Brother, sister drown in pond while bathing dog in Mumbai - Sakshi
Sakshi News home page

చెరువు వైపు చూస్తూ మొరుగుతున్న కుక్క.. పరిశీలనగా చూసి నివ్వెరపోయిన జనం!

Published Mon, May 29 2023 7:19 AM | Last Updated on Mon, May 29 2023 11:26 AM

brother and sister died due to drowning in pond - Sakshi

తమ పెంపుడు కుక్కకు చెరువులో స్నానం చేయించాలని ఆ అన్నాచెల్లెలు ఎంతో ముచ్చటపడ్డారు. అయితే అదే వారిపాలిట శాపంగా మారింది. స్థానికంగా ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని డోంబివలీ దావాడీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అన్నాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్కను తీసుకుని చెరువుకు వెళ్లారు. అక్కడ దానికి స్నానం చేయించాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా వారు లోతైన నీటిలో మునిగిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. అయితే దాని ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు.

ఉమేష్‌నగర్‌కు చెందిన రంజిత్‌ రవీంద్రన్‌(22),కీర్తి రవీంద్రన్‌(16) కుటుంబంతో పాటు ఉంటున్నారు. రంజిత్‌ ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థి. కీర్తి ఈ ఏడాదే 12వ తరగతిలో చేరింది. వారి తల్లిదండ్రులు ఏదోపనిమీద తమ గ్రామానికి వెళ్లారు. దీంతో ఇంటిలో ఈ అన్నాచెల్లెళ్లలోపాటు వారి పెంపుడు కుక్క కూడా ఉంది. ఆదివారం ఈ అన్నాచెల్లెళ్లు స్కూటర్‌పై కుక్కను తీసుకుని గావ్‌దేవి చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ కుక్కకు స్నానం చేయించాలనుకున్నారు.

ఈ నేపధ్యంలో వారు చెరువులోకి దిగినవెంటనే మునిగిపోయారు. అయితే కుక్క ఈ ప్రమాదం నుంచి బయటపడింది. వారిద్దరూ చెరువులో మునిగిపోవడాన్ని చూసిన ఆ కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. కొద్దసేపటి తరువాత కుక్క అలా మొరుగుతుండటాన్ని గమనించిన గ్రామస్తులకు ఏదో అనుమానం కలిగింది. వారు సంఘటనా స్థలానికి వచ్చి.. ఆ అన్నా చెల్లెళ్లు మునిగిపోయి ఉండటాన్ని గమనించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఇంతలో భారీ సంఖ్యలో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో రెండు గంటలపాటు చేసిన ప్రయత్నాల అనంతరం ఆ అన్నాచెల్లెళ్ల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అన్నాచెల్లెళ్లు చదువు అంటే ఎంతో ఆసక్తి చూపేవారు. కీర్తి 10వ తరగతిలో 98శాతం మార్కులను సంపాదించింది. ఈ అన్నాచెల్లెళ్లద్దరూ ఆ కుక్కను ఎంతో ప్రేమగా చూసుకునేవారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement