మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లో చట్టవిరుద్దంగా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్ శివారు ప్రాంతంలో అంచల్ బాలికల హాస్టల్ నిర్వహిస్తున్నారు.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనుంగో .. ఈ చిల్డ్రన్స్ హోమ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే రిజిస్టర్‌ను తనిఖీ చేయగా.. అందులో 68 బాలికల ఎంట్రీలు ఉండగా.. 26 మంది గల్లంతైనట్లు గుర్తించారు. మిస్ అయిన వారిలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్ ప్రాంతాలకు చెందిన బాలికలు ఉన్నారు.
అదృశ్యమైన బాలికల గురించి షెల్టర్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానలు చెప్పాడు. అనుమానం వచ్చిన అధికారి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికల హాస్టల్‌లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అసలు షెల్టర్ హోంను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది.
వీధుల్లో ఒంటరిగా కనిపించిన పిల్లలను ఒక చోట చేర్చి, ఎలాంటి లైసెన్స్ లేకుండా ఓ మిషనరీ( మత గురువు) ఈ షెల్టర్ హోమ్‌ను నడుపుతున్నట్లు కనుంగో ట్వీట్ చేశారు. రక్షించిన పిల్లలకు రహస్యంగా క్రైస్తవ మతాన్ని ఆచరించేలా చేశారని ఆరోపించారు. హాస్ట్‌లో ఎక్కువమంది అమ్మాయిలు ఆరు నుంచి 18 సంవత్సరాల వారేనని.. వీరిలో అధికంగా హిందువులే ఉన్నట్లు తెలిపారు.
కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న గవర్నర్.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వ సీఎస్‌కు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇక షెల్టర్ హోంలోని మిగతా పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పజెప్పారు.
చదవండి: రామమందిర ప్రారంభం.. ఆలయానికి వెళ్లి మహా హారతి ఇస్తా: ఉద్ధవ్
Comments
Please login to add a commentAdd a comment