
సమీనాబేగం, ఇష్రత్‌బి(ఫైల్)
బంజారాహిల్స్: ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన ఇష్రత్ బీ, సమీనాబేగం స్థానిక ప్రభుత్వ ఉర్ధూ మీడియం స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నారు. గత నెల 29న ఇష్రత్ బీని ఆమె తల్లి ఇంటి పనుల్లో నిర్లక్ష్యం చేస్తుందని చేయిచేసుకుంది. అనంతరం ఆమె బయటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇష్రత్ బీ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించగా తన సోదరి కూతురు సమీనా బేగంతో కలిసి బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్లడం చూసినట్లు అక్కడే ఉన్న అర్బాజ్ తెలిపాడు. దీంతో ఆమె పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు ఇద్దరూ ముంబయికి చేరుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందడంతో అక్కడికి వెళ్లేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment