
గాయిత్రి(ఫైల్)
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): భర్త చేతిలో భార్య హతమైన సంఘటన స్థానిక శివాజీనగర్‌లో చోటుచేసుకుంది. టూటౌన్ సీఐ నరసింహులు, ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు..శివాజీనగర్‌కు చెందిన లోకేష్ ఇంటింటికీ వాటర్ క్యాన్లు సరఫరా చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి భార్య గాయిత్రి(30) ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె నిషిత ఉంది. గాయిత్రి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకునితో చనువుగా ఉంటోదని తెలుసుకున్న లోకేష్ అనుమానం పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అతను ఇంటికి వచ్చేవేళకు ఆమె మరో వ్యక్తితో మాట్లాడటం చూసి గొడవపడ్డాడు. ఇది తారస్థాయికి చేరడంతో కత్తితో ఆమెను పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. టూటౌన్ సీఐ, ఎస్‌ఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి మార్చురీకి తరలించారు.
చదవండి:
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment