girls missing
-
AP: ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్.. పోలీసుల గాలింపు
సాక్షి, శ్రీ సత్యసాయి: ధర్మవరంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం అయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం నుంచి ముగ్గురు కాలేజీ విద్యార్థినులు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అదృశ్యం కేసు మిస్టరీగా మారింది.వివరాల ప్రకారం.. ధర్మవరంలో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం నుంచి శిరీష, గాయత్రి, ప్రియాంక కనిపించపోవడంతో వారి తల్లిదండ్రుల ఆందోళనకు గురువుతున్నారు. ఈ క్రమంలో పేరెంట్స్.. పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో, మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ముగ్గురు అమ్మాయిల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
భోపాల్: షెల్టర్ హోం నుంచి 26 మంది బాలికల మిస్సింగ్!
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లో చట్టవిరుద్దంగా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్ శివారు ప్రాంతంలో అంచల్ బాలికల హాస్టల్ నిర్వహిస్తున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనుంగో .. ఈ చిల్డ్రన్స్ హోమ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే రిజిస్టర్‌ను తనిఖీ చేయగా.. అందులో 68 బాలికల ఎంట్రీలు ఉండగా.. 26 మంది గల్లంతైనట్లు గుర్తించారు. మిస్ అయిన వారిలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్ ప్రాంతాలకు చెందిన బాలికలు ఉన్నారు. అదృశ్యమైన బాలికల గురించి షెల్టర్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానలు చెప్పాడు. అనుమానం వచ్చిన అధికారి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికల హాస్టల్లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అసలు షెల్టర్ హోంను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. వీధుల్లో ఒంటరిగా కనిపించిన పిల్లలను ఒక చోట చేర్చి, ఎలాంటి లైసెన్స్ లేకుండా ఓ మిషనరీ( మత గురువు) ఈ షెల్టర్ హోమ్‌ను నడుపుతున్నట్లు కనుంగో ట్వీట్ చేశారు. రక్షించిన పిల్లలకు రహస్యంగా క్రైస్తవ మతాన్ని ఆచరించేలా చేశారని ఆరోపించారు. హాస్ట్‌లో ఎక్కువమంది అమ్మాయిలు ఆరు నుంచి 18 సంవత్సరాల వారేనని.. వీరిలో అధికంగా హిందువులే ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న గవర్నర్.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వ సీఎస్‌కు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇక షెల్టర్ హోంలోని మిగతా పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పజెప్పారు. చదవండి: రామమందిర ప్రారంభం.. ఆలయానికి వెళ్లి మహా హారతి ఇస్తా: ఉద్ధవ్ -
ముగ్గురు విద్యార్థినిలు మిస్సింగ్.. ఏమయ్యారు?
సాక్షి, జనగామ: జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో శనివారం ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్థినిల పేరెంట్స్ హెడ్మాస్టర్కు విషయం తెలిపారు. దీంతో, వీరంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. జనగామ జిల్లాలో ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. స్టేషన్ రోడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆశ్విత(15), శివరాత్రి రక్షిత(14), దూదేకుల రుబిన(12) శనివారం అదృశ్యమయ్యారు. ఈరోజు భోజన సమయంలో వీరు ముగ్గురు కనిపించలేదు. ఈ విషయం వీరి పేరెంట్స్‌కు హెడ్మాస్టర్ వలబోజు కృష్ణమూర్తి తెలియజేశారు. ఈ క్రమంలో వీరి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విషాదం.. కొడుకు మరణ వార్త విని తండ్రి మృతి -
నెలలో 28 మంది బాలికలు అదృశ్యం.. దీని వెనుక ఏదో ఉంది
సాక్షి, హైదరారబాద్: ఒకే పోలీసుస్టేషన్ పరిధి నుంచి నెల రోజుల కాలంలో 28 మంది బాలికలు అదృశ్యమయ్యారు. దీని వెనుక ఏదో ఉంది... అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టు పోలీసులకు తలనొప్పి తెచ్చి పెట్టింది. ఈ విషయంలో అసలేం జరిగిందంటూ ఆరా తీయగా.. స్లమ్ ఏరియాలు అత్యధికం. హైదరాబాద్ తూర్పు మండల పరిధిలోని మలక్‌పేట డివిజన్లో ఉన్న సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిధి మూడు చదరపు కిలోమీటర్లు ఉంది. ఇందులో మూడు లక్షలకు పైగా జనాభా నివసిస్తుండగా... ప్రతి రోజూ 30 వేల నుంచి 40 వేల మంది వచ్చిపోతుంటారు. ఈ ఠాణా పరిధిలోని వచ్చే ప్రాంతాల్లో అత్యధికం స్లమ్ ఏరియాలు ఉన్నాయి. వీటిలో సింగరేణి కాలనీ, కాజాబాగ్, శంకేశ్వరిబజార్, చింతల్‌ల్లోని కీలకం. ఇక్కడ నివసించే వారిలో పేదలు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉన్నారు. ఇదే ఈ ఠాణాకు మిస్సింగ్‌ల సమస్య తెచ్చి పెట్టింది. కొందరు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం, కుటుంబ కలహాల కారణంగానూ ఇల్లు వదులుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుల ఆ«ధారంగా మిస్సింగ్ కేసులు నమోదు చేసుకుంటున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇవీ గణాంకాలు... సైదాబాద్ పోలీస్‌స్టేషన్ జనవరి 1 నుంచి జూన్ 30 వరకు మొత్తం 44 మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఇందులో మైనర్ అమ్మాయిలకు సంబంధించినవి 9 కాగా... 8 కొలిక్కి వచ్చాయి. వీటిలో ఆరు కేసుల్లో మైనర్లను మేజర్లు వివాహం చేసుకున్నట్లు తేలడంతో పోక్సో చట్టం కింద కేసులు మార్చారు. 18–85 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు తప్పిపోయిన కేసులు 23 నమోదయ్యాయి. వీటిలో 19 కొలిక్కిరాగా.. నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మహిళల్లో 80 ఏళ్ళు పైబడిన ఇద్దరు వృద్ధాశ్రమం నుంచి వెళ్లిపోయారు. పది మంది మేజర్లు ప్రేమ వివాహాలు చేసుకుని తిరిగి వచ్చారు. 18 ఏళ్ళు పైబడిన పురుషులు 12 మంది మిస్సింగ్‌పై కేసులు నమోదయ్యాయి. వీటిలో 11 ట్రేస్ కాగా.. ఒకటి పెండింగ్‌లో ఉంది. ఇతను మానసిక రోగి అందుకే ఆచూకీ దొరకడంలేదు. ప్రతి ఫిర్యాదు కేసుగా నమోదు మిస్సింగ్‌కు సంబంధించి వచ్చినన ప్రతి ఫిర్యాదునూ కేసుగా నమోదు చేస్తున్నాం. వారి ఆచూకీ కోసం అధికారిక సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నాం. స్లమ్స్‌లో మిస్సింగ్స్ ఎక్కువగా జరగడానికి కారణాలు విశ్లేషించాం. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి, వారిలో అవగాహనకు కృషి చేస్తున్నాం. – కస్తూరి శ్రీనివాస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సైదాబాద్ -
హైదరాబాద్: ఇద్దరు యువతుల అదృశ్యం కలకలం
మల్కాజిగిరి: విద్యార్థిని అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌పేట్‌కు చెందిన అశోక్ కూతురు అశ్విని(19) డిగ్రీ చదువుతోంది. కొన్ని రోజులుగా సెల్‌ఫోనులో ఎక్కువగా మాట్లాడుతుండడంతో తల్లి బాలామణి గమనిస్తుంది. ఈ నెల 4వ తేదీ ముగ్గురు గుర్తు తెలియని మహిళలు వాళ్ల ఇంటికి వచ్చి ఓ యువకుడితో అశ్విని వివాహం గురించి అడగడంతో బాలామణి తిరస్కరించి కూతురిని మందలించింది. అదే రోజూ సూపర్ బజార్‌కు వెళ్లిన అశ్విని ఇంటికి తిరిగి రాలేదు. ఈ ఘటన పై ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం కుత్బుల్లాపూర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ పరిధి శ్రీకృష్ణనగర్‌కు చెందిన శ్రీనుబాషా కుమార్తె రిషిదా(21) విద్యార్థిని. ఈ నెల 5వ తేదీ ఉదయం 8.30 గంటలకు రిషిదా ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లింది. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యువతి స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఏటీఎంలో చోరీ.. గంటలోనే దొంగ పట్టివేత! -
ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం
సాక్షి, విశాఖపట్నం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం కావడం మంగళవారం నగరంలో కలకలం రేపింది. పైగా తాము చనిపోతామని, తమను వెతకొద్దంటూ తల్లికి మెసేజ్ పంపించడం ఆ కుటుంబాన్ని మరింత ఆందోళనలోకి నెట్టింది. ద్వారకానగర్ బుదిల్‌పార్క్ సమీపంలో నివసిస్తున్న మింది అనురాధ (22), తులసీ(20), కోమలి(17) అక్కాచెల్లెళ్లు. వీరిలో తులసీ, కోమలి విశాఖలోని ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. వీరంతా సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లారు. అదే సమయంలో తల్లి లక్ష్మి మొబైల్‌కు మెసేజ్ పంపారు. దీంతో తల్లిదండ్రులు అప్రమత్తమై ద్వారకా జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి అదృశ్యం కావడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అంతలోనే మంగళవారం మళ్లీ తల్లి మొబైల్‌కి తాము చెన్నైలో క్షేమంగా ఉన్నామని మెసేజ్ పెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు వారెందుకు అలా మెసేజ్ పెట్టారు.. చెన్నై ఎందుకు వెళ్లారో వివరాలు తెలియరాలేదు. పోలీసులు ఆ వివరాలకోసం దర్యాప్తు చేస్తున్నారు. -
నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. గుజరాత్లో కొంతమంది పిల్లలను అక్రమంగా నిర్బంధించారని కూడా నిత్యానందపై ఆరోపణలు ఉండటం తెలిసిందే. బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తే ఇంటర్‌పోల్ సభ్య దేశాలు ఆ వ్యక్తి ఆచూకీ, జరిగిన నేరానికి నిందితుడికి మధ్య ఉన్న సంబంధాలపై అదనపు సమాచారం సేకరిస్తాయి. నిత్యానంద ఆనుపానులు తెలుసుకోవాలన్న గుజరాత్ పోలీసుల అభ్యర్థనకు స్పందించిన సీబీఐ ఆ మేరకు ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తిని పంపిందని అహ్మదాబాద్ డీఎస్పీ కె.టి.కమారియా తెలిపారు. నిత్యానందను అరెస్ట్ చేసేందుకు అవసరమైన రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయించేందుకు ప్రయత్ని స్తున్నట్లు ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌లోని నిత్యా నంద ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఓ వైపు వెదుకుతుండగానే.. నిత్యానంద ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో కైలాస అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు డిసెంబర్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
తప్పిపోయిన బాలికలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
సాక్షి, పశ్చిమ గోదావరి : పాఠశాల నుండి అదృశ్యమైన మైనర్ బాలికలను పోలీసులు పట్టుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. చింతలపూడి మండలంలోని రాఘవపురం గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు బుధవారం అదృశ్యమయ్యారు. ఆందోళన చెందిన బాలికల తల్లిదండ్రులు చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లల ఆచూకీ కోసం పోలీసులు వారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్లు వారిని గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, పిల్లలను తీసుకొచ్చి జంగారెడ్డి గూడెం డీఎస్పీ స్నేహిత సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
మహిళలపై నేరాలను అరికట్టండి: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు, హత్య లు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని, వెంటనే వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతి పత్రం సమర్పించింది. తెలంగాణలో 2015 నుంచి 2017 వరకు 1,024 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, ఇందులో చాలామంది అమ్మాయిలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని, మరికొందరిని హత్య చేస్తున్నారని గవర్నర్‌కు ఈ బృందం వివరించింది. హాజీపూర్ గ్రామంలో బాలికల వరుస హత్యల ఘటనలో ఆ గ్రామం నుంచి భువనగిరికి, భువనగిరి నుంచి హైదరా బాద్‌కు ప్రజారవాణా సౌకర్యం లేకపోవడంతో మర్రి శ్రీనివాస్‌రెడ్డి బాలికలకు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తెలిపింది. గవర్నర్‌ను కలసిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్, బీజేపీ మహిళా అధ్యక్షురాలు విజయ, మాధవి తదితరులు ఉన్నారు. -
ఏమైపోయారో?
ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగిరావడం లేదు. నెలలు..సంవత్సరాలైన వారి జాడ తెలియడం లేదు. అసలు బతికున్నాడో..మరే ప్రమాదంలో చిక్కుకున్నాడో అంతుపట్టడం లేదు. ఇలా అదృశ్యమైన వ్యక్తుల్లో అధికంగా మహిళలే ఉంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. ఏళ్ల తరబడి వీరి జాడ తెలియక అయిన వా రు మానసిక వేదనకు గురవుతున్నారు. మంచిర్యాలక్రైం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తప్పిపోయిన వారిలో కొంతమంది ఆచూకీ దొరుకుతుండగా.. మరికొంత మంది ఏమైపోతున్నారో తెలియడం లేదు. 2016 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,502 మంది తప్పిపోగా ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,502 మంది అదృశ్యం కాగా 1,379 మంది దొరికారు. ఇంకా 123 మంది ఆచూకీ లభించక ఆ కుటుంబాలు తీరని క్షోభను అనుభవిస్తున్నాయి. అదృశ్యమైన వారిలో చిన్నారుల నుంచి యువత వరకు ఉన్నారు. ఇందులో 18 ఏళ్లలోపు బాలబాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధిక శాతం మహిళా మిస్సింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కారణమేదైనా జిల్లాలో మిస్సింగ్ కేసులు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. ఇటీవల భద్రాద్రి జిల్లాలోని హాజీపూర్ ఘటనతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. వివాహం చేసుకుంటున్నారు.. యువతుల మిస్సింగ్ కేసుల్లో చాలా మట్టుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నవే అధికంగా ఉంటున్నాయి. సాధారణంగా యువతులు ఆదృశ్యమైనప్పుడు వారి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెడుతుంటారు. ఇలాంటి చాలా కేసుల్లో యువత కొన్ని నెలల తర్వాత ప్రేమ వివాహం చేసుకొని జంటలుగా తిరిగివస్తున్నారు. యువతి మైనర్ తీరిన పక్షంలో ఆమె వాంగ్మూలం తీసుకొని ఆ కేసులను కొట్టివేస్తారు. కాగా మరికొంత మంది యువతుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. వీరు కూడా ఏదైనా ప్రేమ వివాహం చేసుకున్నారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మూడున్నర ఏళ్లలో మహిళల మిస్సింగ్ కేసులే అధికంగా నమోదవుతున్నాయి. మొత్తం 1,502 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఇందులో సుమారు 600లకుపైగా మహిళలు అదృశ్యమయ్యారు. కొందరుల ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని తిరిగి వచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఇలా ఇందులో 500మంది ఆచూకీ లభించింది. ఇంకా 100 మంది మహిళల ఆదృశ్యం మిస్టరిగానే మిగిలిపోయింది. ఏదేమైనా చేతికందిన పిల్లలు కనిపించకుండా పోతున్నారనే బాధ తల్లిదండ్రులను వేధిస్తోంది. ఒక వేళా అదృశ్యమై పెళ్లిళ్లు చేసుకున్నా ఇంటికి రాకుండా బయటనే ఉండే పిల్లల గురించి తెలియక తల్లితండ్రులు.. వారు ఏమయ్యారనే ఆవేదనకు గురవుతున్నారు. పిల్లల అక్రమ రవాణా.. ఉమ్మడి జిల్లాలో అదృశ్యమైన కేసులను బట్టి చూస్తే మనుషుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుసుస్తోంది. అదృశ్యమైన 18 ఏళ్లలోపు పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో చిన్న పిల్లలను అపహరించడమే లక్ష్యంగా కొన్ని ముఠాలు ఇటీవల తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పసి పిల్లలకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి ముంబై, నాగ్‌పూర్, హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. బాలబాలికల్లో కొంతమంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంతోనే ఇంటిని విడిచి వెళ్లిపోగా.. మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి కార్మిక పనులు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్, ఉట్నూర్, కెరమెరి, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్ వంటి పట్టణాల నుంచి మనుషుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. అదృశ్యమైన మహిళలను రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి కొంత మందిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ తిరిగి వదిలేయడం, మరికొంత మందిని వ్యభిచార గృహాలకు తరలించడం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అమాయక మహిళలకు డబ్బు ఏరగా వేసి ఇలాంటి పడుపు రొంపిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కింద నమోదు చేసిన చాలా కేసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. చిన్నపిల్లలు అదృశ్యమై ఎంత వెతికినా దొరకని కేసులపై సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మచ్చుకు కొన్ని సంఘటనలు æ మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన ఓ బాలిక( 18) తమకు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉచుకొని దగ్గరి బందువైన ఓ యువకునికి తెలిసిన వారి ఇంట్లో పని చేసేందుకని 2014 డిసెంబర్ 21న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సదరు యువతి, యువకుడు కనిపించకుండా పోయారు. కొంత కాలం వేతికి ఎక్కడ ఆచుకి లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. æ 2018 అక్టోబర్ 14న మంచిర్యాల గోదావరిలో రైల్వే బ్రిడ్జి కింద గుర్తుతెలియని కుళ్లిపోయిన మృతదేహం లభించింది. తలకు తీవ్రమైన గాయం ఉండడంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 6 నెలలు అవుతున్న మృతి చెందిన వ్యక్తి ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఎవరు హత్య చేసి ఉంటారు అనేది ఇంక మిస్టరీగానే మిగిలిపోయింది. మిస్సింగ్ కేసులపైదృష్టి సారిస్తాం జిల్లాలో మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. మంచిర్యాల జిల్లాలోని పోలీస్ అధికారులతో సమావేశమై ఈ కేసులపై చర్చిస్తాం. ఇప్పటికే సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అన్ని కేసుల్లో దృష్టి సారిస్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో పురోగతి సాధించేందుకు, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోనూ, జిల్లాలోని పోలీస్స్టేషన్లలో సమాచారం అందించి చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లాలో మహిళల అక్రమ రవాణా ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీçసులకు సమాచారం అందించాలి. 100 కాల్ చేస్తే పోలీసులు క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకుంటారు. – రక్షిత కే మూర్తి, డీసీపీ, మంచిర్యాల -
కుదిరితే తిరుపతి.. లేకుంటే బాసర
శంకరపట్నం(మానకొండూర్): ‘ఆరో తరగతినుంచి కలిసి చదువుకున్నాం. కొద్దిరోజులైతే పదోతరగతి పరీక్షలు ముగుస్తాయి. ఎవరి ఇంటికి వాళ్లం వెళ్తాం. తరువాత కలుసుకోవడం కుదరదని రహస్యంగా టూర్‌కు ప్లాన్ చేసుకున్నాం. మొదట తిరుపతి వెళ్దామనుకున్నాం.. సమయం అనుకూలించక బాసర వెళ్లివద్దామని హాస్టల్లోంచి వెళ్లాం’ అని శుక్రవారం అర్ధరాత్రి కేశవపట్నం కస్తూరిబా పాఠశాల నుంచి అదృశ్యమైన పదోతరగతి విద్యార్థులు దుర్గం ఐశ్వర్య, కొంకటి రేణుక, బెజ్జంకి భవాని,మాతంగి తేజశ్రీ, మంద రేవణ్య ఆదివారం సీఐ రవికుమార్‌కు వివరాలు వెల్లడించారు. మూడురోజులు మందుగానే ప్లాన్.. కేశవపట్నం కస్తూరిబా పాఠశాలలో దుర్గం ఐశ్వర్య, కొంకటి రేణుక, బెజ్జంకి భవాని, మాతంగి తేజశ్రీ, మంద రేవణ్య పదో తరగతి చదువుతున్నారు. వీరు ఆరో తరగతి నుంచి మంచి స్నేహితులు. మార్చి 16నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. పరీక్షలు ముగిస్తే ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతామని, ఇంతలో తిరుపతి వెళ్లొద్దామని మూడురోజుల ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. ఈ నెల 22న సాయంత్రం 7గంటలకు బయటకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. హాస్టల్ భవనం ఎక్కి చుట్టుపక్కల పరిశీలించారు. రాత్రి 11.30కి నైట్‌డ్యూటీ టీచర్, వాచ్మెన్, విద్యార్థులు నిద్రపోయాక భవనంపైకి ఎక్కారు. నిచ్చెనసాయంతో ప్రహరీదూకిన ఐదుగురు విద్యార్థినులు కేశవపట్నంలోని మేయిన్ రోడ్డుకు చేరుకున్నారు. లారీలో జగిత్యాలకు.. అక్కడ ఓ బేకరీ యజమాని సెల్ తీసుకుని రేవణ్య తన బంధువైన కరీంపేటకు చెందిన అనిల్‌కు ఫోన్‌చేసి రమ్మంది. బైక్‌పై అక్కడికి చేరుకున్న అనిల్‌ను ఎలాగైనా హుజూరాబాద్‌లో విడిపెట్టాలని వారు కోరారు. దీంతో భయపడిన అనిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విద్యార్థినులు కాలినడకన వంకాయగూడెం వరకు నడిచి వెళ్లారు. ఓ లారీని ఆపి అందులో జగిత్యాలకు చేరుకున్నారు. జగిత్యాల బస్టాండ్‌లో నిజామాబాద్ బస్సుఎక్కి శనివారం వేకువజామున నిజామాబాద్‌లో దిగారు. బాసర వెళ్దామని.. అందరిదగ్గర కలిపి వీడ్కోలు పార్టీకి దాచుకున్న రూ.1000తో బాసర వెళ్లొద్దామని నిశ్చయించుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన విద్యార్థులను అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గమనించింది. విషయాన్ని నిజామాబాద్ పోలీసులకు తెలిపింది. వారు అక్కడికి చేరుకుని విద్యార్థినులను సఖీ కేంద్రానికి తరలించారు. అక్కడ పూర్తి వివరాలు తెలుసుకుని, శంకరపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం వేకువజామున నిజామాబాద్ చేరుకున్న ఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్ రమేశ్, మహిళాహోంగార్డు రజిత అక్కడి సఖీ కేంద్రం నుంచి ఐదుగురు విద్యార్థినులను కేశవపట్నం తీసుకొచ్చారు. స్థానిక కస్తూరిబా పాఠశాలలో హుజూరాబాద్ రూరల్ సీఐ రవికుమార్ విద్యార్థినులను విడివిడిగా విచారించారు. వీరిలో కొంకటి రేణుక, బెజ్జంకి భవాని, మంద రేవణ్యకు తండ్రులు లేరు. వీరి కుటుంబ సభ్యులను పిలిపించి ఆదివారం కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పరీక్షల సమయంలో ఇబ్బంది పెట్టొద్దని తల్లిదండ్రులకు ఎస్సై సత్యనారాయణ సూచించారు. -
ఆ.. ఇద్దరు ఏమయ్యారు..?
ఇద్దరివీ వేర్వేరు ప్రాంతాలు.. హాస్టల్ గదిలో ఉంటూ చదువుకుంటున్న సందర్భంలో స్నేహం చిగురించింది.. చదువు(క్లాస్)లో హెచ్చుతగ్గులున్నా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య బంధం గట్టిపడింది. కాలక్రమంలో ఉన్నత చదువు నిమిత్తం దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే తట్టుకోలేకపోయారు.. అయినా ఫోన్లో నిత్యం మాట్లాడుకుంటూ ఉపశమనం పొందేవారు. విధి వక్రించడంతో ఓ విద్యార్థినికి అనుకోని ప్రమాదం ఏర్పడితే తట్టుకోలేకపోయింది. ఇక కలిసి ఉండలేమనుకున్నారో.. ఒక్కటిగా చనిపోవాలని నిర్ణయించుకున్నారో.. తెలియదు కానీ.. ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. నల్లగొండలోని పానగల్ చెరువుకట్ట సమీపంలో ఆ ఇద్దరి విద్యార్థినుల వస్తువులు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు చెరువులో గాలించినా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆ.. ఇద్దరు ఏమయ్యారన్నది మిస్టరీగా మారింది. పోలీసులు, విద్యార్థినుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ క్రైం : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన తెగుళ్ల వెంకటేశం రెండో కుమార్తె ప్రస్తుతం శ్రావణి(17) హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి కాలనీలో కృష్ణవేణి ఉమెన్స్ జూనియర్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్(పాత మహబూబ్‌నగర్ జిల్లా)కు చెందిన చికెన్, రియల్ ఎస్టే ట్, ఆర్ఎంపీ వైద్య వృత్తి చేస్తున్న ఎంఏ. ఖలీల్ ప్రథమ కుమార్తె హబీబ్ ఉన్నీసా అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో ఇద్దరూ కలిసి ఒకే రూంలో ఉండే వారు. ఒకే కళా శాల కావడం, జూనియర్ శ్రావణి, ఉన్నీసా రూం మెట్స్ కావడంతో ఇద్దరి మధ్య విడదీయలేని స్నేహబంధం ఏర్పడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక గంటల కొద్దీ ఫోన్ సంభాషణ ఉండేది. ఇద్దరి తల్లిదండ్రులు ఫోన్లు ఎక్కువగా మాట్లాడుకోవద్దని, బాగా చదువుకోవాలని నచ్చజెప్పారు. ప్రస్తుతం ఉన్నీసా నల్లగొండలోని వెంకటేశ్వర కళాశాలలో టీటీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. దీంతో ఇద్దరి మధ్య నేరుగా కలుసుకోవడానికి గ్యాప్ ఏర్పడడంతో ఉండలేకపోయారు. నాలుగు నెలల క్రితం ఉన్నీసా కళాశాలకు వెళ్తుండడంతో జారి పడడంతో రక్తనాళాల్లో మెదడు గడ్డకట్టింది. దీంతో మరింత ఆందోళనకు లోనైంది. అసలేంజరిగిందంటే.... పది రోజుల క్రితం కళాశాల నుంచి చౌటుప్పల్ వచ్చిన శ్రావణి శుక్రవారం కళాశాలలో ల్యాబ్ ఉందని, నెట్ సెంటర్ వద్దకు తీసుకెళ్లాలని తండ్రి వెంకటేశాన్ని కోరడంతో నెట్ సెంటర్ వద్ద శ్రావణిని వదిలి వెళ్లాడు. కొద్దిసేపు నెట్ సెంటర్లో ఉన్న శ్రావణి చౌటుప్పల్ బస్టాండ్‌లో బస్ ఎక్కి నల్లగొండకు వచ్చి, చిన్న వెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్ సమీపంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఉన్నీసా వద్దకు చేరుకుంది. శ్రావణి నల్లగొండకు వచ్చే ముందు ఇంట్లో సూసైడ్ నోట్ రాసిపెట్టింది. ఉన్నీసా లేని జీవితం గడపలేనని అనారోగ్యంగా ఉంటుందని, చదవలేకపోతున్నానంటూ సూసైడ్ నోట్లో రాసి ఉంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్లిన శ్రావణి తండ్రి వెంకటేశం సూసైడ్ నోట్‌ను చూసి చౌటుప్పల్ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించి బస్టాండ్‌లోకి వెళ్తున్న విషయాన్ని గుర్తించి తెలిపారు. వెంటనే శ్రావణితండ్రి వెంకటేశం ఉన్నీసా తండ్రి ఖలీల్‌కు ఫోన్ చేసి సూసైడ్ నోట్ విషయాన్ని తెలిపాడు. ఉన్నీసా ఉంటున్న హాస్టల్వద్దకు వెళ్లి శ్రావణి వచ్చిందేమో తెలుసుకోమని మీర్బా కాలనీలో ఉంటున్న ఉన్నీసా బంధువులకు ఫోన్ చేసి చెప్పడంతో హస్టల్‌కు వెళ్లి వాకబు చేయగా 12.30 గంటల సమయంలో ఇద్దరూ కలిసి బ్యాగ్ తీసుకొని వెళ్లినట్లు హాస్టల్ వద్ద ఉన్న వారు తెలపడంతో ఖలీల్‌కు విషయం చెప్పారు. ఇద్దరూ కలిసి వెళ్లినట్లు ఖలీల్ శ్రావణి తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో పాటు ఉన్నీసా ఆచూకీని కనుక్కోవాలని నల్లగొండలోని బంధువులకు ఫోన్లో సమాచారం ఇచ్చి నల్లగొండకు చేరుకున్నాడు. రెండు కుటుంబాల వారు నల్లగొండకు వచ్చేలోపే పానగల్ ఉదయ సముద్రం చెరువుకట్ట లోపల బ్యాగ్, ఇద్దరికీ సంబంధించిన చెప్పులు, చున్నీలు ఉండడంతో పాటు ఉన్నీసా కళాశాల ఐడీ కార్డు లభించింది. కీచైన్‌పై ఇద్దరి పేర్లు రాసి ఉండడం వారి ఇద్దరి మధ్య బలమైన స్నేహ సంబం«ధం ఉందని భావిస్తున్నారు. గాలించిన పోలీసులు... నీటి విడుదల చెరువు కట్ట లోపల సూసైడ్ నోట్, ఇద్దరి విద్యార్థుల చెప్పులు, దుస్తులు లభించడంతో పోలీసులు చెరువు లోపల ఈతగాళ్లతో గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. తూము సమీపంలోనే నీటిలోకి దూకి ఉంటారని భావించిన పోలీ సులు తూము మధ్యలో చిక్కుకొని ఉంటారని, నీటిని విడుదల చేసినప్పటికీ ప్రయోజనం లేదు. చీకటి పడే వరకు పోలీసులు చేపట్టిన చర్యలేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఉన్నీసా వినియోగిస్తున్న ఫోన్ కాల్ డేటాను ఆధారంగా మరో కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇద్దరి మధ్య స్నేహం, విడిగా ఉండలేక అనారోగ్యం.. కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డీఎస్పీ గంగారాం, సీఐ భాషా, ఎస్సై నర్సింహులు ఘటన స్థలంలో విద్యార్థినుల ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శుక్రవారం ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను రప్పిస్తామని పోలీసులు తెలిపారు. ఉన్నీసా సూసైడ్ నోట్లో ఇది.... ఉన్నీసా మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిం ది. చిన్న ప్రమాదం జరిగిందని, తలలో బ్లడ్ క్లాట్ అయిందని, అందుకు రూ.20లక్షల వైద్య ఖర్చు అవుతుందని, నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి లేకుండా ఉండలేకపోతున్నానని, సంతోషంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, నా గురించి దిగులు చెందవద్దని, సూసైడ్ నోట్లో పేర్కొం ది. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లు రాసి సంతోషంగా ఉండాలని కోరింది. ఇదే చివరి రోజు.... తన జీవితానికి ఇదే చివరి రోజు అని, ఉన్నీసాతో మాట్లాడడాన్ని కుటుంబ సభ్యులు అనుమానించారని, తల్లి కన్నీరు పెట్టిందని, కులం భావన ఉండకూడదని, నా మృతదేహం దొరకకుండా చనిపోయే విధంగా ఆత్మహత్యకు ప్లాన్ చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. కాలేజీ లోనే చనిపోవాలని భావించినప్పటికీ కుటుంబ సభ్యులందరినీ ఒకసారి చూడాలని ఉందని అందుకే ఈ రోజు చనిపోతున్నట్లు పేర్కొంది. ఆరోగ్యం కూడా బాగుండడం లేదని, కుటుంబానికి తలవంపులు తెచ్చే పని తాను చెయ్యనప్పటికీ ఉన్నీసాతో మాట్లాడే ఫోన్‌ను అనుమానించారని, అందరూ సంతోషంగా ఉండండి అంటూ మూడు పేజీల సూసైడ్ నోట్లో పేర్కొంది. -
ఇద్దరు బాలికల అదృశ్యం
బంజారాహిల్స్: ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన ఇష్రత్ బీ, సమీనాబేగం స్థానిక ప్రభుత్వ ఉర్ధూ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. గత నెల 29న ఇష్రత్ బీని ఆమె తల్లి ఇంటి పనుల్లో నిర్లక్ష్యం చేస్తుందని చేయిచేసుకుంది. అనంతరం ఆమె బయటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇష్రత్ బీ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించగా తన సోదరి కూతురు సమీనా బేగంతో కలిసి బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్లడం చూసినట్లు అక్కడే ఉన్న అర్బాజ్ తెలిపాడు. దీంతో ఆమె పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు ఇద్దరూ ముంబయికి చేరుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందడంతో అక్కడికి వెళ్లేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. -
పడగనీడలో శరణాలయాలు
దిక్కులేనివారికి నీడనిచ్చి ఆదుకుంటున్నాయని భావించే శరణాలయాలు వారి పాలిట నరక కూపా లుగా మారాయని వెలువడుతున్న కథనాలు హృదయవిదారకంగా ఉంటున్నాయి. అమ్మానాన్నలు లేనివారు, దుర్భర దారిద్య్రంతో సతమతమవుతున్నవారు, ఒంటరిగా ఉంటే సంఘవిద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉంటుందని భయపడేవారు...ఇలా అనేకమంది అభాగ్యులు ఆశ్రయం దక్కుతుందని శరణాలయాలకు వెళ్లి అక్కడున్న తోడేళ్ల బారిన పడుతున్నారని, కాళరాత్రులు చవిచూస్తున్నారని ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో వెలుగులోకొచ్చిన ముజఫర్‌పూర్ శరణాలయం దుర్మార్గాలపై దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాకుండానే ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా శరణాలయంలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని బయటికొచ్చింది. ఈ దుర్మార్గాల తీరు గమనిస్తే అసలు దేశంలో ప్రభు త్వాలున్నాయా, అవి పనిచేస్తున్నాయా అన్న సందేహం కలుగుతుంది. ముంబైలోని టాటా ఇనిస్టి ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) సంస్థ మొన్న ఫిబ్రవరిలో బిహార్ శరణాలయాలపై ఇచ్చిన సమగ్ర నివేదిక మహిళలు, బాలికలు, బాలురు అక్కడ అనునిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వారిపై అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న అఘాయిత్యాల సంగతి బయటపెట్టింది. నిజానికి ఈ మాదిరి ఆడిట్ చేయమని టిస్‌ను కోరింది బిహార్ ప్రభుత్వమే. అందుకు ఆ ప్రభుత్వాన్ని అభి నందించాల్సిందే. కానీ అనంతర చర్యల్లో మాత్రం అక్కడి ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి ఉండి పోయింది. ముజఫర్‌పూర్ శరణాలయంలో 7 నుంచి 18 ఏళ్ల వయసులోపు బాలికలపై అత్యాచారాలు జరిగాయని మార్చిలో జరిగిన దర్యాప్తు నిర్ధారించగా మే నెలలో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనగారిని పోలీసులు మరో నెల్లాళ్లకుగానీ అరెస్టు చేయలేకపోయారు. అసలు శరణాలయంలో ఉండాల్సిన 11మంది మహిళలు, నలుగురు పిల్లలు ఏమయ్యారని ఆరా తీయడానికే రెండు నెలలు పట్టింది. టిస్ నివేదిక ఈ ఒక్క శరణాలయం గురించి మాత్రమే మాట్లా డలేదు. ఆ రాష్ట్రంలోని 110 శరణాలయాల్లో కేవలం 7 మాత్రమే సంతృప్తికరంగా పనిచేస్తున్నాయని, మిగిలినవన్నీ అధ్వాన్నంగా అఘోరిస్తున్నాయని తెలిపింది. ముజఫర్‌పూర్‌లో బాలికలపై మాదక ద్రవ్యాలు ప్రయోగించటం, వారు అపస్మారక స్థితిలోకెళ్లాక అత్యాచారాలకు పాల్పడటం రివాజు అని అందులోనివారు చెబుతున్నారు. ఒక బాలిక ఈ అఘాయిత్యానికి కన్నుమూస్తే సంస్థ ఆవరణలోనే ఖననం చేశారట. ఈ స్వచ్ఛంద సంస్థలన్నిటికీ ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వ నిధులు ప్రవ హిస్తున్నాయి. వాటికి నిర్వహణా సామర్ధ్యం ఉందో లేదో... మంజూరవుతున్న నిధుల్ని ఎలా ఖర్చు చేస్తున్నాయో... ఆ శరణాలయాల్లోని అభాగ్యుల స్థితిగతులెలా ఉన్నాయో తెలుసుకోవడం తమ బాధ్యతని ఆ ప్రాంత ఎమ్మెల్యే, మంత్రులు, అధికారులు అనుకోలేదు. సాక్షాత్తూ సాంఘిక సంక్షేమ మంత్రి మంజువర్మ భర్తే ముజఫర్‌పూర్ దురాగతాలకు బాధ్యుడని భావిస్తున్న ఠాకూర్‌తో తరచు మంతనాలు సాగించేవాడని వెల్లడైంది. ఈ కథ బయటకు రావడంతో ఆమె పదవి నుంచి తప్పు కున్నారు. కానీ ఆమె భర్తకూ, ఠాకూర్‌కూ మధ్య ఉన్న లావాదేవీలు బయటపడాల్సి ఉంది. దేవరియా ఉదంతాన్ని ఓ పదేళ్ల చిన్నారి బయటపెట్టేవరకూ అక్కడి ప్రభుత్వ యంత్రాంగం నిద్రలో జోగుతోంది. ఆదివారం నిశిరాతిరి వేళ శరణాలయం నిర్వాహకురాలి కన్నుగప్పి తప్పించు కున్న బాలిక ఒంటరిగా పోలీస్‌స్టేషన్‌కొచ్చి అక్కడి ఘోరాలను పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ బాలిక రాత్రి వేళ బయటికొచ్చే సాహసం చేయలేకపోయినా... దారిలో మరో రాక్షసుడి కంటబడినా ఇదంతా ఎప్పటికీ బయటికొచ్చేది కాదు. శరణాలయంలోని పిల్లలతో బండచాకిరీ చేయించడం, యుక్త వయ సొచ్చినవారిని సాయంత్రమయ్యేసరికి కార్లలో ఎటో తరలించడం అక్కడ నిత్యకృత్యమని, సాయం కాలం వెళ్లిన యువతులు పొద్దునే వచ్చి ఏడుస్తుంటారని తెలిపింది. తనకూ, తనతోపాటున్నవారికీ శరణాలయంలో నిత్యం ఎదురవుతున్న అన్యాయాలు పోలీస్‌స్టేషన్‌కెళ్లి చెబితే విరగడవుతాయని ఆ చిన్నారికి ఎందుకనిపించిందోగానీ ఆ చర్య నాగరిక సమాజంలో మర్యాదస్తుల ముసుగేసుకున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాకాన్ని బజారుకీడ్చింది. రాత్రికి రాత్రే శరణాలయానికెళ్లిన పోలీసులకు రిజిస్టర్ ప్రకారం ఉండాల్సిన 42మంది బాలికలు, యువతుల్లో 24మంది మాత్రమే లెక్క తేలారు. మిగిలిన 18మంది గురించి అడిగితే నిర్వాహకులు నీళ్లు నమిలారు. అందులో ఒక యువతి మాత్రం ఆ మరు నాడు వృద్ధుల శరణాలయంలో పోలీసులకు తారసపడింది. మారుమూల గ్రామాల్లో చీమ చిటుక్కు మంటే వేగుల నుంచి కబురందే ప్రభుత్వాలకు దేవరియా శరణాలయంలో ఏం జరుగుతున్నదో పదేళ్ల పసిపాప వచ్చి చెప్పేవరకూ తెలియలేదు! నడిరోడ్డుపై ఉన్మాద మూకలు గోరక్షణ పేరుతోనో, మరే ఇతర సాకుతోనో అమాయకులను కొట్టి చంపుతున్నా కదలికలేని ప్రభుత్వాలు నిర్భాగ్యులు కొలువు దీరే శరణాలయాలను పట్టించుకోవాలనుకోవటం అత్యాశే కావొచ్చు. అత్యాచార ఉదంతాలు బయటికొచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు ఎక్కడలేని చురుకుదనమూ ప్రద ర్శిస్తాయి. జమ్మూ–కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడి, ఆమె ఉసురు తీశాక దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన నేరగాళ్లకు ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ కేంద్రం బిల్లు తెచ్చింది. శరణాలయాల్లో తనిఖీలు చేయాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఒక్క శరణాలయాలు మాత్రమే కాదు... ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి పైసా ఏమవుతున్నదో, రకరకాల పేర్లు చెప్పుకుని ప్రభుత్వ నిధులు తీసుకుంటున్న సంస్థల తీరుతెన్నులెలా ఉంటున్నాయో నిరంతరాయంగా తనిఖీలు జరగాలి. ఆ తనిఖీలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలి. అది ప్రభుత్వాల బాధ్యత. ఎవరో చెబితే తప్ప ఏమీ తెలుసుకోలేని అశక్తతలో ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఇలాంటి నేరాలూ, ఘోరాలు కొన సాగుతూనే ఉంటాయి. -
అమ్మా.. ఎక్కడున్నావు తల్లీ
సాక్షి, ముమ్మిడివరం : అమ్మా.. ఎక్కడున్నావు తల్లీ అని రోదిస్తూ గోదారి గట్టున తమ బిడ్డల ఆచూకి కోసం నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రుల వేదన చూపరులను కలచివేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలంలో గోదావరి నదిలో పిల్లలు గల్లంతై ఆరు రోజులు గడచినా ఇంకా ముగ్గురి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. మృతదేహాలు లభ్యమైనవారి రోదన ఒకవైపు, ఆచూకీ తెలియని విద్యార్థినుల కుటుంబ సభ్యుల వేదన మరోవైపు.. లంక గ్రామాల్లో అలముకున్న హృదయ విదారక దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద ఈ నెల 14న జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థినులు, ఒక వివాహిత గల్లంతైన విషయం తెలిసిందే. ఐదు రోజులు ముమ్మర గాలింపు చర్యల చేపట్టగా ముగ్గురు విద్యార్థినులతో పాటు ఓ వివాహిత మృత దేహం లభ్యమయ్యాయి. మరో ముగ్గురు బాలికల ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన విద్యార్థినులు కొండేపూడి రమ్య, పోలిశెట్టి అనూష, సుచిత్రల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన అనూష, సుచిత్ర ఆచూకీ తెలియక వారి తల్లిదండ్రులు పోలిశెట్టి మాచరయ్య, వీరవేణి బోరున విలపిస్తున్నారు. మాచరయ్య వీరవేణికి ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె అనూష చదువులో çమంచి మార్కులు తెచ్చుకుంటూ వ్యవసాయంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేది. రెండో కుమార్తె సుచిత్ర. మాచరయ్య మూడో కుమార్తె కనక మహాలక్ష్మి తన అక్కలకు ఏమైందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఇంట్లో గడుపుతోంది. కొండేపూడి రమేష్‌కుమార్, దుర్గలకు నలుగురు కుమార్తెలు కాగా గల్లంతైన రమ్య నాలుగో కుమార్తె. తండ్రి ఆర్కెష్ట్రాలో పని చేస్తుండటంతో రమ్య పాటలు పాడుతూ ఉండేది. అందరితో కలిసి మెలిసి ఉండే రమ్య దూరం కావడంతో ఆ కుటుంబం దుఖఃసాగరంలో మునిగిపోయింది. ఆరో రోజు కూడా ప్రత్యేక బృందాలు గోదావరి తీరంలో గాలింపు చర్యలు చేపట్టాయి. మత్య్సకారులు మర పడవలపై గాలింపు నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ రూ.3.50 లక్షల సాయం ఐ.పోలవరం: పడవ ప్రమాదంలో మృతిచెందిన, గల్లంతైన వారి కుటుంబాలకు వైఎస్సార్ సీపీ తమ వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు చొప్పున ఏడు కుటుంబాలకు రూ.3.50 లక్షలు ఆర్థికసాయం అందించింది. గురువారం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం, రామచంద్రాపురం కోఆర్డినేటర్లు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, చెల్లుబోయిన వేణు పశువుల్లంక రేవు దాటి లంక గ్రామాలైన సలాదివారిపాలెం, శేరులంకలకు వెళ్లి ఏడు కుటుంబాలకు సాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బోస్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు ఏడు కుటుంబాలకు రూ.3.50 లక్షలు అందిస్తున్నట్టు తెలిపారు. -
600 మంది అమ్మాయిలు అదృశ్యం.. కలకలం
జైపూర్: శిష్యురాలిపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక వేత్త దాతీ మహారాజ్ ఆశ్రమం నుంచి 600 మంది అమ్మాయిలు అదృశ్యం అయినట్టు ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే దాతీ మహారాజ్ రాజస్థాన్‌లోని అల్వాస్‌లో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి బాగోగులు తానే చూసుకుంటున్నానని గతంలో అనేక సార్లు చెప్పుకున్నారు. కాగా దాతీ మహరాజ్ తనపై అత్యాచారం చేశాడని 25 ఏళ్ల యువతి ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆశ్రమానికి వెళ్లారు. ఆ సమయంలో ఆశ్రమంలో కేవలం 100 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మిగతా 600 అమ్మాయిలు ఎక్కడికి వెళ్లారన్న కోణంలో విచారణ జరుపుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అలాగే ఆశ్రమం నుంచి తప్పించుకున్న దాతీ మహారాజ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. దాతీ మహారాజ్ తనను పదేళ్ల పాటు ఆశ్రమంలో నిర్భందిచాడని, ఆయనతో పాటు మరో ఇద్దరు అనుచరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ 25 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన వద్ద ఉండే ఓ మహిళా శిష్యురాలు అమ్మాయిలను బలవంతంగా ఆయన గదిలోకి పంపుతుందని వెల్లడించింది. ఈ విషయంపై ఇటీవల స్పందించిన దాతీ మహారాజ్.. ఆరోపణలు చేస్తున్న యువతి తనకు కుమార్తె వంటిదని పేర్కొన్నారు. విచారణకు కూడా సహకరిస్తాని చెప్పిన ఆయన ఆశ్రమం నుంచి పరారు కావడం గమనార్హం. -
‘మంజీరా’లో ఇద్దరమ్మాయిల గల్లంతు
చిలప్‌చెడ్: మంజీరా నదిలో ఆదివారం ఇద్దరు అమ్మాయిలు గల్లంతయ్యారు. అందరూ చూస్తుండగానే నది ఉధృత ప్రవాహంలో వారు కొట్టుకుపోయారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చి ఇలా గల్లంతవడం విషాదం మిగిల్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిట్కుల్ శివారులో చోటుచేసుకుంది. హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన సతీశ్, రంజనల కుమార్తె శ్రీవిద్య (20) ఓపెన్ డిగ్రీ చదువుతూ ప్రైవేట్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పని చేస్తోంది. అలాగే.. సత్యనారాయణ, వసంతల కుమార్తె రోహిత (16) ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. మల్కాజ్‌గిరికి చెందిన 30 మంది మహిళలతో కలసి వీరు చిట్కుల్ శివారులోని చాముండేశ్వరీ అమ్మవారి దర్శనానికి వచ్చారు. పక్కనే ప్రవహిస్తున్న మంజీరా నదిలో అందరూ స్నానాలు చేశారు. కొంత మంది అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లగా.. శ్రీవిద్య, రోహిత మళ్లీ నదిలోకి దిగారు. ఆ సమయంలో నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇద్దరు అమ్మాయిలు అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయా రు. అమ్మాయిలు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం లో గల్లంతైనా సాయంత్రం ఆరు గంటల వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపు చర్యలకు అవ కాశం లేదని చెబుతున్నారు. కాగా, సింగూరు జలా లు వదలడం.. పర్యాటక క్షేత్రమైన చాముండశ్వరీ ఆలయ పరిధిలోని మంజీరా నది వద్ద ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవడంతో అమ్మాయిల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పూర్ణిమ కేసులో మలుపు
► అదృశ్యం కాదు... కిడ్నాప్ ► కేసును మార్చిన పోలీసులు హైదరాబాద్ (జగద్గిరిగుట్ట): గత 40 రోజులుగా ఆందోళన కల్గిస్తున్న విద్యార్థిని పూర్ణిమ (15) అదృశ్యం కేసును బాచుపల్లి పోలీసులు కిడ్నాప్ కేసుగా మార్చినట్లు సీఐ బాలక్రిష్ణారెడ్డి తెలిపారు. జూన్ 7వ తేదీన నిజాంపేట్‌కు చెందిన చొల్లంగి నాగరాజు, విజయకుమారిల కుమార్తె పూర్ణిమ సాయి తమ ఇంటి పక్కనే గల ఓ ప్రైవేటు పాఠశాలకు అని వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. అదే రోజు సాయంత్రం పూర్ణిమ తల్లిదండ్రులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి తమదైన కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రోజులు గడుస్తున్నా పూర్ణిమ ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు 18 బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొంటున్నారు. అయినా చిన్న క్లూ కూడా లభించలేదు. దీంతో గురువారం పూర్ణిమ తల్లిదండ్రులు చొల్లంగి నాగరాజు, విజయకుమారిలు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసును పోలీసులు కిడ్నాప్ (ఐపీసీ 366) కేసుగా మార్చారు. దర్యాప్తును మరో కోణంలో చేపట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇద్దరిపైనే అనుమానాలు.. తమ కుమార్తె అదృశ్యానికి సంబంధించి ఆమె చదువుతున్న పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న మహిళా సంఘం నాయకురాలు రేఖ సైతం పోలీసుల దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్లోనూ సీసీ కెమెరాలు ఉండాలని, పూర్ణిమ చదువుతున్న భాష్యం స్కూల్లో ఎందుకు లేవని అచ్యుతరావు ప్రశ్నించారు. బాలిక అదృశ్యం తర్వాత యాజమాన్యం స్పందించి సీసీ కెమెరాలు అమర్చిందని, ముందే ఈ పని చేస్తే తమ కేసులో ఉపయుక్తంగా ఉండేదని పూర్ణిమ తల్లిదండ్రులు చెప్తున్నారు. బాలిక మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసుల వైఫల్యాన్ని బాలల హక్కుల సంఘం తప్పుబడుతోంది. -
పూర్ణిమా.. నీవెక్కడమ్మా..!
► అదృశ్యమై నెల దాటినా దొరకని ఆచూకీ ► కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ► 18 బృందాలతో గాలిస్తున్నామన్న పోలీసులు ► ఆధారం లభించకనే ఆలస్యం ► బాలల హక్కుల సంఘం సాయం కోరిన తల్లిదండ్రులు బాలిక అదృశ్యం.. పోలీసుల దృష్టిలో ఇదో రొటీన్ మిస్సింగ్ కేసు. తల్లిదండ్రులకు మాత్రం క్షణమొక యుగంగా గడిచే మానసిక క్షోభ. ఈ నరకయాతనను ఆ తల్లిదండ్రులు 40 రోజులుగా అనుభవిస్తున్నారు. కూకట్పల్లి నిజాంపేటకు చెందిన పదమూడేళ్ల పూర్ణిమ సాయి అదృశ్యం కథ ఇది. వేసవి సెలవుల్లో ఇంట్లో సరదాగా తిరిగిన కుమార్తె పాఠశాల పునఃప్రారంభమైన మూడోరోజే అదృశ్యమైంది. ఇన్ని రోజులవుతున్నా ఆచూకీ లభించకపోవడంతో కన్నవారు ఈ కేసు దర్యాప్తులో పోలీసుల అలసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. హిమాయత్‌నగర్: కూకట్‌పల్లికి చెందిన చొల్లంగి నాగరాజు, విజయకుమారి కుమార్తె పూర్ణిమ సాయి. గత నెల 7న యథావిధిగా స్కూల్‌కని వెళ్లింది. కొద్ది సేపటికే పాఠశాల నుంచి ‘పూర్ణిమ ఈ రోజు స్కూల్‌కి హాజరుకాలేదు’ అంటూ వచ్చిన ఫోన్ కాల్ ఆ తల్లిదండ్రులకు ముచ్చెమటలు పట్టించింది. సమీపంలోని బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీసినా పూర్ణిమ జాడ లేకపోవడంతో బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 40 రోజులవుతున్నా ఈ అదృశ్యం కేసులో పురోగతి లేదని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురువారం వారు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడు చెప్పుకున్నారు. ‘పూర్ణిమా.. ఎక్కడున్నావ్ తల్లీ.. ఇంటికి రా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సీసీటీవీ పుటేజీలు పరిశీలించలేదు.. పూర్ణిమ సాయి స్థానికంగా ఉన్న భాష్యం స్కూల్లో పదో తరగతి విద్యార్థిని. ఈ స్కూల్ నిజాంపేట మెయిన్ రోడ్డులో ఉంది. ఇదే రహదారిలో భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లు, సూపర్ మార్కెట్స్‌తో పాటు విద్యా సంస్థలు ఉన్నాయి. వీటన్నింటికీ సీసీ కెమెరాలు ఉంటాయని, రహదారిలోనూ ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమార్తె అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసులు వీటిని పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. కేవలం స్కూలు సమీపంలో ఉన్న ఓ ఫర్నిచర్ షాప్ సీసీ పుటేజీలను మాత్రమే పరిశీలించారన్నారు. ఇందులో పూర్ణిమ స్కూల్ గేటు వరకు వెళ్లినట్లు స్పష్టంగా కనిపించిందని, దర్యాప్తు అక్కడితో ఆగిపోయిందని వాపోతున్నారు. పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన కెమెరాలను ఎందుకు పరిశీలించడం లేదని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరిపై అనుమానాలు.. తమ కుమార్తె అదృశ్యానికి సంబంధించి ఆమె చదువుతున్న పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న మహిళా సంఘం నాయకురాలు రేఖ సైతం పోలీసుల దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్లోనూ సీసీ కెమెరాలు ఉండాలని, పూర్ణిమ చదువుతున్న భాష్యం స్కూల్లో ఎందుకు లేవని అచ్యుతరావు ప్రశ్నించారు. బాలిక అదృశ్యం తర్వాత యాజమాన్యం స్పందించి సీసీ కెమెరాలు అమర్చిందని, ముందే ఈ పని చేస్తే తమ కేసులో ఉపయుక్తంగా ఉండేదని పూర్ణిమ తల్లిదండ్రులు చెప్తున్నారు. బాలిక మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసుల వైఫల్యాన్ని బాలల హక్కుల సంఘం తప్పుబడుతోంది. పోలీసులు చెబుతున్నది ఇదీ.. జూన్ 7న స్కూల్‌కు బయలుదేరిన పూర్ణిమ తరగతులకు హాజరుకాలేదని ఆ రోజు ఉదయం తల్లికి స్కూల్ నుంచి ఫోన్‌కాల్ వెళ్లింది. ఆ సమయంలో ఆమె రిసీవ్ చేసుకోలేదు. తిరిగి ఫోన్ చేయలేదు. మధ్యాహ్నం 1.30 తర్వాత స్కూల్ నుంచి ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి యజమాన్యాన్ని సంప్రదించారు. రాలేదని వారు సమాధానం చెప్పడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం కనిపించకపోవడంతో అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన సీఐ బాలకృష్ణారెడ్డి కేసు తీవ్రతను పైస్థాయి అధికారులకు తెలిపారు. దీంతో మొత్తం 18 బృందాలను ఏర్పాటు చేశారు. సిటీలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయినా ఎక్కడ ఫలితం కనిపించలేదు. వైజాగ్, యానాం, షిర్డీ, చెన్నై, తిరుపతిలోను ప్రత్యేక బృందాలతో వెతికించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని డీజీపీలు, జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహరాష్ట్ర డీజీపీలకు కూడా ఆ అమ్మాయి ఫొటోలను పంపించి కనబడితే సమాచారం అందించాలని కోరారు. బెంగళూరు, చెన్నై, థానే, ముంబై పోలీసు కమిషనర్లకు కూడా పూర్ణిమ ఫొటోలు పంపించారు. దాదాపు అన్ని కేసుల్లో మిస్సింగ్ కేసుల్లో 90 శాతం స్పష్టత కనిపించినా ఈ కేసులో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. -
అనాధాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
విజయవాడ: అనాధాశ్రమంలో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన నగరంలోన కలకలం సృష్టిస్తోంది. స్థానిక గురునానక్ కాలనీలోని పవిత్రాత్మానికేతన్ అనాధాశ్రమంలో ఉంటున్న రోహిణి(13), మరియమ్మ(11) అనే ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారంటూ ఆశ్రమ నిర్వాహకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పటమట పోలీసులు బాలికల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
మిస్టరీగా బాలికల ‘మిస్సింగ్’
హైదరాబాద్ (జగద్గిరిగుట్ట): మైనర్ బాలికల వరుస మిస్సింగ్ కేసులు బాచుపల్లి పోలీసులకు సవాలుగా మారాయి. ఓ కేసు దర్యాప్తులో మునిగి ఉండగానే మరో మిస్సింగ్ కేసు నమోదవుతోంది. ఈ నెల 7న నిజాంపేటకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి పాఠశాలకు వెళ్లింది. అప్పటినుంచీ ఆచూకీ లభించలేదు కదా కనీసం చిన్న క్లూ కూడా దొరకక పోవడం పోలీస్ వర్గాలతో పాటు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. పోలీసులు 14 బృందాలుగా ఏర్పడి ఇటు సైబరాబాద్.. అటు రాచకొండ కమిషనరేట్ల పరి«ధిలో విస్తృతంగా గాలిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంలోని సీసీ ఫూటేజీలకు పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల సైబరాబాద్ క్రైమ్ డీసీపీ జానకి షర్మిల నిజాంపేటలోని పూర్ణిమ సాయి ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. వైజాగ్, యానం ప్రాంతాలకు పూర్ణిమ వెళ్లి ఉండవచ్చనే అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన నేపధ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో ఘటనలో నిజాంపేట కేటీఆర్ కాలనీకి చెందిన ప్రసాద్ కుమార్తె దుర్గాదేవి (14) ఈ నెల 11న కిరాణా దుకాణానికి వెళ్లి అదృశ్యమైంది. ఇప్పటి వరకు ఆ బాలిక కూడా తిరిగి రాలేదు. ఇంకా నిజాంపేటలోని బండారు లేఅవుట్లో నివాసముండే శ్యాంసుందర్‌రెడ్డి కుమార్తె యామిని(16) ఈ నెల 11న బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైంది. యామిని ఖమ్మంలోని తన స్వగ్రామం వెళ్లినట్లు తెలిసింది. పూర్ణిమ, దుర్గాదేవిల మిస్సింగ్‌లు మిస్టరీగానే మారాయి. -
ఏ హాని తలపెట్టొద్దు: పూర్ణిమ తల్లి
హైదరాబాద్: నగర శివారులోని బాచుపల్లి పీఎస్ పరిధిలో బాలికల అదృశ్యంపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటివరకూ ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం కాగా ఒకరి జాడ గుర్తించగా, మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే అయిదు రోజుల కిందట అదృశ్యమైన 10 వతరగతి విద్యార్థిని పూర్ణిమ జాడ లభ్యం కాకపోవడంతో విద్యార్థిని తల్లి విజయ కన్నీటి పర్యంతమయ్యారు. ఐదు రోజుల కిందట పూర్ణిమ అదృశ్యం కాగా, సోమవారం దుర్గాదేవి, యామిని అనే బాలికలు కనిపించకుండాపోయారు. కాగా, విచారణ వేగమంతం చేసిన పోలీసులు యామిని ఆచూకీ కనిపెట్టారు. ఆ విద్యార్థిని బంధువుల ఇంట్లో ఉందని గుర్తించి ఆమె తల్లిదండ్రులకు ఊరట కలిగించారు. పూర్ణిమ తల్లి విజయ మీడియాతో మాట్లాడుతూ.. మా కూతురు పూర్ణిమ బయటకు వెళ్లింది.. కానీ ఇంటికి తిరిగిరాలేదని బాలిక తల్లి వ్యక్తం చేశారు. ఎవరితోనూ గొడవపడలేదని, స్కూల్లోనూ అందరితోనూ కలిసి పోయేదని చెప్పారు. పెద్దవాళ్లమైనా మాతో ఏదైనా గొడవ ఉంటే మాతోనే చూసుకోవాలని.. తమ కూతురికి ఎలాంటి హాని తలపెట్టొద్దని విజయ వేడుకున్నారు. ఎవరు కిడ్నాప్ చేశారో.. ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియడం లేదన్నారు. తమ కూతురి ఆచూకీ తెలిసిన వారు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. సంబంధిత వార్తలు హైదరాబాద్‌లో బాలికల అదృశ్యం కలకలం -
హైదరాబాద్‌లో మరో ఇద్దరు బాలికల అదృశ్యం
హైదరాబాద్: నగర శివారులోని బాచుపల్లి పీఎస్ పరిధిలో బాలికల అదృశ్యం మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకూ ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం కాగా ఒకరి జాడ గుర్తించగా, మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే అయిదు రోజుల కిందట అదృశ్యమైన 10 వతరగతి విద్యార్థిని పూర్ణిమ ఆచూకీని లభ్యం కాకపోవడంతో పోలీసులు కేసు విచారణ వేగమంతం చేశారు. అయిదు రోజులైనా పూర్ణిమ వివరాలు తెలియకపోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంతలోనే నిన్న(సోమవారం) మరో ఇద్దరు అమ్మాయిలు దుర్గాదేవి, యామిని కనిపించకుండా పోయారు. నిజాంపేట్ కు చెందిన దుర్గాదేవి (14) సోమవారం సాయంత్రం సరుకులు తెచ్చేందుకు కిరాణాషాప్ నకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. యామిని ఆచూకీ లభ్యం నిజాంపేట్‌కు చెందిన యామిని 10 వతరగతి పరీక్షలలో పాస్ అయ్యింది. కాలేజిలో చేర్చేందుకు కుటుంబసభ్యులు అంతా సిద్ధం చేశారు.. ఇంతలో అంకుల్ ఇంటికి వెళ్లి వస్తానంటూ సోమవారం ఇంట్లో చెప్పి వెళ్లిన యామిని ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో బాలికల తల్లిదండ్రులు తమ కూతుళ్లు కనిపించడం లేదంటూ బాచుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే యామిని ఆచూకీ మంగళవారం లభ్యమైనట్లు సమాచారం. బంధువుల ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
11 వేల మంది బాలికలు అదృశ్యం
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బాలికలపై అకృత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ ఎంపీ ఛాయా వర్మ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంత విద్యాసంస్థల్లో చదువుకునే సుమారు 11వేల మంది బాలికలు కనిపించకుండా పోయారని, వారి విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ ఛాయా వర్మ కోరారు. శుక్రవారం బీజేపీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు సందర్భంగా ఆమె మాట్లాడారు. గిరిజన బాలికల హాస్టళ్లలో లైంగికదాడులు, కిడ్నాపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరాయని అన్నారు. వీటిపై అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇందుకు సంబంధించి 2012 చట్టాన్ని సవరించాలని సూచించారు. దీనిపై స్పీకర్ కురియన్ స్పందిస్తూ.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని సంబంధిత మంత్రిని కోరారు. బాలికలపై అత్యాచారాలు జరిగిన హాస్టళ్లు ఉంటే విచారణ జరిపి అటువంటి వాటిని మూసివేయించాలని కోరారు. -
తండ్రి మందలించాడని ఇద్దరు బాలికలు...
⇒ ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇద్దరు బాలికలు బహదూర్‌పురా: తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన బాలికలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కూతుళ్ల కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రవిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన ఉస్మాన్ అలీ ఖాన్, మేరాజ్ బేగం దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో కలసి నివాసముంటున్నారు. పెద్ద కుమార్తె సమీహ 9వ తరగతి, చిన్న కుమార్తె నబీల్ 8వ తరగతి చదువుతున్నారు. చెప్పిన పని చేయలేదని ఈ నెల 4వ తేదీన కూతుళ్లను ఉస్మాన్ అలీఖాన్ మందలించాడు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన వీరు రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మేరాజ్ బేగం తన కూతుళ్లు కనిపించడం లేదని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040-27854789, 9490616309 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు, తల్లిదండ్రులు కోరారు. -
హాస్టల్ నుంచి ఐదుగురు యువతుల అదృశ్యం
పెనమలూరు, న్యూస్‌లైన్ : పెనమలూరులోని అనాథ బాలికల హాస్టల్ నుంచి ఐదుగురు యువతులు ఆదివారం వేకువజామున అదృశ్యం కావడంతో కలకలం రేగింది. తొలుత పోలీసులు ఈ ఘటనను అత్యంత గోప్యంగా ఉంచి విచారణ చేసినా.. ఆదివారం రాత్రికి యజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ ధర్మేంద్ర తెలిపిన ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరు వంతెన వద్ద నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో నవీన ఫర్ గాళ్స్ హాస్టల్ ఉంది. దీనిలో మొత్తం 19మంది అనాథ యువతులు ఉంటున్నారు. వీరికి నవజీవన్ బాలభవన్ యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. శనివారం రాత్రి ఈ యువతులు భోజనాల అనంతరం నిద్ర పోయారు. వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ఎస్.లక్ష్మి, కె.కావ్యలు బాత్రూమ్కు వెళ్లటానికి లేవగా నెట్‌వాచ్‌ఉమెన్ మేరీ తాళాలు తీసింది. బాత్రూమ్కు వెళ్లిన వారు తిరిగి రాగానే మళ్లీ తాళం వేసింది. అప్పటికి అందరూ ఉన్నారు. ఉదయం లేచి చూసేసరికి ఐదుగురు యువతులు అదృశ్యం కావడాన్ని వార్డెన్ గుర్తిం చారు. హాస్టల్లో రెండేళ్లుగా ఉంటున్న పరిటాలకు చెందిన ఎం.రమణ, కృష్ణలంకకు చెందిన ఎస్.లక్ష్మి, విజయవాడ శిఖామణి సెంటర్‌కు చెందిన ఎన్.గాయత్రి, రాజమండ్రికి చెందిన ఎం.సంతోషి, గుడివాడకు చెందిన కావ్య అదృశ్యమైనవారిలో ఉన్నారు. నిద్రలో ఉన్న వాచ్ఉమెన్ వద్ద నుంచి గప్‌చుప్‌గా తాళం తీసుకుని వారు పారిపోయి ఉంటారని వార్డెన్ భావిస్తున్నారు. వీరందరి వయస్సు 18-19 సంవత్సరాలే. వీరు విజయవాడలో చిన్నచిన్న ప్రైవేటు ఉద్యోగాలు, టైలరింగ్ వంటి పనులు చేస్తుంటారు. ఈ యువతుల అదృశ్యం విషయాన్ని హాస్టల్ యాజమాన్యానికి వార్డెన్, వాచ్మెన్ తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. హాస్టల్‌వద్ద భద్రత కరువు యువతులు ఉంటున్న ఈ వసతిగృహం వద్ద కనీస భద్రత కూడా లేదు. ఇక్కడ ఉండే యువతులందరూ పగలు వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ రాత్రివేళ హాస్టల్లో ఉంటున్నారు. ఈ యువతులు ఏం చేస్తారు, ఎక్కడకు వెళతారు తదితర అంశాలను ఆరా తీసేవారే లేరని సేకరించిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదని, రాత్రికి రాత్రే యువతులు అదృశ్యం కావడం దురదృష్టకరమని హాస్టల్వార్డెన్ రమాదేవి అన్నారు.