మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అనే అనుమానంతో 23 ఏళ్లు యువకుడిని సామూహికంగా కొట్టి చంపారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
వివరాల్లోకి వెళితే నలసోపారాలోని వెలై పాడా ప్రాంతంలో 10 మంది గుంపుగా చేరి విజయ్ అలియాస్ అభిషేక్ జోగిందర్ సోనీ బంధించారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో విజయ్ అక్కడ సంచరిస్తున్నాడని ఆరోపిస్తూ, కర్రలతో విజయ్‌పై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఈ దాడిలో విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. గతంలో కూడా పాల్ఘర్‌లో మూక హత్యల ఉదంతం వెలుగు చూసింది. నాటి ఘటనలో ఇద్దరు సాధువులు, ఒక డ్రైవర్ హతమయ్యారు. 2020, ఏప్రిల్ 16న పాల్ఘర్ జిల్లాలోని గడ్చించలేలో ఇద్దరు సాధువులను, వారి కారు డ్రైవర్‌ను దొంగలుగా అనుమానించిన స్థానికులు మూకుమ్మడిగా వారిపై దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 201 మందిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment