'ఆ మద్దతు ధర ఏ మూలకు సరిపోతుంది'
హైదరాబాద్: రైతులకు ముష్టి వేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచిందని వైఎస్సార్సీపీ నేత నాగిరెడ్డి అన్నారు. క్వింటాల్ వరికి పెంచిన రూ.50, వేరు శెనగకు రూ.30, పత్తికి రూ.50 ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. బీజేపీకి భాగస్వామ్య పక్షమైన టీడీపీ మద్దతు ధర పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు కోరడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతపురంలో వేరు శెనగ విత్తనాల పంపిణీ కోసం రైతులు రోడ్లెక్కారని, ఇలాంటి పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం వల్లే వచ్చిందని ఆరోపించారు. ఏపీ సర్కార్కు విత్తనాలు సరఫరా చేయడం చేతకాక ప్రైవేట్ మార్కెట్లో కొనుక్కోమంటుందని, అది సిగ్గుచేటని విమర్శించారు.