
సాక్షి, హైదరాబాద్: కట్టుకున్న భార్యను రాయితో అతి కిరాతకంగా కొట్టి హత్య చేసిన ఘటన చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లగండ్లలో నివాసముంటున్న తాండూరుకు చెందిన అంబికా.. బొటిక్ షాపులో పని చేస్తోంది.
శుక్రవారం ఉదయం షాప్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమె వద్దకు వచ్చిన భర్త నరేందర్.. తలపై బండరాయితో దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి గాయాలతో రోడ్డుపై పరిగెత్తిన అంబికను వెంబడించి మరి అతి కిరాతకంగా కత్తితో హత్య చేశాడు. గొడవలు కారణంగా భార్యాభర్తలు ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు.
చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. మాజీ ప్రియురాలి ఇంట్లోకి దూరి..
Comments
Please login to add a commentAdd a comment