madanapalli
-
ప్రసూబేబీ.. నటనే హాబీ!
మదనపల్లె సిటీ: అవును అతడు సోషల్ మీడియా సూపర్‌స్టార్. యూట్యూబ్‌లో 8.5 మిలియన్ల సబ్స్క్రైబర్లు, ఇన్‌స్ర్ట్రాగామ్‌లో భారీ ఫాలోయింగ్. ప్రసూబేబిగా సూపర్ ఫేమస్. చదివింది ఎంటెక్. ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత ఉద్యోగం వస్తుంది. లక్షలాది రూపాయల జీతం లభిస్తుంది. కానీ అతను అందరూ వెళ్లేదారిలో కాకుండా తనకంటూ ప్రత్యేక మార్గం ఉండాలని భావించాడు. నిండు చందురుడు ఒకవైపు–చుక్కలు ఒకవైపు’ అని భావించే తత్వం ఆయనది. అందుకే అతను సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. ఆ మార్గంలో వెళ్లే క్రమంలో మొదట అందరూ హేళన చేశారు. అయినా నిరుత్సాహపడలేదు. మరింత కసి, పట్టుదలతో ముందుకెళ్లాడు. ఎంచుక్ను రంగం ఏదైనా సరే, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే విజయం తనవెంటే ఉంటుందని నిరూపించాడు. ఇంటిల్లిపాదీ ఆనందించే వీడియోలను సొంతంగా రూపొందిస్తూ అందులో తానే నటిస్తూ సోషల్ మీడియా సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. అతనే మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లె(గారబురుజు)కు చెందిన ప్రశాంత్. అతని విజయగాథపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..👉సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమకున్న నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటివారిలో ప్రశాంత్ ఒకరు. ప్రసూ బేబి అనే యూట్యూబ్ ఛానల్ పేరుతో తల్లిదండ్రుల నుంచి ప్రేమికుల వరకు వారి బాధ్యత గుర్తు చేస్తున్నాడు. సరదా సరదా వీడియోలతో యువతను ఆకట్టుకుంటున్నాడు. ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా నటనతో సత్తా చాటుతూ అనతికాలంలోనే సోషల్ మీడియా సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో స్టైలిష్‌గా కన్పించే ప్రశాంత్ చక్కటి నటన, వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో అందరినీ అలరిస్తున్నాడు. ప్రశాంత్ అంటే ఎవరూ గుర్తు పట్టరు. కానీ ‘ప్రసూబేబి’ అంటే మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఇట్టే గుర్తు పట్టేస్తారు.అనంతపురం కేంద్రంగా...ప్రశాంత్ ఎంటెక్ చదివేందుకు అనంతపురం జేఎన్టీయూలో చేరాడు. చదువుకుంటూనే సీరియస్ యాక్టింగ్ మొదలుపెట్టాడు. నటనపై ఆసక్తి ఉన్న తనలాంటి వారితో కలిసి వీడియోలు రూపొందిస్తున్నాడు. యాక్టింగ్ మొదలుకుని స్క్రిప్టు వరకు అన్నీ తానే చూసుకుంటున్నాడు. ఇప్పటి వరకు 30 మందికిపైగా తనతో కలిసి నటించారు. వారిలో చాలామందికి సొంత యూట్యూబ్ చానళ్లు, ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లు ఏర్పాటు చేయించి వారూ తగిన ఆదాయం పొందేలా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రశాంత్ పాపులారిటీ గుర్తించిన పెద్ద సంస్థలు సైతం అతనితో వ్యాపార ప్రకటనలు చేయిస్తున్నారు. సినిమా ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఇటీవలే దసరా, విరూపాక్ష సినిమాలకు ప్రమోషన్ చేశారు. ఓటీటీ, సినిమా ఆఫర్లు సైతం వస్తున్నాయి.వ్యవసాయ కుటుంబం నుంచి..ప్రశాంత్‌ది వ్యవసాయ కుటుంబం. మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం గారబురుజు గ్రామం. తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులు కాగా, ప్రశాంత్ చిన్న కుమారుడు. ప్రాథమిక విద్య గ్రామంలో చదివాడు. ఇంటర్మీడియట్ వాల్మీకిపురం జూనియర్ కాలేజీలో, బీటెక్ మదనపల్లె ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో చదివాడు.టిక్‌టాక్‌తో మొదలు పెట్టి..మదనపల్లెలో ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతుండగానే నటనపై ఆసక్తితో 2019లో టిక్‌టాక్‌లో లిప్–సింక్ వీడియోలను చేయడం ప్రారంభించాడు. ప్రేమ, మానవత్వం, కుటుంబ ఇతివృత్తంగా వీడియోలు రూపొందించాడు. అవి బాగా ట్రెండింగ్ కావడంతో లక్షల్లో సబ్ స్క్రైబర్లు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో తన దృష్టిని యూట్యూబ్‌పై మళ్లించాడు.పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నంతోనే...పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నంతోనే నేను ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోగలిగాను. సాధించాలన్న బలమైన కోరిక, దానినితోడు సరైన ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళితే మనం తప్పకుండా విజయం సాధిస్తాం. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, కుటుంబంలో ఉండే సంతోషాలు, సరదాలు, సమస్యలే ఇతివృత్తంగా ఎక్కువ వీడియోలు రూపొందించా. ఇవి భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికి కనెక్ట్ అయ్యాయి. ఇదే ఉత్సాహంతో మరింత మంచి కంటెంట్ అందివ్వడానికి ప్రణాళికలు సిద్ధ చేసుకుంటున్నా. వెబ్ సీరిస్‌లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నా.–ప్రశాంత్, ప్రసూబేబీ -
గజదొంగల ముఠాతో యుద్ధం చేస్తున్నాం : సీఎం వైఎస్ జగన్
-
ఉన్న ఊరిని... వ్యవసాయాన్ని వదిలి
వరుణుడు కరుణించలే.. నమ్ముకున్న భూమాత గుప్పెడు గింజలివ్వలే...ఉన్న ఊరు జానెడు పొట్టను నింపలే... చేసేదేమీ లేక పొట్ట చేత పట్టుకుని అయిన వారినంతా వదిలి బతుకు జీవుడా అంటూ వలసి వచ్చారు. ఊరుగాని ఊరులో తెలియని వ్యక్తుల మధ్య కొత్త జీవితానికి నాంది పలికారు. నేడు నలుగురు మెచ్చే స్థాయికి ఎదిగారు. మెరుగైన జీవనంతోపాటు నాలుగు కాసులు వెనకేసుకుంటూ కన్నబిడ్డలను తమలాగా కాకుండా నాలుగు అక్షరం ముక్కలను నేర్పించుకుంటూ జీవనయానం సాగిస్తున్నారు. కడప ఎడ్యుకేషన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లె నియోజక వర్గాల పరిధిలోని 50 గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి కుటుంబాల వారు పానీ పూరి బండ్లే జీవనోపాధిగా ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరంతా గత 18 ఏళ్లకు పైగా కడపతోపాటు జిల్లాలో పలు నియోజకవర్గ, మండల కేంద్రాలలో పానీపూరీ బండ్లను ఏర్పాటు చేసుకుని స్థిర జీవనాన్ని సాగిస్తున్నారు. నీటి వసతి లేక ఉన్న ఊరిని వదిలి... మదనపల్లె, తంబళ్లపల్లె నియోజక వర్గ పరిధిలో దండోరుపల్లె, కురువపల్లె, రెడ్డింపల్లె, బాటవారికురువపల్లె, అమరేపల్లె, వాయల్పాడు, సీటీఎం, బి. కొత్తకోట, పెద్దతిప్ప సముద్రంతోపాటు దాదాపు 50 గ్రామాల పరిధిలో రైతులందరూ వ్యవసాయమే జీవనోపాధిగా జీవనం సాగించేవారు. ప్రతి రైతు రెండు నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న ఆసాములే. అయితే రానురాను సకాలంలో వర్షాలు లేక, సరైన నీటి వసతి లేక.. పంటలు పండక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో చేసేదేమీ లేక వలసలు పోవాల్సి వచ్చేది. ఈ తరహాలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 20 ఏళ్ల క్రితం కడపకు వలసి వచ్చి పానీపూరీ బండితో జీవనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతని బంధువులు ఇలా ఒక్కొక్కరికిగా ఎవరి అçనుకూలమై స్థావరానికి వారు వెళ్లి పానీపూరీ బండ్లను ఏర్పాటు చేసుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. ఇలా వలస వచ్చిన వారే వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి కుటుంబాల వారున్నారు. ఉదయమంతా పానీపూరి తయారీ... సాయంత్రం బండ్ల నిర్వహణ... వలస వచ్చిన వారంతా ఉదయాన్నే పానీపూరి నిర్వహణకు కావాల్సిన కూరగాయలు, సరకులు మార్కెట్ నుంచి తెచ్చుకుని పూరీలు, పానీ, మసాలాలతోపాటు కావాల్సిన వస్తువులన్నీ వారే సొంతంగా సిద్ధం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలోని ప్రధాన కూడళ్లలో వారు వారు ఎంచుకున్న స్థావరాల్లో బండ్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని సాగిస్తారు. రాత్రి 9 గంటలకంతా వ్యాపారాన్ని ముగించుకుని ఇళ్లకు చేరిపోతారు. కూలీ, ఖర్చులు పోను ఇలా ఒక్కో బండిపైన రోజుకు వెయ్యి నుంచి 15 వందల రూపాయల వరకు ఆదాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అంతా ఒకే కులానికి చెందిన వారే... వలస వచ్చిన వారిలో ప్రత్యేకతేంటంటే వేరే వేరే ఊళ్లకు చెందిన వారైనా సరే అంతా ఒకే కులానికి చెందిన వారు కావడం విశేషం. పానీపూరి బండి నిర్వహణ ను ప్రధాన వృత్తిగా మలుచుకుని జీవిస్తున్నారు. 18 ఏళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని... నాపేరు కొల్లె రమణయ్య. మాది దండువారిపల్లె గ్రామం. నాకు మా గ్రామంలో రెండు ఎకరాల పొలం ఉండేది. ఆ పొలం వర్షాధారంతోనే పండేది. వర్షాలు సరిగా రాకపోవడంతో ఉన్న పొలం పండక బీడుగా ఉండేది. జీవనం కష్టం కావడంతో చేసేదేమీ లేక 18 క్రితం పొట్ట చేతపట్టుకుని కడపకు వలస వచ్చాను. అప్పట్లో పానీ పూరి బండిని ఏర్పాటు చేసుకుని ప్లేటు పానీపూరి రూపాయితో వ్యాపారాన్ని మొదలు పెట్టాను. తరువాత నా కుమారులు ఇద్దరితో కూడా ఇదే వ్యాపారాన్ని పెట్టించాను. ఇప్పుడు జీవనం బాగానే ఉంది. ఉన్న ఊరిలో బతకలేక... నా పేరు తొల్లగోర్ల శ్రీరాములు. మాది బి.కొత్తకోట మండలం రాపూరివారిపల్లె. నాకు మా గ్రామంలో 3 ఎకరాల పొలం ఉంది. కానీ నీటి వసతి లేదు. వర్షం వస్తే పంటలు పండాలి లేదంటే ఎండాలి. ఈ తరుణంలో మా బంధువులు పానీపూరీ బండి పెట్టుకుని జీవనం సాగించేవారు. వారి ద్వారా నేను 18 ఏళ్ల క్రితం కడపకు వచ్చి పానీపూరి బండి వ్యాపారాన్ని ప్రారంభించాను. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు పడ్డా రానురాను మెరుగుపడి దేవుడి దయవల్ల బాగానే ఉన్నాను. నా ముగ్గురు పిల్లలను నాలా కాకుండా బాగా చదివించుకుంటున్నాను. కాంట్రాక్టు ఉద్యోగాన్ని వదిలేసి... నాపేరు రేషమ్ మహేష్. మాది అంగళ్లు గ్రామం. నేను చదువు ముగించుకుని హైదరాబాదులో ఏపీ ట్రాన్స్ కోలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. అప్పటో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ట్రాన్స్‌కోలో కాంట్రాక్టు కింద ఉద్యోగం చేసేవారందరిని తొలగించారు. దీంతో చేసేదేమీ లేక మా బంధువుల ద్వారా కడపకు వచ్చాను. అప్పటి నుంచి పానీ పూరి బండి ఏర్పాటు చేసుకుని జీవనం ప్రారంభించాను. 3 ఎకరాల పొలం ఉన్నా ... నాపేరు గంట్ల నారాయణమ్మ, మాది దండువారిపల్లె. మాకు 3 ఎకరాల పొలం ఉండేది. నీటి వసతి లేని కారణంగా పంటలను సకాలంలో సాగు చేసుకోలేక పోయేవాళ్లం. వర్షం వచ్చినప్పుడు పంటలను సాగు చేస్తాము. తరువాత సకాలంలో వర్షం వచ్చి అన్ని అనుకూలిస్తే పంట చేతి కొస్తే వస్తుంది లేదంటే పోతుంది. ఇలా కొన్నేళ్లపాటు పోరాటం చేశాం. అయినా ఏం లాభం ఉండేదికాదు. దీంతో మా కుమారుడిని తీసుకుని కడపకు వచ్చి పానీపూరి బండి ఏర్పాటు చేసుకుని ప్లేటు రూ.3తో వ్యాపారం ప్రారంభించాను. ప్రస్తుతం ప్లేటు రూ. 20కి అమ్ముతున్నాం. -
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
-
చేతులెత్తి నమస్కరిస్తున్నా.. బతకాలని ఉంది
‘చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచారు. ఆర్థిక స్థోమత సహకరించకపోయినా కాయకష్టం చేసి ఇంజినీరింగ్ దాకా నెట్టుకొచ్చారు. ఇప్పుడు మాయదారి రోగం నన్ను కుంగదీస్తోంది. ఉద్యోగం చేసి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఉంది. వారికి సేవ చేసి రుణం తీర్చుకోవాలని ఉంది. నన్ను బతికించండి. దాతలు ముందుకొచ్చి ప్రాణాలు కాపాడండి’ అంటూ ఆ చదువుల తల్లి కళ్లనిండా నీళ్లు పెట్టుకుని.. చేతులెత్తి నమస్కరిస్తూ దీనంగా అభ్యర్థిస్తుండడం కలచివేసింది. ఈ ఘటన మదనపల్లెలో శనివారం పలువురిని కదిలించింది. చదవండి: ఊ అంటావా బాబూ.. ఉఊ అంటావా.. మదనపల్లె సిటీ: వైఎస్సార్ జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం, కోనపేటకు చెందిన రాయవరం చంద్రమోహన్, దేవి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి ఏకైక కుమార్తె ఆర్.హిమజ. కడపలోని కందుల ఓబుల్‌రెడ్డి మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం చంద్రమోహన్ కుటుంబసభ్యులతో కలిసి మదనపల్లె పట్టణ శివారు ప్రాంతమైన శ్రీవారినగర్‌కు వచ్చారు. స్థానిక నీరుగట్టువారిపల్లెలోని టమటా మార్కెట్ యార్డులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం హిమజ తీవ్ర అస్వస్థతకు గురైంది. కుబుంబ సభ్యులు బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పుట్టకతోనే ఆమెకు ఓ కిడ్నీ లేదని, మరో కిడ్నీ పాడైందని అక్కడి వైద్యులు తేల్చారు. వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని, అప్పటి వరకు డయాలసిస్ చేయిస్తుండాలని సూచించారు. కిడ్నీ మార్పిడి చేయాలంటే రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. రెండు నెలల నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ఇప్పటికే బిడ్డ ఆరోగ్యం కోసం రూ.3 లక్షల వరకు ఖర్చు పెట్టారు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ – 9502058163, ఎస్బీఐ, మదనపల్లె బ్రాంచ్, అకౌంట్ నం.35877578698, ఐఎఫ్ఐసీ కోడ్ : ఎస్బీఐఎన్ 0003748. -
భార్యపై అనుమానం.. చివరికి ఏం చేశాడంటే..?
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): భర్త చేతిలో భార్య హతమైన సంఘటన స్థానిక శివాజీనగర్‌లో చోటుచేసుకుంది. టూటౌన్ సీఐ నరసింహులు, ఎస్ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు..శివాజీనగర్‌కు చెందిన లోకేష్ ఇంటింటికీ వాటర్ క్యాన్లు సరఫరా చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి భార్య గాయిత్రి(30) ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె నిషిత ఉంది. గాయిత్రి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకునితో చనువుగా ఉంటోదని తెలుసుకున్న లోకేష్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అతను ఇంటికి వచ్చేవేళకు ఆమె మరో వ్యక్తితో మాట్లాడటం చూసి గొడవపడ్డాడు. ఇది తారస్థాయికి చేరడంతో కత్తితో ఆమెను పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. టూటౌన్ సీఐ, ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. చదవండి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య -
మదనపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో పేలుళ్ల కలకలం
సాక్షి, చిత్తూరు: మదనపల్లిలోని ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్ళు కలకలం సృష్టించాయి. భవన నిర్మాణం కోసం డీమార్ట్ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లను పేల్చారు. భారీగా పేలుడు సంభవించడమే గాక బండరాళ్లు ఆ పరిసరాల్లోని నివాస గృహాలపై పడ్డాయి. దీంతో పలు ఇళ్లు దెబ్బతినడంతో పాటు ఐదుగురికి గాయాలుకాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డీమార్ట్ సంస్థపై స్థానికుల మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డ నాలుక కోసి తల్లి తినేసిందనేది అవాస్తవం
సాక్షి, మదనపల్లె(చిత్తూరు జిల్లా): మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులైన తల్లిదండ్రులు చేసినవి క్షుద్ర పూజలు కాదు.. రుద్రపూజలని హైకోర్టు న్యాయవాది రజని తెలిపారు. బిడ్డ నాలుక కోసి తల్లి తినేసిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. నిందితుడు పురుషోత్తం నాయుడిని హైకోర్టు న్యాయవాది రజని మదనపల్లె సబ్‌జైలులో శనివారం కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వీరికి శిక్ష వేయడం కంటే.. ప్రేరేపించిన వ్యక్తులను శిక్షించాల్సిన అవసరముందన్నారు. ఆధ్యాత్మిక శక్తిలో క్షుద్రుడు, రుద్రుడు.. రెండు రకాలని పేర్కొన్నారు. వీరు చేసింది రుద్రపూజలని చెప్పారు. ఆడపిల్లలకు రక్షణ లేదని బలంగా నమ్మడం వల్లే పెద్దమ్మాయి అలేఖ్య ఆధ్యాత్మిక శక్తి తెచ్చుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిసిందని న్యాయవాది రజని చెప్పారు. చదవండి: (నేను మూడో కన్ను తెరిస్తే భస్మమే : పద్మజ) అలేఖ్య భోపాల్‌లో ఉన్నప్పుడు స్పిర్చ్యువల్ పవర్ నేర్చుకున్నట్లు ఆమె తండ్రి చెప్పారన్నారు. చదువులో ఉన్నతస్థితి సాధించి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు నిరోధిస్తానని ఆమె చెప్పేదని తెలిసిందన్నారు. బిడ్డలను చంపేందుకు డంబెల్ ఉపయోగించారని పోలీసులు చెబుతున్నా.. తల్లిదండ్రులు మాత్రం దానిని శివుడి ఢమరుకంగా భావించి ఉంటారన్నారు. ‘నేనే శివుడ్ని..’ అనుకుంటూ డంబెల్‌ను ఢమరుకంగా భావించి తలపై కొడితే బిడ్డ తిరిగి వస్తుందనే భ్రమతో కొట్టి ఉంటారన్నారు. పిల్లలిద్దరూ చనిపోయారని తల్లిదండ్రులిద్దరూ ఇంకా భావించట్లేదని చెప్పారు. పూజ మధ్యలో పోలీసులు షూలతో వెళ్లి గదిని అపవిత్రం చేసి.. పిల్లల దేహాలను తీసుకెళ్లడం వల్లే వారు తిరిగి రాలేదనే భ్రమలో ఉన్నారన్నారు. జైలులో దూరంగా ఉంచి మాట్లాడించడం వల్ల.. పూర్తిస్థాయిలో విషయాలు తెలుసుకోలేకపోయానని చెప్పారు. చదవండి: (జంట హత్యల కేసు: అమ్మాయిల చెవిలోఊదిందెవరు?) పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ రవిమనోహరాచారి అక్కచెల్లెళ్లు అలేఖ్య, సాయిదివ్య హత్యలకు సంబంధించి తల్లిదండ్రులతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. ఇప్పటివరకు 10 మందిని విచారించినట్లు చెప్పారు. హత్య జరగడానికి ముందు వారింటికి ఎవరెవరు వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. భోపాల్‌లో అలేఖ్యకు ఓ ట్రస్టుతో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. చదవండి: (ఇంకా మూఢత్వంలోనే.. తానే శివుడు, అవంతికనంటూ) -
ప్రేమ వివాహం.. 6 నెలలు తిరక్కుండానే
సాక్షి, చిత్తూరు: మదనపల్లి మండలం నిరుగట్టువారిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి.. పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. ఏడాది కూడా తిరగకుండానే.. తిరిగిరాని లోకాలకు వెళ్లింది. వివరాలు.. నిరుగట్టువారి పల్లెకు చెందిన ఉమ, రామాంజనేయులు ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆనందంగా సాగాల్సిన ఆమె జీవితం.. అర్థాంతరంగా ముగిసింది. రామాంజనేయులు భార్య ఉమను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఉరి వేసుకుని మరణించినట్లు చిత్రీకరించి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండి: మా ఇంట్లో దేవుళ్లున్నారు, మళ్లీ పుడతారు) -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, మదనపల్లె: మదనపల్లె మండలంలో ఓ ప్రేమజంట శుక్రవారం రాత్రి పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితులు, ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం మేరకు, మదనపల్లె మండలం చీకిలబైలుకు చెందిన అమర(22) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వలసపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన స్రవంతి(22) పుంగనూరు రోడ్డులోని 150మైలు వద్ద ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. (ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య) ఇద్దరూ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఇరువురి కుటుంబసభ్యులు వీరిని మందలించారు. దూరం చేస్తారన్న మనస్తాపంతో కృష్ణాపురం సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు బాధితులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సంఘటనపై రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (మైనర్‌తో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్) -
బాలుడి ప్రాణాలను బలికొన్న సెల్ ఫోన్ చోరీ
సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ చోరీ మైనర్ బాలుడిని బలికొన్న ఘటన చిత్తూరులోని మదనపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఈశ్వమ్మ కాలనికి చెందిన మైనర్ బాలుడు భరత్ రెండు రోజు క్రితం బంధువుల ఇంట్లో ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగలించాడు. తన దొంగలించిన ఫోన్ స్థానికి మొబైల్ షాపులో 2500 రూపాయలకు విక్రయించాడు. సెల్‌ఫోన్ కనింపచకుండా పోవడంతో భరత్‌ను బంధువులు ఆరాతీయడంతో భరత్ తానే దొంగలించినట్లను ఒప్పుకున్నాడు. అనంతరం బాలుడు తాను అమ్మిన షాపు వద్దకు వెళ్లి సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వాలని షాపు యజమాని చాంద్ భాషాను కోరాడు. షాపు యజమాని సెల్ ఇవ్వకపోగా బాలుడిని చిత్ర హింసలకు గురిచేశాడు. చాంద్ భాష కొట్టిన దెబ్బలకు తీవ్ర అస్వస్థకు గురై భరత్ ఇవాళ మృతి చెందాడు. దీంతో షాపు యజమాని చాంద్ భాషపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు శనివారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన విద్యార్థిని బి.కొత్తకోట ఏపీ మోడల్ స్కూల్లో చదువుతోంది. అదే పాఠశాలలో నగరి నియోజకవర్గానికి చెందిన నవీన్ తెలుగు ఉపాధ్యాయుడు. సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థిని ఇంటికొచ్చింది. ఈ క్రమంలో నవీన్ గురువారం ఆమెను కలిసి పాఠశాలకు సంబంధించిన వివరాలు మాట్లాడాలని చంద్రాకాలనీ గురుకుల పాఠశాలలో పనిచేసే తన పినతల్లి ఉండే క్వార్టర్స్‌కు తీసుకెళ్లాడు. ఆ సమయంలో పినతల్లి ఇంట్లో లేకపోవడంతో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికకు పట్టణంలోని ఓ థియేటర్లో సినిమా చూపించి, ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. తమ కుమార్తె ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వర్షిత కేసు; ‘నిందితుడిని ఉరి తీయాలి’
సాక్షి, చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత(5) హత్య కేసులో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వర్షిత హత్యకు కారకులను ఉరి తీయాలని కుటుంబ సభ్యులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు విద్యార్థులు మద్దతు తెలిపి ర్యాలీ నిర్వహించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా హెటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఎక్కి విద్యార్థులు నిరసన తెలిపారు. అనంతరం మదనపల్లిలో సబ్ కలెక్టర్ చేకూరి కీర్తిని కలిసి నిందితుడు మహ్మద్ రఫీకీ ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నెల 7వ తేదిన తమ మూడవ కూతురు వర్షితను తీసుకొని తల్లిదండ్రులు ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరవ్వగా.. నిందితుడు రఫీ మండపం నుంచి వర్షితను తీసుకెళ్లి అత్యాచారం చేసి తరువాత హత్య చేసి మరునాడు కల్యాణ మండపం వెనుక గుట్టుగా పడేసిన విషయం తెలిసిందే. కాగా చిన్నారి వర్షిత హత్యాచారం కేసులోని ప్రధాన నిందితుడు పఠాన్ మహ్మద్ రఫీ (25)ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
‘లడ్డూలు తినాలన్న కోరికే ఇలా మార్చింది’
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ఐదు దశాబ్దాల కాలంలో 36 దేశాల్లో 37 వేలకుపైగా ఇంద్రజాల ప్రదర్శనలు. 4 ప్రపంచ రికార్డులు. వేలాది సన్మానాలు. ఇంద్రజాలంతో వయోబేధం లేకుండా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అసమాన∙ప్రతిభ కలిగిన వ్యక్తి అతను. ఆయనే జాదూగర్ ఆనంద్‌గా ప్రసిద్ధికెక్కిన ప్రముఖ ఇంద్రజాలికుడు ఆవíస్తి ఆనంద్. ఇంద్రజాల ప్రదర్శనలో భాగంగా మదనపల్లెకు వచ్చిన ఆయనతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. సాక్షి : మీ పేరు...కుటుంబ నేపథ్యం? ఆనంద్ : నా పేరు ఆవస్తి ఆనంద్. మాది మధ్యప్రదేశ్ రాష్ట్రం, జబల్పూర్ నగరం. 1952లో జనవరి 3న జన్మించాను. మాది ఉన్నత విద్యావంతుల కుటుంబం. నాన్న ఏ.పి.అవస్తి, వృత్తిరీత్యా వైద్యుడు. అమ్మ మహేశ్వరిదేవి ఫ్రొఫెసర్. జబల్పూర్లో పాఠశాల విద్య,ఇండోర్‌లో మెట్రిక్యులేషన్, డిగ్రీ, పీజీ పూర్తి చేశాను. మా అమ్మానాన్నలకు నలుగురు సంతానం. ముగ్గురు అక్కయ్యలు. నేను చివరి వాడిని. సాక్షి : మీకు ‘జాదూగరి’వైపు దృష్టి ఎప్పుడు మళ్లింది? ఆనంద్ : నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్లేదారిలో కొందరు గారడీ చేసేవారు. రోజూ అక్కడికి వెళ్లి గారడీ చూసేవాడిని. వారు గాల్లో నుంచి నాకు లడ్డూలు తీసి ఇచ్చేవారు. రోజూ లడ్డూలు ఉచితంగా తినేవాడిని. కొన్ని రోజులయ్యాక గారడీవారు మకాం మార్చేస్తే, లడ్డూలు తినడానికి అలవాటుపడిన నాకు లడ్డూల మీద ఉన్న కోరికతో వారిని వెతుక్కుంటూ వెళ్లేవాడిని. ఆ సమయంలో స్వతహాగా నేను కూడా గారడీ చేసి లడ్డూలు తయారు చేయాలని అనుకున్నా. ప్రయత్నించి విఫలమయ్యాను. కానీ ప్రయత్నం వదలలేదు. ఎక్కడ గారడీ, మ్యాజిక్ షోలు జరిగినా వెళ్లి చూసేవాడిని. అలా ..అలా చిన్నపాటి మేజిక్‌లు నేర్చుకుని, మా స్కూల్లో ప్రదర్శించి, అందరి మన్ననలు పొందేవాడిని. గణేష్, దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలలో నా ప్రదర్శనలు ఇచ్చేవా డిని. వారు ఇచ్చే డబ్బులు అమ్మా,నాన్న పాకెట్ మనీతో ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకాలను కొనేవాడిని. అలా మొదలైన నా ప్రస్థా నం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి ‘జాదూగర్’గా మార్చింది. ∙నాకు గురువులు ఎవరూలేరు. స్వయంకృషితో ఈ స్థాయికి చేరా. సాక్షి : మీకు తల్లిదండ్రుల సహకారం ? ఆనంద్ : లేదు. మా అమ్మానాన్నలు నన్ను కూడా డాక్టర్ చేయాలనుకున్నారు. నేను మెజీషి యన్ అవడం ఏమాత్రం వారికి ఇష్టం లేదు. సాక్షి : మేజిక్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఆనంద్ : 18 ఏళ్ల వయసులో ‘ఇంద్రజాలం’ చేయడం ప్రారంభించా. అంతే కాదు ఒళ్లు గగు ర్పొడిచే నదిలో ‘అండర్ వాటర్ ఎస్కేప్ విన్యా సాన్ని 40 సెకండ్లలో ప్రదర్శించి బయటకు వచ్చేశా. ఇది కూడా స్వతహాగానే నేర్చుకున్నా. సాక్షి : ఎన్ని రికార్డులు సాధించారు? ఆనంద్ : ఇప్పటి వరకు నేను 4 ప్రపంచ రికార్డులు సా«ధించా. 18 ఏళ్ల వయస్సులో అండర్ వాటర్ ఎస్కేప్‌గా మొదటి రికార్డు. 19 ఏళ్లప్రాయంలో బ్లైండ్ ఫోల్డ్‌ఫో నిర్వహించి రెండో ప్రపంచ రికార్డు సాధించా. ఇండోర్ నుంచి భూపాల్ వరకు 210 కిలోమీటర్లు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ మీద ప్రయాణం చేయడం. 36 దేశాలలో 37 వేలకుపైగా ప్రదర్శనలు నిర్వహించి మూడో ప్రపంచ రికార్డు సాధించా. అత్యంత వేగవంత మెజీషియన్‌గా 4వ ప్రపంచ రికార్డు సాధించా. సాక్షి : ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు? ఆనంద్ : ఇంద్రజాలాన్ని ప్రభుత్వాలు ఓ కళగా గుర్తించాలి. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో మ్యాజిక్ అకాడమీలు ఏర్పాటు చేసి ఇంద్రజాలాన్ని ప్రోత్సహించాలి. -
కూలికి రాలేదని ట్రాక్టర్‌తో తొక్కించాడు
-
కూలీకి రానందుకు ట్రాక్టర్‌తో తొక్కించాడు
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కృష్ణాపురంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కూలీకి రానందుకు ట్రాక్టర్ యజమాని డ్రైవర్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. అడ్డుకోబోయిన డ్రైవర్ బంధువును కూడా ట్రాక్టర్‌తో తొక్కించాడు. ఈ ఘటనలో డ్రైవర్ హరి ప్రసాద్‌తో పాటు ఆయనకు మద్ధతుగా వచ్చిన నాగభూషణం కూడా మరణించారు. ట్రాక్టర్ యజమాని చంద్రానాయక్ ఘటన జరిగిన వెంటనే పరారయ్యారు. అనారోగ్యంతో హరిప్రసాద్, ఆయన సోదరుడు నాగభూషణం కూలీకి వెళ్లనట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఘటన అనంతరం చంద్రా నాయక్ ఇంటిపై బాధితుల కుటుంబసభ్యులు దాడికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఇలాంటి గొడవలు ఊరిలో మంచిది కాదని వారించడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అనంతరం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి శవాలను తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక.. ప్రైవేటు భూములే మిగిలాయి..!
సాక్షి టాస్క్‌ఫోర్స్: మదనపల్లె పట్టణంలో గూడులేని పేదవాడికి సెంటు స్థలం ఇవ్వాలంటే మీనమేషాలు లెక్కించే రెవెన్యూ అధికారులు.. అధికారం అండగా టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములన్నింటినీ దర్జాగా కబ్జా చేస్తున్నా చూస్తుండిపోయారు. నకిలీ పట్టాలు, పత్రాలతో యథేచ్చగా రూ.వేల కోట్ల విలువ చేసే వందల ఎకరాల భూములు స్వాహా చేస్తున్నా.. ఎందుకు వచ్చిన గొడవలే అని ఊరకుండిపోయారు. ఫలితంగా ప్రభుత్వ భూములకు ప్రహరీగోడలు ఏర్పాటు చేసుకుని రియల్ ఎస్టేట్ ముసుగులో వెంచర్లు వేసి అమ్మేందుకు సిద్ధమయ్యారు. పట్టణంలోనే డీకేటీ బ్రదర్స్‌గా పేరుమోసిన టీడీపీ నాయకుల్లో ఒకరిని ఏకంగా ముఖ్యమంత్రి మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే అభద్రతా భావంలో ఉంటున్న ప్రజలకు ఈయన ఎమ్మెల్యేగా అయితే ప్రైవేటు భూములు వదలిపెట్టడన్న బెంగ పట్టుకుంది. మాజీ సైనికుల భూముల్లో టీడీపీ కార్యాలయం.. బీకే.పల్లెలోని సర్వేనెంబరు 8లో ఉన్న భూమి చెరువు పొరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. దీనిపక్కనే ఉన్న స్థలాన్ని మాజీ సైనికులకు ఇళ్ల పట్టాల కింద ప్రభుత్వం కేటాయించింది. సర్వేనెంబర్ 8/1లో 142 మంది మాజీ సైనికులకు 2సీ పట్టాలు ఇచ్చారు. దీనిపై కన్నేసిన టీడీపీ అభ్యర్థి ఇదే నెంబరులో 2.07 ఎకరాల భూమిని మాజీ సైనికుడు ఇంద్రసేన రాజు పేరుతో 1984 సెప్టెంబర్ 23న పట్టా ఇచ్చినట్లు తహసీల్దార్ సంతకాలతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. 2016 జూన్‌లో ఇంద్రసేన రాజుకు చెందిన భూమిని అనంతపురం జిల్లాకు చెందిన జాస్తి నాగేంద్ర పేరుతో జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. 2016 ఆగస్టులో నాగేంద్ర నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే నెంబరు చెరువు పొరంబోకుగా ఉన్నందున రిజిస్ట్రేషన్‌కు అనుమంతించమని అధికారులు సూచిస్తే హైకోర్టును ఆశ్రయించారు. రెండుసార్లు తీర్పు ప్రతికూలంగా వచ్చింది. మూడోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం మాజీ సైనికులకు, అభ్యర్థి దొమ్మలపాటి రమేష్‌కు మధ్య వివాదం కోర్టులో నడుస్తోంది. భూముల విషయంలో మాజీ సైనికులపై దొమ్మలపాటి రమేష్ అనుచరులు మాజీ సైనికులను గాయపరిచిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం ఆక్రమిత స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. విలేకరులకు కేటాయించిన భూమిని కూడా.. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి ఆక్రమణలో ఉన్న జర్నలిస్టులకు కేటాయించిన స్థలం మదనపల్లె బైపాస్ రోడ్డులో జర్నలిస్టులకు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు స్థలాన్ని ఎంపిక చేశారు. స్కెచ్ సహా వేసి జర్నలిస్టులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించి స్థలాన్ని చూపించి చదును చేసుకోమన్నారు. విలేకరులు హౌసింగ్ కమిటీగా ఏర్పడి స్థలాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో భూమికి తప్పుడు పత్రాలను సృష్టించి 3.5 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. జర్నలిస్టులకు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వ భూమి కాదని, తనదేనంటూ బెదిరింపులకు దిగారు. చంద్రాకాలనీ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుచరుడితో కలిసి భారీ వెంచర్ వేశారు. అందుకు సంబం ధించి అన్ని అనుమతులున్నట్లు ప్లాట్లు కావాల్సిన వారు సంప్రదించాలని బోర్డులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా టీడీపీ నాయకుల అక్రమాలపై విచారణ చేపట్టాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు. ఇతర నియోజకవర్గానికి పాకిన ఆక్రమణలు తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు రెవెన్యూ పరిధి 111 సర్వేనెంబరులోని 22 ఎకరాల ప్రభుత్వభూమిని పేదలకు పంపిణీ చేయాలని రెవె న్యూ అధికారులు నిర్ణయించారు. సర్వేనెంబర్‌ను 13 భాగాలుగా డివిజన్ చేసి వాటిలో 111/2,4,5,8,9,11,13 సర్వే నెంబర్లలో భూమి వ్యవసాయానికి పనికిరాదనే ఉద్దేశంతో పంపిణీ చేయలేదు. మిగతాభూమిని అర్హతను ఆధారంగా చేసుకుని రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు పట్టాను ఇచ్చారు. అంగళ్లు గ్రామానికి చెందిన తిరుమలక్క, కమలమ్మ, యల్లయ్య, బొగ్గుల ఏసయ్య, రామలింగమ్మలకు పంపిణీ చేశారు. ఈ భూమి అనంతపురం హైవేకి పక్కగా ఉండటం, కోట్ల విలువ చేసేది కావడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ ఆయన కుటుంబసభ్యులు వీరిని బెదిరించి భూమిని ఆక్రమించుకున్నారు. 111/5 సర్వేనెంబర్లో 42 సెంట్లు పెద్ద బండ ఉంది. దీనిని ఎవరికి పంపిణీ చేయకుండా వదిలేయడంతో మొదట దీన్ని ఆక్రమించుకున్నారు. బండరాయిని 1.33 ఎకరాల భూమిగా చూపిస్తూ దొమ్మలపాటి రమేష్ బావ కృష్ణమూర్తినాయుడు పేరుతో పట్టా చేయించుకున్నారు. వీటికి కొత్త సర్వేనెంబర్లు 111/3ఈ, 569/9, 111/3డీ, 142/1, 192 సర్వేనెంబర్లతో 4 ఎకరాల భూమిని భార్య సరళ పేరుతో పట్టా చేసుకున్నారు. 111/3డీ సర్వే నెంబరుతోనే భార్య, బామ్మర్ది శ్రీనివాస రెడ్డి, అక్క పేరుతో దొంగ పట్టాలు సృష్టించుకున్నారు. రెవెన్యూ రికార్డులో ఈ సర్వేనెంబర్లు లేకపోవడం ప్రస్తావించదగ్గ విషయం. కేవలం ఈ నెంబర్లతోనే మొత్తం భూమిని ఆక్రమించుకుని పేదోళ్ల పొట్ట కొట్టారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేశారనే ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. -
ర్యాగింగ్ భూతానికి ఇంజనీరింగ్ విద్యార్థిని బలి
-
కేసు పెట్టి.. పరువు తీసిందని..
మదనపల్లె క్రైం : వేర్వేరుగా ఉండడంతోపాటు తప్పుడు కేసులు పెట్టి బంధువుల్లో తలవంపులు తెస్తోందని కట్టుకున్న భార్యను కడతేర్చాలని భర్త పథకం వేశాడు. కిరాయి హంతకులతో హత్య చేయించాడు. గత నెల 30న మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో జరిగిన మహిళా న్యాయవాది నాగజ్యోతి(40) హత్య కేసును మూడు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. సూత్రధారి అయిన భర్త జితేంద్ర(45)ని అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో ఉంటున్న ప్రముఖ న్యాయవాది జితేంద్రకు నాగజ్యోతితో 23 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలానికి వీరి మధ్య కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఆ గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో రెండేళ్ల క్రితం విడిపోయి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కేసు పెట్టి.. పరువు తీసిందని.. ఎనిమిది నెలల క్రితం నాగజ్యోతి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో భర్త జితేంద్రపై తప్పుడు కేసు పెట్టింది. అంతేకాకుండా ఆమె కూడా న్యాయవాది కావడంతో నిత్యం అదే కోర్టులో భర్తకు ఎదురుపడుతూ దూషించేది. బంధువుల్లో తలవంపులు తీసుకువస్తుండడంతో జితేంద్ర తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ఒక కేసులో న్యాయం పొందడానికి తనను ఆశ్రయించిన నిందితుల్లో కొందరిని ప్రలోభ పెట్టాడు. వారితోపాటు మరికొంత మంది సాయంతో భార్యను హత్యచేసేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలోనే ఆమె కదలికలను పసిగట్టిన కిరాయి హంతకులు గత నెల 30వ తేదీన మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో కోమటివానిచెరువు కల్వర్టు వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న నాగజ్యోతిని హత్య చేయించాడు. సీరియస్‌గా తీసుకున్న డీఎస్పీ పట్టపగలు మహిళా న్యాయవాది హత్యకు గురికావడాన్ని సీరియస్‌గా తీసుకున్న డీఎస్పీ చిదానందరెడ్డి నాలుగు బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. భర్త తీరుపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు. న్యాయవాది జితేంద్రపై సెక్షన్ 302 రెడ్‌విత్ 34 కింద కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఇంకా కొంతమందిపై కేసు విచారణలో ఉందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. మహిళా న్యాయవాది హత్య కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులకు నగదు అవార్డులు, రివార్డులు ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారని డీఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో సీఐలు సురేష్‌కుమార్, నిరంజన్‌కుమార్, ఎస్ఐలు క్రిష్ణయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
6, 7 తేదీల్లో డా. ఖాదర్ సదస్సులు
అటవీ కృషి నిపుణులు, సిరిధాన్యాలు–కషాయాలతో షుగర్ నుంచి కేన్సర్ వరకు ఏ వ్యాధినైనా జయించవచ్చని ప్రచారోద్యమం నిర్వహిస్తున్న తెలుగు స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి చిత్తూరు జిల్లా మదనపల్లి రానున్నారు. మే 6న సా. 4 గంటలకు మదనపల్లిలోని బీటీ కాలేజీ ఆడిటోరియంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మే 7వ తేదీ ఉ. 11 గంటలకు మదనపల్లికి సమీపాన అంగళ్లులోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(మిట్స్) ఆడిటోరియంలో ప్రసంగిస్తారు. సభికుల ప్రశ్నలకు జవాబులిస్తారు. ఏయే జబ్బులకు ఏయే సిరిధాన్యాలు, కషాయాలు వాడాలో చెబుతారు. అటవీ చైతన్యం ద్రావణంలో అటవీ కృషి పద్ధతిలో సిరిధాన్యాల సాగు విధానాన్ని వివరిస్తారు. వివరాలకు.. ‘మిట్స్’ కాలేజీ పీఆర్వో మారుతీప్రసాద్–90520 77747, ఎంసీవీ ప్రసాద్ (ప్రకృతివనం) –91107 63014 6న బసంపల్లిలో గోఆధారిత ప్రకృతి సేద్యంపై శిక్షణ అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లిలోని శ్రీఅమరణరేయన స్వామి దేవస్థానం ఆవరణలో మే 6న(ప్రతి నెలా మొదటి ఆదివారం) ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు రైతులకు సీనియర్ రైతు నాగరాజు దేశీ గోఆధారిత ప్రకృతి సేద్యంపై శిక్షణ ఇవ్వనున్నారు. రుసుము రూ. 100. వివరాలకు. నాగరాజు– 94407 46074, పార్థసారధి– 96636 67934, లక్ష్మయ్య – 94405 66069. జూన్ 1 నుంచి ‘చో’ సహజ సాగు పద్ధతిలో కూరగాయలు, ఔషధ మొక్కల సాగుపై ఉచిత శిక్షణ దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యూ సహజ సాగు, చింతల వెంకటరెడ్డి(సీవీఆర్) మట్టి ద్రావణం వాడే పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలతోపాటు.. కలబంద, మునగ ఆకు, మునగ కాయల సాగు, విక్రయాలపై జూన్ 1వ తేదీ నుంచి 41 రోజుల పాటు పొలాల్లో ఆచరణాత్మక ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివశంకర్ షిండే తెలిపారు. కనీసం టెన్త్ చదివి 18 ఏళ్లు నిండిన వారు మే 8వ తేదీ లోగా 70133 09949 నంబరుకు వాట్సప్/టెలిగ్రామ్ మెసేజ్ పంపాలి. -
టీడీపీ నాలుగేళ్లపాలనలో అభివృద్ధి ఏదీ?
మదనపల్లె : నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో, ఎవరికి మేలు జరిగిందో తెలపాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవిని త్యజించి, ఆమరణ దీక్షల అనంతరం శనివారం తొలిసారి జిల్లాకు వచ్చిన మిథున్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అధ్యక్షతన అభినందన, ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. స్థానిక మిషన్ కాంపౌండ్‌లో జరిగిన ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పెద్దిరెడ్డి అభిమానులు హాజరయ్యారు. మిథున్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మాటలు తప్ప ప్రజ లకు ఒరిగిందేమీ లేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, పేదలకు ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందలేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 12 నెలల్లో మనందరికీ మేలు జరుగనుందని, మనందరం కోరుకునే రాజన్న రాజ్యం వస్తుం దని తెలిపారు. చిన్నవయస్సులోనే ఎంపీ అయిన తాను మూడున్నరేళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మదనపల్లెలో జరుగుతున్న ఈ సభ భవిష్యత్తులో ప్రజాసంక్షేమం కోసం చేయబోయే పోరాటాలకు ఆరంభమని చెప్పారు. ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఐదు కోట్ల ఆంధ్రు ల హక్కని, పదవి ముఖ్యం కాదు, ప్రజాసంక్షేమం ముఖ్య మని రాజీనామా చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలి చిన మిథున్ రెడ్డిని అభినందిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు చేసింది ధర్మదీక్ష కాదని, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా రూ.30 కోట్ల ఖర్చుతో చేసిన కర్మదీక్షని విమర్శించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి కష్టపడుతుంటే.. ఆయన బాటలో నడుస్తున్న మిథున్‌రెడ్డి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ద్వారకనాథ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో కొత్తగా చేరిన నాయకుడు పుంగనూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ సవాళ్లకు బెదిరేది లేదని, దీటుగా సమాధానమిస్తామని హెచ్చరించారు. తంబళ్లపల్లె ప్రజలు తనపై చూపుతున్న అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటా నని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు జంగాలపల్లె శ్రీనివాసులు, పోకల అశోక్ కుమార్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గాయత్రీదేవి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ రెడ్డెమ్మ, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్, షమీం అస్లాం ప్రసంగించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బాబ్జాన్, ఉదయ్‌కుమార్, ఎంపీపీ సుజనా బాలకృష్ణారెడ్డి, జరీనా బేగం, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, దేశాయ్ జయదేవ్ రెడ్డి, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, ఫర్జాన రఫీ, మస్తాన్ రెడ్డి, ఖాజా, బాలగంగాధర రెడ్డి, మహమ్మద్ రఫీ, వెంకటరమణారెడ్డి, సుగుణాఆంజనేయులు, ముక్తియార్, షరీఫ్, ఎస్.ఏ.కరీముల్లా, ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున, మండల ఉపాధ్యక్షుడు ఆనంద పార్థసారధి, సర్పంచ్ శరత్ రెడ్డి, నాగరాజరెడ్డి, దండు కృష్ణారెడ్డి, చేనేత, వాణిజ్య విభాగం భువనేశ్వరి సత్య, గార్ల చంద్రమౌళి, దండాల రవిచంద్రారెడ్డి, లియాఖత్ అలీ, మస్తాన్ ఖాన్, సురేంద్ర, మహేష్, రోలింగ్ మల్లిక పాల్గొన్నారు. వెల్లువెత్తిన ప్రజాభిమానం మదనపల్లె : ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా మదనపల్లె నియోజకవర్గానికి వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ఉదయం 7.30 గంటలకు బెంగళూరుకు చేరుకున్న ఆయనకు విమానాశ్రయం నుంచే ఆత్మీయ స్వాగతాలు మొదలయ్యాయి. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకుని సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన ఆయనకు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో వేచివున్న వేలాది మంది అభిమానులు పూలవర్షం కురిపించారు. మహిళలు కర్పూర హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 500 వాహనాల్లో అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. వాహనాల వెంబడి బైక్‌లపై ర్యాలీ చేస్తూ జై జగన్, జై మిథున్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. -
మదనపల్లెలో పట్టపగలు భారీ చోరీ
మదపసల్లె క్రైం : మదనపల్లె పట్టణంలో గురువారం పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. బీరువా లాకర్లను ధ్వంసంచేసి అందులో ఉన్న 300 గ్రాముల బంగారు నగలు, రూ.లక్ష నగదు అపహరించారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కదిరి రోడ్డు న్యాయమూర్తుల బంగ్లా సమీపంలో నివాసం ఉంటున్న పరుపుల వ్యాపారి దర్బార్‌బాషా, అతని భార్య దిల్షాద్ గురువారం ఉదయం ఇంటికి తాళం వేసుకుని ఎస్టేట్‌లో పరుపులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోనికి వెళ్లి పరిశీలించారు. బీరువాలు, కప్‌బోర్డులను పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఈ విషయమై వన్‌టౌన్ ఎస్ఐ సుమన్‌ను వివరణ కోరగా చోరీపై తమకు ఫిర్యాదు అందిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో ఇంజినీర్ దారుణ హత్య
-
ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి
సాక్షి, మదనపల్లి: చిత్తూరుజిల్లా మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్ నుంచి పొట్ట చేతబట్టుకుని వచ్చిన ఓ కుటుంబంలోని ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో మదనపల్లికి వచ్చి బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటూ స్థానిక ఎస్ బి ఐ కాలనీలో రోడ్డు పక్కన గుడారం వేసుకుని ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో బెంగళూరుకు చెందిన గంగాధర(42) అనే వ్యక్తి అటుగా వచ్చాడు. అక్కడున్న 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న స్థానికులు గమనించి గంగాధరకు దేహశుద్ధి చెయ్యగా అతను పరారయ్యాడు. మదనపల్లి 2వ పట్టణ పోలీసు స్టేషన్లో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
జన్మభూమికి వెళ్లకపోతే విద్యార్థులకు టీసీలే
చిత్తూరు జిల్లా: మంత్రి పాల్లొనే జన్మభూమి కార్యక్రమానికి వెళ్లకపోతే టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తామని బీటీ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హుకుం జారీ చేసింది. యాజమాన్య తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉన్న అందరికీ టీసీలు ఇచ్చేయండి అంటూ గేట్లకు తాళం వేసి యాజమాన్య పద్దతులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో చారిత్రక నేపధ్యం కల బీటీ కాలేజీని నాశనం చేసేందుకు ప్రైవేటు వ్యక్తులు చూస్తున్నారని, కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టే పనులు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. బలవంతంగా రాజకీయపార్టీల కార్యకలాపాలకు విద్యార్థులను వినియోగించుకోవడం దారుణం అని వాపోయారు. ఇప్పటికైనా ప్రైవేట్ వ్యక్తులను కాలేజీకి దూరంగా పెట్టి తమ కళాశాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. -
మానవత్వం మంటగలిసిన వేళ..
సాక్షి, మదనపల్లె టౌన్: పోనుపోను మనుషుల మధ్య సంబంధాలు తీసికట్టుగా మారుతున్నాయి. బంధాలు, ఆప్యాయతలు కనుమరుగవుతున్నా యి. పాశ్చాత్య నాగరికత మోజులో యువత పెడదారి పడుతోంది. తాజాగా శనివారం మదనపల్లె ప్రాంతంలో వెలుగుచూసిన ఘటనను దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పోలీసుల కథనం మేరకు.. పీఅండ్‌టీ కాలనీలో ఉంటున్న ఓ ముస్లిం బాలిక(14) ప్రేమపేరుతో మోసపోయి, గర్భం దాల్చింది. దీపావళి రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చుట్టుపక్కల వారికి విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని ఆ బిడ్డను మండలంలోని కొండామారిపల్లె పంచాయతీ టీఎన్ఆర్ కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి సమీపంలో ముళ్లపొదల్లో పడేసింది. స్థానిక యువకుడు ఆ పసికందును తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. విషయం షీ–టీమ్ పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకుని బిడ్డను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆ బిడ్డను ఐసీడీఎస్ సీడీపీవో ఎల్లమకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని ఆస్పత్రిలో వదిలేశారు మదనపల్లె క్రైం : ‘తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దగ్గరుండి సపర్యలు చేయాల్సిన బిడ్డలు బరువు తమకెందుకు అనుకున్నారో ఏమో అర్ధరాత్రి సమయంలో ఆయన్ను తీసుకొచ్చి ఆస్పత్రి వద్ద పడేసి వెళ్లిపోయారు. సిబ్బంది గమనించి అతన్ని క్రానిక్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని చంద్రాకాలనీలో ఉం టున్న బత్తల ఆదెప్ప(70) 20 ఏళ్ల క్రితం కురబలకోట మండలం పిచ్చిలవాండ్లపల్లె నుంచి బతుకుదెరువు కోసం వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ భార్య నరసమ్మ, పిల్లలు మోహన్, సరోజ, శ్యామల, శోభను పోషించుకునేవాడు. బిడ్డలందరికీ పెళ్లిళ్లు చేశాడు. వయస్సు మీద పడడంతో కొన్ని రోజులుగా ఆదెప్ప అనారోగ్యం బారినపడ్డాడు. ఈ క్రమంలో ఆస్తి పంపకాల విషయమై బిడ్డలు తండ్రి మీద ఒత్తిడి తెచ్చారు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో ఒకరికొకరు గొడవపడ్డారు. తండ్రిని తీసుకొచ్చి క్రానిక్‌వార్డులో దిక్కులేనివాడిలా పడేసి వెళ్లారు. తిండి పెట్టేవారు లేక రోజురోజుకూ మృత్యువుకు దగ్గరవుతున్నాడు. ఆస్పత్రి సిబ్బంది అతని దీన స్థితి చూడలేక విలేకరులకు సమాచారం అందించారు. -
కారుణ్య మరణానికి అనుమతివ్వండి
-
కారుణ్య మరణానికి అనుమతివ్వండి
మదనపల్లి: శక్తికి మించి ఖర్చు చేశారు.. అయినా తమ కూతురిని కాపాడుకోలేని పరిస్థితి. దీంతో తమ కళ్ల ముందే నరకయాతన పడుతున్న కుమార్తె ను చూడలేని ఆ తల్లిదండ్రులు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు. వివరాలు.. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన బొగ్గల చిన్నరెడ్డప్ప, సునిత దంపతుల ఆరేళ్ల కూతురు శృతిహాసిని గత కొన్నేళ్లుగా న్యూరోప్రైబోమా వ్యాధితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకుండాపోయింది. ప్రైవేట్ వైద్యం చేయించే స్థోమత లేక మానసికంగా కుంగిపోయారు. దీంతో చేసేదేమి లేక మెడ నొప్పితో కూతురు చేస్తున్న ఆర్తనాదాలు వినే ఓపిక తమకు లేదని.. తమ కూతురికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరుతూ ఆ జంట మదనపల్లి రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి కేవీ మహాలక్ష్మీకి అర్జీ పెట్టుకున్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లర్లకు జిల్లాలో మరో ఎదరుదెబ్బ తగిలింది. మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో పీలేరు, సత్యవేడు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సహాయంతో రెండు ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగుల్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 వాహనాలు( 1 లారీ, 1 కారు, 4 మోటారు సైకిళ్లు), సుమారు 1.5 టన్నుల బరువైన 48 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అబ్దుల్ రహమాన్ అనే అంతర్జాతీయ స్మగ్లర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ జి. శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
కరెంట్ షాక్‌తో కూలీ మృతి
- మరో ఇద్దరికి తీవ్రగాయాలు మదనపల్లి: భవన నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలకు విద్యుత్ షాక్ తగిలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పట్టణంలోని నీరుగట్టువారి కాలనీలో ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో కూలి పని చేస్తున్న కుల్ల శేఖర్(50) విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. అతనిని రక్షించడానికి యత్నించిన ఓబుల్‌రెడ్డి, జి.శేఖర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు తుమ్మనగుట్ట పంచాయతి పరిధిలోని సెగలేటివారిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. -
ప్రేమజంట ఆత్మహత్య
మదనపల్లి(చిత్తూరు): ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీకలబల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. మండలంలోని ఉగ్రారపుపల్లి గ్రామానికి చెందిన జీ. సురేంద్ర(22) యమున(22) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బార్లపల్లి సమీపంలోని గుట్టపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. యమునకు గతంలో సురేష్ అనే వ్యక్తితో వివామమైంది. వీరికి బాలాజీ(6) అనే కొడుకు ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం సురేష్ మృతిచెందాడు. అప్పటి నుంచి యమున సురేంద్రతొ సన్నిహితంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెపోటుతో ఏఆర్ ఎస్ఐ మతి
తిరుపతి క్రైం: శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తు నిమ్తితం తిరుపతికి వచ్చిన కడప ఏఆర్ ఎస్ఐ నాగరాజనాయక్(53) మంగళవారం గుండెపోటుతో మతి చెందాడు. ఈస్ట్ సీఐ రాంకిషోర్ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లెకు చెందిన నాగరాజనాయక్ ఈ నెల 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బందోబస్తు నిమిత్తం తిరుపతికి వచ్చి శ్రీనివాసంలో బస చేస్తున్నారు. ఈయనకు గతంలో రెండు సార్లు గుండెపోటు వచ్చింది. మంగళవారం శ్రీనివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో కిందపడ్డారు. తలకు గాయమైంది. ఆస్పత్రికి తరలించకముందే మతి చెందాడు. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి, మతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. -
సిల్క్ సబ్సిడీ ఏమైంది?
– కష్టాల్లో చేనేత కార్మికులు – రుణమాఫీ జమ చేయాలి – సబ్‌కలెక్టరేట్ ఎదుట ఆందోళన మదనపల్లె రూరల్: పట్టు పాసుపుస్తకాలు కలిగిన చేనేత కార్మికులకు ప్రభుత్వం గతంలో ఇస్తున్న నాలుగు కిలోల సిల్క్ సబ్సిడీని అమలుచేయాలంటూ చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేత కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా చేనేత ఐక్యవేదిక పట్టణ అధ్యక్షులు బి.త్యాగరాజు మాట్లాడుతూ మదనపల్లెలో సుమారు 15వేల మంది చేనేత కార్మికులు జీవనం సాగిస్తున్నారన్నారు. నిమ్మనపల్లె, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, ములకలచెరువు, కురబలకోట, వాల్మీకిపురం, కలకడ, కలికిరి మండలాల్లోని చేనేత కార్మికులు పట్టుపాసుపుస్తకాలు కలిగి ఉన్నారని చెప్పారు. గతంలో ప్రతినెలా వీరికి 1కేజీ సిల్కుపై రూ.150 చొప్పున నాలుగు కేజీల వరకు రూ.600 ప్రభుత్వ రాయితీ వస్తుండేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ స్కీమును అమలుచేయకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఆ స్కీం అమలుచేయాలని అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకోగా రూ.1కోటి 64లక్షల రూపాయలు మంజూరుచేసినట్లు తెలిసిందన్నారు. కానీ ఇప్పటివరకు ఆ రాయితీ పైకం లబ్ధిదారులకు అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ప్రభుత్వం తమకు రావాల్సిన సబ్సిడీని తమ ఖాతాలకు జమచేసి పథకాన్ని నిరంతరం కొనసాగేలా చొరవతీసుకోవాలని, రుణమాఫీ చేయాలని కోరారు. చేనేతకార్మికులకు ప్రభుత్వం ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సుమారు 200మందికిపైగా చేనేతకార్మికులు పాల్గొన్నారు. -
లాటరీ మోసాలకు పాల్పడుతున్న 11మంది అరెస్ట్
మదనపల్లి (చిత్తూరు జిల్లా) : ఎలాంటి అనుమతులు లేకుండా లాటరీల ద్వారా మోసాలకు పాల్పడుతున్న 11మందిని మదనపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లి కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఏజెంట్లను పెట్టుకుని వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీరి దగ్గర నుంచి 15 సెల్ఫోన్లతో పాటు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం
మదనపల్లె రూరల్: మదనపల్లె పట్టణంలో సేకరించిన చెత్తాచెదారంను తమ గ్రామ సమీపంలో డంపింగ్ చేయడంపై తట్టివారిపల్లె, పుంగనూరువాండ్లపల్లె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆదివారం చెత్తను మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం వద్ద దింపి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలోని బాహుదా కాలువలో తొలగించిన చెత్తాచెదారాన్ని ట్రాక్టర్లలో తీసుకువచ్చి తమ గ్రామాల సమీపంలో డంపింగ్ చేయడం దారుణమన్నారు. మున్సిపాలిటీకి పంచాయతీలో డంపింగ్ యార్డు కేటాయించినా పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను అక్కడకు చేర్చకుండా తమ గ్రామాల్లో దించడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పారిశుద్ధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మళ్లీ పట్టణంలోని చెత్తను తీసుకువచ్చి చెరువు, తూముల్లో దించడం దారుణమని మండిపడ్డారు. వెంటనే చెత్తదిబ్బలు తొలగించకుంటే కార్యాలయం ఎదుట గ్రామస్తులంతా ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. -
మున్సిపల్ స్థలం అన్యాక్రాంతం
– రూ. 2 కోట్ల ఆస్తి పరులపాలు – తూతూ మంత్రంగా అధికారుల చర్యలు – రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా అధికార పార్టీ ప్రయత్నం – సబ్ రిజిస్ట్రార్‌పై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు మదనపల్లె : పురపాలక సంఘ స్థలం అన్యాక్రాంతమైంది. గత నెల 18వ తేదీ స్థానిక తూర్పుకొత్తపేటలోని దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువజేసే పురపాలక సంఘం ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సాక్షి కథనం, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల చొరవతో అధికార పార్టీ నాయకుల అక్రమాలు బయటపడినా ఫలితం లేకపోతోంది. ఈ కబ్జా భాగోతంపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు గళం విప్పడంతో ఖంగుతిన్న మున్సిపల్ అధికారులు ఆ స్థలాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా స్థానిక సబ్ రిజిస్ట్రార్ కోదండరామయ్యతో చర్చించారు. వెంటనే ఆ రిజిస్ట్రేషన్ రద్దుచేయాలని కోరారు. రిజిస్టర్ చేసిన వారు చేయించుకున్న వారు వస్తే రద్దుచేయవచ్చని చెప్పారు. స్థలం రిజిస్ట్రేషన్ విషయమై కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రస్తావించగా, చైర్మన్, కమిషనర్ వెంటనే ఆ స్థలం మున్సిపాలిటీకి చెందినదిగా బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారేకానీ ఇప్పటివరకూ బోర్డు పెట్టకపోవడం గమనార్హం. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధే కుట్రపన్నుతున్నారని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా అధికార పార్టీ ప్రయత్నం రిజిస్టర్ చేసిన వారు, చేయించుకున్న వారు ఆ ప్రజాప్రతినిధి అనుచరులే. ఈ స్థలంపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఒకవేళ ప్రతిపక్షం, మీడియా ఒత్తిళ్లవల్ల తీసుకున్నా అవి నామమాత్రంగానే ఉండాలని అధికారులకు సూచనలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఈ స్థలాన్ని ఎలాగైనా సరే పరిరక్షిస్తామని శపథం చేస్తున్నారేగానీ అందుకు చేపట్టాల్సిన చర్యలు మాత్రం శూన్యమనే విమర్శలు వస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్‌పై సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు స్థానిక సబ్ రిజిస్ట్రార్ కోదండరామయ్యపై సబ్ కలెక్టర్ కృతికాబాత్రకు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. మున్సిపల్ స్థలాన్ని రిజిస్టర్ చేశారని, వెంటనే రద్దుచేయించేలా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ స్థలాల వివరాలు ఇవ్వలేదు.. మున్సిపల్ స్థలాలకు సంబంధించిన వివరాలు ఇప్పటివరకూ ఇవ్వలేదని స్థానిక సబ్ రిజిస్ట్రార్ కోదండరామయ్య అన్నారు. మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్‌పై ఆయనను వివరణ కోరగా, తమ వద్దకు పక్కా డాక్యుమెంట్లతో రావడంతోనే రిజిస్టర్ చేశామని చెప్పారు. పట్టణంలో ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని, అయితే మున్సిపల్ స్థలాల వివరాలను ఇప్పటివరకూ తమకు ఇవ్వలేదని తెలిపారు. -
'జీవితాంతం నటిస్తూనే ఉంటా'
► సొంత బ్యానర్‌పై సినిమాలు ► మదనపల్లె వాసులకు అవకాశం ► ప్రముఖ సినీ హాస్య నటుడు ఎల్బీ శ్రీరామ్ మదనపల్లె: ప్రేక్షకులు మెచ్చే విధంగా జీవితాంతం నటిస్తానని ప్రముఖ సినీ హాస్య నటుడు ఎల్బీ శ్రీరామ్ తెలిపారు. భరతముని ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మదనపల్లెలో ఆదివారం నిర్వహించిన మ్యాజిక్ ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 30 ఏళ్లుగా హాస్యాన్ని పండిస్తున్నానన్నారు. ఇటీవల సినిమాల ఆదరణ తగ్గి సీరియల్స్‌పై జనాలు మొగ్గుచూపుతున్నారన్నారు. తన సొంత బ్యానర్ లైఫ్ బ్యూటిఫుల్ క్రియేషన్ (ఎల్బీశ్రీరామ్) పై సినిమాలు నిర్మించి యూట్యూబ్‌లో విడుదలచేస్తానన్నారు. మంచి సినిమాలు తీయాలన్న ఆశయంతో మదనపల్లె పరిసర ప్రాంతాల్లో చిన్న సినిమాలను తీయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో మదనపల్లె పరిసర ప్రాంతాల్లో నటనపై ఆసక్తి కలిగిన వారికి అవకాశం కల్పిస్తానని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తనను సంప్రదిస్తే ప్రతిభను గుర్తించి సినిమాలో ఎంపిక చేస్తానన్నారు. తండ్రి, తాతలతో పాటు ప్రేక్షకులకు దగ్గరయ్యే ఎలాంటి పాత్రలైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆకట్టుకున్న మ్యాజిక్‌షో బెంగళూరుకు చెందిన అమరేంద్రసాయి చైతన్యకుమార్(శ్రీవాత్సవ) చేసిన మ్యాజిక్ ప్రదర్శన చూపురులను ఆకట్టుకుంది. ఇతను ఐదో ఏట నుంచే మ్యాజిక్ ప్రదర్శనలు ఇస్తూ ఇప్పటి వరకు750 కిపైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపారు. విద్యతోపాటు మ్యాజిక్, స్టాంపులు,కాయిన్స్ కలక్షన్ చేస్తూ పలు ప్రదర్శనలు చేసి మన్ననలు అందుకున్నారు. అనంతరం ఎల్.బి.శ్రీరామ్,శ్రీవాత్సవలను ఘనంగా శాలువాలతో సత్కరించారు. -
డీఈఈ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
చిత్తూరు జిల్లా మదనపల్లిలోని హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ కుప్పం బ్రాంచ్ 12 డీఈఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించారు. ఈ కార్యాలయంలో డీఈఈగా పనిచేస్తున్న మద్దిలేటి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బెంగళూరులోని ఎస్ఆర్పురంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు సమాచారం. అలాగే ఆయన నివాసంలోనూ సోదాలు చేపట్టారు. -
రెండు ఆటోలు ఢీ.. 11 మందికి గాయాలు
మదనపల్లి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం సర్కారు తోపు వద్ద శనివారం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్యాసింజర్ ఆటోలు ఢీకొనడంతో వాటిలో 11 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఓ నాగుపాము కలకలం రేపింది. చిన్నపిల్లల వార్డు బయట సీసీ రోడ్డు పక్కన నాగు పాము ప్రత్యక్షం కావడంతో దాన్ని చూసిన వారు భయాందోళనకు లోనయ్యారు. పాములు పట్టడంలో నేర్పరి అయిన ఇందిరానగర్ ప్రాంతవాసి ప్రమీద్ అనే యువకుడికి కబురుపెట్టారు. అతడు వచ్చి నాగుపామును చాకచక్యంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
మున్సిపల్ ఉద్యోగుల ఆందోళనబాట
మదనపల్లి టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లి మునిసిపాలిటీ కార్మికులు, ఉద్యోగులు సోమవారం చైర్మన్ అనుచరుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఆదివారం రాత్రి చైర్మన్ అనుచరులు ఓ ఉద్యోగిపై చేయి చేసుకోవడంతో దాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కొండ పైనుంచి దూకాడు, కానీ..
మదనపల్లి (చిత్తూరు) : ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుట్టపై నుంచి మూడు కిలోమీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూకి ఆత్మహత్యాయాత్నం చేసిన వ్యక్తి అదృష్టవశాత్తు చెట్లలో చిక్కుకొని బతికిపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం హార్స్ లీ హిల్స్‌లోని కాలిబండ వద్ద సోమవారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఎం.టి.భగీరధ రెడ్డి(48) సిరికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో విబేధించిన కారణంగా వారు ఇతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగక పలుమార్లు భౌతిక దాడులకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన భగీరధ రెడ్డి ఆత్మాహత్య చేసుకోవడానికి హార్స్ లీ హిల్స్‌లోని కాలిబండ పక్కన ఉన్న కొండపైకి చేరుకున్నాడు. అనంతరం తన తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడి నుంచి దూకేశాడు. ఒంటిపై వేసుకుని ఉన్న జర్కిన్ చెట్లలో చిక్కుకోవడంతో.. సుమారు 3000 అడుగుల ఎత్తులో కొండపై ఇరుక్కున్నాడు. అప్పటికే అతని తమ్ముడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని రక్షించారు. చెట్టు కొమ్మలు గీరుకోవడంతో.. శరీరమంతా గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పదిశాతం కమీషన్‌ను రద్దుచేస్తాం: మంత్రి
చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో రైతు ఉత్పత్తుల కొనుగోలు చేసేందుకు వ్యాపారులు 10 శాతం కమీషన్ ఇవ్వటాన్ని రద్దు చేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఆయన గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో పర్యటించారు. భారీ వర్షాల తర్వాత పొలాలను, చెరువుల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన మార్కెట్ యార్డులో అధికారులు, రైతులతో సమావేశమయ్యారు. ఎక్కడా లేని విధంగా మదనపల్లె మార్కెట్లో పదిశాతం దోపిడీ సాగుతోందని రైతులు ఆయన దృష్టికి తీసుకు వ చ్చారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ విధానాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాల నుంచి 6.50 ఎకరాలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మదనపల్లె మార్కెట్‌ను మరింత ఆధునీకరించటంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఆటో, బైక్ ఢీ..ఒకరి మృతి
మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆటో, బైక్‌ను ఢీకొట్టిడంతో కత్తి రాము(30) అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మంగళవారం మరణించాడు. -
చెరువులో మునిగి ముగ్గురు మృతి
ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం చిన్నతిప్పారెడ్డిపల్లె గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్, శివ, మరో బాలుడు కలిసి సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ నీట మునిగారు. సమీపంలోని వారు గమనించి రక్షించేలోగానే మృత్యువాతపడ్డారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అల్లుడిపై వేట కొడవళ్లతో దాడి
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి చంద్రయ్య కాలనీలో ఓ చేనేత కార్మికుడిపై అతని మామ, మరో ఇద్దరు సోమవారం సాయంత్రం వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాథమిక సమచారం మేరకు.. కురబల కోట మండలం బోయపల్లికి చెందిన అప్పులప్ప (35) మదనపల్లి చంద్రయ్య కాలనీలో నివసిస్తూ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి శ్యామల, విజయలక్ష్మి అనే ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. కాగా అప్పులప్పకు అతని రెండో భార్య విజయలక్ష్మి, తండ్రి లక్ష్మయ్యతో గొడవ జరిగింది. దీంతో లక్ష్మయ్య, గంగాధర్, వెంకటరమణ అనే ముగ్గురు అప్పులప్పపై వేటకొడవళ్లతో దాడి చేసి నరికారు. ఈ దాడిలో చేతులు తెగిపోగా, గొంతు భాగంలోనూ తీవ్ర గాయం అయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు. -
మదనపల్లిలో రెచ్చిపోయిన దొంగలు
చిత్తూరు జిల్లా మదనపల్లిలో దొంగలు మరో సారి చెలరేగి పోయారు. ఆదివారం రెండిళ్లలో చోరీలకు తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. కురవంక కాలనీలో శనివారం అర్ధరాత్రి చుక్కం రఘు, సాయి గణేష్ ఇళ్ల తాళాలను గడ్డపారతో పగులగొట్టి రూ.లక్ష నగదు, 28 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. బాధితులు ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చోరీ విషయాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారం క్రితం ఇదే ప్రాంతంలో దొంగలు మూడిళ్లల్లో చోరీలకు పాల్పడ్డ సంగతి తెలిసిందే... -
అటవీ హక్కుల చట్టం అమలు చేయాలి
అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని కోరుతూ సీపీఐ, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం మదనపల్లి సబ్‌కలెక్టర్ మల్లికార్జున్‌కు ఈ విషయం గురించి వినతిపత్రం సమర్పించారు. -
అమ్మ మనసు
జ్ఞాపకం పదవ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, తిరుపతి శ్రీ వేంకటేశ్వరా జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేరాను. ఒకరోజు అమ్మతో, ‘‘అమ్మా! ప్రతిరోజూ మనవూరి నుండి పదిమైళ్ల దూరం నడచి తిరుపతికి పోయి చదువుకొని రావాలంటే చాలా కష్టంగా ఉంది. నాతో చదివే పిల్లలంతా అక్కడే హాస్టల్లో చేరి చదువుకొంటు న్నారు. నన్ను కూడా హాస్టల్లో చేర్పించం డమ్మా! మనకు బియ్యం కార్డు కూడా ఉంది కాబట్టి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉచితంగా సీటు ఇస్తారు’ అని చెప్పాను. అమ్మ, నాన్న ఎలాగో కష్టపడి నాకు హాస్టల్లో సీటు సంపాదించారు. నేను హాస్టల్లో ఉంటూ వారానికి ఒకసారి మా వూరికి వెళ్లి వస్తూండేవాణ్ని. మా పల్లెలో ఓ టూరింగు టాకీస్ ఉండేది. ఆదివారం ఊరెళ్లగానే స్నేహితులతో కలసి సినిమాకి వెళ్లేవాడిని. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిపోయేవాణ్ని. నాన్నకది నచ్చేది కాదు. ‘‘వారానికి ఒక్కసారి వస్తావు. ఓ నిముషం కూడా ఇంట్లో ఉండకుండా, స్నేహితులతో సినిమాలకెళ్తావు. ఇక్కడే ఇలా ఉంటే, తిరుపతిలో ఎలా ఉంటున్నావో’’ అన్నాడు ఓరోజు. దాంతో నేను అలిగి ‘‘ఇక నేను వారం వారం రాను, నెలకో సారి వస్తాను’’ అని చెప్పి వెళ్లిపోయాను. మరుసటి ఆదివారం నేను ఇంటికి రాకపోయేసరికి సోమవారం ఉదయాన్నే అమ్మ నన్ను కలవడానికి తిరుపతికి బయలుదేరింది. ఎలాగో కాలేజీ కను క్కుని, కాలేజీ గేటు దగ్గరకు చేరి వచ్చే పోయే పిల్లలందర్నీ నా గురించి అడు గుతూ ప్రాధేయపడుతోంది. మీ పిల్లోడు ఏం చదువుతున్నాడని అడిగితే చెప్పలే కుంది. ‘నా బిడ్డను చూడాలయ్యా’ అని ఏడుస్తోంది. ఉదయం పది గంటల్నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే అన్నం, నీళ్లు లేకుండా ఆక్రోశిస్తూ ఉంది. ఇంతలో మావూరి విద్యార్థి, నా మిత్రుడైన చంద్ర అమ్మను గుర్తుపట్టాడు. తనని తీసుకుని హాస్టల్కొచ్చాడు. నన్ను చూడగానే అమ్మ కళ్లు జలపాతాల య్యాయి. ‘‘నిను చూడకుండా ఈ అమ్మ ఎలా బతకాలిరా, నువ్వు నాతో రాకుంటే నేను వెళ్లను’’ అని భీష్మించి కూర్చుంది. నా తోటి విద్యార్థులంతా అమ్మ పడే వేదన చూసి చలించిపోయారు. నాకైతే కన్నీళ్లు ఆగలేదు. ఇక జన్మలో అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను! - ఆనంద్, మదనపల్లి -
రోడ్డుప్రమాదంలో చిన్నారి మృతి
చిత్తూరు (మదనపల్లి) : మదనపల్లి మండలకేంద్రంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మురళి(4) అనే బాలుడు మృతిచెందాడు. రోడ్డుపై ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ లారీ ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సమైక్యాంధ్ర కోరుతూ మదనపల్లిలో వినూత్న నిరసన