ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: స్కూల్ ఫీజు కట్టడానికి మరుసటి రోజు రమ్మని చెప్పిన ప్రిన్సిపాల్‌పై ఓ విద్యార్థి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 సయ్యద్ నగర్‌లోని ది ఆక్స్‌ఫర్డ్ మిషన్ హైసూ్కల్‌లో స్థానికంగా నివసించే ఇలియాస్(19)అనే విద్యార్థి సోమవారం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు వచ్చాడు. అయితే ఫీజు చెల్లించేందుకు రేపు రావాలని స్కూల్ ప్రిన్సిపల్ ఫిర్దోస్ అంజుమ్ సూచించారు.
ఇప్పడే కట్టుకోవాలంటూ వాగ్వాదానికి దిగిన ఇలియాస్ కోపంతో ఊగిపోతూ ప్రిన్సిపల్‌ను కొట్టాడు. అప్పుడే వచ్చిన అతడి తల్లి జాఫరున్నీసాబేగం కూడా చెప్పు తీసుకొని ప్రిన్సిపల్ ముఖంపై బాదింది. బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇలియాస్‌తో పాటు అతడి తల్లి జాఫరున్నీసాబేగంపై ఐపీసీ సెక్షన్ 354, 324, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment