వర్షిత తల్లిదండ్రులను పరామర్శిస్తున్న వాసిరెడ్డి పద్మ, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు.
ప్రశ్నిస్తే పెళ్లి బస్సు సిబ్బంది అన్నాడు..
గురువారం రాత్రి పెళ్లికి వచ్చిన ఆ అగంతకుడు .. ఓసారి పెళ్లికొడుకు తరఫు మనిషినని.. మరోసారి పెళ్లికుమార్తె తరఫున అని పొంతన లేకుండా చెప్పాడని.. మరి కొందరితో పెళ్లి బస్సు సిబ్బంది అని చెప్పాడని పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో అతనే హంతకుడై ఉంటాడని అనుమానిస్తున్నారు.
హంతకుడు కర్ణాటక వాసి?
కల్యాణమండపంలో సంచరించిన హంతకుడి ఆనవాళ్లను సీసీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు కర్ణాటక వాసిగా నిర్థారణకు వచ్చారు. దీంతో అతనికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, కోలార్, కేజీఎఫ్ జిల్లాలోని డీసీఆర్‌బీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హంతకుడిని పట్టుకునేందుకు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
మానవ మృగాల ఆట కట్టిస్తాం
అభం శుభం తెలియని చిన్నారులను బలిగొనే మానవ మృగాల ఆట కట్టిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. దారుణ హత్యాచారానికి గురయిన బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాళ్యంకు చెందిన వర్షిత (5) కుటుంబాన్ని శనివారం ఆమె తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్షిత హంతకుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment