
సాక్షి, పశ్చిమ గోదావరి : పాఠశాల నుండి అదృశ్యమైన మైనర్ బాలికలను పోలీసులు పట్టుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. చింతలపూడి మండలంలోని రాఘవపురం గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు బుధవారం అదృశ్యమయ్యారు. ఆందోళన చెందిన బాలికల తల్లిదండ్రులు చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లల ఆచూకీ కోసం పోలీసులు వారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్లు వారిని గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, పిల్లలను తీసుకొచ్చి జంగారెడ్డి గూడెం డీఎస్పీ స్నేహిత సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment