
Metro station in Kharkiv: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజుల తరబడి దాడి చేస్తూనే ఉంది. వైమానిక దాడులతో పౌరుల ఆవాసాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే కైవ్, మారియుపోల్, ఖార్కివ్‌లను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖార్కివ్‌లోని పౌరులు బాంబుల దాడుల నుంచి తప్పించుకునేందుకు మెట్రో స్టేషన్‌లోనే తలదాచుకుంటున్నారు.
ఈ మేరకు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ..ఉక్రెనియన్లకు ఆ మెట్రో స్టేషనే బాంబు షెల్టర్‌గా మారిందని పేర్కొంది. ఆ స్టేషన్‌లో పౌరులు ఏవిధంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారో వివరిస్తూ..వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అక్కడే నివాసం ఉంటున్న ఉక్రెయిన్ల కోసం తాత్కాలిక పడకలను, సంగీత కచేరీలను ఏర్పాటు చేశారు.
అంతేగాదు రష్యా బలగాలు ఖార్కివ్‌లోని అణుకేంద్రం పై కూడా దాడులు నిర్వహించింది. అంతేగాదు ఖార్కివ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీలోని న్యూట్రాన్ సోర్స్ ప్రయోగాశాల అగ్నిప్రమాదానికి గురైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.. అంతేగాదు ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న నష్టాన్ని అంచనవేయడం కూడా కష్టమేనని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment