janma bhoomi
-
‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మిస్తుండగా తొలి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ వివరాలను ఆలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ ఈ ఏడాది అక్టోబర్‌కల్లా గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుంది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్వయంగా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులపై తాజా సమీక్షా సమావేశంలో నిర్మాణసంస్థలు లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ వారి నిపుణులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారీగా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. గర్భగుడితో ఉన్న ప్రధాన ఆలయంతోపాటు నృత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఇలా ఐదు మండపాలనూ నిర్మిస్తున్నారు. ఐదు మండపాలపై 34 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు ఉండే గుమ్మటాలను ఏర్పాటుచేస్తారు. ఇవి భక్తులకు ఆలయం ప్రాంగణం నుంచి 69 అడుగుల నుంచి 111 అడుగుల ఎత్తుల్లో గోచరిస్తాయి. ప్రధాన ఆలయం పొడవు 380 అడుగులుకాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం గర్భగుడి నిర్మాణంలో మక్రానా మార్బుల్‌తో చెక్కిన స్తంభాలు, పైకప్పు, కుడ్యాలను వినియోగించనున్నారు. ఆలయ బరువు, అన్ని రకాల వాతావరణ మార్పులను తట్టుకునేలా మొత్తంగా 392 భారీ స్తంభాలను ప్రధాన ఆలయం కోసం వాడుతున్నారు. గర్భగుడి ద్వారాలకు బంగారు పూత పూయనున్నారు. ఆలయ ప్రాకారంతో కలిపి రామాలయ విస్తీర్ణం 8.64 ఎకరాలు. ఆలయ ప్రాకారం పొడవు 762 మీటర్లుకాగా లోపలి ప్రాంగణంలో మొత్తం ఆరు ఆలయాలు నిర్మిస్తారు. భక్తుల కోసం విడిగా సదుపాయం కల్పిస్తారు’ అని ఆ ప్రకటన పేర్కొంది. -
జన్మభూమిలో రాక్షస మూకలు
రాజ్యాంగ స్ఫూర్తిని నడివీధిలో నిలబెట్టి హత్య చేశారు. ప్రజాస్వామ్యం అనే పదాన్ని జనం సాక్షిగా వెక్కిరించారు. సంక్షేమం ప్రజలకు అందకుండా సొంత మనుషులతో అడ్డుగోడ కట్టారు. ఆ గోడకు జన్మభూమి కమిటీ అని పేరు పెట్టారు. అసలు ఈ కమిటీకి ఉన్న అధికారం ఏమిటి..? జనాల అర్హతను నిర్ణయించే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు..? జనం డబ్బు జనానికి చేరడంపై వీరి పెత్తనం ఏమిటి..? ఈ ప్రశ్నలకు రాష్ట్రంలో జవాబు కరువైంది. ఒకప్పుడు రహస్యంగా పనిచేసిన రాజకీయ రాక్షస మూకలకు కమిటీలని పేరు పెట్టి సాక్షాత్తు ప్రభుత్వమే జనంపైకి వదిలింది. అప్రజాస్వామ్యమని తెలిసినా సంక్షేమ పథకాల చేరికలో సర్వ హక్కులూ వారికే అప్పగించింది. ఫలితంగా ప్రజలు ఓటేసి గెలిపించిన సర్పంచ్‌లు, పరీక్షలు పాసై ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు ఉత్సవ విగ్రహాలైపోయారు. నెత్తినెక్కి అధికారం చెలాయిస్తున్న కమిటీ సభ్యులను ప్రశ్నించలేక జనం బాధితులుగా మిగిలిపోయారు. సాక్షి నెట్వర్క్, శ్రీకాకుళం: పరిహారం.. పరిహాసం చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బొడ్డు సింహాద్రి. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన రైతు. తిత్లీ తుఫాన్లో సింహాద్రికి చెందిన నాలుగు ఎకరాల తొంభై సెంట్లలో జీడి, కొబ్బరి తోటలు ధ్వంసమయ్యా యి. ఆ మేరకు అధికారులకు ఆధారాలు చూపించారు. వారు కూడా జియో ట్యాగింగ్ అంటూ రాసుకుని వెళ్లా రు. పరిహారం జాబితా చూసేసరికి మూడెకరాల డబ్బై ఎనిమిది సెంట్లలోనే పంట నష్టపోయినట్టు వచ్చింది. నష్ట పరిహారం కూడా కేవలం రూ.15వేలు వచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రే సింహాద్రికి రూ.60వేల చెక్ అందించారు. కానీ బ్యాంక్ అధికారులు మాత్రం రూ.15వేలే ఇచ్చారు. ఈ తగ్గింపు వెనుక జన్మభూమి కమిటీ సభ్యులు ఉన్నారన్నది సింహాద్రి ప్రధాన ఆరోపణ. తనలాంటి వారిని మోసం చేసి వేల కొద్దీ డబ్బు దండుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌లో ఒకలా పరిహారం చూపించి, ఖాతాలో మరోలా పరిహారం ఎందుకు వేశారో అర్థం కావడం లేదని, కేవలం ప్రచారం యావ, జన్మభూమి కమిటీ సభ్యులను పోషించడం కోసమే ఇలా దగా చేశారని మండిపడుతున్నారు. చావులోనూ.. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు బోర గోపాలు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ కార్జివీధిలో నివా సం ఉంటారు. ఈయన భార్య బోర సీతమ్మ(38) గత ఏడాది జూన్ 8న మృతి చెందారు. అప్పటికే బీమా కోసం ప్రీమియం చెల్లించి పేరు నమోదు చేసుకుని ఉండడంతో తక్షణ సాయం కింద రూ.5వేలు అందించారు. అలాగే బీమా నియమాల ప్రకారం ఈయనకు ఎస్ఆర్ఐ118785331 నంబర్ గల రూ.2 లక్షల పాలసీ ధ్రువీకరణ పత్రం కూ డా అందజేశారు. వీరిది చాలా పేద కుటుంబం. చిన్న పాన్‌షాప్ పెట్టుకుని కుటుంబాన్ని నడిపిస్తున్నారు. ఈ రూ.2 లక్షలు చేతికి వస్తే కుటుంబ పరిస్థితి కాసింతైనా∙మెరుగుపడుతుందదని గోపాలు ఆశించారు. కానీ ఆ ఆశలపై జన్మభూమి కమిటీ సభ్యులు నీళ్లు చల్లారు. సాయంలో తమ వాటా తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. గోపాలు కట్టిన ప్రీమియం వల్లనే బీమా డబ్బులు వచ్చినా, అన్యాయంగా అందులో వాటా అడిగారు. ఇవ్వనని చెప్పినందుకు పది నెలలుగా ఆ సాయం అందకుండా అడ్డుపడుతున్నారు. సాయం అందకపోవడం వల్ల అప్పులు తీర్చలేకపోతున్నానని, తనలాంటి వారిపై ఇలా ప్రతాపం చూపడం తగదని ఆయన అంటున్నారు. గూడు చెదిరినా.. గుండె కరగలేదు.. ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు సావిత్రి సాహు. కవిటి మండలం మాణిక్యపురానికి చెందిన ఈమె ఇల్లు తిత్లీ తుఫాన్లో ధ్వంసమైపోయింది. అందరిలానే అధికారుల వద్దకు గ్రామంలో తుఫాన్ తర్వాత జరిగిన సర్వే చేసినప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా నంబర్ ఇచ్చి పరిహారం కోసం పేరు నమోదు చేసుకున్నారు. తుఫాన్‌కు పడిపోయిన చెట్ల స్థానంలో చిగుళ్లు కూడా వచ్చాయి. కానీ ఈమెకు మాత్రం నష్ట పరి హారం రాలేదు. ఊరిలో ఉన్న పెద్దలందరి వద్దకూ కాళ్లు అరిగేలా తిరిగారు. ఎవ్వరూ సాయం చేయలేదు. ఓ యువకుడు చొరవ తీసుకుని నష్ట పరి హారాల జాబితా కోసం ఆన్లైన్లో వెతికాడు. ఆ జాబితాలో సావిత్రి పేరు లేదు. తుఫాన్‌కు దారుణంగా నష్టపోతే తన పేరు జాబితాలో లేకపోవడమేంటని సావిత్రి లబోదిబోమన్నారు. తీరా చూస్తే అది జన్మభూమి కమిటీ సభ్యుల నిర్వాకం. ప్రతి పల్లెలోనూ ప్రతి పథకంలోనూ వీరి జోక్యం మితి మీరిన విషయం అందరికీ తెలిసిందే. పరిహారం పొందడానికి సావిత్రికి అన్ని అర్హతలు ఉన్నా కేవలం ఈ కమిటీ సభ్యుల అనుమతి లేకపోవడం వల్ల ఆమె సాయం అందుకోలేకపోయారు. సొంతవారంతా వలస వెళ్లిపోగా ఒం టరిగా మిగిలిన తనపై ఇంత కక్ష ఎందుకు పెంచుకున్నారో అర్థం కావడం లేదని, వృద్ధురాలినని కూడా చూడకుండా సాయానికి దూరం చేయడం సబబు కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దారుణాలు ఈయన పేరు నీలాపు లింగరాజు. సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన యువకుడు. చిన్నపాటి టిఫిన్ దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. వ్యాపారాన్ని కొద్దిగానైనా అభివృద్ధి చేయాలని బీసీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు కూడా అన్ని అర్హతలు చూసి లింగరాజు రుణం పొందడానికి అర్హుడేనని నిర్ధారించింది. కానీ ఈ రుణం పొందాలంటే బ్యాంకుల కంటే జన్మభూమి కమిటీ సభ్యుల సంతకం అత్యంత ప్రధానం. ఇది అందరికీ తెలిసిన రహస్యం. లింగరాజు ఎంత బతిమలాడినా ఆ కమిటీ సభ్యులు సంతకం పెట్టలేదు. తమ వారికి రుణం ఇప్పించడానికి లింగరాజును దారుణంగా తొక్కేశారు. ఎంత ప్రాధేయపడినా ఆ కమిటీ సభ్యులు వినిపించుకోలేదని, కేవలం ఈ అప్రజాస్వామిక కమిటీ వల్లే తనకు రుణం రాకుండాపోయిందని లింగరాజు ఇప్పటికీ బాధ పడుతున్నారు. నిర్దాక్షిణ్యంగా.. ఈమె పేరు గుజ్జల చిన్నప్పమ్మ. గార మండలం ఆడవరం గ్రామం, అంపోలు పంచాయతీ. భర్త యల్లయ్య మరణించి దాదాపు రెండేళ్లయ్యింది. ఆధార్ ఆధారంగా పింఛను ఇస్తున్నారు. ఇప్పటికే వయసు 71 ఏళ్లు కావచ్చింది. దీనికితోడు భర్త మరణం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసింది. ఇదిలా ఉంచితే వైఎస్సార్ సీపీ అన్నా, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నా ఇష్టమని ఈ వృద్ధురాలు గ్రామంలో చెబుతూ ఉంటుంది. అదే ఆమె చేసిన తప్పైపోయింది. అన్ని అర్హతలు ఉన్నా జన్మభూమి కమిటీ సభ్యులు ఆమె పింఛన్‌ను నిర్దాక్షిణ్యంగా నిలిపివేశారు. పింఛను కావాలని పలుమార్లు అధికారులు, టీడీపీ నాయకులను కలుస్తున్నా ప్రయోజనం లేకపోయింది. అర్హతలు ఉన్నాయని అధికారులకు తెలిసినా జన్మభూమి కమిటీలను కాదని వారేమీ చేయలేకపోతున్నారు. తాను తనువు చాలించేలోగా అయినా పింఛను ఇవ్వండని అధికారులను వేడుకుంటోంది. -
గుండె చెరువాయే..
సాక్షి, యడ్లపాడు: మండలంలోని బోయపాలెంలో 16 సుగాలీ కుటుంబాలతోపాటు వాల్మీకి బోయ, కాటిపాపలు, ముస్లింలకు చెందిన మరో 14 కుటుంబాలకు 1969లో గ్రామ సమీపంలోని వంకాయలపాడులో ఉన్న 28/ఎ ఇరిగేషన్ చెరువులో 30 ఎకరాలను సాగు నిమిత్తం ప్రభుత్వం పంపిణీ చేసింది. అప్పట్లో ఒక్కొక్కరికీ ఒక ఎకరం చొప్పున ఇవ్వడంతో వరి, పత్తి, వివిధ రకాల కూరగాయలు, చిరుధాన్యాలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. జన్మభూమి గద్దలు వాలాయి 2015 మే 16న రాత్రికి రాత్రే పచ్చని పొలాల్లో అక్రమంగా జన్మభూమి కమిటీ సభ్యులు మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇదేమని ప్రశ్నించేందుకు వచ్చిన వారిని మండలస్థాయి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. నీరు –చెట్టు పథకం కింద తవ్వకాలు చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. నేల తల్లితో తెగిపోతున్న బంధాన్ని తట్టుకోలేక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్న వారిని బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. తమ జీవనాధారం పోయిందని, న్యాయం చేయాలని నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా ఉన్నతాధికారులను సైతం పలుమార్లు కలిసి వేడుకున్నారు. వారెవ్వరూ కనికరం చూపలేదు. నోటికాడ కూడు తీసేశారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏ నేరం చేశామని తమకు ఇంతటి శిక్ష విధించారో సమాధానం చెప్పాలంటూ ఎన్నికల వేళ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి కూడా అన్యాయం చేశారు పొలాన్ని తవ్వి మట్టి తీస్తుంటే ఆదుకోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబాన్ని వేడుకున్నాం. తప్పక న్యాయం చేస్తామన్నారు. ఇష్టానుసారంగా మట్టి తవ్వుకున్న వారికి మద్దతు ఇచ్చారుకానీ, వీధినపడ్డ మమ్మల్ని నేటికీ పట్టించుకోలేదు. ఉన్నపొలం పోయి ఇప్పుడు ఉన్నవ, బోయపాలెం రైతుల వద్ద 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. గులాబి పురుగుల దెబ్బతో పెట్టిన పెట్టుబడి రాకుండా పోయింది. పాలకులు, ప్రకృతి పేదలపై పగబడితే జీవించగలమా..!– దగ్గు కృష్ణమూర్తి, బాధితుడు వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులనే.. వైఎస్సార్ సీపీకి సానుభూతిదారులు కావడంతో కాలనీలోని 60 సుగాలీ కుటుంబాల్లో ఒక్కరికి కూడా సబ్సీడీ రుణాలు మంజూరు చేయలేదు. ఒక్కో ఇంట్లో నాలుగైదు కుటుంబాలున్నా సెంటు నివేశన స్థలం ఇవ్వలేదు. దశాబ్దాల కిందట ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇళ్లు కూలిపోతే కనీసం హౌసింగ్ లోన్ మంజూరు చేయలేదు. మరుగుదొడ్లు నిర్మించుకుంటే బిల్లులు రానివ్వరు. ప్రశ్నించే వారు లేరని ఎస్టీలపై ఇంతటి వివక్ష చూపుతారు? – వీ శ్రీనివాసనాయక్, వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం మండల కన్వీనర్ నోటికాడ కూడు లాక్కున్నారు ఎస్టీలకు సాగు చేసుకుని జీవించమంటూ ప్రభుత్వం 50 ఏళ్ల కిందట ఎకరం చొప్పున భూమిని పంపిణీ చేసింది. అప్పటి నుంచి దానిపైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నాం. అప్పట్లో ఒక్క కుటుంబానికే ఇచ్చినా.. ఒక్కొక్క ఇంటిలో మూడేసి కుటుంబాలు ఉండేవి. వీరందరికీ ఆ ఎకరం భూమే ఆధారమైంది. ఆ భూముల్లో మట్టిదందా చేసి మా నోటికాడ కూడు తీసేశారు. ఇప్పుడు మేమెట్టా బతకాలో చెప్పండి. – వంకాడవత్ సాలమ్మబాయి, వృద్ధురాలు బతిమిలాడినా వదల్లేదయ్యా మా నాన్న బింజు నాగయ్య నుంచి పొలం హక్కు పొందాను. పొలం లేకపోతే దాదాపు అన్ని కుటుంబాలు రోడ్డున పడతాయంటూ అధికారులకు ఎంతగానో వేడుకున్నా వినలేదు. తవ్వకాలు ఆపాలని చూస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు. రాత్రికిరాత్రే తవ్వి పెద్ద పెద్ద గుంతలు చేశారు. మాపొలంలో పండించిన కూరగాయలు ఊళ్లో అమ్ముకునే వాళ్లం. ఇప్పుడు గుంటూరు నుంచి తెచ్చి అమ్మితే లాభాలేమీ రావడం లేదు. – గింజు బుల్లయ్య, బోయపాలెం పొలం లేక కూలీకి వెళ్లి గోతాలు కుడుతున్న సుగాలీ కాలనీ వాసి -
'ప్రశ్నిస్తే పోలీసులతో అడ్డుకున్నారు'
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. జన్మభూమి సభల్లో సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులతో అడ్డుకున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ఎన్ని కోట్టుల మంజూరు చేసిందో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం అమ్ముకోలేని స్థితిలో ఉన్నా ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. అదే విధంగా మొత్తం ఎంతమందికి పెన్షన్లు మంజూరు చేశారో చెప్పాలన్నారు. -
టీడీపీ నేతలకు చంద్రబాబు చీవాట్లు!
-
‘అనంతను కరివేపాకులా వాడుకుంటున్నారు’
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరివేపాకులా వాడుకుంటున్నారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రేపు (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటన సందర్భంగా మాజీ ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని.. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. అనంతపురం టీడీపీ నేతలకు చీము నెత్తురు, సిగ్గూశరం ఉంటే చంద్రబాబు ను నిలదీయాలని డిమాండ్ చేశారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అనంత వెంకట్రామిరెడ్డి పదవులను కరివేపాకులా చూస్తున్న వారంతా రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు. అక్రమ సంపాదన, దౌర్జన్యాలను పక్కనపెట్టి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని అన్నారు. ఏపీ సర్కార్ ఆర్భాటంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ఓ బోగస్ అని, అర్జీలు తీసుకోవడం మినహా సాధించింది శూన్యమని ఆయన వ్యాఖ్యానించారు. జన్మభూమి టీడీపీ ప్రచార కార్యక్రమంలా సాగుతోందని, ఏపీలో అధికారులు నరకయాతన అనుభవిస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. హెరిటేజ్ కంపెనీకి లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు పాడి పరిశ్రమను నీరుగారుస్తున్నారన్నారు. -
కర్నూలు జిల్లాలో జన్మభూమికి బ్రేక్
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో జన్మభూమి కార్యక్రమానికి బ్రేక్ పడింది. కర్నూలు మండలం పూడూరు గ్రామంలో బుధవారం జన్మభూమి సభ నిర్వహించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామస్తులు దారిలోనే అడ్డుకున్నారు. అధికారులను గ్రామంలోనికి రానివ్వకుండా రోడ్డుపైనే నిలిపివేశారు. తమ గ్రామానికి రోడ్డువసతి కల్పించడం, ఇతర సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫళమయ్యారని వారు ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో తమ గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించని అధికారులు నిర్వహించే జన్మభూమి సభల వల్ల తమకు ఒరిగేదేమీ లేదని వారు నిష్కర్షగా చెప్పారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో ఎమ్మార్వో ఇతర అధికారులు జన్మభూమి సభనిర్వహించకుండానే వెనుతిరిగారు. -
ప్రశ్నిస్తే గృహ నిర్బంధం చేస్తారా?: ఉమ్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐదోవిడత జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి ఇప్పటి వర కూ ఏడున్నర లక్షలకు పైగా అర్జీలు వచ్చా యంటేనే గత నాలుగేళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అర్థమని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లు అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జన్మ భూమి కార్యక్రమాలు రసాభాసగా జరుగు తున్నాయని, ప్రశ్నించే వారిని సభల్లో ఉండనివ్వడం లేదన్నారు. సమస్యల పరి ష్కారం కోసం జన్మభూమి కార్యక్రమా లకు వెళ్తున్న ప్రతిపక్షనేతలను హౌస్ అరెస్టులు చేయడం దారుణమన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోల వెన్నులో జన్మభూమి సమావేశానికి వెళ్తు న్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొలుసు పార్థ సార«థిని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వంలో ఉలికిపాటు మొదలైందన్నారు. ఇప్పటికైనా నాలుగు దఫాలుగా జరిగిన అర్జీలన్నీ ఏ మేరకు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.‘జన్మభూమి–మాఊరు’కార్యక్రమంలో ప్రభుత్వం ఖర్చుతో టీడీపీకి ప్రచారం చేసుకుంటున్నారని ఉమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలలో ఏ మేరకు నెరవేర్చారో యాక్షన్ టేకన్ రిపోర్టు (ఏటీఆర్)ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకు జోగి రమేష్ బహిరంగ సవాల్
-
బెజవాడ నడిబొడ్డున తేల్చుకుందాం...
సాక్షి, విజయవాడ : జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న పార్థసారధిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఆయన మంగళవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని జన్మభూమి సభను నడిపిస్తున్నారని అన్నారు. తమ పార్టీ నేత పార్థసారధితో పాటు, కోలవెన్ను గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్వహిస్తున్న జన్మభూమి...టీడీపీ కార్యక్రమంలా తయారైందని జోగి రమేష్ విమర్శించారు. జన్మభూమిలో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు జన్మభూమికి రాకూడదా? ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాకూడదా అంటూ... ఏం నేరం చేశారని పార్థసారధిని అరెస్ట్ చేశారని ప్రశ్నలు సంధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి గడపకు రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఉండేదని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ దుకాణాల్లో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేవారని, చంద్రబాబు పాలనలో బియ్యం తప్ప ఏమీ రావడం లేదని ఎద్దేవా చేశారు. రైతు రుణాలను మాఫీ చేశామని చంద్రబాబు సిగ్గులేకుండా చెబుతున్నారని, రుణమాఫీతో పాటు డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేసిన ఘనత ఆయనదేనని జోగి రమేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ నడిబొడ్డున చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నియోజకవర్గాల్లో ఏ మేరకు నెరవేర్చారో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. -
కంకిపాడు పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, కంకిపాడు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పార్థసారధిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఆయనను మంగళవారం పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక తమని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభకు వెళ్లకుండా విపక్ష నేతలను అడ్డుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ సభలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, అయితే సమస్యలను లేవనెత్తే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. నిలదీసిన విపక్ష నేతలను బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయని, పోలీసులను అడ్డం పెట్టుకుని జన్మభూమి సభ నడిపిస్తున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు. గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని చెప్పే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమానికి ప్రతపక్షాలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. డ్వాక్రా రుణమాఫీ ఎవరికి చేశారని, రుణాలు చెల్లించాలని బ్యాంక్‌ల నుంచి మహిళలకు నోటీసులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తే అడ్డుకోవడం సరికాదంటూ...ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ ఆయన నోటికి నల్లరిబ్బన్ కట్టుకున్నారు. అలాగే వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధితో పాటు గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు జన్మభూమికి వెళుతున్న తమను పోలీసులు అడ్డుకున్నారని గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళుతున్న తమని భయపెట్టి నోరు మెదపకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంకిపాడు పోలీసుల అత్యుత్సాహం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నేత, మాజీమంత్రి పార్థసారధిని అరెస్ట్ చేసిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనతో పాటు ఇతర నేతలను పోలీసులు వాహనంలో...పలు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పుతున్నారు. ముందుగా కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు అక్కడ నుంచి ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు వైపుకు తీసుకుని వెళ్లి మరలా ఉయ్యూరు వైపుకు తరలిస్తున్నారు. పోలీసుల వైఖరిపై వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడుతున్నారు. -
వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి గృహ నిర్బంధం
-
కోలవెన్నులో ఉద్రిక్తత, పార్థసారధి గృహనిర్బంధం
సాక్షి కంకిపాడు : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కొలవెన్నులో మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో జరిగే జన్మభూమి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్ళిన వైఎస్ఆర్ సీపీ నేత, మాజీమంత్రి కె.పార్ధసారధిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనకూడదంటూ పోలీసుల ఆంక్షలు విధించారు. గ్రామ సర్పంచ్ ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. జన్మభూమిలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని పార్థసారథి విజ్ఞప్తి చేసినా పోలీసులు స్పందించకపోవడంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రసాభసగా మారిన జన్మభూమి
-
రాయచోటి జన్మభూమి సభలో రగడ
-
జన్మభూమికి వెళ్లకపోతే విద్యార్థులకు టీసీలే
చిత్తూరు జిల్లా: మంత్రి పాల్లొనే జన్మభూమి కార్యక్రమానికి వెళ్లకపోతే టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తామని బీటీ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హుకుం జారీ చేసింది. యాజమాన్య తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉన్న అందరికీ టీసీలు ఇచ్చేయండి అంటూ గేట్లకు తాళం వేసి యాజమాన్య పద్దతులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో చారిత్రక నేపధ్యం కల బీటీ కాలేజీని నాశనం చేసేందుకు ప్రైవేటు వ్యక్తులు చూస్తున్నారని, కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టే పనులు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. బలవంతంగా రాజకీయపార్టీల కార్యకలాపాలకు విద్యార్థులను వినియోగించుకోవడం దారుణం అని వాపోయారు. ఇప్పటికైనా ప్రైవేట్ వ్యక్తులను కాలేజీకి దూరంగా పెట్టి తమ కళాశాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. -
ఇదేమి చోద్యం..!
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పులివెందులలోని ధ్యాన్‌చంద్ క్రీడామైదానంలో జన్మభూమి–మా ఊరు సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పట్టణంలో పార్టీ జెండాలు, తోరణాలు, ప్లెక్సీలతో పసుపు మయం చేశారు. వారు అత్యుత్సాహంతో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా వదలలేదు. పట్టణంలోని ముద్దనూరురోడ్డు పాత జూనియర్ కళాశాల సర్కిల్లో ఉన్న గాంధీ విగ్రహం చుట్టూ పార్టీ జెండాలు, ప్లెక్సీలతో ముంచెత్తారు. జాతిపిత విగ్రహం కూడా సరిగా కనిపించడంలేదు. మహాత్ముని విగ్రహం చుట్టూ ఇలా ఒక పార్టీకి చెందిన జెండాలు, తోరణాలు ఏర్పాటు చేయడం ఏమిటని చూసిన వారు మండిపడుతున్నారు. – పులివెందుల -
మళ్లీ తెరపైకి జన్మభూమి
-
గతం కంటే భిన్నంగా జన్మభూమి: సీఎం
సాక్షి, అమరావతి: గత నాలుగు జన్మభూముల కంటే మరింత పటిష్టంగా అకౌంటబిలిటీనీ మరింత పెంచే విధంగా అయిదవ విడత జన్మభూమి కార్యక్రమా న్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేస్తూ జనవరి 2 నుంచి జనవరి 11 వరకు ‘జన్మభూమి– మాఊరు’పేరుతో పదిరోజులు పాటు పండుగలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. జన్మభూమి కార్యక్రమ వివరాలను తెలియచేయడానికి శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సీఎం మాట్లాడుతూ రోజుకు ఒక అంశాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో దీనిపై చర్చించనున్నట్లు తెలిపారు. మీడియాను కంట్రోల్ చేయాలి రాష్ట్రంలో మీడియాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివిధ సంస్థలకు, విద్యార్థులకు ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి బాబు వివరిస్తున్నప్పుడు మీడియాకూ ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా... మీడియా ఏది పడితే అదే రాయకుండా కంట్రోల్ చేయాల్సిన అవస రం ఉందన్నారు. రాష్ట్రంలో ఎటువంటి పోష కాలు లేని సన్న బియ్యాన్ని అధికంగా తిని షుగర్ వ్యాధి తెచ్చుకుంటున్నారని చెప్పారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం బ్రిటిషర్లు కృష్ణానదిపై ఆనకట్ట కట్టడం, తర్వాత ప్రకాశం బ్యారేజ్ నిర్మించడంతో కృష్ణా డెల్టా సస్యశ్యామలమైందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ నిర్మించి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాత్రి దుర్గాఘాట్‌లో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఎక్కడ పడ్డ నీరు అక్కడే నిల్వ చేయాలనేది తన ఆశయమన్నారు. -
అంతా ‘జన్మభూమి’ జపం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పాలన స్తంభించింది. అధికారులంతా జన్మభూమి జపం చేస్తున్నారు. రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకూ జన్మభూమి కార్యక్రమం పేరుతో జిల్లా అధికారులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రతి రోజూ నిర్వహించే సమావేశాలు, వారం వారం సమీక్షల క్యాలెండర్‌ను పూర్తిగా రద్దు చేసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాలన స్తంభించింది. కలెక్టరేట్ బోసిపోతోంది. ఈనెల 2వ తేదీ నుంచి ఇదే దుస్థితి నెలకొంది. జన్మభూమి తర్వాత 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు కార్యాలయాలు పనిచేసినా అప్పుడు పండగ కోలాహలం నేపథ్యంలో ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఎలాగూ పండగ సెలవులు ఉంటాయి. అంటే నెలలో సగం రోజులు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజా సమస్యలను అధికారులు గాలికి వదిలేసినట్టయింది. ప్రస్తుతం ప్రజలు కార్యాలయాలకు వస్తున్నా.. అధికారులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. కొందరు జన్మభూమి గ్రామసభలు ముగిసిన అనంతరం కార్యాలయాలకు వస్తున్నా.. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇప్పటికే ‘మీకోసం’ రెండువారాలు రద్దు ప్రతి సోమవారం జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని జన్మభూమి కార్యక్రమం నేపథ్యంలో ఇప్పటికే రెండు వారాల పాటు కలెక్టర్ రద్దు చేశారు. మండల కేంద్రాల్లో నిర్వహించే మీకోసం కార్యక్రమాలకూ మంగళం పాడారు. దీంతో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. రైతులను గాలికొదిలేశారు ప్రస్తుతం రబీ సీజ¯ŒS ప్రారంభ దశలో ఉంది. రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సాగునీరు, రుణాలు అందక అవస్థలు పడుతున్నారు. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు. అయితే అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. -
అదే తీరు.. నిరసనల జోరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జన్మభూమి గ్రామ సభల్లో నిరసనలు, నిలదీతలు కొనసాగుతున్నాయి. ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకున్న చోట ముందస్తుగా అరెస్ట్‌లు చేయించి గొడవలు జరగకుండా చూస్తున్నారు. నిడమర్రు మండలం అడవికొలనులో ఆక్వా మాఫియా దెబ్బకు పంట పొలాలు దెబ్బతిన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ సమస్యపై రైతులు ఆందోళనలు చేశారు. గురువారం ఆ గ్రామంలో జన్మభూమి సభ సందర్భంగా రైతులు నిలదీస్తారన్నభయంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. మిగిలిన వారిని బెది రించారు. రద్దు చేసిన వృద్ధాప్య పిం ఛన్లు పునరుద్ధరించాలని కోరుతూ ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో వృద్ధులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. గ్రామంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన సాలా దానయ్య, అంపా ముత్యాలు, తాడిపర్తి రామారావు, కంతే వెంకటస్వామి, తాడిపర్తి సుబ్బారావు, జంపా కొండయ్య తదితరులు జన్మభూమి గ్రామ సభ ఎదుట ప్ల కార్డులు చేతబూని తమ పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమకు 2014 వరకూ రూ.200 చొప్పున పింఛను ఇచ్చారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పేరుతో రద్దు చేశారని వారు వాపోయారు. చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెం జన్మభూమి గ్రామ సభను గిరిజనులు అడ్డుకున్నారు. నాయకపోడు గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు అధికారులను సభలోకి వెళ్లనీయలేదు. గిరిజనుల సమస్యలు పరిష్కరించని కారణంగా సర్పంచ్ మేడి రాములు, ఎంపీటీసీ సత్యవతి జన్మభూమి గ్రామ సభనుంచి వాకౌట్ చేశారు. వెంకటాపురం గ్రామ సభలో చింతలపూడి–నామవరం రహదారి నిర్మాణంౖ కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో జెడ్పీ స్కూల్లో మధ్యా హ్న భోజనం సరిగా ఉండటం లేదని విద్యార్థులు ఆరోపించారు. దేవరపల్లి మండలం పల్లంట్లలో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లస్థలాల కోసం అధికారులను నిలదీశారు. అర్హులకు పథకాలు మంజూరు చేయకుండా అనర్హులకు మంజూరు చేస్తున్నారని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు పంచాయతీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. వీరవాసరం మండలం రాయకుదురులో అర్హత ఉన్నా తమకు పింఛన్లు ఎందుకివ్వడం లేదని పలువురు వృద్ధులు అధికారులను నిలదీశారు. -
రగడ.. రగడ
జన్మభూమి–మా ఊరు గ్రామ సభలు రెండో రోజైన మంగళవారం వేడెక్కాయి. ప్రతిచోట నిలదీతలు, నిరసనలు మార్మోగాయి. సమస్యలు పరిష్కారం కాలేదంటూ బీజేపీ నాయకులు జన్మభూమి సభలో నిరసన వ్యక్తం చేయగా.. మరోచోట అవినీతిపై టీడీపీలోని రెండు వర్గాలు రోడ్డెక్కాయి. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న కంసాలి బేతపూడి గ్రామస్తులు గ్రామసభను అడ్డుకున్నారు. పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి నరసాపురం తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుట సీపీఎం నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ షాక్ ఇచ్చింది. మొగల్తూరు మండలం మోడి గ్రామంలో ప్రధానమైన వియర్ చానల్ పనులు పూర్తికాకపోవడం, «గ్రామంలోని దర్భరేవు డ్రెయిన్‌పై వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ నాయకులు ముందుగానే ప్రకటించారు. అధికారులెవరినీ సభకు రానివ్వకుండా ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. వేదిక వద్ద బల్లలు, కుర్చీలను విసిరేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆ సభకు హాజరుకాకుండా మొహం చాటేశారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ తరలింపు విషయంలో ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలంటూ నరసాపురం మండలం కంసాలి బేతపూడిలో జన్మభూమి సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. నీటిసంఘం అధ్యక్షుడు పొత్తూరి రామరాజు, అధికారులు, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి గోబ్యాక్, గోబ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి జీపులో ఎక్కించారు. గ్రామస్తులు, మహిళలు పోలీసు జీప్ ఎదుట బైఠాయించగా.. కానిస్టేబుళ్ల సాయంతో మహిళలను పక్కకు లాగి జీపును పోనిచ్చారు. నిరసనకారులను వదలకపోవడంతో సీపీఎం నాయకులు నరసాపురం వెళ్లి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంలో సీపీఎం నాయకులు, రూరల్ ఎస్సై కె.సతీష్‌కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు పోలీసులు అందరినీ చెదరగొట్టారు. ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అవినీతి బట్టబయలైంది. ఉంగుటూరు మండలం వెల్లమిల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో టీడీపీ సీనియర్ నాయకుడు బండి స్వరూప్, అదే పార్టీకి చెందిన సర్పంచ్ సర్లమామిడి నాగేశ్వరరావు వర్గాల మధ్య జన్మభూమి సభలో వివాదం తలెత్తింది. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని, కనీసం క్యూరింగ్ కూడా చేయలేదని బండి స్వరూప్ వర్గీయులు సర్పంచ్ నర్లమామిడి నాగేశ్వరరావును నిలదీశారు. దీంతో సర్పంచ్ వర్గీయులు నీరు–చెట్టు పథకంలో మట్టిని అమ్ముకున్నారంటూ బండి స్వరూప్‌పై విరుచుకుపడ్డారు. ఇరువర్గాలు పోట్లాడుకుని వారి అవినీతిని బయటపెట్టుకున్నారు. యలమంచిలి మండలం చించినాడలో జన్మభూమి కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజలు ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలంటూ మహిళలు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పాలకవర్గానికి బాసటగా నిలిచారు. వారిని అడ్డుకోవడానికి జెడ్పీటీసీ బోనం వెంకట నరసింహరావు, తహసీల్దార్ వంటెద్దు స్వామినాయుడు ప్రయత్నించడంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామసభలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వటం లేదని తహసీల్దార్‌ను, ఇతర అధికారులను గ్రామస్తులు నిలదీ శారు. టి.నరసాపురం మండలం బండదవారిగూడెంలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించే విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రెండు గంటలపాటు వాగ్వివాదం చోటుచేసుకోవడంతో జన్మభూమి సభ ఆలస్యమైంది. చింతలపూడి మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో ఇళ్లు, పెన్షన్లు, చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న వారికిచ్చే పరిహారంపై అధికారులను రైతులు నిలదీశారు. యర్రంపల్లిలో చింతలపూడి ఎత్తిపోతల పథకంతోపాటు పీహెచ్సీ భవనాన్ని ఎందుకు ప్రారంభించ డం లేదని సీపీఐ, వైఎస్సార్ సీపీ నాయకులు అధికారులను నిలదీశారు. ఊటసముద్రంలో నిర్వహించిన గ్రామసభలో నాయకపోడు గిరి జనులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు. దాదాపు 2 గంటలకు పైగా సభను జరగనివ్వకుండా కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేశారు. జిల్లా అధికారులు ఇచ్చిన హామీ మేరకు ఆందోళన విరమించారు. జీలుగుమిల్లిలో కార్డులు ఇచ్చి కదలాలంటూ తహసీల్దార్‌ను ఘెరావ్ చేశారు. -
జన్మభూమిలో తమ్ముళ్ల బరితెగింపు
► జన్మభూమిలో పచ్చదండు దాష్టీకం ► నిలదీసిన వారిపై దాడులు, ముష్టి ఘాతాలు ► ప్రశ్నించినవారి గెంటివేత అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గ్రామ సభ వద్ద వ్యక్తి ఆత్మహత్యా యత్నం ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదంటూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, నిలదీతలు జన్మభూమి సభలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల నియంతృత్వపోకడలు రాజరిక పాలనను మరోసారి గుర్తు చేస్తున్నాయి. అధికార పార్టీనాయకుల బరితెగింపుతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. సమస్యలు పరిష్కరించేందుకు చేపట్టిన సభలు కాస్తా ఆధిపత్యాన్ని చాటుకునే వేదికలుగా మారాయి. సమస్య చెబితే హెచ్చరికలు... ప్రశ్నిస్తే దౌర్జన్యాలు.. ఇదేమని నిలదీస్తే పిడిగుద్దులు... ఇంకా మొండికేస్తే గెంటివేతలు... ఇదీ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల తీరు తెన్నూ... సాక్షి ప్రతినిధి, విజయనగరం: జన్మభూమి గ్రామ సభల్లో టీడీపీ నాయకుల దౌర్జన్యం పెచ్చుమీరుతోంది. సమస్యలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారు. జన్మభూమి గ్రామ సభ సందర్భంగా పెద్ద శబ్దంతో బాకాల్లో పాటలు వేయడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానికులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి చావబాదారు. మరోసారి ప్రశ్నించకుండా ముష్టి ఘాతాలు కురిపించారు. విజయనగరం ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో హైస్కూల్ విద్యార్ధులు పరీక్ష రాస్తుండగా బాకాలు పెట్టి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న వైనాన్ని ప్రశ్నించినందుకు భౌతిక దాడులకు పాల్పడ్డారు. పార్వతీపురంలోని ఏడో వార్డులోని కేపీఎం హై స్కూల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. వరండాలో రాస్తున్న విద్యార్థులకు ఈ శబ్దాలు అసౌకర్యంగా మారాయి. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు దేవుపల్లి నాగరాజు, మజ్జి వెంకటేష్‌లతో పాటు స్థానికులు కూడా టీడీపీ నాయకులను ప్రశ్నించారు. అదే అవకాశంగా భావించిన టీడీపీ కార్యకర్తలు ఉన్న పళంగా వీరిపై దాడులు చేశారు. దొరికిన వారిని దొరికినట్టు చితక్కొట్టారు. టీడీపీ నాయకుల నిర్లక్ష్యాన్ని, పట్టించుకోని వైనాన్ని ప్రశ్నించిన వారంతా ఒక్క సారిగా అవాక్కయ్యారు. తేరుకోకముందే వారిపై టీడీపీ నాయకులు పిడిగుద్దులు కురిపించారు. దీంతో స్థానికులు, వైఎస్సార్సీపీ నాయకులు తలోదిక్కుకు పారిపోయారు. కొత్తవలస మండలం తాడివానిపాలెం గ్రామానికి చెందిన బోని సత్యం తన వద్ద ఎస్సీలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు భూమిని తీసుకుని ఇప్పటి వరకూ ప్రత్యామ్నాయంగా వేరేచోట భూమి ఇవ్వలేదనీ, ఎన్నిమార్లు అధికారులను ప్రశ్నించినా సమాధానం ఇవ్వడం లేదనీ మంచినీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్యా యత్నం చేసాడు. ఎంత మంది చెప్పినా వినలేదు. చాలా సేపు అక్కడే ఉండిపోవడంతో అధికారులు, స్థానికులు బతిమిలాడి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో అతను కిందికి దిగాడు. మెరకముడిదాం మండలం ఊటపల్లి, మక్కువ మండలం తూరు మామిడి, జామి మండలం భీమసింగి తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయనీ, కేంద్రాల్లో ఎక్కడా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో పందికొక్కులు, దొంగల పాలవుతున్నాయనీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఇబ్బందులు కలుగుతున్నాయనీ నిలదీశారు. అలాగే రేషన్ కార్డులు, పింఛన్లను కేవలం అధికార పార్టీ వర్గాల వారికే ఇస్తున్నారని గ్రామసభల్లో నిలదీశారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ఇందిరానగర్‌లో నిర్వహించిన గ్రామసభలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, జి.వి.రంగారావు, దానబాబుల ఆధ్వర్యంలో పలువురు నాయకులు అపరిష్కృత సమస్యలు పరిష్కరించమన్నందుకు తెలుగు తమ్ముళ్లు దుర్భాషలకు దిగారు. రేషన్ కార్డులు కొంత మందికే ఇచ్చి రాజకీయం చేస్తున్నారని అధికారులను నిలదీశారు. పూసపాటిరేగ మండలం వెంపడాంలో పిన్నింటి వెంకటరమణ తదితరులు పింఛన్ల మంజూరులో పక్షపాత వైఖరిని ఎండగడుతూ నిలదీశారు. గజపతినగరం మండంల కెంగువలో అనధికారిక కుళాయిలపై మజ్జి రామకృష్ణ తదితరులు ప్రశ్నించగా ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాదులాట జరిగింది. ఏఎస్ఐ త్రినాధ సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. మెరకముడిదాం మండలం జి.మర్రివలసలో గత సమస్యల్లో ఎన్ని పరిష్కరించారో చెప్పి అప్పుడు గ్రామ సభ నిర్వహించాలని సర్పంచ్ గొర్లె రామారావు నిలదీయగా సంబంధిత ఫైలు తేలేదని అధికారులు చెప్పడం కొసమెరుపు. -
జన్మభూమిలో.. అశ్రుధార
ఈమె పేరు దాలి రమణమ్మ. ఊరు సంతకవిటి మండలం తమరాం.పుట్టుకతో అవిటితనం శాపం. కాళ్లు చేతులు సరిగా పనిచేయవు. రెండేళ్ల క్రితం వరకూ వికలాంగ పింఛను వచ్చేది. తరువాత ఆగిపోయింది. గతంలో రెండు పర్యాయాలు ఇదే జన్మభూమిలో గోడు వెళ్లబోసుకున్నా పునరుద్ధరించలేదు. సోమవారం ఊళ్లో జరిగిన జన్మభూమికి యాతన పడి చేరుకుంది. అధికారుల ముందు ఇలా కంటతడి పెడుతూ కష్టాన్ని చెప్పుకుంది. పింఛను పునరుద్ధరిస్తామని ప్రత్యేకాధికారి పి. కూర్మినాయుడు చెబుతున్నా ఈమె కంటనీరు ఆపుకోలేకపోయింది. సదరం వివరాలు సరిగ్గాలేని కారణంగా పింఛను నిలిచిపోయిందని పంచాయతీ కార్యదర్శి మౌళి సాక్షికి తెలిపారు. ఈమెకు 50 శాతం మేర వికలాంగత్వం ఉన్నట్లు వెలుగు అధికారులు తెలిపారు. నిరుపేద తండ్రే ఈమెకు తోడు. - సంతకవిటి -
ప్రశ్నిస్తే పీఎస్కే..!
►జన్మభూమి కార్యక్రమంలో వింతపోకడ ►సమస్యలపై ప్రశ్నించినవారిని పోలీస్‌స్టేషన్‌కు ►తరలించాలని ఆదేశాలిస్తున్న ఎమ్మెల్యే మోదుగుల ►పోలీసుల అత్యుత్సాహం ►పోలీస్‌స్టేషన్ వద్ద కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల నినాదాలు ►రోడ్డుపై బైఠాయించి టీడీపీ కార్యకర్తల ఆందోళన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యేలను ప్రశ్నించిన కార్యకర్తలు, ప్రజలకు చేదు అనుభవం ఎదురవుతోంది. సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నించిన వారిని పోలీసుల సాయంతో జన్మభూమి కార్యక్రమం నుంచి పంపివేయడం, పోలీస్స్టేషన్లకు తరలించడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గుంటూరు పట్టణంలో శనివారం పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఇదే జరిగింది.. గుంటూరు ఈస్ట్ : పట్టణంలోని 18 డివిజన్లో శనివారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఆదంసాహెబ్, ఇతర కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిని పిలిచి వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. పోలీసులు అత్యుత్సాహంతో ఆదం సాహెబ్‌ను లాలాపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారినీ స్టేషన్‌కు తరలించండి.. అనంతరం ఎమ్మెల్యే 19వ డివిజన్ జన్మభూమి సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి మాజీ కార్పొరేటర్ కొంపల్లి సుబ్బులు భర్త, సీనియర్ టీడీపీ కార్యకర్త అయిన మాలకొండయ్య ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తాను వార్డులో సీనియర్ నాయకుడినైనా వేదిక మీదకు పిలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో ఉన్న నిరుపేదల సమస్యలు ఏకరువుపెట్టారు. ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమీపంలోని పోలీస్ సిబ్బందిని పిలిచి మాలకొండయ్యను, అతని వెంట ఉన్నవారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో పోలీసులు మాలకొండయ్య, అతని సమీప బంధువు వేమూరు సుబ్బారావులను లాలాపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు దీంతో రెండు వార్డుల్లోని టీడీపీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్య లాలాపేట స్టేషన్‌కు వచ్చారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ పెద్దల ఆదేశాలతో టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి మద్దాళిగిరి స్టేషన్‌కు వచ్చి మాలకొండయ్యను సముదాయించి స్టేషన్ వెలుపలకు తీసుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే చర్యకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు. అక్కడి నుంచి ఐబీలో ఉన్న మంత్రి పుల్లారావును కలిసేందుకు ప్రదర్శనగా వెళ్లారు. మార్గంమధ్యలో హిమని సెంటర్లో రోడ్డుమీద బైఠాయించారు. పార్టీ కార్యాలయానికి పిలవాలేగానీ.. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ 2002 సంవత్సరంలో తన సతీమణి కొంపల్లి సుబ్బులు టీడీపీ కార్పొరేటర్‌గా పనిచేసిందన్నారు. అప్పటి నుంచి తాను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తుస్తున్నట్లు చెప్పారు. తన వార్డులో జన్మభూమి సభ జరుగుతుండగా తనను స్టేజీ మీదకు పిలువకపోవడంతోపాటు, వార్డులో గత జన్మభూమిలో ఇచ్చిన హామీల విషయంలో కూడా ఎమ్మెల్యే మాట్లాడడానికి ఇష్టపడడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో మర్యాదగా అడిగినా తనను పార్టీ కార్యాలయానికి రమ్మనకుండా పోలీసులతో స్టేషన్‌కు తరలించడం అన్యాయమంటూ మాలకొండయ్య కన్నీళ్ల పర్యంతమయ్యారు. -
'సీఎంను చూస్తే పీఎంకు భయం'
కుప్పం రూరల్(చిత్తూరు): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి ప్రధాని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తయిండ్లు గ్రామంలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాలు చూసి ఎక్కడ తనకు పోటీ అవుతాడోనని మోదీకి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అంచలంచెలుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తున్నారని చెప్పుకున్నారు. -
జన్మభూమికి చుక్కెదురు!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమైన రెండో విడత జన్మభూమి కార్యక్రమం రసాభాసలకు దారితీస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి వంటి హామీలను గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన మహిళలు, యువత, రైతులు జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొని అధికారులను నిలదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కూడా గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రభుత్వ పథకాలన్నిట్లో టీడీపీ వాళ్లకే పట్టం కడుతున్నారని నిరసిస్తు.. విశాఖపట్నం, కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం, విజయనగరం జిల్లాలలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా బొబ్బిలిలో ముఖ్యమంత్రి సభలో పాల్గొనేందుకు వెళ్తున్న సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆగ్రహించిన సీపీఐ, సీపీఎం కార్యకర్తలు రోడ్డు పైన ధర్నాకు దిగారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగన్నవలసలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎల్లన్న కొండలో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమాన్ని స్థానికులు బహిష్కరించారు. జన్మభూమి కార్యక్రమాన్ని అధికార పార్టీ కార్యక్రమంగా మర్చేసారని నిరసిస్తూ.. అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో కార్యక్రమాన్ని బహిష్కరించారు. విజయనగరంలోని భోగాపురం ఏయిర్పోర్టు బాధిత గ్రామస్థులు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగి వారిని వెనక్కి పంపించేశారు. -
'జన్మభూమిలో నాయకులను నిలదీయండి'
-
'జన్మభూమిలో నాయకులను నిలదీయండి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకుని ప్రజల ముందుకు రావాలని సూచించారు. హామీలను తక్షణమే నెరవేర్చాలని జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు టీడీపీ నాయకులను నిలదీయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్ నారాయణ మాట్లాడుతూ..హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని జన్మభూమి కార్యక్రమం చేపడుతున్నారని చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. -
చెవిరెడ్డి మాటమీద నిలబడే వ్యక్తి
తిరుచానూరు : చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి. నమ్మిన పార్టీని, సిద్ధాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోని వ్యక్తి. అని చెవిరెడ్డిపై చిత్తూరు ఎంపీ డాక ్టర్ ఎన్. శివప్రసాద్ ప్రశంసల జల్లు కురిపించారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి, కుంట్రపాకం గ్రామ పంచాయతీలో ఆదివారం జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెవిరెడ్డి నమ్మిన సిద్ధాంతం, పార్టీ కోసం పని చేసే వ్యక్తి అన్నారు. 2001 టీడీపీ పాలనలో తాను రాష్ట్ర మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో జిల్లాలో టీడీపీ 32, కాంగ్రెస్ 33జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుందన్నారు. ఎలాగైనా సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో జెడ్పీ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకోవాలని, ఆ సమయంలో చెవిరెడ్డిని టీడీపీలోకి తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు, ప్రలోభాలు పెట్టినా లొంగలేదని తెలిపారు. చివరకు కిడ్నాప్ చేయాలనుకున్నానని ఎంపీ ఆనాటి సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు. కేవలం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వల్లే టీడీపీ హయాంలోనూ జిల్లా పరిషత్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగిందని తెలిపారు. చిన్నప్పటి నుంచే చెవిరెడ్డితోనూ, వారి కుటుంబతోనూ అనుబంధం ఉందని, ఆ చనువుతోనే చెవిరెడ్డిని తమ పార్టీలోకి తీసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. నమ్మిన పార్టీని, సిద్ధాంతాన్ని మోసం చేయలేనని తమ్ముడు చెవిరెడ్డి తనతో చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తు ఉందన్నారు. అంతటి నిబద్ధత కలిగిన చెవిరెడ్డితో కలిసి చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానని, ప్రజలు కూడా తమతో పనిచేయించుకోవాలని కోరారు. అంతకుముందు ఎంపీ శివప్రసాద్‌ను పుష్పగుచ్ఛం, దుశ్శాల్వతో చెవిరెడ్డి సత్కరించారు. -
ఆనాటి రాక్షస పాలన మళ్లీ గుర్తుకొస్తోంది
తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలను మర్చిపోయిందని చిత్తూరు జిల్లా పుంగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు మూడు నెలల పాలన ఇంతకుముందు ఆయన తొమ్మిదేళ్ల పాటు సాగించిన రాక్షస పాలనను గుర్తుకు తెస్తోందని ఆయన మండిపడ్డారు. ఉన్న పింఛన్లను తొలగించడమే జన్మభూమి కార్యక్రమంలా మారిందని, జన్మభూమి- మాఊరు కార్యక్రమాన్ని ప్రజలే అడ్డుకుంటున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. అందుకే స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా జన్మభూమిని ఆరు నెలల పాటు వాయిదా వేస్తే మంచిదని తమ అధినేతను కోరుతున్నట్లు ఆయన అన్నారు.