
పోలీసులు విడుదల చేసిన నిందితుడి ఫొటో
కురబలకోట (చిత్తూరు జిల్లా):రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన చిన్నారి వర్షిత హత్య కేసు నిందితుడి సీసీ ఫుటేజీ చిత్రాలను సోమవారం డీఎస్పీ రవి మనోహరాచారి విడుదల చేశారు. ఇటీవల మదనపల్లె సమీపంలోని చేనేత నగర్ కల్యాణ మండపం వద్ద చిన్నారి వర్షిత దారుణ హత్యకు గురైన విషయం విదితమే.
సోమవారం కల్యాణ మండపంలో సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో నమోదైన చిత్రాలను పత్రికలకు విడుదల చేశారు. ఇలాంటి పోలికలున్న వారి ఆచూకీ లభిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. 9440796738, 9440617891, 9440900705, 8885588558 నంబర్లకు ఆచూకీ తెలపాల్సిందిగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment