చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆటో, బైక్‌ను ఢీకొట్టిడంతో కత్తి రాము(30) అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మంగళవారం మరణించాడు.