అర్వపల్లి: నల్లగొండ జిల్లా అర్వపల్లి మండల కేంద్రం శివారులో ఆదివారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొనగా ఓ వ్యక్తి మృతిచెందాడు. పర్సాయిపల్లి వైపు వెళుతున్న బైక్‌ను ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న పడమటి తండాకు చెందిన అంగోతు రామోజీ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం వారిని అర్వపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.