
సాక్షి, శ్రీ సత్యసాయి: జిల్లాలోని గోరంట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న తేజస్విని అనుమానాస్పదంగా మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది.
అయితే, కొంత కాలంగా తిరుపతికి చెందిన సాధిక్, తేజస్విని ప్రేమించుకుంటున్నారని ఆమె పేరెంట్స్ చెప్పారు. తేజస్విని ప్రియుడు సాధికే హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తేజస్విని కూడా.. సాధిక్ నడుపుతున్న ఇటుక బట్టి వద్దే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకోవడం వారి ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తేజస్విని డెడ్ బాడీని మరోసారి పోస్టుమార్టంకు పంపించారు. కాగా, శుక్రవారం వచ్చిన రిపోర్టుల్లో ఆమెపై అత్యాచారం జరగలేదని, ఆమెను ఆత్మహత్య చేసుకుందని వైద్యులు నిర్ధారించారు. తేజస్విని ఆత‍్మహత్యేనని, ఆమె ఉరివేసుకొని చనిపోయినట్టు వైద్యులు ప్రాథమికంగా రిపోర్టులో ధృవీకరించారు. దీంతో ఆమె మృతిపై సస్పెన్స్ వీడింది.
ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అంతలోనే..
Comments
Please login to add a commentAdd a comment