బీజేపీతో టీడీపీకి సంబంధాలున్నాయి.. | YV Subbareddy Claims TDP Has Relations With BJP | Sakshi
Sakshi News home page

బీజేపీతో టీడీపీకి సంబంధాలున్నాయి..

Published Sun, May 6 2018 1:13 PM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

YV Subbareddy Claims TDP Has Relations With BJP - Sakshi

ఒంగోలు, ప్రకాశం : తెలుగుదేశం పార్టీ నేతలు దళారులుగా మారి కంది రైతును దోచుకుంటున్నారని రాజీనామా చేసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. జిల్లాలో రైతుల వద్ద కందులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెసేనని అన్నారు. టీడీపీ విష ప్రచారం ప్రజలకు కొత్తేమీ కాదని చెప్పారు. ప్రజా మద్దతు వైఎస్సార్‌ సీపీకే ఉందని తెలిపారు.

బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చెబుతున్న టీడీపీకి ఇంకా ఆ పార్టీతో సంబంధాలు ఉన్నాయని అన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా బీజేపీ నాయకుడి భార్యను నియమించడమే ఇందుకు ఆధారమని చెప్పారు. ప్రకాశం జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన రెండు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement