శ్రీకాకుళం: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి గాయాల పాలయ్యాడు. శ్రీకాకుళం జిల్లా జనుమూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
జనుమూరుకు చెందిన మీ-సేవా కేంద్రం నిర్వాహకుడు దుర్గారావు(43) సోమవారం ఉదయం కరవంజి నుంచి బైక్‌పై బయలుదేరాడు. కోనేరు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ దుర్గారావును ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.