
సాక్షి, చిత్తూరు: మదనపల్లి మండలం నిరుగట్టువారిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి.. పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. ఏడాది కూడా తిరగకుండానే.. తిరిగిరాని లోకాలకు వెళ్లింది. వివరాలు.. నిరుగట్టువారి పల్లెకు చెందిన ఉమ, రామాంజనేయులు ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆనందంగా సాగాల్సిన ఆమె జీవితం.. అర్థాంతరంగా ముగిసింది. రామాంజనేయులు భార్య ఉమను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఉరి వేసుకుని మరణించినట్లు చిత్రీకరించి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(చదవండి: మా ఇంట్లో దేవుళ్లున్నారు, మళ్లీ పుడతారు)
Comments
Please login to add a commentAdd a comment