులు, వ్యాపారులు సీసీఐ కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారుల అండదండలతో ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా భావించి పొరుగు జిల్లాలకు చెందిన కొందరు దళారులు లారీల్లో పత్తిని తీసుకువచ్చి అమ్మకానికి ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి. దీన్ని అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. ఇలా సీసీఐకి ఎక్కువ మొత్తంలో దళారులే పత్తిని అమ్ముకుంటుండగా నిజమైన రైతులు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీసీఐ కొద్దిరోజుల క్రితం బయ్యర్లనూ మార్చింది. నూతనంగా వచ్చిన బయ్యర్లు తేమశాతం ఏమాత్రం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుండటంతో రైతులూ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఫలితమివ్వని చర్యలు సీసీఐ కేంద్రంలో అమ్మకాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వశాఖలు చర్యలకు పూనుకున్నాయి. దళారులకు సంబంధించిన పత్తిని సీసీఐకి విక్రయిస్తుండగా రెవెన్యూ, పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. దీనిపై మార్కెట్లోని కమీషన్‌వ్యాపారులు, వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. రైతులే సీసీఐ కేంద్రంలో అమ్ముకుంటుంటే అనవసరంగా తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బుధవారం మార్కెట్‌కు వచ్చిన వివిధ పంట ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేశారు. కొందరు వ్యాపారులు రైతులను సీసీఐ అధికారులపైకి ఉసిగొల్పుతున్నారని సమాచారం. నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం జిల్లాలో ఖమ్మం, నేలకొండపల్లి మినహా ఎక్కడా సీసీఐ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు పండించిన పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.4,050 మద్దతు ధరగా నిర్ణయించి సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మిగతా చోట్ల సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ.3,500ల చొప్పున అమ్ముకోవాల్సి వస్తోంది. ఖమ్మంలో సీసీఐ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు కేవలం 55,345 క్వింటాలు, నేలకొండపల్లి సీసీఐ కేంద్రంలో 1,657 క్వింటాలను మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు ప్రస్తుత సీజన్లో దాదాపు 2.50లక్షల క్వింటాలుకు పైగా పత్తిని కొనుగోలు చేశారు. ఇంకా మధిర, ఏన్కూరు, భధ్రాచలం, వైరా, బూర్గంపాడు, కొత్తగూడెం, చండ్రుగొండలలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. -
మిర్చి రైతుపై దళారీ ఉచ్చు
గుంటూరు వ్యవసాయ మార్కెట్లోరాజ్యమేలుతున్న సిండికేట్ వ్యవస్థ కనీస మద్దతు ధర దక్కని దయనీయ స్థితి వచ్చిందే దక్కుదలగా అమ్ముకోవాల్సిన దుస్థితి గుంటూరు సిటీ: గుంటూరు వ్యవసాయ మార్కెట్లో దళారి వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పాలకుల పట్టనితనం, అధికారుల అలసత్వం కారణంగా ఇక్కడ సిండికేట్‌స్వామ్యం రాజ్యమేలుతోంది. ఫలితంగా రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. చివరకు రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. జిల్లాలో లక్షా 80వేల ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ. లక్షన్నరకు పైగా పెట్టుబడితో 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగు బడి సాధిస్తున్నారు. ఇక్కడి నుంచి అసలు కథ, రైతు వ్యధ మొదలవుతుంది. పంటను వ్యయ ప్రయాసలకోర్చి గుంటూరు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చినా వారికి కనీస ఆదరణ కూడా లభించదు సరికదా దళారులంతా సిండికేట్ అయి ధర పెరగకుండా కట్టడి చేస్తారు. కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కని దయనీయ స్థితి కల్పిస్తారు. పెట్టుబడుల రీత్యా క్వింటా ధర ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు పలికితే గానీ రైతుకు గిట్టుబాటు కాదు. కానీ ఈ ఏడు సీజన్ ఆరంభంలో మిర్చి రైతుకు దక్కిన ధర రూ. ఆరు వేలు. అది కూడా మేలు జాతికి చెందిన తేజ రకం మిరపకు మాత్రమే. ఇక నాటు కాయలకు దక్కింది మరీ తక్కువ. అయినా ధర పెరిగే వరకు శీతల గిడ్డంగుల్లో దాచుకోలేని అసహాయత, తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని అశక్తత ఈ ఏడు మిరప రైతులను నిలువునా ముంచింది. అయిన కాడికి అమ్ముకునేలా చేసింది. తాజాగా మంగళవారం రూ.10,200 వరకు ధర పలికి రికార్డు సృష్టించింది. పంట ఉత్పత్తి ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్, చైనా ల్లో ఈ ఏడు ఆశించిన దిగుబడులు లేకపోవడంతో మిర్చి ధర మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పలు రైతు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మిర్చి క్వింటాకు గత ఏడాది రూ. మూడు వేలు ధర పలికితే ఈ ఏడు రూ. ఆరు వేలు లభించడం మంచి పరిణామమే కదా అంటున్న అధికారుల వ్యాఖ్యలపై వారు మండిపడుతున్నారు. వారు చెప్పింది వాస్తవమేననీ, అయితే అదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు పెరిగిన పెట్టుబడులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా మార్కెట్ శక్తుల ఆట కట్టించి రైతుకు మద్దతు ధర దక్కేలా తగు చర్యలు చేపట్టాలని పలు రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పులి మీద పుట్రలా రుణమాఫీ అసలే అంతంత మాత్రంగా ఉన్న మిర్చి రైతుకు రుణమాఫీ అంశం పులి మీద పుట్రలా మారింది. రుణమాఫీ అమలు కాక మరోవైపు పాత రుణం చెల్లించాలని బ్యాంకర్లు చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక పంటను దాచుకోకుండా అయిన కాడికి అమ్ముకుంటున్నట్టు సమాచారం. -
మద్దతు కరువు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ధాన్యం అమ్మకాలలోనూ రైతులకు కష్టాలు తప్పడం లేదు. 287 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటివరకు 168 ప్రారంభం కాగా, 119 కేంద్రాలు ఇంకా ఎప్పుడు తెరుస్తారో తెలియడం లేదు. ఫలితంగా రైతులు ఖరీఫ్ ధాన్యాన్ని విక్రయించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రాలలో అసౌకర్యాలు తిష్టవేయగా, గన్నీ సంచులు, హమాలీల కొరత అక్కడక్కడా ఇబ్బందికరంగా మారింది. ఆరుగాలం శ్రమించిన రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్ రోస్ మార్కెటింగ్, పౌరసరఫరాల, డీఆర్డీఏ తదితర శాఖలను అప్రమత్తం చేసి నా, క్షేత్రస్థాయిలో కొందరి అలసత్వం రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. వారు రైస్ మిల్ల ర్లు, దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, సోమవారం నాటికి 7,030 మె.టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కామారెడ్డిలో హమాలీలు లేరు కామారెడ్డి మండలం గర్గుల్ కొనుగోలు కేంద్రం లో హమాలీలు లేక వారం రోజులుగా ధాన్యం అక్కడే ఉంది. రైతులు ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు పడుతున్నారు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసినా బిల్లులు సరిగ్గా రావడంలేద ని వారు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి మార్కెట్లో కొనుగోళ్లు నెమ్మదిగా జరుగుతుం డటంతో రైతులు వారం రోజులుగా అక్కడే ఉంటున్నారు. మాచారెడ్డి సింగిల్‌విండోలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటి వరకు తెరవలేదు. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దోమకొండలో ఆరు కొనుగోలు కేంద్రాలుండగా,కొ న్న ధాన్యానికి సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదు. ఆర్మూర్‌లో తూకం లేదు ఆర్మూర్ నియోజకవర్గంలో రైతులు ధాన్యం తీసుకువచ్చి వారం గడుస్తున్నా తూకం వేయ డం లేదు. కొనుగోలు కేంద్రాలలో హమాలీల పేరుతో దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు విని పించాయి. పలు కేంద్రాలలో అకాల వర్షంతో ధాన్యం తడిసిపోగా, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఆర్మూర్ పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో, పీఏసీఎస్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ పరిసరాలలో, పెర్కిట్, మిర్ధాపల్లి, ఆలూర్, దేగాం, పిప్రి, పెర్కిట్, ఫత్తేపూర్, తదితర గ్రామాలలో కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొంత మేర తడిసి పోవడంతో రైతులు వేదనకు గురవుతున్నారు. కొనుగోలు కేంద్రంలో 40 కేజీల బస్తాకు హమాలీ పేరుతో రూ.14లు వసూలు చేస్తూ క్వింటాలుకు రెండున్నర కిలోల కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు. తూకం వేసి లారీలలో ఎక్కించే వరకు రైతులదే బాధ్యత అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటుండటంతో రైతులు రేయింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. బోధన్‌లో బిల్లులు రావడం లేదు బోధన్ వ్యవసాయ మార్కెట్లో, సింగిల్విం డోలో, సాలూర, సాలంపాడ్, నవీపేట మండలంలోని అభంగపట్నం, రెంజల్ మండలం సాటాపూర్, దండిగుట్ట, ఎడపల్లి మండలంలో ని ఎడపల్లి, ఠానాకలాన్ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు సకాలంలో అందడం లేదని తేలింది. ఇప్పటివరకు 11 వేల కింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. రైతులకు రూ. 1.37 కోట్లు చెల్లించాల్సి ఉండ గా, ఇందులో రూ. 68 లక్షలు చెల్లించారు. మిగిలిన డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. కొనుగోలు కేంద్రంలో కాంటా లేదు. సాలూర సొసైటీలో 6 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఇక్కడ తేమ కొలత మీటరు పని చేయ డం లేదు. కాంటాలు లేవు. పంట పొలాలు, ఖా ళీ ప్రదేశాలలో తూకం వేస్తున్నారు. సాలంపాడ్ లో ఇప్పటి వరకు 8 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇక్కడ కొనుగోలు కేంద్రంలో కాంటా లేదు. పెంటాకుర్థులో ఇదే పరిస్థితి. ఈ సొసైటీ పరిధిలో బీపీటి రకం ధాన్యం సాగు చేశారు. ఇక్కడ కేవలం 2,190 కింటాళ్లు కొనుగోలు చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్, దండిగుట్ట కేంద్రాలలో తూకం బంద్ ఉంది. తేమ, తాలు ఉన్నాయని జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా మారాయి. కనీస మద్దతు ధర దేవుడెరుగు ఎనలేని ఇబ్బందులను ఎదుర్కుంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందని, తా లు ఉందని చెబుతూ నిరాకరిస్తున్నట్లు రైతులు వెల్లడించారు. పైగా తెచ్చిన ధాన్యాన్ని జల్లెడ పట్టటంతో చాలా వరకు తరుగు పోతోంది. గత్యంతరం లేక ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వానలకు అక్కడక్కడా ధాన్యం తడిసిపోయి రంగు మారింది. ఇదే అదునుగా కొనుగోలు కేంద్రాలలో రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. అక్టోబర్ 29న ప్రారంభించిన ‘మెప్మా’ కేంద్రం మొక్కుబడిగా మారింది. అకాల వాన కొంప ముంచింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాల పరిస్థితి దారుణంగా ఉంది. డిచ్పల్లి మండలం బర్థిపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధర్మారం (బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొద్దిమేర తడిసింది. దీంతో సోమవారం కొనుగోళ్లను నిలిపివేశారు. తరుగు పేరిట బస్తాకు కిలో ధాన్యం తీసేస్తున్నారని రైతులు తెలిపారు. ధర్పల్లి పీఏసీఎస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనూ, సిరికొండ మండలం తాళ్ల రామడుగులోనూ వానకు ధాన్యం తడిసి పోవడంతో కొనుగోళ్లను నిలిపివేశారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించకపోవడం వల్ల తడిసిపోయింది. ఇక్కడా అంతే జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, గున్కుల్, మల్లూర్ సింగిల్ విండోల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. మద్నూర్ మండలంలో డోంగ్లిలో ఇంతవరకు ధాన్యం రాకపోవడంతో తూకాలు ప్రారంభం కాలేదు. మదన్ హిప్పర్గలో 6,040 బస్తాల ధాన్యాన్ని కొన్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, నాగిరెడ్డిపేట మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్‌విండోలు, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వానకు ధాన్యం తడవడంతో రైతులు ఆరబెట్టడంలో నిమగ్నమయ్యారు. తాటిపత్రు లు లేకపోవడంతో రైతులు స్వయంగా తెచ్చుకుంటున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందనే కారణంతో తూకాలు చేయడం లేదు. రైతులకు డబ్బులు రావడానికి 10 నుంచి 20 రోజుల సమయం పడుతోంది. -
మాకే అమ్మాలె!
పరిగి: తాము పండించిన మక్కలు, ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతోంది. రైతులు పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులు.. వాళ్ల రాబడికి ఎసరు పెడుతున్నాయి. మార్కెట్లో కమీషన్ ఏజెంట్లు(అడ్తిదారులు)గా పనిచేస్తున్న వారే వడ్డీ వ్యాపారుల అవతారమెత్తి రైతులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలతో పోలిస్తే క్వింటాలుకు రూ.200 నుంచి రూ. 300 తక్కువైనా అడ్తాదారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ కారణంగా సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతు లు మద్దతు ధర దక్కే పరిస్థితి కన్పిం చడం లేదు. పరిగిలో మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి అటు కొనుగోలు కేంద్రాలకు, ఇటు పరిగి వ్యవసాయ మార్కెట్లో అడ్తీదారుల వద్దకు వస్తున్న రైతు ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం. మార్కెట్‌కు ఒక్కరోజే నాలుగు వేల క్వింటాళ్ల మక్కలు.. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు పరిగిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి 15రోజులైంది. వేల కొలది ఖాళీ సంచులు సైతం అందుబాటులో ఉంచారు. ఐదారుగురు సిబ్బంది, కూలీలను కొనుగోలు కేంద్రం వద్ద ఉంచుతున్నారు. కానీ 15 రోజుల్లో కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చి విక్రయించిన మక్కలు కేవలం 500 క్వింటాళ్లు మాత్రమే. అదే గత శుక్రవారం ఒక్కరోజే ఆ పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్లో అడ్తీల వద్దకు 4వేల క్వింటాళ్ల మక్కలు వచ్చాయి. కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.1,310 చెల్లిస్తుండగా.. మార్కెట్లో రూ.1000 నుంచి రూ.1,150 మాత్రమే ఇస్తున్నారు. రైతులు క్వింటాలుకు రూ.200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నారు. ఇప్పటికే రైతులు ఇలా రూ.10 లక్షల వరకు నష్టపోయారు. అధికారికంగా మాత్రమే ఈ లెక్కులు. పరిగిలో జీరో మార్కెట్ నిర్వహిస్తున్నందున.. ఆ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమే కారణం రైతులు కొనుగోలు కేంద్రాలకు విక్రయించకుండా అడ్తీదారులకు విక్రయిస్తూ ప్రభుత్వ మద్దతు ధర పొందక పోవడానికి ఈ సారి బ్యాంకులు రుణాలివ్వకపోవటమే ప్రధాణ కారణంగా చెప్పవచ్చు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు అడ్తాదారుల వద్ద, ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్ల వద్ద అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో తప్పని పరిస్థితితో పండించిన పంటను అడ్తీదారుల వద్దకు తీసుకు వెళ్లి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అప్పులు ఇచ్చిన అడ్తీదారులు, వ్యాపారులు పండించిన పంటను తమకే విక్రయించాలని ముందే కండీషన్ పెట్టడడంతోపాటు వందకు నెలకు రూ. మూడు.. అంతకంటే ఎక్కువ వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో సవాలక్ష నిబంధనలు.. మొక్కజొన్నలు, ధాన్యానికి మద్దతు ధరలు ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనేక నిబంధనలు పెట్టింది. తేమశాతం మొక్కజొన్నలకు 14, ధాన్యానికి 17 ఉండాలనే నిబంధన ఉంది. ఏమాత్రం తేమశాతం ఎక్కువగా ఉన్నా కొనడం లేదు. బీ, సీ గ్రేడ్ మక్కులు సైతం కొనుగోలు చేస్తామని ప్రకటించినా వాటిని రెండో, మూడో గ్రేడ్లలోకి నెట్టేస్తున్నారు. ఒక వేళ తేమ శాతం నిర్దేశించిన విధంగా ఉండి కొనుగోలు చేసినా డబ్బులు 15 రోజుల తర్వాత చెల్లిస్తారు. ఒక్కోసారి నెలలు పడుతుంది. పండించిన ఉత్పత్తులు తమవేనని రెవెన్యూ అధికారులతో ధ్రువీకరించాలి. ఇవన్నీ దాటుకుని కొనుగోలు కేంద్రంలో విక్రయించినా.. డబ్బులు చెక్కురూపంలో ఇస్తారు. ఆ చెక్కును మార్చుకునేందుకు బ్యాంకులకు వెళితే అధికారులు పాత బకాయిల కింద జమచేసుకుంటారనే భయం. ఇవన్నీ రైతులకు మద్దతు ధరను దూరం చేయడంతోపాటు వ్యాపారుల ఉచ్చులో చిక్కుకునేలా చేస్తున్నాయి. -
మద్దతు కష్టమే!
నరసన్నపేట రూరల్: ధాన్యానికి మద్దతు ధరపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమానికే గండి కొట్టే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లెవీ సేకరణకు సంబంధించి తాజాగా సవరించిన నిబంధనలు రైతుకు మేలు చేసేవిగా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత ఆహర సంస్థ ద్వారా అమల్లోకి తెచ్చిన ఈ నిబంధనల ప్రకారం లెవీ సేకరణ పరిమాణాన్ని బాగా కుదించారు. దీని ప్రభావం ప్రభుత్వం చెల్లించే ధాన్యం మద్దతు ధరపై పడుతుందని అటు మిల్లర్లు, ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైతుల తరఫున అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా చోద్యం చూస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ధాన్యానికి మద్దతు ధర దక్కదని మిల్లర్లు అంటున్నారు. ఈ పరిస్థితిని అధికార పార్టీ పెద్దలకు తెలియజేసినా పట్టించుకోవడంలేదని మిల్లర్ల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. లెవీ 25 శాతమే రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యంలో 75 శాతాన్ని బియ్యం రూపంలో ఎఫ్‌సీఐ లెవీగా తీసుకునేది. మిగిలిన 25 శాతంలో రెండొంతులు ఇతర రాష్ట్రాల్లోనూ, మిగిలిన ఒక వంతు రాష్ట్రంలోనూ బహిరంగ మార్కెట్లో స్వేచ్ఛగా విక్రయించుకొనేందుకు అనుమతి ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం ఈ సీజన్ నుంచి మిల్లర్ల నుంచి 25 శాతం బియ్యాన్నే లేవీగా తీసుకుంటుంది. మిగిలిన 75 శాతం ధాన్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అక్టోబరు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. దీని వల్ల రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వ పెద్దలకు, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు జిల్లా మిల్లర్లు వివరించారు. అయినా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదు. గతంలో 75 శాతం లేవీగా తీసుకున్నప్పుడే మిగిలిన 25 శాతం నిల్వలను అమ్ముకొనేందుకు మిల్లర్లు నానాపాట్లు పడేవారు. ఇప్పుడు 75 శాతం విక్రయించడం జరిగే పని కాదంటున్నారు. మరోవైపు ఈ 75 శాతం ధాన్యాన్ని నిల్వ చేసే సౌకర్యం జిల్లాలో లేదు. ఆ స్థాయిలో గిడ్డంగుల్లేవు. పైగా భారీగా డబ్బు పెట్టుబడి పెట్టే మిల్లర్లు కూడా లేరు. ఇది పరోక్షంగా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాగా గతంలో క్వింటాలుకు వంద రూపాయల వరకూ తక్కువకు రైతుల నుంచి ధాన్యం కొనేవారు. మారిన పరిస్థితుల్లో ఏ రేటుకు కొనుగోలు చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి వేశారు. హుద్‌హుద్ తుపాను, దోమ పోటు కారణంగా ఎకరాకు 5 నుంచి 8 బస్తాల వరకూ దిగుబడి తగ్గుతుందని అంచ నా. ఇలా తీసుకున్నా ధాన్యం దిగుబడి ఎకరాకు 8 నుంచి 18 బస్తాల వరకూ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో తిండి గింజలకు కొంత నిల్వ చేసుకొని మిగిలిన ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముతారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ వరికి ఇప్ప టికే మద్దతు ధరలు ప్రకటించింది. సాధారణ రకం క్వింటాలు రూ. 1360, ఏ గ్రేడ్ రకం రూ.1400గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొత్త లెవీ నిబంధనల నేపథ్యంలో ఈ స్థాయిలో రెతులకు మద్దతు ధర లభిం చడం అనుమానమేనంటున్నారు. -
చెరకు రైతు.. బతుకు బరువు
సాక్షి, సంగారెడ్డి: చెరకు రైతుకు మద్దతు ధర అందని ద్రాక్షగా మారింది. ఎప్పటిలాగే ఈ సారి కూడా క్రషింగ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులు మద్దతు ధర కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మూడు చెరకు ఫ్యాక్టరీలు పది రోజుల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో మద్దతు ధరపై మరోమారు మెతుకుసీమ చెరకు రైతులు పోరుబాటకు సిద్ధపడుతున్నారు. కరెంటు కోతలు, వర్షాభావం పరిస్థితులను అధిగమించి పంట సాగు చేసిన తమకు టన్నుకు రూ.3,500 చెల్లించాల్సిందిగా రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. జిల్లాలోని గణపతి షుగర్స్, ట్రైడెంట్ షుగర్స్, నిజాం దక్కన్ షుగర్స్ పరిశ్రమలు మాత్రం రైతులు అడిగినంతగా ధర చెల్లించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల సంగారెడ్డి మండలం ఫసల్వాది సమీపంలోని గణపతి షుగర్స్ యాజమాన్యంతో మద్దతు ధరపై చెరకు రైతులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మిగతా రెండు పరిశ్రమల పరిధిలోని రైతులు సైతం రూ.3,500 చెల్లించాలని కోరుతున్నారు. మద్దతు ధర ఖరారు కానప్పటికీ గణపతి షుగర్స్ ఈనెల 13న, ట్రైడెంట్ షుగర్స్ ఈనెల మూడోవారంలో, నిజాం దక్కన్ షుగర్స్ వచ్చేనెల క్రషింగ్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలు, రైతు సంఘాలు, చెరకు రైతులతో సోమ లేదా మంగళవారాల్లో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మద్దతు ధరపైనే ఆశలు జిల్లాలో సుమారు 22 వేల మంది చెరకు రైతులు 18 వేల హెక్టార్లలో చెరకు పంటలను సాగు చేశారు. ఫసల్వాదిలోని గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 7,200 హెక్టార్లు, జహీరాబాద్‌లోని ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 9, 000 హెక్టార్లు, మెదక్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 2,280 హెక్టార్లలో రైతులు చెరకుపంట వేశారు. జహీరాబాద్, న్యాల్కల్, పుల్కల్, పాపన్నపేట, ఝరాసంగం, అందోలు ప్రాంతాల్లో చెరకు సాగు అధికంగా ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ దఫా చెరకు సాగు వ్యయం పెరిగింది. దీనికితోడు ఖరీఫ్‌లో వర్షాభావం, కరెంటు కోతల కారణంగా చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికితోడు ఈసారి లద్దెపురుగు పంటను దెబ్బతీసింది. ఈ కారణాలతో చెరకు దిగుబడి ఈ దఫా 20 శాతానికిపైగా తగ్గనున్నట్లు అంచనా. ఇదిలావుంటే చెరకు కోతల ధరలు కూడా రెట్టింపయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని చెరకు రైతులు టన్ను రూ.3,500 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు. చక్కెర ధర తగ్గడం వల్లే? టన్నుకు చెరకు రూ.3,500 ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మాత్రం రూ.2,600 నుంచి రూ.2,800 వరకు చెల్లిస్తామంటున్నాయి. మార్కెట్లో చక్కెర ధర ఆశించిన స్థాయిలో లేకపోవటం, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ చక్కెరపై ఐదు శాతం వ్యాట్ విధించటం, రాష్ట్ర విభజన నేపథ్యంలో మొలాసిస్ సరఫరాపై టన్నుకు రూ.2,500 పన్ను విధించటం తదితర కారణాలతో మద్దతు ధర చెల్లింపు విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే చర్చల్లో సమస్యలను విన్నవించి తమకు, రైతులకు నష్టం వాటిల్లకుండా మద్దతు ధర నిర్ణయించాలని పరిశ్రమల యాజమాన్యాలు భావిస్తున్నట్లు సమాచారం. -
కష్టకాలం
సాక్షి, ఖమ్మం: నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ఆశతో ఖరీఫ్ సాగు మొదలుపెట్టిన రైతన్నకు ఆ తర్వాత నిరాశేమిగిలింది. విత్తునాటడానికే చినుకులు రాలకపోవడంతో అప్పుడుప్పుడు కురిసే జల్లులతోనే 3,31,494 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఇల్లెందు, గుండాల, బయ్యారం, టేకులపల్లి, కారేపల్లి, మధిర, పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోయింది. విద్యుత్ కోతలతో తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, బయ్యారం, గార్ల, కామేపల్లి, కారేపల్లి, టేకులపల్లి, గుండాల, బూర్గంపాడు, కొత్తగూడెం, ముల్కలపల్లి, పాల్వంచ, చండ్రుగొండ తదితర మండలాల్లో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి చేతికి అందే దశలో ఎండిపోతోంది. ఆయా మండలాల్లో పత్తి పంట కూడా వాడిపోవడంతో దిగుబడి తగ్గింది. జిల్లాలో సాగు చేసిన మిరప తోటలు ఆశాజనకంగా లేవు. వర్షాభావంతో అన్ని పంటల దిగుబడులు తగ్గాయి. అడుగంటిన భూగర్భ జలాలు తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. భూగర్భ జలవనరుల శాఖ నిబంధనల ప్రకారం ఖరీఫ్, రబీ సీజన్లో 2 నుంచి 3 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోతే అంతగా పంటలు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. కానీ ఈ స్థాయే ఖరీఫ్‌లో దాటితే రబీలో మరింత తీవ్రతరమై నీటి కష్టాలు ఎదురవుతాయి. బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర (వీఎంల)లో గత నెలలో అత్యధికంగా 6.33 మీటర్లకు నీటిమట్టం పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది. దళారీ చేతిలో రైతు దగా అరకొరగా చేతికి అందిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం రైతును మరింత కుంగదీస్తోంది. కనీసం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా రైతుకు దక్కపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వం 10 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం ఖమ్మంలో ఒక్క కేంద్రాన్ని మాత్రమే తెరిచారు. ఈ కేంద్రంలోనూ వ్యాపారుల దందానే కొనుసాగుతండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిగతా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మద్దతు ధర రూ.4,050 అయితే దళారులు రూ.3వేల నుంచి రూ. 3,500 వరకే పెడుతున్నారు. రుణమాఫీకి ఎదురుచూపులు.. ఈ ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.1,400 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రూ.4.81 కోట్లు మాత్రమే కొత్తగా రైతులకు రుణాలు ఇచ్చారు. రూ.724 కోట్లు రెన్యూవల్స్ చూపించారు. జిల్లా వ్యాప్తంగా రూ. 1,700 కోట్లు రుణమాఫీ కావాలి. ఇప్పటి వరకు 25 శాతం రుణమాఫీ కింద జిల్లాకు రూ.427.85 కోట్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో రూ.285 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. నూతన రుణాలు, రుణమాఫీ అంటూ కాగితాల్లోనే ప్రభుత్వం అంకెల గారిడి చేసింది. కొత్తగా రుణాలు ఇవ్వకపోవడం, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బలవన్మరణం.. జిల్లాలో 12 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఏ ఒక్కటీ నమోదుకాకపోవడం గమనార్హం. మధిర మండలం రొంపిమళ్ల గ్రామానికి చెందిన మొగిలి నాగేశ్వరరావు (30) పత్తి సాగుతో అప్పులపాలై పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పినపాక నియోజకవర్గంలో ఈ సీజన్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వాపురం మండంలోని అమెర్ధ పంచాయతీ చండ్రలబోడు గ్రామానికి చెందిన ఎనిక తిరుపతి(40), గుండాల మండలం దామర గూడెం వాసి పాయం పాపయ్య(30), నడిమిగూడెంకు చెందిన పాయం రాంబాబు(22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నేలకొండపల్లి మండలం ఆరేగూడెం గ్రామ రైతు తమ్మినేని వెంకటేశ్వరరావు (40), తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం శివారు అజ్మీరాతండాకు చెందిన భూక్యా సామ్యా (35), ఏన్కూరు మండలం రాయమాధారానికి చెందిన జబ్బ శ్రీనివాసరావు (30), జూలూరుపాడు మండలం భీమ్లాతండాకు చెందిన బాదావత్ వెంకట్రామ్(45), పాల్వంచ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన తాటి శ్రీను(39) బలవన్మరణానికి పాల్పడ్డారు. వర్షాభావం వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని 32 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, వైరా, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ఖమ్మంఅర్బన్, ఏన్కూరు, తల్లాడ, వేంసూరు, దమ్మపేట, ముల్కలపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం, సింగరేణి, ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, అశ్వాపురం, గుండాల, చర్ల, వేలేరుపాడు, కొణిజర్ల మండలాలను కరువు ప్రాంతాలుగా పేర్కొన్నారు. -
‘మద్దతు’నిస్తాం
* రైతులకు అండగా ఉంటాం * జిల్లాలో 175 వరి, 70 మక్క కొనుగోలు కేంద్రాలు * నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు జోగిపేట: ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా 175 వరి, 70 మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే బాబూమోహన్ కోరిక మేరకు అందోలు నియోజకవర్గంలోని జోగిపేట, వట్పల్లి మార్కెట్లలో పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బుధవారం ఆయన జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ఒకవేళ రైతుకు మద్దతు ధర దక్కకపోతే ప్రభుత్వమే ఆ రైతుకు మద్దతు ధరకు ఎంతతక్కువైతే అంత మొత్తం ఇస్తుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ నిధి కూడా ఏర్పాటు చేసే యోచనలో సీఎం ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ సర్కార్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అందువల్లే రుణమాఫీ అమలు చేయడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.700 కోట్ల కొత్త రుణాలను రైతులకు మంజూరు చేయించామని, త్వరలోనే మరో రూ.200 కోట్ల రుణాలను మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. షేడ్నెట్లు వేసుకొని కూరగాయలు పండించుకునేందుకు వీలుగా 50 శాతం సబ్సిడీతో నెట్లను అందజేయనున్నట్లు వివరించారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్లో మరుగుదొడ్ల నిర్మా ణం, సీడ్ గోడౌన్ పనులను రూ.40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రాహుల్ బొజ్జా డైనమిక్ కలెక్టర్ జిల్లాలో రైతు రుణమాఫీ, రైతులకు కొత్త రుణాల మంజూరు విషయంలో జిల్లా కలెక్టర్ బొజ్జా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, ఆయన డైనమిక్ కలెక్టర్ అని మంత్రి అభివర్ణించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కలెక్టర్ బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎంపీ పి.మాణిక్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎంపీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాక్షులు రమేశ్, డీసీసీబీ మాజీ ఉపాధ్యాక్షులు పి.జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జి.లింగన్న, నాగభూషణం, వర్తక సంఘం అధ్యక్షులు ఎం.మల్లికార్జున్, మార్కెటింగ్ ఏడీఎం ఎస్ఎఫ్ హమీద్, జోగిపేట మార్కెట్ సెక్రటరీ నాగేశ్వరరావు, జహీరాబాద్ మార్కెట్ సెక్రటరీ శివరామ శాస్త్రి, తహ శీల్దాదారు నాగేశ్వరరావు, సర్పంచ్‌లు బీరప్ప, కాళీదాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, నాయకులు సీహెచ్. వెంకటేశం, ఏ.శ్రీకాంత్, నాగరత్నంగౌడ్, అనిల్, సత్తిబాబు, సార శ్రీధర్, అ నిల్రాజ్, మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నిజమైన రైతు బిడ్డ కరువు మంత్రిగా, రవాణా మంత్రిగా, 14 ఏళ్లు ఉద్యమకారుడిగా, ప్రస్తుతం సీఎంగా ఉన్నప్పటికీ కేసీఆర్ ఎప్పుడూ వ్యవసాయాన్ని విస్మరించలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన ఎప్పుడు ఏ హోదాలో ఉన్నా, తాను రైతునన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోరన్నారు. అందువల్లే సీఎంగా ఉండి కూడా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవళ్లిలోని తన ఫాంహౌస్‌లో వ్యవసాయం చేస్తున్నాడన్నారు. అందువల్ల సీఎంకు రైతుల సమస్యలు తెలుసుననీ, తప్పకుండా రైతులకు న్యాయం చేస్తారన్నారు. -
పంటలకు గిట్టుబాటు ధర కల్పించరా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎల్.రమణ, ఎర్రబెల్లి హైదరాబాద్: వర్షాభావం ఒకవైపు, కరెంటు కోత మరోవైపుతో అష్టకష్టాలు పడి రైతులు పండించిన కొద్దిపాటి పంటకైనా ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేకపోతోందని, సీసీఐ, మార్క్‌ఫెడ్‌ల ద్వారా పత్తి, మొక్కజొన్న, ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తానని కరపత్రాలు పంచిన మంత్రి హరీష్‌రావుకు వాస్తవ పరిస్థితి తెలియడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విమర్శించింది. బుధవారం టీడీపీ కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైఫల్యం వల్ల కరెంటు, సాగునీరు లేక అధిక శాతం పంటలు ఎండిపోయాయని, మిగిలిన పంటలను అమ్ముకుందామన్నా రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని వారు విమర్శించారు. పేదల తరఫున ఉద్యమిస్తాం: ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మెడలు వంచైనా అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు ఇప్పిస్తామని టీటీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి అన్నారు. పింఛన్ల కోత, రేషన్‌కార్డుల ఏరివేతను నిరసిస్తూ జూబ్లీహిల్స్ నియోజక వర్గం టీడీపీ బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ఖైరతాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. -
గోధుమ ‘మద్దతు’ పెంపు
క్వింటాల్‌కు 50 పెరిగిన ధర న్యూఢిల్లీ: గోధుమల కనీస మద్దతు ధర స్వల్పంగా పెరిగింది. గోధుమల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 50 పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో మద్దతు ధర రూ. 1,450లకు చేరుకుంటుందని, రబీసీజన్ సాగులో రైతులకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల సలహా సంఘం (సీఏసీపీ) సిఫార్సులమేరకు రబీ సీజన్లో పంటల మద్దతు ధ రను రూ. 50నుంచి రూ. 125ల వరకూ హెచ్చిస్తూ, సీసీఈఏ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది. రబీ సీజన్‌కు సంబంధించి బార్లీ, పప్పులు, ఆవాలు వంటి పంటల మద్దతు ధరను పెంచారు. పప్పుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 125 పెరిగి రూ. 3,075కు చేరింది. ఆవాలు, సన్‌ఫ్లవర్ గింజల మద్దతు ధర రూ. 50ల చొప్పున పెరిగింది. ఆవాల మద్దతు ధర క్వింటాల్ రూ. 3,175కు, సన్‌ఫ్లవర్ ధర క్వింటాల్ రూ. 3,050కి చేరింది. బార్లీ కనీస వుద్దతు ధర రూ. 50 పెరిగి, క్వింటాల్ మద్దతు ధర రూ. 1,150కి చేరింది.వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో పరిశోధనలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు సంబంధించి విదేశాలతో ఓ ఒప్పందాన్ని చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. -
పత్తి కొనుగోలుపై తీవ్ర ఉత్కంఠ
ఆదిలాబాద్:పత్తిరైతుల దీనస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక విలవిల్లాడుతున్నాడు. పత్తిరైతు అననుకూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని సాగుచేసినా వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నాడు. జిల్లాలో పత్తి కొనుగోలు తొలిరోజే ఉత్కంఠ పరిస్థితులకు దారితీసింది. ఆదివారం పత్తి కొనుగోలుకు వచ్చిన సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులు ఆంక్షలు పెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తిలో 12 శాతం తేమ మించితే కొనుగోలు చేయలేమని సీసీఐ అధికారులు తేల్చిచెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పత్తి కొనుగోలుకు ప్రయివేటు వ్యాపారులు కూడా ఆసక్తి చూపకపోవడంతో రైతలు తీవ్ర డైలామాలో పడ్డారు. ఇంకా పత్తికొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు సీసీఐ అధికారులను దిగ్భందించి నిరసన చేపట్టారు. -
మద్దతు ధరతో ధాన్యం కొనాలి
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా మద్దతు ధరతోనే రైతుల వద్ద నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014-15 సీజన్ ప్రారంభమైందని, తెలంగాణ ప్రభుత్వం నూతన మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేపడుతుందని తెలిపారు. బియ్యం ఏ గ్రేడ్ ధర క్వింటాల్‌కు రూ.1,400, బీ గ్రేడ్ ధర క్వింటాల్‌కు రూ.1,360, మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1310 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైస్‌మిల్లర్లకు సీఎమ్మార్ చార్జీలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో మార్కెట్‌యార్డుల్లో కావాల్సిన పరికరాల కొనుగోలుకు రూ.6 కోట్ల 40 లక్షలు ప్రభుత్వం విడుదల చేసిందని, జిల్లాకు రూ.80 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. యార్డుల్లో సౌకర్యాలు, కాంటాలు, ఎలక్ట్రానిక్ మిషన్ల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించాలని సూచించారు.ఉపయోగించాలని న్నారు. రాష్ట్రంలో పండించిన సూపర్ క్వాలిటీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయరాదన్నారు. పత్తి, మొక్కజొన్న మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోలు చేయాలన్నారు. 31 వేల మెట్రిక్ టన్నుల అంచనా కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ, ఈ ఏడాది 31 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలుకు అంచనా వేశామని తెలిపారు. జిల్లాలో 179 కేంద్రాల్లో కొనుగోళ్ల ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సీసీఐ ద్వారా ఈ నెల 20 నుంచి పత్తి కొనుగోళ్లు చేపడుతున్నామని, జిన్నింగ్ మిల్లులకు రెండు రోజుల పాటు పవర్ హాలీడే లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 284 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. డీఎస్వో వసంత్‌రావు దేశ్‌పాండే, డీఎం ఆనంద్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీసీఐపై రైతుల ఆగ్రహం
మద్దతు ధర కోసం ఆందోళన * మార్కెట్ కార్యదర్శితో వాగ్వాదం * కొనుగోళ్లేవంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు * ఆలస్యంగా ప్రారంభమైన కొనుగోళ్లు * అయినా రైతుకు దక్కని ‘మద్దతు’ జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో సీసీఐ తీరుపై రైతులు నిప్పులు చెరిగారు. కొనుగోళ్లు ప్రారంభించామని చెబుతున్నా.. పత్తిని ఎందుకు కొనడం లేదంటూ అధికారులను నిలదీశారు. మార్కెట్ కార్యదర్శిని ముట్టడించి మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. దీంతో మార్కెట్లో ఉద్రిక్తత ఏర్పడింది. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు గురువారం కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి రైతులు సుమారు ఆరు వేల బస్తాల్లో పత్తిని తెచ్చారు. అలాగే 46 వాహనాల్లో లూజ్ పత్తిని తీసుకొచ్చారు. అయితే సీసీఐ మద్దతు ధర రూ.4050కి క్వింటాల్ కొనాల్సి ఉంది. మధ్నాహ్నం 12 గంటలు దాటినా.. సీసీఐ అధికారులు తేమశాతం చూస్తూ వెళ్లిపోయారే తప్ప బస్తా కొనలేదు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. వారికి కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలిచా రు. అసిస్టెంట్ కార్యదర్శి విజయ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. మద్దతు ధరకే సీసీఐ కొనాలని పట్టుబట్టారు. అధికారులందరినీ యార్డుకు రప్పించాలని బైఠాయించారు. మార్కెట్ కార్యదర్శి స్పందించి సీసీఐ అధికారులను పిలిపించారు. తేమశాతం అధికంగా ఉన్నందునే కొనడం లేదనడంతో రైతులు, కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమశాతం అధికంగా ఉంటే కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ఖరీదుదారులను పిలిపించి కొనుగోళ్లు జరిగేలా చూడాలని నిలదీశారు. దీనికి కార్యదర్శి స్పందించకపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చేరుకుని రైతులను సముదాయించారు. చివరకు ముగ్గురు వ్యాపారులు పత్తిని కొనడంతో వివాదం సద్దుమణిగింది. రైతులు మండుటెండలో రెండు గంటలపాటు ఆందోళన చేసినా.. సీసీఐ మాత్రం రూ.3,929 ధరతో 12.95క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకుంది. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.3500 నుంచి రూ.3900 వరకు చెల్లించి రైతులను నిలువునా దోపిడీ చేశారు. రతో 12.95క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకుంది. మధ్య దళారులు క్వింటాల్‌కు రూ.3500 నుంచి రూ.3900 వరకు చెల్లించి రైతులను నిలువు దోపిడీ చేశారు. -
రైతన్నకు పూర్తి ‘మద్దతు’
సిద్దిపేట జోన్: రైతాంగానికి మద్దతు ధర అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నదని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి. హరీష్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఖరీఫ్ ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ యేడు ఖరీఫ్ సీజన్ ధాన్యం, మక్కల కొనుగోళ్ల కోసం విస్తృతంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 67 మొక్కజొన్న, 168 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొక్కజొన్న ప్రభుత్వ మద్ధతు ధర క్వింటాలుకు రూ. 1,310, కామన్ గ్రేడ్ వరికి రూ. 1,360, ఏ గ్రేడ్ వరికి రూ. 1,400 చెల్లించేలా నిర్ణయించామన్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల ప్రక్రియలో భాగంగా సిద్దిపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టామన్నారు. వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 168 కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. వీటిలో 125 ఐకేపీ, 48 పీఏసీఎస్ పర్యవేక్షణలో ఉంటాయన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్ధతు ధరను పొందేందుకు కోతల అనంతరం ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని మంత్రి సూచించారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో ఈ యేడు 24 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వాటిలో బక్రిచెప్యాల, చిన్నగుండవెల్లి, చింతమడక, ఇర్కోడ్, నారాయణరావుపేట, పొన్నాల, పుల్లూరు, తోర్నాల, మాచాపూర్, పెద్దలింగారెడ్డిపల్లి, ఖాతా, నంగునూరు, నర్మెట, పాలమాకుల, గట్లమల్యాల, సిద్ధన్నపేట, అల్లీపూర్, చిన్నకోడూర్, గోనెపల్లి, గుర్రాలగొంది, జక్కాపూర్, ఇబ్రహీంనగర్, మైలారం, రామంచ గ్రామాలున్నట్లు ఆయన తెలిపారు. ఖరీఫ్ కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులను వేగవంతంగా జరిపేందుకు ఆన్లైన్ విధానాన్ని జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామన్నారు. రైతులకు 72 గంటల్లోగా ఆన్లైన్ ద్వారా బిల్లులు చెల్లిస్తామన్నారు. మరోవైపు సంబంధిత రైతుకు బిల్లుకు సంబంధించిన చెల్లింపు ధర, తేదీతో కూడిన వివరాలను ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. ఆ దిశగా తొలి విడతలో ఆరు కేంద్రాలకు రూ. 35 లక్షలు మంజూరు చేశామన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 130 కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ స్థల సేకరణలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉందన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డును పూర్తి స్థాయిలో కూరగాయల, మాంస మార్కెట్‌గా రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఆరు కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించడం జరిగిందని త్వరలో నిధులు మంజూరు కానున్నయన్నారు. ఈ నిధుల ద్వారా కూరాయల మార్కెట్లో కోల్డ్ స్టోరేజీ కేంద్రం తో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీలో కనీస మౌలిక వసతుల కోసం రూ. 11 కోట్లను మంజూరు చేశామన్నారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డు అభివృద్ధికి రూ. 12 కోట్లు మంజూరు అయ్యాయని, వారం రోజుల్లోగా పనులు ప్రారంభం జరిగేలా చర్యలు చేపడుతారన్నారు. సిద్దిపేటలో సుభోజన పథకం.. సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సుభోజన పథకాన్ని త్వరలో సిద్దిపేటలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ యార్డులోని రైతులకు, మాతా శిశు సంక్షేమ కేంద్రం, సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలోని రోగులకు, రోగుల బంధువులకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, యార్డుకొస్తున్న ధాన్యం వివరాలను మంత్రి అధికారులనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మద్దతు ధరల పోస్టర్లను, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ శరత్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, జిల్లా సహకార శాఖ అధికారి సాయికృష్ణుడు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడి, డీఎల్సీఓ ప్రసాద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య, తహశీల్దార్ రాములు, ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి ఎన్‌వైగిరి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చందు, టీఆర్ఎస్ నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, శేషుకుమార్, వ్యవసాయ శాఖ అధికారులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
‘గోవాడ’ రైతులకు చేదు కబురు
మద్దతుధరపై నిరాశమిగిల్చిన యాజమాన్యం నిరసన వ్యక్తం చేసిన రైతులు ఫ్యాక్టరీలో అవినీతి ఆరోపణలపై విచారణకు ఎమ్మెల్యే డిమాండ్ చోడవరం : గోవాడ సహకార చక్కెరమిల్లు మహాజనసభ సభ్యరైతులను నిరాశపరిచింది. గిట్టుబాటు ధర కోసం ఆశగా ఎదురుచూసిన రైతన్నలకు యాజమాన్యం ప్రకటన తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. రానున్న సీజన్‌కు సంబంధించి మద్దతు ధర ప్రకటించకపోగా, గతేడాది సరఫరా చేసిన చెరకు టన్నుకు రూ.2350 మాత్రమే చెల్లిస్తామని చైర్మన్ గూనూరు మల్లునాయుడు తెలిపారు. గోవాడ సుగర్స్ 44వ మహాజన సభ ఫ్యాక్టరీ ఆవరణంలో సోమవారం జరిగింది. తొలుత 2013-14 నివేదికను ఎమ్డీ వి.వి.రమణరావు చదివి వినిపించారు. అనంతరం 2014-15 అంచనా నివేదికను వివరించారు. అధ్యక్షోపన్యాసంలో చైర్మన్ మల్లునాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. ఫ్యాక్టరీని 4వేల టన్నులకు విస్తరిస్తున్నామన్నారు. మార్కెట్లో పంచదారకు ధర ఆశాజనకంగా లేకపోవడంతో గిట్టుబాటు ధర ఎక్కువగా ఇవ్వలేకపోతున్నామన్నారు. ఫ్యాక్టరీలో లోపాలు, మద్దతు ధరపై పలువురు రైతులు సభలో మాట్లాడారు. మా డుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ మద్దతు ధరను రూ.2800కు మించి చెల్లించాలన్నారు. మదుపులు బాగా పెరిగిపోయినందున కనీసం రూ.2600లయినా ఇవ్వాలన్నారు. మూడేళ్ల కిందట టన్నుకు రూ.2500లు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారని, అధికారంలో ఉన్న వీరు ఇప్పుడు మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల న్నారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ ప్రస్తుతం 5వేల టన్నుల కెపాసిటీకి ఫ్యాక్టరీని ఆధునీకరించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న మిషనరీని సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు గతంలో సుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయాలని చూశారని, వైఎస్ రాజశేఖరరెడ్డి చెరకు రైతులను ఆదుకొని ఫ్యాక్టరీలను నిలి పారన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏటా టన్నుకు రూ.200లు చొప్పున రైతులకు ప్రోత్సాహకం ఇచ్చిందని, అధికార పార్టీ పాలకవర్గం, ఎమ్మెల్యేలు సీఎంపై ఒత్తిడి తెచ్చి దానిని కొనసాగించాలన్నారు. ఈ సీజన్‌కు టన్నుకు రూ. 2800 మద్దతు ధర ఇవ్వాలన్నారు. కో-జనరేషన్ ద్వారా ప్రభుత్వానికి అమ్మే కరెంటు ధర పీపీని రద్దు చేసి యూనిట్‌కు రూ. 9 ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ధర్మశ్రీ చెప్పారు. ప్రతి పక్షాలు ఎప్పుడూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. అవినీతి అరోపణలపై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే రాజు గోవాడ సుగర్ ప్యాక్టరీలో అవినీతి చోటుచేసుకుం దంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ కమిటీ వేయాలని చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు డిమాండ్ చేశారు. ఆరోపణలు నివృత్తిచేసుకోకపోతే పాలకవర్గానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇందుకు తక్షణం కమిటీని వేయాలన్నారు. టన్నుకు రూ.2500 మద్దతు దర ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీర్మానాలు : మహాజనసభలో పలు తీర్మానాలు చేశారు. 2013-14 క్రషింగ్ సీజన్‌కు టన్నుకు రూ.2350 మద్దతు ధరను చైర్మన్ మల్లునాయుడు ప్రకటించారు. రోజువారీ క్రషింగ్ సామర్థ్యం పెంచేం దుకు రూ.24కోట్లతో ఆధునికీకరణకు ప్రతిపాదన, కరెంటు పీపీ రద్దు, పంచదార అమ్మకాలపై వ్యాట్ రద్దు, మొలాసిస్ అమ్మకాలపై అదనపు పన్ను రద్దు, ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని గ్రీన్ బెల్టుగా రూపొందించే పనులకు సమావేశంలో ఆమోదం తెలిపారు. రైతులకు ప్రోత్సాహకాలు : మునుపెన్నడూలేని విధంగా సభ్యరైతులకు ఫ్యాక్టరీ నిధులతో ఒకొక్కరికి ఒక స్టీల్ క్యారేజ్‌ను ప్రోత్సాహకంగా అందజేసింది. వీటిని సభలో నాయకులు రైతులకు అందజేశారు. ఉత్తమ రైతులకు సత్కారం : ఫ్యాక్టరీ పరిధిలో ఆధునికీకరణ పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడి సాధించిన ఇద్దరు రైతులను సభలో సత్కరించారు. వారాడకు చెందిన యడ్ల తాతయ్యలు, సింహాద్రిపురం శివారుకు చెందిన సబ్బవరపు వెంకటరమణలను సన్మానించారు. -
శనగలకు గిట్టుబాటు ధర కల్పించాలి
నంద్యాల: శనగకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, క్వింటాల్ రూ.5 వేల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనగలకు గిట్టుబాటు ధర లేక కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో రైతులు మూడు సంవత్సరాల నుంచి ధాన్యాన్ని నిల్వ ఉంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బ్యాంకుల్లో కుదువకు పెట్టుకున్న సొత్తులు సమయానికి విడిపించుకోలేకపోవడంతో బ్యాంకులు వేలం వేస్తున్నాయన్నారు. ప్రభుత్వం మాత్రం క్వింటాల్ రూ.3100 చొప్పున కొనుగోలు చేయాలని భావిస్తుండటం దారుణమన్నారు. రాష్ట్ర విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మంది రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ పరిధిలో ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలను తిరుపతికి కేటాయించడంతో హైదరాబాద్ నుంచి దరఖాస్తులు, డీడీలు తిరుపతికి చేరుకుంటే తప్ప ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు అత్యధికంగా నీటిని విడుదల చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల సీమ జిల్లాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని భూమా డిమాండ్ చేశారు. శాసన సభ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజా సమస్యలు వెలుగులోకి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జరిగే శాసన సభ సమావేశాల్లోనైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. -
పెసరకు భారీ ‘మద్దతు’
తాండూరు: పెసరకు డిమాండ్ ధర పలుకుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మద్ధతు ధర కన్నా అధికంగా ధర లభిస్తోంది. పెసర్ల సీజన్ ఆరంభం కావడంతో తాండూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో క్రయవిక్రయాలు మొదలయ్యాయి. గత మూడు రోజులుగా వివిధ గ్రామాల నుంచి రైతులు పెసర్లను యార్డుకు తరలించి విక్రయిస్తున్నారు. క్వింటాలు పెసర్లకు ప్రభుత్వ మద్ధతు ధర రూ.4500. మార్కెట్ యార్డులో క్వింటాలుకు గరిష్టంగా రూ.6525, కనిష్టంగా రూ.6000, సగటు(మోడల్) ధర రూ.6200 ధర పలుకుతున్నట్టు మార్కెట్ కమిటీ అధికారులు చెబుతున్నారు. మద్దతుకు మించి ధర పలుకుతుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సీజన్ ఆరంభంలో పంట నాణ్యతగా ఉండటం అధిక ధర పలకడానికి కారణమని మార్కెట్ కమిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. మద్దతు ధర కన్నా క్వింటాలు పెసర్లకు రూ.1700 అధికంగా ధర పలకడం గమనార్హం. ఇప్పటివరకు మార్కెట్ యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు/వ్యాపారులు క్వింటాలుకు సగటు ధర రూ.6200 చొప్పున రూ.1,30,20,000 విలువ చేసే 2100 క్వింటాళ్ల పెసళ్లను కొనుగోలు చేసినట్టు తాండూరు మార్కెట్ కమిటీ సూపర్వైజర్ హబీబ్ అల్వీ తెలిపారు. పెసర్ల క్రయవిక్రయాలపై రూ.వందకు 1శాతం చొప్పున రూ.1.30లక్షలపైగా మార్కెట్ ఫీజు రూపంలో ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు. మరో నెలపాటు పెసర్ల్ల సీజన్ కొనసాగుతుందన్నారు. -
అన్నదాతకు అండగా కొత్త మార్గదర్శకాలు
మార్కెటింగ్ శాఖ ప్రచారమే ముఖ్యం సాక్షి, మంచిర్యాల : అన్నదాతలకు గిట్టుబాటు ధర లభించినపుడే పంట అమ్ముకునేలా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకానికి ప్రభుత్వం మెరుగులు దిద్దింది. తాజా మార్గదర్శకాలు అమలు చేస్తూ అవగాహన కల్పిస్తే అన్నదాతలకు న్యాయం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు మార్కెటింగ్ శాఖ ప్రచారానికి రంగం సిద్ధం చేస్తోంది. పథకం అమలు ఇలా.. మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న రైతులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాస్‌బుక్ నకలు, రెండు ఫొటోలు ఇస్తే అధికారులు సదరు రైతుకు రైతుబంధు కార్డును అందజేస్తారు. ఈ కార్డుదారులకు దక్కే సౌలభ్యాలను ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆశాజనకంగా రూపొందించింది. పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కనపుడు మార్కెట్ యార్డులో ధాన్యం నిలువచేసుకొని దాని మొత్తం విలువలో 75 శాతం లేదా రూ.లక్ష రూపాయల లోపు రుణంగా గతంలో పొందేవారు. యార్డుల్లో ధాన్యాన్ని మూడునెలల వరకు నిలువ చేసుకునే సదుపాయం ఉండేది. ఆ నిబంధనను తాజాగా మార్చి ధాన్యం విలువలో 75 శాతం మొత్తాన్ని రుణంగా ఇవ్వడం యథావిధిగా ఉంచుతూ రుణమొత్తాన్ని ప్రభుత్వం రూ.2 లక్షలకు పెంచుతూ తెలంగాణ సర్కారు జీవో నంబర్ 5ను జారీ చేసింది. మరోవైపు నిలువ ఉంచే సమయాన్ని 3 నెలల నుంచి ఆరు నెలలకు పెంచింది. దీంతోపాటు గతంలో ఉన్న వడ్డీ చెల్లించే అవసరం లేకపోవడాన్ని యథావిధిగా కొనసాగిస్తూ రైతుబంధు కార్డు కాలపరిమితిని ఐదేళ్లకు పెంచారు. ప్రచారం ముఖ్యం జిల్లాలో వరి, పత్తి, సోయా, కంది వంటి పంట లు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఈ పంటల లో ఎక్కువ వాటికి గిట్టుబాటు ధర దక్కడం లే దు. పంట చేతికి వచ్చిన సమయంలోనే అమ్ముకుంటే తక్కువ ధర వచ్చే నేపథ్యంలో యార్డుల్లో నిలువ చేసుకుంటే గిట్టుబాట ధర వచ్చినపుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో 17 మార్కెట్‌యార్డులు, 82 గోడౌన్లు అందుబాటు లో ఉన్నాయి. ఇందులో 66,000 మెట్రిక్ టన్ను ల ధాన్యం నిలువ చేసే సదుపాయం ఉంది. అ యితే ప్రస్తుతం అందులో కొన్ని పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు. అందులోనుంచి డీలర్ల కు పీడీఎస్ సరుకులు పంపిణీ చేసేలా ఎంఎల్ఎస్ పాయింట్లుగా పౌరసరఫరాల శాఖ ఉపయోగించుకుంటోంది. దీంతోపాటు ఇటీవల కొనుగోలు చేసిన ధాన్యం నిలువ ఉంచేందుకు ఐకేపీకి గోడౌన్లు అందజేశారు. అయితే ఐకేపీ నిలువ చేసిన ధాన్యం తరలిన తర్వాత రైతుబంధు అమలుకు ప్రచారం చేస్తామని మార్కెటింగ్ శాఖ పేర్కొంటోంది. ఇప్పటివరకు లబ్ధిదారులు జిల్లాలో 45,799 రైతుబంధు కార్డులు అందజేశారు. అయితే రైతుబంధు పథకాన్ని ఉపయోగించుకుంటున్న అన్నదాతలు ఏటా తగ్గుము ఖం పడుతున్నారు. తాజాగా ప్రభుత్వం రైతుల కోసం కల్పించిన సౌలభ్యానికి తోడుగా మార్కెటింగ్‌శాఖ రైతుల్లో అవగాహన కల్పిస్తే మేలు. -
మిల్లర్లతో మిలాఖత్?
తనిఖీలు చాలు.. వచ్చేయండి! అధికారులకు బాస్‌ల ఫోన్? రైస్‌మిల్లుల్లో ఆగిన తనిఖీలు మధ్యలోనే వెళ్లిపోయిన వైనం ఇక నోటీసులిచ్చి ఏం ప్రయోజనం? జమ్మికుంట :ధాన్యం రైతులకు మద్దతు ధర చెల్లించని మిల్లర్లకు నోటీసులిచ్చి.. తనిఖీలు మొదలుపెట్టిన విజిలెన్స్ అధికారులకు ఏమైందో ఏమో గానీ... కాసేపటికే ఆపేశారు. అధికారుల నోటీసులతో తమకు మద్దతు ధర దక్కుతుందని ఆశించిన రైతన్నలకు దీంతో నిరాశే మిగిలింది. ఉన్నతాధికారుల ఫోన్‌తో అధికారులు ఆగమేఘాలమీద వెనుదిరగగా నోటీసులు ఇక చెత్తబుట్టలకే పరిమితం కానున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వరంగ సంస్థలతోపాటు మిల్లర్లు కూడా కొనుగోలు చేశారు. మద్దతు ధర గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,345 ఉండగా వ్యాపారులు రూ.1,150 నుంచి రూ.1,200 దాకా, మగ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,310 ఉండగా మిల్లర్లు రూ.850 నుంచి రూ.950 మాత్రమే చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో సివిల్ సప్లయ్స్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టగా... తమకు మద్దతు ధర దక్కడం లేదని చాలా మంది రైతులు వెల్లడించారు. రైతులు చెప్పిన వివరాల మేరకు రూపొందించిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు జమ్మికుంటలోని ఏడు మిల్లులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జిల్లా విజిలెన్స్ అధికారులు మూడు మిల్లుల్లో సోదాలు మొదలుపెట్టారు. ఒక్కో మిల్లులో వేలాది క్వింటాళ్ల నిల్వలుండగా తనిఖీ చేసేందుకు ఒక రోజు సమయం పట్టే అవకాశముంది. కానీ, అధికారులు కేవలం రెండు గంటల్లోనే మూడు మిల్లులు తనిఖీ చేసి అర్ధంతరంగా వెనుదిరిగారు. తనిఖీలు మొదలుపెట్టగానే మిల్లుల్లో ఉన్న అక్రమ నిల్వలు, నేరుగా కొనుగోళ్లు చేపట్టిన వివరాలు, రికార్డుల్లోకి ఎక్కని ధాన్యం, రైతుల వద్ద తక్కువ ధరతో సేకరించిన ధాన్యం గుట్టు బయటపడుతుందనే భయంతో కొందరు వ్యాపారులు ఓ ముఖ్యనాయకుడితో తనిఖీలు ఆపేలా ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సదరు నాయకుడినుంచి ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లగా.. మిల్లుల్లో అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు తయారు చేయాలని వారు తనిఖీ అధికారులకు ఫోన్లోనే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేవలం మూడు మిల్లుల్లోనే రెండు గంటల్లో తనిఖీలు చేపట్టి వెనుదిరిగారనే ప్రచారం జరుగుతోంది. అధికారుల తనిఖీలతో తమకు మద్దతు ధర చెల్లిస్తారని ఆశించిన రైతులు తీవ్ర నిరాశ చెందారు. అసలు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మిల్లర్లకు నోటీసులు ఎందుకు జారీ చేశారు? వీటి వెనుక మర్మమేమిటి? తనిఖీలు లేకుండా అక్రమ నిల్వలను ఎలా గుర్తిస్తారు? తనిఖీలు అర్ధంతరంగా నిలిపేసి ఎందుకు వెనుదిరిగినట్లు? అనేది అంతుచిక్కడం లేదు. -
అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర
కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం వెల్లడి భువనేశ్వర్(ఒడిశా) : గిరిజనులకు ప్రయోజనం కలిగేలా చింతపండు వంటి పది రకాల అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం వెల్లడించారు. ఈ నిర్ణయం అటవీ ప్రాంత నివాసితులకు మేలు చేకూర్చుతుందన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, కరెంట్ వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం ప్రాధాన్యమిస్తుందని ఆయన తెలిపారు. రెండు రోజుల ఒడిశా పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడ రాష్ర్ట గిరిజన శాఖాధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు, సహజ సంపదకు నష్టం జరగకుండా చేపట్టే ప్రాజెక్టులకే తన మద్దతుంటుందన్నారు. ఒడిశాలోని కాందహార్‌లో పోస్కో కంపెనీ ప్రతిపాదించిన ముడి ఇనుము మైనింగ్‌పై సంబంధిత మంత్రులకు తన అభిప్రాయాలు చెబుతానన్నారు. పోలవరంపై ఒడిశాకు మద్దతు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్ట్‌పై ఒడిశా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తానని, పార్లమెంట్‌లోనూ పోరాడతానని కేంద్ర మంత్రి జుయల్ ఓరం తెలిపారు. అవసరమైతే ఈ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తానన్నారు. రాష్ట్ర ప్రజల ఆదరణతో పార్లమెంటుకు వెళ్లిన నేపథ్యంలో ఇక్కడి వారి ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యమిస్తానన్నారు. -
‘మద్దతివ్వండి’ ... మహాప్రభో
సాక్షి, మహబూబ్‌నగర్: అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు చేస్తున్న డిమాండ్‌ను అధికారులు పెడచెవిన పెడుతున్నారు. కొనుగోలుకు ప్రభుత్వంనుంచి ఆదేశాలు అందకపోవడం వల్లనే అధికార గణం ధాన్యం క్రయ విక్రయాలపై శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి తరువాత జిల్లాలో కురిసిన అకాల వర్షంతో ఐకేపీ కేంద్రాల వద్ద క్రయ విక్రయాలకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పాన్‌గల్, వీపనగండ్ల తదితర మండలాల పరిధిలోని ఐకేపీ కేంద్రాలలో సుమారుగా 14 వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసిపోయినట్లు అధికార వర్గాలు ప్రాధమికంగా అంచనా వేశాయి. ఈ తడిసిన ధాన్యంలో 9 వేల క్వింటాళ్ల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఉన్నట్లు సమాచారం. మిగతా 5 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రం అమ్మకం కోసం ఐకేపీ కేంద్రాలకు తరలించిన రైతుల ధాన్యంగా తెలుస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఐకేపీ వర్గాలు మాత్రం బుధవారం 16 వాహనాలను ద్వారా మహబూబ్‌నగర్‌లోని గోదాములకు చేర్చినట్లు సమాచారం. రైతుల ధాన్యాన్ని మాత్రం పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి వరి పంటను పండించి విక్రయం కోసం కొనుగోలు కేంద్రాలకు తరలించగా... అకాల వర్షం కారణంగా తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్వయాన ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ తడిసిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరతో కొనుగోలు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ....అధికారులు మాత్రం ఆచరణలో పెట్టడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడమేనని తెలుస్తోంది. రైతులకు న్యాయం జరిగే విధంగా ధాన్యం క్రయ విక్రయాల్లో పూర్తిస్థాయి తోడ్పాటును అందిస్తున్నామని పేర్కొంటున్న అధికారులు... ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే తూచ తప్పకుండా పాటిస్తామని పేర్కొంటున్నారు. రైతులు మాత్రం తడిసిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలు నిరాసక్తతను చూపిస్తున్నాయని వివరిస్తున్నారు. మార్కెట్లోకి తీసుకెళ్లే వ్యాపారులు కారు చౌకకు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకు అనుగుణంగా ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని రూ.1345 సాధారణ రకం ధాన్యానికి రూ.1310 ఉండగా వ్యాపారులు మాత్రం కారుచౌకగా రూ.700ల నుంచి రూ.900ల వరకే ఖరీదు చేయడానికి ముందుకు వస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిపోయిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. -
‘ఐకేపీ’ల్లో మూలుగుతున్న ధాన్యం
- పజ్జూరు ఐకేపీ కేంద్రంలోనే పేరుకుపోయిన 30 లారీల ధాన్యం - లారీల కొరతను సాకుగా చూపుతున్న నిర్వాహకులు - సొంత ఖర్చులతో రవాణా చేసుకుంటున్న రైతులు - చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం జిల్లాలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో సంఘబంధాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని ఎంతో ఆశతో వచ్చిన రైతన్నకు వివిధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రాల నిర్వాహకులు సకాలంలో ధాన్యం కాటా వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు గన్నిబ్యాగు(బస్తాలు)లు సరిపడా వున్నప్పటికీ కొన్ని చోట్ల కాంటా వేయడం లేదని తెలుస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే హమాలీల కొరత ఉందని చెబుతున్నట్లు రైతులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల లారీల కొరత ఉండటం కారణంగా ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. అంతేకాకుండా కొన్ని ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యాన్ని నాలుగైదు మిల్లులకు పంపించడం వల్ల మిల్లర్లు, లోడుకు 6 నుంచి 8 క్వింటాళ్ల తరుగు చూపుతున్నారని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. గడ్డికొండారం ఐకేపీ కేంద్రం నుంచి మిర్యాలగూడలోని మహేశ్వరి మిల్లుకు మూడు రోజులుగా ధాన్యం తరలిస్తున్నారు. ఆ మిల్లు యాజమాన్యం తరుగు ఎక్కువగా చూపుతుండటంతో ఐకేపీ సిబ్బంది, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పజ్జూరు ఐకేపీ కేంద్రం తీరిది తిప్పర్తితో పాటు పజ్జూరు ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. ఒక్క పజ్జూరు ఐకేపీ కేంద్రానికే సుమారు 25 లారీల ధాన్యం వచ్చింది. ఇందులో 8 లారీలకు సరిపడా ధాన్యం కాంటా వేసి బస్తాల్లో ఉంచారు. కాంటా వేసి వారం రోజులవుతున్నా ఒక్క లారీ కూడా రాకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిస్తోంది. మూ డు రోజుల కిత్రం వచ్చిన వర్షానికి ధాన్యా న్ని రక్షించేం దుకు సిబ్బంది పడిన అవస్థలు అంతాఇంతా కాదు. లారీలను సమకూర్చే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సిబ్బంది, రైతులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గడ్డికొండారంలో దయనీయ పరిస్థితి గడ్డికొండారం ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లిన రైతులకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని తరలించుకోవాలని, లేదంటే ధాన్యం కొనుగోలు చేయమని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. చేసేదేమి లేక రైతులే కిరాయి చెల్లించి తమ ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. -
రైతులకు అందని ‘మద్దతు’
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని పదేపదే గుప్పించిన ప్రకటనలు ఆచరణలో చూపలేకపోయారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర కల్పిస్తామన్న గత ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. జిల్లాలో గత నెల 4వ తేదీన ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 27 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 580 మంది రైతులకు రూ.11.34 కోట్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. చాలామంది రైతులకు మద్దతుధర అందలేదు. ధాన్యాన్ని రైసు మిల్లులకు రవాణా చేసి నెల కావస్తున్నా ఇప్పటి వరకు తమ ఖాతాలో నగదు జమ చేయలేదని రైతులు వాపోతున్నారు. జిల్లా పౌర సరఫరాల కార్యాలయానికి వెళితే సమాధానం చెప్పేవారేలేరని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం సేకరణ ఇలా... పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, డీఎం సివిల్ సప్లయీస్ సంయుక్తంగా ధాన్యం సేకరణ చేపట్టింది. కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ సిబ్బంది ద్వారా ధాన్యాన్ని సేకరించారు. రైతుల ధాన్యాన్ని సంబంధిత రైసుమిల్లులకు పంపుతారు. అక్కడ వారు రసీదు ఇస్తారు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్ దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి సంబంధిత రైతుకు మద్దతు ధర క ల్పించేందుకు డీఎం సివిల్ సప్లయీస్‌కు పంపిస్తారు. దీనిని పరిశీలించిన డీఎం రైతుకు 2,3 రోజుల్లో నేరుగా వారి ఖాతాలో మద్దతు ధరకు సంబంధించిన మొత్తాన్ని జమ చేయాలి. కానీ నెలలు గడుస్తున్నా అందాల్సిన మొత్తం అందలేదు. -
పొగాకు రైతులకు మంచిరోజులు
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: వేలం కేంద్రాల్లో లోగ్రేడ్ రకం పొగాకుకు డిమాండ్ రావడంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు. నాణ్యమైన పొగాకును వెనక్కు నెట్టి లోగ్రేడ్‌ను కొనేందుకు వ్యాపారులు ముందుకు వస్తుండటం రైతులకు కలిసొచ్చింది. విదేశీ ఆర్డర్లతో ఎగుమతిదారులు లోగ్రేడ్‌లో కాస్తంత మంచి పొగాకు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో లోగ్రేడ్ నిల్వల్లో కదలిక వచ్చింది. కొన్నాళ్లుగా పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర రాక, వేలం కేంద్రాలకు తెచ్చిన బేళ్లను సైతం వెనక్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రెండు రోజులుగా మార్కెట్లో ఊహించని మార్పుల వలన మేలు రకం పొగాకుతో సమానంగా లోగ్రేడ్ పొగాకుపై బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో పాటు మీడియం గ్రేడ్లకు కూడా మంచి ధర పలుకుతుండటంతో పొగాకు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒంగోలు రీజియన్ పరిధిలో ఒంగోలు రెండు, టంగుటూరు పరిధిలో రెండు, కొండపి, కందుకూరు పరిధిలో రెండు, గుంటూరు పరిధిలో వెల్లంపల్లి 1, 2, కేంద్రాలు, పొదిలిలో 1, 2 కేంద్రాలు, కలిగిరి, డీసీపల్లిల్లో పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 47,146 మంది పొగాకు పండించే రైతులున్నారు. కర్ణాటకలో 42,204 మంది రైతులు పొగాకు పండిస్తున్నారు. పొగాకు కేంద్రాలు ప్రారంభమై దాదాపు 70 రోజులు కావస్తోంది. ప్రారంభం నుంచి ఏనాడూ రైతుకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాణ్యమైన, మేలిమి రకం పొగాకుకు రూ.127 నుంచి రూ.130 పలుకుతోంది. ఆ ధర కూడా కొద్ది బేళ్లకు మాత్రమే పలుకుతోంది. అత్యధిక బేళ్లకు కిలో రూ.115 నుంచి రూ.120 ఉంటుందని అంచనా. మీడియం గ్రేడ్‌లో కూడా కిలో రూ.105 నుంచి రూ.115 వరకు కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు లోగ్రేడ్ పొగాకును కొంటున్నారు. దీనికి కూడా కిలో రూ.105 నుంచి రూ.115 వరకు ధర పలుకుతోంది. దీంతో నాలుగే ళ్లుగా వ్యాపారుల వద్ద నిల్వలకు కదలిక వచ్చింది. వేలం కేంద్రాల్లో లోగ్రేడ్ పొగాకుకు మంచి ధర వచ్చిందని ఇటీవల ఒంగోలు వచ్చిన టుబాకో బోర్డు చైర్మన్ గోపాల్ విలేకర్ల సమావేశంలో తెలిపారు. పలు కంపెనీల నుంచి విదేశీ వ్యాపారులు లోగ్రేడ్ రకాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇతర దేశాల్లో లోగ్రేడ్ రకానికి ధరలు ఎక్కువగా ఉండటంతో మన లోగ్రేడ్ రకం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ర్టంలో 2013-14లో 172 మిలియన్ల పొగాకు పంట పండించేందుకు పొగాకు బోర్డు నిర్దేశిస్తే రైతులు దాదాపు 185 మిలియన్ల కిలోల పొగాకు పంట పండించారు. దీనిలో ఇప్పటి వరకు 85 నుంచి 90 మిలియన్ కిలోల వరకు అమ్మకాలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఆరు వేల కోట్ల పొగాకు ఉత్పత్తులు ఎగుమతి అయినట్లు టుబాకో బోర్డు చైర్మన్ ఇటీవల తెలిపారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
‘సాక్షి’ కథనంపై అధికారుల స్పందన సాక్షి, హైదరాబాద్: ధాన్యానికి మద్దతు ధరతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. ధాన్యానికి మద్దతు ధర లభిం చడం లేదని గురువారం సాక్షి పత్రికలో ‘ముద్దకు మద్దతేది ?’ అనే కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పౌరసరఫరాల కార్పొరేషన్ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుత సీజన్ రబీ ధాన్యన్ని కొనుగోలు చేయడానికి వీలుగా 2,018 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పామని, అవసరం అనుకుంటే మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు అవసరం అయ్యే 4.95 కోట్ల గోనె బస్తాలను కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా 2.08 లక్షల మంది రైతుల నుంచి రూ.884 కోట్ల విలువ చేసే 7.90 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వివరించారు. అలాగే మద్దతు ధరపై 18.75 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. కాగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి నిధులు విడుదల చేశామని సివిల్ సప్లయ్స్ అధికారి పేర్కొన్నా.. రైతులకు మాత్రం డబ్బు అందలేదు. సివిల్ సప్లయ్స్ నుంచి ఇప్పటి వరకు కేవలం రూ. 370 కోట్లు మంజూరు అయితే విడుదలైంది మాత్రం రూ. 309 కోట్లు మాత్రమే విడుదల అయినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
ధాన్యం.. దైన్యం
సాక్షి, ఏలూరు : ధాన్యం విరగ పండినప్పటికీ రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలగటం లేదు. మద్దతు ధర లభించకపోవడంతో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ధాన్యానికి ఇచ్చే కనీస మద్దతు ధరను ప్రభుత్వం ఏటా ఎంతోకొంత పెంచుతుంటుంది. ఈ ఏడాది ప్రభుత్వం లేకపోవడం.. కొత్త ప్రభుత్వం ఇంకా కొలువుదీరకపోవడంతో మద్దతు ధరపై నేటికీ ప్రకటన వెలువడలేదు. జిల్లాలో ఇప్పటికే దాదాపు సగానికి పైగా ధాన్యా న్ని మిల్లర్లకు తక్కువ ధరకే రైతులు విక్రరుుంచారు. ధాన్యం కొనుగోలుకు ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నా కొనుగోళ్లు నామమాత్రంగానే ఉన్నారుు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా మిల్లర్లు ధర తగ్గించేశారు. పట్టించుకునేదెవరు? ధరల విషయంలో దోపిడీకి గురవుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమైనా గిట్టుబాటు ధర కల్పిస్తుందనుకుంటే అదీ లేదు. గత ఖరీఫ్‌లో ధాన్యానికి మద్దతు ధర రూ.60 పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించడంతో ఏ గ్రేడ్ ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,250 నుంచి రూ.1,310కి పెరిగింది. ఈసారి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. నిజానికి గిట్టుబాటు ధర ఎంతున్నా రైతుకి దక్కేది నామమాత్రమే. మద్దతు ధరను కనీసం రూ.2,200 పెంచితే మిల్లర్లు ధర పెంచుతారని రైతులు ఆశపడుతున్నారు. చేలల్లోనే ధాన్యం ఈ ఏడాది డెల్టా, సెమీ డెల్టాలో 3,78,190 ఎకరాలు, మెట్టలో 39,310 ఎకరాల్లో కలిపి మొత్తం 4,17,500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. వాస్తవానికి 17 శాతం తేమ గల ధాన్యాన్ని ఏ గ్రేడ్‌గా గుర్తించి క్వింటాల్‌కు రూ.1,345 చెల్లించాలి. అంతకు మించి తేమ ఉంటే బీ గ్రేడ్‌గా గుర్తించి రూ.1,310కు కొనుగోలు చేయాలి. ప్రభుత్వ ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,008 ధర రావాల్సి ఉండగా, దళారులు రూ.900 నుంచి రూ.920 మధ్య కొంటున్నారు. సాధారణ రకం ధాన్యానికి రూ.982 ధర వస్తుందనుకుంటే రూ.850 నుంచి రూ.880 మాత్రమే ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రేడ్‌తో సంబంధం లేకుండా ఏ రకం ధాన్యాన్ని అయినా ఒకే ధరకు అడుగుతున్నారు. దీంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవడానికి మనసొప్పక చేలల్లోనే రాశులుగా పోసి నామమాత్రపు రక్షణ చర్యల మధ్య వదిలేస్తున్నారు. ఈ కారణంగా ఇప్పటివరకూ సుమారు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు కొనగలిగారు. అలంకార ప్రాయంగా ఐకేపీ కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకే కొంటామని అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో విఫలమవుతూనే ఉన్నాయి. 2012 ఖరీఫ్‌లో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగుచేశారు. అంచనా దిగుబడి 11.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, లక్షా 35 వేల హెక్టార్లలో వరి పంట నీలం తుపానుకు దెబ్బతింది. దీంతో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు కోల్పోయారు. మిగిలిన ధాన్యాన్ని కొనడానికి జిల్లాలో 72 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేవలం 28 కేంద్రాల్లో 7,301మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 2013 రబీలో లక్షా 68 వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ధాన్యం కొనుగోలుకు 76 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్పత్తి లక్ష్యం 11.99 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఐకేపీ కేంద్రాల ద్వారా కొన్నది కేవలం 108 మెట్రిక్ టన్నులే. 2013 ఖరీఫ్‌లో జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేశారు. వర్షాలకు 54 వేల 400 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. గరిష్టంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ వర్షం దెబ్బకు ఆ దిగుబడి సగానికి పడిపోయింది. 80కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేసినా కేవలం 250 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. ఈ ఏడాది రబీలో జిల్లాలోని 57 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ కేవలం 886 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వం ధాన్యం కొంటే మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుంది. అది ఎగవేయడానికి, మిల్లర్లకు మేలు చేకూర్చడానికీ ప్రభుత్వమే ఈ విధంగా కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నారుు. -
ముద్దకు మద్దతేదీ?
-
సౌకర్యాలు లేకనే..
బాన్సువాడ టౌన్, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు రైతన్నలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అసలే ధాన్యం కొనుగోళ్లు లేక, కనీస మద్దతు ధర రాక తీవ్ర ఆందోళన చెందుతున్న రైతులపై ప్రకృతి విరుచుకు పడుతోంది. బాన్సువాడ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షం వల్ల మండలంలోని వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. బాన్సువాడ మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం కుప్పలన్నీ వర్షం నీటిలో మునిగి పోయాయి. పొద్దంతా ఎండలు మండిపోతున్నాయి. రాత్రి వేళ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి వర్షం కురియడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేక పోతున్నారు. రైతులకు తాటిపత్రులు కూడా అందుబాటులో ఉండక పోవడంతో ధాన్యం కుప్పలు తడిసి పోతున్నాయి. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, సోమేశ్వర్, బుడ్మి, తిర్మలాపూర్, చింతల్‌నాగారం, బోర్లం తదితర గ్రామాల్లో పొలాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్నది. చింతల్ నాగారంలో రెండు రోజుల క్రితమే సుమారు 400 ఎకరాల్లో రైతులు వరి కోతలు కోసి ధాన్యాని ఆరబెట్టారు. వర్షం దాటికి కుప్పలన్నీ నానిపోయాయి. ఎకరానికి రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు. గన్నీ సంచుల కొరత, రైస్ మిల్లర్ల నిబంధనలు, హమాలీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రోజుల తరబడి ధాన్యం కాంటాలు కావడం లేదని, ఫలితంగా ధాన్యం కుప్పలన్నీ వర్షం పాలవుతున్నట్లు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ముద్దకు మద్దతేదీ?
కామన్ వరి మద్దతు ధర: 1,310 ఇస్తున్న ధర: 900-1,000 అన్నదాత నోట్లో మట్టికొడుతున్న వ్యాపారులు ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా దగా మద్దతు ధర కంటే రూ. 300 నుంచి 400 తక్కువ చెల్లింపు నిల్వ చేసుకునే సౌకర్యం లేక తడిసిపోతున్న ధాన్యం అయినకాడికి అమ్ముకుంటున్న దైన్యం.. వ్యాపారులు, మిల్లర్ల మాయాజాలంలో రైతన్న చిత్తు సాక్షి, హైదరాబాద్: మట్టిని నమ్ముకున్న రైతుకు చివరకు మట్టే మిగులుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడంలేదు. ఓ పక్క రాష్ట్రపతి పాలన.. నిన్నమొన్నటి వరకు ఎన్నికల హడావుడి కారణంగా ప్రభుత్వ నిఘా లేకపోవడంతో దళారులు చెలరేగిపోతున్నారు. ధాన్యం కొనుగోలులో అడ్తి వ్యాపారులు, మిల్లర్ల మాయాజాలంలో రైతన్న చిత్తవుతున్నాడు. మరోవైపు ఏజెంట్లతో మార్కెట్ కమిటీ కుమ్మక్కవుతుండటంతో రైతులకు ధాన్యం నిల్వ చేసుకునే సౌకర్యం కూడా లభించడంలేదు. ఫలితంగా వర్షం వస్తే ధాన్యం తడిసిపోతోంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోవడంతో.. ఏజెంట్లు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు కొంటున్నారు. రైతులు కూడా ఇక చేసేది ఏమీ లేక ఎంత వస్తే అంతకే అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనే దిక్కే లేదు: సీజన్ బాగుండడం, ప్రాజెక్టుల్లో అవసరమైన నీరు ఉండడంతో ఈ ఏడాది రబీలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. సాధారణ వరి విస్తీర్ణం 35.77 లక్షల ఎకరాలు ఉండగా, ఈ ఏడాది 40.5 లక్షల ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చింది. అంటే, ఆ మేరకు ధాన్యం దిగుబడి కూడా పెరగనుంది. దీన్ని అంచనా వేసిన మిల్లర్లు, వ్యాపారులు.. ధరలను తగ్గించేసి రైతులను దగా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి లేకపోవడం, ప్రత్యామ్నాయ కొనుగోలు వ్యవస్థ నెలకొల్పలేకపోవడంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం రబీ పంటలు కోత దశకు చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ధాన్యం మార్కెట్లోకి వస్తోంది. కానీ వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువగా చెల్లిస్తున్నారు. సాధారణ రకం ధాన్యం(కామన్ వరి) మద్దతు ధర రూ.1,310 కాగా, గ్రేడ్-ఏ ధర రూ.1,345గా ఉంది. అయితే రైతుకు రూ.900 నుంచి రూ.వెయ్యిలోపు మాత్రమే ఇస్తున్నారు. ఇదేంటని అడిగితే.. ‘ఈ ధరకైతే ఇవ్వండి, లేదా వెనక్కి తీసుకెళ్లండి’ అని వ్యాపారులు కరాఖండిగా చెబుతున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడానికి ఏ మిల్లర్లు కూడా ముందుకు రావడంలేదు. దీంతో రైతన్న శ్రమకు తగిన ఫలితం దక్కడంలేదు. రోడ్డెక్కుతున్న రైతన్న... నాణ్యమైన ధాన్యానికి సైతం వ్యాపారులు తక్కువ ధర నిర్ణయించడంపై భగ్గుమన్న రైతులు ఇక చేసేది లేక రోడ్డెక్కుతున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డుకు 15 వేల బస్తాల ధాన్యం వచ్చింది. అయితే తేమ సాకుతో ప్రభుత్వరంగ సంస్థలు ధాన్యం కొనుగోలు చేయలేదు. నాణ్యమైన ధాన్యానికి సైతం వ్యాపారులు.. మద్దతు ధరకంటే రూ.150 తక్కువగా నిర్ణయించారు. అంతేగాక ‘ఇష్టముంటే అమ్ముకోండి... లేదంటే వెళ్లిపొండి’ అని నిర్లక్ష్యంగా మాట్లాడడంతో రైతులు ఆగ్రహంతో మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులను నిర్బంధించే ప్రయత్నం చేశారు. యార్డు ఎదుట రహదారిపై బైఠాయించారు. దీంతో వ్యాపారులు కొనుగోలు ప్రారంభించి క్వింటాల్‌కు రూ.1,230 నుంచి రూ.1,250 వరకు ధర చెల్లించారు. ఇక రైతుల కళ్లాల వద్ద దళారుల దోపిడీ రోజుకు రూ.35 లక్షల వరకు ఉంటున్నట్లు సమాచారం. మార్కెట్లో ఏం జరగాలి? - కమీషన్ ఏజెంట్లు ఎక్కడా సరుకును బీమా చేయించడంలేదు. వాస్తవానికి గరిష్టంగా తమ వద్దకు ఏడాదికి ఎంత సరుకు వస్తుందో సగటున లెక్కించి.. ముందుగా వారు బీమా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కడా కూడా ఏజెంట్లు బీమా చేయించుకునేలా మార్కెట్ కమిటీలు చొరవ చూపడంలేదు. ఇలా బీమా చేయించుకుంటే ఏదైనా ప్రమాదం వల్ల సరుకు నష్టపోతే కనీసం రైతులకు బీమా అయినా దక్కుతుంది. - ఏజెంట్లు అవసరమైన మేరకు టార్పాలిన్ కవర్లు కొనేలా మార్కెట్ కమిటీ దృష్టి సారించాలి. అయితే, ఏజెంట్లతో ఈ కమిటీలు కుమ్మక్కవుతున్నాయి. ఫలితంగా మార్కెట్ యార్డుల్లో టార్పాలిన్ కవర్లు ఉండటంలేదు. దీంతో వర్షాలు వస్తే మొత్తం ధాన్యం తడిసిపోతోంది. - ధాన్యాన్ని భద్రపరిచేందుకు మార్కెట్ కమిటీ చర్యలు తీసుకోవాలి. కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రైతులు ఆరుబయటే ధాన్యాన్ని ఉంచుతుండటంతో వర్షం వస్తే కన్నీళ్లే మిగులుతున్నాయి. - తడిసిన ధాన్యాన్ని మార్కెట్ కమిటీ నేరుగా కొనేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే దళారులు రంగప్రవేశం చేసి.. ధాన్యం తడిచిందనే సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ముందుగానే ప్రారంభించాలి రొక్కం మురళి, రైతు, తిమ్మాపూర్, నిజామాబాద్ వరి కోతలు మొదలైన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. కోతలు మొదలైనా కొనుగోళ్లు ప్రారంభించడంలేదు. దీంతో రైతులు ధాన్యం నిల్వ చేసుకోలేక తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. సౌకర్యాలు కల్పించాలి బుత్పురం మహిపాల్, మోర్తాడ్, నిజామాబాద్ కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడం వల్ల రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోలేకపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఒక్కచోట కాకుండా వరి ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నచోట ప్రారంభించాలి. అలాగే ధాన్యానికి సరిపడే సంచులు కూడా సరఫరా చేయాలి. కొనుగోలు కేంద్రాలకు అనుగుణంగా గోదాములను నిర్మించాలి. ఈ సౌకర్యాలు కల్పిస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. పంట అమ్ముకునేందుకు గిన్ని కష్టాలా వినోద, మల్లారం, వేములవాడ మండలం, కరీంనగర్ జిల్లా నేను ఎములాడ మార్కెట్‌కు వడ్లుదెచ్చి వారమైంది. ఇన్ని రోజుల సంది మా కుప్పల దిక్కు చూసినోళ్లు లేరు. రోజూ వడ్ల కాడ కావలి గాయాలంటే తిప్పలైతాంది. సద్ది తెచ్చుకుని తినుడు, పండుడు అయితుంది. మార్కెట్ల పందులు తిరుగుతున్నయ్. కొద్దిగ కన్నంటుకుంటే సాలు.. మొత్తం పందులు బుక్కిపోతున్నయ్. పండించిన పంటను అమ్ముకుందామన్నా గిన్ని కష్టాలా? -
తడిసిన ధాన్యమూ కొనుగోలు
కలెక్టరేట్,న్యూస్‌లైన్: తడిసిన ధాన్యంపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం క్వింటాలుకు రూ. 1,345 చెల్లించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడా రు. జిల్లాలో కురిసిన అకా ల వర్షాల వల్ల కొన్ని ప్రాం తాల్లో రబీ ధాన్యం తడిసి ముద్దయ్యిందన్నారు. అదేవిధంగా వారం రోజులుగా రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయక పోవడంపై వారిని పిలిపించి మాట్లాడినట్లు తెలిపారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతులు టోల్‌ఫ్రీ 18004256644, ల్యాండ్ 08462-221801 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 28,990 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో వంద కొనుగోలు కేంద్రాలు మోర్తాడ్ : వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా మరో వంద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కొండల్ రావు తెలిపారు. ఆదివారం మోర్తాడ్, దోన్పాల్లలో తడిసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఇందిర క్రాంతి పథం ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్న కొనుగోలు కేంద్రాలకు అదనంగా మరో వంద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ అంగీకరించారని ఆయన తెలిపారు. అవసరం ఉన్న చోట ఆయా గ్రామాల మిహ ళా సమాఖ్యలు ప్రతిపాదనలు పంపితే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా లారీల కొరత, గన్నీ సంచుల కొరత ఉన్నా జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ సెల్ నంబర్ 7702003545కు ఫోన్ చేయాలన్నారు. 17 శాతం తేమ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని ఆయన కోరారు. -
తడిసినా.. ‘మద్దతుకే కొనాలి..
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. శనిగపురంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆ పార్టీ నాయకులు సందర్శించి, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రవీందర్రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి సుమారు 10వేల బస్తాల ధాన్యం పూర్తిగా తడిచిపోయిందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు అండగా ఉండి ఉద్యమిస్తామన్నారు. న్యాయం జరిగేంత వరకు టీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్‌నాయక్ మాట్లాడుతూ నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే రైతులు నష్టపోయారని అన్నారు. అనంతరం రవీందర్రావు ఆర్డీఓ మధుసూదన్‌నాయక్‌తో ఫోన్లో మాట్లాడుతూ అకాల వర్షంతో నష్టపోయిన పరిస్థితుల గురించి వివరించారు. అన్ని విధాలా రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మార్నేని వెంకన్న, డోలి లింగుబాబు, వెంకన్న, వెంకటాద్రి, ఉపేంద్ర, వీరేందర్ పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన అన్నదాతలు
వీణవంక/రామడుగు/మానకొండూర్/కోరుట్ల, న్యూస్‌లైన్ : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ శనివారం జిల్లాలోని ఆయా మండలాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని రోజుల తరబడి తూకం వేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వీణవంక మండలం చల్లూరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు వీణవంక-కరీంనగర్ రహదారిపై ధర్నా చేశారు. తహశీల్దార్ బావ్‌సింగ్ ఫోన్లో రైతులతో మాట్లాడి కొనుగోళ్లు చేపడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రామడుగు మండలం వెదిరలోని ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కరీంనగర్-జగిత్యాల రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. వైఎస్సార్సీపీ చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థి మల్యాల ప్రతాప్ రైతులకు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళనను కలెక్టర్ వీరబ్రహ్మయ్యకు ఫోన్లో వివరించారు. స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని మండల అధికారులను ఆదేశించడంతో రైతులు ఆందోళన విరమించారు. అకాల వర్షాలకు నీటిపాలైన వరితో పాటు తడిసిన విత్తన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని మానకొండూర్ మండలం చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామాల రైతులు గట్టుదుద్దెనపల్లిలోని సీడ్ గోదాం ఎదుట ధర్నా నిర్వహించారు. స్పందించిన సీడ్ అధికారులు రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. అకాల వర్షాలకు తడిచిన వరిధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరుట్ల మండలం యెఖీన్‌పూర్ రైతులు కోరుట్ల-వేములవాడ రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. -
పసుపు రైతుకు ప్రతి ఏటా నష్టాలే!
ధారూరు, న్యూస్‌లైన్: ఒకప్పుడు తులం బంగారానికి వచ్చిన ధర క్వింటాలు పసుపునకు వచ్చిందని, మళ్లీ ఆ మద్దతు ధర రాకపోతుందా.. అనే ఆశతో ప్రతీ సంవత్సరం పసుపు పంటను సాగు చేస్తున్నా నష్టాలే తప్పలాభాలు రావటం లేదని పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర లభిస్తుందన్న ఆశతో మండలంలోని పలు గ్రామాల రైతులు యేటా పసుపును సాగు చేస్తూనే ఉన్నారు. కేవలం 2010లో క్వింటాలు పసుపునకు రూ.18 వేల నుంచి రూ.19,500 వరకు మద్దతు ధర పలికింది. అప్పటి నుంచి రైతులు పెద్ద మొత్తంలో పసుపును పండిస్తున్నా 2011 నుంచి ఇప్పటివరకు ధర త గ్గడమే తప్ప పెరిగిన దాఖలాలు లే వని రైతులు వాపోతున్నారు. మండలంలోని కేరెల్లి, కొండాపూర్‌ఖుర్దు, ధర్మాపూర్, కొండాపూర్‌కలాన్, అవుసుపల్లి, ధారూరు, చింతకుంట, హరిదాస్‌పల్లి, అల్లిపూర ఎబ్బనూర్, బాచారం తదితర గ్రామాల్లో రైతులు దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో పసుపుపంట పండిస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక నష్టాలనే చవిచూస్తున్నారు. పసుపు పంట సాగు చేసిన రైతన్నలు ఎకరాకు రూ.60 వేల పెట్టుబడి పెడుతున్నా అమ్మకానికి మార్కెట్‌కు వెళితే మాత్రం క్వింటాలుకు రూ. 5,200 నుంచి రూ.6 వేల వరకే మద్దతు ధర పలకడంతో పెట్టుబడులు పోను చేతికి చిల్లిగవ్వ కూడా రాకపోగా నష్టాలే వస్తున్నాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 సంవత్సరాలుగా బహిరంగ మార్కెట్లో మద్దతు ధర రాకున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం తమ దీన స్థితిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు పొలాల పక్కనే పారుతున్న నది, వాగుల నుంచి డీజిల్ మోటార్ల ద్వారా నీటిని వాడటంవల్ల వేలల్లో ఖర్చవుతుందని రైతులు వాపోవున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడమే ప్రధాన కారణమని రైతులు పేర్కొన్నారు. ఒక తడికి ఎకరాకు డీజిల్ ఖర్చు రూ.5 నుంచి రూ.6 వేల వరకు అవుతుందన్నారు. కనీసం 4, 5 తడుల నీరు పెట్టాలని, ఇందుకు రూ.20 వేలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. 20 రోజుల పాటు కష్టాలే.. పంట చివరి దశలో 20 రోజుల పాటు శ్రమించాల్సి ఉంటుందని రైతులు పేర్కొన్నారు. పొలాన్ని దున్ని పసుపును వెలికి తీయడంతో పాటు ఉడికించడం, కొమ్ము, గొండలు వేరు చేయడం వంటి పనులు ఉంటాయన్నారు. పెద్ద మొత్తంలో కూలీలు అవసరవువుతారని, వారికి దినసరికూలి రూ.200 చొప్పున ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంత ఖర్చు చేసినా పసుపుకొమ్ములను ఆరబెడితే ప్రస్తుతం అకాల వర్షాలు పసుపుకొమ్ముల రంగు మారడానికి కారణవువుతుందని వాపోతున్నారు. దీంతో ధర మరింత తగ్గి నష్టాలనే చవి చూస్తున్నామన్నారు. పసుపు రైతుల బాధలు గమనించి క్వింటాలుకు కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు మద్దతు ధర లభించేలా చూడాలని వారు అధికారులను కోరుతున్నారు. -
ఏమిటిది ఏలికా?
బోధన్, న్యూస్‌లైన్ : ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక దిగాలు పడుతున్నారు. బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాలలో రబీ సీజన్లో రైతులు వేలాది ఎకరాలలో వరి సాగు చేశారు. మొక్కజొన్నను వందల ఎకరాలలో పండించా రు. ఈ పంటల దిగుబడులు చేతికి వస్తున్నా యి. ముంగిటిలో, పంట పొలాలలో నిల్వ చేసి, ఆరబెడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో దళారులు గ్రామాలలో మకాం వేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 1,345, బీపీటీకి క్వింటాలుకు రూ. 1,500 మద్దతు ధరను ప్రకటించింది. మొక్కజొన్న క్వింటాలుకు రూ .1,310 మద్దతు ధరను ప్రకటించింది. ఖరీఫ్‌లో సహకార సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాలు, పౌరసరఫరాల శాఖ ద్వారా ధా న్యం కొనుగోలు చేశారు. రబీలో కొనుగోలు కేంద్రాల ఊసు లేక పోవడంతో రైతులు దిక్కుతోచకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు గ్రామాలలో తిరుగుతూ వరి కొనుగోళ్లు ముమ్మరం చేశారు. సాధారణ రకం వరి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకానికి క్వింటాలుకు రూ. 1,210 నుంచి 1,250 లోపే చెల్లిస్తున్నారు. సన్న రకం ధాన్యాన్ని కూడా ఇదే ధరకు కొంటామంటున్నారు. మార్క్‌ఫెడ్ ఎక్కడ? ఇదిలా ఉండగా మొక్కజొన్నను మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందిస్తామని అధికారులు గతంలో వెల్లడించారు. కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. సహకార సంఘాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ ప్రతిపాదనలు మాత్రం తయారు చేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌రావడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం లేదని చెబుతున్నారు. ధాన్యం కొనుగోలుకు, ఎన్నికల కోడ్‌కు సంబంధం ఏమిటని రైతులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మొక్కజొన్నను క్వింటాలుకు రూ.1,200 నుంచి 1,250 వరకు రైతుల నుంచి కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఇంకా జాప్యం జరిగితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. -
దళారుల దందా!
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : మార్కెట్ మాయాజాలంతో రైతన్న కుదేలయ్యాడు. పెట్టుబడులు కూడా రాకుండా దళారులు అడ్డుకుంటున్నారు. అన్నదాత బలహీనతను పొలంలోనే సొమ్ము చేసుకుంటున్నారు. ఏతల నాడు ధరలు కోతల నాటికి కనుచూపు మేరలో కూడా కనిపించడంలేదు. జిల్లాలో రబీ సీజన్లో రైతులు పండించిన పలు రకాల పంటలకు నేడు గిట్టుబాటు ధరలు లేవు. వేరుశనగ.. రబీ సీజన్లో 3327 హెక్టార్లలో వేరుశనగా సాగు చేశారు. తీరప్రాంతంలో ఎక్కువగా సాగువుతోంది. విత్తనాలు, ఎరువులు, దుక్కి, కలుపు, కూలీ అన్నీ కలిపి ఎకరాకు రూ.25 వేలకుపైగా ఖర్చు పెట్టారు. క్వింటాకు 30 నుంచి 40 బస్తాలలోపే పండింది. విత్తన కొనుగోలు సమయంలో వేరుశనగ అధిక ధర పలికింది. పంట చేతికొచ్చే సమయానికి ఆ ధర లేక రైతులు దిగాలు పడ్డారు. బస్తా రూ. 900 నుంచి రూ.1200 వరకు మత్రామే పలుకుతోంది. రేటు పెరగకుండా దళారులు అడ్డుకుంటూ రైతును నట్టేట ముంచుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు పొలాల్లోనే ఎంతోకొంతకుపంట తెగనమ్ముకుంటున్నారు. కౌలు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చివరకు కౌలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నాడు. మిర్చి.. 7694 హెక్టార్లలో మిర్చి వేశారు. ఈ పంట పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా సాగవుతోంది. కందుకూరు ప్రాంతంలో కొండమూరువారిపాలెంలో దాదాపు 250 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. క్వింటా రూ.8 వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.7,300లకు పడిపోయింది. ఎకరాకు రూ.లక్షా 50 వేల వరకు ఖర్చు అవుతోంది. దళారుల మాయజాలంతో ధరలు తగ్గిపోయాయి. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు విలవిల్లాడుతున్నారు. పత్తి.. జిల్లావ్యాప్తంగా రబీలో 807 హెక్టార్లలో పత్తి సాగైంది. ఖరీఫ్‌లో 53,508 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎకరాకు రూ.21,550 వరకు పెట్టుబడి పెట్టారు. కౌలు 15 వేలు చెల్లించారు. మొత్తం రూ.36,550 వరకు ఖర్చు పెట్టారు. ప్రభుత్వం క్వింటాకు దాదాపు రూ.4వేల ధర నిర్ణయించింది. అంత వరకూ బాగానే ఉన్నా రంగుమారిందన్న సాకు చూపి మార్కెట్లో దళారులు రూ.3,200 కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. దీనికి తోడు మూడు నుంచి ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి కూడా తగ్గింది. తీసిన పత్తి కూలీలకే సరిపోలేదని రైతన్న వాపోతున్నాడు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు ప్రారంభించకుండా చోద్యం చూస్తోంది. గతేడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ఈ మొత్తం నేపథ్యంలో పత్తి సాగు చేయాలంటేనే రైతులు జంకుతున్నారు. ‘శనగ’ లేదు శీతల గిడ్డంగుల్లో 14.5 లక్షల క్వింటాళ్ల శనగలు మూడేళ్లుగా మూలుగుతున్నాయి. మళ్లీ కొత్తవి వచ్చాయి. గత నెల ఒంగోలు వ్యవసాయ మార్కెట్లో కేంద్రాన్ని ఏర్పాటు చేసి తొలిరోజు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గతంలో రూ.7,500 పలికిన ధర నేడు రూ.3,700 కూడా పలకని పరిస్థితి ఉంది. మద్దతు ధర పేరుతో ప్రభుత్వం మూడు వేల వంద రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తోంది. అదీ అన్ని సక్రమంగా ఉంటేనే. లేకుంటే నిబంధనల పేరుతో కోత విధిస్తారు. అమ్మిన శనగలకు డబ్బుల కోసం రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ ఇంకా చెప్పులరిగేలా తిరుగుతున్నారు. రైతన్నల వర్రీ జిల్లాలో వరి 80289 హెక్టార్లలో సాగైంది. ధాన్యం చేలో ఉండగానే దళారులు రంగంలోకి దిగారు. బీపీటీలు, 1001, సన్నాల రకం వడ్లను దళారులు రూ.900 నుంచి రూ.1000 కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొత్తపట్నం ప్రాంతంలో అసలు ధర రూ.1200 వరకు ఉన్నా మిల్లర్లు దళారులను రంగంలోకి దించి కేవలం రూ.900 అడగటం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయకట్టు పరిధి దర్శి, త్రిపురాంతకం, కురిచేడు, ముండ్లమూరు ఏరియల్లో ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకు పండే అవకాశం ఉంది. ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చు అవుతోంది. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో దిక్కుతోచని రైతు.. పొలంలోనే పంట తెగనమ్ముతున్నాడు. కౌలు రైతుల శ్రమ వృథా అవుతోంది. అటు పెరిగిన ఖర్చులు, ఇటు మార్కెట్ దళారుల మాయజాలం దెబ్బకు రైతన్న కుదేలవుతున్నాడు. ఇవీ.. అంతే పొగాకు, ఉల్లి, టమోట పంటలకూ కూడ గిట్టుబా టు ధర రాకుండా దళారులు అడ్డుకుంటూ రైతన్న శ్రమను దోచుకుంటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని అన్నదాత వాపోతున్నాడు. -
బెల్లం ధరఢమాల్
కామారెడ్డి, న్యూస్‌లైన్: బెల్లం రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు వీలుగా మా ర్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొంత కాలం క్రితం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏమైందో తెలియదు కానీ, దానిని నెల రోజులకే మూసివేశారు. బెల్లం అమ్మిన రైతులకు డబ్బులు రాకపోగా, ఇంకా విక్రయించని రైతులు బెల్లాన్ని విధి లేక ఇంటిలోనే నిలువ చేసుకున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు బహిరంగ మార్కెట్ ధరను బాగా తగ్గించేశారు. మార్క్‌ఫెడ్ క్వింటాలుకు రూ. 2600 ధర నిర్ణయించింది. కొందరు రైతులు మా ర్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో బెల్లం విక్రయించారు. అప్పుడు మార్కెట్లో వ్యాపారులు రూ. 2400 వరకు ధర చెల్లించారు. అయితే, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం నెల రోజులకే మూతపడడం బెల్లం ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు మార్కెట్లో వ్యాపారులు క్వింటాలు కు రూ. 2,050 మా త్రమే చెల్లిస్తున్నారు. దీంతో క్విం టాలుకు 550 వరకు నష్టపోవాల్సి వస్తోంది. అప్పుల వేధింపులు వ్యాపారులు నిర్ణయించిన ధరకే బెల్లం అమ్మాల్సిన పరిస్థితులలో రైతులు తమ ఇళ్లలోనే బెల్లాన్ని నిల్వ ఉంచుతున్నారు. చెరుకు సాగుతో పాటు బెల్లం త యారీకి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రై తులు బెల్లం అమ్ముడుపోకపోవడంతో అప్పుల వే ధింపులు తాళలేకపోతున్నారు. మార్క్‌ఫెడ్ కొనుగో లు కేంద్రం ఎత్తివేసిన తర్వాత బెల్లం కొనడానికి వ్యా పారులు కూడా ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు చే సిన బెల్లాన్ని ఎక్కడికి సరఫరా చేస్తున్నది, ఎంత కొ నుగోలు చేసిందన్న వివరాలను ఎప్పటికప్పుడు త మకు తెలపాలని ఎక్సైజ్ అధికారులు ఆంక్షలు పెట్టా రు. ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేటలో కామారెడ్డి వ్యాపారికి చెందిన బెల్లం లారీని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ కారణాలతో వ్యాపారులు బెల్లం కొ నుగోలుకు విముఖత చూపుతున్నారు. కొందరు కొ నుగోలు చేస్తున్నప్పటికీ ధర మాత్రం అంతంతగానే ఉంటోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మిగిలేదేమీ లేదు తక్కువ ధరకు బెల్లం అమ్మితే మిగిలేది ఏమీలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు సాగుకు అయ్యే ఖర్చుతో పాటు బెల్లం తయారీకి కలిసి క్వింటాలుకు రూ. రెండు వేల వరకు ఖర్చవుతోంది. క్వింటాలుకు రూ. 2600 చెల్లిస్తే రైతులకు రూ. 600 మిగిలేది. మార్కెట్లో ధర రూ. రెండు వేలకు మించకపోవడంతో ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామంలో రైతుల వద్ద వెయ్యి క్వింటాళ్లకు పైగా బెల్లం మిగిలింది. బండరామేశ్వర్‌పల్లి, లచ్చాపేట, తది త ర గ్రామాలలో కొనేవారు లేక, ఉన్న ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతు న్నామని వాపోతున్నారు. పాలకులకు పట్టని రైతుల గోడు బెల్లం కొనుగోలు కేంద్రం ఎత్తివేసిన దరిమిలా తలెత్తిన సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. రైతుల గురించి గొప్పగా మాట్లాడే నే తలు బెల్లం విషయంలో తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా బెల్లం ధర విషయంలో, కొనుగోలు కేంద్రాల విషయంలో చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
అన్నదాతకు అన్యాయం
గజ్వేల్, న్యూస్‌లైన్: అధికారులు..పాలకులు అందరూ కలిసి అన్నదాతకు తీవ్ర అన్యాయం చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినట్టే ఇచ్చి ఇపుడు అడ్డగోలు ధర కట్టారు. ఫలితంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ విధిలేని పరిస్థితుల్లో అధికారులు చెప్పిన రేటుకు ప్రైవేటు వ్యాపారులకు పంటను అప్పగించేందుకు సిద్ధమయ్యారు. రెండురోజూ కొనసాగిన ఆందోళన గజ్వేల్ మార్కెట్ యార్డులో మక్కల రైతుల ఆందోళన శనివారం కూడా కొనసాగింది. 45 రోజుల కిందట రైతుల నుంచి మక్కల కొనుగోలు చేసి తక్‌పట్టీ(రసీదు)లు ఇచ్చిన తర్వాత అధికారులు తరలింపును సాకుగా చూపి చెక్కులివ్వలేమని మాట మార్చిన నేపథ్యంలో రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టిన సంగతి తెల్సిందే. సమస్య పరిష్కారం కోసం శనివారం కూడా యార్డుకు తాళం వేసి రైతులు ఆందోళనకు దిగారు. దీంతో యార్డు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. యార్డుగేటు ఎదుట మక్కల రైతుల ఆందోళన నేపథ్యంలో శనివారం యార్డుకు పత్తిని తీసుకువచ్చిన రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టిన మార్కెట్ కమిటీ కార్యదర్శి డేవిడ్, మార్కెట్ కమిటీ సూపర్వైజర్ వీర్శెట్టిలు ఈ సమస్యను సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్డీఓ ముత్యంరెడ్డి పత్తిరైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శనివారం ఒక్కరోజు పత్తికోనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ అధికారులు ఈ విషయాన్నే మక్క రైతలకు వివరించారు. మక్క రైతుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ యార్డులో కొనుగోళ్లు నిలిపివేస్తామనీ, అయితే పత్తిరైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఒక్కరోజు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత యార్డులోని 14 వేల క్వింటాళ్ల మక్కల వ్యవహారంపై సాయంత్రం వరకు స్థానిక తహశీల్దార్ బాల్‌రెడ్డి, సీఐ అమృతరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి డేవిడ్‌లు రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. నిల్వలను వ్యాపారులు కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు సూచించగా వారు అందుకు అంగీకరించారు. అయితే రైతులకు ఐకేపీ కేంద్ర నిర్వాహకులు తక్‌పట్టీల్లో క్వింటాలుకు రూ.1,310 రాసివ్వగా, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏ గ్రేడ్ రకం మక్కలకు రూ.1,130, సాధారణ రకానికి రూ.975 ధర చెల్లించి కొనుగోలు చేయడానికి వ్యాపారులు అంగీకరించారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు కూడా ఒప్పుకోవడంతో వ్యాపారులు తరలింపును ప్రారంభించారు. మారిన ధరతో రైతులు రూ.50 లక్షలకుపైగానే నష్టపోవాల్సి వస్తోంది. ఇదిలావుంటే మక్కల తరలింపు పూర్తయ్యేవరకు యార్డులో లావాదేవీలను నిలిపివేయాలని నిర్ణయించారు. పత్తి రైతులు ఈ విషయాన్ని గమనించాలని మార్కెట్ కమిటీ కార్యదర్శి డేవిడ్ సూచించారు. -
ఈ శ్రమకు ఫలితమేది!
బోధన్, న్యూస్‌లైన్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ అధీనంలో ఉండగా చెరుకు పంటకు గిట్టుబాటు ధర లభించేది. రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందేవి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఈ చక్కెర కర్మాగారాన్ని 2002లో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో(జాయింట్ వెంచర్) ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ప్రైవేట్ యాజమాన్యం లాభాపేక్షతో వ్యవహరిస్తూ రైతులను కడగండ్ల పాలు చేస్తోంది. ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేసిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. సమాచారం లేకుండానే.. ఈ సీజన్లో క్రషింగ్‌ను 2013 నవంబర్ ఆఖరి వారంలో ప్రారంభిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు రైతులు చెరుకు నరికి ఫ్యాక్టరీకి తరలించారు. అయితే ఫ్యాక్టరీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే క్రషింగ్‌ను నిలిపివేసింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. క్రషింగ్ ప్రారంభించాలంటూ ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్వర్యంలో బంద్ కూడా పాటించారు. దిగివచ్చిన యాజమాన్యం డిసెంబర్ ఏడో తేదీనుంచి క్రషింగ్ ప్రారంభించింది. క్రషింగ్ కొనసాగుతోంది. చెల్లింపుల్లో జాప్యం ఎన్డీఎస్ఎల్ పరిధిలో 2013 -14 సీజన్‌కుగాను సుమారు 5 వేల ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేశారు. ఇప్పటి వరకు సుమారు లక్షా 60 వేల టన్నుల వరకు చెరుకును ఫ్యాక్టరీకి తరలించారు. ఫ్యాక్టరీ ప్రకటించిన ధర ప్రకారం రైతులకు సుమారు రూ. 42 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలి. అయితే గడువు దాటినా బిల్లులు చెల్లించకపోవడంతో ఫ్యాక్టరీ యాజమాన్యంపై రైతులు ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో తొలి విడతలో రూ. 7 కోట్లు చెల్లించారు. క్రషింగ్ ప్రారంభానికి 20 రోజుల ముందు హార్వెస్టింగ్ అడ్వాన్స్‌ల కింద ఎకరానికి రూ. 3 వేల చొప్పున ఫ్యాక్టరీ చెల్లించింది. తొలి విడత బిల్లులోనే ఈ అడ్వాన్స్‌తోపాటు ఎరువులకోసం ఇచ్చిన రుణాన్ని మినహాయించుకొంది. మిగిలిన బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. సమస్య సబ్‌కలెక్టర్ దృష్టికి.. బిల్లులు చెల్లించడంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రైతులు గురువారం బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. బిల్లుల చెల్లింపులో ప్రతి ఏటా గడువులు విధిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. స్పందించిన సబ్‌కలెక్టర్.. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ జానకీ మనోహర్‌తో మాట్లాడారు. ఆదివారం బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈ హామీని రైతులు నమ్మడం లేదు. మూడేళ్లుగా ఫ్యాక్టరీ గడువులు విధిస్తూ ఉల్లంఘిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. -
గిట్టుపాట్లే!
గిద్దలూరు, న్యూస్‌లైన్: అన్నదాతకు అండే లేకుండా పోతోంది. వ్యాపారులు, దళారులు దోపిడీ చేస్తున్నారు. దీంతో రైతుకు శ్రమకు తగ్గ ఫలం లభించడం లేదు. అధికారులు సైతం భరోసా కల్పించలేకపోతున్నారు. గిద్దలూరు, కంభం మండలాల్లో మార్కెట్ యార్డులున్నా కొన్నేళ్లుగా ఎలాంటి కొనుగోళ్లు చేపట్టడం లేదు. దీంతో మార్కెట్ యార్డులు అలంకార ప్రాయంగా మారాయి. 30 వేల ఎకరాల్లో పత్తి సాగు: నియోజకవర్గంలో 35 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. రాచర్లలో 5 వేలు, గిద్దలూరులో 10 వేలు, కొమరోలులో 6 వేలు, బేస్తవారిపేటలో 5 వేలు, కంభం మండలంలో 4 వేలు, అర్ధవీడులో 5 వేల ఎకరాల్లో పత్తి సాగులో ఉంది. తద్వారా 2.40 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో దళారులకు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో మద్దతు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు. నియోజకవర్గంలో పప్పు శనగ, మిరప, పొగాకులాంటి వ్యాపార పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ పంటలకు రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదు. వ్యాపారులు, దళారుల మోసాలకు వారు బలైపోతున్నారు. నిరుపయోగంగా మారిన మార్కెట్ యార్డులు: గిద్దలూరు, కంభం మండల కేంద్రాల్లో ఉన్న మార్కెట్ యార్డులు కొనుగోళ్లు చేపట్టక నిరుపయోగంగా ఉన్నాయి. గిద్దలూరులో టమోటా విక్రయించేందుకు, గేదెల సంత కోసం మాత్రమే మార్కెట్ యార్డు ఉంది. అదీ దళారుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ధాన్యం నిల్వ చేసేందుకు నిర్మించిన గోడౌన్లను సివిల్ సప్లైస్ వారికి అద్దెకిచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో రైతులు ధాన్యం నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది. రైతులు పండించే ధాన్యం, పత్తి వంటి వాటిని విక్రయించేందుకు ట్రేడర్లను నియమించలేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది సెస్‌ల వసూళ్లకే పరిమితమయ్యారు తప్ప రైతులకు ప్రయోజనాలు చేకూర్చే పనులు చేపట్టడం లేదు. వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో దళారులదే రాజ్యం: రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తే వారు లాభపడే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో సరైన మార్కెట్ అవకాశాలు లేకపోవడంతో దళారులు రాజ్యమేలుతున్నారు. తేమ శాతం సాకుగా చూపి ధర తగ్గించి, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. దళారులకు కాకుండా జిన్నింగ్ మిల్లులకు వెళ్తే అక్కడ డబ్బులు ఆలస్యంగా ఇస్తున్నారు. సీసీఐ కేంద్రం కానీ, ట్రేడింగ్ విధానాన్ని కానీ అమలు పరిస్తే లాభపడే అవకాశముందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ మార్కెట్‌యార్డ్ అధికారులు చొరవ చూపడం లేదు. దీంతో రైతులు తాము పండించిన పంటను అమ్ముకునేందుకు దళారులు, జిన్నింగ్ మిల్లులను ఆశ్రయించాల్సి వస్తోంది. నూతనంగా ఏర్పాటవుతున్న కమిటీ వారైనా రైతులకు ప్రయోజనం కలిగే దిశగా మార్కెట్ యార్డులో వ్యాపారం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం రాచర్ల, గిద్దలూరు, కొమరోలు మండలాల్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగులో ఉందని సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టరుకు గతంలో లేఖ ఇచ్చాం. గిద్దలూరుకు మంజూరు కాలేదు. నేను ఇటీవలే కార్యదర్శిగా వచ్చాను. పూర్తిస్థాయిలో అవగాహన రాలేదు. వ్యాపారులు వినియోగిస్తున్న కాటాలను, రాళ్లను పరిశీలించి మోసాలకు పాల్పడకుండా చూస్తాం. - వీ ఆంజనేయులు, మార్కెట్ యార్డు కార్యదర్శి, గిద్దలూరు -
‘మద్దతు’ కోసం ఎదురుచూపు
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : పత్తి రైతులు మద్దతు ధర కోసం నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది ఎరువులు, విత్తనాల ధరలు గణనీయంగా పెరిగాయి. విత్తనాలు వేసినప్పటి నుంచి పత్తి పంట చేతికొచ్చే వరకూ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. దీనికి తోడు ప్రారంభం నుంచి అధిక వర్షాలు పత్తి రైతులకు శాపంగా మారాయి. ఉపాధి హామీ పథకం పనులతో గ్రామాల్లో పత్తి ఏరే కూలీలకు డిమాండ్ పెరిగింది. దీనికితోడు గతేడాది కిలో పత్తికి రూ.5 చెల్లించగా, ప్రస్తుతం రూ.7కు పెంచారు. ఇదిలా ఉంటే.. ఈసారి దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గింది. ఎకరాలకు సుమారు రూ.15 నుంచి 20 వేల వరకు ఖర్చు చేశారు. గతేడాది ఎకరాకు ఏడు నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. ఈసారి మూడు క్వింటాళ్లకు పడిపోయింది. ధరలేమో క్వింటాల్‌కు ప్రారంభంలో రూ.4300 చెల్లించగా.. ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.4,800 వరకు చెల్లిస్తున్నారు. దీంతో చేతికి వచ్చిన పత్తిని మార్కెట్లో అమ్ముకోలేక.. ధర మరింత ఏమైనా పెరుగుతుందా అని పలువురు రైతులు ఇళ్లలోనే నిల్వ చేస్తున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని భీమ్‌పూర్, రహపల్లి, బూర్గుడ, ఈదులవాడ, కొమ్ముగూడ, గొళ్లగూడ, అంకుసాపూర్తోపాటు పలు గ్రామాల్లో ఎక్కడ చూసినా రైతుల ఇళ్లలో తెల్లబంగారం కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇళ్లలో స్థలం సరిపోక ప్రమాదాలు సైతం లెక్క చేయకుండా ఇళ్లపైన కూడా నిల్వ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పత్తి పంటను రైతులు ఇళ్లలోనే నిల్వ చేస్తుండడంతో.. జిన్నింగు మిల్లులు వెలవెలబోతున్నాయి. ఒక్కో జిన్నింగు మిల్లులో కేవలం రెండు మూడు రోజులకు సరిపడే పత్తి మాత్రమే నిల్వ ఉంది. -
సాగు భారమే
నిజాంసాగర్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత రబీ పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు విపరీత ంగా పెరిగాయి. వర్షాకాలం చివరి వరకు కురిసిన వానలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, జలాశయాలలో పుష్కలంగా నీరు చేరింది. ఖరీఫ్ కన్నా రబీ సాగు విస్తీర్ణం పెరుగుతున్నా, పెట్టుబడులూ రెట్టింపుగానే ఉన్నాయని రైతులు వాపోతు న్నారు. ముఖ్యంగా వరి సాగును ఎంచుకున్న రైతులు పెట్టుబడులకు తిప్పలు పడుతున్నారు. విత్తన ఎంపిక మొదలు నారుమడి నుంచి పంట నూర్పిడి వరకు పొలాలను రైతులు కంటికి రెప్పలా చూసుకోవాల్సి వస్తోంది. ముడి చమురు ధరలు పెరగడంతో మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఆ ప్రభావం రైతులపైనా పడింది. ఎరువులు, విత్తనాలతో పాటు వ్యవసాయ కూలీల ధరలు రెట్టింపయ్యాయి. కాంప్లెక్స్, యూరియా ధరలు పెరిగాయి. ఖరీఫ్ లో వ్యవసాయ పనులు చేసిన మహిళా కూలీలకు రూ. 100 నుంచి రూ.110 చెల్లించారు. ఈ రబీ సాగులో కూలీలకు రూ. 130 నుంచి రూ. 150 వర కు చెల్లించాల్సి వస్తోందని రైతులు పేర్కొం టున్నారు. అంతేకాకుండా ఎకరం పొలా న్ని దమ్ముచేసే ట్రాక్టర్‌కు ఖరీఫ్‌లో రూ. 1300 చెల్లించగా ప్రసుత్తం రబీలో రూ. 1600 వరకు ట్రాక్టర్ల యజమానులు పెం చారు. ఇలా ఈ రబీ సీజన్లో పంటల సాగు ధరలు పెరగడంతో సన్నకారు రైతు లు ఆందోళన చెందుతున్నారు. ఎకరం పొలానికి రైతులు రూ. 20 వేలకు పైగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఆరు నెలలకు చేతికొచ్చే పంటలకు రేయిం బవళ్లు కష్టపడినా రూ. 30 వేలకు మించి దిగుబడి రావడం లేదంటున్నారు. ‘మద్దతు’ కరువు వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతు లు వాపోతున్నారు. వరి ధాన్యానికి క్విం టాలుకు రూ. 1,500 నుంచి రూ. 1,800 మద్దతు ధరను చెల్లించాలని రైతులు కోరుతున్నారు. -
మద్దతుకే లొల్లి..!
మహబూబ్‌నగర్ వ్యవసాయం,గద్వాల న్యూస్‌లైన్: ఈ ఏడాది వేరుశనగ పంటను సాగుచేసిన రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా త యారైంది. వర్షాలు సంమృద్దిగా కురవడంతో మంచిరోజులు వచ్చాయని రైతులు భావించారు. గత రబీలో ప ల్లీ పంటను వేసిన వారికి కాస్తో కూస్తో లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందనే భావనతో ఈ రబీలో 1.10 లక్షల హెక్టార్లలో వేరుశనగపంటను సాగు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పంటకు తెగుళ్లు సోకాయి. దిగుబడి సగానికి తగ్గిపోయింది. వాస్తవానికి చెట్టుకు 20 కాయల వరకూ వస్తే మంచి కాపుగా భావిస్తారు. కాన్నీ పలు ప్రాంతాల్లో మొక్కకు ఏడునుంచి 10 కాయలకు మించి లేవు. మరోవైపు మద్దతుధర రాక రైతులు తికమక పడుతున్నారు. ఈ స్థితిలో రైతుల నుండి పంటను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనాల్సి ఉంటుంది. అలా ఇప్పటివరకు వేరుశనగ కొనే ప్రయత్నం జరగలేదు. కొన్ని చోట్ల కేంద్రాలు తెరుస్తామని చెప్పినా ఇంకా అవి ప్రారంభం కాలేదు. దీంతో అన్నదాతలు తమకు తోచిన ధరకు ఇచ్చేస్తున్నారు. విత్తనానికి రూ.4,500..రైతు పంటకు మాత్రం రూ.2,500 ? రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ధరతో ఈ ఏడాది వేరుశనగ విత్తనాలను సరాఫరా చేసి క్వింటాకు రూ.4500 తీసుకుంది. ఇప్పుడు పంట ధర మాత్రం రూ. 2500 దాటడం లేదు.రైతులు తెచ్చిన పంట తడిగా ఉందని, నాపలు ఎక్కువగా ఉన్నాయంటూ కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు ధరను పెరగనివ్వడం లేదు. వేరుశనగకు ప్రభుత్వం రూ.4వేలు మద్దతు దరను నిర్ణయించింది.జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1.60 లక్షల క్వింటాళ్లను రైతుల నుండి వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతుల నుండి ఎక్కువగా రూ. 3000 వేల లోపే కొనుగోలు చేశారు.కాగా వచ్చిన దాంట్లో ఒక 10శాతం అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు చూపించి మిగతా 90శాతం ఉత్పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ కర్షకులను నట్టేట ముంచుతున్నారు. తెగుళ్లతో తగ్గిన దిగుబడి గత నెలలో మంచు కురవడంతో వేరుశనగపంటకు తిక్కాకుమచ్చ తెగులు, లద్దెపురుగు ఆశించింది. ఇది దిగుబడిని దెబ్బతీసింది. వీటిని అదుపు చేసేందుకు రైతులు క్రిమిసంహారక మందులకోసం భారీగా పెట్టాల్సి వచ్చింది. ఆయిల్‌ఫెడ్,నాఫెడ్ సంస్థలు కొనుగోలు చేసేనా? మద్ధతు ధర సమస్య వచ్చినప్పుడు ఆయిల్‌ఫెడ్,నాఫెడ్ వంటివి ముందుకు రావాలి. ఇప్పటి వరకు ఈ సంస్థలతో కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించకుంటే నిరసన కార్యాక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. కంట తడే... గద్వాల ప్రాంతంలో వేల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి బోర్లు, బావులు, కాలువల కింద వేరుశనగ పంటను వేశారు. గత మూడు నెలల నుంచి వేరుశనగను విక్రయించేందుకు గద్వాల మార్కెట్ యార్డుకు తీసుకొస్తుండగా మార్కెట్లో వస్తున్న ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. యార్డుకు రోజూ దాదాపు 2 వేల బస్తాల వేరుశనగ వస్తోంది. నవంబర్ నెలలో రూ.3,500 నుంచి రూ.3,700 వరకు క్వింటాలుకు ధరలు వచ్చాయి. డిసెంబర్ నెలలో రూ,3,400 నుంచి రూ.3,500 వచ్చింది. జనవరి నెలలో సైతం రూ.3,600 నుంచి రూ. 3,800 వరకు వచ్చింది. జనవరిలో ఒక్క 24వ తేదీన ఒక లాట్‌కు అత్యధికంగా రూ.4,010 వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం వేరుశనగకు రూ.4 వేలు మద్దతు ధర ప్రకటించినా వ్యాపారులనుంచి ఆ ధర పలకడం లేదు. ఇక గద్వాల మార్కెట్లో వారం రోజుల క్రితం ప్రభుత్వం ఏపీ ఆయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే తేమ 8 శాతంగా, మట్టి, ధూళి క్వింటాలుకు కేవలం రెండు కేజీలు, నాపలు 4 శాతంగా ఉండాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధన ప్రకారం రైతుల వేరుశనగ ఉండడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయినప్పటికీ రైతులు అక్కడ అమ్ముకునే పరిస్థితి లేదు. తిక్కఆకుమచ్చ తెగులు ముంచింది నేను మూడెకరాల్లో వేరుశనగ సాగుచేశాను.కాగా రాత్రి వాతావరణం చల్లగా ఉంటూ, ఆధికంగా మంచు కురవడంతో పంటకు తిక్క ఆకుమచ్చ తెగులు సోకింది.మందులకు రూ.10వేల ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దిగుబడి కూడా అంతంత మాత్రమే వచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలి. - శేఖర్, వడ్డేమాన్ అప్పులు తీర్చే పరిస్థితే లేదు నేను 30 బస్తాల వేరుశనగ పంటను మహబూబ్‌నగర్ మార్కెట్‌యార్డుకు తీ సుకువచ్చాను.ధాన్యాంభాగాలేదని రూ. 2,400 వంతున చెల్లించారు. నేను ఈ పంట సాగు కోసం రూ.25వేల వరకు ఖర్చు చేశాను.కాగా ఇంత తక్కువ ధర చెల్లించడంతో చేసిన అప్పులు కూడా తీర్చే పరిస్థితి లేకుండా పోయింది. - మాణిక్యం...దౌల్తాబాద్ -
మార్కెట్ మాయ!
చేవెళ్ల, న్యూస్‌లైన్: మద్దతు ధరను ప్రభుత్వం అరకొరగా పెంచుతుండటం, దీన్ని ఆసరా చేసుకున్న వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లిస్తూ ఆశ చూపుతుండటం.. వెరసి మార్కెట్ మాయాజాలంలో చిక్కి పత్తి రైతులు విలవిల్లాడుతున్నారు. సీసీఐ కేంద్రాల్లో ధర స్థిరంగా ఉంటుందన్న విషయం గ్రహించిన వ్యాపారులు రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చే సమయంలో మద్దతు ధర కంటే ఓ వందో.. రెండు వందల రూపాయలో ధర పెంచి రైతులకు ఆశ చూపించి పత్తి ఎగరేసుకుపోయారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు, అలాగే వ్యాపారులు స్వల్పంగా పెంచిన ధరకు జిల్లావాప్తంగా పలువురు రైతులు పత్తి పంట అమ్ముకున్నారు. ఈ ధరలకు పత్తి పంటను అమ్ముకున్న దాదాపు 70శాతం మంది రైతులు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధర పెరగడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి గిట్టుబాటు ధర రాక అల్లాడిన రైతన్నకు అంతా అయిపోయాక ధర పెరగడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. ఒక్కసారిగా క్వింటాలుకు సుమారు రూ.వెయ్యికి పైగా ధర పెరగడంతో ఇప్పటికే పత్తిని అమ్ముకున్న రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు సీసీఐ కొనుగోలు కేంద్రాలను మూసివేయడంతో పలు గ్రామాల్లో రైతుల ఇళ్లలో పత్తి ఇంకా నిల్వ ఉంది. ఈ పత్తిని మొత్తం కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగిన వ్యాపారులు ఏకంగా గ్రామాల్లోకే వెళ్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే సుమారు రూ.800ఎక్కువ చెల్లిస్తూ పత్తి కొనుగోలు చేసి జిన్నింగ్ మిల్లులకు తరలిస్తున్నారు. చేవెళ్ల వ్యవసాయ డివిజన్లో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాల్లో పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. గత ఖరీఫ్ సీ జన్‌లో డివిజన్వ్యాప్తంగా 14,340 హెక్టార్లలో పత్తి పంట సాగయ్యింది. పంట కొనుగోలుకు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించింది. ‘మద్దతు’ తక్కువ.. బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువ ప్రభుత్వం పత్తిపంటకు నిర్ణయించిన మద్దతు ధర గతంతో పోలిస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో పలువురు రైతులు సీసీఐకి పంట అమ్ముకోవడానికి ఉత్సాహం చూపలేదు. పత్తి పంటకు 2012 సంవత్సరంలో క్వింటాలుకు రూ.3900 ఉన్న మద్దతు ధరను ప్రభుత్వం 2013లో మరో వంద రూపాయలు పెంచి రూ.4వేలుగా ఖరారు చేసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఈ ధరే చెల్లించారు. అయితే సీజన్ ప్రారంభంలోనే వ్యాపారులు పత్తిని క్వింటాలుకు రూ.4200-4300కి కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువగా ఉండటంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకోవడానికి రైతులు ఆసక్తి చూపలేదు. 2012లో పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద క్యూకట్టిన రైతులు ధర వ్యత్యాసంతో ఈసారి వాటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం వ్యాపారులు పత్తి పంట క్వింటాలుకు రూ.5వేలు చెల్లించి కొనుగోలు చేసినా సీసీఐ మాత్రం రూ.4వేలకు ఒక్కపైసా పెంచలేదు. ప్రస్తుతం వ్యాపారులు పత్తి ధరను కొద్దిగా తగ్గించి క్వింటాలు రూ.4,800కి కొనుగోలు చేస్తున్నారు. -
గిట్టుబాటు ధర కల్పించాలి
ధారూరు, న్యూస్‌లైన్: వేరుశనగ దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ధారూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వికారాబాద్- తాండూరు ప్రధాన రహదారిపై దాదాపు 2 గంటల పాటు బైఠాయించడంతో రెండు వైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ధారూరు మార్కెట్ యార్డులో వేరుశనగ పంటకు వ్యాపారులు ధర తగ్గించి బీట్లను కొనసాగించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో ఖరీదుదారులు వేరుశనగలు క్వింటాలుకు నాణ్యతను బట్టి రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. తమకు ఈ ధర గిట్టుబాటు కాదని.. రూ. 5 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ మాటను బేఖాతరు చేస్తూ.. బీట్లు కొనసాగిస్తున్న వ్యాపారుల తీరును నిరసిస్తూ.. రైతులు బీట్లను నిలిపివేయించి రాస్తారోకోకు దిగారు. ధారూరులో వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, మద్దతు ధర కల్పించాలలి వారు డిమాండ్ చేశారు. దీంతో వ్యాపారులు వేరుశనగతో పాటు అన్ని రకాల ఉత్పత్తుల బీట్లను నిలిపివేశారు. రైతులతో మార్కెట్ కమిటీ చైర్మన్, తహసీల్దార్ చర్చలు రైతులు రాస్తారోకో చే స్తున్న సమాచారం తెలుసుకున్న ధారూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. సంగమేశ్వర్రావు, తహసీల్దార్ ఆర్. జనార్దన్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులతో వారు చర్చలు జరిపారు. వేరుశనగలకు గిట్టుబాటు ధర కల్పిచేందుకు జిల్లా మార్కెటింగ్ అసిస్టెంట్ డెరైక్టర్‌తో వారు ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 29లోగా ధారూరులో వేరుశనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రైతులకు చైర్మన్, తహసీల్దార్లు వివరించడంతో వారంతా శాంతించారు. రాస్తారోకో కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ శుభప్రద్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షుడు బాల్‌రాజ్‌నాయక్, మండల కన్వీనర్ నాగే శ్లు, సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఆర్. మహిపాల్, రైతు నాయకులు శంకర్, కిషోర్, శ్రీకాంత్, చత్రనాయక్, బాబురావు, మోహన్‌నాయక్ పాల్గొన్నారు. 29న ధారూరులో బీట్లు శనివారం నిలిచిపోయిన బీట్లను తిరిగి ఈ నెల 29న (బుధవారం) ఉదయం 10 గంటలకు నిర్వహించాలని మార్కెట్ కమిటీ పాలకవర్గం నిర్ణయించింది. రైతులు ఈ విషయాన్ని గమనించి బుధవారం ఉదయాన్నే తమ దిగుబడులను తీసుకురావాలని వారు కోరారు. -
మెరిసిన తెల్లబంగారం
జడ్చర్ల, న్యూస్‌లైన్: ఇన్నాళ్లూ మసకబారిన తెల్లబంగారానికి వన్నె వస్తోం ది. పత్తిధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతుండటంతో రైతన్న ముఖా ల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బుధవారం బాదేపల్లి మార్కెట్లో పత్తి క్వింటాలు కు రూ.5072 పలికింది. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి పత్తి మార్కెట్‌కు ఐ దువేల క్వింటాళ్ల పత్తి విక్రయానికి రావడం తో ఆవరణమంతా బస్తాలతో నిండిపోయిం ది. క్వింటాలుకు గరిష్టంగా రూ.5072 ధర పలకగా, కనిష్టంగా రూ.4209 ధర లభిం చింది. గత శనివారం మార్కెట్లో పత్తికి గరి ష్టంగా రూ.4869 ధర లభించింది. కాగా పత్తి కి గరిష్టంగా ఇంతధర రావడం ఈ సీజన్లో ఇదే మొదటిసారి. గతేడాది కూడా ఇంత ధర లు మార్కెట్లో లభించలేదు. ప్రభుత్వం ప త్తికి గరిష్టంగా రూ.4000, కనిష్టంగా రూ. 3800 మద్దతుధరలను కేటాయించింది. అయితే ఇక్కడి మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధరలను మించి రికార్డుస్థాయిలో పత్తికి ధర లభిస్తుండటంతో రై తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇది వరకే అమ్ముకున్న రైతులు మాత్రం ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ ఏడాది పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిన నేపథ్యం లో రైతుల దగ్గర ఇక పత్తి నిల్వలు లేవని భావించిన వ్యాపారులు పోటీపడి ధరలను పెంచినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్క రోజే మార్కెట్లో రూ.2.25కోట్ల పత్తి వ్యాపారం జరిగింది. దీంతో యార్డుకు రూ.2.25లక్షల ఆదాయం ఒక్కరోజే లభించిందని యార్డు అధికారులు పేర్కొన్నారు. మున్ముందు కూడా ఇవే ధరలు ఉంటాయో లేదో వేచిచూడాలి.