సాక్షి, చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత(5) హత్య కేసులో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వర్షిత హత్యకు కారకులను ఉరి తీయాలని కుటుంబ సభ్యులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు విద్యార్థులు మద్దతు తెలిపి ర్యాలీ నిర్వహించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా హెటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఎక్కి విద్యార్థులు నిరసన తెలిపారు. అనంతరం మదనపల్లిలో సబ్ కలెక్టర్ చేకూరి కీర్తిని కలిసి నిందితుడు మహ్మద్ రఫీకీ ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నెల 7వ తేదిన తమ మూడవ కూతురు వర్షితను తీసుకొని తల్లిదండ్రులు ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరవ్వగా.. నిందితుడు రఫీ మండపం నుంచి వర్షితను తీసుకెళ్లి అత్యాచారం చేసి తరువాత హత్య చేసి మరునాడు కల్యాణ మండపం వెనుక గుట్టుగా పడేసిన విషయం తెలిసిందే. కాగా చిన్నారి వర్షిత హత్యాచారం కేసులోని ప్రధాన నిందితుడు పఠాన్ మహ్మద్ రఫీ (25)ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment