
సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ చోరీ మైనర్ బాలుడిని బలికొన్న ఘటన చిత్తూరులోని మదనపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఈశ్వమ్మ కాలనికి చెందిన మైనర్ బాలుడు భరత్ రెండు రోజు క్రితం బంధువుల ఇంట్లో ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగలించాడు. తన దొంగలించిన ఫోన్ స్థానికి మొబైల్ షాపులో 2500 రూపాయలకు విక్రయించాడు.
సెల్‌ఫోన్ కనింపచకుండా పోవడంతో భరత్‌ను బంధువులు ఆరాతీయడంతో భరత్ తానే దొంగలించినట్లను ఒప్పుకున్నాడు. అనంతరం బాలుడు తాను అమ్మిన షాపు వద్దకు వెళ్లి సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వాలని షాపు యజమాని చాంద్ భాషాను కోరాడు. షాపు యజమాని సెల్ ఇవ్వకపోగా బాలుడిని చిత్ర హింసలకు గురిచేశాడు. చాంద్ భాష కొట్టిన దెబ్బలకు తీవ్ర అస్వస్థకు గురై భరత్ ఇవాళ మృతి చెందాడు. దీంతో షాపు యజమాని చాంద్ భాషపై పోలీసులు కేసు నమోదు చేశారు.