సాక్షి, శ్రీ సత్యసాయి: ధర్మవరంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం అయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం నుంచి ముగ్గురు కాలేజీ విద్యార్థినులు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అదృశ్యం కేసు మిస్టరీగా మారింది.
వివరాల ప్రకారం.. ధర్మవరంలో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం నుంచి శిరీష, గాయత్రి, ప్రియాంక కనిపించపోవడంతో వారి తల్లిదండ్రుల ఆందోళనకు గురువుతున్నారు. ఈ క్రమంలో పేరెంట్స్.. పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో, మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ముగ్గురు అమ్మాయిల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment