
టీడీపీ ప్రభుత్వ తీరుపై వైఎస్‌ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు.
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ తీరుపై వైఎస్‌ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. జన్మభూమి సభల్లో సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులతో అడ్డుకున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ఎన్ని కోట్టుల మంజూరు చేసిందో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం అమ్ముకోలేని స్థితిలో ఉన్నా ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. అదే విధంగా మొత్తం ఎంతమందికి పెన్షన్లు మంజూరు చేశారో చెప్పాలన్నారు.