శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ పార్టీలకు అతీతంగా పలు పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేశారు. మొత్తం 367 పంచాయతీలు తీర్మానాలు చేశాయి. వీటిలో 50 శాతం వరకు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సర్పంచ్‌లు తీర్మానాలు చేయించారు. రాజాం నియోజకవర్గంలో 80, పలాసలో 52, పాతపట్నంలో 48, ఎచ్చెర్లలో 33, ఆమదాలవలసలో 42, టెక్కలిలో 32, నరసన్నపేటలో 77, ఇచ్చాపురంలో 1, పాలకొండలో 5, శ్రీకాకుళంలో 2 పంచాయతీల్లో తీర్మానాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి సమైక్య రాష్ట్రాన్ని కోరుతుండగా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు నాల్కల దోరణిని అవలంభిస్తూ వస్తున్నాయి. పంచాయతీల్లో తీర్మానాలు చేయాలని వైఎస్సార్ సీపీ ప్రకటన వెలువరించగానే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్‌లపై ఆయా గ్రామస్తులు తీర్మానాలు చేయాలని పట్టుబట్టడంతో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేశారు. పలువురు సర్పంచ్‌లు కూడా సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీల విధానాలను తప్పు బడుతూ ఆ పార్టీలకు రాజీనామాలు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇటువంటి వారితో పాటు, రాష్ట్రం విడిపోతే వచ్చే కష్టాలను గుర్తెరిగిన సర్పంచ్‌లు కూడా తీర్మానాలు చేశారు. ఇంకొందరు ఇతర ప్రాంతాల్లో ఉండడం వలన శనివారం తీర్మానాలు చేయాలని నిర్ణయించుకున్నారు. తీర్మాన ప్రతులను శనివారం ప్రధానమంత్రి, రాష్ట్రపతులకు ఈ-మెయిల్ ద్వారా పంపించనున్నారు. శనివారం సరికి 500 పంచాయతీల వరకు తీర్మానాలు చేసి పంపించే అవకాశాలున్నాయి.
రాష్ట్రపతి, ప్రధానికి పంపండి : కృష్ణదాస్
శ్రీకాకుళం: సమైక్యాంధ్ర కావాలని కోరుతూ పంచాయతీలు చేసిన తీర్మానాల కాపీలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు ఈ-మెయిల్ ద్వారా పంపించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ కోరారు. ఞఝౌటఛఃజీఛి.జీ, ఝ్చఝౌజ్చిఃట్చట్చఛీ.జీఛి.జీ, జ్ఛ్ఛఛీఠ్చిఛ్జ్టిజీజజీఃజ్చఃజీఛి.జీ అనే వెబ్‌సైట్లకు పంపించాలని సూచించారు. ప్రతులను నరసన్నపేటలోని తన కార్యాలయంలో అంద జేయాలన్నారు. మంగళవారం ఉదయం కూడా తీర్మానాలు చేయవచ్చని సాయంత్రంలోగా ఈ-మెయిల్‌లు పంపించాలని తెలిపారు. శుక్రవారం ఉదయం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గ్రామాల్లో ‘సమైక్య’ తీర్మానాలు
Published Sat, Nov 2 2013 6:30 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement