సాక్షి, అనంతపురం : పుట్టపర్తి సత్యసాయి 94వ జయంతి వేడుకలకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. సత్యసాయి తన భోదనలతో మానవునిలో మానవత్వాన్ని, ఆధ్యాత్మికతను మేల్కొల్పారని తెలిపారు. విద్య, వైద్య, తాగునీటి రంగాలకు సత్యసాయి అందించిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ప్రతి మనిషి సేవ, ప్రేమ భావనలను పెంపొందించుకొని సమసమాజ స్థాపనకు కృషి చేయాలనేదే సత్యసాయి అభిమతమని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నాకు మరింత ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని సత్యసాయిని వేడుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment