జన్మభూమికి వెళ్లకపోతే విద్యార్థులకు టీసీలే | TC will be given if students does not go to janma Bhoomi | Sakshi

జన్మభూమికి వెళ్లకపోతే విద్యార్థులకు టీసీలే

Published Fri, Jan 5 2018 1:14 PM | Last Updated on Fri, Jan 5 2018 1:16 PM

TC will be given if  students does not go to janma Bhoomi - Sakshi

చిత్తూరు జిల్లా: మంత్రి పాల్లొనే జన్మభూమి కార్యక్రమానికి వెళ్లకపోతే టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తామని  బీటీ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హుకుం జారీ చేసింది. యాజమాన్య తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉన్న అందరికీ టీసీలు ఇచ్చేయండి అంటూ గేట్లకు తాళం వేసి యాజమాన్య పద్దతులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంతో చారిత్రక నేపధ్యం కల బీటీ కాలేజీని నాశనం చేసేందుకు ప్రైవేటు వ్యక్తులు చూస్తున్నారని, కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టే పనులు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. బలవంతంగా రాజకీయపార్టీల కార్యకలాపాలకు విద్యార్థులను వినియోగించుకోవడం దారుణం అని వాపోయారు. ఇప్పటికైనా ప్రైవేట్ వ్యక్తులను కాలేజీకి దూరంగా పెట్టి తమ కళాశాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement