చివ్వెంల: అతివేగం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం ఒట్టిగంపాడు శివారులో మంగళవారం ఉదయం ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. మృతుడ్ని గోగుల భిక్షంగా గుర్తించారు. శ్యామలా, కర్రి వీరయ్య, పెద్దిరెడ్డి గాయపడ్డారు. ఆటో అతి వేగంగా నడపడంతోనే అదుపుతప్పి ప్రమదం జరిగిందని బాధితులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు 108కు సమాచారం అందించారు.