కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ‘ఈ కేసుపై విచారణ చేపట్టాం. ఢిల్లీ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ వైద్య బృందాలు వచ్చాయి’అని సీబీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
మరోవైపు.. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక హత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదికతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు జూనియర్ డాక్టర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి.
#WATCH | After reaching RG Kar Medical College and Hospital in Kolkata earlier today, a CBI official says "We have taken over the investigation. FSL team and medical teams have come from Delhi..." pic.twitter.com/LnEERH5ymN
— ANI (@ANI) August 14, 2024
జూనియర్ డాక్టర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించినట్లు తెలుస్తోంది.
తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు కోల్‌కతా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించిన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం రిపోర్టు వెల్లడించిన అంశాలు.. ఆమెపై సామూహిక హత్యచారం జరిగే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment