varshita
-
Hyderabad: భార్య చూస్తుండగా భర్త, ఇద్దరు కుమార్తెల దుర్మరణం
మేడ్చల్: మేడ్చల్ మండలం గౌడవెల్లి రైల్వే స్టేషన్లో రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన తోగరి కృష్ణ (42) తన భార్య కవిత (37), కుమార్తెలు వర్షిత (12), వరిణి (8)లతో కలిసి అత్వెల్లి పరిధిలోని రాఘ వేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. కృష్ణ రైల్వేలో ట్రాక్‌మన్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజులుగా మేడ్చల్ –మనోహరాబాద్ రూట్లో ట్రాక్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కాగా, ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్లో కృష్ణకు డ్యూటీ ఉంది. తన స్వగ్రామం లింగారెడ్డిపేటలో బోనాల పండుగ ఉండటంతో తన భార్య, ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకుని డ్యూటీ ముగిశాక లింగారెడ్డిపేట వెళ్దామని కారులో గౌడవెళ్లి స్టేషన్‌కు మధ్యాహ్నం 3గంటల సమయంలో చేరుకున్నారు. భార్య, పిల్లలను స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ప్లాట్ ఫాంపై కూర్చోబెట్టి కృష్ణ స్టేషన్ చివరిలో ట్రాక్‌పైకి పనిచేసేందుకు వెళ్లాడు. ఆయన అక్కడ పనిచేసుకుంటున్న సమయంలో చిన్న కూతురు వరిణి ట్రాక్‌పై దిగి తండ్రి వైపు వస్తోంది. ఈ క్రమంలోనే పెద్ద కూతురు, కవితకూడా ట్రాక్‌పై దిగి కృష్ణ పనిచేస్తున్నవైపు నడుస్తున్నారు. 3.45 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు గౌడవెల్లి స్టేషన్‌కు చేరింది. అక్కడ స్టాప్ లేకపోవడంతో రైలు వేగంగా వస్తుండటం, కూతుళ్లు ట్రాక్‌పైన ఉన్న విషయం గమనించిన కృష్ణ కేకలు వేసుకుంటూ పిల్లల వైపు పరిగెత్తాడు. ప్రమాదాన్ని తప్పించుకునేందుకు పెద్ద కూతు రును పట్టుకుని ట్రాక్‌కు ప్లాట్ ఫాంకు మధ్యలో గోడవైపు నిలబడ్డాడు. అయితే అప్పటికే చిన్న కూతురును రైలు ఢీకొట్టింది. కవిత మరో ట్రాక్‌పైకి వెళ్లింది. ఈ క్రమంలో గోడ మధ్యలో ఇరుక్కుపోయిన తండ్రీకూతుళ్లను కూడా రైలు వేగంగా ఢీకొనడంతో ముగ్గురూ మృతి చెందారు. ట్రాక్‌పై వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది. కవితకు విషయం అర్థమయ్యేలోపే ముగ్గురూ అనంతలోకాలకు వెళ్లిపోయారు. స్టేషన్లో ఉన్న వారు కవిత చిరునామా తెలుసుకుని బంధువు లకు, అపార్ట్మెంట్ వాసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. -
చిన్న వయసులోనే.. నూరేళ్లు నిండాయా బిడ్డా.. తీవ్ర విషాదం!
మహబూబాబాద్: తల్లి మందలించిందనే కారణంతో మనస్తాపం చెందిన ఓ బాలిక.. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం జీపీ పరిధిలోని జీన్యతండాలో జరిగింది. తండాకు చెందిన గుగులోత్ దూబ్‌సింగ్, వినోద దంపతుల కూతురు వర్షిత (10) తండాలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్లింది. చాలా సమయం తర్వాత ఇంటికి వచ్చిన బాలికను తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. -
యంగ్ టాలెంట్
థాయ్‌లాండ్‌లో పుట్టిన వర్షిత పదమూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో ఇండియాకు వచ్చింది. సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చెన్నైలోని ‘కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీ’లో మ్యూజిక్ కోర్సు చేసింది. ‘స్వర్ణభూమి అకాడమీ ఆఫ్ మ్యూజిక్’ నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరైన తరువాత జాజ్ మ్యూజిక్‌పై ఆసక్తి మొదలైంది. వర్షిత ఫస్ట్ సింగిల్ ‘స్టే’కు మంచి స్పందన వచ్చింది. స్పాటిఫై, యూట్యూబ్, సౌండ్క్లౌడ్లో ఆమె పాటలు ఎంతో ఆదరణ పొందాయి. ఇరవై సంవత్సరాల వయసులో సెవెన్ ఐలాండ్ ఫిల్మ్‌ఫెస్టివల్, కోవ్లాంగ్ పా యింట్ సర్ఫ్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్లాంటి ఎన్నో ఫెస్టివల్స్‌లో తన గాత్రాన్ని వినిపించింది వర్షిత. ఏఆర్రెహమాన్ మ్యూజిక్ ట్రూప్‌లో భాగంగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. 22 సంవత్సరాల వర్షిత పాటలు పడడంలోనే కాదు రాయడంలో కూడా ప్రతిభ చూపుతుంది.వర్షిత ΄పాటల్లో ఎంత మాధుర్యం ఉంటుందో, మాటల్లో అంత ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. వ్యక్తిత్వ వికాస కోణంలో ఎన్నో కళాశాలల్లో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇచ్చింది. -
ఎల్బీ నగర్ ఘటన: చిన్నారి వర్షితది ఆత్మహత్యే
నాగోలు: అనేక ప్రశ్నలు.. ఎన్నో అనుమానాల బాలిక వర్షిత మృతి కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరో తరగతి విద్యార్థిని వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బాలిక మృతి పట్ల వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఆయన చెప్పారు. బాలికను తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ దుర్గేష్‌ను విచారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏసీపీ కథనం ప్రకారం వివరాలు.. మన్సురాబాద్‌లోని మధురానగర్‌లో కాలనీ రోడ్డు నంబర్– 5లో ఉంటున్న సత్యనారాణరెడ్డి, ప్రభావతి దంపతుల కూతురు వర్షిత. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన బాలిక చిప్స్ కొనుకుంటానంటూ దుకాణానికి వెళ్లింది. మన్సూరాబాద్ చౌరస్తాకు వచ్చి ఆటో ఎక్కింది. అక్కడ నుండి ఎల్బీనగర్ చౌరస్తా మీదగా చంద్రపూరి కాలనీ రోడ్డునెం. 2/బీ కు వెళ్లి ఆటో అతని రూ. 50 ఇచ్చి అక్కడ దిగింది. ఆటోలో వెళ్లే క్రమంలో తన తండ్రికి ఫోన్ చేయాలని డ్రైవర్‌కు నంబర్ చెప్పింది. ఫోన్ బిజీగా రావడంతో ఆటో డ్రైవర్ వర్షితను అపార్ట్మెంట్ వద్ద దించేశాడు. అక్కడ ఉన్న వాచ్‌మన్ వెంకటమ్మ వర్షిత బిల్డింగ్‌పైకి వెళ్తుండగా.. ఎవరు కావాలని అడిగింది. మా నాన్న కోసం వచ్చానంటూ చెప్పి బిల్డింగ్‌పైకి వెళ్లింది. వాచ్‌మన్ తన కుమారుడైన రాజున బిల్డిండ్‌పైకి పంపగా ఎవరూ కనిపించలేదు.. ఇంతలోనే వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి కావాలనే నాలుగో అంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక వర్షితపై లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలో వైద్య పరీక్షలు చేయగా.. అలాంటిదేమీ లేదని వెల్లడైందన్నారు. చదువులో ముందుండే వర్షిత.. అందరితోనూ కలుపుగోలుగా మసలుకునేదని కాలనీవాసులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబంలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో సున్నిత మనస్కురాలైన వర్షిత కొంత ప్రభావితమై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సమాచారం. (చదవండి: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్ ఫోన్ కాల్ కీలకం!) -
ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య
ఖమ్మం క్రైం: ప్రేమ పేరుతో మైనర్ బాలికను ఓ వ్యక్తి వేధిస్తుండటంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని తల్లాడ గ్రామానికి చెందిన కుసుమరాజు వర్షిత (17) తండ్రి మృతిచెందగా కుటుంబపోషణ నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఇదే ఆస్పత్రిలో తిరువూరు మండలం మునుకోళ్లకు చెందిన మల్లవరపు మధుకుమార్ కూడా పనిచేస్తున్నాడు. తనను ప్రేమించమని, కోరిక తీర్చాలని మధు ఆమెను వేధించేవాడు. దీనికితోడు ఆమె జీతం నుంచి డబ్బు తీసుకున్నాడు. వేధింపులు పెరగడంతో వర్షిత ఇటీవల మరో ఆస్పత్రిలో చేరింది. అయినా అప్పటికే పెళ్లి అయిన మధుకుమార్ వేధింపులు ఆగకపోగా.. ఆమెతో ఫోన్లో మాట్లాడినప్పుడు రికార్డు చేసిన వాయిస్‌ను బయటపెడతానని బెదిరించసాగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఉదయం తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వెంటనే స్నేహితురాలు వర్షిత తల్లికి ఫోన్ చేయగా ఆమె ఖమ్మం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహం పక్కన ఇంజక్షన్, సిరంజీ ఉండడంతో విషం ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. టూటౌన్ సీఐ శ్రీధర్, ఎస్ఐ రాములు మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ బాధ్యుల సహకారంతో మార్చురీకి తరలించారు. మధుకుమార్‌పై పోక్సోతోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. -
వర్షిత కేసు: చిత్తూరు కోర్టు సంచలన తీర్పు
సాక్షి, చిత్తూరు: సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారి వర్షితపై కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన రఫీని దోషిగా తేలుస్తూ ఉరి శిక్ష విధించింది. గతేడాది నవంబర్ 7న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన చిన్నారిని మదనపల్లి మండలానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ అత్యాచారం చేసి ఆపై హత మార్చాడు. చిన్నారికి చాక్లెట్ తీసిస్తానని చెప్పి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందుతుడిని లారీ క్లీనర్ రఫీగా గుర్తించారు. అయితే హత్యానంతరం రఫీ ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయి పోలీసులు గుర్తుపట్టకుండా గుండు గీయించుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదులో భాగంగా పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టి రఫిని పట్టుకున్నారు. రఫిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు అతనిపై హత్య, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇతడు గతంలోనూ పలువురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. డిసెంబర్ 30వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను విచారించిన కోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించింది. తీర్పుపై స్పందించిన హోంమంత్రి సుచరిత: చిత్తూరు సెషన్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై హోంమంత్రి సుచరిత స్పందించారు. చిన్నారి పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా.. పోలీసులు సేకరించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించడంతో హత్య జరిగిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. డిసెంబర్ 30వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను విచారించిన కోర్టు ఎట్టకేలకు ఈ రోజు తుది తీర్పు వెల్లడించింది. బాలికపై అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన నిందితుడికి పోస్కో చట్టం కింద మరణశిక్ష విధించడం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిసారని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఆడుకుంటూనే.. పోయింది! లైంగికదాడి.. హత్య! -
చిన్నారి వర్షిత కేసులో సంచలన తీర్పు
-
చిన్నారి వర్షిత హత్య కేసు వాయిదా
-
చిన్నారి వర్షిత కేసు తీర్పు వాయిదా
సాక్షి, చిత్తూరు : మదనపల్లె సమీపంలోని అంగళ్లులో గతేడాది నవంబర్ 7న హత్యకు గురైన చిన్నారి వర్షిత కేసు తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. తన వాదనలు వినేందుకు సమయం కావాలని ముద్దాయి రఫీ కోరడంతో కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు. వాదనలు విన్న తర్వాతే తీర్పు ఇచ్చే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోకనాథ్ పేర్కొన్నారు. కాగా, గతేడాది నవంబర్ 7న మదనపల్లె సమీపంలోని అంగళ్లులో చిన్నారి వర్షిత హత్యాచారానికి గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మదనపల్లె మండలంలోని బసినికొండకు చెందిన లారీ క్లీనర్ మహ్మద్ రఫీ(27) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. అప్పటికే తప్పించుకున్న నిందితుడు ఛత్తీస్‌ఘడ్‌కు పారిపోయాడు. కేసును చాలెంజ్‌గా తీసుకున్న ఎస్పీ సెంథిల్ కుమార్ నిందితుడిని పట్టుకోవడానికి మదనపల్లె డీఎస్పీ రవిమనోహరచ్చారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నియమించారు. ఎట్టకేలకు నవంబర్ 16న రఫీని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరపరిచారు. ఈ ఘటనకు సంబంధించి పలు ఆధారాలు సేకరించి న్యాయస్థానానికి అందజేశారు. నేరం జరిగిన 17 రోజుల్లోనే చార్జిషీట్ పత్రాన్ని న్యాయస్థానానికి అందించారు. చిత్తూరులోని జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి వెంకట హరినాథ్ ఈ కేసు విచారణ ప్రారంభించారు. పోలీసులు ఇచ్చిన అన్ని సాక్ష్యాలను పరిశీలించారు. ఈనెల 14న విచారణ కూడా పూర్తయింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తారనే ప్రచారంతో బాధితులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కేసును ఈ నెల 18కి వాయిదా వేశారు. -
చిన్నారి వర్షిత కేసులో నేడు తుది తీర్పు
-
వర్షిత కేసు; ‘నిందితుడిని ఉరి తీయాలి’
సాక్షి, చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత(5) హత్య కేసులో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వర్షిత హత్యకు కారకులను ఉరి తీయాలని కుటుంబ సభ్యులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు విద్యార్థులు మద్దతు తెలిపి ర్యాలీ నిర్వహించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా హెటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఎక్కి విద్యార్థులు నిరసన తెలిపారు. అనంతరం మదనపల్లిలో సబ్ కలెక్టర్ చేకూరి కీర్తిని కలిసి నిందితుడు మహ్మద్ రఫీకీ ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నెల 7వ తేదిన తమ మూడవ కూతురు వర్షితను తీసుకొని తల్లిదండ్రులు ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరవ్వగా.. నిందితుడు రఫీ మండపం నుంచి వర్షితను తీసుకెళ్లి అత్యాచారం చేసి తరువాత హత్య చేసి మరునాడు కల్యాణ మండపం వెనుక గుట్టుగా పడేసిన విషయం తెలిసిందే. కాగా చిన్నారి వర్షిత హత్యాచారం కేసులోని ప్రధాన నిందితుడు పఠాన్ మహ్మద్ రఫీ (25)ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
గతంలో నిందితుడిపై లైంగిక దాడి కేసులున్నాయి
-
వర్షిత హంతకుడి సీసీ ఫుటేజీ చిత్రాలు విడుదల
కురబలకోట (చిత్తూరు జిల్లా):రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన చిన్నారి వర్షిత హత్య కేసు నిందితుడి సీసీ ఫుటేజీ చిత్రాలను సోమవారం డీఎస్పీ రవి మనోహరాచారి విడుదల చేశారు. ఇటీవల మదనపల్లె సమీపంలోని చేనేత నగర్ కల్యాణ మండపం వద్ద చిన్నారి వర్షిత దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సోమవారం కల్యాణ మండపంలో సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో నమోదైన చిత్రాలను పత్రికలకు విడుదల చేశారు. ఇలాంటి పోలికలున్న వారి ఆచూకీ లభిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. 9440796738, 9440617891, 9440900705, 8885588558 నంబర్లకు ఆచూకీ తెలపాల్సిందిగా కోరారు. -
ఆడుకుంటూనే.. పోయింది!
కురబలకోట : మానవ మృగం చేతిలో బలైన చిన్నారి వర్షిత (6) ఆడుకుంటూనే నిందితుడి వెంట వెళ్లింది. సీసీ కెమెరాల ఫుటేజిల్లో ఈ విషయం స్పష్టమైంది. మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి, రూరల్ సర్కిల్ సీఐ అశోక్ కుమార్, ముదివేడు ఎస్ఐ సుకుమార్ మరోసారి ఆదివారం కల్యాణ మండపం సీసీ కెమెరాల్లోని ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలించారు. సంఘటన జరిగిన రాత్రి 9. 54 గంటలకు నిందితుడి వెంట చిన్నారి వర్షిత ఎంతో సరదాగా నడిచింది. ఏ మాత్రం బెరకు, భయం లేనట్లు సంతోషంగా వెళ్లడం సీసీ ఫుటేజీలో కనిపించింది. ఒక చోట వర్షితను నిందితుడు ఫొటో తీశాడు. ఆ తర్వాత నిందితుడి కంటే ముందుగా వర్షిత ఆడుకుంటూ.. మెల్లగా పరుగెత్తుకుంటూ వెళ్లినట్లు ఉంది. చిన్నారి వెనక నిందితుడు వెళ్లినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత చిన్నారి ఏ సీసీ కెమెరాలోను కనిపించలేదు. కొంత సేపటికే 10.15 గంటలకు నిందితుడిగా భావిస్తున్న ఒక్కడే తిరిగి కల్యాణ మండపంలోకి చేరుకున్నాడు. చేతిలో ఐస్‌క్రీమ్ ప్యాకెట్‌తో బయటకు వెళుతున్నట్లు కనిపించింది. అంతే ఇతను కూడా ఆ తర్వాత ఏ కెమెరాలోనూ రికార్డు కాలేదు. ఎంతో కాలంగా తెలిసిన వ్యక్తితో వెళ్లినట్లుగా చిన్నారి ఆడుకుంటూ నిందితుడి వెంట ళ్లడం సీసీ ఫుటేజీల్లో చూసిన పోలీసుల కళ్లు సైతం చెమర్చాయి. సామాజిక మాధ్యమంలో సీసీ ఫుటేజీని చూసిన వారిని చలింపజేస్తోంది. బంధుమిత్రులు ఇప్పటికీ తల్లడిల్లిపోతున్నారు. ఎంత ఘాతుకానికి పాల్డడ్డారని నిట్టూరుస్తున్నారు. 478 మందికి పైగా విచారణ సంఘటన జరిగినప్పటి నుంచి వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరు టీమ్‌లు విచారణ జరుపుతున్నాయి. ఆదివారం వరకు 478 మందిని విచారించినట్లు చెబుతున్నారు. ఏ మాత్రం క్లూ లభ్యం కాలేదు. ఆదివారం వాట్సాప్, ఫేస్బుక్కులో అనుమానితుడి ఊహాచిత్రాన్ని పోలీన ఓ యువకుడి ఫొటో హల్చల్ చేసింది. అయితే పెద్దతిప్పసముద్రం మండలంలోని ఓ కేసులో నిందితుడిగా అతన్ని గుర్తించారు. హర్షిత కేసుకు అతనికి సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు. -
వర్షిత హంతకుడు ఇతడే!
కురబలకోట (చిత్తూరు)/సాక్షి, అమరావతి: సంచలనం రేపిన ఐదేళ్ల చిన్నారి వర్షిత హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఊహా చిత్రాన్ని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి ఆదివారం విడుదల చేశారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన వర్షిత ఇటీవల చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో అత్యాచారం.. ఆపై హత్యకు గురైన విషయం తెలిసిందే. కల్యాణ మండపం సీసీ ఫుటేజీలో నిందితుడి ఆకారం స్పష్టంగా కన్పించలేదని డీఎస్పీ చెప్పారు. పెళ్లిలో అతన్ని చూసిన వారు చెప్పిన ఆనవాళ్లతో పాటు ఫుటేజీలోని ఆకారం ఆధారంగా ఈ ఊహా చిత్రాన్ని రూపొందించామన్నారు. ఇలాంటి పోలికలున్న వ్యక్తి కనిపిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే, ఫుటేజీలో లభ్యమైన నిందితుడి ఫొటోను కూడా ఆదివారం పోలీసులు పత్రికలకు విడుదల చేశారు. కఠినశిక్ష పడేలా చూడండి చిన్నారి హత్య తీవ్రంగా కలచివేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య ఘటన తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని చెప్పారు. దారుణ ఘటనకు పాల్పడ్డ వ్యక్తికి కఠిన శిక్షపడేలా చూడాలని పోలీసులను సీఎం ఆదేశించారు. -
లైంగికదాడి.. హత్య!
బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు. ప్రశ్నిస్తే పెళ్లి బస్సు సిబ్బంది అన్నాడు.. గురువారం రాత్రి పెళ్లికి వచ్చిన ఆ అగంతకుడు .. ఓసారి పెళ్లికొడుకు తరఫు మనిషినని.. మరోసారి పెళ్లికుమార్తె తరఫున అని పొంతన లేకుండా చెప్పాడని.. మరి కొందరితో పెళ్లి బస్సు సిబ్బంది అని చెప్పాడని పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో అతనే హంతకుడై ఉంటాడని అనుమానిస్తున్నారు. హంతకుడు కర్ణాటక వాసి? కల్యాణమండపంలో సంచరించిన హంతకుడి ఆనవాళ్లను సీసీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు కర్ణాటక వాసిగా నిర్థారణకు వచ్చారు. దీంతో అతనికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, కోలార్, కేజీఎఫ్ జిల్లాలోని డీసీఆర్‌బీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హంతకుడిని పట్టుకునేందుకు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మానవ మృగాల ఆట కట్టిస్తాం అభం శుభం తెలియని చిన్నారులను బలిగొనే మానవ మృగాల ఆట కట్టిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. దారుణ హత్యాచారానికి గురయిన బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాళ్యంకు చెందిన వర్షిత (5) కుటుంబాన్ని శనివారం ఆమె తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్షిత హంతకుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మద్యం మత్తులో కట్టుకున్న భార్యను హతమార్చాడు. దీంతో నాలుగేళ్ల చిన్నారి అనాధలా మారింది. తల్లి లేని ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తుండటం గమనించిన బంధువులు ఆ చిన్నారిని తల్లి మృతదేహంతో సహా తీసుకెళ్లి తండ్రి ఇంటి ముందు ఆందోళన చేశారు. వరంగల్ జిల్లా మల్కాపురానికి చెందిన ఓ జంట నగరంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన భర్త భార్యను హతమార్చి పరారాయ్యాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు నాలుగేళ్ల వర్షితను మల్కాపురం తీసుకెళ్లి అతని ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.