satya sai
-
బంతి, కనకాంబరాల పూల తోటలు.. ప్రకృతి అందాలు (ఫొటోలు)
-
బలవంతంగా రేషన్ డీలర్ల తొలగింపు
సాక్షి, పుట్టపర్తి: కూటమి సర్కార్ నిరుపేదలను నానా తిప్పలు పెడుతోంది. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అటకెక్కిస్తూ పస్తులు పెడుతోంది. ముఖ్యంగా నిరుపేదల కడుపు నింపే ప్రజా పంపిణీ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. గతంలో వైఎస్ జగన్ సర్కార్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేసే వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. అంతేకాకుండా వివిధ కారణాలతో కార్డుదారులకు పంచదార, గోధుమపిండి, కందిపప్పు పంపిణీ నిలిపివేసింది. రెండు నెలలుగా బియ్యంతోనే సరిపెడుతోంది. అది కూడా రేషన్ దుకాణం వద్దకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి. బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో కందిపప్పు కొనలేకున్నామని పేదలు వాపోతున్నారు.ఆదాయ మార్గాలపై కన్ను..రేషన్ డీలర్షిప్ కోసం జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. పేదలకు ఇవ్వాల్సిన సరుకులు ఇవ్వకుండా బ్లాక్‌లో విక్రయించి ఆర్జించాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకోసం ఎవరికి వారుగా ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. ఫలితంగా కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ్ముళ్ల కుమ్ములాటలో ఒక్కో పంచాయతీలో కార్డుల ఆధారంగా రెండు నుంచి మూడు రేషన్ దుకాణాలు వెలిశాయి. దీంతో తమ కార్డు ఏ దుకాణం పరిధిలో ఉందో? ఏ దుకాణం వద్దకు వెళ్లాలో తెలియక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు.బలవంతంగా తొలగింపు..జిల్లా 5,62,784 కార్డులుండగా, వీరికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1,367 రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నిరుపేదలకు ప్రతి నెలా నిత్యావసర సరుకులు అందజేసేది. అయితే కూటమి అధికారంలోకి రాగానే.. చాలా చోట్ల డీలర్లను తొలగించారు. కొత్తగా టీడీపీ మద్దతుదారులను డీలర్లుగా నియమించారు. వారు తమకిష్టమొచ్చిన సమయంలో, తమకు అనుకూలమున్న ప్రాంతంలో రేషన్ పంపిణీ చేస్తున్నారు. దీంతో రేషన్ సరుకులు తీసుకునేందుకు నిరుపేదలు పనులు మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గట్టిగా ప్రశ్నిస్తే అధికారంలో తమ పార్టీ ఉందని.. తమకు ఇష్టం వచ్చినప్పుడు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామంటున్నారు. ఇంకా పాత డీలర్లే కొనసాగుతున్న చోట్ల నిత్యావసరాల పంపిణీని టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఫలితంగా నిరుపేదలను పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.కొనలేని పేదలు..గతంలో చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు అరకిలో చక్కెర రూ.17.50కే ఇచ్చేవారు. కిలో కందిపప్పు రూ.67కే ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయడం లేదు. బయట కొందామంటే రేట్లు విపరీతంగా ఉంటున్నాయని పేదలు వాపోతున్నారు. కిలో చక్కెర రూ.42 పైగా ఉంటోంది. కందిపప్పు కిలో రూ.185 పలుకుతోంది. దీంతో చాలామంది పేదలు కందిపప్పు కొని తినలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీని రాజకీయం చేయడం మాని, నిరుపేదలందరికీ నిత్యాసర సరుకులు అందించాలని జనం వేడుకుంటున్నారు.నిరుపేదలకు తక్కువ ధరకే నిత్యావసరాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపంపిణీ వ్యవస్థను కూటమి సర్కార్ అస్తవ్యస్తం చేసింది. కార్డుదారులకు రాయితీతో ఇవ్వాల్సిన కందిపప్పు, చక్కెరకు పూర్తిగా కోత పెట్టింది. కేవలం బియ్యం ఇస్తూ గంజి కాచుకుని తాగమంటోంది. ఇక కూటమి పార్టీల నేతలు రేషన్‌డీలర్లుగా తమ వారిని నియమించుకునేందుకు కొన్ని చోట్ల పాత డీలర్లు రేషన్ పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బియ్యం కూడా అందని పరిస్థితి నెలకొంది. -
ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా నిలబడ్డాం: సీఎం జగన్
సాక్షి, పుట్టపర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వరుసగా ఐదో ఏడాది రెండో విడతలో వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. పుట్టపర్తిలో బటన్ నొక్కి ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందజేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘దేవుడి దయంతో మంచి కార్యక్రమం జరుగుతోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతన్న ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది. పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను. ఈనెలలోనే అవి కూడా వస్తాయి. ప్రతీ విషయంలో అన్నదాతలకు అండగా నిలబడ్డాం. మొత్తం రూ.33,209.81 కోట్లు సాయం అందించాం. 14 ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని గతంలో ఎప్పుడూ ఆలోచన చేయలేదు. రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నాయకత్వంలోకి తీసుకొచ్చాం. నా నిరుపేద వర్గాలకు మంచి జరగాలనే అడుగులు వేశాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతున్నలకు రైతు భరోసా అందించాం. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడాలి. సామాజిక సాధికార యాత్రకు విశేష స్పందన వస్తోంది. బాబు హయాంలో వ్యవసాయానికి ఏడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయారు. మీ బిడ్డ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. ఈ నాలుగేళ్లలో రూ.7800 కోట్ల బీమా అందించాం. ఈ క్రాప్ ద్వారా ప్రతీ రైతుకు మంచి జరిగేలా చేస్తున్నాం. ప్రతీ గ్రామంలో నేడు ఆర్బీకే కేంద్రాలు పనిచేస్తున్నాయి. గడచిన నాలుగేళ్ల కాలంలో రూ.60వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం. చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువే. దేవుడి దయతో గత నాలుగేళ్లలో కరువు మాటేలేదు. మన ప్రభుత్వంలో పంట సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెప్తూ రైతన్నకి భరోసా కల్పిస్తున్నాం. గతంలో సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు హయాంలో హెరిటేజ్ కంపెనీకి లాభాలు పెరిగాయి. రైతులకు ఎందుకు మంచి జరగలేదు’ అని ప్రశ్నించారు. -
గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు.. కుప్పకూలిన యువకుడు
-
గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు
గుండెపోటు.. ఈ మాట వింటేనే గుండె ఆగినంత పని అవుతుంది. అంతకంతకు పెరిగిపోతున్న గుండెపోటు మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్ఎటాక్తో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. రదాగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపిన వారు అప్పటికప్పుడే ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది.. పట్టణంలోని మారుతి నగర్లో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నవరాత్రుల్లో భాగంగా బుధవారం రాత్రి వినాయకుని మండపం ముందు డాన్స్ చేస్తూ ప్రసాద్ (26) అనే యువకుడు మృతి చెందాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ప్రసాద్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. -
కుట్రలను తిప్పి కొట్టండి
గోరంట్ల/ పెనుకొండ/ సోమందేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబును అధికారంలోకి తేవడానికి రామోజీరావు శ్రీఈనాడుశ్రీలో తప్పుడు కథనాలు వండివార్చి ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటున్న కుట్రలను తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ పిలుపునిచ్చారు. తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు ప్రతులను శంకరనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం గోరంట్లలోని బస్టాండ్ సర్కిల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దహనం చేశారు. శంకరనారాయణ మాట్లాడుతూ జనరంజక పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు రామోజీరావు పత్రికా విలువలను దిగజారుస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో గోరంట్ల మార్కెట్‌యార్డు ఉపాధ్యక్షుడు నూర్‌మహమ్మద్, వైఎస్సార్సీపీ రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు పాటూరి శంకరరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఫకృద్దీన్ సాహెబ్, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ బాషా, నాయకులు మేదరశంకర, శంకరరెడడ్డి, ప్రభాకారరావు, సర్పంంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పెనుకొండలో నగరపంచాయతీ చైర్మన్ ఉమర్‌ఫారూక్‌ఖాన్, వైస్ చైర్మన్ సునీల్, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ బోయ నరసింహ నేతృత్వంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్లోనూ వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నారాయణరెడ్డి, మాజీ కన్వీనర్ వెంకటరత్నం, ఉప సర్పంచ్ వేణు, వైస్ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, మైనార్టీ సెల్ కన్వీనర్ ఇమామ్‌వలి, సీనియర్ నాయకులు యల్లారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి తదితరులు ఈనాడు ప్రతులను తగులబెట్టి.. తప్పుడు రాతలను ఖండించారు. -
వైభవంగా గావుల మహోత్సవం
కనగానపల్లి: దాదులూరు పోతలయ్యస్వామి జాతరలో కీలకమైన గావుల మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామునే భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్చించారు. అనంతరం ఉరుముల శబ్దాలు, పోతరాజుల విన్యాసాల నడుమ 15 మేకపోతు పిల్లలను బలిచ్చి స్వామికి రక్తతర్పణం చేశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దాదలూరు కిక్కిరిసిపోయింది. అనంతరం పలువురు భక్తులు ఆలయం ముందు పోట్టేళ్లు, మేకపోతులను బలిచ్చి స్వామికి మొక్కులు సమర్పించుకున్నారు. జనంతో కిక్కిరిసిన పరుష.. దాదులూరు పరుష జనంతో కిక్కిరిసిపోయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు భక్తులు పోతలయ్యస్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ఆలయంలో క్యూలైన్లతో పాటు చుట్టూ ఉన్న పరుష ప్రాంతం జనంతో నిండిపోయింది. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకొన్న పోలీస్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బందికి ఆలయ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇద్దరు యువకులు జలసమాధి
హిందూపురం: ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడి మృతి చెందారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హిందూపురం రూరల్ సీఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పూలకుంటకు చెందిన ఐటీఐ విద్యార్థి చంద్రకీర్తి (18), కూలిపనులు చేసుకునే తరుణ్ (18) స్నేహితులు. వీరు శుక్రవారం ఉదయం బహిర్భూమికని స్థానిక చెరువు వద్దకు వెళ్లారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చెరువు వద్దకెళ్లగా వారు కనిపించలేదు. చెరువు నీటిలో ఒక చెప్పు తేలియాడుతుండటంతో అందులో మునిగిపోయి ఉంటారన్న అనుమానించారు. స్థానికుల సహకారంతో చెరువులో వెదికినా జాడ కనిపించలేదు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ పోలీసు సిబ్బందితో పూలకుంట చెరువు వద్దకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందిని రప్పించి వారి సహకారంతో చెరువులో వెదికించి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉంటారని, ఈతరాకపోవడంతో నీటమునిగి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించినట్లు ఈఓ పట్టెం గురుప్రసాద్, ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ తెలిపారు. 72 రోజులకు గాను హుండీ కానుకల ద్వారా రూ.98,13,595 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. గతంలో కంటె ఈసారి ఆదాయం ఎక్కువ వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ చలపతి, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ‘డీజిల్’ టెండర్ల పరిశీలన పుట్టపర్తి టౌన్: జిల్లాలోని ఆరు ఆర్టీసీ డిపోలకు డీజిల్ సరఫరా చేసేందుకు దాఖలైన టెండర్లను డీపీటీఓ మధుసూదన్ ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. మొత్తం 35 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఖాళీగా వేసిన టెండర్‌ను తిరస్కరించారు. మిగతా టెండర్లను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన టెండర్లను ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు. అయితే తమకు కావలసిన వారికి టెండర్కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని పలువురు టెండర్‌దారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అలాంటిదేమీ లేదని అధికారులు తోసిపుచ్చారు. నిబంధనల ప్రకారమే టెండర్‌ను ఖరారు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పరిశీలన కమిటీ సభ్యులు చీఫ్ మెకానికల్ ఇంజినీర్ మోహన్‌కుమార్, అకౌంట్ ఆఫీసర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు. -
శ్రీ సత్యసాయి జిల్లాలో అతి పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం
-
చిలుకలన్నీ కలిసి పాము పై దాడి..
-
అనంత వర్షాలు...
-
అనంత, సత్యసాయి జిల్లాలో భారీ వర్షం.. ఇళ్లలోకి వరద నీరు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి వరద నీటితో రుద్రంపేట, నడిమివంక, ఆదర్శ్‌నగర్ కాలనీలు జలమయమయ్యాయి. అధికారులు దాదాపు 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగస్వామయి నగర్లో చిక్కుకున్న కాలనీవాసులను బోట్ల సాయంతో రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. విజయవాడలో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో, అధికారులు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌ను మూసివేశారు. ఆలయానికి వచ్చే భక్తులు మెట్లు, లిఫ్ట్ మార్గాల్లో రావాలని ఈవో భ్రమరాంబ సూచించారు. వాహనాలను కనకదుర్గనగర్‌లో నిలిపివేయాలని ఈవో స్పష్టం చేశారు. -
తేజస్విని డెడ్ బాడీ కలకలం.. లవర్ ఇటుక బట్టి వద్ద..
సాక్షి, శ్రీ సత్యసాయి: జిల్లాలోని గోరంట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న తేజస్విని అనుమానాస్పదంగా మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది. అయితే, కొంత కాలంగా తిరుపతికి చెందిన సాధిక్, తేజస్విని ప్రేమించుకుంటున్నారని ఆమె పేరెంట్స్ చెప్పారు. తేజస్విని ప్రియుడు సాధికే హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తేజస్విని కూడా.. సాధిక్ నడుపుతున్న ఇటుక బట్టి వద్దే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకోవడం వారి ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తేజస్విని డెడ్ బాడీని మరోసారి పోస్టుమార్టంకు పంపించారు. కాగా, శుక్రవారం వచ్చిన రిపోర్టుల్లో ఆమెపై అత్యాచారం జరగలేదని, ఆమెను ఆత్మహత్య చేసుకుందని వైద్యులు నిర్ధారించారు. తేజస్విని ఆత్మహత్యేనని, ఆమె ఉరివేసుకొని చనిపోయినట్టు వైద్యులు ప్రాథమికంగా రిపోర్టులో ధృవీకరించారు. దీంతో ఆమె మృతిపై సస్పెన్స్ వీడింది. ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అంతలోనే.. -
24 ఏళ్ల క్రితం పెళ్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్త అడ్డొస్తున్నాడని
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డు తగిలిన భర్తను తానే హతమార్చినట్లు నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. వివరాలను బుధవారం ధర్మవరం అర్బన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమాకాంత్ వెల్లడించారు. ధర్మవరంలోని దుర్గానగర్‌కు చెందిన పల్లపు గంగాధర్‌కు 24 సంవత్సరాల క్రితం లక్ష్మీదేవితో వివాహమైంది. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే స్థానిక ఎరికల ముత్యాలు, ఎరికల పుల్లక్క, ఎరికల నగేష్, మరికొందరితో దాదాపు రూ.8 లక్షల వరకు అధిక వడ్డీకి గంగాధర్ అప్పులు చేసి భార్య చీరల వ్యాపారానికి సమకూర్చాడు. కొన్నేళ్లుగా లక్ష్మీదేవి తారకరామాపురానికి చెందిన నారా భాస్కరరెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా తెలుసుకున్న గంగాధర్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతుండడంతో ఎలాగైనా భర్తను అంతమొందించాలని లక్ష్మీదేవి నిర్ణయించుకుంది. తన అన్న వెంకటేష్, ఆమె అల్లుడు సుధాకర్‌కు డబ్బు ఆశ చూపి వారి సాయంతో ఏప్రిల్ 8న అర్ధరాత్రి 1.30గంటల సమయంలో ఎల్పీ సర్కిల్లోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మద్యం మత్తులో పడి ఉన్న గంగాధర్‌పై బండరాయి, ఇనుప పైపులు వేసి, గొంతు నులిమి హతమార్చింది. చదవండి: తిరుమల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. కిడ్నాపర్ ఎవరంటే..? మరుసటి రోజు అప్పులు ఇచ్చిన వారే తన భర్తను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానాలు రేకెత్తడంతో విషయం తెలుసుకున్న ఆమె, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. బుధవారం ఉదయం వీఆర్వో ద్వారా పోలీసులకు లొంగిపోయారు. హత్యకు దారి తీసిన పరిణామాలను ఈ సందర్భంగా పోలీసులకు నిందితులు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
అన్నదాతల ‘ఆత్మ’ సాక్షిగా రాజకీయం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు సాకే రామకృష్ణ (40) ఆర్థిక సమస్యలతో 2020లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే మండలంలోని బాసంవారిపల్లి గ్రామానికి చెందిన గజ్జెల ఓబయ్య(38)కు సెంటు భూమి కూడా లేదు. ఇతను కూడా అప్పుల బాధ తాళలేక 2019 జూన్ 27న రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తికి చెందిన పుల్లారెడ్డి పేరుపై ఎలాంటి భూమి లేదు. ఇంట్లో సమస్యలతో ఇతనూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా ఈ జిల్లాలో కండ్లగూడూరుకు చెందిన రమణారెడ్డి, ముప్పాలగుత్తికి చెందిన బాల దస్తగిరి, బందార్లపల్లికి చెందిన ఎ.సోమశేఖర్, పెద్దవడుగూరుకు చెందిన కె.నారాయణస్వామి, తనకల్లు మండలం కోటూరుకు చెందిన శివరామిరెడ్డి, మరో ఎనిమిది మంది.. మొత్తంగా ఇలా రైతులు కాని 16 మంది వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 12 మందికి ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరఫు నుంచి వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష చొప్పున పరిహారం అందింది. (మిగిలిన నలుగురిలో ఒకరిది కర్ణాటక, మరో మగ్గురు 2013కు ముందే మృతి చెందారు) అయితే వీరంతా రైతులని, వీరి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇంతటితో ఆగకుండా ఈ 16 మందితో పాటు ఆత్మహత్య చేసుకున్న 15 మంది రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇటీవల ఆర్థిక సాయం చేసి, రాజకీయంగా వాడుకునేందుకు వ్యూహ రచన చేశారు. వాస్తవానికి ఈ 15 మంది రైతు కుటుంబాలను ప్రస్తుత ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోంది. వీరిలో ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున (అప్పటి నిబంధనల ప్రకారం), ఏడుగురికి రూ.7 లక్షల చొప్పున పరిహారం అందించారు. మరో ఆరుగురు రైతులకు రూ.7 లక్షల చొప్పున సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. నాడు ఒక్కమాటైనా అన్నారా? 2014–19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి చేతులాడలేదు. ప్రతిదానికి ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ చంద్రబాబును ఎందుకు పరిహారం ఇవ్వలేదని ఒక్క ప్రశ్నా వేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. పైగా టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా పరిహారం అందించింది. కౌలు రైతులకు కూడా పరిహారం అందజేస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెబుతారు. ఈ నేపథ్యంలో రైతులు కాని వారిని సైతం రైతులుగా చిత్రీకరించి, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపు కోవడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి పవన్ కల్యాణ్ పొలిటికల్ ‘టూర్’ ప్రారంభించారని రైతు సంఘాల నేతలు, రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కల్యాణ్ హడావిడి చేసిన తీరుపై బాధిత రైతులు సైతం నోరెళ్లపెడుతున్న పరిస్థితి. పరిహారం ఇవ్వడం తప్పు కాకపోయినా, ప్రభుత్వం ఆదుకోనందునే తాను ముందుకు వచ్చానని చెప్పడం సరికాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందరూ రైతులేనా? పవన్‌కళ్యాణ్‌కు రైతులెవరో, కౌలు రైతులెవరో.. చేనేతలెవరో కూడా తెలియని పరిస్థితి. అందరినీ ఒకేగాట కట్టేసి.. చనిపోయిన వారంతా రైతులే అంటూ రాజకీయ విమర్శలు చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నల్లమాడ మండలం వంకరకుంటకు చెందిన చేనేత కార్మికుడు సాకే రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రూ.లక్ష సాయం అందించింది. ఈ కుటుంబానికి వితంతు పింఛన్, అమ్మ ఒడి పథకాన్నీ వర్తింపజేసింది. ఈ విషయం ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే పవన్ కల్యాణ్ ఇతన్ని కౌలు రైతు అంటూ హడావుడి చేయడంపై ఆ గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. పరిహారం ప్రక్రియ ఇలా.. ♦రైతులు/ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే అధికారుల పంచనామా మొదలుకొని నివేదిక ఇచ్చే వరకు పక్కాగా వివరాలు సేకరిస్తారు. వీఆర్వో లేదా వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌కు, పోలీసులకు సమాచారం ఇస్తారు. వైఎస్సార్ బీమా పోర్టల్‌లో సంబంధిత వ్యక్తి వివరాలు అప్లోడ్ చేస్తారు. ♦పోలీసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎస్ఐతో కలిసి మండల తహశీల్దార్, మండల వ్యవసాయాధికారి (త్రీమెన్ కమిటీ) గ్రామానికి వెళ్లి రైతు ఆత్మహత్యపై అన్ని వివరాలు సేకరిస్తారు. ♦త్రీమెన్ కమిటీ రిపోర్టుకు శవ పంచనామా, పోస్టు మార్టమ్ రిపోర్టు, డెత్ సర్టిఫికెట్, పురుగు మందులు తాగినట్లు రుజువు చేసే రిపోర్టు అన్నీ జత చేయాలి. ♦త్రీమెన్ కమిటీ రిపోర్టు డివిజన్ కమిటీకి పంపిస్తారు. డివిజన్ కమిటీలో ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీ ఉంటారు. ఈ కమిటీ మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్థారించుకున్న తర్వాత రైతు ఆత్మహత్యకు పరిహారం ఇవ్వాలని రిపోర్టు తయారు చేసి, వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి ఫైలు జాయింట్ కలెక్టర్‌కు, ఆపై కలెక్టర్‌కు వెళ్తుంది. ♦అనంతరం డైరెక్ట్ బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో నామినీకి సీఎఫ్ఎంఎస్ ద్వారా పరిహారం అందజేస్తారు. -
Degree Student: చదువుకు దూరమై.. బతకడం భారమై..
ధర్మవరం రూరల్(శ్రీసత్యసాయి జిల్లా): కొన్ని పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమైన ఓ డిగ్రీ విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురై బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మండల పరిధిలోని మల్లేనిపల్లి గ్రామానికి చెందిన పూజారి రాములు, అంజనమ్మ దంపతుల కుమార్తె రాధారాణి(19) పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. చదవండి: ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి కొన్ని కారణాలతో కుటుంబీకులు ఆమెను చదువు మాన్పించారు. దీంతో తన భవిష్యత్ అంధకారం అయ్యిందని రాధారాణి తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే బుధవారం ఎవరూలేని సమయంలో ఇంట్లోని దూలానికి ఉరివేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పవన్ పర్యటనపై మండిపడుతున్న రైతులు, రైతు సంఘాలు
-
బయటపడ్డ పవన్ కల్యాణ్ రాజకీయ డ్రామాలు
సాక్షి, అనంతపురం, సత్యసాయి జిల్లా: టీడీపీ పాలనలో రైతు ఆత్మహత్యలపై నోరు మెదపని పవన్ కల్యాణ్.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ పేరుతో ఇప్పుడు రాజకీయ డ్రామాలకు తెర తీశారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రాజకీయ లబ్ధి కోసమే పవన్ పర్యటనలు చేస్తున్నారని రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల.. ఆత్మహత్య చేసుకున్న ఒక్కొ రైతు కుటుంబానికి రూ. 7 లక్షల చొప్పున వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 201 మందికి రూ.11.95 కోట్లు పంపిణీ చేసింది. గతంలో 110 మంది రైతు కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ఎగొట్టారు. టీడీపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచింది. ఎవరిని ఉద్దరించేందుకు వస్తున్నారు? ‘అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల మేర ఆర్థిక సాయం అందించింది. చివరకు టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలనూ సీఎం జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో ఆదుకున్నారు. బాధిత కుటుంబాలు గౌరవంగా బతుకుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకునే పేరుతో అల్లరి చేసేందుకే వస్తున్నట్లు ఉన్నారు’’ అని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునే పేరుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కొత్తచెరువుకు చెందిన రైతు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం వస్తుండగా.. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి స్పందించారు. రైతు రామకృష్ణ ఆత్మహత్య చేసుకుంటే 17 రోజుల్లోనే రూ.7 లక్షలు అందించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ పర్యటన ఎవ్వరిని ఉద్దరించేందుకని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇంత పెద్ద మొత్తంలో పరిహారం అందించలేదన్నారు. -
ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే: తిప్పేస్వామి
మడకశిర(సత్యసాయి జిల్లా): మంత్రి పదవి రాలేదని తనకు అసంతృప్తి లేదని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. సోమవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రాణం ఉన్నంత వరకు తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఆశయమన్నారు. మంత్రి పదవి దక్కక పోవడంతో తాను అసంతృప్తితో ఉన్నట్లు మీడియా అసత్యప్రచారం చేసిందన్నారు. తాను 40 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబం వెంటే ఉన్నానని పేర్కొన్నారు. చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల.. తనకు వైఎస్సార్ 1999లో చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014, 2019లో మడకశిర ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారని తెలిపారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కుటుంబానికి విశ్వాస పాత్రుడిగా ఉంటానని తెలిపారు. కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని కోరారు. -
కన్నా... నీ రాక కోసం!
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా చైనాలో చిక్కుకున్న భారతీయుల్లో మన జిల్లా వాసి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేపగా, అతడి కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజాం పట్టణం కాలెపువీధికి చెందిన దొంతంశెట్టి సత్యసాయికృష్ణ టీసీఎల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికై శిక్షణ నిమిత్తం అక్కడకు వెళ్లాడు. ఇంతలో కరోనా మహమ్మారి విజృంభించడంతో చైనా ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. వైద్య పరీక్షల్లో టెంపరేచర్ డౌన్‌గా ఉందని ఇతడితోపాటు వెళ్లిన కర్నూలు జిల్లాకు చెందిన యువతిని పంపేందుకు అనుమతి నిరాకరించింది. సత్యసాయికృష్ణ గతేడాది ఆగస్టులో తమిళనాడులోని వెల్లూరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీఎల్ కంపెనీ ఉద్యోగిగా ఎంపికయ్యాడు. వెంటనే కంపెనీ ట్రైనింగ్ నిమిత్తం ఈయనతోపాటు మరో 89 మందిని చైనాలోని వ్యూహాన్ సిటీ తీసుకెళ్లింది. వీరిలో కొంతమంది రెణ్నెల్ల క్రితం ఇండియాకు వచ్చేయగా, సత్యసాయికృష్ణతోపాటు మరో 57 మందికి శిక్షణ కాలం ఆర్నెల్లకు పొడిగించడంతో ఉండిపోయారు. ఇంతలో వ్యూహాన్లో కరోనా వైరస్ విజృంభించడంతో చైనా ప్రభుత్వం ఎవరినీ పంపకుండా నిషేధం విధించింది. వచ్చిన అవకాశం చేజారింది... కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తున్న సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చొరవతో 11 రోజుల క్రితం 600 మంది రెండు విమానాల్లో స్వదేశానికి చేరుకున్నారు. పది మందిని మాత్రం చైనా ప్రభుత్వం ఇండియా పంపేందుకు అనుమతించ లేదు. వీరిలో టీసీఎల్ కంపెనీ నుంచి వెళ్లిన రాజాం పట్టణానికి చెందిన సత్యసాయికృష్ణ, కర్నూలు జిల్లాకు చెందిన మరో యువతి ఉన్నారు. వీరిద్దరికి ఆ రోజు వైద్య పరీక్షల్లో టెంపరేచర్ డౌన్‌గా ఉందని చైనా ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఎదురు చూస్తున్న కుటుంబీకులు... మధ్య తరగతి కుటుంబానికి చెందిన సత్యసాయికృష్ణ విట్ ఎంట్రన్స్ టెస్టులో ర్యాంకు సాధించడంతో అక్కడ మెకానికల్ ఇంజినీరింగ్ సీటు లభించింది. ఈ కోర్సు చివరి సంవత్సరంలో ఉండగా, టీసీఎల్ కంపెనీ తిరుపతిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసింది. చైనాలో శిక్షణ ముగించుకుని ఈ నెల మొదటి వారంలో ఇండియాకు రావాల్సి ఉంది. ఇంతలోనే కరోనా వైరస్ కారణంగా వ్యూహాన్ సిటీలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇతడి రాక కోసం తల్లి శ్రీదేవి, నానమ్మ భద్రమ్మ, సోదరి గాయత్రి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రయత్నాలు.. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఈ విషయం పెట్టామని, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ఓ తెలుగు మహిళ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తుందన్నారు. యోగ క్షేమాలు తెలుసుకుంటున్నాం... తన కుమారుడికి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందుతున్నాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, టిఫిన్ వంటివి ఇవ్వడం లేదు. గతంలో వీరికి వండి పెట్టే వంటమనిషి లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రోజూ మాస్‌్కలు ధరించి దగ్గర్లో క్యాంటీన్‌కు వెళ్లి బిస్కెట్లు, పండ్లు వంటివి తీసుకుంటున్నారు. తన కుమారుని యోగక్షేమాలు రోజు ఫోన్ ద్వారా తెలుసుకుంటూ కాలం గడుపుతున్నాం. – సత్యసాయికృష్ణ తండ్రి శ్రీనివాసరావు, రాజాం -
'మరింత ప్రజాసేవ చేయాలని కోరుకున్నా'
సాక్షి, అనంతపురం : పుట్టపర్తి సత్యసాయి 94వ జయంతి వేడుకలకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. సత్యసాయి తన భోదనలతో మానవునిలో మానవత్వాన్ని, ఆధ్యాత్మికతను మేల్కొల్పారని తెలిపారు. విద్య, వైద్య, తాగునీటి రంగాలకు సత్యసాయి అందించిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ప్రతి మనిషి సేవ, ప్రేమ భావనలను పెంపొందించుకొని సమసమాజ స్థాపనకు కృషి చేయాలనేదే సత్యసాయి అభిమతమని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నాకు మరింత ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని సత్యసాయిని వేడుకున్నట్లు తెలిపారు. -
ప్రేమికుడిగా కాదు... ప్రేమ స్వరూపుడివి కావాలి
లౌకిక జీవనాన్ని కాదనకుండానే ఆధ్యాత్మిక జీవన విలువలను అందించిన భగవాన్ సత్యసాయి బోధలు కొన్ని... ♦ ఆధ్యాత్మికమంటే మన జీవిత మార్గమే.ఊ మానవత్వంలో దైవత్వాన్ని ఆవిర్భవింపజేసేదే ఆధ్యాత్మిక జీవన మార్గం. ♦ ఆధ్యాత్మిక జీవితమంటే ఏకాంత జీవితం కాదు. మానవులందరిలోనూ ఏకత్వాన్ని గుర్తిం^è డం ♦ మానవునియందున్న పశుత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవడమే ఆధ్యాత్మికం ♦ సర్వజీవుల ఏకత్వ స్వరూపమే ఆధ్యాత్మిక జీవితం. మానవ కోటి మధ్య ప్రేమ బీజాలను నాటి సహన పుష్పాలను వికసింపజేసి శాంతి ఫలాలను సమాజానికి అందించేదే ఆధ్యాత్మికత. ♦ వీణలో అనేక తీగలుంటాయి. ఒక్కొక్క తీగ ఒక్కొక్క రకమైన శబ్దాన్నిస్తుంది. ఏ ఒక్క తీగ అపస్వరం పలికినా, వినడానికి ఇంపుగా ఉండదు. తీగలు వేర్వేరు గాని, వీణ ఒక్కటే కదా! దేశమే ఒక వీణ, మతాలే తీగలు. వీణపై తీగలన్నీ చేరి సుస్వరాన్ని పలికినట్లుగా, మతాలన్నీ ఏకమైనప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది ♦ భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఆయనను ప్రేమకోసం ఆశించినప్పుడే ఆయన బంధీ అవుతాడు. పనికిమాలిన వాటి కోసం కాదు ఊ ప్రేమికుడిగా నీవుండకూడదు. నీవే ప్రేమగా మారాలి. ఎందుకంటే, ప్రేమికుడిగా ఉన్నప్పుడు ఒకరిని మాత్రమే ప్రేమిస్తావు. నీవే ప్రేమగా మారినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు. -
పుట్టపర్తికి చేరిన ఇండోర్ భక్తుడి పాదయాత్ర
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సేవలు, ఆధ్యాత్మిక బోధనల పట్ల ప్రజలను చైతన్యం చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సత్యసాయి భక్తుడు సతీష్ చేపట్టిన పాదయాత్ర బుధవారం పుట్టపర్తికి చేరుకుంది. 2016 అక్టోబర్ 20న ఇండోర్‌లో పాదయాత్ర ప్రారంభించిన ఆయన సత్యసాయి చిత్రపటాన్ని, ఆయన బోధించిన బోధనలతో కూడిన ప్ల కార్డులతో పాదయాత్రగా పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ఆయనకు సత్యసాయి పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ప్రజా సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన సేవాస్పూర్తిని, ఆధ్యాత్మిక బోధనలతో అందరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్గ మధ్యలో ప్రజలకు సత్యసాయి చరిత్రను వివరించానన్నారు. గతంలో ఇండోర్ నుండి మహారాష్ట్రలోని షిర్డీకి, హిమాచల్‌ప్రదేశ్‌లోని వైష్టోదేవి ఆలయానికి పాదయాత్ర చేపట్టానన్నారు. -
సత్యసాయి సేవలు ఆదర్శం
పుట్టపర్తి టౌన్ : మానవాళికి ప్రేమతత్వాన్ని పంచుతూ లోక కల్యాణ సాధనకు పాటుడిన మహనీయుడు సత్యసాయి అని, ఆయన సేవలు ప్రపంచానికి ఆదర్శమని కేరళ రాష్ట్ర హైకోర్ట్ జడ్జి అను శివరామన్ పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో ఓనం పర్వదిన వేడుకలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో జరిగిన రెండో రోజు వేడుకల్లో భాగంగా ఆమె ప్రసంగించారు. కేరళీయులు ప్రాచీన కాలం నుంచి ఓనం వేడుకలను ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నారన్నారు. చెడును సంహరించడం మంచిని పెంచడమే ఓనం పర్వదిన సందేశమన్నారు. అనంతరం కేరళలోని కోజీకోడ్ జిల్లాకు చెందిన సద్గురుకులానికి చెందిన సంగీత విద్వాంసులు సనల్‌కుమార్ వర్మ,సుభాష్ చంద్రన్,జైరాజాలు కేరళ సంప్రదాయ రీతిలో సంప్రధానభజన్ కచేరి నిర్వహించారు. కచేరీలో భాగంగా గురువాయూర్ కృష్ణ, ఆదిదేవత అయిన కోల్లూరు ముఖాంభికా, గణేష్, సుబ్రహ్మణ్యంస్వామి,శభరిమల ఆయ్యప్పలను కీర్తిస్తూ భక్తి›గీతాలు అలపించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
సత్యసాయి మృతిపై సీబీఐ విచారణ