తిరుపతి క్రైం: శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తు నిమ్తితం తిరుపతికి వచ్చిన కడప ఏఆర్ ఎస్‌ఐ నాగరాజనాయక్(53) మంగళవారం గుండెపోటుతో మతి చెందాడు. ఈస్ట్ సీఐ రాంకిషోర్ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లెకు చెందిన నాగరాజనాయక్ ఈ నెల 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బందోబస్తు నిమిత్తం తిరుపతికి వచ్చి శ్రీనివాసంలో బస చేస్తున్నారు. ఈయనకు గతంలో రెండు సార్లు గుండెపోటు వచ్చింది. మంగళవారం శ్రీనివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో కిందపడ్డారు. తలకు గాయమైంది. ఆస్పత్రికి తరలించకముందే మతి చెందాడు. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి, మతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు.