శ్రీకాకుళం జిల్లా : ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడీ ఫలితాలు విడుదల అయ్యాయి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్ శనివారం ఫలితాలను విడుదలచేశారు. బీఈడీలో 82శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మొత్తం 18,017 మంది పరీక్షలు రాయగా 14,090మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన చెప్పారు.