చిత్తూరు(వి. కోట): చిత్తూరు జిల్లా వి. కోట మండలం ఎస్ బండపల్లి వద్ద బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. మృతి చెందిన యువకుడు కుదువగడ్డ గ్రామానికి చెందిన ప్రభు(20)గా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపటంతో అదుపుతప్పి పడిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.