Three 8th Class Girl Students Are Missing In Jangaon District, Details Inside - Sakshi
Sakshi News home page

Students Missing In Jangaon: ముగ్గురు విద్యార్థినిలు మిస్సింగ్‌.. ఏమయ్యారు?

Published Sat, Aug 5 2023 7:41 PM | Last Updated on Sat, Aug 5 2023 8:15 PM

Three Girl Students Are Missing In Jangaon District - Sakshi

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమవడం సంచలనంగా మారింది..

సాక్షి, జనగామ: జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో శనివారం ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్థినిల పేరెంట్స్‌ హెడ్‌మాస్టర్‌కు విషయం తెలిపారు. దీంతో, వీరంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. జనగామ జిల్లాలో ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. స్టేషన్ రోడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆశ్విత(15), శివరాత్రి రక్షిత(14), దూదేకుల రుబిన(12) శనివారం అదృశ్యమయ్యారు. ఈరోజు భోజన సమయంలో వీరు ముగ్గురు కనిపించలేదు. ఈ విషయం వీరి పేరెంట్స్‌కు హెడ్‌మాస్టర్‌ వలబోజు కృష్ణమూర్తి తెలియజేశారు. ఈ క్రమంలో వీరి పేరెంట్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: విషాదం.. కొడుకు మరణ వార్త విని తండ్రి మృతి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement