చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చిన్నతిప్ప సముద్రం చెరువులో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం చిన్నతిప్పారెడ్డిపల్లె గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్, శివ, మరో బాలుడు కలిసి సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ నీట మునిగారు. సమీపంలోని వారు గమనించి రక్షించేలోగానే మృత్యువాతపడ్డారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.