కారుణ్య మరణానికి అనుమతివ్వండి
మదనపల్లి: శక్తికి మించి ఖర్చు చేశారు.. అయినా తమ కూతురిని కాపాడుకోలేని పరిస్థితి. దీంతో తమ కళ్ల ముందే నరకయాతన పడుతున్న కుమార్తె ను చూడలేని ఆ తల్లిదండ్రులు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు. వివరాలు.. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన బొగ్గల చిన్నరెడ్డప్ప, సునిత దంపతుల ఆరేళ్ల కూతురు శృతిహాసిని గత కొన్నేళ్లుగా న్యూరోప్రైబోమా వ్యాధితో బాధపడుతోంది.
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకుండాపోయింది. ప్రైవేట్ వైద్యం చేయించే స్థోమత లేక మానసికంగా కుంగిపోయారు. దీంతో చేసేదేమి లేక మెడ నొప్పితో కూతురు చేస్తున్న ఆర్తనాదాలు వినే ఓపిక తమకు లేదని.. తమ కూతురికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరుతూ ఆ జంట మదనపల్లి రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి కేవీ మహాలక్ష్మీకి అర్జీ పెట్టుకున్నారు.