
సాక్షి, రంగారెడ్డి: కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ డ్రామాతో నగరంలో కలకలం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. సదరు యువతి మంగళవారం మధ్యాహ్నం షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని సమాచారం. దాంతో యువతి కుటుంబ సభ్యులు మొదట ఆమెని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం యువతిని ఇంటికి పంపించారు వైద్యులు.
మంగళవారం రాత్రి అందరూ నిద్రపోయాక యువతి మరోసారి షుగర్ మాత్రలు మింగినట్లు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున యువతి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెని ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కొనసాగుతుండగా.. యువతి మరణించింది.
Comments
Please login to add a commentAdd a comment