sri kakulam district
-
రోడ్డుపై విద్యార్థుల వీరంగం
-
శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు
-
బైకులు ఢీ... ఒకరి మృతి
శ్రీకాకుళం: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి గాయాల పాలయ్యాడు. శ్రీకాకుళం జిల్లా జనుమూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జనుమూరుకు చెందిన మీ-సేవా కేంద్రం నిర్వాహకుడు దుర్గారావు(43) సోమవారం ఉదయం కరవంజి నుంచి బైక్‌పై బయలుదేరాడు. కోనేరు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ దుర్గారావును ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బీఈడీ ఫలితాలు విడుదల
శ్రీకాకుళం జిల్లా : ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడీ ఫలితాలు విడుదల అయ్యాయి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్ శనివారం ఫలితాలను విడుదలచేశారు. బీఈడీలో 82శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మొత్తం 18,017 మంది పరీక్షలు రాయగా 14,090మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన చెప్పారు. -
'వంశధార' సైడ్ వీయర్ కు ఓకే
శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద ‘అడ్డుగోడ’కు అనుమతి సాక్షి, న్యూఢిల్లీ: వంశధార నదీ జలాల వివాదంలో రాష్ట్రానికి తొలి విజయం దక్కింది. వంశధార రెండోదశ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద (మనవైపు నదికి) సైడ్ వీయర్ (గేట్లతో కూడిన అడ్డుగోడ) నిర్మాణానికి వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) అనుమతి ఇచ్చింది. తమకు నష్టం జరుగుతుందంటూ ఇంతకాలం మోకాలడ్డుతూ వచ్చిన ఒడిశా అభ్యంతరాలు, వాదనలను తాత్కాలికంగా పక్కనపెట్టింది. దీంతో మరో 8 టీఎంసీల నీటిని వాడుకోవడానికి, తద్వారా మరో 50 వేల ఎకరాలు సాగు చేసేందుకు మన రాష్ట్రానికి అవకాశం చిక్కింది. అయితే సైడ్‌వీయర్ విషయంలో మున్ముందు వివాదాలు తలెత్తకుండా, నిర్మాణం మొదలుకుని, దాని పనితీరు, నీటిని వాడుకోవడం వరకు అన్నింటినీ పర్యవేక్షించడానికి ట్రిబ్యునల్ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి ఒక్కొక్కరు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇదే సమయంలో కొన్ని షరతులను కూడా విధించింది. కాట్రగడ్డ వద్ద సైడ్‌వీయర్ నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన దరఖాస్తును ( ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ ) జస్టిస్ ఎం.కె.శర్మ చైర్మన్‌గా, జస్టిస్ బి.ఎన్.చతుర్వేది, జస్టిస్ గులాం మహమ్మద్ సభ్యులుగా ఉన్న వంశధార ట్రిబ్యునల్ మంగళవారం పరిష్కరించింది. ఈ మేరకు 28 పేజీల మధ్యంతర ఉత్తర్వును ప్రకటించింది. దీంతో సైడ్‌వీయర్ నిర్మాణానికి ఇప్పటివరకూ ఉన్న ప్రతిబంధకాలన్నీ తొలగినట్టయింది. దీంతో మన రాష్ట్ర ఉన్నతాధికారుల్లో, రాష్ట్రం తరఫున వాదించిన న్యాయవాదుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యూరుు. ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే... ఒడిశా దాఖలు చేసిన దరఖాస్తు నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు సమర్పించిన పత్రాలు, ఇతరత్రా ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రెండురాష్ట్రాల వాదనలు ఆలకించిన ట్రిబ్యునల్ గత ఆగస్టులో ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. చివరకు మంగళవారం ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎం.కె.శర్మ ఉత్తర్వులు వెలువరించారు. ‘సైడ్‌వీయర్ నిర్మాణానికి అనుమతించనట్టయితే... సాగునీరు, ఇతరత్రా అవసరాల కోసం కోరిన పరిమాణం మేరకు జలాలను వినియోగించుకోవడానికి రాష్ట్రాన్ని నిరాకరించినట్టు అవుతుందని, దానివల్ల తాము దారుణంగా నష్టపోతామని, కోలుకోలేనంతగా దెబ్బతింటామనే వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా చూపగలిగింది. తమ కేసుకు బలమైన ఆధారాలున్నాయని నిరూపించుకోవడంలో ఒడిశా విఫలమైంది. రికార్డుల్లో ఉన్న వాస్తవాలు, పత్రాలు మొగ్గును ఆంధ్రప్రదేశ్‌కే ఇస్తున్నాయి’’ అని ట్రిబ్యునల్ పేర్కొంది. వాస్తవాలను, కేసు నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలించిన మీదట సైడ్‌వీయర్ నిర్మాణాన్ని ప్రతిపాదిత అనుబంధ పనులతో సహా చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతిస్తున్నట్లు ట్రిబ్యునల్ తెలిపింది. ఇవీ షరతులు.. సైడ్‌వీయర్ నిర్మాణం, అనుబంధ పనుల నిమిత్తం ప్రస్తుతమిస్తున్న ఉత్తర్వులు తాత్కాలికమైనవేనని, అవసరమనుకున్న సందర్భంలో తామిచ్చే తదుపరి ఉత్తర్వులకు ఇవి లోబడి ఉంటాయని పేర్కొంది. ట్రిబ్యునల్ మొత్తం పది షరతులను విధించింది. అందులో ముఖ్యమైనవి... సైడ్‌వీయర్ నిర్మాణం, దాని పనితీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వు అమలును పర్యవేక్షించడానికి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలి. ‘జల ప్రవాహ నిర్వహణ, నియంత్రణ పర్యవేక్షక కమిటీ’గా వ్యవహరించే ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల తరఫున మొత్తం ముగ్గురికి ఇందులో స్థానమివ్వాలి. సీడబ్ల్యూసీ ప్రతినిధి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రాజెక్టు ప్రతిపాదనకు కేంద్ర జలసంఘం, జల వనరులు, పర్యావరణ, అటవీ, గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖల అనుమతులు, చట్టపరంగా అవసరమైన ఇతర అనుమతులు పొందడం తప్పనిసరి. సైడ్‌వీయర్ పనితీరునంతటినీ, గేట్ల మూసివేతతో సహా, పర్యవేక్షక కమిటీయే చూస్తుంది. కమిటీయే తన కార్యాలయ ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. కార్యాలయ నిర్వహణ, పర్యవేక్షణ కార్యకలాపాలకు అయ్యే ఖర్చులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరిస్తుంది. సైడ్‌వీయర్‌కు ఎగువన ప్రవాహం ఎంత ఉంది, సైడ్‌వీయర్ నుంచి ఎన్ని నీళ్లు వెళ్తున్నాయనే వివరాల రికార్డును కమిటీ నిర్వహిస్తుంది. వంశధార నదిలో సైడ్‌వీయర్‌కు ఎగువన ప్రవాహ జలాలు 4,000 క్యూసెక్కులకు మించి ఉన్నపుడు, దిగువన ప్రవహించే నీళ్లు 4,000 క్యూసెక్కులకు సమానంగా లేక అంతకుమించి ఉన్నపుడే దాని గేట్లను తెరవడానికి కమిటీ అనుమతించాలి. ఏ సంవత్సరంలోనైనా సరే జూన్ నుంచి నవంబర్ వరకు ఉన్న నెలల్లో సైడ్‌వీయర్ ద్వారా పక్కకు వెళ్లే మొత్తం జలాలు ఎట్టి పరిస్థితుల్లోనూ 8 టీఎంసీలకు మించకుండా ఉండేలా కమిటీ చూడాలి. ఈ 8 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాకు వచ్చే 50 శాతం జలాల్లో భాగమవుతాయి. జూన్ మాసం నుంచి నవంబర్ వరకు సైడ్‌వీయర్ నుంచి పక్కకు వెళ్లే జలాల మొత్తం ఎప్పుడైతే 8 టీఎంసీలకు చేరుకుంటుందో ఆ వెంటనే సైడ్‌వీయర్ గేట్లను మూసివేసేలా, మళ్లీ తదుపరి సంవత్సరం వర్షాకాలం వరకు అవి అదే స్థితిలో ఉండేలా కూడా కమిటీ చూస్తుంది. వంశధార నది నుంచి ప్రవహించే మొత్తం జలాలు దిగువకు పారేందుకు, వాటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు వీలుగా డిసెంబర్ 1 నుంచి మే 31 మధ్యకాలంలో సైడ్‌వీయర్ గేట్లు మూసివుంటాయి. ఇక నేరడిపై దృష్టి..! కాట్రగడ్డ సైడ్‌వీయర్ నిర్మాణంపై ఒడిశా దరఖాస్తును పరిష్కరించిన నేపథ్యంలో ఇప్పుడు ట్రిబ్యునల్ నేరడి బ్యారేజీపై దృష్టి పెట్టనుంది. నేరడి వద్ద బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కేసు ట్రిబ్యునల్ ఎదుట పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 22న, ఏప్రిల్ 2న జరుపుతామని ట్రిబ్యునల్ మంగళవారం ప్రకటించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వుపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఎం.ఎ.రవూఫ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్.వి.రమణమూర్తి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున వాదించిన న్యాయవాదుల బృందంలో సీనియర్ న్యాయవాదులు సి.ఎస్.వైద్యనాథన్, ఎస్.సత్యనారాయణ ప్రసాద్, ఎ.సత్యప్రసాద్, బాదన భాస్కరరావు, వై.రాజగోపాల్ తదితరులున్నారు. ఇదీ నేపథ్యం... వంశధార నది ఒడిశా-ఆంధ్ర సరిహద్దులో 29 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 82 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సెప్టెంబర్ 30, 1962న ఈ నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచుకోవాలనే ఒప్పందం కుదిరింది. వంశధార ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దీనిని రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ, ఎడమ ప్రధాన కాలువలను నిర్మించి 17.841 టీఎంసీల నదీ జలాలను వినియోగిస్తూ 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది. రెండవ దశలో 16.048 టీఎంసీలు వినియోగించుకుంటూ 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ప్రతిపాదించింది. నేరడి బ్యారేజి నిర్మాణానికి 106 ఎకరాల భూమి సేకరణకు ఒడిశా ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంలో ఆలస్యం అయినందున రాష్ట్ర ప్రభుత్వం వంశధార రెండవ దశ నిర్మాణాన్ని రెండు విడతలుగా చేపట్టాలని భావించింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ నుంచి కుడి ప్రధాన కాలువ నిర్మించి 0.62 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు మేరకు సైడ్‌వీయర్ నిర్మాణం ద్వారా మరో 8 టీఎంసీలను వినియోగించుకోవడానికి వీలు చిక్కింది. రెండవ దశ నిర్మాణంలో భాగంగా నేరడి బ్యారేజీ, ఫ్లడ్‌ఫ్లో కాలువ, హీర రిజర్వాయర్ నిర్మించి 45 వేల ఎకరాలకు సాగులోకి తీసుకురావడంతో పాటు గొట్టా బ్యారేజీ కుడి, ఎడమ ప్రధాన కాలువల ఆయకట్టు స్థిరీక రణ జరుగుతుంది -
భూ లబ్ధిదారులకు పంట రుణాలు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వం పంపిణీ చేసిన భూ లబ్ధిదారులకు పంట రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్. కృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూమంత్రి మాట్లాడుతూ ఇంతవరకు పలు విడతల్లో పేదలకు 77 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశామ న్నారు. అరుుతే, ఇంత వరకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు సాగుచేస్తున్న లబ్ధిదారులకు రుణాలు అందించలేదన్నారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయూన్ని చర్చిస్తామని, అందరి రైతులకు రుణాలు అందేలా జిల్లా స్థారుు అధికారులు చూడాలన్నారు. ఐ.వై.ఆర్ కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాల్లో సమీకృత మార్కెట్ యార్డులను నిర్మిస్తామన్నారు. పంట నిల్వకు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని తెలిపారు. దీనికి అవసరమైన భూమిని గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లాల్లో ప్రభుత్వ భూముల పరిస్థితి, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సమీక్షించారు. సమీకృత మార్కెట్ యార్డులను జిల్లాలోని ఉద్యానవన నర్సరీ కేంద్రాల్లో నిర్మించాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ సూచించారు. పలాస ప్రాంతంలో జీడి పరిశ్రమలు అధికంగా ఉన్నాయని, ఇక్కడ కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి పి. రజనీకాంతరావు, ఆర్డీవో గణేష్‌కుమార్, ఎన్.తేజ్‌భరత్, ఉపకలెక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య బంద్
ఢిల్లీ పెద్దల విభజన తంత్రం మరోమారు అగ్గి రాజేసింది. జిల్లా మొత్తం సమైక్య కాంక్షతో రగిలిపోయింది. టీ నోట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినందుకు నిరసనగా జిల్లాలో పూర్తి బంద్ పాటించిన ప్రజలు ధర్నాలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలతో తీవ్ర నిరసన ప్రకటించారు. ఉదయం నుంచీ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, ఏపీఎన్జీవో, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు రోడ్లపైకి వచ్చి బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆర్టీసీ కార్మికులు కూడా బంద్‌లో పాల్గొనడంతో జిల్లాలో 480 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బ్యాంకులు, వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఫ్లెక్సీని ఉద్యమకారులు చించేసి నిరసన ప్రకటించగా.. రాజాం, పలాస, పాతపట్నం, పాలకొండ తదితర ప్రాంతాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. - ఫొటో ఫీచర్ సెంటర్‌స్ప్రెడ్‌లో సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక, ఇతర ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం బంద్ విజయవంతమైంది. జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఉదయం ఆర్టీసీ సిబ్బంది బస్సులను డిపోల్లోనే ఆపివేసి నిరసన తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. కొన్నిచోట్ల దుకాణాలు, కార్యాలయాలను తెరవగా ఉద్యమకారులు మూసివేయించారు. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర, పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మార్పు ధర్మారావుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరాం, కన్వీనర్లు జామి భీమశంకర్, దుప్పల వెంకట్రావు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నాడ వెంకటరమణారావు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు డే అండ్ నైట్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తీరిగ్గా ఉదయం 10 గంటల తర్వాత వచ్చి ఆందోళన చేపట్టారు. వీరు జెండాలు పట్టుకుని పాలకొండ రోడ్ మీదుగా అంబేద్కర్ కూడలి వద్దకు వస్తుండగా.. మీ నేత చంద్రబాబు తెలంగాణ కు సై అంటే మీరిక్కడ జెండాలు పట్టుకుని తిరుతున్నారేంటని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నించారు. భారీ బందోబస్తు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక పోలీసులు, కేంద్రబలగాలను మోహరించారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం, రాజీవ్ స్వగృహ వద్దనున్న ఇందిరా గాంధీ బొమ్మ వద్ద, ఇంకా విగ్రహాలు ఉన్నచోట్ల, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాలకొండ ఆంజనేయ సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేతృత్వంలో ఏలాం జంక్షన్ వద్ద రాస్తారోకో, ధర్నా చేపట్టి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. టీడీపీ నేతలు, ఎన్జీఓలు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేపట్టి బస్సులు తిరగకుండా నిలువరించారు. సీతంపేటలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బంద్ చేపట్టి రోడ్డుపై నినాదాలు చేశారు. బస్సులను నిలిపివేశారు ఆమదాలవలసలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు విద్యార్ధులతో కలిసి ర్యాలీగా వెళ్లి రైల్వేస్టేషన్ ఎదురుగా మానవహారం నిర్వహించారు. పొందూరులో బంద్ విజయవంతమైంది. వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యురాలు కూన మంగమ్మ, పార్టీ పట్టణ, మండల యూత్ కన్వీనర్లు దవళ అప్పలనాయుడు, సింగూరు రాజు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దుకాణాలు, ప్రభుత్వ కార్యా ల యాలను మూయించారు. అనంతరం జాతీ య రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ నాయకత్వం వహించారు. ఎచ్చెర్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి కళావెంకటరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి వద్ద జాతీయ రహదారిని వైఎస్ఆర్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్, మండల కన్వీనర్ బాడాన మురళీ తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు దిగ్బంధిం చారు. దాదాపు 3 గంటల సేపు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కృపారాణి ఫ్లెక్సీలను ఉద్యమకారులు చించివేశారు. ఇచ్ఛాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. పార్టీ నేతలు దుకాణాలను మూసివేయించారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టి రోడ్డుపై బైఠాయిం చా రు. పాఠశాలలు, కళాశాలలను స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్ఆర్సీపీ మునిసిపల్, మండల కన్వీనర్లు పిలక పోలారావు, కారంగి మోహనరావు, మునిసపల్ యువజన విభాగం కన్వీనర్ పి.కోటి, జిల్లా ఎస్సీ విభాగం కన్వీనర్ సల్ల దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలంలో పార్టీ నాయకులు బంద్‌ను విజయవంతం చేశారు. పలాసలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వేకువజామున 4 గంటలకే రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూసివేయించారు. ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గరుడుఖండి గ్రామం వద్ద రోడ్డును దిగ్బంధించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ బీఈటీ స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. పరీక్షను బహిష్కరించిన చిన్నారులు మందస, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు నిరసనగా జి.ఆర్.పురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్వార్టర్లీ పరీక్షను బహిష్కరించారు. గ్రామ సర్పంచ్ కర్రి గోపాలకృష్ణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి పాఠశాలకు వెళ్లి బంద్ పాటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులను కోరారు. దీంతో విద్యార్థులు పరీక్ష రాయకుండా బయటకు వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. -
గ్రామాల్లో ‘సమైక్య’ తీర్మానాలు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ పార్టీలకు అతీతంగా పలు పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేశారు. మొత్తం 367 పంచాయతీలు తీర్మానాలు చేశాయి. వీటిలో 50 శాతం వరకు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సర్పంచ్‌లు తీర్మానాలు చేయించారు. రాజాం నియోజకవర్గంలో 80, పలాసలో 52, పాతపట్నంలో 48, ఎచ్చెర్లలో 33, ఆమదాలవలసలో 42, టెక్కలిలో 32, నరసన్నపేటలో 77, ఇచ్చాపురంలో 1, పాలకొండలో 5, శ్రీకాకుళంలో 2 పంచాయతీల్లో తీర్మానాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి సమైక్య రాష్ట్రాన్ని కోరుతుండగా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు నాల్కల దోరణిని అవలంభిస్తూ వస్తున్నాయి. పంచాయతీల్లో తీర్మానాలు చేయాలని వైఎస్సార్ సీపీ ప్రకటన వెలువరించగానే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్‌లపై ఆయా గ్రామస్తులు తీర్మానాలు చేయాలని పట్టుబట్టడంతో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేశారు. పలువురు సర్పంచ్‌లు కూడా సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీల విధానాలను తప్పు బడుతూ ఆ పార్టీలకు రాజీనామాలు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇటువంటి వారితో పాటు, రాష్ట్రం విడిపోతే వచ్చే కష్టాలను గుర్తెరిగిన సర్పంచ్‌లు కూడా తీర్మానాలు చేశారు. ఇంకొందరు ఇతర ప్రాంతాల్లో ఉండడం వలన శనివారం తీర్మానాలు చేయాలని నిర్ణయించుకున్నారు. తీర్మాన ప్రతులను శనివారం ప్రధానమంత్రి, రాష్ట్రపతులకు ఈ-మెయిల్ ద్వారా పంపించనున్నారు. శనివారం సరికి 500 పంచాయతీల వరకు తీర్మానాలు చేసి పంపించే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి, ప్రధానికి పంపండి : కృష్ణదాస్ శ్రీకాకుళం: సమైక్యాంధ్ర కావాలని కోరుతూ పంచాయతీలు చేసిన తీర్మానాల కాపీలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు ఈ-మెయిల్ ద్వారా పంపించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ కోరారు. ఞఝౌటఛఃజీఛి.జీ, ఝ్చఝౌజ్చిఃట్చట్చఛీ.జీఛి.జీ, జ్ఛ్ఛఛీఠ్చిఛ్జ్టిజీజజీఃజ్చఃజీఛి.జీ అనే వెబ్సైట్లకు పంపించాలని సూచించారు. ప్రతులను నరసన్నపేటలోని తన కార్యాలయంలో అంద జేయాలన్నారు. మంగళవారం ఉదయం కూడా తీర్మానాలు చేయవచ్చని సాయంత్రంలోగా ఈ-మెయిల్లు పంపించాలని తెలిపారు. శుక్రవారం ఉదయం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.