
నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఎవడే సుబ్రమణ్యం. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ద్వారానే నాగ్ అశ్విన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ విడుదలైన పదేళ్లు పూర్తి కావడంతో మరోసారి బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు.
ఇలాంటి అరుదైన సినిమాలు తరచుగా రావని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. మీలో ఎవరైనా ఈ సినిమాను చూడకపోతే తప్పుకుండా థియేటర్లకు వెళ్లి చూడాలని అభిమానులను కోరారు. నేటి యువతరం తప్పకుండా చూడాల్సిన చిత్రాల్లో ఎవడే సుబ్రమణ్యం ఒకటని ఆయన తెలిపారు. ఈ జనరేషన్‌కు మూవీ కథ సరిగ్గా సెట్ అవుతుందన్నారు. గత పదేళ్లలో చాలా చిత్రాలు వచ్చాయి.. కానీ ఆ టైమ్‌లో చూడని వాళ్లు ఎవరైనా ఉంటే చూడాలని కోరారు. ఈ సినిమా చూసి కనీసం ఒకశాతం మార్పు వచ్చినా చాలని నాగ్ అశ్విన్ వీడియోను రిలీజ్ చేశారు.
కాగా.. ఎవడే సుబ్రమణ్యం మూవీ ఈనెల 21న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం ఎవరైనా మిస్సయితే ఎంచక్కా బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment