shelter
-
పెట్ లవర్స్.. బీ కేర్‌ఫుల్..!
పెంపుడు జంతువులు.. మన జీవన శైలిలో ఓ భాగం. అయితే ఆ మూగ జీవాలను ప్రాణప్రదంగా భావించేవారు కోకొల్లలు. కంటికి రెప్పలా కాస్తూ.. విడదీయరాని మైత్రి బంధాన్ని కొనసాగించే వారు మరికొందరు. మనుషుల్లానే చలికాలంలో వాటికీ రక్షణ అవసరమే.. అందుకే జంతు ప్రేమికులు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటిపట్ల జాగ్రత్తగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల మాదిరిగానే వాటికీ సీజనల్ వ్యాధులు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వాటి ఆరోగ్యానికీ ఢోకా ఉండదని చెబుతున్నారు కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా, తెలంగాణలోని సనత్ నగర్‌కి చెందిన కెనైన్ అసోసియేషన్ కార్యదర్శి విశాల్ సూదం. మనుషులకే కాదు.. పెంపుడు జంతువులకూ చలికాలంలో వేడి పుట్టించే వివిధ రకాల యాక్సెసరీస్ అందుబాటులోకి వచ్చాయి. కుక్కలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు వాష్ చేసుకునేందుకు వీలుగా ఫ్లాట్ బెడ్, రౌండ్ బెడ్లు దొరుకుతున్నాయి. కుక్కలు, పప్పీస్ చలి తీవ్రతను వీటి ద్వారా అరికట్టవచ్చు. దీంతోపాటు ప్రత్యేక స్వెట్టర్లు జంతువులకు రక్షణ నిలుస్తున్నాయి. అన్ని సైజుల కుక్కలకూ అనువుగా ఉండేలా వివిధ మోడళ్లతో ఊలుతో తయారుచేసిన స్వెట్టర్లు లభిస్తున్నాయి. ఇవి కూడా వాటి సైజు, నాణ్యత ఆధారంగా వివిధ ధరల్లో లభిస్తున్నాయి. అలాగే. కాళ్లకు రక్షణ కలిగించే రీతిలో శీతాకాలంలో షూష్ అందుబాటులో ఉన్నాయి.శీతాకాలంలో మంచు కారణంగా గాలిలో తేమ శాతం కారణంగా గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. దీంతో పెంపుడు జంతువులు వాయు కాలుష్యం బారిన పడి శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే బయటకు తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. పెట్స్ ఆరోగ్యంగా ఉండడానికి రెగ్యులర్‌గా గ్రూమింగ్ చేయడం అవసరం. నీళ్లు తాగించేందుకు ఉపయోగించే గిన్నెలు, పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సీజనల్ వ్యాధులు.. శీతాకాలలో వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ. చలి కాలంలో ఫ్లీస్, టిక్, మైట్స్ (గోమర్లు) అనే బాహ్య పరాన్నజీవులు కుక్కల చర్మంపై చేరతాయి. దీంతో జుట్టు రాలిపోవడం, టిక్ ఫీవర్ రావడం, బ్లడ్ లాస్ కావడం, దురదలు కారణంగా కుక్కలు వాటంతట అవే శరీరాన్ని కొరుక్కుంటాయి. గాలి సంక్రమణ ద్వారా ఒక కుక్క నుంచి మరో కుక్కకు పాకుతుంటాయి. అందుకోసం ముందుగానే నిపుణుల సలహా మేరకు బెల్టు టైపులో ఉండే యాంటీ టిక్ కాలర్ ఏర్పాటు చేయడం రక్షణగా ఉంటుంది. అలాగే తరచూ యాంటీ రాబీస్, సెవన్ ఇన్ వన్ వంటి టీకాలను వేయించాలి. షాంపో, పౌడర్, స్ప్రేస్తో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రత్యేక శ్రద్ధ అవసరం..శీతాకాలంలో మంచుకురిసే అవకాశం ఉన్నందున సాధ్యమైంత వరకూ పెంపుడు జంతువులకు ప్రత్యేక షెల్టర్ గానీ, ఇంట్లో వెచ్చని ప్రదేశాన్ని గానీ కేటాయిస్తే బాగుంటుంది. ముఖ్యంగా పప్పీస్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాటి దినచర్యలో ఏవైనా మార్పులు వస్తే.. వైద్యుల సలహా పాలించాలి. – విశాల్ సూదం, కెనైన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది) -
నా చిరకాల స్వప్నం, గుడ్ న్యూస్ : రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
నటి రేణుకా దేశాయ్ శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకుంది. చిన్న నాటి కల నెలవేరింది అంటూ ఇంటూ ఇన్‌స్టాలో ఒకపోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, వ్యక్తిగత విషయాలతో పాటు , ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం, పలు సామాజిక అంశాలపై స్పందించడం అలవాటు. అలాగే అభిమానుల సాయంతో తోచిన సహాయం చేస్తూ ఉంటుంది. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగాలో ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. క్తికరమైన విషయాన్ని తన ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. తనకు చిన్నప్పటినుంచి జంతువులు ముఖ్యంగా కుక్కలు, పిల్లులు మీద ఇష్టం ఎక్కువ అనీ, పెద్దాయ్యక వాటి కోసంఏదైనా చేయాలని కోరిక ఉండేదని, కోవిడ్ సమయంలో దీని ప్రాధాన్యతను తాను మరింత గుర్తించానని తెలిపింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఒక ఎన్జీవోను రిజిస్టర్ చేసినట్టు వెల్లడించింది. గతంలో ప్రమాదాలకు గురైన కుక్కలు లాంటివాటిని రక్షించడంలో తనకు చాలామంది గొప్పవాళ్లు సాయం చేశారని తెలిపింది. ఇపుడిక తానే స్వయంగా ఒక సంస్థను, ఆంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పింది. అలాగే ఈ ప్రయాణంలో మరింత ముందుకు పోవాలంటే దాతల సాయం కూడా చాలా అవసరం అంటూ, సాయం చేసి, మూగజీవాల రక్షణలో తనకు తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేసింది.‘‘ఈ రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు, చిన్ననాటి కల నెరవేరింది, అందుకే క్షణాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ తన సంస్థకు సంబంధించిన వివరాలను, తన ఆశయాలను ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనిపై నెటిజన్లు ఆమెను ఆభినందిస్తున్నారు. జంతువుల సంరక్షణ, వైద్య సాయం అందించే క్రమంలో విజయం సాధించాలి అంటూ విషెస్ అందించారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
అంబానీ కొడుకు నిజంగా గ్రేట్.. అడవిని సృష్టించిన కొత్త పెళ్లికొడుకు.
-
భోపాల్: షెల్టర్ హోం నుంచి 26 మంది బాలికల మిస్సింగ్!
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లో చట్టవిరుద్దంగా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్ శివారు ప్రాంతంలో అంచల్ బాలికల హాస్టల్ నిర్వహిస్తున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనుంగో .. ఈ చిల్డ్రన్స్ హోమ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే రిజిస్టర్‌ను తనిఖీ చేయగా.. అందులో 68 బాలికల ఎంట్రీలు ఉండగా.. 26 మంది గల్లంతైనట్లు గుర్తించారు. మిస్ అయిన వారిలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్ ప్రాంతాలకు చెందిన బాలికలు ఉన్నారు. అదృశ్యమైన బాలికల గురించి షెల్టర్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానలు చెప్పాడు. అనుమానం వచ్చిన అధికారి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికల హాస్టల్లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అసలు షెల్టర్ హోంను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. వీధుల్లో ఒంటరిగా కనిపించిన పిల్లలను ఒక చోట చేర్చి, ఎలాంటి లైసెన్స్ లేకుండా ఓ మిషనరీ( మత గురువు) ఈ షెల్టర్ హోమ్‌ను నడుపుతున్నట్లు కనుంగో ట్వీట్ చేశారు. రక్షించిన పిల్లలకు రహస్యంగా క్రైస్తవ మతాన్ని ఆచరించేలా చేశారని ఆరోపించారు. హాస్ట్‌లో ఎక్కువమంది అమ్మాయిలు ఆరు నుంచి 18 సంవత్సరాల వారేనని.. వీరిలో అధికంగా హిందువులే ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న గవర్నర్.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వ సీఎస్‌కు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇక షెల్టర్ హోంలోని మిగతా పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పజెప్పారు. చదవండి: రామమందిర ప్రారంభం.. ఆలయానికి వెళ్లి మహా హారతి ఇస్తా: ఉద్ధవ్ -
ఇండియా షెల్టర్ ఐపీవో రెండో రోజుకి 4.3 రెట్లు స్పందన
అందుబాటు ధరల గృహ రుణాల కంపెనీ ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పబ్లిక్ ఇష్యూ రెండో రోజుకల్లా విజయవంతమైంది. 4.34 రెట్లు అధిక స్పందనను సాధించింది. కంపెనీ 1.79 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. గురువారాని(14)కల్లా 7.76 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 7.33 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 5 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 84 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 400 కోట్ల విలువైన షేర్లనుప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచారు. షేరుకి రూ. 469–493 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1200 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. మంగళవారం(12న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 360 కోట్లు అందుకుంది. ప్రధానంగా టైర్–2, టైర్–3 పట్టణాలలో మధ్యాదాయ, తక్కువ ఆదాయ వర్గాల వారికి గృహ రుణాలు సమకూర్చుతోంది. -
పాక్‌లో వరద బాధితులను... అక్కున చేర్చుకున్న ఆలయం
కరాచీ:కనీవిని ఎరగని వరదలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్లో ఓ చిన్న గ్రామంలోని హిందూ దేవాలయం అందిస్తున్న సేవలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జలాల్ ఖాన్ అనే మారుమూల కుగ్రామంలో ఉన్న బాబా మధోదాస్ మందిర్ వరదలో సర్వం కోల్పోయిన కనీసం 300 మంది ముస్లింలకు ఆశ్రయంతో పాటు భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తోంది. చుట్టుపక్కల నదులన్నీ పొంగడంతో ఊరికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆలయం ఎత్తయిన ప్రాంతంలో ఉండటంతో వరద ముంపు నుంచి తప్పించుకుంది. దాంతో గ్రామస్తులంతా ఆలయ ఆవరణలో ఉన్న 100 పై చిలుకు గదుల్లో తలదాచుకుంటున్నారు. వారి పశువులు కూడా ఆలయ ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్నట్టు డాన్ వార్తా పత్రిక పేర్కొంది. దేశ విభజనకు ముందు ఇక్కడ సంచరించిన బాబా మధో దాస్‌ను హిందూ ముస్లింలిద్దరూ ఆరాధించేవారట. బలూచిస్తాన్ ప్రావిన్స్ నలుమూలల నుంచీ హిందువులు ఈ ఆలయ సందర్శనకు వస్తారు. ఊళ్లోని హిందూ కుటుంబాలు చాలావరకు ఉపాధి కోసం కరాచీ తదితర చోట్లకు వలస వెళ్లాయి. రెండు కుటుంబాలు మాత్రం గుడి బాగోగులు చూసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయాయి. గుళ్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులకు భోజనాధికాలను ఆ హిందూ కుటుంబాలే సమకూరుస్తున్నాయి. వారి సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమంటూ ఊరివాళ్లంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. ఇది మత సామరస్యానికి అద్దం పట్టే ఉదంతమని డాన్ కథనం పేర్కొంది. -
నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న రాజపక్స కుటుంబం
Protests erupted at the Trincomalee Naval Base in Sri Lanka: అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో నిరసనకారుల దాడులు రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత వహిస్తూ శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సా రాజీనామా చేసినప్పటికీ అల్లర్లు ఆగడం లేదు. అంతేకాదు హంబన్‌టోటాలోని రాజపక్స కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ భారీ ఉద్రిక్తతల కారణంగా మహింద రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు ట్రింకోమలీ నావికా స్థావరంలో తలదాచుకుంటున్నారు. అయితే మహింద్రా కుటుంబం నేవీలో ఆశ్రయం పొందుతున్నట్లు ఆందోళనకారులు తెలుసుకోవడంతో అక్కడ కూడా నిరసనలు చెలరేగాయి. ఇప్పట్లో ఈ నిరసన సెగ మహీంద్రా కుటుంబాన్ని అంత తేలిగ్గా వదిలేట్లు లేదు. ఆర్థిక, రాజకీయం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక ఇప్పుడూ హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుపోతుంది. ప్రస్తుతం ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. A protest underway in front of the Trincomalee Naval Base claiming former PM Mahinda Rajapaksa and his family members are inside pic.twitter.com/fJ6hOh6b3Y — NewsWire 🇱🇰 (@NewsWireLK) May 10, 2022 Ancestral home of the Rajapaksa family in Medamulana, Hambantota set on fire by protesters. pic.twitter.com/QIEnREphjq — NewsWire 🇱🇰 (@NewsWireLK) May 9, 2022 (చదవండి: శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు) -
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
-
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
Metro station in Kharkiv: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజుల తరబడి దాడి చేస్తూనే ఉంది. వైమానిక దాడులతో పౌరుల ఆవాసాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే కైవ్, మారియుపోల్, ఖార్కివ్‌లను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖార్కివ్‌లోని పౌరులు బాంబుల దాడుల నుంచి తప్పించుకునేందుకు మెట్రో స్టేషన్లోనే తలదాచుకుంటున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ..ఉక్రెనియన్లకు ఆ మెట్రో స్టేషనే బాంబు షెల్టర్‌గా మారిందని పేర్కొంది. ఆ స్టేషన్లో పౌరులు ఏవిధంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారో వివరిస్తూ..వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అక్కడే నివాసం ఉంటున్న ఉక్రెయిన్ల కోసం తాత్కాలిక పడకలను, సంగీత కచేరీలను ఏర్పాటు చేశారు. అంతేగాదు రష్యా బలగాలు ఖార్కివ్‌లోని అణుకేంద్రం పై కూడా దాడులు నిర్వహించింది. అంతేగాదు ఖార్కివ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీలోని న్యూట్రాన్ సోర్స్ ప్రయోగాశాల అగ్నిప్రమాదానికి గురైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.. అంతేగాదు ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న నష్టాన్ని అంచనవేయడం కూడా కష్టమేనని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
ఏం పాపం చేశాం.. మాకు బతకాలని ఉంటుంది.. దగ్గరకు రాకండి ప్లీజ్!
ఆరిలోవ(విశాఖ తూర్పు): పచ్చని అరణ్యాలు పలుచపడుతున్నాయి. కొండలు జనావాసాలుగా రూపాంతరం చెందాయి. దీంతో అరణ్యంలో ఉండాల్సిన వన్య ప్రాణులు జనారణ్యంలోకి ప్రవేశించి ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని జంతు జాతులు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. అందుకే వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అటవీ శాఖాధికారులు, జంతు సంరక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 4(శనివారం)న ప్రపంచ వన్య ప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. విశాఖ నగరంలో జనసాంద్రత విపరీతంగా పెరిగింది. భారీగా నివాసాల కొరత ఏర్పంది. స్థలాల ధర చుక్కలను తాకుతోంది. దీంతో పేద జనం అడవులు, కొండలను ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకుంటున్నారు. విశాఖ నగరాన్ని ఆనుకొని ఉన్న కొండలు జనావాసాలతో కిక్కిరిసిపోయాయి. కంబాలకొండ, సీతకొండ, ఎర్రకొండ, ఎండాడ కొండలు, అమనాం ప్రాంతాల్లో దట్టమైన రిజర్వ్డు ఫారెస్టుకు చెందిన కొండలున్నాయి. వీటిలో కంబాల కొండలో 17,600 ఎకరాలు, సీతకొండలో 800, ఎర్రకొండలో 800, అమనాం ప్రాంతంలో 920 ఎకరాల విస్తార్ణంలో అడువులుండేవి. కొన్నేళ్లుగా ఆ అడవులు ఆక్రమణకు గురై విస్తీర్ణం తరిగిపోయింది. ఒకప్పుడు సుమారు 1,000 ఎకరాల్లో రుషికొండ ప్రాంతంలో కొండలుండేవి. వీటిలో ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు, ఫిల్మ్‌సిటీ వెలిశాయి. దీంతో అక్కడ అటవీ ప్రాంతమంతా కనుమరుగైంది. ఈ కొండలన్నింటిలోను సుమారు 8 చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అప్పట్లో గుర్తించారు. ఎండాడ కొండల్లో నాలుగు చిరుతలు సంచరించేవని, ఇక్కడ నిర్మాణాలు జరగడంతో వాటి జాడ కనిపించలేదు. చిరుతలకు ఆహారమైన జింకలు, కనుజులు, నక్కల సంఖ్య కూడా తగ్గతుందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో ఆహారం కోసం చిరుతలు జనారణ్యంలోకి చొరబడుతున్న సందర్భాలు ఉన్నాయి. చిరుతలు అడవుల్లో సుమారు 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సంచరిస్తాయి. సీతకొండ, ఎర్రకొండ, అమనాం ప్రాంతాలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. దీంతో రాత్రివేల ఆహారం కోసం చిరుతలు తిరుగుతూ అడవులు సమీపంలోని నివాసాలలోకి చొరబడుతున్నాయి. గతంలో అమనాం, ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం, అక్కయ్యపాలెం, మధురవాడ ప్రాంతాల్లో చిరుతలు ఆహారం కోసం జనారణ్యంలోకి వచ్చి ఇళ్లలోకి చొరబడిన సంఘటనలు తెలిసిందే. 2013 నుంచి వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం వన్యప్రాణులను సంరక్షించాలనే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా సీఐటీఈఎస్ అనే సంస్థ 2013 నుంచి వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోను అటవీశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వన్యప్రాణులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జంతువుల ఆవాసాలను రక్షించడం, వన్యప్రాణులను వేటాడం చేయకుండా చూడడం ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. ఇందిరాగాంధీ జూలో వరుసగా రెండేళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయింది. 2020లో కరోనా కారణంగా నిర్వహించలేకపోయింది. ప్రస్తుతం తుపాన్ కారణంగా జూలో అధికారులు వన్యప్రాణులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేకపోయారు. విశాఖ జూలో వన్యప్రాణులు నగరంలో 625 ఎకరాల అటవీ విస్తీ్తర్ణంలో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్కులో అనేక రకాల వన్యప్రాణులున్నాయి. ఇక్కడ వివిధ రకాలకు చెందిన సుమారు 830 వన్యప్రాణులు కనువిందు చేస్తున్నాయి. రామచిలుకలు, ఆఫ్రికన్ చిలుకలు, మైనాలు, ఆస్ట్రిచ్‌లు, ఈమూలు, రంగురంగుల పిట్టలతో పాటు పులులు, సింహాలు, ఏనుగులు, నీటి ఏనుగులు, ఖడ్గమృగం, జిరాఫీలు, జీబ్రాలు, చింపాంజీలు, కనుజులు, జింకలు, కొండగొర్రెలు, అడవి కుక్కలు, హైనాలు తదితర వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. జూకి వచ్చిన సందర్శకులు సరదాగా వినోదం కోసం మాత్రమే వన్యప్రాణులను చూడాలనుకోకూడదు. వాటి జీవన విధానం, పర్యావరణంలో వాటి ఆవశ్యకత గరించి తెలుసుకోవాలి. ప్రతి ఏడాది జూలో వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తుంటాం. అయితే ఈ ఏడాది తుపాను కారణంగా జూకి సెలవు ప్రకటించడంతో జరుపుకోలేకపోతున్నాం. అందరూ వన్యప్రాణులను సంరక్షించడానికి కృషి చేయాలి. వాటిపై ప్రేమ చూపాలి. వాటి ఆవాసాలలోకి చొరబడకుండా ఉండాలి. ప్రస్తుం మన దేశంలో చీతాలు అంతరించిపోయాయి. మిగిలిన జంతు జాతి అంతరించిపోకుంగా చూడాలి. –నందని సలారియా, జూ క్యూరేటర్. -
మానవత్వం చాటిన వైఎస్సార్ సీపీ నేత
సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి): ఎన్నికల ప్రచారంలో ఓటు అభ్యర్థించేందుకు వెళ్లిన సమయంలో పూరి గుడిసెలో దయనీయ స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని చూసి చలించిన 15వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెస్లీ ఆమెకు గూడు కల్పించేందుకు శ్రీకారం చుట్టి తన మానవత్వాన్ని చాటారు. వివరాల్లోకి వెళితే.. జాతీయ రహదారికి చేర్చి, జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా పాడుబడిన పూరి పాకలో వృద్ధురాలు బొమ్మిడి లక్ష్మీ నివసిస్తోంది. భర్త చనిపోగా బంధువులు పట్టించుకోవడం మానేశారు. దివ్యాంగురాలైన కుమార్తెతో కలిసి వృద్ధురాలికి వచ్చే పింఛను సొమ్ముతోనే జీవిస్తున్నారు. అవ్వతో కొబ్బరికాయ కొట్టించిన నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి ఇదిలా ఉండగా, ఇటీవల నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారానికి వచ్చిన కటికతల జాన్ వెస్లీ వృద్ధురాలిని ఓటు అడిగేందుకు వచ్చారు. ఆ సమయంలో శిథిలమైన పూరిపాకలో వర్షానికి తడిసిపోయి ఇంటి ముందు బురద, దుర్వాసనలో జీవిస్తుండటాన్ని గమనించి చలించిపోయారు. ఎన్నికల అనంతరం తాను గెలిచినా, ఓడినా వృద్ధురాలికి గూడు నిర్మిస్తానని సంకల్పించారు. అనంతరం కౌన్సిలర్‌గా గెలుపొందగా, గురువారం చైర్పర్సన్ జామి హైమావతితో కలిసి జాన్ వెస్లీ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పరిశీలించారు. పూరి గుడిసె స్థానంలో షెడ్డు నిర్మాణానికి వృద్ధురాలితోనే కొబ్బరికాయ కొట్టి కొత్త నిర్మాణం ప్రారంభించారు. రెండు రోజుల్లో నిర్మాణం పూర్తవుతుందని, ఇందుకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చవుతుందన్నారు. వృద్ధురాలి కుమార్తెకు దివ్యాంగ పింఛను మంజూరుకు కృషి చేస్తానన్నారు. -
అనాథ బాలురకూ ఆశ్రయం!
సాక్షి, హైదరాబాద్: అనాథలు, వసతి కోసం ఎదురు చూసే బాలుర కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సరికొత్త కార్యాచరణ చేపట్టింది. ఇప్పటివరకు అనాథ బాలికలు, మహిళల కోసమే షెల్టర్ హోంలు నిర్వహిస్తున్న ఆ శాఖ.. ఇక బాలుర కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రానికి ఒక షెల్టర్ హోంను ఏర్పాటు చేశారు. వీటిలో అనాథ బాలికలను నేరుగా చేర్చుకుని ఆశ్రయమిస్తారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలు, ఇతరత్రా కారణాలతో హింసకు, దాడులకు గురైన వారిని సైతం షెల్టర్ హోంలు అక్కున చేర్చుకుని ఆశ్రయం ఇస్తాయి. బాలికలు, మహిళల కోసం నిర్వహించే ఈ హోంలకు ఆ శాఖ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే ఈ హోంలు కొనసాగుతున్నాయి. అయితే బాలుర కోసం ఇప్పటివరకు ప్రత్యేకించి హోంలు లేవు. బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆరు వసతి గృహాలున్నప్పటికీ.. ఇందులో మెజార్టీ పిల్లలు సమాజంలో పొరపాట్లను చేసి వస్తున్న వారే.. మరోవైపు ప్రతి ఆర్నెల్లకోసారి నిర్వహించే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాల ద్వారా గుర్తిస్తున్న బాలుర సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఇలా గుర్తించిన వారిని ఎక్కడ వసతి కలి్పంచాలనేది అధికారులకు సమస్యగా మారింది. బాలల సంక్షేమ శాఖ పరిధిలోని హోంలకు పంపిస్తున్నప్పటికీ అనాథ బాలలకు ప్రత్యేక హోం అంటూ లేదు. మరోవైపు సింగిల్ పేరెంట్ సంరక్షణ నుంచి బయటపడే వారు, తల్లిదండ్రులున్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో వసతి కోసం నిరీక్షిస్తున్న వారిలో బాలుర సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోంలను తెరిచే అంశంపై ఆ శాఖ దృష్టి సారించింది. నెలాఖరుకు కొలిక్కి... అనాథ బాలుర కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోంలు తెరిచే అంశంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇక్కడ కేవలం వసతితో పాటు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బాలల సంక్షేమ శాఖ పరిధిలోని హోంలకు అనుబంధంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. షెల్టర్ హోంకు వచ్చే పిల్లల వయసుకు తగిన కార్యక్రమాలు అమలు చేసేలా కొత్త హోంల కార్యాచరణ ఉండనుంది. గత నెల రెండో వారంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాలురకు షెల్టర్ హోం అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పాత జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతిపాదనల రూపకల్పనకు చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరులోగా 10 బాలుర షెల్టర్‌హోంల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
ఆవాసానికి పులి అన్వేషణ
భీమారం(చెన్నూర్): మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చిన పెద్దపులి ఆవాసం కోసం భీమారం, చెన్నూరు, కోటపల్లి మ ండలాల్లోని అడవిలో తిరుగుతోంది. రెండు నెలల క్రితం వచ్చిన ఏ2 మగపెద్దపులికి ఇప్పటి వరకు సరైన స్థావరం దొరకక అడవులను జల్లెడ పడుతోంది. అయి తే ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏ1 మగ, కే4 ఆడ పెద్ద పులులు రెండేళ్ల నుంచి నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. కొత్తగా వచ్చిన పులిని సమీప అడవిలోకి రానివ్వడం లేదని అటవీ శాఖాదికారులు చెబుతున్నారు. ఒ ంటరిగా ఉన్న ఏ2 మగ పులి దట్టమైన అడవులతో పాటు మైదాన ప్రాంతంలో సంచిరిస్తుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతం అధికంగా ఉన్న కోటపల్లి మండలం పంగిడి సోమారంతో పాటు భీమారం ప్రాంతం గుండా తిరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భీమారం స మీపంలో గొల్లవాగు ప్రాజెక్ట్ ఉండటం, అది దట్టమైన అడవి ప్రాంతం కావడంతో పాటు చెన్నూరు మండలం బుద్దారం అటవీ ప్రాంతానికి కలిసి ఉండటంతో పెద్దపులులు స్థావరంగా మార్చుకున్నాయి. ఇప్పటికే రెండు పులులు ఇక్కడ కేంద్రంగా చేసుకుని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ప్రభుత్వం పులుల సంరక్షణకు ఈ ప్రాంత ంలో సదుపాయాలు కల్పించకపోయిన ఇక్కడ వాటికి అనుకూలమైన పరిస్థితలు ఉండటంతో దీర్ఘకాలంగా ఉంటున్నాయి. రోజుకు 25మీటర్ల నడక ఆవాసం కోసం ఆరాటపడుతున్న ఏ2 మగ పెద్దపులి ప్రతిరోజు 25కిలో మీటర్లకి పైగా నడక కొనసాగిస్తుందని అటవీశాఖ అధికారులు అంచనాకి వచ్చారు. ఒకే రోజు రెండు మండలాలను చుట్టి వస్తుందని వారు పేర్కొంటున్నారు. చెన్నూరు మండలం ఆస్నాద్ వెళ్లిన పులి అదే రాత్రి కోటపల్లి మండలం పారిపెల్లి మరుపటి రోజు మల్లంపేట, పంగిడి సోమారం మీదుగా తిరిగి భీమారం మండలం నర్సింగాపూర్ చేరుకుంది. దీనిని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు పాద ముద్రలు సేకరిస్తూ రక్షణ కోసం చర్యలు చేపడుతున్నారు. రాత్రంతా అడవిలోనే పశువులు.. రెండు రోజుల క్రితం భీమారంలోని గొల్లవాగు ప్రాజెక్ట్ సమీపం గుండా కలప డిపో మీదుగా ఎలకేశ్వరం వెళ్లిన పులిని చూసిన పశువులు రాత్రి ఇంటికి రాలేదు. గ్రామంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పశువులు మేత కోసం ప్రాజెక్ట్ వైపు అడవికి మేత కోసం వెళ్లాయి. అయితే పులి కనపడటంతో పశువులు భయపడి అడవిలోనే ఉండిపోయాయి. మరుసటి రోజు గ్రామస్తులు వెళ్లి పశువులను తీసుకవచ్చారు. ఇప్పటికే ఈ అడవిలో సంచరిస్తున్న కే4, ఏ1 పెద్దపులులకు భిన్నంగా ఏ2 మగపులి అడవులతో పాటు మైదాన ప్రాంతంలో సంచరిస్తుండంతో దాని భద్రతపై అటవీశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది చర్చానీయాంశంగా మారింది. శంకర్పల్లి శివారులో పులి సంచారం మందమర్రిరూరల్: మండలంలోని శంకర్పల్లి గ్రామ శివారులో పులి అడుగులను అధికారులు మంగళవారం గుర్తించారు. వారి వివరాల ప్రకారం... మధ్యాహ్నం మామిడిగట్టు అటవీ ప్రాంతం నుంచి ఆదిల్పేట్, చిర్రకుంట అటవీ ప్రాంతం గుండా శంకర్పల్లి అటవీ ప్రాంతంలో సంచరించినట్లు అడుగుల ద్వారా గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతానికి గొర్రెల, పశువుల కాపరులు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. -
చిక్కుకుపోయిన 9,435 మంది కూలీలు
సాక్షి,విశాఖపట్నం: హఠాత్తుగా వచ్చిన లాక్డౌన్.. వలస కూలీల బతుకులపై పిడుగు పడేలా చేసింది. పొట్ట చేత పట్టుకొని ఊరుగాని ఊరు వచ్చిన వలస జీవుల్ని.. కంటికి కనిపించని కరోనా మహమ్మారి రోడ్డున పడేసింది. పనితోనే జీవితాలు ముడిపడి ఉండే వారంతా.. ఉన్న ఊరిలో ఉండలేక.. సొంత ఊరికి చేరలేక అనాథలుగా మారిన వారిని.. ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. వారి జీవన గమనానికి భరోసా ఇస్తూ ఆదుకుంటోంది. నిత్యావసరాలు పంపిణీ చెయ్యడంతో పాటు.. తలదాచుకునేందుకు షెల్టర్లు ఏర్పాటు చేస్తూ.. వారికి ఏలోటూ రానీయకుండా చర్యలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో వలస కార్మికుల్ని ఎక్కడి వారక్కడే ఉండాలనీ, తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ కూలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం చెయ్యొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న వలస కూలీలు, కార్మికులకు ప్రభుత్వం భరోసానిచ్చింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వలస కూలీలు, కారి్మకుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాట్లు చెయ్యడంతో పాటు నిత్యావసరాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 12 వేల మంది గుర్తింపు.. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 వేల మంది కూలీలు, కార్మికులు వున్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో తొలి విడతగా 9435 మందికి నిత్యావసర వస్తువులను సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నారు. రోజుకు ఒక ప్రాంతం చొప్పున ఈ పంపిణీ జరుగుతోంది. ప్రతి ఒక్కరికీ పది కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, మూడు కిలోల గోధుమ పిండి, లీటర్ వంట నూనె, అరకిలో ఉప్పు, 250 గ్రాముల కారం, 250 గ్రాముల పసుపు పొడి, 2 కిలోల ఉల్లిపాయలు, రెండు కిలోల బంగాళాదుంపలు కలిపి ఒక కిట్‌గా తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. 46 వసతి కేంద్రాలు.. వలస కూలీలు, దినసరి కార్మి కుల కోసం జిల్లా వ్యాప్తంగా 46 కేంద్రాల్లో ఉచిత భోజనం, వసతి ఇతర ఏర్పాట్లు చేశారు. జీవీఎంసీ పరిధిలో 26 కేంద్రాలు ఏర్పాటు చెయ్యగా.. రూరల్ ప్రాంతంలో 20 ఏర్పాటు చేశారు. అరకులోయ, పాడేరు, పాయకరావుపేట, జి.మాడుగుల, అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇబ్బందులుంటే ఫోన్ చెయ్యండి.. వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వ సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకూ గుర్తించిన వారి కోసం వసతి సౌకర్యాలు ఏర్పాటు చెయ్యడమే కాకుండా.. నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాం. తొలివిడతలో 9,435 మందికి అందించాం. రెండో విడత నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు కిట్లు సిద్ధం చేస్తున్నాం. ఏ వలస కారి్మకుడైనా భోజనానికి, వసతికి ఇబ్బంది ఎదురైతే 1800 4250 0002 నంబర్‌కు కాల్ చేస్తే.. వారి సమస్యలు పరిష్కరిస్తాం. – ఎల్.శివశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ రెండు వారాల నుంచి.. పని నిమిత్తం విశాఖకు వ చ్చాను. కరో నా నేపథ్యంలో అనకాపల్లిలో చిక్కుకుపోయాను. పునరావాస కేంద్రంలో ఉంటున్నాను. భోజనం పెడుతున్నారు. సౌకర్యాలతో కూడిన వసతి కల్పించారు. – ప్రభాకర్, వలస కార్మికుడు, కాకినాడ -
వలలే ఉరితాళ్లు!
సాక్షి, హైదరాబాద్: వేసవి విడిది కోసం వచ్చిన విదేశీ అతిథులకు వలలకు చిక్కి అల్లాడుతున్నాయి. జాలరులు చేపల కోసం వేసుకున్న వలలు తెలియకుండానే విదేశీ విహంగాలకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి కొత్తగా ఏర్పడ్డ కుటుంబంతో తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లాలని సంబరపడే విదేశీ వలస పక్షులు వేటలో భాగంగా అనుకోకుండా వలలకు చిక్కి మృతి చెందుతున్నాయి. నగరంలోని ప్రధాన జలాశయం గండిపేటలో ఓ స్వచ్ఛంద సంస్థ కొద్ది రోజుల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించింది. జాలరుల అవగాహన లేమితోనే ఇది జరుగుతుందని గుర్తించింది. అక్కడి పరిస్థితులు వలస పక్షులకు మృత్యుకౌగిలిగా మారుతోన్న తీరును అటవీశాఖ అధికారుల దృష్టికి తెచ్చింది. వలస పక్షులను రక్షించేందుకు జాలరులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇదీ సంగతి: వేసవి సమీపించిందంటే చాలు సైబీరియా మొదలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పక్షులు మన దగ్గరకు వలస రావడం తెలిసిందే. నీటి వనరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి పొదిగి, ఆ పిల్లలు ఎగిరే నేర్పును పొందే వరకు ఎదురు చూసి ఆ తర్వాత సొంత ప్రాంతాలకు ఎగిరిపోతాయి. ఇలా తెలంగాణలోని వివిధ ప్రాంతాలు విదేశీ పక్షులకు విడిదిగా ఉంటున్నాయి. అందులో నగరంలోని గండిపేట (ఉస్మాన్ సాగర్) కూడా ఒకటి. ప్రస్తుతం గండిపేట జలాశయం విదేశీ విహంగాలతో సందడిగా ఉంది. కానీ కొన్నిరోజులుగా క్రమం తప్పకుండా ఇక్కడ ఆ పక్షులు చనిపోతున్నాయి. విషయం తెలిసి ‘యానిమల్ వారియర్స్’సంస్థ ప్రతినిధులు జలాశయం వద్ద కొద్ది రోజులుగా పరిశీలిస్తుండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గండిపేట జలాశయం ఆది నుంచి జాలరులకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇందులో చేప విత్తనాలు వేసి అవి పెరిగాక వాటిని పట్టి విక్రయించి ఆదాయం పొందుతున్నారు. చేపలు పట్టేందుకు వీలుగా వలలను జలశయంలోని ముళ్ల పొదలను ఆసరాగా చేసుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటికి చిక్కే చేపలను తీసి అమ్ముకుంటారు. ఈ క్రమంలో గాలి ఉధృతి పెరిగినప్పుడు కొన్ని వలలు ఆ ముళ్లపొదలకు చిక్కుకుపోతున్నాయి. వాటిని తీయటం సాధ్యం కాక అలాగే వదిలేసి కొత్త వలలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తేలిందని యానిమల్ వారియర్స్ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. అలా ఇరుక్కుపోయిన వలలు నీటిలో ఉండిపోతున్నాయి. వాటిని గుర్తించని పక్షులు ముళ్లపొదలపై వాలే సమయంలో వాటిల్లో చిక్కుకుపోతున్నాయి. కొన్ని పక్షులు చేపలను ముక్కుతో వేటాడే సమయంలో వాటి ముక్కు వలలకు ఇరుక్కుపోతోంది. పెనుగులాడితే వలల వైరు భాగం ముక్కుకు గట్టిగా చుట్టుకుపోతోంది. దీంతో ముక్కు తెరుచుకునే పరిస్థితి లేక ఆహారం తీసుకోలేక నీరసించి పక్షులు చనిపోతున్నాయని తేలింది. చేపలు పట్టే ప్రక్రియతో పక్షులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ వదిలేసిన పాత వలలే ప్రమాదంగా మారాయి. ఆదివారం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అనే మరో సంస్థ ప్రతినిధులు కొందరు పక్షి ప్రేమికులు కలిసి దాదాపు 60 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు జలశయంలోని తుప్పలకు ఇరుక్కుని ఉన్న వలల భాగాలను పెద్ద మొత్తంలో వెలికి తీశారు. జలాశయానికి చిలుకూరు వైపు వలస పక్షులు ఎక్కువగా ఉండటంతో అటువైపు ఈ ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని టన్నుల బరువున్న వ్యర్థాలను వెలికి తీశారు. ఇంకా అంతకు కొన్ని రెట్ల మేర వ్యర్థాలు నీటిలో ఉన్నాయని, వాటన్నింటినీ తొలగిస్తేనే పక్షులకు సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు. జాలరులకు అవగాహన కల్పిస్తాం ‘‘నీటిలో వదిలేసిన పాత వలలు వలస పక్షులకు ప్రమాదంగా మారాయి. వాటిని తొలగించి భవిష్యత్తులో మళ్లీ అవి రాకుండా ఉండాలి. అందుకోసం ఈ జలాశయంలో చేపలు పట్టే జాలరులకు అవగాహన కల్పించాల్సి ఉంది. వలలు ఏర్పాటు చేయటంలో అంతర్జాతీయ పద్ధతులేంటో గుర్తిస్తున్నాం. వాటిని జాలరుల దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో అలా వలలు తుప్పలకు ఇరుక్కుపోకుండా చేస్తాం. దానివల్ల జాలరులు వలలు కోల్పోయి నష్టపోకుండా ఉండటమే కాకుండా పక్షులకు ప్రమాదం లేకుండా ఉంటుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారితో కలిసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ముందు జలాశయంలో పెద్ద మొత్తంలో ఉన్న వలల భాగాలను అధికారులు వెలికి తీయించాల్సి ఉంది. మాతో కలిసి వచ్చిన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు, ఇతర పక్షి ప్రేమికులకు ధన్యవాదాలు’’ –ప్రదీప్ నాయర్, సంజీవరావు, ‘యానిమల్ వారియర్స్’సభ్యులు -
షెల్టర్కో కథ.. షెడ్డుకో వ్యథ
ట్రాఫిక్ సమస్యతో నగరం విలవిలలాడుతోంది. రోడ్లపై లేస్తున్న దుమ్ము, దూళితో పాటు చెవులు చిల్లులు పడేలా వినిపించే శబ్దాల మధ్య సగటు ప్రయాణికుడి బాధ అంతా ఇంత కాదు. కిక్కిరిసిన నగరంలో మనిషి నిల్చోవడానికి సైతం ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా బస్టాప్‌ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇంటికో..ఆఫీసుకో వెళ్లేందుకు బస్టాప్‌కు వచ్చిన వారు నిలుచునేందుకు కూడా స్థలం ఉండటం లేదు. బస్సొస్తే అది ఎంత దూరంలో ఆగుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఎక్కడ ఆపాలో తెలియని గందరగోళంలో బస్సు డ్రైవర్. బస్సు స్టాప్‌ల్లో వెలిసిన తోపుడు బండ్లు, నిలిపిన ఆటోలు, ఇతర వాహనాలు... వెరసి సగటు ప్రయాణికుడికి స్టాపుల్లోనూ నరకమే. దీంతో బస్టాపుల్లో కాకుండా అటుపక్కో ఇటుపక్కో వెళ్లి ఊసూరుమని నిలుచోవాల్సి వస్తోంది. తీరా బస్సు వస్తే అదెక్కడ ఆగుతుందో తెలియదు. ప్రయాణికుడు ముందుకో లేదా వెనక్కో అన్నట్టు పరుగులు పెట్టాల్సిందే. ప్రతినిత్యం ప్రతి స్టాపు వద్ద కనిపించే దృశ్యాలివీ. నగరంలో ఇప్పుడు అనేక చోట్ల బస్టాపులే మాయమైపోతున్నాయి. షెల్టర్లు కబ్జాలకు గురికావడంతో జనం రోడ్లపైనే నిలుచోవాల్సి వస్తోంది. ప్రయోగాత్మకంగా నగరంలో కొన్నిచోట్ల ఏసీ బస్టాపులు నిర్మించినా అనేక చోట్ల షెల్టర్లు లేకపోవడం, లేదా ఆ స్థలాలు కబ్జాలకు గురికావడం, ప్రైవేటు పార్కింగ్ కోసం ఉపయోగించడం, తోపుడు బండ్లతో నిండిపోవడం... రకరకాల కారణాలతో వాటి రూపురేఖలు మారిపోయాయి. ఈ రకమైన పరిస్థితిని మీరు నిత్యం ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉంటారు. అలాంటి వాటి విషయమై స్పందిద్దాం. కబ్జాకు గురైనా, బస్టాపును పార్కింగ్ స్థలంగా వినియోగిస్తున్నా, వ్యాపారానికి వాడుకుంటున్నా, షెల్టర్ లేకుండా రోడ్డుపైనే బస్టాప్ నిర్వహిస్తున్నా...ఫొటోలు లేదా చిన్న వీడియో తీసి ‘సాక్షి’కి పంపించండి. వాటిని ప్రచురించడంతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతాం. మీరు చేయాల్సింది బస్టాపునకు సంబంధించిన ఫొటోలు లేదా చిన్న నిడివి కలిగిన వీడియోను 90100 77759 నంబర్‌కు వాట్సాప్ చేయండి. లేదా Info@sakshi.com కు మెయిల్ ద్వారా పంపించండి. వాటితో పాటు ఏ ప్రాంత బస్టాపు, మీ పేరు మొబైల్ నంబర్ తదితర వివరాలను పొందుపరిస్తే వాటిని ‘సాక్షి’ (sakshi.com) లో ప్రచురిస్తాం. -
సంచలనం; మరో షెల్టర్ హోం అకృత్యాలు
భోపాల్: మద్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక షెల్టర్‌హోం చిన్నారులపై వెలుగుచూసిన అకృత్యాలు సంచనలం రేపాయి. ఒక ప్రైవేటు వసతి గృహం యజమాని దివ్యాంగులైన బాలబాలికలపై చాలాకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు యజమాని లైంగిక హింస, వేధింపులు కారణంగా తమ సహచరులు ముగ్గురు చనిపోయినట్టుగా బాధితులు ఆరోపించారు. దీంతో యజమానిని శనివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒక మాజీ సైనికుడు (70) భోపాల్‌లో భైరాంఘర్ ప్రాంతంలో ప్రైవేటుగా ఒక షెల్టర్ హోం నిర్వహిస్తున్నాడు. దివ్యాంగులైన పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే.. కాలయముడిలా మారాడు. నిత్యం దారుణమైన లైంగిక వేధింపులు, హింసకు పాల్పడేవాడు. దీంతో బాధితులు యజమాని అకృత్యాలపై సాంఘిక న్యాయ విభాగానికి మొరపెట్టుకున్నారు. షెల్టర్ హోం యజమాని లైంగిక హింస కారణంగానే విపరీతమైన రక్తస్రావంతో ఒక బాలుడు మరణించగా, గోడకేసి తలను మోదడంతో మరో విద్యార్థి అసువులుగా బాసాడు. మరో ఉదంతంలో రాత్రంతా చలిలో బలవంతంగా పడుకోబెట్టడంతో మరో విద్యార్థి ప్రాణాలు విడిచాడని వివరించారు. దీనిపై తదుపరి విచారణకు ఆదేశించామని సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కృష్ణ మోహన్ తివారి వెల్లడించారు. ఈ ఉదంతంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విభాగం స్పందించింది. గతంలో ఇతనిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు వచ్చినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించింది. బాధితులతో కలిసి స్థానిక టీటీ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని డీఐజి ధర్మేంద్ర చౌదరి తెలిపారు. 1995లో రిజిస్టర్ చేసుకున్న ఈ హోం రెండు శాఖలను (భైరాంఘర్, హోషంగాబాద్) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధిత నిధులను కూడా పొందుతోంది. 2003 నాటి లెక్కల ప్రకారం 42 మంది బాలురు, 58 మంది బాలికలు ఈ హోంలో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 2017 లో హొషంగాబాద్ కలెక్టర్‌కు లైంగిక వేధింపుల గురించి ఓ బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు సరిగా ఉందని తేలినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అయితే, ఫిర్యాదు తర్వాత హోషంగాబాద్ శాఖ మూసివేసారు. -
లైంగిక వేధింపుల కేసులో డీసీపీఓ అరెస్ట్
సాక్షి, పట్నా : బిహార్ ప్రభుత్వంతో కలిసి ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే బాలల సదనంలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ముజఫర్‌పూర్ జిల్లా బాలల రక్షణాధికారి (డీసీపీఓ)ని అరెస్ట్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వెంటనే సదనంలో ఉన్న 44 మంది బాలికలను వేరే ప్రాంతానికి తరలించారు. బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ఇప్పటివరకూ పది మందిని అరెస్ట్ చేశారు. బాధిత బాలికల ఫిర్యాదు మేరకు డీసీపీఓ రవి రోషన్‌ను ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేశామని ముజఫర్ పూర్ ఎస్పీ హర్పీత్ కౌర్ వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖ చేపట్టిన అంతర్గత విచారణలోనూ నేరంలో డీసీపీఓ పాత్ర ఉన్నట్టు తేలింది. అయితే తనను ఈ కేసులో బలిపశువును చేవారని, తాను ఎప్పుడు బాలికల సదనాన్ని సందర్శించినా సాంఘిక సంక్షేమ శాఖ బృందం తన వెంట ఉండేదని డీసీపీఓ పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో బాలల సంక్షేమ కమిటీ సభ్యుడితో పాటు, సదనం ఉద్యోగులున్నారని పోలీసులు తెలిపారు. కేసులో నిందితులపై పోస్కో చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. సదనంలో నిర్వాహకులు తమను లైంగిక వేధింపులకు గురిచేశారని సాంఘిక సంక్షేమ శాఖ చేపట్టిన అంతర్గత విచారణలో బాలికలు వెల్లడించారు. -
10రూపాయలకే రెండు పూటలా భోజనం..
సాక్షి, హైదరాబాద్ : జబ్బు చేసి ఆస్పత్రి పాలైన వారి పరిస్థితి ఒకలా ఉంటే... వారిని పరామర్శించడానికి వచ్చే వారి తిప్పలు అన్నీఇన్నీ కావు. దూర ప్రాంతం నుంచి వచ్చేవారి పరిస్థితి ఇంకా దారుణం. ఒక్కరోజులో చూసి వెళ్లిపోయే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు తినడానికి, ఉండటానికి కూడా ఇబ్బందే. పట్నంలో పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్లు ఉంటాయి. అలాంటి వారి పట్ల ఆత్మీయ బంధువవుతుంది ‘సేవా భారతి ట్రస్ట్’. రోగులకు, వారితో పాటు వచ్చే బంధువులకు కూడా రెండు పూటలా కడుపు నిండా భోజనం పెట్టడమే కాక ఉండటానికి వసతి కల్పిస్తుంది ఈ ట్రస్ట్. ఇదంతా కూడా కేవలం ‘పది రూపాయలకే’. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దూర ప్రాంతం నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు అలానే వారితో పాటు వచ్చే కుటుంబసభ్యులకు పట్టెడన్నం పెట్టి ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ప్రారంభమైంది. ఈ విషయం గురించి ‘సేవా భారతి ట్రస్ట్’ సెక్రటరీ నర్సింహమూర్తి ‘మొదట మేము కేవలం భోజన సదుపాయం మాత్రమే కల్పించే వాళ్లం. కానీ 2013లో గాంధీ ఆస్పత్రి సుపరిండెంట్ ‘రోగుల కోసం వచ్చే వారి కోసం వసతి కల్పించమ’ని కోరాడు. దాంతో మేము ఈ వసతి గృహాన్ని నిర్మించాము. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మేము ఈ భవనాన్ని నిర్మించాం. దీన్ని నిర్మించిన కొత్తలో రోజుకు కేవలం పది మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజుకు ఇక్కడ దాదాపు రెండు వందల మంది వరకూ బస చేస్తున్నారు. వారానికి దాదాపు 7 వేల మందికి బస కల్పిస్తున్నామని’ చెప్పారు. -
వనం నుంచి జనంలోకి..
శ్రీకాకుళం సిటీ: జిల్లాకు చెందిన ఓ మహిళా మావోయిస్టు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం) ఇరోతు సుందరమ్మ ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆమెపై ఉన్న రివా ర్డును ఎస్పీ ఆమెకే అందజేశారు. కుటుంబ నేపథ్యం.. ఇరోతు సుందరమ్మ వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన ఇరోతు అప్పన్న(లేటు), గున్నమ్మల కుమార్తె. సుందరమ్మ సోదరులు ఈశ్వరరావు, జానకిరావులు అప్పటికే ఎప్పటి నుంచో మా వోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. వీరి ద్వారా ఉద్యమానికి ఆకర్షితురాలైన సుందరమ్మ 2002లో గార వల్లభరావు అలియాస్ చిన్నమురళి, జానకి అలియాస్ అప్పలనాయుడు, వెంకటరావు అలియాస్ త్రినాథ్, శశిల ప్రోద్బ లంతో మావోయిస్టు పార్టీలో చేరారు. చిన్న స్థాయి నుంచి.. మావోయిస్టు పార్టీలో దళం మెంబర్ స్థాయి నుంచి ఏసీఎం స్థాయికి సుందరమ్మ ఎదిగారు. తొలుత ఈమె విజయనగరం జిల్లా కొండబారిడి ఏరియాలో దళం మెంబరుగా పనిచేశారు. అలాగే గొట్టా ఏరియాలో, దేరువాడ ఏరియాలో పనిచేస్తూ తర్వాత ఒడిశాలోని ఆర్ ఉదయగిరి దాడిలో మెడికల్ బృందంలో దళం సభ్యులకు ప్రథమ చికిత్స చేసేందుకు నియమితులయ్యారు. 2006లో కొరాపుట్ ఏసీఎంగా ప్రమోట్ అయ్యారు. 2008 నుంచి 2009 వరకు జంఝావతి దళ కమాండర్‌గా పనిచేశారు. 2012లో హైకమాండ్ ఆదేశాల మేరకు దండకారణ్యంలో 8 నెలల మెడికల్ ట్రైనింగ్ కోసం వెళ్లారు. ఆమె దళంలో పనిచేసినప్పుడు 303 తుపాకీ ఉపయోగించారు. బయటకు వచ్చి.. మళ్లీ కొంతకాలం కిందట సైద్ధాంతిక విభేదాల కారణంగా ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయితే హైకమాండ్ ఆదేశాలతో మళ్లీ పార్టీలోకి చేరారు. అయినా అక్కడి పరిస్థితులకు తలొగ్గలేక జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అన్నయ్య ఇరోతు ఈశ్వరరావును వెంటపెట్టుకుని ఎస్పీ సమక్షంలో ఆదివారం లొంగిపోయారు. ఈమె పాల్గొన్న సంఘటనలు: - దమన్‌జోడీ ఎన్‌ఏఎల్‌సీఓ కంపెనీపై దాడిలో పాల్గొన్నారు. - ఒడిశాలోని నారాయణపట్నం బ్లాక్‌లో పాలూరు అంబూష్లో పాల్గొని నలుగురు సీఆర్పీఎఫ్ జవా నుల మృతికి కారణమయ్యారు. - దాయిగూడ అంబూష్ మెట్టకమరవలస దాడిలో పాల్గొన్నారు. - కేడవాయి, చిన్నదొడ్డ, జరుడ తదితర సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రివార్డును అందజేస్తాం: ఎస్పీ ఇరోతు సుందరమ్మ మీద ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డు నగదును ప్రభుత్వం నుంచి ఈమెకు ఇప్పించే ఏర్పాటు చేస్తూ, మిగిలిన రాయితీలు కలెక్టర్ నుంచి ఇప్పించే ఏర్పాట్లను చేస్తానని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ హామీ ఇచ్చారు. ఈమె మాది రిగానే ఇంకా ఎవరైనా మాజీ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే వారి రివార్డు, నగదును వారి జీవన ఉపాధి కోసం ప్రభుత్వం నుంచి ఇప్పించే ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. మిగిలిన మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. -
జకీర్‌కు మలేసియా ఆశ్రయం
కౌలాలంపూర్: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ (52)కు మలేసియా ప్రభుత్వం శరణార్థిగా దేశంలోకి అనుమతించింది. ఇక్కడి పుత్ర మసీదు(మస్జీద్ పుత్ర) నుంచి జకీర్ తన అంగరక్షకుడితో కలిసి బయటికొస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ మసీదులోనే ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ సహా పలువురు కేబినెట్ మంత్రులు ప్రార్థనల్లో పాల్గొంటారు. 2018, జూన్‌లో జరిగే ఎన్నికల్లో దేశంలోని మెజారిటీ మలయా ముస్లింల ఓట్లను దక్కించుకునేందుకు రజాక్ ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయమై ఆ దేశ ఉపప్రధాని అహ్మద్ జహీద్ పార్లమెంటులో మాట్లాడుతూ.. జకీర్ ఐదేళ్ల క్రితమే మలేసియాలో శాశ్వత నివాసం కోసం అనుమతి పొందారని తెలిపారు. జకీర్ అప్పగింతపై భారత్ నుంచి ఎలాంటి విజ్ఞప్తులు అందలేదన్నారు. -
గ్రంథాలయంలో స్టేజీ షెల్టర్ ప్రారంభం
హుజూర్నగర్ : పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేజీ షెల్టర్‌ను శుక్రవారం దాత బూర్లె లక్ష్మీనారాయణ, శేషమ్మ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాఖ గ్రంథాలయ అధ్యక్షుడు కుంట సైదులు మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి దాతలు చేయూతనందించడం అభినందనీయమన్నారు. అనంతరం స్టేజీ షెల్టర్ దాతలను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వీరస్వామి, శ్రీనివాస్, వెంకయ్య, నాగేందర్, నారాయణ, సైదులునాయక్, వెంకట్రాజు, మౌలాలీ, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
కలకలం
నేరగాళ్లకు షెల్టర్‌జోన్‌గా కర్నూలు – జిల్లాలో తెలంగాణ ఎంసెట్ ప్రకంపనలు – కర్నూలులో దలదాచుకున్న ఓ అకాడమీ డైరెక్టర్లు – రంగంలోకి దిగిన అక్కడి సీఐడీ అధికారులు – కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు – అదుపులో ఇరువురు వ్యక్తులు తెలంగాణ ఎంసెట్ లీకేజీ వ్యవహారం జిల్లాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడి సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేయడం.. ఇప్పటికే పలువురిని విచారించి అరెస్టు చేయడం తెలిసిందే. తాజాగా లీకేజీతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను సీఐడీ అధికారులు కర్నూలులో అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నేరగాళ్లకు జిల్లా షెల్టర్ జోన్‌గా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, కర్నూలు: తెలంగాణ సీఐడీ అధికారులు కర్నూలులో తనిఖీలు నిర్వహించడం జిల్లాను కుదిపేస్తోంది. ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు కర్నూలులోని ఓ హోటల్లో తలదాచుకున్న సమాచారంతో అధికారులు శుక్రవారం ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. ఓ అకాడమీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లను వీరి ప్రయాణిస్తున్న కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీపై అక్కడి సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేయడం తెలిసిందే. విచారణ అనంతరం ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోగా.. లోతుగా విచారణ చేపట్టేందుకు పలువురు అనుమానితుల జాబితాను కూడా సిద్ధం చేశారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన రెసోనాన్స్ మెడికల్ అకాడమీ డైరెక్టర్లు వెంకటరమణ, తరుణ్తేజ్లు ఉన్నారు. వీరిని విచారించేందుకు ఇళ్ల వద్దకు చేరుకోగా పరారైనట్లు గుర్తించారు. ఏ వాహనంలో వెళ్లారనే సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. హైదరాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారిలో వెళ్లినట్లు టోల్‌గేట్లలోని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా కర్నూలు నగరం బళ్లారి చౌరస్తా సమీపంలోని ఓ హోటల్లో బస చేసినట్లు సమాచారం తెలుసుకున్నారు. ఆ మేరకు శుక్రవారం ఉదయాన్నే నగరానికి చేరుకొని నిమిషాల వ్యవధిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. షెల్టర్ జోన్‌గా కర్నూలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా కర్నూలు జిల్లా పతాక శీర్షికల్లో నిలుస్తోంది. బెంగళూరు, చెన్నై రాష్ట్రాలకు సులభంగా తరలిపోవడానికి కర్నూలు జిల్లా ముఖద్వారం కావడంతో.. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు పోలీసుల కళ్లుగప్పి కర్నూలుకు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచే అనుకున్న ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అండర్‌వరల్డ్ డాన్ అబుసలేం, అతని ప్రియురాలు మోనికాబేడీలకు కర్నూలు నగరంలో నివాసం ఉంటున్నట్లుగా చిరునామా సృష్టించి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అదేవిధంగా హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఏడాదిన్నర క్రితం ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు కాల్పులకు పాల్పడిన అనంతరం కర్నూలు బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో తలదాచుకోవడం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఓ మెడికల్ అకాడమీ డైరెక్టర్లు కూడా కర్నూలులో తలదాచుకోవడం చూస్తే నగరం నేరగాళ్లకు షెల్టర్ జోన్‌గా మారుతుందనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. -
ఎల్లంపల్లి నిర్వాసితుల తరలింపు
మంచిర్యాల టౌన్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను గురువారం అధికారులు తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ఇప్పటికే 145.5 మీటర్లకు వరద నీరు చేరి, ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు సమీప గ్రామాలైన చందనాపూర్, కొండపల్లి గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా గ్రామాల్లోని నిర్వాసితులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. కొండపల్లి నిర్వాసితులను కర్ణమామిడి పునరావాస కేంద్రంలో నిర్మించిన పాఠశాల భవనంలోకి, చందనాపూర్ నిర్వాసితులను చందనాపూర్ పునరావాస కేంద్రంలోనే నిర్మించిన పాఠశాల భవనంలోకి తరలించారు. వరద నీరు మరింత చేరితే కర్ణమామిడి, పడ్తన్‌పల్లి, రాపల్లి నిర్వాసితులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అభాగ్యుల్లో ఆశాజ్యోతి
అనాథ చిన్నారులకు ఆశ్రయం పదో వసంతంలోకి వడివడిగా అడుగులు దాతల సహకారంతో బాధితులకు అండగా... గజ్వేల్‌రూరల్: చుట్టూ పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. అందులోకి వెళ్తుంటే ఓ ఉద్యానవనంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. ప్రజ్ఞాపూర్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారికి పక్కన 2.2ఎకరాల విశాలవంతమైన ప్రాంతంలో ఉన్న ‘ఆశాజ్యోతి’కి ప్రతి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని వెళుతుంటారు. మరి కొందరు అక్కడే ఉండి వైద్య చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు మరో 35మంది వరకు (తల్లి... తండ్రిని కోల్పోయిన) హెచ్ఐవీ బాధిత అనాథ చిన్నారులు ఆశ్రయం పొందుతూ తమ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్నారు. వారికి ఉచితంగా మందులను ఇవ్వడంతో పాటు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తూ బాధితులను అక్కున చేర్చుకుంటుంది ‘ఆశాజ్యోతి’... 2006లో ఏర్పాౖటెన ఈ కేంద్రం పదో వసంతంలోకి అడుగులు వేస్తోంది. ‘ఆశాజ్యోతి’ ఏర్పాటు 2006 ఆగస్టు 8న గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో ఎస్వీడీ(సొసైటీ ఆఫ్ డివైన్వర్డ్ మిషన్)్ఙదైవవాక్కు సభ’ సంస్థకు చెందిన హైదరాబాద్ ఫ్రావిన్స్ వారు ‘ఆశాజ్యోతి’ని ఏర్పాటు చేశారు. అప్పటì భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి దీన్ని ప్రారంభించారు. ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ సోకి జీవించే వారిని పరామర్శించడంతో పాటు వారి బాధలను విముక్తి చేసేందుకు అతి ముఖ్యమైన సేవా కార్యక్రమంగా పరిగణించి, నిరాశ, నిసృ్పహలకు గురైన వారి జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాౖటెంది. 2012 నుంచి ఫాదర్ ఆల్వీన్ డైరెక్టర్‌గా, ఫాదర్ ఫెలిక్స్ సుపీరియర్లుగా ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. సేవలు ప్రజ్ఞాపూర్‌లో గల ఆశాజ్యోతి కేంద్రం(క్లస్టర్) నుంచి మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలోని హెచ్ఐవీ బాధితులకు సేవలందిస్తున్నారు. రోజు సుమారు 25మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఇక, పదుల సంఖ్యలో ఆశ్రయం పొందుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 7200 మంది వచ్చి ఈ కేంద్రం నుంచి చికిత్స పొందగా..6,362 మంది బయటి నుంచి వచ్చిన వారు ఆశ్రయం పొంది చికిత్స చేయించుకున్నారు. వీరికి గజ్వేల్ పట్టణానికి చెందిన వైద్యుడు మల్లయ్య రోజూ వైద్య చికిత్స అందిస్తున్నారు. అలాగే మెడిసిటీకి చెందిన చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ బీ.రంగారెడ్డి (ప్రతి ఆదివారం), గజ్వేల్ ఎస్పీహెచ్పీవో రామకృష్ణ (ప్రతి సోమవారం) ‘ఆశాజ్యోతి’కి వచ్చి బాధితులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలి ఒక్క తెలంగాణాలో మాత్రమే ‘ఆశాజ్యోతి’ హెచ్ఐవీ/ఎయిడ్స్ కేర్ సెంటర్ ఉంది. గతంలో ఈ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులను రద్దు చేయడంతో ఎస్వీడీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ‘ఆశాజ్యోతి’ని కొనసాగిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నిధుల మంజూరుకు చర్యలు చేపడితే మరింత మంది హెచ్ఐవీ బాధితులకు మెరుగైన చికిత్సను అందించేందుకు వీలు కలుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి బాధితుల్లో వెలుగులు నింపాలి. – ఆశాజ్యోతి సంస్థ డైరెక్టర్ ఫాదర్ ఆల్వీన్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ‘జీవోదయ’ సంస్థ ఆధ్వర్యంలో ‘ఆశాజ్యోతి’ క్లస్ట ర్ పరిధిలో హెచ్ఐవీ/ ఎయిడ్స్ నిర్మూలనకు విశేషంగా కళాజాత కా ర్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. వీటితో పాటు గ్రామాల అభివృద్ధి, మహిళ, యువత, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆటపాటల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అయితే నిధుల కొరత వల్ల ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్ళలేక దాతల సహకారం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో కళాజాతకార్యక్రమాలను నిర్వహిస్తే బాగుంటుంది. – జీవోదయ సంస్థ డైరెక్టర్, ‘ఆశాజ్యోతి’ సంస్థ సుపీరియర్ ఫాదర్ ఫెలిక్స్రోచ్ దాతల సహకారం మరువలేనిది ‘ఆశాజ్యోతి’కి ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో హెచ్ఐవీ బాధితులు, అనా«థ చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో దాతలు ముందుకు వచ్చి అం దించిన సేవలు, సహకారం మరువలేనిది. ప్రభుత్వం చొరవ చూపి ఆశాజ్యోతికి నిధులు వచ్చేలా చూడాలి. – ‘ఆశాజ్యోతి’ సంస్థ కోఆర్డినేటర్ వీరబాబు