ముంబై : కులం పేరుతో సీనియర్ల చేతిలో వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ కేసు కీలక మలుపు తిరిగింది. పాయల్‌ది ఆత్మహత్య కాదు హత్య అనే అనుమానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. పోస్ట్ మార్టమ్ రిపోర్టు సంచలన విషయాలు బయటపెట్టింది. పాయల్ గొంతు దగ్గర, శరీరం మీద గాయలున్నట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టు వెల్లడించింది. దాంతో పాయల్‌ది హత్య అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ సందర్భంగా పాయల్ కుటుంబం తరఫు న్యాయవాది.. పాయల్ మృతిని హత్యగా గుర్తించాలని కోర్టును కోరారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాయల్ మరణించిన తీరు.. ఆమె శరీరం మీద ఉన్న గాయాలను బట్టి చూస్తే.. తనది ఆత్మహత్య కాదు.. హత్య అని తెలుస్తుంది. పోస్టు మార్టమ్ రిపోర్టు కూడా ఇదే తెలియజేస్తుంది. ప్రస్తుతం హత్య కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు గాను 14 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అన్నారు.
స్థానిక బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్ తాడ్వీని సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో పాయల్ ఈనెల 22న హస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే అనే ముగ్గురు మహిళా డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
(చదవండి : డాక్టర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు)
Comments
Please login to add a commentAdd a comment