
ద్వీప దేశం శ్రీలంకలో ఆగని నిరసన సెగ. శ్రీలంక ప్రధాని మహీంద్రా రాజపక్స రాజీనామ చేసినప్పటికీ అల్లర్లు ఆగడం లేదు.
Protests erupted at the Trincomalee Naval Base in Sri Lanka: అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో నిరసనకారుల దాడులు రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత వహిస్తూ శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సా రాజీనామా చేసినప్పటికీ అల్లర్లు ఆగడం లేదు. అంతేకాదు హంబన్‌టోటాలోని రాజపక్స కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు.
ఈ భారీ ఉద్రిక్తతల కారణంగా మహింద రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు ట్రింకోమలీ నావికా స్థావరంలో తలదాచుకుంటున్నారు. అయితే మహింద్రా కుటుంబం నేవీలో ఆశ్రయం పొందుతున్నట్లు ఆందోళనకారులు తెలుసుకోవడంతో అక్కడ కూడా నిరసనలు చెలరేగాయి. ఇప్పట్లో ఈ నిరసన సెగ మహీంద్రా కుటుంబాన్ని అంత తేలిగ్గా వదిలేట్లు లేదు. ఆర్థిక, రాజకీయం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక ఇప్పుడూ హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుపోతుంది. ప్రస్తుతం ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
A protest underway in front of the Trincomalee Naval Base claiming former PM Mahinda Rajapaksa and his family members are inside pic.twitter.com/fJ6hOh6b3Y
— NewsWire 🇱🇰 (@NewsWireLK) May 10, 2022
Ancestral home of the Rajapaksa family in Medamulana, Hambantota set on fire by protesters. pic.twitter.com/QIEnREphjq
— NewsWire 🇱🇰 (@NewsWireLK) May 9, 2022