బంజారాహిల్స్‌లో దారుణం.. కూతుళ్లపై కన్న తండ్రే | Father Molests His Two Daughters Since 3 Years In Hyderabad | Sakshi
Sakshi News home page

ఇద్దరు కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం

Published Wed, Jan 20 2021 8:42 AM | Last Updated on Wed, Jan 20 2021 12:36 PM

Father Molests His Two Daughters Since 3 Years In Hyderabad - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: కన్నతండ్రి కూతురిపాలిట కామాంధుడయ్యాడు. మూడేళ్లుగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ ఎవరికైనా ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-12లోని బోలానగర్‌ ఫస్ట్‌లాన్సర్‌లో నివసించే విద్యార్థిని(18)పై ఆమె తండ్రి(42) గత కొంతకాలంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు గత డిసెంబర్‌ 29న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

కుటుంబసభ్యులు గాలింపు చేపట్టి ఆమెను జనవరి 5న ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయావని సోదరి నిలదీయడంతో మహ్మద్‌ కరీం అనే వ్యక్తి తనను తీసుకెళ్లాడని.. రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పింది. అంతేగాక తండ్రి కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. మూడేళ్లుగా తన సోదరిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, తనపై కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఇద్దరం తండ్రి బాధితులమేనని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement