postmortem report
-
వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్!
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలను పోస్ట్‌మార్టం నివేదిక బలపరుస్తోంది. మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచి్చతంగా గ్యాంగ్ రేపేనని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు. ‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది’’ అన్నారు. ఒళ్లంతా గాయాలే నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో విస్మయకర వివరాలున్నాయి. ‘‘రేప్ చేశాక గొంతు నులిమి చంపారు. పెనుగులాట సందర్భంగా కదలకుండా తలను గోడకు బలంగా అదమడంతో వెనక వైపు పెద్ద గాయమైంది. ముఖమంతా గీసుకుపోయింది. కేకలు వేయకుండా నోరు మూసేశారు. గొంతుపై బలంగా నొక్కడంతో థైరాయిడ్ కార్డిలేజ్ చితికిపోయింది. జననాంగాల వద్ద లోతైన గాయమైంది. లైంగికదాడే అందుకు కారణం. నడుము, పెదాలు, చేతి వేళ్లు, ఎడమ కాలిపై గాయాలున్నాయి. రెండు కళ్ల నుంచి, నోటి నుంచి రక్తస్రావమైంది. ముక్కు, నోరు గట్టిగా అదిమిపట్టి మూసేసినట్లు చర్మం కమిలింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘కాళ్లు పూర్తిగా 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి. కటిభాగం వద్ద ‘పెలి్వక్ గార్డిల్’ చీలిపోయింది. అంటే కాళ్లను పూర్తిగా పక్కకు విరిచేశారు’ అని వైద్యురాలి బంధువు ఒకావిడ విలపిస్తూ చెప్పారు. మూడు గంటలు బయటే నిలబెట్టారు మృతదేహాన్ని చూపించకుండా ఆస్పత్రి బయట మూడు గంటలు బయటే నిలబెట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ‘‘తర్వాత తండ్రిని అనుమతించారు. తన ఒంటిపై బట్టల్లేవు. కాళ్లు పక్కకు విరిచేసినట్లు ఫొటోలోకనిపిస్తోంది. కళ్లద్దాల ముక్కలు కంట్లో ఉన్నాయి. ఊపిరాడకుండా చేసి చంపేశారు’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. -
కోల్‌కతా: సంచలన రిపోర్టు.. డాక్టర్‌పై సామూహిక అత్యాచారం?
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ‘ఈ కేసుపై విచారణ చేపట్టాం. ఢిల్లీ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ వైద్య బృందాలు వచ్చాయి’అని సీబీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. మరోవైపు.. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక హత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదికతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు జూనియర్ డాక్టర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి.#WATCH | After reaching RG Kar Medical College and Hospital in Kolkata earlier today, a CBI official says "We have taken over the investigation. FSL team and medical teams have come from Delhi..." pic.twitter.com/LnEERH5ymN— ANI (@ANI) August 14, 2024 జూనియర్ డాక్టర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించినట్లు తెలుస్తోంది. తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు కోల్‌కతా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించిన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం రిపోర్టు వెల్లడించిన అంశాలు.. ఆమెపై సామూహిక హత్యచారం జరిగే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్?
సాక్షి, జగిత్యాల జిల్లా: సంచలనం సృష్టించిన కోరుట్ల దీప్తి మృతి కేసులో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కీలకం కానుంది. ఈ రోజు వైద్యులు ఇచ్చే పోస్ట్‌మార్టం నివేదికలో మరిన్ని విషయాలు బయటకురానున్నాయి. మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన దీప్తి ఒంటిపై స్వల్పగాయాలు ఉన్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు తెలిసింది. దీప్తి చెల్లె చందన, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఆ రాత్రి ఇంట్లో మద్యం పార్టీ అనంతరం వెళ్లిపోవడంతో పలు అనుమానాలు నెలకొన్నాయి. చందన తాను అక్కను చంపలేదని తమ్ముడు సాయికి వాయిస్ మేసేజ్ పంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చందన ఆడియో కాల్స్‌పై పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు. అలాగే నిన్న అంతా హైలెట్ అయిన కోరుట్ల బస్టాండ్‌లో సీసీ కెమెరా ఫుటేజ్ చందన, ఆమె బాయ్ ఫ్రెండ్‌ది కాదని పోలీసులు తేల్చారు. చందన వాయిస్ మెసేజ్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. కోరుట్ల బస్టాండ్‌లో మంగళవారం ఉదయం కనిపించిన సీసీ ఫుటేజీ చిత్రాలు.. చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌వి కావనే సమాచారంతో విచారణ గందరగోళంగా మారింది. అయితే, చందన బాయ్ ఫ్రెండ్ కారులో వచ్చి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఆమె వాయిస్ మేసేజ్ వచ్చిన సెల్‌ఫోన్ ఆధారంగా రెండు బృందాలు హైదరాబాద్‌కు చేరుకుని గాలింపు చేపట్టాయి. చదవండి: నా తప్పేం లేదు.. నాకు అక్కను చంపే ఉద్దేశమే లేదు.. బంక శ్రీనివాస్‌రెడ్డి(దీప్తి తండ్రి) ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, సుమారు 50 తులాల వరకు బంగారు ఆభరణాలు మాయమైనట్లు సమాచారం. ఇంట్లోనుంచి వెళ్లిపోయిన చందన.. డబ్బులు తాను తీసుకున్నట్లు వాయిస్ మేసేజ్‌లో చెప్పినా.. బంగారం విషయం ఎత్తలేదు. బంగారం సైతం చందన తీసుకెళ్లి ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చందన తన క్లాస్మేట్ ఒకరితో కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటోందని, అతడితో కలిసి డబ్బులు, నగలు తీసుకు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
లేడీ సింగం పోస్టుమార్టంలో సంచలన విషయం
గువాహటి: లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న అసోం ఎస్సై జున్మోని రభా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు వెలువడటంతో కొత్తకోణం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినప్పటికీ.. జున్మోని శరీరంపై వెనకభాగంలో అనేక గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడికావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు వైపుల అనేక పక్కటెముకలకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. అంతేగాక బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా జున్మోని రభా మరణించారని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. ఆమె రెండు మోకాళ్లు, కాళ్లు మోచేతి,చేతులపై గాయాలు గుర్తులు కనిపించినట్లు తేలింది. కుటుంబ సభ్యుల అనుమానం మోరికోలాంగ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రభా.. మంగళవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జున్మోని రభా సివిల్ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేట్ కారులో వెళ్తుండగా నాగోన్ జిల్లాలోఈ ఘోరం జరిగింది. అయితే ఈ ప్రమాదంపై రభా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్లానింగ్ తోనే ఈ హత్య జరిగిందని జున్మోని రభా తల్లి సుమిత్రా రభా ఆరోపిస్తున్నారు. నిజాన్ని తెలుసుకోవడానికి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన ప్రణబ్ దాస్‌ను సీన్ రీ క్రియేట్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య గౌహతి నుండి గురువారం సాయంత్రం నాగోన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదంపై టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం అతన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాస్‌ను నాగాన్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ముందు హాజరుపరిచారు. చదవండి: సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల నియామకం.. 34కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య అయితే ఘటన జరిగినప్పుడు తాను గువాహటి నుంచి వస్తున్నట్లు ప్రణబ్ దాస్ తెలిపారు. రోడ్డుకు ఎడమ పక్కన కారు పార్క్ చేసి ఉందని, ఇంతలో ఓ ట్రక్లు ఎదురుగా దూసుకొచ్చి కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు బ్లాక్ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి కారు నుంచి దిగి కిందకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపు తాను అక్కడే ఉండగా.. పోలీసులు మాత్రం తనను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆరోపించారు. నిందితుడి లోంగుబాటు ఎస్సై జన్మోని రభా మృతి కేసులో ప్రధాన నిందితుడైన పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ అస్సాం పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను సుమిత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుమిత్‌ను జఖలబంధ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుమిత్ అదుపులో ఉన్నాడని అతన్ని విచారించిన అనంతరం కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. స్పందించిన సీఎం జన్మోని మరణంపై ఎట్టకేలకు సీఎం హిమాంత బిస్వా శర్మ నోరు విప్పారు. పోలీసు మృతిపై సీఐడీతోపాటు.. మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే కేసును సీబీకి అప్పగించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది సున్నితమైన విషయమని, ఈ ఘటనలో చాలా కోణాలు ఉన్నాయన్నారు. దీనికి మొత్తం పోలీస్ శాఖపై అంటిపెట్టడం సరైనది కాదన్నారు. కాబోయే భర్తను అరెస్ట్ చేయించి ఒకప్పుడు ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడని కాబోయే భర్తను అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది రభా. నేరుస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఆమెను దబాంగ్ కాప్ అని కూడా పిలిచేవారు. అయితే డేరింగ్ పోలీస్ అధికారిగా పేరు సంపాదించిన ఆమెను పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. జున్మోని రభాకు ఎంత పేరుందో అంతకుమించిన వివాదాలు కూడా ఉన్నాయి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని జున్మోని రభాపై అభియోగాలు రావడంతో కాబోయే భర్తతోపాటు ఆమె కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మజులీ జిల్లాకోర్టు జ్యూడిషీయల్ కస్టడీ విధించడంతో విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యేతో వివాదం గత ఏడాది జనవరిలో భుయాన్ నియోజకవర్గంలో చట్టవిరుద్ధంగా అమర్చిన యంత్రాలతో బోట్లను నడుపుతున్నారనే ఆరోపణలపై కొందరు బోట్ మెన్ లను రభా అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడీయో టేప్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ...ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలంటూ రభాకు సూచించారు. -
ప్రీతి సూసైడ్‌కు అతడే కారణం: సీపీ రంగనాథ్
సాక్షి, వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ధారవత్ ప్రీతి నాయక్ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. ఆమెది ఆత్మహత్యేనని ప్రకటించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ఈ మేరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని ప్రకటించారాయన. ప్రీతిది ఆత్మహత్యేనని స్పష్టం చేసిన ఆయన.. ఇందుకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నాం. ఐపీసీ సెక్షన్ 306 కింద చర్యలు తీసుకుంటున్నాం. ప్రీతి ఆత్మహత్య కు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రధాన కారణం. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌కు వరంగల్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని సైఫ్ బెయిల్ ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. సైఫ్‌కు బెయిల్‌పై విడుదలైన మర్నాడే ప్రీతి సూసైడ్ కేసులో వరంగల్ సీపీ కీలక ప్రకటన చేయడం గమనార్హం. ఇదీ చదవండి: నరబలి కాదు.. ఆర్థిక వివాదాలే కారణం -
మెడికో ప్రీతీ మృతిపై వీడని మిస్టరీ
-
అంజలి మద్యం సేవించలేదన్న పోస్టుమార్టం నివేదిక
-
కల్యాణ మండపంలో నవ వధువు మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు టెస్టులు నిర్వహించిన తర్వాత వైద్యులు రిపోర్టు అందించారు. ఈ రిపోర్టు అందిన తర్వాత పీఎం పాలెం సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. సృజన పాయిజన్ తీసుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారని తెలిపారు. అయితే, పాయిజన్ ఎందుకు తీసుకుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విశాఖ నార్త్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘సృజనది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశాము. సృజన అన్నౌన్ పాయిజన్ తీసుకొని చనిపోయినట్లు ఇండస్ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్టు నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆమె బ్యాగులో గన్నేరు కాయల తొక్కు లభించింది. అది ఎలా వచ్చింది అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నాము. ఇప్పటికే కొంతమందిని విచారించాం. సృజనా మృతిలో వాస్తవాలు తెలియాలంటే ఆమె తల్లిదండ్రులు కూడా వాస్తవాలు చెప్పాలి. సృజన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము’’ అని అన్నారు. అయితే, బుధవారం రాత్రి పెళ్లి సందర్భంగా నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతకు ముందు వధువు మృతిపై ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం -
తేజస్విని డెడ్ బాడీ కలకలం.. లవర్ ఇటుక బట్టి వద్ద..
సాక్షి, శ్రీ సత్యసాయి: జిల్లాలోని గోరంట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న తేజస్విని అనుమానాస్పదంగా మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది. అయితే, కొంత కాలంగా తిరుపతికి చెందిన సాధిక్, తేజస్విని ప్రేమించుకుంటున్నారని ఆమె పేరెంట్స్ చెప్పారు. తేజస్విని ప్రియుడు సాధికే హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తేజస్విని కూడా.. సాధిక్ నడుపుతున్న ఇటుక బట్టి వద్దే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకోవడం వారి ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తేజస్విని డెడ్ బాడీని మరోసారి పోస్టుమార్టంకు పంపించారు. కాగా, శుక్రవారం వచ్చిన రిపోర్టుల్లో ఆమెపై అత్యాచారం జరగలేదని, ఆమెను ఆత్మహత్య చేసుకుందని వైద్యులు నిర్ధారించారు. తేజస్విని ఆత్మహత్యేనని, ఆమె ఉరివేసుకొని చనిపోయినట్టు వైద్యులు ప్రాథమికంగా రిపోర్టులో ధృవీకరించారు. దీంతో ఆమె మృతిపై సస్పెన్స్ వీడింది. ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అంతలోనే.. -
షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..!
Shane Warne Had Been On Extreme Liquid Diet Before Death: స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణంపై థాయ్ పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనలో వార్న్ 14 రోజుల కఠినమైన లిక్విడ్ డైట్ (ద్రవ రూపంలో ఉన్న ఆహారం) ఫాలో అయ్యాడని, ఇదే అతని మరణానికి పరోక్షంగా కారణమైందని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మృతి చెందడానికి ఒక్క రోజు ముందే వార్న్ తన డైట్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడని, గతంలో కూడా అతను ఇలాంటి అర్థం పర్థం లేని డైట్లు ఫాలో అయ్యేవాడని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ తెలిపాడు. థాయ్‌లాండ్ వెకేషన్‌కు బయల్దేరే ముందు ఛాతీలో నొప్పి వస్తుందని, విపరీతంగా చమటలు పడుతున్నాయని వార్న్ తనతో చెప్పాడని ఎర్స్కిన్ వెల్లడించాడు. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం డాక్టర్‌ను కూడా కలిశాడని ఆయన పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, వార్న్ గుండెపోటుతోనే మరణించాడని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు థాయ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. వార్న్ విల్లా గదిలో ఫ్లోర్‌తో పాటు టవల్స్‌పై రక్తపు మరకల్ని గుర్తించిన మాట వాస్తవమేనని, సీపీఆర్ చేసే క్రమంలో వార్న్ రక్తపు వాంతులు చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. వార్న్ మరణానికి ముందు మద్యం తీసుకోలేదని, గత కొంతకాలంగా అతను మద్యం తీసుకున్నట్లు రుజువులు లేవని స్పష్టం చేశారు. Operation shred has started (10 days in) & the goal by July is to get back to this shape from a few years ago ! Let’s go 💪🏻👏🏻 #heathy #fitness #feelgoodfriday pic.twitter.com/EokgT2Hyhz — Shane Warne (@ShaneWarne) February 28, 2022 వార్న్‌కు గుండెపోటు రావడానికి కఠినమైన డైట్‌తో పాటు తీవ్రమైన వర్కౌట్స్ కారణమయ్యాయని, ఫిబ్రవరి 28 వార్న్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తుందని వెల్లడించారు. వార్న్ చేసిన ట్వీట్లో తన ఫోటోను షేర్ చేసి మరికొద్ది రోజుల్లో ఇలా తయారవుతానని, ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతుందని, జూలై కంతా ఫిట్‌గా తయారవ్వడమే లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా, వెకేషన్ ఎంజాయ్ చేయడానికి థాయ్‌లాండ్‌కు వెళ్లిన వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. చదవండి: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! -
తీవ్ర రక్తస్రావం, షాక్‌తో దుబే మృతి..
లక్నో : ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపిన ఘటనలో ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు షాక్‌కు గురై మరణించాడని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈనెల 10న దుబే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పట్టుబడగా ప్రత్యేక వాహనంలో అతడిని కాన్పూర్‌కు తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ దుబే మరణించాడు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం మూడు బుల్లెట్లు దుబే శరీరంలోకి దూసుకెళ్లాయి. ఆయన శరీరంపై పది గాయాలయ్యాయని, తొలి బుల్లెట్ దుబే కుడి భుజానికి, రెండు బుల్లెట్లు ఛాతీ ఎడమవైపు చొచ్చుకువెళ్లాయని నివేదికలో వెల్లడైంది. దుబే తల, మోచేయి, కడుపు భాగంలోనూ గాయాలున్నట్టు నివేదిక పేర్కొంది. మహంకాళి దేవాలయంలో పూజలు చేసేందుకు ఉజ్జయిని వచ్చిన దుబేను ఈనెల 9న మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్పూర్‌కు సమీపంలోని బిక్రు గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను చంపిన కేసులో గ్యాంగ్‌స్టర్ దుబే ప్రధాన నిందితుడు. దుబే ఎన్‌కౌంటర్‌తో దశాబ్ధాల పాటు సాగిన అరాచకాలకు, నేరసామ్రాజ్యానికి తెరపడిందని ఆయన స్వగ్రామం బిక్రులో స్ధానికులు సంబరాలు చేసుకున్నారు. చదవండి : రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం -
సుశాంత్ ఫైనల్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో పలు రకాలు కథనాలు వెలువడుతున్నాయి. సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని అతని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా సుశాంత్ ఫైనల్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌ను వైద్యులు సమర్పించారు. ఊరివేసుకోవడం వల్లనే సుశాంత్ మరణించారని వైద్యులు అందులో స్పష్టం చేశారు. ఐదుగురు వైద్యులు సమర్పించిన ఈ రిపోర్ట్‌లో పలు వివరాలను పొందుపరిచారు.(చదవండి : సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) ఊరి వేసుకోవడం కారణంగా ఊపిరాడక సుశాంత్ మృతిచెందినట్టుగా వైద్యులు ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అంతర అవయవాల పరీక్షల రిపోర్ట్ కోసం ఫొరెన్సిక్ డీజీకి లేఖ రాశారు. సుశాంత్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని.. చనిపోయే ముందు అతను ఎలాంటి బాధ అనుభవించినట్టు ఆధారాలు కనిపించలేదని రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఇది కేవలం ఆత్మహత్యే అని.. అందులో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుంది. ఇప్పటివరకు 23 మందిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారించిన వారిలో సుశాంత్ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇంట్లో పనిచేసేవారు, సినీ ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఉన్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు అతను ఉంటున్న బిల్డింగ్‌లో సీసీ కెమెరాలు పనిచేశాయని వెల్లడించారు. అలాగే అతని కుక్క వేరే రూమ్‌లో ఉందని.. అది బతికే ఉందని తెలిపారు. సుశాంత్ మరణంపై భిన్న కథనాలు ప్రచురించిన వెబ్సైట్లను విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ కథనాలు ప్రచురించడానికి గల ఆధారాలపై వారిని ప్రశ్నించనున్నట్టు తెలిపారు. (చదవండి : సుశాంత్ ఆత్మహత్య: సీబీఐ విచారణకు ఫోరం) -
ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్ నిజాలు
తిరువనంతపురం : పేలుడు పదార్థాలు ఉన్న పైనాపిల్ తినటం కారణంగా మరణించిన గర్భంతో ఉన్న ఏనుగు పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఏనుగు నోటిలో పెద్ద మొత్తంలో పేలుడు సంభవించటం కారణంగా తీవ్రమైన గాయాలయ్యాయని, వాటి కారణంగా ఇన్ఫెక్షన్ సైతం సోకినట్లు తేలింది. ఇన్ఫెక్షన్ కారణంగా విపరీతమైన నొప్పి, ఒత్తిడితో బాధపడుతూ ఏనుగు నీరు, ఆహారం తీసుకోలేకపోయిందని వెల్లడైంది. అలా దాదాపు రెండు వారాల పాటు నీరు, తిండి లేకుండా గడిపిందని తేలింది. ( ఏనుగు మృతి కేసులో తొలి అరెస్టు ) తద్వార విపరీతమైన నీరసానికి గురైన ఏనుగు నీళ్లలో మునిగిపోయిందని, ఆ తర్వాత నీటిని పెద్ద మొత్తంలో శరీరంలోకి తీసుకోవటంతో ఊపిరితిత్తులు పాడై ఆ వెంటనే అది మరణించినట్లు వెల్లడైంది. గర్భంతో ఉన్న ఏనుగు వయసు దాదాపు 15 సంవత్సరాలు ఉంటుందని, దాని శరీరంలో బుల్లెట్, ఇతర లోహాల అవశేషాలు కనిపించలేదని రిపోర్టు పేర్కొంది. ( ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబ్) -
జార్జ్ ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్
వాషింగ్టన్: అమెరికా పోలీసుల చేతిలో నరహత్యకు గురైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పూర్తి శవపరీక్ష నివేదికను వైద్యులు బుధవారం విడుదల చేశారు. అనేక క్లినికల్ వివరాలను వెల్లడించిన ఈ నివేదిక ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేల్చింది. హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ కార్యాలయం విడుదల చేసిన ఈ 20 పేజీల నివేదిక జార్జ్ కుటుంబం అనుమతితో వెల్లడయ్యంది. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ మాట్లాడుతూ.. ‘మెడపై తీవ్రమైన ఒత్తిడి వల్లే ఫ్లాయిడ్ మరణించాడు. అతడు మరణించిన తీరును బట్టి దీన్ని నరహత్యగా పేర్కొనవచ్చు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక ఏప్రిల్ 3న ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు, కాని లక్షణ రహితంగా ఉన్నాడని వెల్లడించారు. మరణించిన సమయంలో ఫ్లాయిడ్ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా కనిపించాయని తెలిపారు.(జార్జ్‌ది నరహత్యే !) గతంలో అమెరికా పోలీసులు ఇచ్చిన నివేదికలో ఫ్లాయిడ్ ‘ఫెంటనిల్ ఇన్‌టాక్సికేషన్’, ‘మెథమ్‌ఫెటమైన్’ అనే డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫెంటనిల్ ఇన్‌టాక్సికేషన్ వల్ల తీవ్రమైన శ్వాసకోశ మాంద్యం, మూర్ఛ లక్షణాలు ఉంటాయని.. కానీ ఫ్లాయిడ్‌లో ఇవేవి కనిపించలేదని నివేదికలో తెలిపారు. ఊపిరాడకపోవడం వల్లే ఫ్లాయిడ్ మరణించాడని ఆండ్రూ బేకర్ తెలిపారు. -
జార్జ్‌ది నరహత్యే!
వాషింగ్టన్ : జార్జ్ ఫ్లాయిడ్ (46) మరణంపై అమెరికా అట్టుడుకుతున్న సమయంలో కీలక మైన అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని, ఇది నరహత్య అని మినియాపోలిస్‌లోని హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అదుపులో ఉండగా అతడు గుండెపోటుకు గురైనట్లు నివేదిక తెలిపింది. (నల్లజాతి ప్రతిఘటన) అటు ఫ్లాయిడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్షల విచారణలోనూ ఇది పోలీసుల హత్యగానే నిర్ధారణ అయింది. ఫ్లాయిడ్ కుటుంబానికి చెందిన న్యాయవాది బెంజమిన్ క్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు జార్జ్‌ని నిరోధిస్తున్నపుడే..గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. మెడపై ఒత్తిడి కారణంగా మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోవంతో మరణించాడని పరీక్షల్లో తేలినట్టు క్రంప్ చెప్పారు. పోలీసుల అమానుషంతోనే అతను మరణించాడని, అంబులెన్సే జార్జ్‌కు పాడెగా మారిందని వ్యాఖ్యానించారు. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం) కాగా మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో గత సోమవారం జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్ల జాతి వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో తెల్ల జాతి పోలీస్ అధికారి డెరెక్ షావిన్ అతని మెడపై మోకాలితో బలంగా నొక్కుతుండగా ప్రాణాలు కోల్పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిరాయుధుడైన ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి పోలీసులే కారణమంటూ ఎగిసిన నిరసనలతో అమెరికా అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. -
వైద్యం చేయించలేక..
సదాశివపేట (సంగారెడ్డి): వైద్య ఖర్చులు భరించలేక.. ఆ తర్వాత పెళ్లి ఖర్చులు భరించాల్సి వస్తుందని ఓ తండ్రి కన్నకూతురిని హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం సదాశివపేట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి ఈ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వైద్యం ఖర్చులు భరించలేక, ఒకవేళ చికిత్స చేయించినా తర్వాత పెళ్లి ఖర్చులు భరించాల్సి వస్తుందని రవినాయక్ అనే వ్యక్తి కన్న కూతురును హత్య చేశాడు. రవినాయక్ స్వగ్రామం వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలంలోని జాంబాపూర్ తండా. బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి వచ్చి మేస్త్రీ పనులు చేస్తున్నాడు. నవాబుపేటలోని కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న కూతురు రేణుకకు జ్వరంగా ఉండడంతో అతను ఈనెల 12న బైక్‌పై ఆమెను ఆత్మకూర్ గ్రామానికి తీసుకువచ్చాడు. జ్వరం ఎక్కువైనందున చుట్టుపక్కల వారి సూచన మేరకు అదే రోజు రాత్రి చికిత్స కోసం రేణుకను సదాశివపేట పట్టణానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే కూతురుకు ఎప్పుడూ జ్వరం వస్తుందని, గత ఏడాదే చికిత్సకోసం రూ.20 వేలు ఖర్చు చేసినందున ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తే ఎంత డబ్బు ఖర్చవుతుందోనని, ఒక వేళ ఖర్చుపెట్టి బాగుచేయించినా ఆమె పెళ్లి చేయాలంటే మళ్లీ డబ్బు కావాలి అని ఆలోచించాడు. ఈ క్రమంలో కూతురును గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఏమీ ఎరగనట్లు.. కూతురుకు ఎక్కిళ్లు వచ్చి చనిపోయిందని భార్య చంద్రిబాయిని నమ్మించాడు. అంత్యక్రియలు చేయడానికి కూతురు శవాన్ని సొంత గ్రామమైన వికారాబాద్ జిల్లా జాంబాపూర్ తండాకు తీసుకువెళ్లారు. అంతిమ సంస్కారం కార్యక్రమంలో మృతురాలు రేణుక గొంతుపై కమిలిన గాయాలు కనపడడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈనెల 13న వికారాబాద్ వీఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత సదాశివపేటలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ద్వారా రేణుకను గొంతునులిమి చంపినట్లు తెలుసుకున్నారు. దీంతో కూతురును హత్య చేసిన నిందితుడు రవినాయక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. -
హైకోర్టు రిజిస్ట్రార్‌కు రీ పోస్ట్‌మార్టం రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు చేసిన రీ పోస్ట్‌మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ రిజిస్ట్రార్‌కు చేరుకుంది. మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం నిర్వహించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మంగళవారం ప్రిలిమినరీ రిపోర్టుతో పాటు చిత్రీకరించిన వీడియో సీడీని అందజేశారు. కాగా ఢిల్లీ వెళ్లిన తరువాత పూర్తిస్థాయి రిపోర్టును అందజేస్తామని ఈ మేరకు ఎయిమ్స్ వైద్య బృందం హైకోర్టుకు నివేదించింది. చదవండి: ‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’ -
‘కోడెల పోస్టుమార్టం నివేదిక అందలేదు’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించిన కేసులో పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదని బంజారాహిల్స్ ఏసీపీ, ఈ కేసు విచారణ అధికారి కేఎస్ రావు తెలిపారు. గత సెప్టెంబర్ 16వ తేదీన కోడెల హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోడెల కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే విచారించి ఆయన సెల్‌ఫోన్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతి చెందిన రోజు ఘటనా స్థలంలో సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని కేఎస్ రావు తెలిపారు. దీనిపై నివేదిక వచ్చాక ఈ కేసులో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. -
లైంగికదాడి.. హత్య!
బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు. ప్రశ్నిస్తే పెళ్లి బస్సు సిబ్బంది అన్నాడు.. గురువారం రాత్రి పెళ్లికి వచ్చిన ఆ అగంతకుడు .. ఓసారి పెళ్లికొడుకు తరఫు మనిషినని.. మరోసారి పెళ్లికుమార్తె తరఫున అని పొంతన లేకుండా చెప్పాడని.. మరి కొందరితో పెళ్లి బస్సు సిబ్బంది అని చెప్పాడని పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో అతనే హంతకుడై ఉంటాడని అనుమానిస్తున్నారు. హంతకుడు కర్ణాటక వాసి? కల్యాణమండపంలో సంచరించిన హంతకుడి ఆనవాళ్లను సీసీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు కర్ణాటక వాసిగా నిర్థారణకు వచ్చారు. దీంతో అతనికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, కోలార్, కేజీఎఫ్ జిల్లాలోని డీసీఆర్‌బీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హంతకుడిని పట్టుకునేందుకు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మానవ మృగాల ఆట కట్టిస్తాం అభం శుభం తెలియని చిన్నారులను బలిగొనే మానవ మృగాల ఆట కట్టిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. దారుణ హత్యాచారానికి గురయిన బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాళ్యంకు చెందిన వర్షిత (5) కుటుంబాన్ని శనివారం ఆమె తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్షిత హంతకుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
శివరామ్ విచారణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయన ఆత్మహత్యకు కుటుంబ వివాదాలు ఏమైనా కారణమా? అనే కోణంలోనూ విషయ సేకరణపై పోలీసులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కోడెల తనయుడు శివరామ్‌ను త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. కోడెల కొన్ని రోజుల కిందట కూడా తన స్వస్థలంలో ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు ఆ విషయం దాచి గుండెపోటుగా చిత్రీకరించడంపైన తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు, కుటుంబీకుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తమకు అందిందని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని కోడెల ఆత్మహత్య కేసుతో కలిపి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు. బసవతారకం ఆస్పత్రి వైద్యురాలికి చివరి కాల్.. హైదరాబాద్‌లో కోడెల ఉరి వేసుకున్న గదిని పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కొన్నేళ్లుగా వినియోగిస్తున్న మందులను వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని నిర్ణయించారు. అదే సమయంలో కోడెల పర్సనల్ మొబైల్ సెల్‌ఫోన్ ఎక్కడుంది? దాన్ని దాచాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆత్మహత్యకు ముందు ఆ ఫోన్‌తో ఆయన ఎవరితో మాట్లాడారు? ఫోన్ దొరికితే గుట్టు రట్టవుతుందని ఎవరైనా భయపడుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కాల్‌డేటా రికార్డర్ యాప్ (సీడీఆర్ఏ)తో కాల్‌లిస్ట్‌ను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యురాలికి ఫోన్ చేసి 24 నిమిషాలు మాట్లాడినట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవడానికి ఆ డాక్టరును విచారించాలని నిర్ణయించారు. కేబుల్ వైరుతో ఉరి.. పోస్టుమార్టం నివేదిక కోడెల శివప్రసాదరావు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ఆ నివేదికను బుధవారం పోలీసులకు అందించారు. మెడకు కేబుల్ వైరు బిగించుకోవడం ద్వారానే మరణం సంభవించిందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కోడెల గొంతు భాగంలో ఎనిమిది అంగుళాల పొడవుతో మచ్చ ఉందని తెలిపారు. ముందుగా తన పంచెను చింపి తాడుగా చేసుకుని ఉరి వేసుకోవాలని కోడెల ప్రయత్నించారని, అది సాధ్యం కాకపోవడంతో గదిలో ఉన్న కేబుల్ వైరుతో ఉరి వేసుకున్నారని తెలిపారు. 12 మందిని విచారించాం: బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు కోడెల ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా కుటుంబీకులు, గన్‌మెన్, డ్రైవర్ తదితరులతో కలిపి మొత్తం 12 మంది వాంగ్మూలాలు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన కుమారుడు, ఇతర కుటుంబీకులు, సన్నిహితులతోపాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని చెప్పారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కొడుకు శివరామ్ స్టేట్మెంట్ కీలకం కానుందని పేర్కొన్నారు. కోడెల ఫోన్లోని కాల్‌డేటా ఆరా తీస్తున్నామన్నారు. ముగిసిన కోడెల అంత్యక్రియలు నరసరావుపేట/నరసరావుపేటటౌన్: అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు టీడీపీ కార్యకర్తలు కన్నీటి వీడ్కోలు పలికారు. నరసరావుపేట కోటలోని కోడెల నివాసం నుంచి స్వర్గపురి వరకు సాగిన కోడెల అంతిమయాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, లోకేష్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు పాల్గొన్నారు. కోడెల భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం కోటలో ఉంచారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో చంద్రబాబు వచ్చి నివాళులర్పించి అంతియాత్ర ప్రారంభించారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శామ్యూల్ కోడెల కుటుంబ సభ్యులకు వివరించగా.. వారు నిరాకరించారు. కోడెల చితికి శాస్త్రోక్తంగా ఆయన కుమారుడు శివరామకృష్ణ నిప్పంటించి అంతిమ సంస్కారం నిర్వహించారు. కోడెల అంతిమయాత్రలో ప్రతిపక్షనేత చంద్రబాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత.. కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం అంతిమయాత్ర సాగనీయకుండా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం మీదుగా తీసుకెళ్లాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు అడ్డు చెప్పారు. అంతిమయాత్ర మల్లమ్మసెంటర్కు చేరిన అనంతరం తిరిగి ఉచ్చయ్య,పెంటయ్య వీధి గుండా స్వర్గపురికి వెళ్లాల్సి ఉంది. అయితే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లమ్మ సెంటర్ నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటివైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి , డీఎస్పీ వీరారెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని ముందస్తు రూట్ మ్యాప్ ప్రకారం వాహనాన్ని మళ్లించారు. సంబంధిత కథనాలు.. ‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’ బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు ఒక మరణం.. అనేక అనుమానాలు కోడెల మృతికి చంద్రబాబే కారణం గ్రూపులు కట్టి వేధించారు.. -
‘పాయల్ గొంతు, శరీరంపై గాయాలున్నాయి’
ముంబై : కులం పేరుతో సీనియర్ల చేతిలో వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ కేసు కీలక మలుపు తిరిగింది. పాయల్‌ది ఆత్మహత్య కాదు హత్య అనే అనుమానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. పోస్ట్ మార్టమ్ రిపోర్టు సంచలన విషయాలు బయటపెట్టింది. పాయల్ గొంతు దగ్గర, శరీరం మీద గాయలున్నట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టు వెల్లడించింది. దాంతో పాయల్‌ది హత్య అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ సందర్భంగా పాయల్ కుటుంబం తరఫు న్యాయవాది.. పాయల్ మృతిని హత్యగా గుర్తించాలని కోర్టును కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాయల్ మరణించిన తీరు.. ఆమె శరీరం మీద ఉన్న గాయాలను బట్టి చూస్తే.. తనది ఆత్మహత్య కాదు.. హత్య అని తెలుస్తుంది. పోస్టు మార్టమ్ రిపోర్టు కూడా ఇదే తెలియజేస్తుంది. ప్రస్తుతం హత్య కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు గాను 14 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అన్నారు. స్థానిక బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్ తాడ్వీని సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో పాయల్ ఈనెల 22న హస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే అనే ముగ్గురు మహిళా డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి : డాక్టర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు) -
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కొన్ని క్లూస్ దొరికాయి: ఎస్పీ
-
పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక: వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే!
-
జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం
తాడేపల్లి రూరల్/మంగళగిరి: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో హత్యకు గురైన యువతి జ్యోతి మృతిదేహానికి వైద్యులు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించారు. మహానాడు కృష్ణాతీరంలో ఉన్న శ్మశాన వాటికలో గురువారం మధ్యాహ్నం 12.25కు ప్రారంభమైన పోస్టుమార్టం 3.30 గంటల వరకు కొనసాగింది. వివరాలు వెంటనే వెల్లడించాలని జ్యోతి బంధువులు, మీడియా ప్రతినిధులు కోరగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.టి.కె.రెడ్డి నిరాకరించారు. 72 గంటల తర్వాత చెబుతామని అనడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వెంటనే పోస్టుమార్టం వివరాలు చెప్పాలని, గతంలో పోస్టుమార్టం జరిగిందా లేదా నిర్ధారించాలని పట్టుబట్టారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. డాక్టర్ టి.టి.కె.రెడ్డిని కారు ఎక్కించారు. ఆందోళనకారులు టి.టి.కె.రెడ్డి కారును అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో కొందరు యువకులు డీజిల్ బాటిళ్లు తీసుకొచ్చి, వంటిమీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించారు. ఇరువర్గాల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. డాక్టర్ టి.టి.కె.రెడ్డి మాట్లాడుతూ.. పోస్టుమార్టం సంపూర్ణంగా నిర్వహించామని, జ్యోతి ఎలా చనిపోయిందో నిర్ధారించేందుకు మరో 72 గంటల సమయం పడుతుందని అన్నారు. పోలీసులు, మండల మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రెండోసారి పోస్టుమార్టం నిర్వహించామని, మొదటిసారి పోస్టుమార్టం ఏ మేరకు చేసారనే విషయం చెప్పడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మృతురాలి అన్న అంగడి ప్రభాకర్, తండ్రి చిన్నగోవిందు మాట్లాడుతూ.. మొదటి పోస్టుమార్టం విషయంలో డాక్టర్లు, పోలీసులు అలసత్వం వహించారని అన్నారు. ఒక ఎస్టీ యువతి చనిపోతే డీఎస్పీ దర్యాప్తు చేయాల్సి ఉండగా, సీఐతో దర్యాప్తు చేయించి కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కోలుకుంటున్న శ్రీనివాసరావు నవులూరులో అమరావతి టౌన్షిప్లో ఈనెల 11వ తేదీ రాత్రి ప్రేమికులపై దుండగులు జరిపిన దాడిలో గాయపడిన చుంచు శ్రీనివాసరావు క్రమంగా కోలుకుంటున్నాడు. తలకు గాయం కావడంతో శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు ఆరోగ్యం మెరుగుపడడంతో గురవారం ఐసీయూ నుంచి సర్జరీ వార్డుకు తరలించారు. శ్రీనివాసరావును ఎవరూ కలవకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్బీ సీఐ ఆధ్వర్యంలోని బృందం అతడిని విచారించి వివరాలు సేకరించినట్లు సమాచారం. శ్రీనివాసరావు కాల్‌డేటా ఆధారంగా విజయవాడకు చెందిన అతడి బంధువును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణ నుంచి డీఎస్పీని తప్పించిన ఉన్నతాధికారులు జ్యోతి హత్య కేసు విచారణ నుంచి నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణను పోలీసు ఉన్నతాధికారులు తప్పించారు. డీఎస్పీ హరి రాజేంద్రనాథ్బాబుకు ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులో ఇప్పటికే రూరల్ సీఐ బాలాజీని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఎస్ఐ బాబూరావును వీఆర్‌కు పంపడంతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలి హత్యకు గురైన జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలని, గాయపడిన చుంచు శ్రీనివాసరావు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని, జ్యోతి కేసును నిర్లక్ష్యం చేసిన డీఎస్పీతోపాటు మిగతా అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని వివిధ గిరిజన సంఘాలు, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని నడిబొడ్డున ఓ గిరిజన యువతి దారుణంగా హత్యకు గురైతే పోలీసులు ఇప్పటికీ సరైన ఆధారాలు సేకరించలేదని మండిపడ్డారు. కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి పరిధిలో ఎలాంటి అనుచిత సంఘటన జరిగినా ప్రభుత్వం అప్రతిష్టపాలు కాకుండా చూసేందుకు అన్ని శాఖల అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు జ్యోతి హత్యోదంతం మరోసారి నిరూపించింది. రాజధానిలో ఓ గిరిజన యువతి హత్యకు గురైతే పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా సామాజిక మాధ్యమాలు, పత్రికల ద్వారా జ్యోతి హత్య కేసుపై కథనాలు వస్తున్నా, సంఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఉన్న సీఎం చంద్రబాబుకు గానీ, ఉన్నతస్థాయి అధికారులు గానీ దీనిపై కనీసం స్పందించిన పాపాన పోలేదు. -
దొంగ సూది
సూది మందు ప్రాణం పోయడానికి...తీయడానికి కాదు.జీవించాలంటే కష్టం చేయాలి...నేరం కాదు.ఎత్తున ఎగిరే రాబందు కూడానేలకు దిగాల్సిందేతప్పించుకుని తిరిగే నిందితుడు చట్టానికి చిక్కాల్సిందే డిసెంబర్ 21– 2014. రాత్రి 11 గంటలు. నల్లగొండ జిల్లా భువనగిరి పరిధిలోని బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్.ఫోన్ మోగింది.‘సార్.. మర్యాల శివారులో ఎవరిదో శవం పడి ఉంది సార్. బాడీ అంతా కాలిపోయి ఉంది’ అని ఎవరో గ్రామస్తుడు çకంగారుగా సమాచారం అందించాడు. బొమ్మలరామారం ఎస్ఐ ప్రసాద్ వెంటనే పోలీసులను తీసుకుని అక్కడకు వెళ్లాడు.పొదల సమీపంలో ఒక శవం పడి ఉంది.ఇంకా కమురు వాసన పోలేదు. 90 శాతం కాలిపోయి ఉంది. ప్యాంటూ షర్టూ ఉన్నాయి. మగ మనిషే.రాత్రి కావడం, శవం ఉండటంతో నలుగుదైరుగు గ్రామస్తులు కూడా అటుగా రాలేదు. కనుక ఏ వివరాలు తెలియలేదు. ‘బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపండి’ అన్నాడు ఎస్.ఐ ఏర్పాట్లను పురమాయిస్తూ. రెండు రోజులు గడిచాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. ఊపిరాడకుండా చేయడం వల్ల మరణం సంభవించిందని తేలింది. అంటే చంపేసి తెచ్చి కాల్చి ఉండాలని అర్థమైంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకో వివరం కూడా చెప్పింది. ‘చేతికి ఇస్లాం చిహ్నం ఉన్న వెండి ఉంగరం ఉంది. సున్తీ చేసిన అనవాళ్లు ఉన్నాయి. కనుక ఇతను ముస్లిం కావచ్చు’...ఆ ప్రాంతంలో పెద్దగా ముస్లిం జనాభా లేదు. ఈ వ్యక్తి ఎక్కడి వాడు?‘సార్... చుట్టుపక్కల జిల్లాల మిస్సింగ్ కేసులు చూద్దాం’ అన్నాడు కానిస్టేబుల్.‘ఆ పని మొదలెట్టండి’ అన్నాడు ఎస్.ఐ.వెంటనే పోలీసులు ఆన్లైన్ వెరిఫికేషన్‌లో ఉన్న మిస్సింగ్ కేసులను జల్లెడ పట్టడం ప్రారంభించారు. గత పదిహేను రోజులుగా నమోదైన కేసుల వివరాలను గమనించారు. ఏమీ లాభం లేకపోయింది. కాని రెండు రోజుల తర్వాత నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసు వారిని ఆకర్షించింది. మృతుని ముఖకవళికలు సరితూగాయి. వెంటనే నిజామాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తే కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి వచ్చారు. మార్చురీలో ఉన్న శవాన్ని గుర్తించి భోరుమన్నారు.‘సార్. ఇతని పేరు ఇలియాస్. కారు డ్రైవర్.’ చెప్పారు బంధువులు.‘శత్రువులు ఎవరైనా ఉన్నారా?’ అడిగాడు ఎస్.ఐ.‘ఎవరూ లేరు సార్. చాలా మంచివాడు. కష్టపడి పని చేస్తాడు. అతడికి కారు ఉంది. దానిని దొంగలించడానికే చంపి ఉంటారు’ అన్నారు వాళ్లు.ఇలియాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలియాస్ మృతదేహం చూసి కన్నీరు మున్నీరవుతున్న వారిని చూసి ఎస్.ఐకు కడుపులో దేవినట్టయ్యింది.‘అమాయకుణ్ణి చంపినవాళ్లను వదిలిపెట్టను’ అనుకున్నాడు. హంతకులకు సంబంధించి ఎలాంటి మిగతా ఆధారాలు లభించకపోవడంతో టెక్నాలజీని వాడుకోవాలన్న ఆలోచనతో వెంటనే టవర్ డంప్‌పై దృష్టి పెట్టారు. మర్యాల శివారులో ఉన్న సెల్‌పోన్ టవర్, కుకూనూర్పల్లి పోలీస్‌స్టేషన్, కరీంనగర్, నిజామామాద్, కొండగట్టు, గజ్వెల్ ప్రాంతాలలోటవర్డంప్ ద్వారా యాక్టివ్ కాల్స్ సాగిన నెంబర్లను సేకరించారు. అయితే చాలా నెంబర్లు స్థానికులవే కావడంతో వారందరిలో నిందితులు లేరని నిర్ధారించుకున్నారు. అయితే హంతకులు ఎవరు? దాదాపు సంవత్సరం గడిచిపోయింది.నవంబర్ 10. 2015.ఎస్.ఐ ప్రసాద్‌కి ఫోన్ వచ్చింది. చేసింది కుకూనూర్ పల్లి ఎస్.ఐ.‘మా ఏరియాలో ఒక కారు దొంగతనం జరిగింది. కిరాయికి మాట్లాడుకున్నవారు డ్రైవర్ కంట్లో కారం కొట్టి మత్తు మందు ఇచ్చి కారుతో పాటు ఉడాయించారు. మీ స్టేషన్ పరిధిలో బాడీ దొరికిన ఇలియాస్ కేసులో ఉన్నది వీళ్లే కావచ్చు’ అన్నాడు ఎస్.ఐ.వెంటనే ఎస్.ఐ ప్రసాద్ రంగంలో దిగి అటాక్‌కు గురైన డ్రైవర్ని కలిశాడు.‘వాళ్లు మొత్తం నలుగురు. కిరాయికి మాట్లాడుకుని బయలుదేరారు. దారిలో పాస్‌కు ఆపమన్నారు. నేను స్లో చేసి ఆపుతుండగానే కంట్లో కారం చల్లారు. తర్వాత ఏదో గుచ్చినట్టుగా అనిపించింది. బహుశా సిరంజీ కావచ్చు. లేచాక చూస్తే రోడ్డు పక్కన పడి ఉన్నాను. వాళ్లు నా ఏ.టి.ఎం కార్డును కూడా తీసుకెళ్లారు’ అన్నాడు.‘వాళ్లను ఇంతకు ముందు చూశావా?’‘లేదు సార్. పూర్తిగా కొత్తవాళ్లు’పోలీసులు వెంటనే కారు కోసం వేట ప్రారంభించారు. కాని నిందితులు కారు నంబర్ మార్చేయడంతో ఆ పని కష్టమైంది. మరోవైపు నేర చరిత్ర ఉన్న ఆర్.ఎమ్.పి డాక్టర్ల గురించికూడా కూపీ లాగడం మొదలైంది. సిరంజీ ఆపరేట్ చేస్తున్నారంటే మెడికల్ ఫీల్డ్‌కు సంబంధం ఉన్నవాళ్లే అయి ఉండాలి.ఇంతలో ఎస్.ఐ ప్రసాద్‌కు అటాక్ అయిన డ్రైవర్ నుంచి ఫోన్ వచ్చింది.‘సార్. నా ఏ.టి.ఎం కార్డుతో వాళ్లు డబ్బు డ్రా చేశారు. ఆ కార్డు మీద నేను నా పిన్ నంబర్ రాసుకుని ఉన్నాను మర్చిపోతానని. అందువల్ల డ్రా చేశారు. ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది’ అన్నాడతను.వెంటనే డ్రా ఎక్కడ చేశారన్న విషయం కూపీ లాగారు.వరంగల్ జిల్లా ఖాజీ పేట ఏ.టి.ఎం.సిసి కెమెరా ఫుటేజ్‌ను వెలికి తీశారు. డ్రా చేస్తున్న వ్యక్తి కనిపించాడు.‘ఇతనే సార్. నా కారు ఎక్కింది’ అన్నాడు డ్రైవర్.వెంటనే నిందితుని ఫొటో అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్లింది. పాత నేరస్తుల ఫొటోలతో ట్యాలీ చేసి చూడటం పూర్తయ్యింది. నాలుగు రోజుల తర్వాత కరీం నగర్లో శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు తన గ్యాంగ్‌తో ఇలియాస్ హత్య ఎలా చేశాడో వివరించాడు. డిసెంబర్ 20. 2014. నిజామాబాద్. ఆ టౌన్‌లోని ఎండి.ఇలియాస్ అహ్మద్‌కు íస్విఫ్ట్ డిజైర్ కారు ఉంది. అద్దెకు తిప్పుతుంటాడు. ఆ రోజు అతని దగ్గరకు కొత్త వ్యక్తులు నలుగురు వ్యక్తులు వచ్చారు. ‘మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులం. వేములవాడ వెళ్లడానికి కారు కావాలి’ అని అడిగారు. వచ్చింది మంచి బేరం అని ఇలియాస్‌కు సంతోషం కలిగింది. వెంటనే బయలు దేరాడు.‘ఈ దారి వద్దు. ఇది హైవే.అనవసరంగా టోల్గేట్లకు డబ్బు కట్టాలి. సరదాగా అడ్డదారిలో వెళదాం’ అన్నారు వాళ్లు.కారు బయలుదేరింది. ఆ నలుగురు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకచోట వైన్ షాప్ కనిపిస్తే ఆపమన్నారు.ఇలియాస్కి ఇది ఆడ్‌గా అనిపించింది.‘దేవుడి పని మీద వెళుతూ మందు తాగుతారా?’ అని అడిగాడు.‘అబ్బెబ్బె... దర్శనం అయ్యాక తాగుదామని’ అని కవర్ చేశారు వాళ్లు.కారు వేములవాడ చేరుకుంది. దేవస్థానం పార్కింగ్ ఏరియాలో కారు ఆపాడు ఇలియాస్.‘మీరు దర్శనానికి వెళ్లి రండి’ అన్నాడు.దిగిన నలుగురూ దేవస్థానం వైపు వెళ్లారు. కాని గుడిలోని సిసి కెమెరాలకు చిక్కుతామన్న భయంతో లోపలకే వెళ్లలేదు. బయటే తచ్చాట్లాడి గుడికి ఆవల మద్యం సేవించి కారు దగ్గరకు వచ్చారు.‘ఇంతదూరం వచ్చాం. కొండగట్టు ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని వెళదాం. నీకు కిరాయి డబుల్ ఇస్తాము లే’ అన్నారు వాళ్లు.కిరాయి వస్తుందన్న ఆనందంతో ఇలియాస్ కొట్టగట్టుకు బయలుదేరాడు. కారు కొండగట్టు ఆర్చీ, జెఎన్టీయూసీ దగ్గరకు వచ్చింది.అప్పటికి చీకటి పడిపోయింది.‘కొంచెం పాస్‌కు ఆపు’ అన్నారు వాళ్లు.ఇలియాస్ ఆపాడు.అంతే. ఒకడు వేగంగా కదిలాడు. వెనుక నుంచి సిరంజీని ఇలియాస్ మెడ మీద గుచ్చాడు. మరొకడు వైర్‌తో అహ్మద్ గొంతును బిగించాడు. కొంత పెనుగాలాట జరిగాక నలుగురి బలం ముందు నిలువలేక ఇలియాస్ హతమయ్యాడు.శవాన్ని కారు డీక్కిలో వేసుకుని టోల్గేట్ సీసీ కెమెరాలకు చిక్కకుండా రకరకాల మార్గాల ద్వారా గజ్వెల్ మీదుగా బొమ్మల రామారం మండలం మర్యాల శివారుకు వచ్చారు. అక్కడ ఇలియాస్ శవాన్ని కాల్చేసి కారులో పారిపోయారు. ఇంత ఘాతుకానికి కారకుడైన శ్రీనివాస్‌కు పెద్ద చరిత్రే ఉంది. అతనిది కరీంనగర్ జిల్లా ధర్మారం. రకరకాల వ్యాపారాలు చేసి నష్టపోయిన శ్రీనివాస్ చివరకు ఒక డాక్టర్ దగ్గర కాంపౌండర్‌గా చేరాడు. ఈ సమయంలోనే మెడికల్ టెర్మినాలజీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత డాక్టర్‌తో గొడవపడి మెడికల్ ఏజెన్సీ ప్రారంభించి అప్పులపాలయ్యాడు. కరీంనగర్లో నక్సలైట్‌నని బెదిరించిన కేసులో, ఒకరిని కొట్టిన కేసులో కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అతని మీద కేసులు నమోదయ్యాయి. తొందరగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో తన గ్రామానికే చెందిన మహేష్, గౌరయ్య, శ్రీధర్‌తో కలిసి జట్టుగా ఏర్పడి నేరాలు చేయడం ప్రారంభించాడు. నేరం చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తరచూ సీఐడీ సీరియల్‌ను చూసేవాడు. మొదట్లో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడే ఈ ముఠా క్రమంగా కార్ల దొంగతనాలకు మళ్లింది. నిజామాబాద్‌కు చెందిన ఇలియాస్‌ను చంపి అతని కారును దొంగతనం చేసి అతడి శవాన్ని సీటుకవర్లు వేసి పెట్రోల్ పోసి దహనం చేశారు. మహరాష్ట్రలో రెండుకార్లు దొంగతనం చేశారు. రోడ్డుపక్కన బస్ కోసం ఎదురుచూస్తున్న వారికి లిప్ట్ ఇస్తామని ఇద్దరు మహిళల వద్ద బంగారు అభరణాలు, నగదు అపహరించుకుపోయారు. ఎంతటి నేరస్తుడైనా క్లూ వదులుతాడనికి గుర్తుగా ఏటిఎంలో డబ్బు డ్రా చేసి దొరికిపోయారు. నేరం చేసినవారు దొరికిపోవడం ఖాయం. – యంబ నర్సింహులు స్టాఫ్ రిపోర్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా -
బురారీ కేసు; దిగ్భ్రాంతికర విషయాలు
న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల కేసులో ఆరు మృతదేహాలకు పోస్టు మార్టమ్ పూర్తయింది. అయితే పోస్టుమార్టమ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయంటున్నారు అధికారులు. పోస్టుమార్టమ్ రిపోర్టు ప్రకారం వారంతా కావాలనే, చనిపోవాలని నిశ్చయించుకునే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన సమయంలో ఎటువంటి పెనుగులాట జరగలేదన్నారు. మోక్షం పొందడం కోసమే వీరంతా ఇలా చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. అంతేకాక మరణించిన కుటుంబ సభ్యులు తమ కళ్లను దానం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మిగిలిన ఐదు మృతదేహాలకు రేపు అనగా మంగళవారం పోస్టుమార్టమ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, మరో వృద్ధురాలు(75) గొంతు కోయడం వల్ల చనిపోయింది. అలాగే వీరి నోటికి టేప్ అంటించారన్నారు. పోలీసుల తనిఖీల్లో ఈ ఇంట్లో తాంత్రిక పూజలకు సంబంధించిన చేతిరాతతో ఉన్న పేపర్లు లభ్యమయ్యాయి. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని తెలుస్తోందన్నారు. ఈ కాగితాల్లో ఉన్నట్లుగానే కుటుంబ సభ్యుల్ని చేతులకు కట్లు, కళ్లకు గంతలు కట్టారన్నారు. అంతేకాకుండా అరవకుండా నోటికి టేప్‌ను అంటించారన్నారు. కుటుంబసభ్యుల్లో తాంత్రిక శక్తులతో ప్రభావితమైన ఒకరు మిగిలిన 10 మందిని హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తొలుత నిందితుడు అందరికీ భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక వారందర్నీ ఉరితీసి ఉంటాడని వెల్లడించారు. ఈ సందర్భంగా కుటుంబంలోని వృద్ధురాలు స్పృహలోకి రావడంతో ఆమెను సదరు వ్యక్తి గొంతుకోసి చంపాడన్నారు. -
ఛీ...ఇంత దిగజారుడా..!
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ):వైద్యో నారాయణో హరీ అని అంతా అంటుంటారు. దైవంతో సమానమని గౌరవిస్తారు. అటువంటి వైద్యుడు మానవత్వం మరిచి డబ్బులకు కక్కుర్తిపడిన ఉదంతం అందరినీ విస్మయానికి గురిచేసింది. చేతికి అందొచ్చిన కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను... పోస్టుమార్టం రిపోర్టు కోసం రూ.10వేలు డిమాండ్ చేసి వైద్య వృత్తికే మచ్చ తెచ్చేందుకు యత్నించాడు. ఈ జుగుప్సాకర ఘటన సోమవారం కేజీహెచ్‌లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 5వ వార్డు మారికవలస పరిధి రాజీవ్‌గృహకల్ప సముదాయం బ్లాక్ నంబర్ 27లో నివసిస్తున్న కెల్లా వెంకటేశ్వరాచారి కుమారుడు వెంకటేష్ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో విశాఖ నగరంలోకి వెళ్తుండగా... వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ఎదురుగా వచ్చేసరికి హైవేపై నడుచుకుని వెళ్తున్న వ్యక్తిని తప్పించేందుకు యత్నించి కింద పడిపోయాడు. అదే సమయంలో వచ్చిన లారీ వెంకటేష్ పైనుంచి దూసుకుపోవడంతో ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీఎం పాలెం పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. ఇక్కడే కేజీహెచ్‌లో పోస్టుమార్టం చేసే వైద్యుడు తన వికృత రూపం ప్రదర్శించాడు. రూ.10 వేలు ఇవ్వకుంటే... రిపోర్టు తారుమారు సోమవారం ఉదయం 10 గంటలకల్లా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా చేయకపోవడంతో వెంకటేష్ బంధువులు, స్నేహితులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్లి వైద్యుడిని సంప్రదించారు. పోస్టుమార్టం నిర్వహించాల్సిన డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... మృతి చెందే సమయానికి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానంగా ఉందని, అందువల్ల పోస్టుమార్టం రిపోర్టులో మద్యం తాగి వాహనం నడపలేదని రాసేందుకు, పోస్టుమార్టం నిర్వహించేందుకు రూ.10వేలు లంచమివ్వాలని డిమాండ్ చేశాడని వెంకటేష్ బంధువులు, స్నేహితులు ఆరోపించారు. సాధారణంగా అందరూ పోస్టుమార్టం చేసే డాక్టర్‌కు ఇస్తున్నట్టుగానే రూ.2వేలు ఇచ్చేందుకు సిద్ధపడినా రూ.10వేలు ఇస్తేనే పోస్టుమార్టం చేస్తానని చెప్పడంతో మృతుడి బంధువులు, స్నేహితులు నిరసనకు దిగారు. ముందుగా ఆంధ్ర వైద్య కళాశాల ముందు, తరువాత పోస్టుమార్టం నిర్వహించే భవనం ముందు నిరసన చేపట్టారు. విషయాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు సదరు పోస్టుమార్టం వైద్యుడితో సంప్రదించారు. విషయాన్ని ఏఎంసీ కార్యాలయానికి రిపోర్టు చేస్తే దర్యాప్తు చేపడతామని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. లారీ యజమానితో కుమ్మక్కై..! ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరుతో సహా దాని యజమాని సదరు పోస్టుమార్టం చేసే వైద్యుడికి లంచం ఎర చూపడం వల్లనే చెడు అలవాట్లు లేని వెంకటేష్‌కు మద్యం అలవాటు ఉందని ఆరోపించారన్న అనుమానం మృతుని కుటుంబీకులు వ్యక్తం చేశారు. పదిమందికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వ వైద్యులు ఈ విధంగా ప్రవర్తించడం అన్యాయమని, ప్రభుత్వ వైద్యులను ఇకపై పేద ప్రజలు భయంతో చూస్తారని అందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగించారు. కుమారుడి మృతదేహంపై పడి తల్లి రోదిస్తున్న దృశ్యం చూపరులను కలిచివేసింది. రూ.10వేలు డిమాండ్ చేశారు పోస్టుమార్టం చేసే వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. మృతుడు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానంగా ఉందని, మద్యం తాగి వాహనం నడపలేదని పోస్టుమార్టం రిపోర్టులో రాయాలంటే రూ.10వేలు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేయడం అన్యాయం. ప్రభుత్వ వైద్యులంటే ప్రజలకు ప్రాణభయం పట్టుకుంది. రూ.10వేలు ఇవ్వడానికి నిరాకరించడం వల్లే ఉదయం చేయాల్సిన పోస్టుమార్టం మధ్యాహ్నం 2 గంటలకు చేశారు. – బేతా దుర్గారావు, బంధువు మద్యం అలవాటు లేదు వెంకటేష్‌కు మద్యం అలవాటు లేదు. స్నేహితులు మద్యం సేవిస్తే వారిని మందలించేవాడు. లేని అలవాటును ఉన్నదని చెప్పడం ఎంతవరకూ సబబు. లారీ డ్రైవరు, యజమాని ఇచ్చే లంచాలకు పోస్టుమార్టం చేసే వైద్యుడు చంద్రశేఖర్ ఆశపడినట్టున్నాడు. అందువల్లే లేని అలవాటు ఉన్నట్టుగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు.– నూకరాజు, స్నేహితుడు మంచి బాక్సర్ నా మేనల్లుడు వెంకటేష్ మంచి బాక్సర్. తల్లిదండ్రులను, తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. చిన్నవయసులోనే బరువు బాధ్యతలు మోస్తూ తండ్రికి అండగా నిలబడ్డాడు. అటువంటి మంచివాడిపై నిందలు వేస్తున్నారు. మద్యం అలవాటు ఉన్నదనడం నిజం కాదు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలి.– శ్రీదేవి, మృతుని మేనత్త -
వీడని మిస్టరీ
పాలకొండ: పాలకొండ టీచర్స్ కాలనీలో కలకలం రేపిన డైట్ విద్యార్థిని పావని అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. జనావాసల మధ్య ఉన్న ఇంట్లో ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటంపై పోలీసులు మంగళవారం దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ తివిక్రమ వర్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ అణువణువూ తనిఖీ చేశాయి. అనంతరం పావని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెది హత్య అని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలింది. గొంతును విచక్షణ రహితంగా కోసేసినట్లు వైద్యులు చెబుతున్నారు. నిశితంగా పరిశీలించిన ఎస్పీ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎస్పీ తివిక్రమవర్మ నిశితంగా పరిశీలించారు. సంఘటనా స్థలంలో గంటకు పైగా దర్యాప్తు చేశారు. ప్రతి ఆధారాన్ని ఆయన సేకరించారు. ఇప్పటికే కేసుపై ఒక అంచనాకు వచ్చిన ఆయన డీఎస్పీ స్వరూపారాణికి సూచనలిచ్చారు. ప్రస్తుతం పావని, శిరీషల ఫోన్ కాల్స్ ద్వారా కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్క శిరీషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో శిరీష పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు గుర్తించారు. కేసుపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు బయటకు రాకుండా చూస్తున్నారు. మనస్పర్థలే హత్యకు దారితీశాయా? సీతంపేట మండలం పెద్దూరుకు చెందిన పావని, శిరీష తల్లిదండ్రులు చనిపోవడంతో పాలకొండలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు. స్థానిక తమ్మినాయుడు కళాశాలలో పావని డైట్ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలం నుంచి అక్క శిరీషతో పావనికి గొడవలు జరుగుతున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. అక్క శిరీషతో పాటు ఆమె స్నేహితులు ఇంటికి వస్తుండేవారని, దీంతో పావని వారితో ఇంటికి రావొద్దని వారించేదన్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం పావని వేరే చోటకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. నరసన్నపేటకు సోమవారం ఉద్యోగ రీత్యా వెళ్లిన శిరీష సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి పావని రక్తపు మడుగులో పడిఉండటం, చుట్టూ కత్తులు ఉండటంతో.. వివాదాల నేపథ్యంలోనే పావనిని కావాలనే హత్య చేశారనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మృతదేహం ఉన్న పరిస్థితి, అక్కడ లభ్యమైన ఆధారాలతో పాటు మెడపై లోతుగా గాయమవడంతో ఆమెది హత్యే అని అభిప్రాయపడుతున్నారు. -
నటుడు ప్రదీప్‌ది ఆత్మహత్యే
♦ పోస్టుమార్టమ్ ప్రాథమిక నివేదికలో వెల్లడి ♦ బంధుమిత్రుల నివాళి అనంతరం అంత్యక్రియలు పూర్తి ♦ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన భార్య పావని ♦ ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల ఆరా హైదరాబాద్: బుల్లితెర నటుడు ప్రదీప్ కుమార్‌ది ఆత్మహత్యేనని, అతను ఉరి వేసుకుని చనిపోయాడని పోస్టు మార్టమ్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. అయితే ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవడంపై నార్సింగ్ పోలీసులు దృష్టి సారించారు. మంగళవారం రాత్రి పది నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరిగిన విషయాలు తెలుసుకునేందుకు నెక్నాంపూర్‌లోని ప్రదీప్ ఇంటి నుంచి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకు న్నారు. దీంతో పాటు ప్రదీప్ ఇంట్లో జరిగిన బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వారిని ప్రశ్నిస్తే అసలేం జరిగిందనేది తెలు స్తుందని భావిస్తున్నారు. ఇందులో భాగం గా వారందరినీ శుక్ర, శనివారాల్లో ఠాణాకు పిలిపించి విచారించనున్నట్టు తెలిసింది. ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు.. బుధవారం రాత్రి పోస్టుమార్టం పూర్తికావ డంతో ప్రదీప్ మృతదేహాన్ని నెక్నాంపూర్ లోని నివాసానికి తీసుకువచ్చారు. బుధ వారం ఉదయం ప్రదీప్ భౌతిక కాయానికి బంధుమిత్రులు, బుల్లితెర నటులు కడసారి వీడ్కోలు పలికారు. అనంతరం ఇంటి నుంచి రాయదుర్గంలోని మహా ప్రస్థానానికి తరలించారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన అంత్యక్రియలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. ప్రదీప్ సోదరుడు చైతన్య రామకృష్ణ బ్రహ్మణ ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్య క్రియల సందర్భంగా ప్రదీప్ తల్లితో పాటు భార్య పావనిరెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. వారిని బంధువులు, బుల్లితెర నటులు ఓదార్చారు. నిన్నమొన్నటి వరకు తమతో ఎంతో అప్యాయంగా ఉండే ప్రదీప్ ఇక లేడంటే నమ్మబుద్ధి కావటం లేదని బంధువులు, తోటి నటీనటులు భోరున విలపించారు. కాగా, ప్రదీప్ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు అతని భార్య పావనిరెడ్డి నిరాకరించారు. కనిపించని శ్రావణ్.. పావనిరెడ్డికి సోదరునిగా చెప్పుకోవటం తో పాటు ప్రదీప్ మరణించే సమయం లోనూ ఫ్లాట్‌లోనే ఉన్న శ్రావణ్ గురువా రం అంత్యక్రియల్లో కనిపించలేదు. ప్రదీప్ బంధుమిత్రులు అంత్యక్రియల కార్యక్రమానికి వస్తారు కాబట్టి గొడవలు జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే అతను దూరంగా ఉన్నట్టు తెలిసింది. కర్ణాటకలోని బెల్గాం నుంచి వచ్చిన పావ నిరెడ్డి బంధువులే అంత్యక్రియల్లో ఎక్కువ గా పాల్గొన్నారు. ప్రదీప్ ఇంటి వద్ద జరిగే కార్యక్రమాలతోపాటు అంతిమయాత్రను చిత్రీకరించన్వికుండా మీడియాను వీరు అడ్డుకోవటం చర్చానీయాంశమైంది. -
వీడియోల వివాదం
-
అంగన్వాడీ టీచర్‌ది హత్యే
* పోస్టుమార్టం నివేదికలో వెల్లడి * భర్తపై హత్య కేసు నమోదు చేసే అవకాశం పుల్కల్: గత సంవత్సరం అక్టోబర్ 16న అనుమానాస్పదంగా మృతి చెందిన పుల్కల్ అంగన్వాడీ టీచర్ పీ రాణమ్మ (37)ను కొట్టడం వల్లే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఈ కేసును హత్య కేసు నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన పుల్కల్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాణమ్మ గత అక్టోబర్ 16న రాత్రి ఛాతిలో నొప్పి వస్తోందని కుటుంబ సభ్యులకు తెలుపడంతో ఆమెను ప్రథమ చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీకి రెఫర్ చేశారు. అయితే బంధువులు మాత్రం జూబ్లీహిల్స్‌లోని అపోలో అసుపత్రికి తరలించారు. అక్కడ రాణమ్మకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. బంధువుల ఫిర్యాదు మేరకు అప్పట్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఫిబ్రవరిలో వచ్చిన పోస్టుమార్టం నివేదికలో రాణమ్మది సహజ మరణం కాదని కొట్టడం వల్లే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ కాపీ పోలీసులకు చేరింది. రాణమ్మ శరీరంలోని గుడి వైపు ఛాతి పైన, వెనుక వైపున బలమైన గాయం కావడంతో రక్త ప్రసరణ కాలేదని అందులో పేర్కొన్నారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగా పుల్కల్ పోలీసులు రాణమ్మ భర్త సంజీవులుపై హత్య కేసు నమోదు చేయనున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్ఐ సత్యనారాయణను వివరణ కోరగా రాణామ్మది అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గతంలో కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా రాణమ్మ భర్తపై హత్య కేసు నమోదు చేయునున్నట్లు తెలిపారు. -
ఎస్వీఎస్ విద్యార్థినులది హత్యేనా?
సాక్షి, చెన్నై: విల్లుపురం ఎస్వీఎస్ కళాశాల విద్యార్థినుల మృతికేసు మలుపు తిరిగింది. ఇది ముమ్మాటికి హత్యే అన్న వాదనలకు బలం చేకూరే రీతిలో కోర్టుకు పోస్టుమార్టం నివేదిక చేరింది. ఊపిరి ఆడక పోవడం వల్లే మరణించినట్టుగా నివేదిక లో పేర్కొనబడి ఉండడం కేసును మలు పు తిప్పి ఉన్నది. అలాగే, బావిలో దూకి మరణించి ఉంటే, ఊపిరి తిత్తుల్లోకి నీళ్లు చేరి ఉండేదని పేర్కొన బడి ఉండడంతో ఆ ముగ్గురిదీ హత్యే అన్న వాదనకు బలం చేకూరినట్టు అవుతోంది. విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలోని ఎస్వీఎస్ సిద్ధ వైద్య కళాశాలకు చెందిన విద్యా కుసుమాలు మోనీషా, శరణ్య, ప్రియాంకలు అనుమానాస్పద స్థితిలో బావిలో గత నెల శవాలుగా తేలిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని సృష్టించింది. ఈ కేసులో తొలుత ఆ జిల్లా యంత్రాంగం ఎవర్నో రక్షించే ప్రయత్నం చేసినట్టుగా మెతక వైఖరి అనుసరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు బయలుదే రడం, విద్యార్థిలోకం కన్నెర్ర చేయడంతో కేసును ఓ సవాల్‌గా తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఆత్మహత్య కేసుగా విచారణ సాగించినా, తదుపరి పరిణామాలతో స్థానిక పోలీసుల చేతి నుంచి కేసును సీబీసీఐడీ తన గుప్పెట్లోకి తీసుకుంది. ఈ కేసులో ఆ కళాశాల కరస్పాండెంట్ వాసుకీతో పాటుగా నలుగురు అరెస్టు అయ్యారు. ఈ అరెస్టులతో ఆ కళాశాలకు అస్సలు గుర్తింపు లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ విద్యార్థినుల మృతి మిస్టరీగానే ఉండడంతో దర్యాప్తు వేగం పెరగలేదని చెప్పవచ్చు. తన కుమార్తె మృతిలో అనుమానాలు ఉన్నాయంటూ మోనీషా తండ్రి కోర్టును ఆశ్రయించడంతో ఆమె మృత దేహానికి మరో మారు పోస్టుమార్టం చెన్నైలో జరిగింది. హత్యేనా: మద్రాసు హైకోర్టులో విచారణలో ఉన్న మోనీషా తండ్రి తమిళరసన్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కోర్టుకు విల్లుపురం వైద్య వర్గాలు జరిపిన పోస్టుమార్టం నివేదిక చేరడం,అందులో పేర్కొన్న అంశాలు కేసును మలుపు తిప్పినట్టు చేసింది. అందులో మృతి చెందిన వారి ఊపిరి తిత్తుల్లో నీళ్లు లేవు అని పేర్కొని ఉండడంతో ఇది ముమ్మాటికీ హత్యే అన్న వాదనలకు బలం చేకూరినట్టు అవుతోంది. అయితే, ఊపిరితిత్తుల్లోనే నీళ్లు చేరని దృష్ట్యా, ఇది హత్యే అన్న వాదనను తమిళరసన్ తరపు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచే పనిలో పడ్డారు. కాగా, ఇప్పటికే చెన్నైలో జరిగిన పోస్టుమార్టం మేరకు మోనీషా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించిం దని, ఊపిరి ఆడకుండా చేసి మరణించి నానంతరం నీళ్లలోకి తెచ్చి పడేసినట్టుం దని తమిళరసన్ తరపు వైద్యుడు సంపత్ స్పష్టం చేసి ఉండడంతో ఇది హత్యే అన్న వాదనకు బలం చేకూరినట్టు అయింది. అయితే, నివేదికను సమగ్రంగా పరిశీలించాల్సిన అవశ్యం ఉన్న దృష్ట్యా, ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి, తదుపరి విచారణ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ బయలు దేరింది. తన కుమార్తె శరణ్య మృత దేహానికి సైతం రీ పోస్టుమార్టం జరపాలని కాంచీపురం జిల్లా సెయ్యారుకు చెందిన ఏలుమలై కోర్టును ఆశ్రయించడంతో, ఈ పిటిషన్లన్నింటిపై మంగళవారం కోర్టు విచారణ నిర్వహించి, ఉత్తర్వుల్ని జారీ చేయనుంది. -
ఛిద్రమైన దేహాలు
శ్రుతి దేహంలో 6..విద్యాసాగర్ శరీరంలో 8 బుల్లెట్లు * శ్రుతి దేహంపై తీవ్రంగా కాలిన గాయాలు * పోస్టుమార్టం నివేదికలో వెల్లడి * విద్యాసాగర్ మర్మాయవాలపై గాయాలు ఉన్నాయన్న కుటుంబసభ్యులు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులు శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల మృతదేహాలకు బుధవారం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. శ్రుతి దేహంలోకి ఆరు బుల్లెట్లు దిగాయి. వాటిలో ఛాతీలో రెండు, ఎడమ కాలుకు రెండు, చేతికి రెండు తూటాలు తగిలినట్లుగా గాయాలున్నాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఆరు తూటాలు శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్లాయని, మృతదేహంలో తూటాలు లభ్యం కాలేదని చెప్పారు. ఇక విద్యాసాగర్‌రెడ్డి మృతదేహంపై ఎనిమిది తూటా గాయాలున్నట్లు పౌరసంఘాల నేతలు, కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోస్టుమార్టం సందర్భంగా విద్యాసాగర్ దేహం నుంచి నాలుగు తూటాలు బయటకు తీసినట్లు తెలుస్తోంది. మిగతా నాలుగు తూటాలు శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి. ‘‘చనిపోయినవారు నిజంగా అడవుల్లోనే ఎదురుపడితే వారి కాళ్లకు కచ్చితంగా బూట్లు ఉండాలి. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల కాళ్లకు బూట్లు లేవు. మహిళా నక్సలైట్లు తప్పనిసరిగా నెక్ టీషర్టులు వేసుకుంటారు. శ్రుతి శరీరంపై నెక్ టీషర్టు లేదు. శ్రుతి దేహంపై కాలిన గాయాలు ఉన్నాయి. యాసిడ్ పోయడం వల్లే ఇలా ఉన్నాయి..’’ అని పోస్టుమార్టం వద్దకు వచ్చిన ప్రజా సంఘాల నేతలు, ఇతరులు ఆరోపించారు. కోర్టు ఆర్డర్ తెచ్చేలోపే.. పోలీసులు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించారని, కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఆగలేదని విరసం నేతలు, మృతుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు, జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డి మృతదేహాలకు వీడియో రికార్డింగ్‌తో పోస్టుమార్టం నిర్వహించాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులతోపాటు విరసం నేతల సమక్షంలో పోస్టుమార్టం చేయాలని కోరారు. ఈ మేరకు న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తెచ్చుకునేందుకు విరసం నేతలు, మృతుల కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ఆందోళనను పోలీసులు పరిగణనలోకి తీసుకోకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించారు. కిరాతకంగా చంపారు..! పోలీసులు అమానవీయంగా వ్యవహరించి శ్రుతి, విద్యాసాగర్‌లను పొట్టన పెట్టుకున్నారని విరసం నేతలు, మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం పూర్తరుున తర్వాత మృతదేహాలను వారి ఇళ్లకు తరలించారు. శ్రుతి శరీరంపై కాళ్లు, పొట్ట తదితర చోట్ల కాలిన గుర్తులున్నాయి. కుటుంబ సభ్యులు ఈ గాయాలను చూపిస్తూ... ‘‘యాసిడ్ పోసి అత్యంత కిరాతకంగా చిత్రహింసలకు గురిచే శారు. ఆమెపై అత్యాచారం చేసి హతమార్చారు..’’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. విద్యాసాగర్ మర్మావయవాలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, ఎవరు చూడకుండా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలున్నాయని చెప్పారు. ముగిసిన విద్యాసాగర్ అంత్యక్రియలు ధర్మసాగర్: విద్యాసాగర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో బుధవారం ముగిశాయి. విద్యాసాగర్ తల్లిదండ్రులు సుధాకర్ లలిత, సోదరి శ్వేత గుండెలవిసేలా రోదించారు. అంత్యక్రియలో గ్రామస్తులు, బంధువులు, వరవరరావు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను పాటించండి వరంగల్ లీగల్: ఎన్కౌంటర్ మృతదేహాలకు శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టుల మార్గదర్శకాలను అమలు పర్చాలని వరంగల్ జిల్లా మానవ హక్కుల కోర్టు మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.బి.నర్సింహులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మావోయిస్టు శ్రుతి బంధువు దుర్గాప్రసాద్ ఈ కోర్టును ఆశ్రయించారు. శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నిపుణుడి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. దీనిని పరిశీలించిన కోర్టు.. ఆ మార్గదర్శకాలను పాటించాలని, వీడియో రికార్డింగులను ఈనెల 25లోగా నివేదికగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. -
‘రైతు ఆత్మహత్య’ల పరిహారం పొందడమిలా..
మంచిర్యాల రూరల్ : ఆరుగాలం కష్టించినా పెరుగుతున్న సాగు ఖర్చులు.. చేసిన అప్పులు.. తీర్చలేక చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సమస్యకు చావు పరిష్కారం కాదు. అనాలోచితంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ఇంటి పెద్ద చనిపోతే ఆయనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు వీధిన పడతారు. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నా.. అవగాహనలేమితో చాలామంది ప్రభుత్వ పరిహారం పొందలేక పోతున్నారు. ప్రతీ ఏడాది వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా జిల్లాలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే విధానం, నియమ నిబంధనలు తెలుసుకుందాం. దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు.. ఎఫ్ఐఆర్ కాపీ పంచనామా రిపోర్టు పోస్టుమార్టం రిపోర్టు ఫోరెన్సిక్ సైన్స్‌ల్యాబ్ రిపోర్టు పైవేట్ రుణాలుంటే.. పత్రాలు బ్యాంకు రుణాల డాక్యుమెంట్లు రైతు పేరున నమోదైన పట్టాదారు పాసుపుస్తకం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల వివరాలు అధికారిక సర్టిఫికెట్లు రేషన్‌కార్డు మూడేళ్లుగా సాగు వివరాల పహనీ మండలస్థాయి పరిశీలన కమిటీ నివేదిక (ఆర్డీవో, డీఎస్పీ, ఏడీఏ కమిటీ నివేదిక) రైతు మరణించాక ఏం చేయాలంటే.. రైతు ఆత్మహత్య చేసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు లేదా గ్రామస్తులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే రశీదు తీసుకోవాలి. రైతు ఆత్మహత్య చేసుకున్న కారణాలు (పంట నష్టం, బోర్లు ఫెయిల్ కావడం, అప్పుల భారం పెరగడం) నమోదు చేయించాలి. స్థానిక రెవెన్యూ అధికారులకు (వీఆర్వో, ఆర్ఐ) సమాచారం అందజేయాలి. ఘటన జరిగిన వెంటనే తహశీల్దార్ ఘటనా స్థలానికి వచ్చి కుటుంబాన్ని పరమార్శించాలి. అప్పుల వాళ్లను పిలిచి మాట్లాడాలి. అలా జరగకపోతే బాధిత కుటుంబ సభ్యులు నేరుగా తహశీల్దార్‌ను కలిసి దరఖాస్తు ఇచ్చి, జీవో 421లో పేర్కొన్న సౌకర్యాలు కల్పించాలని కోరాలి. మండల స్థాయి నిజనిర్ధారణ కమిటీ విచారణకు వచ్చినప్పుడు కూడా కటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, కులపెద్దలు, గ్రామపెద్దలు రైతు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాలి. మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టకపోతే, డివిజన్ స్థాయిలోని ఆర్డీవోను కలిసి పరిస్థితిని వివరించాలి. అక్కడ స్పందన లేకపోతే కలెక్టర్‌ను నేరుగా కలిసి పరిస్థితి వివరించాలి. -
సునంద ఎలా మరణించారో తెలియలేదు: పోలీసులు
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందాపుష్కర్ ఎందుకు మరణించారనే విషయం ఫోరెన్సిక్ నివేదికలో ఏమీ తేలలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అసలు ఆ నివేదికలో ఏమీ తేలనేలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. గురువారం లీకైన పోస్టుమార్టం నివేదికలో మాత్రం... ఆమె మరణానికి విషప్రభావమే కారణమని ఉంది. తమకు పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే ఏదైనా విషయాన్ని నిర్ధారించగలమని కమిషనర్ అన్నారు. ఆధారాలు సేకరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామన్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (సీఎఫ్ఎస్ఎల్) ఢిల్లీ పోలీసులకు తన నివేదిక ఇచ్చిన పది రోజుల తర్వాత అది లీకవడంతో ఇప్పుడు పోలీసులు దాని గురించి స్పందించారు. సునందాపుష్కర్ జనవరి 17వ తేదీన ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెలిసిందే. -
దాడివల్లనే నిడో మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దాడి కారణంగానే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా మృతిచెందినట్లు నిర్ధారణ అయ్యింది. తలపైనా, ముఖంపైనా గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. గత నెల 30న గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో నిడో తానియా మృతిచెందిన విషయం విదితమే. అయితే లజ్‌పత్‌నగర్‌లో దుకాణదారులు జాతి వివక్షతో కొట్టిన దెబ్బల కారణంగానే నీడో మరణించాడని అతని మిత్రులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నిడో మరణంపై ఎయిమ్స్ అందించిన పోస్టుమార్టం నివేదికను పోలీసులు హైకోర్టుకు సోమవారం సమర్పించారు. పదునైన వస్తువుతో తలపైనా, ముఖంపైనా కొట్టిన దెబ్బలకు నిడో మరణి ంచాడని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. నిడో హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను నగర పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు మణిపూర్ యువకులపై దాడి ఈశాన్యరాష్ట్రాలకు చెందిన పౌరులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిడో తానియా ఘటన మంట చల్లారకముందే మరో ఇద్దరు మణిపూర్ యువకులపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. గింఖాన్సూన్ నౌలక్(24), అతని సోదరుడు ఉమ్సాన్ముంగ్ నౌలక్ (25)లు మార్కెట్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి రాత్రి ఎనిమిది గంటల సమయంలో దాడి చేశారని పోలీసులు తెలిపారు. దీంతో వారిద్దరిని ఎయిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేర్చినట్లు చెప్పారు. కాగా ఉమ్సాన్ముంగ్ నౌలక్ను డిశ్చార్జి చేశారు. గింఖాన్సూన్ నౌలక్ అందులోనే చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. దుండగులు తమ వద్ద నుంచి ఎలాంటి దోపిడీకి ప్రయత్నించలేదని, జాతి వివక్ష కారణంగానే దాడి చేశారని బాధితులు ఆరోపించారు. జాతివివక్షతో అరుణాచల్‌ప్రదేశ్ యువకుడిని దాడిచేసి చంపిన ఘటన ఇటీవల చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మంట చల్లారముందే ఇద్దరు మణిపూర్ వాసులపై దాడి జరగడం సంచలనం సృష్టించింది. కాగా నగరంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారిపై ఇటీవల దాడులు పెరిగిన సంగతి విదితమే.